సినిమా

Priyanka Mohan: ఇలాంటి పాత్రలో మెప్పించడం చాలా కష్టం..

Priyanka Mohan: కమర్షియల్ సినిమాలలో అందచందాలతో ఆకట్టుకునే పాత్రల కోసం హీరోయిన్స్ అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ అంటే మాత్రం అదో పెద్ద ఛాలెంజ్. అలాంటి, ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది ప్రియాంక అరుళ్.

Priyanka Mohan: కమర్షియల్ సినిమాలలో అందచందాలతో ఆకట్టుకునే పాత్రల కోసం హీరోయిన్స్ అంతగా శ్రమపడాల్సిన అవసరం లేదు. కానీ, కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ అంటే మాత్రం అదో పెద్ద ఛాలెంజ్. అలాంటి, ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది ప్రియాంక అరుళ్.

గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఈ హీరోయిన్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. అది కూడా అంధురాలి పాత్ర కావడం విశేషం.

‘ఏజీఎస్ 29’లో సరికొత్త పాత్రలో ప్రియాంక..

ఓజీ తర్వాత ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తులాభారం సినిమాలో నటిస్తోంది. అలాగే, ప్రియాంక నటిస్తున్న కోలీవుడ్ సినిమా ‘ఏజీఎస్ 29’ అనే వర్కింగ్ టైటిల్‌ తో రూపొందుతోంది. తమిళంలో విశాల్ హీరోగా నటించిన ‘చక్ర’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎం.ఎస్. ఆనందన్ ఈ చిత్రానికి దర్శకుడు. జై, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.

బ్రెయిలీ లిపితో హింట్ ఇచ్చిన మేకర్స్..

నవంబర్ 20న ప్రియాంక పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకంగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పోస్టర్, ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ప్రియాంక కళ్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేయడంతో పాటుగా బ్రెయిలీ లిపిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో, ఆమె ఈ సినిమాలో అంధురాలి పాత్రలో నటిస్తున్న విషయం రివీలైంది.

ఇక, ఈ సినిమాలో తన పాత్ర కోసం ప్రియాంక ఎలాంటి మేకోవర్‌తో కనిపించబోతోంది? కథలో ఆమె పాత్రకు ఎంతమేర ప్రాధాన్యత ఉండబోతోంది? అన్నది ఆసక్తికరంగా ఉంది. అందంతో పాటు అభినయం ఉన్న ఈ బ్యూటీకి సరైన కమర్షియల్ బ్రేక్ రావడం లేదు. అవకాశాలైతే వస్తున్నాయి గాని..అవి తన కెరీర్‌ను స్టార్ హీరోయిన్‌గా టర్న్ చేయలేకపోతున్నాయి. మరి, ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఆ ఫీట్ సాధిస్తుందా లేదా చూడాలి.

తర్వాత చదవండి