స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

సీఎం రేవంత్.. తిట్టుడు బంద్ చేసి కట్టుడు మొదలు పెట్టండి- కవితతెలంగాణSwechaa16 Oct 2026, 06:13 PM

సీఎం రేవంత్.. తిట్టుడు బంద్ చేసి కట్టుడు మొదలు పెట్టండి- కవిత

Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ చీఫ్ కవిత మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. ఎంతసేపు వాళ్లని వీళ్లని తిట్టడమేనా? మరి పాలనపై ఎప్పుడు దృష్టి పెడతారు అని నిలదీశారు. ఇకనైనా తిట్టుడు బంద్ చేసి కట్టుడు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ కి సలహా ఇచ్చారు కవిత. వెంటనే మిషన్ భగీరథను వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించారు. అది 100 శాతం పూర్తి కాకపోతే మీరు పూర్తి చేయండి అని వ్యాఖ్యానించారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వడం ప్రాథమిక హక్కు అని కవిత తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ఒక్క రిజర్వాయర్ కట్టలేదని రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.

Ranabaali: అనుకున్నదే అయిందా? మళ్ళీ నిరాశ తప్పదా!సినిమాSwechaa16 Oct 2026, 06:08 PM

Ranabaali: అనుకున్నదే అయిందా? మళ్ళీ నిరాశ తప్పదా!

Ranabaali: టాలీవుడ్‌లో రౌడీ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. వరుసగా ఫ్లాపులు వస్తున్నా కూడా, తాజాగా వచ్చిన రణబాలి సినిమాతో హిట్ కొడతాడని అనుకున్నారు. ఈ సినిమా కథ, కథనం, హీరో పెర్ఫార్మెన్స్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే ఆతృతతో విజయ్ అభిమానులు ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

Recharge Hike: 5G ఖర్చులన్నీ మన నెత్తినేనా? ఏడాది తిరిగేలోపే మరోసారి రీఛార్జ్ వడ్డన!NationalSwechaa16 Oct 2026, 05:43 PM

Recharge Hike: 5G ఖర్చులన్నీ మన నెత్తినేనా? ఏడాది తిరిగేలోపే మరోసారి రీఛార్జ్ వడ్డన!

Recharge Hike: చేతిలో స్మార్ట్‌ఫోన్ లేనిదే పూట గడవని రోజులివి. అలాంటి సామాన్యుడి బలహీనతనే టెలికాం కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయా? ఏడాది తిరిగేలోపే మరోసారి రీఛార్జ్ బాదుడుకు రంగం సిద్ధమైందా? అంటే టెలికాం వర్గాల నుంచి వస్తున్న సమాధానం వింటే గుండె గుభేలుమనడం ఖాయం. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల రేట్లు ఏకంగా 12 నుంచి 15 శాతం వరకు ఎగబాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.దేశంలో 5G రాగానే ఏదో అద్భుతం జరిగిపోతుందని కలలు చూపించారు. స్పెక్ట్రమ్ వేలం, టవర్లు, కొత్త టెక్నాలజీ అంటూ కంపెనీలు వేల కోట్లు కుమ్మరించాయి. మరి ఆ పెట్టిన ఖర్చంతా ఎక్కడి నుంచి వస్తుంది? చివరకు ఆ భారాన్ని అంతా సామాన్య మొబైల్ యూజర్ల మీదే నెట్టేయాలని డిసైడ్ అయ్యాయి. ఎయిర్‌టెల్ ఇప్పటికే పని మొదలెట్టేసింది. పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై నెలకు సైలెంట్‌గా 50 రూపాయలు పెంచేసింది. మళ్లీ దానికి కవరింగ్ ఇస్తూ.. "మేము విదేశీ రోమింగ్ ఫ్రీగా ఇస్తున్నాం కదా" అంటూ తియ్యటి కబుర్లు చెబుతోంది. వొడాఫోన్ ఐడియా కూడా సరిగ్గా ఇదే రూట్ ఫాలో అవుతోంది.

NTR-Dragon: ఎన్టీఆర్ 3 నెలల విరామానికి సినిమా ఏడాదికి పోస్ట్ పోన్?సినిమాSwechaa16 Oct 2026, 05:43 PM

NTR-Dragon: ఎన్టీఆర్ 3 నెలల విరామానికి సినిమా ఏడాదికి పోస్ట్ పోన్?

NTR-Dragon: మాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సినిమా డ్రాగన్(వర్కింగ్ టైటిల్ మాత్రమే). హీరోయిన్‌గా కాంతార 1 ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తారక్ ఈ నెల 15 నుంచి షూటింగ్‌లో తిరిగి జాయిన్ అయ్యాడు. కానీ, ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా విడుదల ఎంత లేదన్నా ఏడాది పోస్ట్ పోన్ కాబోతుందట.

Indian Cinema: రామాయణ-వారణాసి లలో ఏది విజువల్ వండర్‌గా నిలుస్తుంది?సినిమాSwechaa16 Oct 2026, 05:08 PM

Indian Cinema: రామాయణ-వారణాసి లలో ఏది విజువల్ వండర్‌గా నిలుస్తుంది?

Indian Cinema: రామాయణ-వారణాసి లలో ఏది విజువల్ వండర్‌గా నిలుస్తుంది? ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో మాట్లాడుకుంటుంది ఈ రెండు భారీ చిత్రాల గురించే. ఇతిహాసాల నేపథ్యంలో ఎంతో గ్రాండియర్‌గా వస్తోన్న సినిమాలివి. ఇక్కడ, విశేషం ఏమిటంటే రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి సినిమాతో బాలీవుడ్ ఎపిక్ మైథలాజికల్ రామాయణ సినిమాతో పోల్చుతున్నారు. ఏది విజువల్ వండర్‌గా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందీ..అనేది చర్చ.

BRS-Congress: నాడు కేసీఆర్-నేడు రేవంత్ రెడ్డి.. రైతులు అంటే లెక్కలేదా?..తెలంగాణSwechaa16 Oct 2026, 05:00 PM

BRS-Congress: నాడు కేసీఆర్-నేడు రేవంత్ రెడ్డి.. రైతులు అంటే లెక్కలేదా?..

నాడు కేసీఆర్.. నేడు రేవంత్ రెడ్డి.. పాలకులు మారుతున్నారు.. కానీ రైతుల కష్టాలు మాత్రం ఎందుకు తీరడం లేదు? కేసీఆర్ హయాంలో రుణమాఫీ జాప్యం, కౌలు రైతుల నిర్లక్ష్యం, గిట్టుబాటు ధర సమస్యలు రైతులను వేధించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీతో ఊరట లభించినా.. రైతు భరోసా హామీ, పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. హామీలు కాదు.. ఆచరణ కావాలి! రైతుకు భరోసా ఇచ్చేది ప్రచారం కాదు.. ప్రభుత్వ పనితీరే! అని పాలకులు ఎందుకు గుర్తించలేక పోతున్నారు..

సింగరేణిలో భారీ కుంభకోణం.. త్వరలో బయటపెడతా-కేటీఆర్తెలంగాణSwechaa16 Oct 2026, 04:48 PM

సింగరేణిలో భారీ కుంభకోణం.. త్వరలో బయటపెడతా-కేటీఆర్

KTR: విదేశీ బొగ్గు కొనుగోళ్లపై విచారణకు సిద్ధమా? అని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సింగరేణిలో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. సింగరేణిలో సోలార్ పవర్ కుంభకోణాన్ని బయటపెడతానని తెలిపారు. సింగరేణిలో టన్ను బొగ్గు రూ.3వేల 800కే లభిస్తోందని.. అలాంటప్పుడు విదేశీ బొగ్గు కోసం రూ.10వేల నుంచి రూ.12వేలు ఎందుకు? అని రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. కమీషన్ల కోసమే సీఎం రేవంత్ విదేశీ బొగ్గు కొనుగోళ్లుకు ప్రాధాన్యం ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ - బీజేపీ తెరవెనుక డీల్?తెలంగాణSwechaa16 Oct 2026, 04:26 PM

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ - బీజేపీ తెరవెనుక డీల్?

MLC Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఫుల్ స్పీడ్‌తో ప్రచారంలో దూసుకుపోతుంటే.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు మాత్రం ఇంకా అభ్యర్థుల పేర్లను ఖరారు చేయలేక తర్జనభర్జన పడుతున్నాయి. అయితే ఈ తాత్సారం వెనుక ఒక సంచలన రాజకీయ వ్యూహం దాగి ఉందన్న చర్చ ఇప్పుడు గాంధీభవన్, తెలంగాణ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు "నువ్వు అక్కడ.. నేను ఇక్కడ" అంటూ ఇరు పార్టీలు లోపాయికారీ ఒప్పందానికి సిద్ధమవుతున్నాయా? అన్న గుసగుసలు పొలిటికల్ సర్కిల్స్‌లో గుప్పుమంటున్నాయి.

నా కంపెనీని టెండర్ వేయొద్దని చెప్తారా? : రాజగోపాల్ రెడ్డి ఆగ్రహంతెలంగాణSwechaa16 Oct 2026, 03:22 PM

నా కంపెనీని టెండర్ వేయొద్దని చెప్తారా? : రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం

రాష్ట్రంలో కమీషన్ల అంశం రాజకీయ హీట్‌ను రగిలించింది. సొంత పార్టీ నుంచే ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. రేడియల్ రింగు రోడ్డు ప్రాజెక్టులో కమీషన్ల కోసమే తన కంపెనీకి టెండర్ దక్కకుండా చేసి ఆంధ్రావాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణ కంపెనీలకు పనులు దక్కకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లాబీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను నిర్ణయిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.తన కంపెనీ నుంచి టెండర్ వేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రుద్ర ఉదయ్ సింహా కాల్ చేసి చెప్పారని పేర్కొన్నారు.2015 ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో పాటు రుద్ర ఉదయ్ సింహ కూడా నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.అయితే, తన కొడుకు కంపెనీ సుశీ ఇన్‌ఫ్రా.. అతను బిడ్డింగ్‌లో పాల్గొంటాడని రుద్ర ఉదయ్ సింహకు చెప్పానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు.రేడియల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.

Trump: ఇరాన్‌పై ట్రంప్ బిగ్గెస్ట్ వార్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌లో పెను విధ్వంసానికి రంగం సిద్ధం!NationalSwechaa16 Oct 2026, 03:06 PM

Trump: ఇరాన్‌పై ట్రంప్ బిగ్గెస్ట్ వార్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌లో పెను విధ్వంసానికి రంగం సిద్ధం!

Trump: పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. అంతర్జాతీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. నెలల తరబడి సాగుతున్న పోరులో దౌత్యపరమైన ఒత్తిళ్లకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గకపోవడంతో, ఆ దేశాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సంప్రదాయ ఆయుధాల్లోనే అత్యంత భయంకరమైన అస్త్రంగా పిలిచే 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' (MOAB)ను ఇరాన్‌పైకి ప్రయోగించేందుకు అమెరికా సైనిక వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయని, దీనికి ట్రంప్ నుంచి కూడా అనుమతి లభించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇరాన్ అణు కేంద్రాలు ఉన్న పీక్యార్ట్స్ పర్వత ప్రాంతంతో పాటు, ఆ దేశ కీలక ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత ఈ మెగా దాడిని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు ఆదేశంఏపీSwechaa16 Oct 2026, 02:52 PM

సీబీఐకి సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. హైకోర్టు ఆదేశం

గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించింది. అంతేకాకుండా, మృతుడు సాయికృష్ణ తల్లి గాదె విజయ లక్ష్మికి రూ.25 లక్షల పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగు వారాల్లోనే పరిహారం అందజేయాలని కోర్టు స్పష్టంచేసింది. కాగా, 25 ఏళ్ల గాదె సాయికృష్ణను ఈ ఏడాది మే నెలలో గతంలో అతని ఉన్న రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లలో భాగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం వద్ద అదుపులోకి తీసుకున్నారు.ఆ తర్వాత కృష్ణలంకకు తరలించగా అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు.దీంతో సాయికృష్ణ తల్లి పోలీసులను అశ్రయించింది. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో తన కుమారుడిని పోలీసులు లాకప్ డెత్ చేశారని ఆరోపిస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌తో పాటు సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.

యూనిఫాం ధరించి డ్యాన్సులు వేయొద్దు.. పోలీసు శాఖ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa16 Oct 2026, 02:03 PM

యూనిఫాం ధరించి డ్యాన్సులు వేయొద్దు.. పోలీసు శాఖ కీలక ఆదేశాలు

పోలీసు ఉద్యోగులు యూనిఫామ్స్ ధరించిన సమయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అని వారికి తాజాగా మార్గదర్శకాలు జారీ అయినట్టు తెలుస్తోంది. కొందరు విధినిర్వహణలో ఇటీవల రూల్స్ బ్రేక్ చేసినట్టు భావించిన తెలంగాణ పోలీసు శాఖ ఈ మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరోసారి గుర్తుచేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంలో డీజేపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర పోలీసువర్గాల గ్రూపుల్లో ఈ ఆదేశాలు చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం. గత రెండు మూడేళ్లుగా ప్రైవేట్ కార్యక్రమాలు, ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలలో విధుల్లో పాల్గొనే పోలీసులు యూనిఫామ్‌లోనే డ్యాన్సులు వేయడం, స్పీచ్‌లు ఇవ్వడం, ప్రయివేటు కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం వంటివి చేస్తున్నట్టు పోలీసుశాఖ గుర్తించింది. ఇటీవల వినాయక చవితి నిమజ్జన సమయంలో ట్యాంక్ మీద కొందరు పోలీసులు డీజే సప్పుళ్లకు డ్యాన్స్ చేయగా.. ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అందులో మహిళా పోలీసులతో పాటు పురుషులు కూడా ఉన్నారు.

డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తిచేయండి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డితెలంగాణSwechaa16 Oct 2026, 01:36 PM

డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తిచేయండి : మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి

డిండి ఎత్తిపోతల హెడ్ వర్క్స్ త్వరగా పూర్తి చేయాలని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒకేసారి లేఖలు రాశారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయానుసారం ఎదుల జలాశయం నుంచి డిండి ఎత్తిపోతల కోసం హెడ్ వర్క్స్ చేపట్టి త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్బంగా లేఖలో కోరారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డిండి లిఫ్ట్ స్కీమ్ సర్వేలకు 2007లో అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిండి ఎత్తిపోతల పథకం కోసం శ్రీశైలం జలాశయం నీటిని తీసుకునేందుకు ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకంతో అనుసంధానం చేసిందన్నారు. 90 టీఎంసీలు పాలమూరు–రంగారెడ్డికి, 30 టీఎంసీలు డిండి ఎత్తిపోతల పథకానికి అని నిర్ధారించిందని గుర్తుచేశారు. కానీ, డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లు తీసుకోవడానికి అవసరమైన నిర్మాణం జరగలేదన్నారు.

బంగ్లాదేశ్ తరహా పాలన మార్పునకు కుట్ర: రాజ్‌నాథ్ సింగ్NationalSwechaa16 Oct 2026, 01:00 PM

బంగ్లాదేశ్ తరహా పాలన మార్పునకు కుట్ర: రాజ్‌నాథ్ సింగ్

 దేశంలో బంగ్లాదేశ్ తరహాలో దాడులు, విప్లవాల ద్వారా 'పాలన మార్పు' (Regime Change) తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామనే ముసుగులో దేశంలో అరాచకం, రాజకీయ అస్థిరత వాతావరణాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాజ్‌నాథ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఏపీ ‘లోకల్’ హీట్..టీడీపీ,  వైసీపీ నేతల బాహాబాహీఏపీSwechaa16 Oct 2026, 12:56 PM

ఏపీ ‘లోకల్’ హీట్..టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీ

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరుపార్టీలు ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి అధికార కూటమి పార్టీని దెబ్బకొట్టాలని ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. అదే దూకుడుతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే బిజీలో ఉన్నారు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పుంగనూరులో నామినేషన్ వేసే అభ్యర్థులతో కలిసి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎలక్షన్ కేంద్రానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. దీంతో మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొంతమందికి గాయాలయ్యాయి.

సెంట్రల్ పార్క్ బంద్.. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహంNationalSwechaa16 Oct 2026, 12:31 PM

సెంట్రల్ పార్క్ బంద్.. కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పలుమార్లు ఆందోళలనకు పిలుపునిచ్చింది.ప్రస్తుతం జంతర్ మంతర్‌లో నిరసనలకు అనుమతి బ్యాన్ చేయడంతో కనాట్ ప్రదేశంలో తిరంగా ర్యాలీకి సేజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌లను మూసివేసింది.ఈ విషయం సుప్రీం మెట్లు ఎక్కగా.. స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. వ్యాపారులకు నష్టం వాటిల్లినట్లు తెలిస్తే రాజ్యాంగ పరిహార అధికారాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. కనాట్ ప్లేస్, సెంట్రల్ పార్క్‌ల మూసివేతపై ఢిల్లీ కిరాణా కమిటీ, ఢిల్లీ ఐరన్ అండ్ హార్డ్‌వేర్ మర్చంట్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ జై అనంత్ దేహద్రాయ్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.

డీలిమిటేషన్‌పై ముందుకే..! బీజేపీ ధైర్యం వెనుక సీక్రెట్ ఏంటి?NationalSwechaa16 Oct 2026, 12:25 PM

డీలిమిటేషన్‌పై ముందుకే..! బీజేపీ ధైర్యం వెనుక సీక్రెట్ ఏంటి?

విపక్షాలు ఎంతగా వ్యతిరేకించినా వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా కేంద్రం అడుగులు వేస్తోందా? ఏప్రిల్‌లో చుక్కెదురైనా.. ఇప్పుడు మళ్లీ డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల బిల్లులను ముందుకు తీసుకురావడానికి బీజేపీ సిద్ధమవుతోందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో లేని సంఖ్యాబలం ఇప్పుడు వచ్చిందా? రాజకీయ సమీకరణాలు మారిపోయాయా?

నాపై నిఘా పెట్టారు.. అరెస్టు చేస్తే చేసుకోండి : దీప్కేNationalSwechaa16 Oct 2026, 12:08 PM

నాపై నిఘా పెట్టారు.. అరెస్టు చేస్తే చేసుకోండి : దీప్కే

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రతివాహనదారుడిని, పౌరుడిని భద్రతా బలగాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పండుగల వేళ సీజేపీ నిరసన కారుల ముసుగులో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు,భద్రతా బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. జంతర్ మంతర్ పరిసరాల్లోకి నిరసనకారులు ఎవరినీ అనుమతించడం లేదు. ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించిన మాదిరి దర్శనమిస్తోంది. ఇదిలాఉండగా, జంతర్ మంతర్ బ్యాన్ చేయడంతో మరో చోట తిరంగా ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తాజాగా స్పందించారు.'లెహ్రా దో తిరంగా' మార్చ్‌కు ముందు భద్రతా బలగాలు భారీగా మోహరించాయని, ఆంక్షలు విధించారన్నారు. సెంట్రల్ పార్క్ మూసివేశారని చెప్పారు. అయినప్పటికీ తాను భయపడటం లేదని పేర్కొన్నారు. ఇక్కడే ఉన్నానని, కావాలంటే వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

సామాన్యుడికి ధరల షాక్.. ఆకాశాన్నంటుతున్న కూరగాయలు!తెలంగాణSwechaa16 Oct 2026, 11:54 AM

సామాన్యుడికి ధరల షాక్.. ఆకాశాన్నంటుతున్న కూరగాయలు!

 బతుకమ్మ, దసరా పండుగల వేళ తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో (El Nino) ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల దిగుబడి గణనీయంగా పడిపోవడంతో మార్కెట్‌లో ధరలకు రెక్కలొచ్చాయి. గతంతో పోలిస్తే ప్రతీ కూరగాయల ధర అమాంతం పెరగడంతో పాటు, కిలో ఉల్లిపాయల ధర రూ.55నుంచి రూ.70వరకు పెరగడంతో వంటింటి బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేస్తున్నాయి.

రేవంత్ సర్కారులో ‘కమీషన్ల’ లొల్లి.. మంత్రుల గుర్రు!టాప్ న్యూస్Swechaa16 Oct 2026, 11:34 AM

రేవంత్ సర్కారులో ‘కమీషన్ల’ లొల్లి.. మంత్రుల గుర్రు!

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారుపై భారీగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పిలిచే ప్రతి టెండర్‌లో కమీషన్ బేసిస్ ఆధారంగానే ఖరారు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు, మంత్రులు సైతం ఇదే విషయంపై చర్చించుకుంటున్నట్టు సమాచారం.సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే కొందరు అధికారులు ఈ వ్యవహారాన్ని అత్యంత చాకచక్యంగా డీల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాంట్రాక్టర్లు సైతం బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయితే, తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు మంత్రులు ఫీల్ అవుతున్నట్టు సమాచారం.

అద్భుతం సృష్టించిన టెస్లా.. గాల్లోకి దూసుకెళ్లిన రోడ్‌స్టర్ కార్!InternationalSwechaa16 Oct 2026, 11:21 AM

అద్భుతం సృష్టించిన టెస్లా.. గాల్లోకి దూసుకెళ్లిన రోడ్‌స్టర్ కార్!

 ఎగిరే కార్ల(Flying Cars) కలను నిజం చేసే దిశగా ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' మరో సంచలన మైలురాయిని అధిగమించింది. అమెరికాలోని మెక్‌గ్రెగర్‌లో అక్టోబర్ 15న నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో టెస్లా కొత్త రోడ్‌స్టర్ కారు గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసి అందరినీ విస్మయపరిచింది. ప్రత్యేకంగా రూపొందించిన ర్యాంప్‌పై తలకిందులుగా ప్రయాణించి, కొద్దిసేపు గాల్లో తేలియాడిన అనంతరం కారు సురక్షితంగా కిందకు దిగింది. ఈ అద్భుతమైన ప్రదర్శన వీడియోను ఎలాన్ మస్క్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంటూ.. ‘భవిష్యత్తులో ఎగిరే కార్లు ఉంటాయనిపిస్తోంది’ అని క్యాప్షన్ జోడించారు.

రింకూ సింగ్ ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది: మాజీ క్రికెటర్ వసీం జాఫర్క్రీడలుSwechaa16 Oct 2026, 11:08 AM

రింకూ సింగ్ ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది: మాజీ క్రికెటర్ వసీం జాఫర్

 వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి సరైన ఫినిషర్ లేకపోవడమే ప్రధాన కారణమని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు. భారీ లక్ష్య ఛేదనలో ఐదో స్థానంలో రింకూ సింగ్ ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఆయన పేర్కొన్నారు. కేవలం బౌలింగ్ చేయలేడనే సాకుతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రింకూను తుది జట్టు నుంచి తప్పించడం అత్యంత దురదృష్టకరమని జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో విశ్లేషించారు.

మెడికవర్ రేవంత్ ఫ్యామిలీదే.. ఇదిగో సాక్ష్యాలు : మన్నె క్రిశాంక్తెలంగాణSwechaa16 Oct 2026, 10:39 AM

మెడికవర్ రేవంత్ ఫ్యామిలీదే.. ఇదిగో సాక్ష్యాలు : మన్నె క్రిశాంక్

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులపై భారీగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎల్ నినో మీద మంత్రులతో సమావేశం అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా ప్రతినిధులు మెడికవర్‌ అంశంలో మాట్లాడాలని కోరగా.. ఆరోపణలు కాదు సాక్ష్యాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.చూపిస్తే విచారణకు సిద్ధం అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ మరోసారి సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

హైదరాబాద్‌లో ఫేక్ డిఫెన్స్ కంపెనీలు..  కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదురాజకీయాలుSwechaa16 Oct 2026, 10:15 AM

హైదరాబాద్‌లో ఫేక్ డిఫెన్స్ కంపెనీలు.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు

తెలంగాణలో ఫేక్ డిఫెన్స్ కంపెనీలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ పాలనలో ఫేక్ ఏరోస్పేస్,డిఫెన్స్ షెల్ కంపెనీలకు అడ్డగా హైదరాబాద్ మారుతోందన్నారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ట్యాగ్ చేస్తూ నగరంలోని నకిలీ కంపెనీలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పలువురు కీలక నేతల కుటుంబాలకు చెందిన అనుమానాస్పద కంపెనీలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న టెసరాక్ట్ ఏరోస్పేస్ షెల్ కంపెనీ వ్యవహారం బయటపడిందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ ఏరోస్పేస్ కంపెనీ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. తాజాగా ఐంద్రి డిఫెన్స్ అనే మరో షెల్ కంపెనీ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Hyderabad: రెవెన్యూలో కాసుల వేట-భూ సమస్యల పరిష్కారంలో 'రిపోర్ట్'ల పంచాయితీ!..తెలంగాణSwechaa16 Oct 2026, 09:31 AM

Hyderabad: రెవెన్యూలో కాసుల వేట-భూ సమస్యల పరిష్కారంలో 'రిపోర్ట్'ల పంచాయితీ!..

భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగీ తిరిగీ విసిగిపోయి చివరకు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్లు, సీనియర్ అసిస్టెంట్ల స్థాయి అధికారులే ఎక్కువగా ఏసీబీకి చిక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం భూ సమస్యల పరిష్కారంలో పైఅధికారుల పాత్ర చాలా కీలకం. భూభారతి లేదా ఇతర పోర్టళ్ల ద్వారా వచ్చిన దరఖాస్తులపై కింది స్థాయి అధికారులు పంపించే విచారణ నివేదికల (Reports) ఆధారంగానే ఆర్‌డీఓలు, అడిషనల్ కలెక్టర్లు (రెవెన్యూ) జిల్లా కలెక్టర్లు ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. అయితే, ఉన్నతాధికారుల నిర్ణయానికి కింది స్థాయి అధికారుల రిపోర్టే కీలకం కావడంతో, కొంతమంది అధికారులు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

బాలిస్టిక్ క్షిపణి దాడి.. త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ప్రధాని!InternationalSwechaa16 Oct 2026, 09:31 AM

బాలిస్టిక్ క్షిపణి దాడి.. త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ప్రధాని!

 మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. యెమెన్ తాత్కాలిక రాజధాని ఏడెన్‌లోని చారిత్రాత్మక అల్-మాషిక్ (Al-Maashiq) అధ్యక్ష భవన ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ తిరుగుబాటుదారులు గురువారం భీకర బాలిస్టిక్ క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన సమయంలో భవనంలోనే ఉన్న యెమెన్ ప్రధాని షయా అల్-జిందానీతో పాటు ఇతర కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

Telangana: ఎండిపోతున్న పొలాలు-అడుగంటుతున్న ఆశలు!..తెలంగాణSwechaa16 Oct 2026, 08:42 AM

Telangana: ఎండిపోతున్న పొలాలు-అడుగంటుతున్న ఆశలు!..

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో 2026 ఖరీఫ్‌ సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. వర్షాభావం, అడుగంటుతున్న భూగర్భ జలాలు, తగ్గిపోతున్న రిజర్వాయర్ల నీటి నిల్వలతో రైతులు పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గగా, వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. అప్పుల భారం రైతులను మరింత కుంగదీస్తోంది. ఈ పరిస్థితుల్లో కరువు మండలాల ప్రకటన, పంటల బీమా, నష్టపరిహారం, రుణాల వాయిదాల మంజూరు వెంటనే చేపట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. యాసంగిలో నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Telangana: మహా కరువుపైనా అవే ఉద్దర మాటలు?తెలంగాణSwechaa16 Oct 2026, 08:02 AM

Telangana: మహా కరువుపైనా అవే ఉద్దర మాటలు?

అనుకోకుండా వచ్చిన కరోనాకు మోదీ చెప్పిన ముచ్చట్లే, ఏడాది ముందు నుంచే చెబుతూ వచ్చిన కరువుపై రేవంత్ రెడ్డి చెబుతున్నారనే చర్చ తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది. నీళ్లు ఎత్తిపోసేందుకు అవకాశాలు ఉన్నా, వర్షాలు పడుతాయి.. మళ్లీ ఎందుకు ఎత్తిపోయడం.. కరెంట్ ఖర్చులు తగ్గించుకునేందుకు నీళ్లు ఎత్తిపోయలేదు అని చెబుతూ వచ్చారు. కరువు ఛాయలు, ఎండల తీవ్రత వచ్చి 20 రోజులకు పైగానే అవుతోంది. సూపర్ ఎల్ నినోపై కనీసం అవగాహన లేకుండా ఢిల్లీ, గోవా, కేరళం అంటూ పార్టీల కార్యక్రమాలకు తిరుగుతూ రైతన్నలను పట్టించుకోలేదు. 7 లక్షల ఎకరాల్లో ఎండిన పొలాలను చూపించి, రైతుల అప్పుల బాధలు వినిపిస్తే కాని రెండు రోజులుగా ఆఫీసర్స్‌తో మీటింగ్ పెట్టి హడావుడి చేస్తున్నారు.

గనుల్లో బొగ్గు గుట్టలు.. ప్లాంట్లలో విద్యుత్ కష్టాలు! యాదాద్రి నుంచి దేశానికి హెచ్చరిక ఇదేనా?NationalSwechaa16 Oct 2026, 12:21 AM

గనుల్లో బొగ్గు గుట్టలు.. ప్లాంట్లలో విద్యుత్ కష్టాలు! యాదాద్రి నుంచి దేశానికి హెచ్చరిక ఇదేనా?

దేశంలో బొగ్గు కొరత ఉందని చెబుతున్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో నిల్వలు తగ్గుతున్నాయని హెచ్చరికలు వస్తున్నాయి. మరోవైపు బొగ్గు గనుల వద్ద మాత్రం లక్షల టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. దేశంలో అసలు ఏం జరుగుతోంది..?

తెలంగాణకు 8 నెలల గండం.. నీళ్లు, కరెంటుకు కటకటేనా?తెలంగాణSwechaa15 Oct 2026, 11:43 PM

తెలంగాణకు 8 నెలల గండం.. నీళ్లు, కరెంటుకు కటకటేనా?

తెలంగాణకు రానున్న రోజులు అంత సులువుగా గడిచేలా కనిపించడం లేదు. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, తగ్గుతున్న నీటి నిల్వలు.. ఇవన్నీ కలిసి రాష్ట్రాన్ని తీవ్రమైన సవాళ్ల దిశగా నడిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి రాబోయే ఎనిమిది 8 అత్యంత కీలకమని హెచ్చరించడం వెనుక కారణమిదే.