స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Tollywood: విశ్వంభర ప్రమోషనల్ ప్లాన్స్ ఇవేనా?సినిమాSwechaa13 Nov 2026, 11:21 AM

Tollywood: విశ్వంభర ప్రమోషనల్ ప్లాన్స్ ఇవేనా?

Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి మొత్తానికి తాజాగా కమెడియన్ ప్రవీన్ పంచుకున్న అప్‌డేట్‌తో మెగా అభిమానుల్లోనే కాదు, సినీ వర్గాలలోనూ ఈ ప్రాజెక్ట్ పక్కన పడలేదని క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో, తాజా సమాచారం మేరకు మెగాస్టార్ విశ్వంభర చిత్రాన్ని 2027 జనవరి 26న ప్రపచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సైలెంట్‌గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Tollywood: వారణాసి తర్వాత మహాభారతం ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!సినిమాSwechaa13 Nov 2026, 10:56 AM

Tollywood: వారణాసి తర్వాత మహాభారతం ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!

Tollywood: మన టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. దాదాపు 1400కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకి ఇప్పుడు బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న.

హైదరాబాద్‌లో రేపు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ.. రాహుల్ గాంధీ రాక!తెలంగాణSwechaa13 Nov 2026, 10:50 AM

హైదరాబాద్‌లో రేపు గిగ్ వర్కర్ల మహా ర్యాలీ.. రాహుల్ గాంధీ రాక!

 తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆరు లక్షల మందికి పైగా గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సామాజిక భద్రత, కార్మిక హక్కుల సాధనే లక్ష్యంగా హైదరాబాద్‌లో శనివారం (నవంబర్ 14) భారీ ర్యాలీ నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మహా ప్రదర్శనకు 'తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్' (TGPWU) పిలుపునిచ్చింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.

Tollywood: నిర్మాతగా నందమూరి తేజస్విని..బాలయ్య ప్లాన్ అదుర్స్ కదా!సినిమాSwechaa13 Nov 2026, 10:49 AM

Tollywood: నిర్మాతగా నందమూరి తేజస్విని..బాలయ్య ప్లాన్ అదుర్స్ కదా!

Tollywood: నిర్మాతగా నందమూరి తేజస్విని..బాలయ్య ప్లాన్ అదుర్స్ కదా! అంటూ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు మాట్లాడుకుంటున్నారట. ఇప్పటి వరకూ బాలయ్య వారసులు ఎవరూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. బాలయ్య నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గత నాలుగైదేళ్ళుగా టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ, చాలా ఆలస్యంగా మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది.

రైతు సదస్సుల నుంచి పాదయాత్ర దాకా.. కేటీఆర్ ప్లాన్ ఇదేనా?తెలంగాణSwechaa13 Nov 2026, 10:17 AM

రైతు సదస్సుల నుంచి పాదయాత్ర దాకా.. కేటీఆర్ ప్లాన్ ఇదేనా?

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ పాదయాత్రల చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటివరకు అసెంబ్లీ సమావేశాలు, ధర్నాలు, నిరసనలకే పరిమితమైన పార్టీ ఇక నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

అమెరికా రియల్‌ఎస్టేట్ రంగంలో విచిత్ర పరిస్థితులు!InternationalSwechaa13 Nov 2026, 10:14 AM

అమెరికా రియల్‌ఎస్టేట్ రంగంలో విచిత్ర పరిస్థితులు!

అమెరికాలో గృహ విక్రయ రంగంలో ఎన్నడూలేని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. మార్ట్‌గేజ్ (గృహ రుణ) వడ్డీ రేట్లు రికార్డు స్థాయిలో ఎగబాకడంతో దేశవ్యాప్తంగా పాత ఇళ్ల అమ్మకాలు గత 16ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అయితే ఒకవైపు విక్రయాలు దారుణంగా క్షీణిస్తున్నప్పటికీ, మరోవైపు ఇళ్ల ధరలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా పైపైకే దూసుకుపోతుండటం ఆర్థిక నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (NAR) గురువారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, అక్టోబర్ మాసంలో పాత ఇళ్ల అమ్మకాలు సెప్టెంబర్‌తో పోలిస్తే 5.5శాతం తగ్గి వార్షిక ప్రాతిపదికన 3.75 మిలియన్ యూనిట్లకు పరిమితమయ్యాయి.

ఒకే రోజు ముగ్గురు రైతుల బలవన్మరణంతెలంగాణSwechaa13 Nov 2026, 10:10 AM

ఒకే రోజు ముగ్గురు రైతుల బలవన్మరణం

తెలంగాణలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఎల్ నినో కారణంగా వర్షాలు లేక సాగు దిగుబడి రాక అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరి వేసిన రైతులు అయితే సాగుకు నీళ్లు అందించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తెలంగాణ సర్కార్ ముందే చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం ఉన్నది. కోత దశకు వచ్చిన పంట ఎండిపోయే స్థితిలో దర్శనమిస్తుండటంతో ఎలాగైనా కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి పొలాలు తడుపుతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పెట్టుబడి భారం కావడం, పాత అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, పంట చేతికి వచ్చినా గిట్టుబాటు ధర రాక, మధ్యలో దళారుల దోపిడీ వంటి అంశాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఈ క్రమంలోనే అప్పుల భారం భరించలేక, పంట దిగుబడి రాలేదని ఆవేదనతో రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఘటన తీవ్రవిషాదం నింపింది.

నెలలో ఖాళీ కానున్న హైదరాబాద్ నీళ్లు.. సర్కార్ వద్ద ప్లాన్ బి ఉందా?తెలంగాణSwechaa13 Nov 2026, 09:49 AM

నెలలో ఖాళీ కానున్న హైదరాబాద్ నీళ్లు.. సర్కార్ వద్ద ప్లాన్ బి ఉందా?

రాష్ట్రంలో వేసవి రాకముందే నీటి ఎద్దడి మొదలైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నీటి కొరతతో గ్రామాల్లోని ప్రజలు అల్లాడుతున్నట్టు సమాచారం. మరోవైపు పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లోనే కాదు గ్రామాలు, పల్లెల్లో కూడా నీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.దీనంతటికి ఎల్ నినో ప్రభావమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.ఇదిలాఉండగా, హైదరాబాద్‌లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. సమ్మర్ ఎఫెక్ట్ ఇప్పుడే తెలుస్తోంది. శీతాకాలంలో వేసవి మాదిరిగా ఎండలు దంచికొడుతుండటంతో జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. తాజాగా రిపోర్టుల ప్రకారం హైదరాబాద్‌లోని ప్రాజెక్టుల్లో డిసెంబర్ వరకే నీరు ఉందని తెలుస్తోంది.

Today in History November 13: చరిత్రలో ఈరోజుInternationalSwechaa13 Nov 2026, 09:09 AM

Today in History November 13: చరిత్రలో ఈరోజు

  • 1927: ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి అడుగున వాహన సొరంగ మార్గం 'హాలండ్ టన్నెల్' (Holland Tunnel) న్యూయార్క్ మరియు న్యూజెర్సీ మధ్య ప్రారంభమైంది.

  • 1967: ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి, మాజీ మిస్ ఇండియా జూహీ చావ్లా జననం.

  • 1985: కొలంబియాలో 'నెవాడో డెల్ రూయిజ్' అగ్నిపర్వతం బద్దలై, భారీ బురద ప్రవాహంతో (Armero tragedy) సుమారు 23,000 మంది ప్రాణాలు కోల్పోయారు

  • 1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మిత్రరాజ్యాల దళాలు ఒట్టోమన్ సామ్రాజ్య రాజధాని కాన్‌స్టాంటినోపుల్ (ఇస్తాంబుల్)ను ఆక్రమించాయి.

  • 1970: తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) తీరంలో చరిత్రలోనే అత్యంత భీకరమైన 'భోలా తుఫాను' (Bhola Cyclone) విరుచుకుపడి లక్షలాది మంది మరణానికి కారణమైంది.

  • 1994: యూరోపియన్ యూనియన్ (EU)లో చేరడానికి స్వీడన్ ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ (Referendum) ద్వారా ఆమోదం తెలిపారు.

  • 1971: నాసా పంపిన 'మారినర్ 9' (Mariner 9) వ్యోమనౌక అంగారక గ్రహ (Mars) కక్ష్యలోకి ప్రవేశించి, మరో గ్రహం చుట్టూ తిరిగిన మొదటి అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టించింది.

  • 1780 (జననం): మహారాజా రంజిత్ సింగ్ — సిక్కు సామ్రాజ్య స్థాపకుడు, 'షేర్-ఎ-పంజాబ్' (పంజాబ్ సింహం).

  • 1850 (జననం): రాబర్ట్ లూయిస్ స్టీవెన్‌సన్ — 'ట్రెజర్ ఐలాండ్', 'డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్' రచించిన ప్రసిద్ధ స్కాటిష్ రచయిత.

  • 1917 (జననం): వసంత్‌దాదా పాటిల్ — మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.

నేటి పంచాంగం - 13 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ చవితి (నాగుల చవితి)SpiritualitySwechaa13 Nov 2026, 08:54 AM

నేటి పంచాంగం - 13 నవంబర్ 2026 | కార్తిక శుద్ధ చవితి (నాగుల చవితి)

  • తేదీ: 13 నవంబరు 2026, శుక్రవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, శుక్ల పక్షం

  • తిథి: చవితి (మధ్యాహ్నం 12:15 వరకు, తదుపరి పంచమి)

  • వారం: శుక్రవారం (భార్గవవాసరే)

  • నక్షత్రం: మూల (ఉదయం 07:38 వరకు, తదుపరి పూర్వాషాఢ)

  • యోగం: ధృతి (రాత్రి 09:42 వరకు, తదుపరి శూల)

  • కరణం: విష్టి/భద్ర (మధ్యాహ్నం 12:15 వరకు), తదుపరి బవ (రాత్రి 11:28 వరకు)

  • రాహుకాలం: ఉదయం 10:30 - 12:00 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • అమృతకాలం: తెల్లవారుజామున 01:15 - 02:50 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 08:35 - 09:20 వరకు మరియు మధ్యాహ్నం 12:22 - 01:07 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 03:18 - 04:52 వరకు

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: ధనుస్సు

  • సూర్యోదయం: ఉదయం 06:23

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:36

పెట్టుబడుల వేటలో ఏపీ, తెలంగాణ.. గ్లోబల్ కంపెనీలను ఆకర్షించేందుకు రెండు రాష్ట్రాల మెగా ప్లాన్!NationalSwechaa13 Nov 2026, 12:50 AM

పెట్టుబడుల వేటలో ఏపీ, తెలంగాణ.. గ్లోబల్ కంపెనీలను ఆకర్షించేందుకు రెండు రాష్ట్రాల మెగా ప్లాన్!

దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడుల కోసం కొత్త పోటీ మొదలైందా? ఏపీ, తెలంగాణల్లో ఎవరి వ్యూహం ఎలా ఉంది? ఈ రెండు రాష్ట్రాల సమ్మిట్లతో యువతకు ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి? ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ తెలంగాణ, ఏపీపైనే ఉంది.

హైదరాబాద్ గొంతెండుతోంది.. ట్యాంకర్ కోసం వారం రోజులు ఎదురుచూపులు! ప్రభుత్వం ఏం చేస్తోంది?తెలంగాణSwechaa12 Nov 2026, 11:55 PM

హైదరాబాద్ గొంతెండుతోంది.. ట్యాంకర్ కోసం వారం రోజులు ఎదురుచూపులు! ప్రభుత్వం ఏం చేస్తోంది?

హైదరాబాద్ లో చుక్క నీటికి చుక్కలు కనిపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయా..? విశ్వనగరమని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలకు హైదరాబాద్ తాగునీటి కష్టాలు కనిపించడం లేదా..? ఇప్పుడే పరిస్థితులు ఇలా ఉంటే.. రానున్న వేసవిలో నగరం పరిస్థితి ఏంటి..?

December Horoscope: డిసెంబర్ నెలలో ఆ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. వాళ్లకు అదృష్టం మామూలుగా లేదు!SpiritualitySwechaa12 Nov 2026, 10:24 PM

December Horoscope: డిసెంబర్ నెలలో ఆ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. వాళ్లకు అదృష్టం మామూలుగా లేదు!

December Horoscope: డిసెంబర్ నెల సమీపిస్తున్న వేళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోబోతోంది. ఏడాది చివర్లో గ్రహాల అనుకూలత వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం తలుపు తట్టనుంది. ఆగిపోయిన డబ్బు చేతికి రావడం, ఆకస్మిక ధనలాభం కలగడంతో పాటు ఉద్యోగం, వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో ఎదుగుదల కనిపించబోతోంది. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Sabarimala Special Trains: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఏకంగా 54 స్పెషల్ ట్రైన్స్.. తేదీలు ఇవే!NationalSwechaa12 Nov 2026, 10:02 PM

Sabarimala Special Trains: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఏకంగా 54 స్పెషల్ ట్రైన్స్.. తేదీలు ఇవే!

Sabarimala Special Trains: శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న అయ్యప్ప స్వాములు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏకంగా 54 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ స్పెషల్ ట్రైన్లు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ - కొల్లం - హైదరాబాద్ మధ్య నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మొత్తంగా ఎనిమిది ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఇందులో 07193 నంబర్ రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (శనివారం) రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి, సోమవారం ఉదయం 7.15 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, 07194 రైలు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో (సోమవారం) ఉదయం 10.55 గంటలకు కొల్లంలో బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Agriculture Business: 2 రూపాయాల ఐడియాతో మొదలైన ప్రయాణం.. 500 కుటుంబాల తలరాత మార్చిన రైతు!NationalSwechaa12 Nov 2026, 09:59 PM

Agriculture Business: 2 రూపాయాల ఐడియాతో మొదలైన ప్రయాణం.. 500 కుటుంబాల తలరాత మార్చిన రైతు!

Agriculture Business: లక్షల రూపాయల పెట్టుబడి ఉంటేనే పెద్ద వ్యాపారం చేయగలమని చాలామంది అనుకుంటారు. కానీ, సరైన ఆలోచన, పట్టుదల ఉంటే కేవలం రెండు రూపాయల ఐడియాతో కూడా కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చని నిరూపించాడు ఓ సామాన్య రైతు. ఒడిశాలోని అంగుల్ జిల్లాకు చెందిన సంతోష్ సాహు, ఒక చిన్న నిమ్మతోట ప్రయోగాన్ని ఏకంగా అమెరికా, యూకే వరకు ఎగుమతి చేసే ఇంటర్నేషనల్ బిజినెస్‌గా మార్చాడు. తాను ఏడాదికి రూ. కోటికి పైగా టర్నోవర్ సాధించడమే కాకుండా, తన చుట్టుపక్కల ఉన్న 500 రైతు కుటుంబాల తలరాతను మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

Consumer Rights: రూపాయి కోసం రెండేళ్ల న్యాయపోరాటం.. ఐఆర్‌సీటీసీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణికుడు!NationalSwechaa12 Nov 2026, 09:11 PM

Consumer Rights: రూపాయి కోసం రెండేళ్ల న్యాయపోరాటం.. ఐఆర్‌సీటీసీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రయాణికుడు!

Consumer Rights: "ఒక్క రూపాయే కదా.. పోతే పోనీలే" అని సాధారణంగా ఎవరైనా సరే తేలిగ్గా వదిలేస్తారు. కానీ కేరళకు చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఆ ఒక్క రూపాయి కోసం ఏకంగా రెండేళ్ల పాటు వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటం చేశాడు. తన హక్కుల విషయంలో రాజీ పడకుండా కన్స్యూమర్ కోర్టు మెట్లు ఎక్కి, చివరకు రైల్వే సంస్థ ఐఆర్‌సీటీసీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఒక్క రూపాయి బకాయికి బదులుగా ఏకంగా రూ. 3,100 పరిహారం రాబట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.కేరళకు చెందిన సంజయ్ రాజ్ కాడగౌడ్ అనే ప్రయాణికుడు 2024 ఆగస్టు 17న తన రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. రూల్స్ ప్రకారం టికెట్ రద్దు చేసిన తర్వాత తిరిగి రావాల్సిన రీఫండ్ అమౌంట్‌లో ఐఆర్‌సీటీసీ ఒక్క రూపాయి తక్కువగా జమ చేసింది. కేవలం రూపాయే అయినా, సర్వీస్ లోపం విషయంలో మౌనంగా ఉండకూడదని సంజయ్ డిసైడ్ అయ్యారు. వెంటనే ఐఆర్‌సీటీసీ తీరును సవాలు చేస్తూ కన్స్యూమర్ కమిషన్‌లో కంప్లైంట్ చేశారు.

22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంతెలంగాణSwechaa12 Nov 2026, 09:05 PM

22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం

22A: తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పరిష్కారం కాని 22ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా క్షేత్ర స్థాయిలో పకడ్బందీగా అమలు చేసి దరఖాస్తుదారులకు ఉపసమనం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. నిర్ణయాల అమలు, సమస్యల పరిష్కారంలో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై సచివాలయంలో కలెక్టర్లు, రిజిస్ట్రార్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లాల రిజిస్ట్రార్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Tollywood: మొన్న థియోట్రికల్..ఇప్పుడు ఓటీటీ డీల్..వారణాసి కి కళ్ళు చెదిరే ఆఫర్!సినిమాSwechaa12 Nov 2026, 08:32 PM

Tollywood: మొన్న థియోట్రికల్..ఇప్పుడు ఓటీటీ డీల్..వారణాసి కి కళ్ళు చెదిరే ఆఫర్!

Tollywood: మన తెలుగు సినిమా సత్తాను ప్రపంచ దేశాలకి చాటి చెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి సినిమాకి సంబందించి బిజినెస్ డీల్స్ మొదలయ్యాయి. మొన్నీమధ్యే..మైత్రీ మూవీ మేకర్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రిలీజ్ కోసం భారీ ఆఫర్‌ను ఇచ్చారు. 290 కోట్లకి డీల్ కుదుర్చుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, 300 కోట్లని తాజాగా కన్‌ఫర్మ్ అయింది.

Nvidia CEO Resigns: సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సన్‌ రాజీనామా.. ఎఫైర్‌ ఎంత పనిచేసింది?InternationalSwechaa12 Nov 2026, 08:17 PM

Nvidia CEO Resigns: సంచలనం.. ఎన్విడియా సీఈవో జెన్సన్‌ రాజీనామా.. ఎఫైర్‌ ఎంత పనిచేసింది?

Nvidia CEO Resigns: ప్రపంచ టెక్, ఏఐ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజ కంపెనీ 'ఎన్విడియా'లో ఊహించని షాకింగ్ పరిణామం జరిగింది. ఆ సంస్థ సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా కంపెనీని అగ్రస్థానంలో నిలిపిన హువాంగ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎఫైర్ వివాదంలో చిక్కుకుని పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.గత కొద్ది రోజులుగా జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంపై సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి. చైనా గూఢచారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అలిస్ అనే మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు హువాంగ్ ఇటీవలే ప్రకటించడం పెద్ద దుమారం రేపింది. ఆ వివాదం ఇంకా సద్దుమణగక ముందే, తాజాగా మరో మహిళతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Tollywood: OG 2, OG 3లపై థమన్ అప్‌డేట్..స్పీకర్లు పగిలిపోయే స్క్రిప్ట్ రెడీనా?సినిమాSwechaa12 Nov 2026, 08:12 PM

Tollywood: OG 2, OG 3లపై థమన్ అప్‌డేట్..స్పీకర్లు పగిలిపోయే స్క్రిప్ట్ రెడీనా?

Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కలెక్షన్ల గురించి అందరికీ తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే ఇది ఎవరూ ఊహించనిది. ఆ తర్వాతనే, దర్శకుడు సుజీత్-పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ చేయాలని డిసైడయ్యారు. ఆల్రెడీ పక్కాగా ఓజీ 2 కథ సిద్ధంగా ఉంది.

సీపీ సజ్జనార్ బదిలీకి సవా లక్ష ఆధారాలు?NationalSwechaa12 Nov 2026, 07:17 PM

సీపీ సజ్జనార్ బదిలీకి సవా లక్ష ఆధారాలు?

అధికారి బదిలీలు అత్యంత సాధారణం. కానీ బలమైన ఆఫీసర్, కీలకమైన పోస్టింగ్ నుంచి బదిలీ చేయడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ఎంతోమంధి అధికారులు తప్పులు చేసినా, కొంతమందికే వర్తించేలా పొలిటికల్ గేమ్ లు పావులు కదుపుతారు. సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్ చాలామందికి తెలియని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం.

బాస్ అంతా బాగుందనుకున్నారు?

హైదరాబాద్ సీపీగా సజ్జనార్ 13 నెలల్లో ఫుడ్ సేప్టీ, జోనల్ ఇన్వెస్టిగేషన్ టీం, వన్ వే లతో పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, ఇక తనకు కర్ణాటక కాంగ్రెస్ నేతల నుంచి పరిచయాలు ఉండటంతో హైదరాబాద్ సీపీగానే రిటైర్మెంట్ అయ్యేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అనేక మంది నేతలు, బిజినెస్ మెన్స్, లాబియిస్టులు నమ్ముకున్నారు. సజ్జనార్ కూడా తన పొలిటికల్ కెరీర్ భవిష్యత్ ని సోషల్ మీడియా ద్వారా కర్ణాటకలో కూడా తెలిపేలా ప్లాన్ చేసుకున్నారు. అక్కడ 300 ఎకరాల వరకు భూములు కూడా కొనుగోలు చేశారని అక్కడి పొలిటికల్ ప్రత్యర్ధులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

Artificial Intelligence: పదేళ్లలోపే క్యాన్సర్ అంతమా? ఏఐ కంపెనీల గాలి తీసేసిన ఫార్మా!NationalSwechaa12 Nov 2026, 06:37 PM

Artificial Intelligence: పదేళ్లలోపే క్యాన్సర్ అంతమా? ఏఐ కంపెనీల గాలి తీసేసిన ఫార్మా!

Artificial Intelligence: రాబోయే పదేళ్లలోపే క్యాన్సర్, గుండె జబ్బులు, అల్జీమర్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు భూమ్మీద లేకుండా పోతాయా? వైద్య ప్రపంచంలో ఏఐ అద్భుతాలు సృష్టించబోతోందా? అవుననే అంటూ ప్రముఖ ఏఐ దిగ్గజం ఆంత్రోపిక్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు టెక్, వైద్య వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. వేల ఏళ్లుగా మనుషులను వణికిస్తున్న మొండి వ్యాధులకు పదేళ్లలో చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆ సంస్థ ఊదరగొడుతోంది. అయితే, ఏఐ కంపెనీల ఈ భారీ బిల్డప్‌పై ఔషధ తయారీ (ఫార్మా) కంపెనీలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెబుతూ ఏఐ కంపెనీల గాలి తీసేస్తున్నాయి.సాధారణంగా ఒక కొత్త వ్యాధికి మందు కనిపెట్టాలంటే శాస్త్రవేత్తలకు దశాబ్దాల సమయం పడుతుంది. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఆ సుదీర్ఘ పరిశోధనలు కేవలం కొన్ని వారాలకే కుంచించుకుపోతాయని ఆంత్రోపిక్ అంచనా వేస్తోంది.

సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట- మంత్రి పొన్నం ప్రభాకర్తెలంగాణSwechaa12 Nov 2026, 06:05 PM

సంక్షేమం, అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట- మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నవంబర్ 14న గిగ్ వర్కర్స్ తో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టే ర్యాలీలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్స్ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. గత పదేళ్లుగా పెరగని ఆటో ఛార్జీలను పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పెంచిందన్నారు.

TG: అగ్నిమాపక శాఖకు సజ్జనార్‌.. పోలీస్‌శాఖలో భారీగా బదిలీలుతెలంగాణSwechaa12 Nov 2026, 05:30 PM

TG: అగ్నిమాపక శాఖకు సజ్జనార్‌.. పోలీస్‌శాఖలో భారీగా బదిలీలు

TG: తెలంగాణ పోలీస్ శాఖలో ప్రభుత్వం అనూహ్యంగా భారీ ప్రక్షాళన చేపట్టింది. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ బదిలీల జాబితాలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ వీసీ సజ్జనార్‌ను అక్కడి నుంచి తప్పించి, అగ్నిమాపక శాఖ (ఫైర్ సర్వీసెస్) డీజీగా బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సజ్జనార్ స్థానంలో డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా పనిచేస్తున్న మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.1996 బ్యాచ్‌కు చెందిన వీసీ సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీ బాధ్యతల నుంచి తెలంగాణ ఫైర్ సర్వీసెస్, విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవలు, పౌర రక్షణ విభాగాల డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది. దీనితో పాటు ఆయనకు ఎస్పీఎఫ్ (SPF) డీజీ బాధ్యతలను కూడా అదనంగా అప్పగించింది.

Covid 19 New Variant: కరోనా మళ్లీ వణికిస్తోందా? ఈసారి వ్యాక్సిన్లకూ చిక్కనంత డేంజరా?NationalSwechaa12 Nov 2026, 05:12 PM

Covid 19 New Variant: కరోనా మళ్లీ వణికిస్తోందా? ఈసారి వ్యాక్సిన్లకూ చిక్కనంత డేంజరా?

Covid 19 New Variant: ప్రపంచ దేశాలను మరోసారి కరోనా గుబులు వెంటాడుతోంది. అంతా సద్దుమణిగిపోయింది, ఇక వైరస్ భయం లేదని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. వెన్నులో వణుకు పుట్టించేలా మరో కొత్త కోవిడ్-19 వేరియంట్ తెరపైకి వచ్చింది. సాధారణ రకాలతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ అత్యధిక సంఖ్యలో మ్యూటేషన్లకు గురైన 'స్పైక్ ప్రోటీన్'ను కలిగి ఉండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ కొత్త రకం కేసులు బయటపడుతుండటంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి.

మంత్రి ఇలాకాలో తాగునీటి కష్టాలు.. నీళ్ల కోసం రోడ్డెక్కిన ప్రజలుతెలంగాణSwechaa12 Nov 2026, 04:42 PM

మంత్రి ఇలాకాలో తాగునీటి కష్టాలు.. నీళ్ల కోసం రోడ్డెక్కిన ప్రజలు

No Water: తెలంగాణలో నీటి కష్టాలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. ఇప్పటికే సాగునీరు లేక చాలా చోట్ల పంట పొలాలు ఎండిపోతున్నాయి. సాగునీటి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పొలాలకు నీరు అందించాలంటూ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. తాజాగా తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి కనిపిస్తోంది. తాగేందుకు నీళ్లు దొరక్క ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. ఖాళీ బిందెల‌తో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.

Telangana BJP: తెలంగాణ బీజేపీలో 'రిపోర్ట్ కార్డు' టెన్షన్.. పదవుల్లో ఉన్న నేతలకు కొత్త షాక్!తెలంగాణSwechaa12 Nov 2026, 04:15 PM

Telangana BJP: తెలంగాణ బీజేపీలో 'రిపోర్ట్ కార్డు' టెన్షన్.. పదవుల్లో ఉన్న నేతలకు కొత్త షాక్!

Telangana BJP: తెలంగాణ బీజేపీలో పదవులు అనుభవిస్తున్న నేతలకు ఇప్పుడు అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చింది. కేవలం పార్టీ పదవి తీసుకున్నామా, హైదరాబాద్ ఆఫీసు చుట్టూ తిరిగామా అన్నట్లుగా వ్యవహరిస్తే ఇకపై కుదరదని ఢిల్లీ పెద్దలు తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో ఎవరు ఎంత చురుగ్గా పనిచేస్తున్నారు? ఎన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు? అన్న వివరాలను తేల్చేందుకు నేతల పనితీరుపై నిఘా పెట్టింది. ప్రతి నెలా ప్రోగ్రెస్ 'రిపోర్ట్ కార్డు' సమర్పించాలన్న అధిష్టానం కొత్త రూల్ ఇప్పుడు రాష్ట్ర కమలం నేతల్లో తీవ్ర టెన్షన్ రేపుతోంది.గత నెలలో రాష్ట్రానికి వచ్చిన బీజేపీ ఇంచార్జీ సునీల్ బన్సల్, సహ ఇంచార్జీలు అభయ్ పాటీల్, రేఖా శర్మతో పాటు సంస్థాగత ప్రధాన కార్యదర్శులు మధుకర్, దశరత్ వరుస సమావేశాలు నిర్వహించారు. బాధ్యతల్లో ఉన్న నేతలు ఇప్పటివరకు ఏం చేశారు?

యూపీలో ఓవైసీ నయా పాలిటిక్స్.. కొత్త కూటమి సీఎం అభ్యర్థిగా ‘ఆజాద్’..NationalSwechaa12 Nov 2026, 03:49 PM

యూపీలో ఓవైసీ నయా పాలిటిక్స్.. కొత్త కూటమి సీఎం అభ్యర్థిగా ‘ఆజాద్’..

యూపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ‘సామాజిక పరివర్తన మోర్చా’ (SPM) తరఫున యూపీ సీఎం అభ్యర్థిగా ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గురువారం యూపీ రాజధాని లక్నోలో చంద్రశేఖర్ ఆజాద్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.యూపీలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించకుండా అడ్డుకోవడానికి తమ కూటమి ఓ బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పూర్తి విశ్వాసంతో చెబుతున్నానని అన్నారు.

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతన్నల నిరసన సెగతెలంగాణSwechaa12 Nov 2026, 03:34 PM

ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతన్నల నిరసన సెగ

Beerla Ilaiah: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతన్నల నుంచి నిరసన సెగ ఎదురైంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని రైతులు ఆరోపించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో గత ప్రభుత్వం నిర్మించిన గోదామును ప్రారంభించేందుకు వచ్చిన బీర్ల ఐలయ్యను రైతులు గట్టిగా నిలదీశారు. 20 రోజులుగా వడ్లు తడుస్తూ, ఎండుతూ ఉన్నా కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లు ఎందుకు కొనడం లేదంటూ బీర్ల ఐలయ్యను వారు ప్రశ్నించారు. ఎప్పటినుంచి ధాన్యం కొనుగోలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో 'లిక్కర్' గోల్‌మాల్.. ఆ లెక్కలన్నీ బయటకు తీస్తున్నారా?తెలంగాణSwechaa12 Nov 2026, 03:19 PM

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో 'లిక్కర్' గోల్‌మాల్.. ఆ లెక్కలన్నీ బయటకు తీస్తున్నారా?

Telangana Excise Department: ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించే తెలంగాణ ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు అసలు సిసలైన లెక్కల వేట మొదలైంది. అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాల్సిన కొందరు అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి, పట్టుబడిన సరుకులో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఆ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ముఖ్యంగా బాటిళ్ల లెక్కల్లో మాయాజాలం, ముడుపుల వాటాల వ్యవహారం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) దృష్టికి వెళ్లడంతో, ఇప్పుడు ఆ గుట్టుమట్లన్నీ బయటకు తీసే పనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు.కొందరు అధికారుల అవినీతి వ్యవహారాలపై సీఎంఓ నుంచి నేరుగా వివరణ కోరుతూ ప్రశ్నలు ఎదురవుతుండటంతో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కొందరు చేస్తున్న తప్పులకు తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.