స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

తెలంగాణలో మరో కొత్త స్కీమ్.. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమాతెలంగాణSwechaa13 Nov 2026, 06:51 PM

తెలంగాణలో మరో కొత్త స్కీమ్.. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా

Indiramma Bheema: ‎రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా సౌకర్యం కల్పించడం ద్వారా దేశంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.‎

ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యం

‎గతంలో రాష్ట్రంలో అమలైన కొన్ని బీమా పథకాలు నిర్దిష్ట శాఖలు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.‎

Assam Bus Accident: ఘోరం.. ట్రక్కు ఢీకొని 23 మంది మృతి.. నుజ్జయిన బస్సు!NationalSwechaa13 Nov 2026, 06:05 PM

Assam Bus Accident: ఘోరం.. ట్రక్కు ఢీకొని 23 మంది మృతి.. నుజ్జయిన బస్సు!

Assam Bus Accident: అస్సాంలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కాజీరంగా నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఓ మినీ బస్సు, భారీ కంటైనర్‌ ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు విద్యార్థులు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.బోకాఖాత్‌ నుంచి నాగావ్‌ వైపు వెళ్తున్న మినీ బస్సు, కాజీరంగా పార్క్‌ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మినీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న చాలామంది లోపలే చిక్కుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రూల్స్ బ్రేక్ చేసి నేషనల్ పార్క్‌ సమీపంలో బస్సును అతి వేగంతో నడపడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతివేగం వల్లే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు.

ఆటో కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..తెలంగాణSwechaa13 Nov 2026, 05:57 PM

ఆటో కార్మికులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్..

Indiramma Illu: పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, అల్పాదాయ వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది. వారి సొంతింటి కల నెరవేర్చడంతో పాటు స్థిరమైన నివాసం కల్పిస్తోంది. ఇంటి అద్దెల భారం తప్పడంతో ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తోంది.

220 కోట్లతో 4 ప్రాంతాల్లో ఆటోనగర్ కాలనీల నిర్మాణం

తాజాగా హైదరాబాద్ నగరంలోని ఆటో కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆటో కార్మికుల సొంతింటి కల సాకారం కానుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటో కార్మికులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల టవర్లు నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. బండ్లగూడ, గంధంగూడ, పేట్ బషీర్‌బాగ్, జల్ పల్లి లక్ష్మీగూడలో హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆటోనగర్ కాలనీలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.220 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

TG: సీఎం అండతో బల్మూరి వెంకట్ భూదందా.. మెతుకు ఆనంద్ ఫైర్!తెలంగాణSwechaa13 Nov 2026, 05:34 PM

TG: సీఎం అండతో బల్మూరి వెంకట్ భూదందా.. మెతుకు ఆనంద్ ఫైర్!

TG: సీఎం రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయనే ధీమాతోనే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వికారాబాద్ జిల్లాలో భూకబ్జాలకు పాల్పడుతూ సామాన్యులను వేధిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కబ్జాకు గురైనట్లు చెబుతున్న భూమిని స్వయంగా పరిశీలించిన ఆయన, బాధిత రైతు మహ్మద్ అజ్మత్ పాషాను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నేతలు కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా దౌర్జన్యానికి దిగుతున్నారని ఆనంద్ మండిపడ్డారు.వికారాబాద్ జిల్లాలోని సర్వే నంబర్ 277లో మహ్మద్ అజ్మత్ పాషా 25 ఏళ్ల క్రితం ఐదున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే, ఆ పొలం పక్కనే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సుమారు 10 ఎకరాల భూమిలో ప్లాటింగ్ డెవలప్‌మెంట్ చేపడుతున్నారని, ఆ వెంచర్‌కు దారి వేసుకోవడం కోసం తన భూమిని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అజ్మత్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.

Nuclear Bomb in Space: ఆకాశంలో ఆ ఒక్క బాంబు పేలితే.. ప్రపంచం కుప్పకూలిపోతుందా!InternationalSwechaa13 Nov 2026, 05:31 PM

Nuclear Bomb in Space: ఆకాశంలో ఆ ఒక్క బాంబు పేలితే.. ప్రపంచం కుప్పకూలిపోతుందా!

Nuclear Bomb in Space: భూమి మీద యుద్ధాలు జరగాల్సిన పనిలేదు.. నగరాలపై క్షిపణులు పడాల్సిన అవసరమూ లేదు. మన కంటికి కనిపించని అంతరిక్షంలో ఒక్క అణుబాంబు పేలితే చాలు, భూమి మీద ఉన్న మొత్తం ప్రపంచమే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మొబైల్ ఫోన్లు మూగబోతాయి, ఇంటర్నెట్ కట్ అవుతుంది, జీపీఎస్ నావిగేషన్ ఆగిపోతుంది, వాతావరణ హెచ్చరికలు అందవు.. ఇలా మనిషి రోజువారీ జీవితం మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తున్నా, అమెరికా శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలో తేలిన భయంకరమైన నిజం ఇది.ప్రస్తుతం భూమికి దగ్గరగా ఉన్న కక్ష్యలో 13,000కు పైగా ఉపగ్రహాలు నిరంతరం తిరుగుతున్నాయి. మనం వాడే కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇంటర్నెట్, బ్యాంకింగ్, నావిగేషన్ ఇలా ప్రతిదీ వీటిపైనే ఆధారపడి నడుస్తోంది. అయితే, విస్కాన్సిన్-మాడిసన్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ పరిశోధకులు కంప్యూటర్ సిములేషన్ ద్వారా చేసిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

చాటుమాటున సజ్జనార్ ఆగడాలు ఎన్నో?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa13 Nov 2026, 04:43 PM

చాటుమాటున సజ్జనార్ ఆగడాలు ఎన్నో?

‘‘సత్యాలే వార్తలు’’. ఇది స్వేచ్ఛ న్యూస్ ట్యాగ్ లైన్. ఇప్పటికే ఎన్నో స్కాంలను బయట పెట్టినా ఉప్పులా అందరికీ చేయి అందించిన చరిత్రే తప్ప ఏనాడూ తప్పు చేయలేదు. మంచి పోలీస్, రెవెన్యూ వ్యవస్థ కోసం ఎన్ని పాట్లైనా పడేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిత్వం నాది. అలాంటిది ఓ నిజాయితీ ఆఫీసర్‌గా సోషల్ మీడియాలో పేరుండి, తెర వెనుక అవినీతికి పాల్పడితే ఎలా ఊపేక్షిస్తాను. మీ అవసరాల కోసం చేసుకోండి అస్సలు పట్టించుకోం. కానీ, మీ అసలు రూపం మరో వంద మంది ముందు చూపిస్తే ఒక్కరు నాలాంటి వాళ్లకు చేరవేసినా, మీలాంటి ఉన్నతాధికారులపై అంటే సీఎస్, డీజీలతో పాటు అందరిపై మా లాంటి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఒక వార్త రాయాలనే తపన ఉంటుంది. అందుకే మీకు వ్యక్తిగా సవాల్ విసురుతున్నా. వ్యవస్థగా చాలా ఆధారాలు ఉన్నాయి.

Bollywood: హిందీలో మన డైరెక్టర్స్ సక్సెస్ అయ్యేనా? కష్టమే!సినిమాSwechaa13 Nov 2026, 04:13 PM

Bollywood: హిందీలో మన డైరెక్టర్స్ సక్సెస్ అయ్యేనా? కష్టమే!

Bollywood: మన టాలీవుడ్ హీరోలు, దర్శకులు హిందీలో సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. గతంలో క్రిష్ హిందీ సీమలో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి మణికర్ణిక చిత్రాన్ని చేశాడు. ఈ సినిమా సమయంలో కంగనాతో ఆయనకి విబేధాలు వచ్చాయి. సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో మళ్ళీ, ఇప్పటి వరకూ క్రిష్ హిందీలో అడుగుపెట్టలేదు. వి.వి.వినాయక్ కూడా అంతే. ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన వినయ్ సక్సెస్ కాలేకపోయాడు.

NTR-TRIVIKRAM: అవన్నీ సెన్స్ లెస్ రూమర్స్..సినిమాSwechaa13 Nov 2026, 03:51 PM

NTR-TRIVIKRAM: అవన్నీ సెన్స్ లెస్ రూమర్స్..

NTR-TRIVIKRAM: ఇటీవల ఇటు సినీ వర్గాలలో, నందమూరి అభిమానుల్లో, సోషల్ మీడియాలో ఒకే వార్త చక్కర్లు కొట్టి బాగా వైరల్ అయింది. అదేమిటంటే.. త్రివిక్రమ్, హారికా హాసిని బ్యానర్ నుంచి దూరం అయినట్టుగా, వీరి కాంబినేషన్‌లో ఎన్టీఆర్ హీరోగా రూపొందాల్సిన 'గాడ్ ఆఫ్ వార్' ఆగిపోయిందని. కానీ, తాజాగా హారిక అండ్ హాసిని వారు ఇవన్నీ సెన్స్ లెస్ న్యూస్ అంటూ కొట్టి పారేశారు. ఈ కాంబోకి ఎలాంటి డ్యామేజ్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది.

తగ్గిన భారత్ ఆధిక్యం.. సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ!క్రీడలుSwechaa13 Nov 2026, 03:42 PM

తగ్గిన భారత్ ఆధిక్యం.. సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎవరికీ తలవంచని రికార్డులను సృష్టించినప్పటికీ, తాజాగా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో బరిలోకి దిగిన కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొన్నప్పటికీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ డకౌట్ల సంఖ్య 20కి చేరగా, దీని ద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న అవాంఛిత రికార్డును ఆయన సమం చేశారు.

Konda Surekha: ఒకప్పటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫుల్ సైలెంట్.. కొండా సురేఖ మౌనం వెనుక అర్థమేంటి?తెలంగాణSwechaa13 Nov 2026, 03:37 PM

Konda Surekha: ఒకప్పటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫుల్ సైలెంట్.. కొండా సురేఖ మౌనం వెనుక అర్థమేంటి?

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌గా, ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నాయకురాలిగా కొండా సురేఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మంత్రి పదవి పోయినప్పటి నుంచి మాజీ మంత్రి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ పూర్తిగా సైలెంట్ అయిపోయారని, ఎక్కడా బహిరంగంగా కనిపించడం లేదని స్థానికంగా వినిపిస్తోంది. ఒకప్పుడు నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉండే కొండా ఫ్యామిలీ ఇప్పుడు ఇంతలా మౌనం వహించడం వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.

Tollywood: కాజల్ కెరీర్ ఖతమవ్వకుండా ఉండాలంటే!సినిమాSwechaa13 Nov 2026, 03:22 PM

Tollywood: కాజల్ కెరీర్ ఖతమవ్వకుండా ఉండాలంటే!

Tollywood: ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలిగిన కాజల్ అగర్వాల్ కెరీర్ గ్యారెంటీగా డేంజర్ జోన్‌లో ఉందని చెప్పక తప్పదు. చందమామ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కాజల్, మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్‌గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఒకదశలో డేట్స్ సర్దుబాటు కాక చాలా సినిమాలను వదులుకున్న పరిస్థితి. హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న రోజులున్నాయి. స్పెషల్ నంబర్ చేసినా భారీ రెమ్యునరేషన్. అలాంటి, కాజల్ కెరీర్ ఇప్పుడు ఉసూరుమంటోంది.

మహిళా భద్రత, డయల్ 100 వ్యవస్థ మెరుగుపై ప్రత్యేక దృష్టి: నూతన సీపీ మహేశ్ భగవత్!తెలంగాణSwechaa13 Nov 2026, 03:19 PM

మహిళా భద్రత, డయల్ 100 వ్యవస్థ మెరుగుపై ప్రత్యేక దృష్టి: నూతన సీపీ మహేశ్ భగవత్!

హైదరాబాద్‌ నగర కొత్త పోలీస్‌ కమిషనర్‌గా (కొత్వాల్‌) నిష్ణాతులైన సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్ బాధ్యతలు చేపట్టారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన మహేశ్‌ భగవత్‌కు నగర పోలీసింగ్‌పై అపారమైన అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఇప్పుడు భాగ్యనగర పోలీస్ బాస్‌గా బాధ్యతలు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే అత్యవసర సేవలందించే 'డయల్ 100' రెస్పాన్స్ వ్యవస్థను మరింత వేగవంతం చేసి మెరుగుపరుస్తామని తెలిపారు.

బీర్ల ఐలయ్య ఒక జోకర్, బ్రోకర్ :  మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్తెలంగాణSwechaa13 Nov 2026, 03:02 PM

బీర్ల ఐలయ్య ఒక జోకర్, బ్రోకర్ : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఒక జోకర్, బ్రోకర్ అని తుంగతుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీర్ల ఐలయ్య మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. డిఫెండర్ కారు కొన్నానని గతంలో బీర్ల ఐలయ్య దావత్ ఇచ్చాడని, కారుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే తన కొడుకు కొనిచ్చాడని చెప్పాడని గుర్తుచేశారు. ‘స్కూలుకు వెళ్లే నీ కొడుకు కారు ఎలా కొనిచ్చాడు? 15 నుంచి 20 వేల ఎకరాల సీలింగ్ భూములను బ్రోకరిజం చేసి స్పెక్ట్రా అనే సంస్థకు కట్టబెట్టి అడ్డగోలుగా దోచుకున్నావ్’ అని ఆరోపించారు.‘ఆ సంస్థ దగ్గర ప్లాట్లు కొన్నవాళ్లందరూ ఇప్పుడు మోసపోయారని, ఇలాంటి జోకర్,బ్రోకర్‌‌వి నువ్వు కూడా కేటీఆర్ గురించి మాట్లాడతావా?’అంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఫైర్ అయ్యారు. ఓడిపోతానని భయంతోనే రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో సభలు పెట్టాడని, గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి లాగా అవ్వరని అంటున్నారని.. నిజమే కేటీఆర్ ఎన్నటికీ రేవంత్ రెడ్డి లాగా లంగ, దొంగ కాడని విమర్శించారు.

Dulquer Salmaan: అందరిలా ఆలోచిస్తే అతను దుల్కర్ ఎందుకవుతాడు!సినిమాSwechaa13 Nov 2026, 02:54 PM

Dulquer Salmaan: అందరిలా ఆలోచిస్తే అతను దుల్కర్ ఎందుకవుతాడు!

Dulquer Salmaan: సాధారణంగా హీరో అనగానే మాస్ అండ్ యాక్షన్ సినిమాలనే ఎంచుకుంటుంటారు. ముఖ్యంగా, మన తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీలు ఫ్యాన్ బేస్డ్ కావడం దీనికి, ప్రధాన కారణం. అయితే, ఎప్పుడు అభిమానులు ఒకే తరహా కథలను చేస్తుంటే ఒప్పుకోవడం లేదు. భిన్నమైన కథలతో వచ్చే సినిమాలంటేనే ఎక్కువగా ఆదరణ చూపిస్తున్నారు. కానీ, మన హీరోలు మాత్రం..అరిగిపోయిన జానర్ కథల చుట్టూనే తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి పూర్తి భిన్నంగా ఉన్నాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.

Telangana Politics :పాలమూరు ప్రాజెక్టులో పొలిటికల్ వరద..తెలంగాణSwechaa13 Nov 2026, 02:50 PM

Telangana Politics :పాలమూరు ప్రాజెక్టులో పొలిటికల్ వరద..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'పాలమూరు-రంగారెడ్డి' ఎత్తిపోతుల పథకం చుట్టే పొలిటికల్ హీట్ నడుస్తోంది. ప్రాజెక్టు కాలువల్లో సాగునీరు పారకముందే, అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు, సవాళ్ల వరద ఉధృతంగా పారుతోంది. రాష్ట్ర స్థాయి మొదలు జిల్లా స్థాయి వరకు బహిరంగ సభలు, ప్రెస్ మీట్లు ఇలా ఏ చిన్న అవకాశం దొరికినా ఇరు పార్టీల నేతలు ఈ ప్రాజెక్టునే రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. "మేము 90 శాతం పనులు పూర్తి చేశాం.. మిగిలినవి మీరు ఎందుకు ఆపేశారు?" అంటూ గులాబీ నేతలు ప్రశ్నిస్తుంటే, "పైపై పనులు చేసి కమిషన్లు నొక్కేశారు.. అసలు కాలువల నిర్మాణం, భూసేకరణ ఏది?" అంటూ హస్తం నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

ఎస్‌బీఐ స్టాఫ్ చేతివాటం? బ్యాంక్ లాకర్‌లో బంగారం మాయం?తెలంగాణSwechaa13 Nov 2026, 02:46 PM

ఎస్‌బీఐ స్టాఫ్ చేతివాటం? బ్యాంక్ లాకర్‌లో బంగారం మాయం?

ఆలేరు‌లోని ఓ ఎస్‌బీఐ బ్యాంకు బ్రాంచ్ ఆఫీసులోని లాకర్‌లో బంగారు నగలు మాయం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 తులాలు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో బంగారం పొగొట్టుకున్న వారు వృద్ధదంపతులు. నగలు డిపాజిట్ చేశాక చాలా కాలం తర్వాత రెండు సార్లు మాత్రమే బ్యాంకు వెళ్లి నగలు చూసుకున్నామని చెబుతున్నారు. కానీ, బ్రాంచ్ ఆఫీసులో నగలు మాయం కావడం.. రికార్డులు సరిగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆలేరు మండలం గుండ్లగూడెంకు చెందిన అంగిరేకుల కృష్ణమూర్తి, లక్ష్మీబాయి దంపతులు 2013లో లాకర్ (నం.ఎ1/12/ ఎస్‌బీఐ-ఆలేరు) సౌకర్యం పొందారు. 22.5.2013వ తేదీన 18 తులాల బంగారు నగలు లాకర్‌లో భద్రపరించారు. అనంతరం 24.12.2018న లాకర్‌ను తెరిచినట్లు బ్యాంకు రికార్డుల్లో నమోదు అయి ఉంది.

శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు, పూర్తి షెడ్యూల్ ఇదే!NationalSwechaa13 Nov 2026, 02:42 PM

శబరిమలకు 54 ప్రత్యేక రైళ్లు, పూర్తి షెడ్యూల్ ఇదే!

 మండల, మకరవిళక్కు పూజల నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. నవంబర్ 15, 2026 నుంచి జనవరి 19, 2027 వరకు హైదరాబాద్, చర్లపల్లి, నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొళ్లం మధ్య వివిధ మార్గాల్లో మొత్తం 54ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో (CPRO) ఎ.శ్రీధర్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిర్ణయంతో అయ్యప్ప మాలధారులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి.

Sai Pallavi: సాయి పల్లవి కాళ్ళు మొక్కిన డైలాగ్ కోచ్..!సినిమాSwechaa13 Nov 2026, 02:29 PM

Sai Pallavi: సాయి పల్లవి కాళ్ళు మొక్కిన డైలాగ్ కోచ్..!

Sai Pallavi: హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ చేసే కొన్ని పాత్రలకి ప్రేక్షకులు, అభిమానులు..చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. కొన్ని వేశాధారణలలో నటీనటులను చూసినప్పుడు కాళ్ళకి నమస్కరించాలనే తన్మయత్వం కలుగుతుంది. అలాంటి, తన్మయత్వంలో సాయి పల్లవి కాళ్ళకి నమస్కరించింది ఓ డైలాగ్ కోచ్. అది, రామాయణ సినిమా షూటింగ్ అమయంలో. అప్పుడు సాయి పల్లవి సీత గెటప్‌లో ఉంది.

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం.. 15మందికి అర్జున అవార్డులు!క్రీడలుSwechaa13 Nov 2026, 02:27 PM

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం.. 15మందికి అర్జున అవార్డులు!

భారత క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తి పతాకను ఎగురవేసిన క్రీడాకారులు, అత్యుత్తమ శిక్షణ అందించిన గురువులకు కేంద్ర ప్రభుత్వం అందించే 'జాతీయ క్రీడా పురస్కారాలు-2025' ప్రదానోత్సవం శుక్రవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో డెకాథ్లాన్ స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేత దివ్య దేశ్‌ముఖ్‌తో పాటు మొత్తం 15మంది క్రీడారత్నాలు ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులను స్వీకరించారు.

తెలంగాణలో చలి పంజా.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. వాతావరణ శాఖ హెచ్చరిక!తెలంగాణSwechaa13 Nov 2026, 01:56 PM

తెలంగాణలో చలి పంజా.. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.. వాతావరణ శాఖ హెచ్చరిక!

రాష్ట్రంలో శీతాకాలం ప్రభావం తీవ్రతరం అవుతోంది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చల్లని పొడి గాలుల ప్రభావంతో చలి తీవ్రత మరింత పెరగనుందని, ఈ సమయంలో రాష్ట్రంలో ప్రధానంగా పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారుకు ఘోరప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!తెలంగాణSwechaa13 Nov 2026, 01:45 PM

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారుకు ఘోరప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!

తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పెను ప్రమాదం తప్పింది. ఆయన చేపట్టిన పాదయాత్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా అనాజీపురం చౌరస్తా వద్ద పాదయాత్ర తిరుమలగిరి వైపు కొనసాగుతుండగా ప్రమాదవశాత్తు మల్లన్న కారును లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అనంతరం మల్లన్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టినట్టు సమాచారం. అయితే, మరో కారులో తిరుమలగిరికి చెందిన భార్యాభర్తలు మేడబోయిన సాయినాథ్‌, చందన ఉన్నారు. ప్రమాదంలో దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.అయితే, వారి రెండేళ్ల కుమారుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో మల్లన్న కారులో లేరని తెలుస్తోంది. అయితే, మల్లన్న వాహనంలో ఉన్న డ్రైవర్ బన్నీ, ఆయన సన్నిహితుడు రంగన్నలకు తీవ్ర గాయాలవ్వగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

లంచావతారులకు మళ్లీ కీలక పోస్టింగులా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa13 Nov 2026, 01:21 PM

లంచావతారులకు మళ్లీ కీలక పోస్టింగులా?

ప్రజలకు రక్షణ కల్పించి, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ శాఖలోనే కొందరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కినా ప్రభుత్వం ఇంకా వారిలో పట్టం కడుతూ పదోన్నతులు కల్పిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదవడం వంటి ఘటనలు పోలీస్ శాఖ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. గత మూడేళ్లుగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పోలీస్ అధికారులపై పెద్ద ఎత్తున ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల అనంతరం సంబంధిత అధికారులపై తీసుకున్న శాఖాపరమైన చర్యలేమిటి? వారు ప్రస్తుతం ఏ స్థానాల్లో పనిచేస్తున్నారు? తిరిగి కీలకమైన ఫోకల్ పోస్టుల్లోనే బాధ్యతలు అప్పగించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు అధికార, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి

యూనిఫాంలో ఉన్న క్రిమినల్.. సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ సంచలన పోస్టు!తెలంగాణSwechaa13 Nov 2026, 01:05 PM

యూనిఫాంలో ఉన్న క్రిమినల్.. సజ్జనార్‌పై మాజీ ఐపీఎస్ సంచలన పోస్టు!

హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ బదిలీ నేపథ్యంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వర రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఒక విశ్రాంత ఐపీఎస్.. ప్రస్తుతం విధుల్లోనే ఉన్న మరో ఐపీఎస్ మీద నేరపూరిత ఆరోపణలు చేయడం పోలీసు వర్గాల్లోనే హాట్ టాపిక్ అయ్యింది. విశ్రాంత ఐపీఎస్ నాగేశ్వర్ రావు స్పందిస్తూ.. 'యూనిఫాంలో ఉన్న నేరస్థుడు' సజ్జనార్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీపీ పోస్టు నుంచి ఆయనను బదిలీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గతంలో తనతో కలిసి పనిచేసిన ఒక సహోద్యోగిని ఇలా విమర్శించడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ సర్వీస్ స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అందుకే నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సి వచ్చిందని వివరించారు.

ఒవైసీ ఎంట్రీ.. బీజేపీకి బూస్టింగ్! యూపీలో కొత్త రాజకీయ గేమ్NationalSwechaa13 Nov 2026, 12:52 PM

ఒవైసీ ఎంట్రీ.. బీజేపీకి బూస్టింగ్! యూపీలో కొత్త రాజకీయ గేమ్

యూపీ రాజకీయాల్లో ఒవైసీ ఎంట్రీ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఎస్పీ బలపడుతున్న సమయంలో కొత్త కూటమితో బరిలోకి దిగుతున్న ఒవైసీ.. బీజేపీకి షాక్ ఇస్తారా? లేక పరోక్షంగా కమలదళానికే మేలు చేస్తారా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కూకట్‌పల్లి ట్రక్ పార్కుల భూముల వేలం.. బిడ్డా మీ సంగతి చూస్తా! : హరీశ్ రావుతెలంగాణSwechaa13 Nov 2026, 12:32 PM

కూకట్‌పల్లి ట్రక్ పార్కుల భూముల వేలం.. బిడ్డా మీ సంగతి చూస్తా! : హరీశ్ రావు

కూకట్‌పల్లి ట్రక్ పార్కుల భూములు వేలం వేయాలన్న తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి భూముల చుట్టే తిరుగుతున్నాడని, సీఎం కుర్చీలో కూర్చుని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడని ఆరోపించారు. నాడు బొందల గడ్డకు జాగా ఉండదని డైలాగులు కొట్టిన ముఖ్యమంత్రి.. నేడు కైతలాపూర్‌లో బొందల గడ్డను కూడా చదును చేస్తున్నారని మండిపడ్డారు.కూకట్‌పల్లి మూసాపేట ట్రక్ పార్క్ భూముల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నర్సరీని కూడా అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. ‘బిడ్డా జాగ్రత్త.. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వేలంలో ఎవరు భూములు కొన్నా అనుమతులు ఇవ్వం. మళ్లీ వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకే వాడుతాం’ అని హరీశ్ రావు హెచ్చరించారు.

Bollywood: కియారాకి ఇంటిమేట్ సీన్స్ అంటే అంతిష్టమా!సినిమాSwechaa13 Nov 2026, 12:11 PM

Bollywood: కియారాకి ఇంటిమేట్ సీన్స్ అంటే అంతిష్టమా!

Bollywood: కియారా అద్వానికి ఇంటిమేట్ సీన్స్ అంటే బాగా ఇష్టమని అర్థమవుతోంది. అంటే, ఆ తరహా సన్నివేశాలలో నటన పరంగా నిరూపించుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి కియారా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుందని తెలుస్తోంది. పైగా, తన భర్త సిద్ధార్థ్ మల్‌హోత్రా వీటి గురించి అసలు అడగడు..పట్టించుకోడు అంటోంది.

TG : పిల్లలు పుట్టాక కళ్యాణలక్ష్మికి మోక్షం.. వీడియో వైరల్!తెలంగాణSwechaa13 Nov 2026, 12:04 PM

TG : పిల్లలు పుట్టాక కళ్యాణలక్ష్మికి మోక్షం.. వీడియో వైరల్!

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సాయంగా గత ప్రభుత్వం అందజేసిన కళ్యాణలక్ష్మి చెక్కులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం లేదని తెలుస్తోంది. దీంతో కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్లుగా ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడిపిల్ల పెళ్లయిన నెల రోజులలోపు కళ్యాణలక్ష్మి సాయం అందించేవారు.అది ఆడపిల్ల తండ్రికి భరోసాగా నిలిచేది. ప్రస్తుతం నెలల తరబడి ఎదురుచూసినా చెక్కులు ఇవ్వడం లేదు. ఇదేంటని అడిగితే నిధులు లేవని, అందుకే ఆలస్యం అవుతోందని స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి పెళ్లయిన తర్వాత అందాల్సిన కళ్యాణలక్ష్మి చెక్కును ఓ మహిళ తనకు పాప పుట్టాక అందుకున్నది. జగిత్యాలలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పెళ్లయి పాప పుట్టిన మహిళకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ చెక్కు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tollywood: ఆ ఆటిట్యూడ్ మారకపోతే సిద్ధుకి హిట్ కష్టమా?సినిమాSwechaa13 Nov 2026, 11:48 AM

Tollywood: ఆ ఆటిట్యూడ్ మారకపోతే సిద్ధుకి హిట్ కష్టమా?

Tollywood: మన హీరోలు ఒక్కొక్కరు ఒక్కో మ్యానరిజంతో ఆకట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. సినిమాకో ఆటిట్యూడ్ చూపిస్తే జనాలకి కూడా కొత్తగా ఉంటుంది. ప్రతీ సినిమాలో ఒకే తరహా బాడీ లాంగ్వేజ్..మేకోవర్..డైలాగ్ మాడ్యులేషన్ అంటే బోర్ కొట్టేస్తుంది. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డకి కూడా ఇదే సమస్య వచ్చి ఫ్లాపులు పడ్డాయి. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి. కానీ, ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి.

ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ రాహుల్ గాంధీ? : కేటీఆర్తెలంగాణSwechaa13 Nov 2026, 11:36 AM

ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ రాహుల్ గాంధీ? : కేటీఆర్

రాహుల్ గాంధీ హైదరాబాద్ రానున్నారని తెలియడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాహుల్ గాంధీ పర్యటనపై ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఏ మొహం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నావ్ రాహుల్ గాంధీ?’ అంటూ ప్రశ్నించారు. ‘ఉద్యోగాల కోసం పోరాడిన విద్యార్థులపై లాఠీచార్జి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు? లగచర్ల గిరిజన మహిళలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? హైడ్రా కూల్చివేతలతో పేదల ఇళ్లు కూలినప్పుడు మీ స్పందన ఏది? కంచ గచ్చిబౌలిలో వేలాది చెట్ల నరికివేతపై ఎందుకు మౌనంగా ఉన్నారు?రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ఎందుకు స్పందించలేదు? జర్నలిస్టుల అరెస్టులు, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఎందుకు నోరు మెదపలేదు? ప్రజా సమస్యలపై ప్రశ్నించని రాహుల్.. ఇప్పుడు రూ.100 కోట్ల ప్రజాధనంతో సభలు, ప్రచార ఆర్భాటాలకా వస్తున్నది? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ నిలదీశారు.

తెలంగాణ సర్కార్ తీపి కబురు.. కేవలం రూ.3.50లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్!తెలంగాణSwechaa13 Nov 2026, 11:32 AM

తెలంగాణ సర్కార్ తీపి కబురు.. కేవలం రూ.3.50లక్షలకే ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్!

 తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ ప్రాంత అల్పాదాయ వర్గాల (LIG) సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) వెలుపల ఉన్న ఐదు ప్రధాన నగరపాలక సంస్థల పరిధిలో 'ఇందిరమ్మ ఇళ్ల టవర్స్' పథకం కింద మొదటి విడతలో 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బృహత్తర పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల భారీ సబ్సిడీని అందించడంతో పాటు స్థలాన్ని ఉచితంగా సమకూరుస్తోంది. దీంతో లబ్ధిదారుడి వాటాగా కేవలం రూ.3.50లక్షలు మాత్రమే చెల్లిస్తే సొంత ఫ్లాట్ సొంతమయ్యే సువర్ణావకాశం లభించింది.