సినిమా

Tollywood: విడుదల వాయిదా..అలాంటి సినిమాలన్నీ ఫ్లాపేనా?

4 నిమిషాల పఠనం

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కొన్ని సినిమాలు చెప్పిన తేదీకి రిలీజ్ కావడం లేదు. దీనివల్ల, ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోవడమే కాదు, బిజినెస్ పరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటోంది. గత కొంతకాలంగా మన టాలీవుడ్ సినిమాలు వాయిదాల మీద వాయిదా పడి చివరికి ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం మళ్ళీ వాయిదా పడింది.

కరోనా తర్వాత నుంచే ఇలా జరుగుతోందా?

కరోనా కి ముందు మన నైజాం లో ఎక్కువగా ఉన్నది సింగిల్ స్క్రీన్ థియేటర్సే. ప్రసాద్స్ మల్టీప్లెక్స్, పివిర్ మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ప్రతీ ప్రాంతంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడుతూ మల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువైంది. దీంతో ఒక సినిమా రిలీజ్ అంటే ఒకేసారి ఒకే మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో కనీసం 20 నుంచి 25 షోలు వేస్తున్నారు. సినిమాకి హిట్ టాక్ వచ్చిందా..రోజుకి 10 షోలు వేసినా అవి ఫుల్ అవుతున్నాయి. ఎందుకంటే, ఆ థియేటర్స్‌లో సీటింగ్ కెపాసిటీ 300 లోపే ఉంటున్నాయి.

ఒకవేళ సినిమా ఫ్లాప్ టాక్ వచ్చిందంటే ఒక్క థియేటర్స్ కూడా సగం సీట్లను భర్తీ చేయదు. ఇలాంటి, పరిస్థితుల్లో సినిమా తీసిన నిర్మాత గట్టిగానే నష్టపోతున్నాడు. దీనికి, తోడు ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటించాక గనక వాయిదా వేస్తే ఇక ఆ సినిమాను జనాలు అంతగా పట్టించుకోవడం లేదు. ప్రభాస్ నటించిన "రాధే శ్యామ్" ఇలా చాలాసార్లు వాయిదా పడింది. "ది రాజా సాబ్" కూడా అంతే. ఇటీవల వచ్చిన ప్యారడైజ్..త్వరలో రాబోతున్న "జైలర్ 2", "రణబాలి"..ఇలా చాలా సినిమాలు ఉన్నాయి.

ఆ లిస్ట్‌లో వెంకీ సినిమా "ఆదర్శ కుటుంబం" చేరింది. ముందు, ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని పోస్టర్ కూడా వేశారు. ఆ తర్వాత అక్టోబర్ 9 అన్నారు. ఇప్పుడు, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామంటున్నారు. అసలే, ఇటీవల అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ నటించిన బ్లాస్ట్ సినిమాతో పోలికలు పెడుతున్నారు. అందుకే, సినిమా ప్రమోషన్స్ కూడా పెద్దగా జరపడం లేదు. ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న వెంకీ సినిమాకి అసలు బజ్ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో పదే పదే వాయిదా అంటే నిర్మాత ఏమైపోతాడో మరి.

#Tollywood#Venkatesh#Aadarsha Kutumbam#Prabhas#Fauzi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి