స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

అందరం కలిసి కోవిడ్‌ను ఎదుర్కొన్నట్లే ఎల్‌నినోను ఎదుర్కొందాంతెలంగాణSwechaa15 Oct 2026, 10:52 PM

అందరం కలిసి కోవిడ్‌ను ఎదుర్కొన్నట్లే ఎల్‌నినోను ఎదుర్కొందాం

Elnino: ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద విపత్తు ఎల్‌నినో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ వల్ల గతంలో ప్రపంచమే స్తంభించిపోయిందని గుర్తు చేసిన ఆయన.. అలాంటి సంక్షోభమే ఎల్‌నినో అని చెప్పారు. భూమిపై ఉన్న ప్రతి జీవరాశిపై ఎల్‌నినో ప్రభావం ఉండబోతుందన్నారు. ఎల్ నినో అంశంపై మంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద విపత్తు ఎల్‌నినో అని ఆయన.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులతో ఎల్‌నినో ప్రభావంపై చర్చించినట్లు రేవంత్ తెలిపారు.

Fauzi Actress: ఇమాన్వీకైనా ప్రభాస్ కలిసొస్తాడా?సినిమాSwechaa15 Oct 2026, 10:24 PM

Fauzi Actress: ఇమాన్వీకైనా ప్రభాస్ కలిసొస్తాడా?

Fauzi Actress: కొందరు హీరోలతో నటించే హీరోయిన్స్ కెరీర్‌లో మంచి స్థానానికి చేరుకుంటారు. మరీ, ముఖ్యంగా డెబ్యూ చేసిన హీరోయిన్‌కి కొందరు హీరోలు లక్కీగా మారతారు. పవన్ కళ్యాణ్ సరసన నటించిన శ్రుతి హాసన్ ఏకంగా ఐరెన్ లెగ్ ముద్రను పోగొట్టుకుంది. అంతకముందు ఎన్ని సినిమాలు చేసినా కూడా శ్రుతి హిట్ అందుకోలేకపోయింది. కానీ, గబ్బర్ సింగ్ తర్వాత కెరీర్ ఊహించని రీతిలో మారిపోయింది.

TG: కొండపోచమ్మ నీళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఎందుకు?: సీఎం రేవంత్తెలంగాణSwechaa15 Oct 2026, 10:05 PM

TG: కొండపోచమ్మ నీళ్లు కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే ఎందుకు?: సీఎం రేవంత్

TG: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిపై రాజకీయ యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి విధానాల వల్లే రాష్ట్రం నేడు ఈ దుస్థితికి చేరిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఏకంగా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో వృథాగా పోశారని ఆయన నిప్పులు చెరిగారు. ఎల్‌నినో పరిస్థితులపై మంత్రులతో సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్.. కేసీఆర్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు.ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి తరలింపుపై రేవంత్‌రెడ్డి సంచలన వివరాలు బయటపెట్టారు. "కొండపోచమ్మ సాగర్ నుంచి పంచపాండవుల చెరువుకు ప్రత్యేకంగా కాలువ తవ్వించారు. అక్కడి నుంచి భారీ మోటార్ల ద్వారా నేరుగా నీటిని ఎత్తిపోస్తూ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తరలిస్తున్నారు.

Aafiya Syed: "అలియాస్ రుక్మిణి" టైటిల్ కి తగ్గ హీరోయిన్ కాదేమో?సినిమాSwechaa15 Oct 2026, 09:47 PM

Aafiya Syed: "అలియాస్ రుక్మిణి" టైటిల్ కి తగ్గ హీరోయిన్ కాదేమో?

Aafiya Syed: కొన్ని సినిమాలకి టైటిల్ ఎంత ముఖ్యమో, అందుకు తగ్గ హీరో లేదా హీరోయిన్ సెలక్షన్ కూడా అంతే ముఖ్యం. కాస్టింగ్ ఫెయిల్యూర్ సినిమాలు చాలా ఉన్నాయి. కథ, కథనం, డైరెక్షన్..ఇలా అన్నీ బావున్నా కూడా, కేవలం మేయిన్ లీడ్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు కోకొల్లలు. ఉదాహరణకి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన యువరాజు సినిమా గనక నాగార్జున చేసి ఉంటే బిగ్ హిట్ అయి ఉండేది. ఇప్పుడు, నితిన్ సినిమా అలియాస్ రుక్మిణి కి హీరోయిన్ ఎంపికైన సరైనదేనా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

TG: యాసంగిలో వరి వేయొద్దు: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణSwechaa15 Oct 2026, 09:43 PM

TG: యాసంగిలో వరి వేయొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

TG: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి, కరెంట్ కొరత తప్పేలా లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉన్నందున, రైతన్నలు పెద్దమనసు చేసుకుని రాబోయే యాసంగి సీజన్‌లో వరి సాగును వాయిదా వేసుకోవాలని చేతులెత్తి విజ్ఞప్తి చేశారు.

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి! పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు!తెలంగాణSwechaa15 Oct 2026, 09:11 PM

నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి! పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు!

TG: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ రాజకీయాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి, కేడర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గ పార్టీ పగ్గాలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి తాత్కాలికంగా అప్పగించబోతున్నారనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి-ఎల్ నినో పై సీఎం ఆందోళనతెలంగాణSwechaa15 Oct 2026, 09:09 PM

పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయి-ఎల్ నినో పై సీఎం ఆందోళన

Elnino: ఎల్ నినో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు హెచ్చరించినట్లే పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నామన్న ఆయన.. ప్రజలు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చలికాలం ఎండా కాలంలా ఉందని వాపోయారు. ఎండా కాలంలో ఉండాల్సిన ఎండలు ఇప్పుడు ఉంటున్నాయన్నారు. గతంలో చాలాసార్లు ఎల్ నినో వచ్చిన ఈస్థాయిలో ప్రభావం చూపలేదన్నారు. ఈసారి సూపర్ ఎల్ నినో వచ్చిందన్నారు. ఎల్ నినో పై ప్రజలను, రైతులను అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.

Trade Deal: భారత్ - అమెరికా తొలి దశ ట్రేడ్ డీల్‌ పూర్తయినట్లే: పీయూష్ గోయల్NationalSwechaa15 Oct 2026, 08:53 PM

Trade Deal: భారత్ - అమెరికా తొలి దశ ట్రేడ్ డీల్‌ పూర్తయినట్లే: పీయూష్ గోయల్

Trade Deal: భారత్, అమెరికాల మధ్య ఎప్పటినుంచో నడుస్తున్న మెగా బిజినెస్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య కుదరాల్సిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో మొదటి రౌండ్ చర్చలు పూర్తయ్యాయని, తొలి దశ ప్రాసెస్ దాదాపు కొలిక్కి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో మాట్లాడిన గోయల్.. ఈ డీల్‌కు సంబంధించి ప్రస్తుతం లీగల్ డ్రాఫ్ట్ రెడీ అవుతోందని చెప్పారు..

Cinema: బోల్డ్ పాత్రలు చేసిన హీరోయిన్స్ అలాంటి వాళ్ళేనా?సినిమాSwechaa15 Oct 2026, 08:42 PM

Cinema: బోల్డ్ పాత్రలు చేసిన హీరోయిన్స్ అలాంటి వాళ్ళేనా?

Cinema: సాధారణంగా సినిమాపై సమాజం ప్రభావం..సమాజంలో జరుగుతున్న పరిణామాలు, ఆదర్శ వంతమైన సంఘటనలు, మనుషుల జీవితాలు..వీటి ఆధారంగా కథలు తయారవుతున్నాయి. ఆ కథల్లో హీరోలు నటిస్తుండటం జరుగుతోంది. ఇలా, తయారైన కథలే బయోపిక్స్‌గా రూపొంది బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన సినిమా ది దర్టీ పిక్చర్. ఇప్పుడు, దీనికి సీక్వెల్ సినిమాను రూపొందించే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారు. లీడ్ రోల్ కోసం తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్తెలంగాణSwechaa15 Oct 2026, 08:14 PM

రూ.2.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్

మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా 2.50 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు పట్టుబడ్డారు. 22Aలో ఉన్న భూమి సక్సెషన్ కోసం రూ.5 లక్షలు డిమాండ్ చేశారు అధికారులు.

Telangana: తెలంగాణలో మొదలైన ఎల్‌నినో కష్టాలు.. గత చరిత్రలో దాగిన భయంకరమైన నిజాలు!!తెలంగాణSwechaa15 Oct 2026, 07:51 PM

Telangana: తెలంగాణలో మొదలైన ఎల్‌నినో కష్టాలు.. గత చరిత్రలో దాగిన భయంకరమైన నిజాలు!!

రాష్ట్రంలో వరుణుడి అలక.. సూర్యుడి ప్రతాపం.. వెరసి ఎల్‌నినో ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనలు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. సకాలంలో వర్షాలు కురవక, వేసిన పంటలు ఎండిపోతుంటే.. పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో లేదో తెలియని దుస్థితిలో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు వర్షాల కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు పెరుగుతున్న సాగు ఖర్చులు.. ఇవన్నీ కలిసి రైతు జీవితాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు బీళ్లుగా మారుతుంటే.. అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతన్నలు దిగాలు పడుతున్నారు.

Tollywood: టాలీవుడ్‌ను వణికిస్తున్న కత్తెరల రాజ్!సినిమాSwechaa15 Oct 2026, 07:50 PM

Tollywood: టాలీవుడ్‌ను వణికిస్తున్న కత్తెరల రాజ్!

Tollywood: కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, వందలాది మంది శ్రమతో ఒక కథను తెరకెక్కించిన నిర్మాతలకు షూటింగ్ పూర్తి కావడం ఒక ఎత్తయితే.. సెన్సార్ గది దాటడం మరో ఎత్తుగా మారింది. థియేటర్లలో ప్రేక్షకుల తీర్పు రాకముందే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్ద పడే కత్తెర దెబ్బలకు సినిమా రూపురేఖలే మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం సినిమాను చూసి ఏ వయసు వారు చూడాలో ధ్రువీకరించే సర్టిఫికేషన్ బోర్డు, నేడు దర్శకుల సృజనాత్మకతను కట్టడి చేస్తూ చిత్రాల మనుగడనే శాసించే స్థాయికి చేరిందన్న ఆగ్రహం చిత్ర పరిశ్రమలో వ్యక్తమవుతోంది.ముఖ్యంగా పాన్-ఇండియా రేంజ్‌లో రూపొందే భారీ బడ్జెట్ సినిమాలకు సెన్సార్ ఆంక్షలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. గతంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ విషయంలో ఫైట్ సీన్ల నిడివిని తగ్గించేందుకు మేకర్స్ అంగీకరించకపోవడంతో బోర్డు ఏకంగా ‘ఏ’ (A) సర్టిఫికేట్ ఇచ్చేసింది.

Tollywood: సినిమాపై ఓటీటీ ఒత్తిడెందుకు?సినిమాSwechaa15 Oct 2026, 07:33 PM

Tollywood: సినిమాపై ఓటీటీ ఒత్తిడెందుకు?

Tollywood: ఒకప్పుడు సినిమా ఎప్పుడు మొదలైనా, ఎప్పుడు పూర్తైనా ఆ సినిమాలపై నిర్మాతల ఒత్తిడి ఉండేది. ఒకవేళ సినిమా అవుట్ పుట్ కోసం గనక రీ షెడ్యూల్స్, ఎక్స్ట్రా డేస్ షూట్ అన్నా కూడా ఇబ్బందులు ఉండేవి కాదు. ఎందుకంటే, కొన్ని సినిమాలకి ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించి, దాని ప్రకారమే షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి చేసేవారు. కానీ, ఇప్పుడు ఇదే సినిమా మీద ఓటీటీల ఒత్తిడి ఎక్కువై, నిర్మాతలకి లాస్ తప్పడం లేదు.

దసరా పండుగ ప్రత్యేక బస్సు సర్వీసులు విజయవంతం- నాగిరెడ్డితెలంగాణSwechaa15 Oct 2026, 07:25 PM

దసరా పండుగ ప్రత్యేక బస్సు సర్వీసులు విజయవంతం- నాగిరెడ్డి

TGSRTC: దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులు అత్యంత ప్రణాళికాబద్ధంగా, విజయవంతంగా కొనసాగుతున్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి తెలిపారు. పండుగ వేళ సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ED), అన్ని రీజినల్ మేనేజర్లు (RM) ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఎండీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

బ్లాక్‌లో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు.. HCA సభ్యుడు అరెస్ట్క్రైమ్Swechaa15 Oct 2026, 07:10 PM

బ్లాక్‌లో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు.. HCA సభ్యుడు అరెస్ట్

HCA: క్రికెట్ కున్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవాలని చూశారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోయారు. కాంప్లిమెంటరీ టికెట్లను సైతం అక్రమంగా బ్లాక్ లో విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కట్ చేస్తే.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయి పరువు పొగొట్టుకున్నారు. హైదరాబాద్ లో భారత్‌-వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌ టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ దందా బట్టబయలైంది.

గోషామహల్ పోలీసులు మెరుపు దాడి చేసి కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ్‌, ఆయన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ్‌ ఉండటం అందరినీ షాక్ కి గురి చేసింది. వీరితో పాటు అవినాష్ దరక్‌, మోహిత్ సోమానీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Prabhas: కన్‌ఫ్యూజన్‌లో డార్లింగ్ మూవీస్..ప్రభాస్ పట్టించుకోడా?సినిమాSwechaa15 Oct 2026, 06:53 PM

Prabhas: కన్‌ఫ్యూజన్‌లో డార్లింగ్ మూవీస్..ప్రభాస్ పట్టించుకోడా?

Prabhas: ప్రభాస్ సినిమా అంటే అభిమానులకి రాను రాను ఆసక్తి తగ్గిపోతుందా!..ప్రస్తుతం ఆయన సినిమాల నుంచి వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇదే అనిపిస్తోంది. ఎప్పుడైతే, ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి ఏ ఒక్క సినిమా కూడా చెప్పిన తేదీకి రిలీజ్ కాలేదు. దాంతో, సోషల్ మీడియాలో ఇకవైపు నెగిటివ్ ట్రోల్స్ వస్తుంటే, ఇంకో వైపు ఓటీటీల నుంచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Indian politics: ఇండియన్ పాలిటిక్స్ ఏం నేర్పుతున్నాయి?అభిప్రాయంSwechaa15 Oct 2026, 06:39 PM

Indian politics: ఇండియన్ పాలిటిక్స్ ఏం నేర్పుతున్నాయి?

భారత రాజకీయ చరిత్రలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకుల త్యాగాల నుంచి నేటి అధికార పోరాటాల వరకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ఒకప్పుడు ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కనిపిస్తారు.. కానీ నేడు అధికారం, ఆర్థిక బలం, ఎన్నికల వ్యూహాలు, ప్రచార ఆర్భాటం రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే ఓటు బ్యాంక్ రాజకీయాలు పురుడు పోసుకున్నాయి. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా ఓట్లను చీల్చే కుతంత్రాలు మొదలయ్యాయి. భావజాలమే ఆధారంగా ఒకప్పుడు సాగిన రాజకీయాలు, క్రమంగా వ్యాపారంగా రూపాంతరం చెందాయి. సిద్ధాంతాల కంటే గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత పెరిగింది. అదేవిధంగా నేడు రాజకీయాలు డిజిటలైజ్ అయ్యాయి... సోషల్ మీడియా ప్రచారాలు, కోట్లాది రూపాయల ప్రకటనలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లా మారాయి.

TG:  అడుగంటుతున్న ప్రాజెక్టులు.. తీవ్ర నీటి కరువు తప్పదా?తెలంగాణSwechaa15 Oct 2026, 06:36 PM

TG: అడుగంటుతున్న ప్రాజెక్టులు.. తీవ్ర నీటి కరువు తప్పదా?

TG: రాష్ట్రంలో ఎండలు ముదరకముందే నీటి గండం పొంచి ఉంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు రోజురోజుకూ పడిపోతుండటంతో రానున్న రోజుల్లో గొంతెమ్మ కోర్కెలు కాదు కదా.. కనీసం గొంతు తడుపుకోవడానికే నీళ్లు దొరకడం గగనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి తీవ్రతను ముందే పసిగట్టిన ప్రభుత్వ యంత్రాంగం, సాగు కంటే మునుముందు తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా సింగూరు జలాశయం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 3.924 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, ఈ నిల్వలు డిసెంబర్ 10 వరకే సరిపోతాయని అధికారులు తేల్చేశారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల పరిధిలోని దాదాపు 2,395 గ్రామాలు, 19 పట్టణాలు ఈ నీటిపైనే బతుకుతున్నాయి. ఈ నాలుగు జిల్లాల తాగునీటి అవసరాల కోసం రూ.84.14 కోట్లు, హైదరాబాద్‌లో నీటి కష్టాలు రాకుండా చూసేందుకు మరో రూ.57.55 కోట్లతో ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

22ఏ.. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం..!తెలంగాణSwechaa15 Oct 2026, 06:10 PM

22ఏ.. దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం..!

22A Lands: 22ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. 22ఏ ను అడ్డు పెట్టుకుని భూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 22ఏ నిషేధిత భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత భూముల జాబితాపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు.

Elon Musk : మస్క్ అన్నయ్య.. నీతులు చెప్పడమే కానీ పాటించడం తెలీదా?InternationalSwechaa15 Oct 2026, 06:10 PM

Elon Musk : మస్క్ అన్నయ్య.. నీతులు చెప్పడమే కానీ పాటించడం తెలీదా?

Elon Musk: "నేను ఏ రాజకీయ పార్టీకి గుడ్డిగా కొమ్ముకాయను.. ప్రజాస్వామ్యంలో డబ్బు ప్రవాహం ప్రమాదకరం.. ఇకపై రాజకీయాల కోసం పైసా కూడా విదిలించను!" ఇలా మైకులు దొరికినప్పుడల్లా, అలాగే తన సొంత 'ఎక్స్' ఖాతాలోనూ సుద్దులు చెప్పడంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కి మించిన వారు మరొకరు ఉండరు. భారతదేశంలో రిలయన్స్ వంటి సంస్థలు ప్రభుత్వాలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయని గతంలో ప్రవచనాలు వండివార్చిన ఈ టెక్ టైకూన్.. ఇప్పుడు తన సొంత దేశమైన అమెరికాలో చేస్తున్నదేంటి? కేవలం రాజకీయ అధికారాన్ని శాసించడానికి, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏకంగా రూ.3,000 కోట్లకు పైగా నిధులను ఎన్నికల బరిలోకి కుమ్మరిస్తూ అడ్డంగా దొరికిపోయారు. నీతులు చెప్పడం వేరు.. సొంత లాభం చూసుకోవడం వేరు అని మస్క్ చేతలే నిరూపిస్తున్నాయి.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం సుమారు 290 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టిన తర్వాత.. ఇకపై రాజకీయ ఫండింగ్‌లకు దూరంగా ఉంటానని 2025లో మస్క్ స్వయంగా ప్రగల్భాలు పలికారు. కానీ ఆ మాటలన్నీ కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితమని ‘ది న్యూయార్క్ టైమ్స్’ తాజా పరిశోధనాత్మక నివేదికతో బట్టబయలైంది. రాబోయే మిడ్-టర్మ్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, రిపబ్లికన్ పార్టీకి పట్టున్న కాంగ్రెస్‌ను కాపాడుకునేందుకు మస్క్ ఇప్పటివరకు ఏకంగా $366 మిలియన్లు (రూ.3,000 కోట్లకు పైగా) వెచ్చించారు.

TG: తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎకరానికి రూ.10 వేల సాయం దిశగా సర్కార్!తెలంగాణSwechaa15 Oct 2026, 05:55 PM

TG: తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎకరానికి రూ.10 వేల సాయం దిశగా సర్కార్!

TG: ఆకాశం వైపు కళ్లప్పగించి చూసిన రైతు కంట ఇప్పుడు కన్నీరే మిగిలింది. వరుణుడు ముఖం చాటేయడం, దానికితోడు ఎల్‌నినో ప్రభావం తోడవడంతో తెలంగాణ పల్లెల్లో కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతికందే దశలో పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11.18 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.ఈ వానాకాలం సీజన్‌లో వానలు సరిగ్గా పడకపోవడంతో పత్తి రైతులు నిండా మునిగిపోయారు. దెబ్బతిన్న మొత్తం 11.18 లక్షల ఎకరాల్లో ఏకంగా 8.93 లక్షల ఎకరాలు పత్తి పంటదే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంటే పాడైపోయిన పంటల్లో దాదాపు 80 శాతం పత్తే. మరో 3 లక్షల ఎకరాలకు పైగా చేలు వాడిపోతుండగా, దాదాపు 80 వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి బూడిదయ్యాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 3.59 లక్షల ఎకరాల్లో చేలు ఎండిపోగా, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అన్నదాతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలు పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి సాగు విస్తీర్ణమే భారీగా తగ్గిపోగా, అందులోనూ వరి నాట్లు ఏకంగా 18 శాతం పడిపోయాయి.

South Cinema: ఫేక్ కలెక్షన్స్ వల్ల సినిమా నిలబడుతుందా?సినిమాSwechaa15 Oct 2026, 05:44 PM

South Cinema: ఫేక్ కలెక్షన్స్ వల్ల సినిమా నిలబడుతుందా?

South Cinema: సినిమా బావుందంటే థియేటర్స్‌కి పరుగెత్తుకెళతారు ఆడియన్స్. అది, ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఎన్ని ఓటీటీలు వచ్చినా, ఎలాంటి ప్యాండమిక్ సిచ్యువేషన్స్ ఎదురైనా..ఆడియన్ కోరుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలిగితే థియేటర్స్ ఎక్స్పీరియన్స్ కోసమే వస్తాడు. ఇందుకు ఉదాహరణ ఈ మధ్య కాలంలో వచ్చిన బ్లాక్ బస్టర్స్ మా ఇంటి బంగారం, లెనిన్, కొరియన్ కనకరాజు, మన శంకరవరప్రసాద్‌గారు, ఇరుముడి లాంటి హిట్ సినిమాలే.

Tollywood: మ్యాజిక్ చేయాల్సింది కంటెంటే..హీరో కాదా?సినిమాSwechaa15 Oct 2026, 05:32 PM

Tollywood: మ్యాజిక్ చేయాల్సింది కంటెంటే..హీరో కాదా?

క్లియర్‌గా చెప్పాలంటే, ఇటీవల కాలంలో వచ్చిన రవితేజ సినిమాలలో బలమైన కథ లేకుండా మాస్ మహారాజ్ ఇమేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని తీసిన సినిమాలన్నీ ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అదే, రవితేజ..బలమైన కథ-కథనాలతో హ్యూమన్ ఎమోషన్స్‌తో చేసిన ఇరుముడి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక్కడ కథ మాత్రమే సక్సెస్ సాధించింది. అందులో నటించిన నటీనటులు సినిమాకి అదనపు ఆకర్శణగా నిలిచారు. మనసులను హత్తుకున్న కథలెప్పుడు నిలబడతాయి.

Saudi Arabia: హౌతీలపై పోరుకు ఇజ్రాయెల్ సైనిక ఆఫర్.. వద్దని సౌదీ వెనక్కి తగ్గడానికి కారణాలు ఇవేనా?NationalSwechaa15 Oct 2026, 05:01 PM

Saudi Arabia: హౌతీలపై పోరుకు ఇజ్రాయెల్ సైనిక ఆఫర్.. వద్దని సౌదీ వెనక్కి తగ్గడానికి కారణాలు ఇవేనా?

Saudi Arabia: యెమెన్ నుంచి దూసుకొస్తున్న హౌతీ తిరుగుబాటుదారుల బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు సంపన్న సౌదీ సామ్రాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయిల్ ఫీల్డులు, ఎయిర్‌పోర్టులు టార్గెట్ కావడమే కాదు.. రాజధాని రియాద్ గగనతలంపైకి కూడా ముప్పు చేరడంతో సౌదీ అరేబియా తీవ్ర భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఉమ్మడి శత్రువైన హౌతీలను మట్టికరిపించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సంచలన సైనిక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అగ్రరాజ్యం అమెరికా సైతం ఈ డీల్ ఫిక్స్ చేసేందుకు తెరవెనుక తీవ్రంగా చక్రం తిప్పింది. అయితే, ముంగిట్లోకి వచ్చిన ఇజ్రాయెల్ ఆర్మీ ఆఫర్‌ను సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ముఖం మీదే నిర్మొహమాటంగా తిరస్కరించడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రాణసంకటమైన ముప్పు పొంచి ఉన్నప్పటికీ నెతన్యాహు ఆఫర్‌కు సౌదీ ఎందుకు చెక్ పెట్టింది? ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు లెక్కలేంటి?

యాదాద్రి పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజినీర్‌పై సస్పెన్షన్ వేటుతెలంగాణSwechaa15 Oct 2026, 04:57 PM

యాదాద్రి పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజినీర్‌పై సస్పెన్షన్ వేటు

Suspension: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, కోతలపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అధికారుల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో కీలక అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. వైటీపీఎస్ స్టేజ్ వన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పై టీజీ జెన్ కో చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ జెన్ కో సీఎండీ హరీశ్ ఆదేశాలు జారీ చేశారు. ఎనర్జీ సెక్రటరీ ఆదేశాల మేరకు సీఎండీ హరీశ్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం, పర్యవేక్షణలో లోపాలు, పనుల పురోగతిపై సమన్వయ లోపాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tollywood: హీరోయిన్‌గా ఎదగాలంటే ఏం కావాలి?సినిమాSwechaa15 Oct 2026, 04:55 PM

Tollywood: హీరోయిన్‌గా ఎదగాలంటే ఏం కావాలి?

Tollywood: హీరోయిన్‌గా ఎదగాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇతర సౌత్ భాషలలోనూ..నార్త్ బెల్ట్‌లోనూ ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే, అందం..అభినయం ఉన్న వాళ్ళూ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. కొందరు ఈ రెండితో పాటు లక్.. అలాగే, ఇండస్ట్రీలో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏళ్ళ పాటు స్టార్ హీరోయిన్‌గా ఏలుతున్నారు.

India Development: అభివృద్ధిలో ఇండియా ఎందుకు వెనకబడుతుంది?!అభిప్రాయంSwechaa15 Oct 2026, 03:42 PM

India Development: అభివృద్ధిలో ఇండియా ఎందుకు వెనకబడుతుంది?!

ఇజ్రాయెల్‌కు నీటి కొరత.. జపాన్‌కు సహజ వనరుల కొరత.. సింగపూర్‌కు భూమి కొరత.. అయినప్పటికీ ఈ దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. వారికి ఉన్న పరిమిత వనరులను సమర్థంగా ఉపయోగించుకుంటూ సాంకేతికత, పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. మరి భారతదేశంలో కూడా సహజ వనరులు, అపారమైన మానవ వనరులు ఉన్న అదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది? అసలు మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్నది ఎవరు? సమస్య ఎక్కడ ఉంది?

రాహుల్ గాంధీ సహా ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులుNationalSwechaa15 Oct 2026, 03:32 PM

రాహుల్ గాంధీ సహా ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్, ఇండియా కూటమి ఎంపీలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయడంతో పాటు అర్హుల ఓట్లు తొలగించిన సీఈసీ పదవి నుంచి తప్పుకోవాలని ఈ సందర్భంగా ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే,సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించిన వ్యవహారంపై దేశ సర్వోన్నత నాయకత్వంపై తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 'ఇండియా' కూటమికి చెందిన పలువురు ప్రముఖ నేతలకు సుప్రీం కోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సుప్రీంకోర్టును ఎవరూ భయపెట్టలేరు. కోర్టు బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో మాకు స్పష్టంగా తెలుసు’ అని సీజేఐ సీరియస్ అయినట్టు తెలిసింది.

సింగరేణి ప్రయివేటీకరణపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ!తెలంగాణSwechaa15 Oct 2026, 03:01 PM

సింగరేణి ప్రయివేటీకరణపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ!

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. గత పదేళ్ల పాలనలో సింగరేణిని కేసీఆర్ కుటుంబం ఒక 'జేబు సంస్థ'గా మార్చుకుందని విమర్శించారు.

Reliance Success Story: చిన్న ట్రేడింగ్ కొట్టు నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం దాకా.. రిలయన్స్ ప్రస్థానం!తెలంగాణSwechaa15 Oct 2026, 02:38 PM

Reliance Success Story: చిన్న ట్రేడింగ్ కొట్టు నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం దాకా.. రిలయన్స్ ప్రస్థానం!

Reliance Success Story: భారతదేశ వ్యాపార చరిత్రలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సాధించిన ప్రగతి కేవలం ఒక కంపెనీ ఎదుగుదల మాత్రమే కాదు. అది యావత్ భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఓ మహా విప్లవం. 1958లో కేవలం 500 రూపాయల పెట్టుబడితో ఒక చిన్న ట్రేడింగ్ సంస్థగా మొదలైన ప్రయాణం, నేడు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ విలువతో దేశంలోనే నంబర్ 1 ప్రైవేట్ రంగ దిగ్గజంగా నిలిచింది. ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం నుంచి ప్రారంభమై ప్రపంచ కుబేరుల జాబితా వరకు సాగిన ధీరూభాయ్ అంబానీ కుటుంబ ప్రస్థానం, భారతీయ వాణిజ్య రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది.