ఒకరు ఎమ్మెల్యే.. ఇంకొకరు పార్టీ అధ్యక్షుడు
పల్లీ బఠాణిలో మైదంపిండిలా మైనంపల్లి రోత వ్యవహారం?
ఈక, తోక తెలియదు.. రోడ్డు మీద పడి వాగుడే తెలుసు?
ఆర్టీవీ ముందు చేసిన హంగామాతో నవ్వుల పాలు
ఈయన ఎలా ఎమ్మెల్యే అయ్యారని విమర్శలు
ఏనాడు ఏ నేత మీద వార్తలు వేయలేనట్లు బిల్డప్‌లు?
నడి రోడ్డుపై పదుల సంఖ్యలో పోలీసులను పెట్టుకుని ప్రశ్నలు?
పోలీసులే ఎదురు తిరగడంతో పలచన అయిన అధికార పార్టీ ఎమ్మెల్యే?
నీ అయ్య కాలం వేరు.. ఈ కాలం వేరు అంటూ సెటైర్స్
నోరు నెత్తిన పెట్టుకుంటే తప్పులు ఒప్పులు అవుతాయా?
పిన్నవయస్సు ఎమ్మెల్యే పిల్ల చేష్టలతో కాంగ్రెస్ పార్టీ మొత్తం బద్నాం
ఎమ్మెల్యే పదవికే కలంకంలా కుర్ర గ్యాంగ్ పనులు?
స్వేచ్ఛ న్యూస్ హెచ్చరిక.. చీటికి మాటికి మీడియాని బ్లేమ్ చేస్తే తరిమికొడతారు?
బిడ్డా.. మైనంపల్లి జాగ్రత్త
ఇలానే ఉంటే జర్నలిస్టుల అడ్డా మీ ఇంటి వద్దే
మైనంపల్లి రోహిత్ రోత వ్యవహారం!!
ఒకరు ఎమ్మెల్యే.. ఇంకొకరు పార్టీ అధ్యక్షుడు.. రాజకీయాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు మాట తీరు, వ్యవహారశైలి కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వ్యవహారం మాత్రం ఇప్పుడు సొంత పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతోందనే చర్చ మొదలైంది.
తాజాగా ఆర్‌టీవీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. తనపై వచ్చిన భూ వ్యవహారాల కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోహిత్ అక్కడికి వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు ఉందా లేదా.. పోలీసులు వెరిఫై చేయాలి అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
రాజకీయంగా ఎవరికి నష్టం
ఇక ఒక వార్త తప్పు అనిపిస్తే.. దానికి సమాధానం వార్తతోనే ఇవ్వాలి. ఆధారాలతో ఖండించాలి. అవసరమైతే చట్టపరమైన మార్గాన్ని ఎంచుకోవాలి. అంతేకానీ పదుల సంఖ్యలో పోలీసుల మధ్య మీడియా కార్యాలయం దగ్గరికి వెళ్లి హంగామా చేయడం వల్ల రాజకీయంగా ఎవరికి నష్టం అని రోహిత్ గుర్తించకపోవడం విచారకరం అంటున్నారు.. ఎమ్మెల్యే అంటే కేవలం ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి కాదు. ప్రజల తరఫున మాట్లాడే రాజ్యాంగబద్ధమైన ప్రతినిధి.
అలాంటి పదవికి ఒక హుందాతనం ఉంటుంది. ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మరిచి రోడ్డు మీదే మీడియాతో వాగ్వాదానికి దిగితే.. అది వ్యక్తిగత వ్యవహారంగా ఆగదు. చివరికి పార్టీ ఇమేజ్‌డ్యామేజ్ చేసే వరకు దారితీస్తుంది.. ఇక ప్రతిక్షణం మీడియా వెంటలేకుంటే రాజకీయ నాయకులకు పబ్లిసిటీ కరువు అవుతుంది. అంతెందుకు రాజకీయ నాయకులు మీడియాను ఎంతలా ఉపయోగించుకుంటారు అన్నది లోకానికి తెలుసు..
ప్రతి కదలిక కెమెరాలో రికార్డ్ అవుతుంది
ఒక్కోసారి వారు చేసే తప్పు, మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుంది. ప్రతి కదలిక కెమెరాలోకి వస్తుంది. అందుకే రాజకీయ నాయకుడిగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రోహిత్ రోత వ్యవహారం చూసిన వారు అంటున్నారు.. ఇక మీడియా తప్పు చేస్తే చట్టం ఉంది. నాయకులు తప్పు అనుకుంటే ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులు తప్పు చేస్తే ప్రజాక్షేత్రం ఉంది. కానీ మీడియాను బ్లేమ్ చేయడం.. ప్రశ్నించిన ప్రతి సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. చివరికి రాజకీయ నాయకుడికే నష్టం కలిగిస్తుంది.
మరోవైపు మైనం పల్లి రోహిత్ లాగా.. నా గురించి వార్త ఎందుకు వేశారు? అన్న కోపంతో మీడియా కార్యాలయాల దగ్గరికి వెళ్లడం మొదలైతే.. రేపు ప్రతి రాజకీయ నాయకుడూ తనకు నచ్చని వార్తపై ఇదే పద్ధతి అనుసరించే పరిస్థితి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చుట్టూ వినిపిస్తున్న విమర్శలు కూడా ఇదే అంశాన్ని మరింత పెద్దదిగా చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటుగా మాట్లాడటం వేరు.. జర్నలిస్టులు, మీడియా సంస్థలతో నేరుగా ఢీకొనడం వేరు.
ప్రశ్నలు అడగడం వల్ల నాయకుడి బలం పెరగదు
పోలీసుల మధ్య నిలబడి ప్రశ్నలు అడగడం వల్ల నాయకుడి బలం పెరగదు. ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగినప్పుడు మాత్రమే రాజకీయంగా బలం పెరుగుతుందనే ఆలోచన ఆయనలో కలుగాకపోవడం విచారకరం అని అంటున్నారు.. ఇంకా చెప్పాలంటే.. యువ ఎమ్మెల్యేగా రోహిత్‌కు రాజకీయంగా భవిష్యత్తు ఉంది.. కానీ ఆ ప్రయాణంలో ప్రతి చిన్న పొరపాటు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశం కూడా ఉందని ఆయన గుర్తించాలి..
ఇక నడి రోడ్డుపై పదుల సంఖ్యలో పోలీసులను వెంటేసుకుని తిరుగుతూ, మీడియానే ప్రశ్నిస్తానంటూ హల్చల్ చేయడం ఆయన చౌకబారుతనానికి నిదర్శనం. అయితే, అక్కడ సీన్ ఆశించినట్టు జరగలేదు! స్వయంగా పోలీసులే ఎదురు తిరగడంతో ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక్కసారిగా పలచనైపోయారు. 'నోరు నెత్తిన పెట్టుకుని గట్టిగా అరిస్తే చేసిన తప్పులన్నీ ఒప్పులు అయిపోతాయా?' అని ప్రజలు నిలదీస్తున్నారు.
"రేయ్ బిడ్డా! నీ అయ్య కాలం వేరు.. ఈ కాలం వేరు!
నెటిజన్లు అయితే రోహిత్‌కు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు.. "రేయ్ బిడ్డా! నీ అయ్య కాలం వేరు.. ఈ కాలం వేరు! నడిరోడ్డుపై దాదాగిరీ చేస్తామంటే నడవదు" అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.. మరోవైపు పిన్న వయస్సులోనే ఎమ్మెల్యే పదవి దక్కితే దాన్ని ప్రజలకు సేవ చేయడానికి వాడుకోవాలి. కానీ, ఈ కుర్ర గ్యాంగ్ చేస్తున్న చౌకబారు పనులతో ఎమ్మెల్యే పదవికే తీవ్ర కలంకం వస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..
వీళ్ల పిల్ల చేష్టల వల్ల అధికార కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మొత్తం తీవ్రంగా బద్నాం అవుతోంది. తమ వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చీటికి మాటికి మీడియాని బ్లేమ్ చేయడం వీరికి అలవాటుగా మారింది. ప్రజాస్వామ్యంలో నాలగవ స్తంభమైన మీడియాపై దాడి చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదనే హెచ్చరికలు పుడుతున్నాయి..


