సినిమా

Dimple Hayathi: ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్.. భోగిలో మాత్రం..

Dimple Hayathi: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి సినీ నేపథ్యం ఉన్నా కూడా ఆ నేపథ్యాన్ని ఉపయోహించుకోకుండా తన సొంత టాలెంట్‌తో స్పెషల్ నంబర్ నుంచి క్రేజీ హీరోయిన్‌ వరకూ ఎదిగింది డింపుల్ హయాతి. తాజాగా, ఈ బ్యూటీ నటించిన భోగి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దర్శకుడు సంపత్ నంది రూపొందించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలో హీరోగా శర్వానంద్ నటించాడు. ఈ ఈవెంట్‌లో తన పాత్రపై డింపుల్ చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి.

భోగి సినిమాలో డింపుల్ హయాతి మందారం అనే పాత్రలో నటించింది. ఇది ఒక వేశ్య పాత్ర. సినిమాలో కీలకంగా వచ్చే ఈ పాత్రతో డింపుల్ హయాతికి మంచి పేరు రావడం పక్కా. అంత అద్భుతంగా దర్శకుడు సంపత్ నంది తీర్చిదిద్దాడు. వాస్తవానికి, వేరే కథ వినడానికి నిర్మాతను కలిసింది డింపుల్. అదే, సమయంలో సంపత్ నంది అక్కడే ఉండి..మందారం పాత్రకి కావాల్సింది ఇలాంటి హీరోయినే అని అక్కడికక్కడే కథ చెప్పాడు.

ఆ కథ, అందులో మందారం పాత్ర డింపుల్‌కి విపరీతంగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సమయంలో నిర్మాత ..నీకు ఈ రోల్ నచ్చితేనే చెయ్యి..లేదంటే ముందు అనుకున్న సినిమా కథనే చేద్దువు గానీ..అని ఆఫర్ చేశాడట. డింపుల్ కి భోగి లో మందారం పాత్ర విపరీతంగా నచ్చడంతో ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకుంది. ఇందులో, కొన్ని బూతులు కూడా మాట్లాడిన సందర్భాలున్నట్టుగా తాజా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.

ఇప్పటి వరకు డింపుల్ చేసినవన్నీ గ్లామర్ పాత్రలే. కథ, పాత్రకి తగ్గట్టు దర్శకులు, కొరియోగ్రాఫర్స్ ఆమెను రొమాంటిక్ యాంగిల్‌లో మాత్రమే చూపించారు. కానీ, కెరీర్‌లో మొదటి సారి పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాను చేసింది. ఇప్పటి వరకూ ఆమె చేసిన సినిమాలన్ని ఒకెత్తైతే, భోగి సినిమాలో మందారం పాత్ర ఒక్కటే తన కెరీర్‌ను ప్రత్యేకం అంటోంది డింపుల్. ఇక, ఈ సినిమాను నవంబర్ 27న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

తర్వాత చదవండి