బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా షాక్ ఇచ్చాయి. భారత్ సహా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు టారిఫ్ అస్త్రం ప్రయోగించడంతో మరోసారి ఇన్వెస్టర్లు బంగారం, వెండి మీద పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిసింది. ఫలితంగా ధరలు మరోసారి ఎగబాకాయి. నిన్నమెున్నటివరకూ భారీగా పడిపోయిన ధరలు.. మరోసారి పుంజుకోవడంతో పసిడి ప్రియులు షాక్‌లో ఉన్నారు. ధరలు పెరుగుతాయని సంకేతాలు రావడంతో పండుగ షాపింగ్, పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాలు ఇప్పుడు కొనాలా? వద్దా? అనే సందిగ్దంలో వినియోగదారులు ఉన్నట్టు సమాచారం.
నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.2,610 పెరిగి రూ.1,25,890కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,400 పెరిగి రూ.1,15,400 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.1,65 వేలుగా కొనసాగుతోంది.నిన్న రెండు సార్లు తగ్గిన బంగారం ధరలు, ఇవాళ భారీగా పెరగడంతో మార్కెట్లో ఇన్వెస్టర్ల జోష్ నడుస్తోంది.
ధరలు ఎందుకు పెరిగాయి?
గత వారం రోజులుగా 14 నెలల కనిష్ఠ స్థాయికి పడిన బంగారం ధరలు ప్రస్తుతం మళ్లీ పుంజుకోవడానికి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో చోటుచేసుకున్న ప్రధాన పరిణామాలే కారణంగా తెలుస్తోంది.అమెరికా డాలర్ బలపడటంతో భారత రూపాయి విలువపై ఒత్తిడి పెరిగింది. భారత్ విదేశాల నుంచి బంగారాన్ని డాలర్ల మారకంతో దిగుమతి చేసుకుంటుంది. అందుకే రూపాయి విలువ తగ్గడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
దానికి తోడు గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గడంతో ఇదే సరైన సమయమని రిటైల్ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు తిరిగి పెద్ద ఎత్తున కొనుగోళ్లు ప్రారంభించారు.అది కూడా ఓ కారణం కావొచ్చు.అమెరికాలో ద్రవ్యోల్బణం (Inflation) అంచనాల కంటే ఎక్కువగా నమోదు కావడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల పెట్టుబడిదారులు మళ్లీ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తుండటంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ తగ్గి ధరలు పెరిగినట్టు తెలుస్తోంది.
