స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Hyderabad: హెచ్‌ఎండీఏలో వివాదాస్పదంగా మారిన తహసీల్దార్ మాధవి రెడ్డి లీలలు!..తెలంగాణSwechaa18 Oct 2026, 10:26 PM

Hyderabad: హెచ్‌ఎండీఏలో వివాదాస్పదంగా మారిన తహసీల్దార్ మాధవి రెడ్డి లీలలు!..

హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ.. హెచ్‌ఎండీఏలో ఒక అధికారిణి వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. శంకర్‌పల్లి జోన్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న తహసీల్దార్‌ కె. మాధవి రెడ్డిని చుట్టుముడుతున్న ఆరోపణలు పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్‌ 9 నుంచి 17 వరకు విధులకు గైర్హాజరయ్యారని, అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Hyderabad: ట్యాంక్ బండ్‌పై వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్!..తెలంగాణSwechaa18 Oct 2026, 08:55 PM

Hyderabad: ట్యాంక్ బండ్‌పై వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్!..

ట్యాంక్‌బండ్ వేదికగా... నగరంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం అంబరానంటింది.. సాంప్రదాయ పూల శోభతో, మహిళల కోలాహలంతో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాగా రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ, దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Hyderabad: హరీశ్ రావు ఆరోపణలను ఖండించిన టీజీఎస్ ఆర్టీసీ.. నాణ్యమైన సేవలే లక్ష్యమని వెల్లడి!..తెలంగాణSwechaa18 Oct 2026, 07:39 PM

Hyderabad: హరీశ్ రావు ఆరోపణలను ఖండించిన టీజీఎస్ ఆర్టీసీ.. నాణ్యమైన సేవలే లక్ష్యమని వెల్లడి!..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా టీజీఎస్ ఆర్టీసీ నిర్వహణపై చేసిన ఆరోపణలకు ఆ సంస్థ యాజమాన్యం స్పష్టతనిచ్చింది. దసరా పండుగల సమయంలో బస్సు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక బస్సుల రద్దుకు సంబంధించి హరీశ్ రావు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని పేర్కొంది..

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పండుగ సమయాల్లో టికెట్ ధరల నియంత్రణ, ఇతర నిర్ణయాలు అన్నీ 2003వ సంవత్సరానికి చెందిన జీవో (GO) ఆధారంగానే అమలవుతున్నాయని అధికారులు వివరించారు. ప్రయాణికులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం మోపకుండా, పూర్తిగా నిబంధనలకు లోబడే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Cinema: ఇక్కడ బాలయ్య-థమన్, అక్కడ రజినీ-అనిరుధ్సినిమాSwechaa18 Oct 2026, 07:38 PM

Cinema: ఇక్కడ బాలయ్య-థమన్, అక్కడ రజినీ-అనిరుధ్

Cinema: కొన్ని కాంబినేషన్స్ అలా కుదురుతాయంతే. ఆ కాంబినేషన్స్ లో వచ్చే సినిమాలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. మన తెలుగులో దర్శకుడెవరైనా, బాలయ్య హీరో.. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఇక, కోలీవుడ్‌లో కూడా అంతే, సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో.. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే బాక్సులు బద్ధలవుతున్నాయి. తాజాగా, వచ్చిన జైలర్ 2 కి థియేటర్స్ కలెక్షన్స్‌తో సందడిగా ఉంది.

Tollywood: "సంబరాల ఏటిగట్టు"..100 కోట్లు..10 షెడ్యూళ్ళు..160 రోజులు..ఈ లెక్క తేలేనా?సినిమాSwechaa18 Oct 2026, 07:18 PM

Tollywood: "సంబరాల ఏటిగట్టు"..100 కోట్లు..10 షెడ్యూళ్ళు..160 రోజులు..ఈ లెక్క తేలేనా?

Tollywood: హమ్మయ్య..మొత్తానికి సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ మాట వినడానికి చాలా నెలల నుంచి వేచి చూస్తున్నారు అటు మెగా అభిమానులు..ఇటు సినీ వర్గాలు. రెండేళ్ళ నుంచి ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష, లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ దక్కలేదు. అందుకే, ‘సంబరాల ఏటిగట్టు’ కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీలో వానల జోరు.. తెలంగాణ ఎండల హోరు! రుతుపవనాల వెనుక ఉన్న కథేంటి..?NationalSwechaa18 Oct 2026, 06:50 PM

ఏపీలో వానల జోరు.. తెలంగాణ ఎండల హోరు! రుతుపవనాల వెనుక ఉన్న కథేంటి..?

ఒకవైపు తమిళనాడులో భారీ వర్షాలు.. మరోవైపు కోస్తా ఆంధ్రప్రదేశ్‌, రాయలసీమలో విస్తారంగా వానలు. ఇంకోవైపు తెలంగాణలోని ఎండ, ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు. పక్కపక్కనే ఉన్నా మూడు రాష్ట్రాల్లో ఎందుకీ తేడా..? రుతుపవనాల వెనుక ఉన్న కథేంటి..?

ప్రపంచవ్యాప్తంగా ప్రజాగ్రహం.. వీధుల్లోకి జనం! ప్రభుత్వాలకు సెగInternationalSwechaa18 Oct 2026, 05:24 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రజాగ్రహం.. వీధుల్లోకి జనం! ప్రభుత్వాలకు సెగ

బతుకు భారమైపోతే ఏం చేయాలి? చదువు భారమైతే ఎక్కడికి వెళ్లాలి? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వీధుల్లోకి తీసుకొస్తున్నాయి. ఐరోపాలోని పలు దేశాల నుంచి అమెరికా, అర్జెంటీనా వరకు నిరసనల హోరు వినిపిస్తోంది. ఇండియాలోనూ సేమ్ సీన్.

Telangana:"వెలుగు"పై బీఆర్‌ఎస్ లీగల్ ఫైర్!!తెలంగాణSwechaa18 Oct 2026, 05:04 PM

Telangana:"వెలుగు"పై బీఆర్‌ఎస్ లీగల్ ఫైర్!!

ఒకవైపు రాష్ట్రంలో ఎల్ నినో హీట్ పుట్టిస్తుండగా.. తెలంగాణ రాజకీయాలు సైతం విమర్శలతో సెగలు కక్కుతున్నాయి.. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒకరిమీద ఒకరు ఆరోపణలతో విరుచుకుపడటం కనిపిస్తుంది.

ఫ్రీగా వస్తే దేన్నీ వదలరు.. ఐ ఫోన్స్‌ను వదిలేస్తారా?వైరల్ న్యూస్Swechaa18 Oct 2026, 04:02 PM

ఫ్రీగా వస్తే దేన్నీ వదలరు.. ఐ ఫోన్స్‌ను వదిలేస్తారా?

హోర్ముజ్ జలసంధిలో మునిగిపోయిన ఓ నౌక కంటెనర్‌లో రూ.కోట్ల విలువైన ఐఫోన్స్ నీళ్లలో పడిపోగా అవన్నీ తేలుతూ తీరానికి కొట్టుకొస్తున్నట్టు తెలిసింది.మూడు రోజుల కింద కార్గో షిప్ సీ మైన్‌ను ఢీకొట్టగా మంటలు చెలరేగి ప్రమాదవశాత్తు ఆ నౌక నీట మునిగింది. అందులోని కంటెనర్లలో ఒకటి బ్రేక్ అవ్వగా..దాని నుంచి ఐఫోన్స్ బయటపడ్డాయి. అవన్నీ నీటిలో తేలియాడుతూ కనిపించాయి. అవి నెమ్మదిగా తీరానికి కొట్టుకొస్తుండటంతో వాటిని తీసుకోడానికి తీరం ప్రజలు ఎగబడినట్టు తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లే పడవల ద్వారా సముద్రంలోకి వెళ్లి ఐఫోన్స్ తీసుసుకోవడంతో పాటు పర్ఫ్యూమ్స్ తీసుకుని పరుగులు తీస్తున్న దృశ్యాలు చక్కర్లు కొడుతున్నాయి.

Suicides in India: దేశంలో పెరుగుతున్న బలవన్మరణాలు-భారతీయులు బలహీనులా? ఎందుకు?..అభిప్రాయంSwechaa18 Oct 2026, 03:42 PM

Suicides in India: దేశంలో పెరుగుతున్న బలవన్మరణాలు-భారతీయులు బలహీనులా? ఎందుకు?..

బ్రతుకు అంటేనే పోరాటం.. కానీ కొందరు ఆ పోరాటాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు.. కారణం సమస్యలు.. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు.. ఉన్నతమైన చదువులు చదివిన వారు సైతం సమస్యలు రాగానే వాటి నుండి పారిపోవడానికి ప్రయత్నించడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం.. మనిషిలోని బలహీనతలు తొలగించి బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిన వ్యవస్థలు చివరకు మనిషిని ఒత్తిడికి బానిసగా మారుస్తున్నాయి..

జలమండలి కీలక ప్రకటన.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్!తెలంగాణSwechaa18 Oct 2026, 03:40 PM

జలమండలి కీలక ప్రకటన.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్!

 బతుకమ్మ, దసరా పండుగల వేళ హైదరాబాద్ వాసులకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు రహదారులపై సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా జలమండలి పటిష్టమైన చర్యలు చేపట్టింది. నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు, నవంబర్ 1 నుంచి నిర్మాణ రంగాలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, పారిశ్రామిక అవసరాల కోసం 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' (Green Water Tankers) సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి వెల్లడించారు.  పండుగల నేపథ్యంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

Tollywood: పీరియాడికల్ సినిమాలు ఎందుకు మెప్పించలేకపోతున్నాయి?సినిమాSwechaa18 Oct 2026, 03:11 PM

Tollywood: పీరియాడికల్ సినిమాలు ఎందుకు మెప్పించలేకపోతున్నాయి?

Tollywood: కమర్షియల్ సినిమాలతో హిట్ కొట్టొచ్చు. ఫ్యామిలీ సినిమాలతో మంచి కలెక్షన్స్ రాబట్టొచ్చు. డివోషనల్ సినిమాలతో రికార్డ్స్ సాధించవచ్చు. ఇలా, జానర్ ఏదైనా బలమైన కథ-కథనం, ఎమోషన్స్ ఉంటే సినిమా హిట్ గ్యారెంటీ. అయితే, పీరియాడికల్ సినిమా చేయాలంటేనే ఎంతో కష్టపడాలి..రీసెర్చ్ చేయాలి..ప్రేక్షకులను మెప్పించే అన్నీ ఎమోషన్స్ మిస్ కాకుండా బ్యాలెన్స్ చేయాలి.

సీఈసీ నియామకంపై  మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుఏపీSwechaa18 Oct 2026, 02:38 PM

సీఈసీ నియామకంపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

దేశం, ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు.ఓటు చోరీ, ఎస్ఐఆర్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల ఆరోపణలు, దీంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, సీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఈసీ రాజీనామా అంశంలో నేరుగా స్పందించకుండానే ఆయన నియామకాన్ని తప్పుబట్టారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని అధికార పార్టీలు చేపట్టకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఈసీ నియామకం న్యూట్రల్ బాడీస్ ద్వారా జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఆ ప్రతిపాదనకు అంగీకరించి తప్పు చేశామని, అందుకే మార్పు రావాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు.సీఈసీ నియామకంలో సంస్కరణలు రావాలని, మళ్లీ న్యూట్రల్ బాడీ ద్వారా సీఈసీ నియామకం జరగాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

దసరా ఎఫెక్ట్.. 4కి.మీల మేర రద్దీగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే!తెలంగాణSwechaa18 Oct 2026, 02:05 PM

దసరా ఎఫెక్ట్.. 4కి.మీల మేర రద్దీగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే!

 తెలుగువారి పెద్ద పండుగైన దసరా, బతుకమ్మ సంబరాల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది ప్రజలు పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. శని, ఆదివారాలు వరస సెలవులు కావడంతో సొంతూర్లకు వెళ్లే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై (NH-65) రద్దీ తీవ్రరూపం దాల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ టౌన్ వరకు దాదాపు 4కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Spirit Movie: ప్రభాస్ "స్పిరిట్" నుంచి ఇది అసలు ఊహించలేనిది!సినిమాSwechaa18 Oct 2026, 02:03 PM

Spirit Movie: ప్రభాస్ "స్పిరిట్" నుంచి ఇది అసలు ఊహించలేనిది!

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ మూవీ కూడా ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భధ్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక, ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రటించారు. 2027, అక్టోబర్ 29న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు.

ఒకరు బైక్, మరొకరు బర్త్ డే కోసం.. ఫ్రెండ్‌ను కడతేర్చిన మైనర్లు!క్రైమ్Swechaa18 Oct 2026, 01:28 PM

ఒకరు బైక్, మరొకరు బర్త్ డే కోసం.. ఫ్రెండ్‌ను కడతేర్చిన మైనర్లు!

చిన్నచిన్న సరదాల కోసం మైనర్లు తప్పు దారి పడుతున్నారు. చెడు సహవాసమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తప్పుడు దారిలో వెళ్తున్న కొందరు మరికొందరిని నేరాల వైపు ప్రేరేపిస్తున్నట్టు సమాచారం. బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో ఇద్దరు మైనర్లు ఏకంగా తన మిత్రుడినే మర్డర్ చేశారు.అనంతరం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సినిమా లెవల్లో ప్లాన్స్ రెడీ చేయడంతో పాటు దానిని ఫాలో అయ్యారు. తాజాగా ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలో 17 ఏళ్ల ప్రజ్యోత్ కాంబ్లే అనే బాలుడు సెప్టెంబర్ 24న సాయంత్రం అదృశ్యమయ్యాడు. అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాలుడి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు.మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.విచారణలో భాగంగా వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. కనిపించకుండా పోయిన బాలుడు హత్యకు గురయ్యాడని, నేరానికి పాల్పడింది అతని మిత్రులే అని గుర్తించారు. వారు కూడా మైనర్లే అని తేలింది.

కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన.. శబరిమల, మాళికాపురం ప్రధాన పూజారుల ఎంపికNationalSwechaa18 Oct 2026, 01:18 PM

కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన.. శబరిమల, మాళికాపురం ప్రధాన పూజారుల ఎంపిక

 ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం, అలాగే మాళికప్పురం దేవాలయాలకు కొత్త ప్రధాన పూజారులను (Chief Priests) లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. రానున్న మండల, మకరవిళక్కు తీర్థయాత్రల (Mandala-Makaravilakku Season) సీజన్‌ను పురస్కరించుకుని ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ప్రధాన పూజారిగా అరీక్కర సుబ్రహ్మణ్యన్ శంకరన్ నంబూదిరి ఎంపిక కాగా, మాళికప్పురం ఆలయ ప్రధాన పూజారిగా ఎ. దామోదరన్ నంబూదిరి ఎన్నికయ్యారు.

హైదరాబాద్ దాండియా వేడుకల్లో విషాదం.. ఇద్దరు యువతులు మృతి!క్రైమ్Swechaa18 Oct 2026, 12:57 PM

హైదరాబాద్ దాండియా వేడుకల్లో విషాదం.. ఇద్దరు యువతులు మృతి!

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. దుర్గామాత నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన దాండియా వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. లైటింగ్ స్టాండ్ మీద పడి ఇద్దరు యువతులు మృతి చెందినట్టు తెలుస్తుండగా..మరో 14 మందికిపైగా విద్యార్థులు గాయపడినట్టు సమాచారం. నగర శివార్లలోని నాదర్‌గుల్‌లో ఉన్న ఎంవీఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాత్రి ఘనంగా దాండియా వేడుకలు నిర్వహించారు. కళాశాల వార్షికోత్సవ సెలబ్రేషన్స్ ‘సంగమం’ ముగింపు వేడుకల్లో నిర్వహించిన దాండియా నైట్‌లో ప్రమాదవశాత్తు లైటింగ్ స్టాండ్ కూలిపోయింది. బలమైన ఈదురుగాలులు వీచడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.విద్యార్థినీ విద్యార్థులు అందరూ సంతోషంగా దాండియా డ్యాన్సులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు లైటింగ్ పోల్ వారిపై కుప్పకూలింది. ఈ ఘటనలో వనపర్తికి చెందిన బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సోనా (సోని) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద తీవ్రత కారణంగా మరో విద్యార్థిని కూడా మరణించినట్లు తెలుస్తోంది.

ఏపీలో హైటెన్షన్.. ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసాన్ని పోలీసుల రౌండప్!ఏపీSwechaa18 Oct 2026, 12:55 PM

ఏపీలో హైటెన్షన్.. ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసాన్ని పోలీసుల రౌండప్!

 ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తుది గడువు ముగియనున్న నేపథ్యంలో కడప జిల్లా పులివెందులలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

National : కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు సర్కారీ కొలువు : సీఎం సువేందుNationalSwechaa18 Oct 2026, 12:34 PM

National : కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు సర్కారీ కొలువు : సీఎం సువేందు

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ నవరాత్రుల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. చోర్‌బగాన్‌లోని దుర్గమాత పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 19మంది చనిపోయారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదం చోటుచేసుకోవడానికి కారకులైన నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలాఉండగా, తొక్కిసలాటలో మరణించిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగంతో పాటు రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. సీఎం, సీఎస్ కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.

Anurag Kashyap: టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికాడా?సినిమాSwechaa18 Oct 2026, 12:30 PM

Anurag Kashyap: టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త విలన్ దొరికాడా?

Anurag Kashyap: మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా సౌత్ అండ్ నార్త్ లో ఉన్న పాపులర్ నటులకి అవకాశం ఇస్తుంటుంది. ఈ విషయంలో, కొందరు తప్పు పట్టినప్పటికీ పాత్రకి తగ్గ నటుడు లేదా నటి కావాలంటే మేకర్స్ కాంప్రమైజ్ కావడం లేదు. మన తెలుగు నటీనటులను ఇతర భాషల వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయరనే మాట గతంలో వినిపించింది. ఇది వాస్తవం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ సీనియర్ దర్శక-నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటున్నాడు.

corporate hospitals: మృత్యు కూపాలుగా మారుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు!! కారకులు ఎవరు?..తెలంగాణSwechaa18 Oct 2026, 12:11 PM

corporate hospitals: మృత్యు కూపాలుగా మారుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు!! కారకులు ఎవరు?..

వైద్యం అనేది సేవారంగం.. కానీ నేడు వ్యాపార రంగంగా మారిందనే తీవ్ర ఆరోపణలున్నాయి.. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విషయంలో సర్కార్ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్న అక్కడ ఉన్న అరకొర వసతుల వల్ల పేదవారు సైతం ఒక్కోసారి ప్రైవేయిట్ ఆస్పత్రులను ఆశ్రయించక తప్పడం లేదు.. అయిన ప్రాణాలకు గ్యారంటీ లేదు. డబ్బులు పోతున్నాయి.. మనుషులు పోతున్నారు.. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం తెలిసిందే..

క్యాన్సర్ బాధితులకు ఊరట.. 137రకాల మందుల ధరలు 70శాతం తగ్గుదల!వ్యాపారంSwechaa18 Oct 2026, 12:04 PM

క్యాన్సర్ బాధితులకు ఊరట.. 137రకాల మందుల ధరలు 70శాతం తగ్గుదల!

 క్యాన్సర్‌తో పోరాడుతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది మంది రోగులకు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది. అత్యంత కీలకమైన, ఖరీదైన 137రకాల క్యాన్సర్ నిరోధక ఔషధాల (Anti-Cancer Drugs) ప్రాథమిక ధరలపై ట్రేడ్ మార్జిన్‌ను (Trade Margin) గరిష్టంగా 30శాతానికి పరిమితం చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల మార్కెట్‌లో లభించే ప్రధాన క్యాన్సర్ మందుల గరిష్ట చిల్లర ధరలు (MRP) ఏకంగా 70శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ సవరించిన నూతన ధరలు నవంబర్ 9వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

ప్రియురాలి మర్డర్..మొసళ్లకు ఆహారంగా వేసిన ప్రియుడుక్రైమ్Swechaa18 Oct 2026, 11:48 AM

ప్రియురాలి మర్డర్..మొసళ్లకు ఆహారంగా వేసిన ప్రియుడు

ఉత్తరప్రదేశ్ ఇటావాకు చెందిన సత్య ప్రకాష్ జటావ్ అనే వ్యక్తి ఓవైపు భార్యతో కాపురం చేస్తూ మరోవైపు నర్సింగ్ అధికారిణి స్నేహలతా పాండేతో సహజీవనం చేస్తున్నాడు.కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న సత్య ప్రకాష్, స్నేహలతకు 10 నెలల కుమారుడు ఉన్నాడు.బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి తనని పెళ్లి చేసుకొని భార్యగా అంగీకరించాలని స్నేహలత పట్టుబట్టింది.కానీ, సత్య ప్రకాష్ అందుకు ఒప్పుకోలేదు. ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా మాట దాటవేస్తూ వచ్చాడు.కొన్ని రోజుల క్రితం మరోసారి స్నేహలతా పాండే పెళ్లి ప్రస్తావన తేవడంతో మాట వినడం లేదని ఆమెను చంపేయాలని సత్యప్రకాష్ నిర్ణయం తీసుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా తొలుత 10 నెలల కుమారుడ్ని తన మొదటి భార్య వద్ద వదిలి వచ్చిన అతడు..అక్టోబర్ 8న కాన్పూర్ చూపిస్తానని, షాకింగ్ చేయిస్తానని చెప్పి బైక్‌ మీద ఆమెను తీసుకెళ్లాడు. పచ్నాడ నదికి (5 నదులు కలిపే చోటు) తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేశాడు.డెడ్ బాడీని పడేసిన ప్రాంతంలో మొసళ్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.స్నేహలత కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పౌరసత్వమా, క్రికెట్టా తేల్చుకోండి.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు!క్రీడలుSwechaa18 Oct 2026, 11:22 AM

పౌరసత్వమా, క్రికెట్టా తేల్చుకోండి.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

 భారత సంతతికి చెందిన విదేశీ పౌరసత్వం కలిగిన (OCI) యువ క్రికెటర్లకు బాంబే హైకోర్టు కీలక సూచనలు చేసింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే బలమైన తపన ఉంటే, ముందుగా భారత పౌరసత్వం (Indian Citizenship) తీసుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. బీసీసీఐ (BCCI) నిర్వహించే దేశవాళీ టోర్నమెంట్లలో పాల్గొనాలంటే భారత పాస్‌పోర్ట్ తప్పనిసరి చేస్తూ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 12మంది ఓసీఐ కార్డు కలిగిన యువ క్రికెటర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్ టికెట్.. సిగ్గనిపిస్తలేదా? : హరీశ్ రావుతెలంగాణSwechaa18 Oct 2026, 11:14 AM

భార్యకు ఫ్రీ.. భర్తకు డబుల్ టికెట్.. సిగ్గనిపిస్తలేదా? : హరీశ్ రావు

అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి మండిపడ్డారు. పండుగల వేళ టీజీఎస్ఆర్టీసీ ‘స్పెషల్’ బస్సుల పేరిట చార్జీలను రెండింతలు చేసి వసూలు చేస్తుండటంపై ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు వస్తే చాలు ఇష్టానుసారం ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల్ని బాదుడేనా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బతుకమ్మ, దసరా పండుగవేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ చార్జీలు డబుల్ చేసి జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు పెట్టి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందని చెప్పారు. భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్.. ఇలా చేస్తే మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా? ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన? అని ప్రశ్నించారు.

భారత్ మాకు కీలక మిత్రదేశం: అమెరికా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!InternationalSwechaa18 Oct 2026, 11:01 AM

భారత్ మాకు కీలక మిత్రదేశం: అమెరికా విదేశాంగ మంత్రి కీలక ప్రకటన!

 రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షల నుంచి భారత్‌కు తాత్కాలిక ఊరట లభించింది. భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని, ఇంధన అవసరాల కోసం రష్యాపై ఉన్న ఆధారపడటాన్ని ఒక్క రోజులో మార్చుకోవడం సాధ్యం కాదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) స్పష్టం చేశారు. రష్యా ఇంధన కొనుగోళ్లపై కఠినమైన చట్టాల నుంచి భారత్ వంటి ప్రధాన దేశాలకు తాత్కాలికంగా మినహాయింపు ఇస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Vijay Devarakonda: ఫ్లాప్ సినిమాపై సెన్షేషనల్ కామెంట్స్..సినిమాSwechaa18 Oct 2026, 10:51 AM

Vijay Devarakonda: ఫ్లాప్ సినిమాపై సెన్షేషనల్ కామెంట్స్..

Vijay Devarakonda: మన హీరోలు, దర్శక నిర్మాతలు కొన్ని సందర్భాలలో సినిమా ఫ్లాప్ అన్న టాక్ వచ్చిన తర్వాత కూడా..కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ అని..టాప్ టెన్ చిత్రాలలో ఇది ఫలనా నంబర్‌లో ఉంటుందని చెప్పుకొస్తుంటారు. అలా, చెప్పడం వెనక కారణాలు ఏంటనేవి స్పష్టంగా తెలియకపోయినా..అప్పటి బజ్ కోసమే అని మాత్రం తెలుస్తుంది. మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు రణబాలి సినిమా తన సినిమాలలో టాప్ 3లో ఉంటుందని అనడం ఆసక్తికరంగా మారింది.

ఆర్టీసీ దోపిడీ షురూ.. 50 శాతం అదనపు చార్జీలు వసూళ్లుతెలంగాణSwechaa18 Oct 2026, 10:25 AM

ఆర్టీసీ దోపిడీ షురూ.. 50 శాతం అదనపు చార్జీలు వసూళ్లు

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.ప్రజారవాణా వ్యవస్థ టీజీఎస్‌ఆర్టీసీ ‘స్పెషల్’ సర్వీసుల పేరిట అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణాన్ని బట్టి చార్జీలు పెరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి దూర ప్రాంతాలకు జర్నీ చేసే వారికి ఒక్కరికే టికెట్ ధర రూ.500 నుంచి 700 మధ్యలో ఉన్నట్టు తెలుస్తోంది.ఎక్స్‌ప్రెస్,డీలక్స్,సూపర్ లగ్జరీ, ఈవీ సర్వీసులను బట్టి టికెట్ ధరలు భిన్నంగా ఉన్నాయి.సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ బస్ టికెట్ ధర రూ.290 నుంచి 320 మధ్యలో ఉండగా, ఇప్పుడు రూ.400కు పైగా వసూలు చేస్తున్నట్టు తెలిసింది.అయితే, ఒక్కరికే ఇంత చార్జ్ అయితే ఒక కుటుంబంలో నలుగురు ఉంటే వాళ్ల పరిస్థితి ఏంటని, రానుపోను టికెట్ చార్జీలకే రూ.5 వేలకు పైగా ఖర్చు కానుంది. ఇక సామాన్యుడు దసరా పండుగ ఎలా చేసుకోవాలి? అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

VIRAL: భార్య రోడ్డుపై పడిపోయినా.. బైక్ ఆపకుండా పారిపోయిన భర్త!వైరల్ న్యూస్Swechaa18 Oct 2026, 10:05 AM

VIRAL: భార్య రోడ్డుపై పడిపోయినా.. బైక్ ఆపకుండా పారిపోయిన భర్త!

 పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే తొందరలో ఓ భర్త తన భార్యను నడిరోడ్డుపైనే పడేసి పరారయ్యాడు. బైక్‌ను ఒక్కసారిగా వేగంగా మలుపు తిప్పడంతో వెనుక కూర్చున్న అతని భార్య బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయింది. అయినప్పటికీ, ఆ వ్యక్తి ఏమాత్రం కనికరం చూపకుండా, భార్యను పట్టించుకోకుండా బైక్‌ను అలాగే పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ భర్త తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.