స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

‘అసలు నిజాన్ని దాచారు..’ శాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు!క్రీడలుSwechaa14 Nov 2026, 02:16 PM

‘అసలు నిజాన్ని దాచారు..’ శాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు!

  ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన 2018 కేప్ టౌన్ బాల్ ట్యాంపరింగ్ (శాండ్‌పేపర్‌గేట్) వివాదం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ భగ్గుమంది. మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇటీవల విడుదల చేసిన తన ఆత్మకథ 'సబర్' (Sabr)లో అప్పటి కుట్ర గురించి సంచలన విషయాలను బయటపెట్టడంతో ఆసీస్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారం చెలరేగింది. ఈ వివాదంపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

National : రాంలీలాలో ఆంక్షలు.. సభలు, నిరసనలపై కఠిన నిబంధనలు!NationalSwechaa14 Nov 2026, 01:53 PM

National : రాంలీలాలో ఆంక్షలు.. సభలు, నిరసనలపై కఠిన నిబంధనలు!

దేశరాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇకమీదట సభలు, నిరసనలు నిర్వహించే వారికి బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ పోలీసులు కొత్తగా నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు సమాచారం. మైదానంలో నిర్వహించే సభలు, సమావేశాలు,ఆందోళనలకు గరిష్ఠంగా 50 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సభలు, ప్రదర్శనలకు అవకాశం ఉండనుంది. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు భారీ ఎదురుదెబ్బరాజకీయాలుSwechaa14 Nov 2026, 01:32 PM

మద్రాస్ హైకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు భారీ ఎదురుదెబ్బ

 తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి విజయం సాధించిన డీఎంకే అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే తిరస్కరించాలని కోరుతూ ఉదయనిధి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను జస్టిస్ జి. అరుల్ మురుగన్ ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. ఈ ఎన్నికల పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణను కొనసాగించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

గిగ్ వర్కర్లకు భరోసా.. బీమా పథకాన్ని  ప్రారంభించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి!తెలంగాణSwechaa14 Nov 2026, 01:12 PM

గిగ్ వర్కర్లకు భరోసా.. బీమా పథకాన్ని  ప్రారంభించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి!

 రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్ హైటెక్ సిటీలోని జయభేరీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి 'తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకం' విధివిధానాలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు మాదాపూర్ శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు వేలాది మంది డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లతో కలిసి నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tollywood: OG 2 కంటే ముందే అనిల్ రావిపూడితో పవన్ సినిమా!సినిమాSwechaa14 Nov 2026, 01:11 PM

Tollywood: OG 2 కంటే ముందే అనిల్ రావిపూడితో పవన్ సినిమా!

Tollywood: OG 2 కంటే ముందే అనిల్ రావిపూడితో పవన్ సినిమా ఉండబోతుందా..! ప్రస్తుతం, ఇదే లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దిల్ రాజు, పవన్ కళ్యాణ్‌ల మధ్య మంచి బాండింగ్ ఉంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన వకీల్ సాబ్ మంచి హిట్ సినిమాగా నిలిచింది. దీంతో, మరోసారి దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా డేట్స్ కూడా ఇచ్చాడు పవన్.

తిరుమలకు పోటెత్తిన భక్త జనం.. ఒక్కరోజే రూ.4.92 కోట్ల ఆదాయం!ఏపీSwechaa14 Nov 2026, 12:30 PM

తిరుమలకు పోటెత్తిన భక్త జనం.. ఒక్కరోజే రూ.4.92 కోట్ల ఆదాయం!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. రద్దీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం ప్రాంతం వరకు బారులు తీరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు.

దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను అవమానిస్తున్నారు: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఫైర్!తెలంగాణSwechaa14 Nov 2026, 12:21 PM

దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను అవమానిస్తున్నారు: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఫైర్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ప్రతిపక్ష నేత స్థాయిలో లేదని, ఆయన దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలు గాంధీ కుటుంబానికి ఎన్నో పదవులు కట్టబెడితే, నేడు అదే కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ దేశాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యంపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించే సైనికులను సైతం కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.

Crime : ఒకరి వేధింపులు, మరొకరు మోసం.. ఇద్దరు యువతుల ఆత్మహత్యక్రైమ్Swechaa14 Nov 2026, 12:08 PM

Crime : ఒకరి వేధింపులు, మరొకరు మోసం.. ఇద్దరు యువతుల ఆత్మహత్య

రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకరేమో పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేయగా.. మరొకరు కులాన్ని సాకుగా చూపి పెళ్లి నిరాకరించడంతో మరో యువతి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. యువతుల మరణాలకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకివెళితే.. నారాయణపేట జిల్లా జౌల్లాపురం గ్రామంలో నివాసముంటున్న హన్మంతు–వెంకటమ్మ దంపతులకు కూతురు అనిత (23) ఉంది. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో అనితకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా సన్నిహితంగా ఇద్దరు సన్నిహితంగా ఉండేవారని సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలని అనిల్ పదే పదే వేధించేవాడు. దీంతో అతన్ని దూరం పెట్టి అనిత చదువుకుంటోంది. దూరం పెట్టినప్పటికీ అనిల్ వేధింపులు ఆగకపోవడంతో, తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకుని అనిత ఆత్మహత్య చేసుకుంది.

స్పై కెమెరా కళ్లజోడుతో శ్రీకాళహస్తి ఆలయంలోకి.. పోలీసుల అదుపులో భక్తుడు!క్రైమ్Swechaa14 Nov 2026, 11:44 AM

స్పై కెమెరా కళ్లజోడుతో శ్రీకాళహస్తి ఆలయంలోకి.. పోలీసుల అదుపులో భక్తుడు!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపేలా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిఘా కెమెరాలు అమర్చిన ప్రత్యేక 'స్పై కెమెరా కళ్లజోడు' (Spy Camera Spectacles) ధరించి పుణెకు చెందిన ఓ భక్తుడు నేరుగా ఆలయంలోకి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సదరు భక్తుడు ధరించిన కళ్లజోడుపై అనుమానం వచ్చిన పూజారులు వెంటనే అప్రమత్తమై ఎస్పీఎఫ్ (SPF) భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.

National : డేంజర్ జోన్‌‌లో భారత్.. 2027 చివరివరకు ఎల్‌నినో ప్రభావం!NationalSwechaa14 Nov 2026, 11:30 AM

National : డేంజర్ జోన్‌‌లో భారత్.. 2027 చివరివరకు ఎల్‌నినో ప్రభావం!

ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడనున్నట్టు తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతుండటంతో ఎల్ నినో ఎఫెక్ట్ ఏర్పడింది. దీంతో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యం అవ్వడంతో పాటు తొందరగా బలహీన పడ్డాయి.ఫలితంగా ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది వర్షాకాలం వరకు పరిస్థితులు చక్కబడేలా పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎల్‌నినో తాజాగా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక హెచ్చరికలు చేసింది. 2027 సెప్టెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని స్పష్టంచేసింది. అంతేకాకుండా, 'హై రిస్క్ జోన్' (అధిక ముప్పు ఉన్న దేశాల జాబితా)లో భారత్‌ను చేర్చింది. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు చేశారు.

ఇంటర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ లో కలిపేస్తారా? సాధ్యమేనా.. ప్రభుత్వం ముందు సవాళ్లెన్నో!తెలంగాణSwechaa14 Nov 2026, 11:17 AM

ఇంటర్‌ను స్కూల్ ఎడ్యుకేషన్ లో కలిపేస్తారా? సాధ్యమేనా.. ప్రభుత్వం ముందు సవాళ్లెన్నో!

ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలన్న ఆలోచన తెలంగాణ విద్యా వ్యవస్థలో ఇప్పుడు పెను చర్చకు తెరలేపుతోంది. ఇంటర్ బోర్డు ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతోందా? లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుంది?

గాంధీ కుటుంబంపై వివాదాస్పద పోస్టులు.. కంగనా రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్!NationalSwechaa14 Nov 2026, 10:40 AM

గాంధీ కుటుంబంపై వివాదాస్పద పోస్టులు.. కంగనా రనౌత్‌పై ఎఫ్‌ఐఆర్!

 బాలీవుడ్ నటి, మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర, రెచ్చగొట్టే రీతిలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. రిటైర్డ్ కెప్టెన్ అతుల్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 13న షిమ్లా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 196(1)(బి), 353(2), 356(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

KTR : 420 హామీలపై సమాధానం చెప్పు రాహుల్ గాంధీ : కేటీఆర్తెలంగాణSwechaa14 Nov 2026, 10:25 AM

KTR : 420 హామీలపై సమాధానం చెప్పు రాహుల్ గాంధీ : కేటీఆర్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయహస్తం’లోని హామీల అమలు తీరును ప్రశ్నిస్తూ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా సంచలన పోస్టు పెట్టారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో హైదరాబాద్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలపై ప్రజలు అడుగుతున్న సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.గత ఎన్నికల సమయంలో బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, మూడేళ్లలో రూ.5వేల కోట్ల కంటే తక్కువ నిధులే ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ.. ఒక్క శాతం కూడా రాష్ట్రంలో అమలు చేయలేదని ప్రశ్నించారు. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12 లక్షలు అందిస్తామని, అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా కల్పిస్తామని ఇచ్చిన హామీల అమలు ‘సున్నా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

TG : గిగ్ వర్కర్ల ర్యాలీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలుతెలంగాణSwechaa14 Nov 2026, 10:09 AM

TG : గిగ్ వర్కర్ల ర్యాలీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌ నిత్యం ఉరుకుల పరుగుల జీవనం గడిపే వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీచేశారు.శనివారం గిగ్ వర్కర్ల భారీ బైక్ ర్యాలీ దృష్ట్యా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి నుంచి గిగ్ వర్కర్స్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లకు ఈ పాలసీని అంకితం చేయనున్నారు.ఉదయం 10:30 గంటలకు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి నిర్వహించే బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనన్నారు. ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రధాన రహదారి ఏరియాల్లో ట్రాఫిక్ అధికారులు డైవర్షన్ ఏర్పాటు చేశారు.ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. సైబర్ టవర్స్ నుంచి హెచ్‌ఐసీసీ (HICC), నోవాటెల్ మధ్య రాకపోకలపై ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

తిరుమల వేంకటేశుడి చిత్రానికి రూపమిచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు కన్నుమూత!NationalSwechaa14 Nov 2026, 10:08 AM

తిరుమల వేంకటేశుడి చిత్రానికి రూపమిచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు కన్నుమూత!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఇళ్లలో, పూజా మందిరాల్లో నిత్యం పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దివ్య చిత్రపటానికి తన కుంచెతో జీవం పోసిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో ఉన్న తన స్వగృహంలో గురువారం తుది శ్వాస విడిచారు. శ్రీనివాసన్ మరణవార్త తెలుసుకున్న కళాకారులు, ఆధ్యాత్మిక వేత్తలు, భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.

Anil Ravipudi: నాగార్జునతో సినిమా కష్టమేనా?సినిమాSwechaa14 Nov 2026, 10:05 AM

Anil Ravipudi: నాగార్జునతో సినిమా కష్టమేనా?

Anil Ravipudi: హిట్ మిషన్ అనిల్ రావిపూడి ప్రస్తుతం జనవరి 12 విడుదల సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవల, ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కోసం ప్రధాన తారాగణం అయిన విక్టరీ వెంకటేష్, కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టి కజికిస్తాన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే, అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా కింగ్ నాగార్జునతో ఉండబోతుందని నిన్నామొన్నటి వరకూ వార్తలు రాగా, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

అగ్రరాజ్యాల అరుదైన భేటీ.. ఒకే వేదికపై ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్InternationalSwechaa14 Nov 2026, 09:58 AM

అగ్రరాజ్యాల అరుదైన భేటీ.. ఒకే వేదికపై ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్

అంతర్జాతీయ దౌత్య రాజకీయాల్లో అత్యంత అరుదైన, చారిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రపంచంలోని మూడు అతిపెద్ద అణుశక్తి దేశాలైన అమెరికా, రష్యా, చైనా అధినేతలు తొలిసారిగా ఒకే వేదికపై ముఖాముఖి సమావేశం కాబోతున్నారు. వచ్చే వారం (నవంబర్ 18-19 తేదీల్లో) చైనాలోని ప్రముఖ టెక్ హబ్ షెన్‌జెన్ నగరంలో జరగనున్న 'ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్' (APEC) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ఈ కీలక త్రైపాక్షిక భేటీ జరగనుందని వైట్ హౌస్ అధికారికంగా ధ్రువీకరించింది.

PhoneTappingCase: ట్యాపింగ్ కేసులో ఫ్యూ డేస్.. ఎన్ని కావాలి?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa14 Nov 2026, 09:31 AM

PhoneTappingCase: ట్యాపింగ్ కేసులో ఫ్యూ డేస్.. ఎన్ని కావాలి?

ఏ ప్రభుత్వం ఉన్నా ఫోన్ ట్యాపింగ్‌లు జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ పెరిగిన కొద్ది విచ్చలవిడి ప్రయోగాలు చేస్తుంటారు. ప్రశ్నించే వారిపై కత్తి పెడుతుంటారు. అలానే ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేసి గుప్పిట్లో పెట్టుకుంటారు. ఇదంతా అధికార పార్టీకి నష్టం వాటిళ్లుతుందని తెలియగానే చేస్తారు. అలా బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేసింది. అందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. ఆనాటి పోలీసుల రూపంలో ఉండే దోపిడీ దొంగల వ్యవహారం విచారణలో బయటపడింది. టాస్క్‌ఫోర్స్‌లో రాధాకృష్ణ, కూకట్ పల్లిలో భుజంగరావు, ప్రణిత్ రావు సమాచారంతో ప్రభాకర్ రావు కొడుకు కబ్జాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఫోన్ ట్యాపింగ్‌ను మావోయిస్టుల పేరుతో మిస్ యూజ్ చేసిన వైనం చాలా పెద్దది.

చరిత్రలో ఈ రోజు (14 నవంబర్)InternationalSwechaa14 Nov 2026, 09:19 AM

చరిత్రలో ఈ రోజు (14 నవంబర్)

  • 1889: భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జననం — ఈ రోజును దేశవ్యాప్తంగా 'బాలల దినోత్సవం' (Children's Day) గా జరుపుకుంటారు.

  • 1891: మధుమేహ (డయాబెటిస్) వ్యాధికి ప్రాణరక్షక ఔషధమైన ఇన్సులిన్ కనుగొన్న నోబెల్ గ్రహీత సర్ ఫ్రెడరిక్ బాంటింగ్ జననం — దీని స్మారకార్థం ఈ రోజును 'ప్రపంచ మధుమేహ దినోత్సవం' (World Diabetes Day) గా పాటిస్తారు.

  • 1922: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) యునైటెడ్ కింగ్‌డమ్‌లో తన రోజువారీ రేడియో ప్రసారాలను అధికారికంగా ప్రారంభించింది.

  • 1969: నాసా చంద్రాన్వేషణ కార్యక్రమంలో భాగంగా అపోలో 12 (Apollo 12) వ్యోమనౌకను ప్రయోగించింది — ప్రయోగ సమయంలో రెండుసార్లు పిడుగులు పడినప్పటికీ వ్యోమగాములు సురక్షితంగా చంద్రునిపైకి ప్రయాణించారు.

  • 2008: భారతదేశపు మొట్టమొదటి చంద్రయాన్ మిషన్ 'చంద్రయాన్-1' (Chandrayaan-1) నుండి విడిపోయిన 'మూన్ ఇంపాక్ట్ ప్రోబ్' (MIP) చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద విజయవంతంగా దిగి, భారత జాతీయ పతాకాన్ని అక్కడ నెలకొల్పింది.

నేటి పంచాంగం - 14 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ పంచమి (శ్రీ పంచమిSpiritualitySwechaa14 Nov 2026, 08:45 AM

నేటి పంచాంగం - 14 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ పంచమి (శ్రీ పంచమి

  • తేదీ: 14 నవంబరు 2026, శనివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, శుక్ల పక్షం

  • తిథి: పంచమి (ఉదయం 10:12 వరకు, తదుపరి షష్ఠి)

  • వారం: శనివారం (స్థిరవాసరే)

  • నక్షత్రం: పూర్వాషాఢ (ఉదయం 06:45 వరకు, తదుపరి ఉత్తరాషాఢ)

  • యోగం: శూల (రాత్రి 07:48 వరకు, తదుపరి గండ)

  • కరణం: బాలవ (ఉదయం 10:12 వరకు), తదుపరి కౌలవ (రాత్రి 09:24 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు

  • అమృతకాలం: తెల్లవారుజామున 01:45 - 03:18 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 06:24 - 07:09 వరకు మరియు ఉదయం 07:09 - 07:54 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 04:12 - 05:45 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: ధనుస్సు (మధ్యాహ్నం 12:35 వరకు), తదుపరి మకరం

  • సూర్యోదయం: ఉదయం 06:24

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:36

ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్యం.. అసలు కారణాలేంటి?NationalSwechaa14 Nov 2026, 01:02 AM

ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్యం.. అసలు కారణాలేంటి?

దేశ రాజధాని ఢిల్లీ.. ఇప్పుడు అభివృద్ధికి కాదు, కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. పీల్చే గాలే విషమవుతోంది.. వాహనాల పొగ, పరిశ్రమల కాలుష్యం, పంట మంటలు కలిసి హస్తినను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి!

కరువు కాలంలో కాంగ్రెస్‌ సంబరాలేంటి..? ప్రజల దాహం కంటే భారత్‌ సమ్మిట్‌ ముఖ్యమా?తెలంగాణSwechaa14 Nov 2026, 12:11 AM

కరువు కాలంలో కాంగ్రెస్‌ సంబరాలేంటి..? ప్రజల దాహం కంటే భారత్‌ సమ్మిట్‌ ముఖ్యమా?

తెలంగాణలో నీటి కోసం జనం అల్లాడుతుంటే.. ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. వందల కోట్లతో అంతర్జాతీయ సదస్సులా? ప్రజాధనం ఖర్చు చేస్తున్నారా? పార్టీ నిధులు వినియోగిస్తున్నారా? రేవంత్‌ సర్కార్‌ పై వస్తున్న విమర్శలివి. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది..?

AP: రాప్తాడు నిందితుడి హెల్త్ సీరియస్.. కర్నూల్‌కి షిఫ్ట్ చేసిన డాక్టర్స్!ఏపీSwechaa13 Nov 2026, 10:03 PM

AP: రాప్తాడు నిందితుడి హెల్త్ సీరియస్.. కర్నూల్‌కి షిఫ్ట్ చేసిన డాక్టర్స్!

AP: రాప్తాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో అమానుష దాడికి పాల్పడి సంచలనం సృష్టించిన నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా సీరియస్‌గా మారింది. తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం నుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి డాక్టర్లు షిఫ్ట్ చేశారు.గత 13 రోజులుగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్‌కు 'పల్మనరీ ఎంబాలిజం' (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదకర పరిస్థితి) తలెత్తినట్లు వైద్యులు గుర్తించారు. మూడు రోజుల క్రితమే శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో అతడు ఆసుపత్రి మంచంపై నుంచి కింద పడిపోయిన విషయం తెలిసిందే.

TG: తెలంగాణ మహిళలకు ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్‌.. ఆ బస్సుల్లో డిస్కౌంట్తెలంగాణSwechaa13 Nov 2026, 09:42 PM

TG: తెలంగాణ మహిళలకు ఆర్టీసీ మరో గుడ్‌న్యూస్‌.. ఆ బస్సుల్లో డిస్కౌంట్

TG: ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. తాజాగా మహిళా ప్రయాణికులకు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై ఏసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు భారీ రాయితీ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించిన ఈ కొత్త ఆఫర్ ప్రకారం.. మంత్లీ బస్ పాస్ తీసుకునే మహిళా ప్రయాణికులు కేవలం 15 రోజుల ఛార్జీ చెల్లిస్తే చాలు, నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.

10రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి-మంత్రి ఆదేశంతెలంగాణSwechaa13 Nov 2026, 09:26 PM

10రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి-మంత్రి ఆదేశం

Komatireddy Venkat Reddy: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఎక్కడా జాప్యం జరగకుండా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు. రైతన్నలకు అండగా నిలవడమే మా లక్ష్యం అన్నారు మంత్రి కోమటిరెడ్డి. అలాగే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజన్ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

TG: తమ్మిడి కుంట వద్ద రాహుల్, రేవంత్ మార్నింగ్ వాక్.. రేపు ఉదయం స్పెషల్ షెడ్యూల్!తెలంగాణSwechaa13 Nov 2026, 08:50 PM

TG: తమ్మిడి కుంట వద్ద రాహుల్, రేవంత్ మార్నింగ్ వాక్.. రేపు ఉదయం స్పెషల్ షెడ్యూల్!

TG: లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 'భారత్ సమ్మిట్' ముగింపు వేడుకతో పాటు 'గిగ్ వర్కర్స్ చట్టం' ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆయన పర్యటన ఫిక్స్ అయ్యింది. ఈ బిజీ షెడ్యూల్‌లో భాగంగానే, రేపు (నవంబర్ 14) ఉదయం హైటెక్ సిటీ సమీపంలోని తమ్మిడి కుంట వద్ద సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ మార్నింగ్ వాక్ చేయనుండటం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, సుందరీకరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐటీ కారిడార్‌కు కూతవేటు దూరంలో ఉన్న తమ్మిడి కుంటను సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి సందర్శించనున్నారు.

నిమ్స్ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు- మంత్రి కీలక ఆదేశాలుతెలంగాణSwechaa13 Nov 2026, 08:39 PM

నిమ్స్ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు- మంత్రి కీలక ఆదేశాలు

TIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పలు రకాల సర్జరీల కోసం రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించింది. సర్జరీల వెయిటింగ్ తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిమ్స్‌ ఆసుపత్రిలో ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో సర్జరీలు నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిమ్స్‌లో పెరుగుతున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వసతులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో నిమ్స్‌లోని వివిధ విభాగాల హెచ్‌వోడీలతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

TG: హైదరాబాద్‌లో 'భారత్ సమ్మిట్' వేడి.. రాహుల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్!తెలంగాణSwechaa13 Nov 2026, 07:57 PM

TG: హైదరాబాద్‌లో 'భారత్ సమ్మిట్' వేడి.. రాహుల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్!

TG: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్' హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. 70 దేశాల నుంచి వెయ్యి మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజేసింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాధనంతో కాంగ్రెస్ పార్టీ సొంత ప్రచారం చేసుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తుండగా, మంత్రులు సైతం అంతే ఘాటుగా బదులిస్తున్నారు.

ఇంటర్ రద్దు.. కార్పొరేట్ విద్యా వ్యాపారం కోసమే..తెలంగాణSwechaa13 Nov 2026, 07:24 PM

ఇంటర్ రద్దు.. కార్పొరేట్ విద్యా వ్యాపారం కోసమే..

రేవంత్ సర్కార్ తీసుకున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ రద్దు నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి సంప్రదింపులు, శాసనసభ చర్చ, చట్ట సవరణ లేకుండా కేవలం ఒక సమీక్షా సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేసే నిర్ణయం తెలంగాణ బిడ్డల కోసం కాదని, కార్పొరేట్ విద్యాసంస్థల స్వార్థ ప్రయోజనాల కోసమేనని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. నవంబర్ 11న ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో జరిగిన సమీక్షలో ఇచ్చిన ఆదేశాన్ని తక్షణమే నిలిపివేసి, ఈ అంశాన్ని శాసనసభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

TG: భారత్‌ సమ్మిట్‌పై కేసీఆర్, కిషన్‌రెడ్డికి కోపమెందుకు : సీఎం రేవంత్తెలంగాణSwechaa13 Nov 2026, 06:57 PM

TG: భారత్‌ సమ్మిట్‌పై కేసీఆర్, కిషన్‌రెడ్డికి కోపమెందుకు : సీఎం రేవంత్

TG: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్'పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'కు సన్నాహకంగా నవంబర్ 13, 14 తేదీల్లో 'భారత్ సమ్మిట్' చేపట్టామని వివరించారు.