స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

#AA24: అల్లు అర్జున్ 24..కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్!సినిమాSwechaa13 Sep 2026, 08:42 PM

#AA24: అల్లు అర్జున్ 24..కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్!

#AA24: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌..ప్రస్తుతం పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ వద్ద తనకంటూ ఓ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. పుష్ప సిరీస్‌తో గ్లోబల్ రేంజ్‌లో బన్నీ మార్కెట్ ఏ రేంజ్‌లో పెరిగిందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టే తన కొత్త ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయి. ప్రస్తుతం, అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ లోపే తన 24వ సినిమా లీక్ బయటకి వచ్చింది. మలయాళ దర్శకుడు బాసిల్‌ జోసెఫ్‌ తో బన్నీ 24వ సినిమా ఉండబోతోంది.

Xi Jinping : ‘‘బలవంతుడిదే రాజ్యం అంటే కుదరదు..’’ బ్రిక్స్ వేదికగా అమెరికాకు జిన్‌పింగ్ వార్నింగ్!దునియాSwechaa13 Sep 2026, 08:12 PM

Xi Jinping : ‘‘బలవంతుడిదే రాజ్యం అంటే కుదరదు..’’ బ్రిక్స్ వేదికగా అమెరికాకు జిన్‌పింగ్ వార్నింగ్!

Xi Jinping : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యాల ధోరణిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బ్రిక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీలో ముగిసిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అంతర్జాతీయ క్రమాన్ని ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థతో పోల్చుతూ.. నియమ నిబంధనలు లేని ప్రపంచం సిగ్నల్స్ లేని నాలుగు రోడ్ల కూడలి లాంటిదని, అటువంటి చోట భారీ ప్రమాదాలు, తీవ్ర గందరగోళం తప్పవని హెచ్చరించారు.పాశ్చాత్య దేశాలు, ప్రత్యేకించి అమెరికా అనుసరిస్తున్న ఏకపక్ష ఆధిపత్య పోకడలను జిన్‌పింగ్ పరోక్షంగా ఎండగడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆధునిక ప్రపంచంలో ‘బలవంతుడిదే రాజ్యం’ అనే ఆటవిక భావన ఇక ఎంతమాత్రం చెల్లదని కుండబద్దలు కొట్టారు. ఒక దేశం ఎంత పెద్దది? ఎంత సంపన్నమైనది? ఎంత సైనిక బలం ఉంది? అనే అంశాలతో సంబంధం లేకుండా.. అంతర్జాతీయ వేదికపై ప్రతి దేశానికీ సమానమైన హక్కు, సమానమైన వాటా ఉండాలని స్పష్టం చేశారు.

Mythri-Movie-Makers: మైత్రీ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..సినిమాSwechaa13 Sep 2026, 07:50 PM

Mythri-Movie-Makers: మైత్రీ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..

Mythri-Movie-Makers: ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. నిర్మాణంలో కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ మైత్రీ దూసుకుపోతోంది. ఇటీవల ఈ సంస్థ నుంచి వచ్చిన ఇరుముడి సినిమా 230 కోట్లకి పైగా వసూళ్ళను రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. తాజాగా, ఇదే సంస్థ నుంచి ధృవ్ విక్రమ్ హీరోగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది.

మోడీ డిన్నర్‌ను స్కిప్ చేసిన చైనా అధ్యక్షుడు.. అసలు మతలబు ఇదే!దునియాSwechaa13 Sep 2026, 07:32 PM

మోడీ డిన్నర్‌ను స్కిప్ చేసిన చైనా అధ్యక్షుడు.. అసలు మతలబు ఇదే!

దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు తొలిరోజే అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సదస్సుకు హాజరైన సభ్యదేశాల అధినేతలకు, విదేశీ ప్రతినిధులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారిక విందును ఏర్పాటు చేశారు. అయితే ఈ గ్రాండ్ డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాకపోవడం ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్న కీలక తరుణంలో, జిన్‌పింగ్ విందుకు దూరంగా ఉండటం రకరకాల ఊహాగానాలకు తావిచ్చింది.దీంతో భారత్-చైనా మధ్య ఏవైనా అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయా అన్న చర్చ మొదలైనప్పటికీ.. జిన్‌పింగ్ గైర్హాజరు వెనుక అసలు కారణం వేరే ఉందని దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. సుదీర్ఘ విమాన ప్రయాణం, టైమ్ జోన్ మార్పు (జెట్‌లాగ్) కారణంగా ఆయన తీవ్రమైన అలసటకు గురైనట్లు సమాచారం. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఏమాత్రం విరామం లేకుండా వరుస అధికారిక సమావేశాల్లో పాల్గొనడం, మోడీతో కీలక భేటీ ఉండటంతో షెడ్యూల్ మొత్తం బిజీగా గడిచిందని, తీవ్ర అలసట కారణంగానే విశ్రాంతి తీసుకునేందుకు డిన్నర్‌కు హాజరుకాలేకపోయారని తెలుస్తోంది.

Srikanth Odela-Chiru: నానితో అయిపోయింది..మార్చ్ నుంచి మెగాస్టార్‌తో!సినిమాSwechaa13 Sep 2026, 07:07 PM

Srikanth Odela-Chiru: నానితో అయిపోయింది..మార్చ్ నుంచి మెగాస్టార్‌తో!

Srikanth Odela: యంగ్ డైరెక్టర్స్ ఊహించనివిధంగా సినిమాలను కంప్లీట్ చేయడమే కాదు, ఒకదాని తర్వాత ఒకటి బిగ్ స్టార్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. త్వరలో ఈ యంగ్ డైరెక్టర్ రూపొందిస్తున్న ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మెగాస్టార్‌తో చేయబోయో సినిమా వర్క్‌ను స్టార్ట్ చేయనున్నాడు. మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాబోతుందని సమాచారం.

Nandus World: ‘నందూస్ వరల్డ్’ నయా దందా.. భర్త పాత్రేనా లేక తెరవెనుక పెద్ద ముఠా ఉందా?సినిమాSwechaa13 Sep 2026, 06:23 PM

Nandus World: ‘నందూస్ వరల్డ్’ నయా దందా.. భర్త పాత్రేనా లేక తెరవెనుక పెద్ద ముఠా ఉందా?

Nandus World: సోషల్ మీడియాలో వేలల్లో లైకులు, లక్షల్లో ఫాలోవర్లు ఉంటే చాలు.. కళ్లు మూసుకుని నమ్మేస్తున్న అమాయకత్వాన్ని కొందరు పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు. విదేశాలకు వెళ్లాలి, డాలర్లు సంపాదించాలి, జీవితాన్ని మార్చుకోవాలన్న నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని యూట్యూబ్ వేదికగా భారీ మోసానికి తెరలేపిన వైనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. యూకే కేంద్రంగా 'నందుస్ వరల్డ్' పేరుతో యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ రమానందన చుట్టూ ఇప్పుడు పోలీసుల ఉచ్చు బిగుస్తోంది.వరుస కేసులతో ఇరుక్కున్న రమానందనను సెప్టెంబర్ 16న ఇబ్రహీంపట్నం పోలీసులు, సెప్టెంబర్ 17న అద్దంకి పోలీసులు విచారించనున్నారు. ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు కొల్లగొట్టారు? ఆ డబ్బంతా ఎక్కడికి మళ్లించారు? ఈ ఫ్రాడ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అందమైన వీడియోలు, విదేశీ లైఫ్‌స్టైల్ చూసి గుడ్డిగా నమ్మితే నిలువునా మునిగిపోతామని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

Rashmika Mandanna-Ranabaali: బేబీ బంప్ తో రణబాలి పూర్తి చేసిన రష్మిక!సినిమాSwechaa13 Sep 2026, 06:12 PM

Rashmika Mandanna-Ranabaali: బేబీ బంప్ తో రణబాలి పూర్తి చేసిన రష్మిక!

Rashmika Mandanna: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆయన భార్య, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రంపై టాలీవుడ్‌ తో పాటుగా పాన్-ఇండియా స్థాయిలోను భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మిక మందన్న పాత్రకి సంబందించిన చిత్రీకరణ పూర్తైంది.

Tollywood-Anupama: అనుపమ పరమేశ్వరన్ పెళ్ళైపోయిందా!సినిమాSwechaa13 Sep 2026, 05:47 PM

Tollywood-Anupama: అనుపమ పరమేశ్వరన్ పెళ్ళైపోయిందా!

Tollywood: మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కి పెళ్ళైందా..తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ చూస్తే అదే అనిపిస్తోంది. ఆమె ఇంతకముందు ఒక హీరోతో ప్రేమలో ఉండి..పెళ్ళి చేసుకోవాలనుకొని కూడా ఇద్దరి మధ్య సఖ్యత కుదరక విడిపోయారు. ఆ తర్వాత సినిమాల మీదే అనుపమ పరమేశ్వరన్ పూర్తిగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్ళికి సంబందించిన ఫొటోస్ వైరల్ అవుతుండటంతో ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది.

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..NationalSwechaa13 Sep 2026, 05:30 PM

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా!!.. అభిజీత్ దీప్కే సంచలన పోస్ట్..

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో శనివారం గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే కు ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి. ఆ ఘటనపై దీప్కే స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొందరు వ్యక్తులు తనను ముఖ్యమంత్రిగా భావించి, విమర్శించారని అన్నారు. అందుకుగానూ పిల్లల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ.. మధ్యప్రదేశ్‌ సీఎంగా రాజీనామా చేస్తున్నానంటూ సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.

NTR-Dragon-Neel: సలార్, ప్రభాస్‌లను ఇక మర్చిపోవాల్సిందే!సినిమాSwechaa13 Sep 2026, 05:28 PM

NTR-Dragon-Neel: సలార్, ప్రభాస్‌లను ఇక మర్చిపోవాల్సిందే!

NTR-Neel: ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘డ్రాగన్‌’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్‌’ మూవీలోని ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇది, ఆయన గత చిత్రాల కంటే రెట్టింపు స్థాయిలో ఉండబోతోందని ఇప్పుడు చర్చ జరుగుతోంది.

బ్రిక్స్‌ దేశాలే రూల్స్‌ సెట్‌ చేసుకోవాలి.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలుదునియాSwechaa13 Sep 2026, 05:26 PM

బ్రిక్స్‌ దేశాలే రూల్స్‌ సెట్‌ చేసుకోవాలి.. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు

PM Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత మండపం వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రపంచ దేశాల అధినేతల సమక్షంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ముందే పరోక్షంగా చైనా అనుసరిస్తున్న తీరును ఎండగడుతూ మోడీ చేసిన కామెంట్స్ దౌత్య వర్గాల్లో సంచలనంగా మారాయి.ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ నుంచి సోలార్ ప్యానెల్స్ వరకు అత్యంత కీలకమైన 'అరుదైన ఖనిజాల' ప్రాసెసింగ్‌లో చైనా ఏకఛత్రాధిపత్యం (దాదాపు 90 శాతం) చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. వీటి సరఫరాను ఆయుధంగా మలుచుకుని ఇతర దేశాలను ఒత్తిడికి గురిచేసే ధోరణిని మోడీ తీవ్రంగా తప్పుబట్టారు. "అత్యాధునిక సాంకేతికతను, సంక్లిష్ట ఖనిజాలను అడ్డం పెట్టుకుని ఇతరులను బెదిరించే చర్యలను ప్రపంచం ముక్తకంఠంతో వ్యతిరేకించాలి.

Aishwarya Lekshmi: ప్రభాస్ స్పిరిట్‌లో మరో గ్లామర్ బ్యూటీ?సినిమాSwechaa13 Sep 2026, 05:06 PM

Aishwarya Lekshmi: ప్రభాస్ స్పిరిట్‌లో మరో గ్లామర్ బ్యూటీ?

Aishwarya Lekshmi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఫౌజీ, తో పాటు భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’ కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. గత నెల మొత్తం ఫౌజీ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్..ఇప్పుడు స్పిరిట్ సినిమా కోసం పూర్తిగా సమయం కేటాయిస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కూడా నటించబోతోందట.

ఏజెన్సీలో ఆగని గిరిజనుల అవస్థలు.. ప్రాణాల కోసం తప్పని పరుగులు!!..NationalSwechaa13 Sep 2026, 04:53 PM

ఏజెన్సీలో ఆగని గిరిజనుల అవస్థలు.. ప్రాణాల కోసం తప్పని పరుగులు!!..

సుంకి గ్రామపంచాయతీకి చెందిన జంకర్‌గుడ గ్రామంలో సావిత్రి అనే మహిళ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆదివారం ఉదయం పరిస్థితి ఆందోళనగా మారింది. అయితే ఆ గ్రామానికి అంబులెన్స్‌ రాలేని దుస్థితి. దీంతో బంధువులు, గ్రామస్థులు ఆమెను డోలీలో 10 కిలోమీటర్లు మోసుకుంటూ ప్రధాన రహదారిపైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఓ ఆటోలో ఆంధ్రాలో ఉన్న సాలూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సరైన రహదారి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!సినిమాSwechaa13 Sep 2026, 04:00 PM

Movie Intervals: టెక్నికల్ సమస్యే కోట్ల వ్యాపారమైంది.. ‘ఇంటర్వెల్’ వెనుక అసలు కథ ఇదే!

వెండితెరపై సినిమా చూస్తున్నప్పుడు సరిగ్గా కథ ఉత్కంఠభరితమైన మలుపు తిరిగే క్షణంలో ‘ఇంటర్వెల్’ కార్డు పడుతుంది. హీరో ఇచ్చిన పవర్‌ఫుల్ వార్నింగ్ లేదా ఊహించని ట్విస్ట్‌తో ప్రేక్షకుల మైండ్ బ్లాక్ చేసి, సెకండ్ హాఫ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేయడానికే డైరెక్టర్ ఈ బ్రేక్‌ను ప్లాన్ చేశారని చాలా నమ్ముతారు. నిజానికి ఈ సినిమా ‘ఇంటర్వెల్ బ్యాంగ్’ అనేది డైరెక్టర్ల ఆలోచనల నుంచో, కథలోని సస్పెన్స్ కోసమో పుట్టనేలేదని మీలో ఎంత మందికి తెలుసు. వాస్తవానికి తెర వెనుక నడిచిన సాంకేతిక అవస్థలను కప్పిపుచ్చుకోవడానికి మొదలైన ఒక విధిలేని సర్దుబాటే ఈ ‘ఇంటర్వెల్’.ఒకప్పుడు ఇప్పటిలాగా శాటిలైట్ ఫీడ్‌లు, డిజిటల్ ప్రొజెక్షన్లు, క్యూబ్ టెక్నాలజీలు లేవు. భారీ ఫిలిం రీళ్లను ప్రొజెక్టర్లలో తిప్పుతూ సినిమాను నడిపించేవారు. కొన్ని టెంట్ హాల్స్‌లో ఒకే ప్రొజెక్టర్ ఉండటం వల్ల ఒక రీల్ పూర్తయ్యాక రెండోది ఎక్కించడానికి తప్పనిసరిగా సమయం పట్టేది. పెద్ద థియేటర్లలో డ్యూయల్ ప్రొజెక్టర్లు ఉన్నప్పటికీ, అప్పట్లో సినిమాలు దాదాపు మూడు నుంచి మూడున్నర గంటల సుదీర్ఘ నిడివితో ఉండేవి. అంతసేపు ప్రొజెక్టర్‌ను నిరంతరాయంగా నడపడం, భారీ రీళ్ల మార్పిడిని సమన్వయం చేసుకోవడం థియేటర్ ఆపరేటర్లకు పెద్ద సవాలుగా మారేది. ఆ రీల్ మార్పిడి వ్యవధిలో తెర చీకటిగా మారితే ప్రేక్షకులు అసహనానికి గురవుతారని, దానికి ‘ఇంటర్వెల్’ అనే ముసుగు వేసి 10 నుంచి 15 నిమిషాల విరామం ఇవ్వడం స్టార్ట్ చేశారు.

SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!తెలంగాణSwechaa13 Sep 2026, 03:11 PM

SingareniCoal: భారీ వర్షాలు.. సింగరేణి గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి!

 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా సింగరేణి సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. ఉమ్మడి వరంగల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల నిర్వహణ స్తంభించిపోయింది. వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో గనుల్లో తవ్వకాలు నిలిచిపోయి కార్మికులు, యాజమాన్యం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

చిత్రం లేదు
తెలంగాణSwechaa13 Sep 2026, 03:09 PM

రేవంత్‌కు అందరికంటే ముందు సపోర్టు ఇచ్చిందే నేనే.. కానీ! :కొండా సురేఖ

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పదవులు, తెరచాటు రాజకీయాలపై మాజీమంత్రి కొండా సురేఖ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘పదవులు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. ప్రజల్లో ఉండేవాళ్లే అసలైన నాయకులు’ అని కొండా సురేఖ అన్నారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన కార్యకర్తలు, ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను ఎంపీటీసీ నుంచి మంత్రి స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో కార్యకర్తలంతా తన వెన్నంటే నిలిచారని చెప్పారు. గతంలో ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ బంధం అలాగే కొనసాగేదని.. ఇప్పుడు అవకాశవాద రాజకీయం పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ‘కొండా’ ఫ్యామిలీకి గుర్తింపు ఉందని చెప్పారు. వైఎస్ జగన్ కోసం నాడు క్షణం ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు తమను కంటికిరెప్పలా కాపాడారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Medak BJP: మెదక్ బీజేపీలో ముదిరిన లడాయి.. జోడెడ్లా? కొమ్ముల పోట్లాటా?తెలంగాణSwechaa13 Sep 2026, 03:03 PM

Medak BJP: మెదక్ బీజేపీలో ముదిరిన లడాయి.. జోడెడ్లా? కొమ్ముల పోట్లాటా?

ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బయటకు అంతా సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా నేతల మధ్య ఈగోలు, ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరాయి. సొంత పార్టీ నిర్వహించే కీలక ఆందోళన కార్యక్రమాలకు ముఖం చాటేస్తూ, ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రైవేట్ వేదికలపై నవ్వులు చిందిస్తున్న ఓ కాషాయ ప్రజాప్రతినిధి తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అనుసరిస్తున్న వింత వైఖరి పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతోంది.

కోమట్ల వద్ద  కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణSwechaa13 Sep 2026, 02:54 PM

కోమట్ల వద్ద  కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి

 హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్యవైశ్య సమాజం ప్రాముఖ్యత, వారి ఆర్థిక వ్యూహాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార దార్శనికత కలిగిన ఆర్యవైశ్యులు వందల, వేల సంవత్సరాల కిందే బంగారం ధరలు పెరుగుతాయని ముందే ఊహించారని కొనియాడారు. ఎంతటి పేద కోమటి ఇంట్లో చూసినా కనీసం కోడిగుడ్డంత బంగారమైనా ఉంటుందని, ఆర్థిక నిల్వలు, పొదుపు సూత్రాలను ప్రపంచానికి నేర్పిన ఘనత ఈ వర్గానిదేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ కార్మికుల బంధీ.. తిండి, నీళ్లు లేక బాధితుల ఆవేదన!తెలంగాణSwechaa13 Sep 2026, 02:19 PM

ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ కార్మికుల బంధీ.. తిండి, నీళ్లు లేక బాధితుల ఆవేదన!

 జీహెచ్‌ఎంసీ పరిధిలో చెత్త సేకరణ బాధ్యతలను 'రాంకీ' అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన స్వచ్ఛ ఆటో, చెత్త సేకరణ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని ఎల్బీ స్టేడియంలో బంధించడం తీవ్ర కలకలం రేపింది. తమ ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మండిపడుతూ కార్మికులు ఆందోళనకు దిగగా, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేడియం ప్రాంగణానికి తరలించారు. ఈ అనూహ్య చర్యతో నగరంలో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన ప్రైవేట్, ఒప్పంద కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏఐ మనుషులను చంపగలదా?.. నిపుణుల వరుస రాజీనామాలు.. సంచలన హెచ్చరికలు!InternationalSwechaa13 Sep 2026, 02:01 PM

ఏఐ మనుషులను చంపగలదా?.. నిపుణుల వరుస రాజీనామాలు.. సంచలన హెచ్చరికలు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవాళికి తీవ్రమైన ప్రమాదంగా మారగలదా? ఏఐ వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు ఉందా? అనే అంశంపై ప్రముఖ ఏఐ పరిశోధన సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకంతకూ శక్తివంతమవుతున్న ఏఐ సాంకేతికత వల్ల భవిష్యత్తులో తలెత్తే పరిణామాలపై ఆయన స్పందిస్తూ స్పష్టమైన సూచనలు చేశారు. మనం సరైన భద్రతా మార్గాన్ని ఎంచుకుంటే ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని, ఒకవేళ తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటే మానవాళికి ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పు ఊహించలేనంత భయంకరంగా మారుతుందని హెచ్చరించారు.

ప్రియుడి కోసం తల్లి హత్య.. కొడుకుని వదిలి పరార్!క్రైమ్Swechaa13 Sep 2026, 01:52 PM

ప్రియుడి కోసం తల్లి హత్య.. కొడుకుని వదిలి పరార్!

వివాహేతర సంబంధం ముసుగులో ఓ మహిళ దారి తప్పింది. తనకు జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా అడ్డుతొలగించుకోవడానికి ప్రయత్నించింది.చివరకు ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. తల్లిని అంతమొందించడంతో పాటు కన్న కొడుకును కూడా వదిలేసి పరార్ అయ్యింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు క్యాబిన్‌పేటలో చోటుచేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. కట్టుకున్న భర్త మరణించడంతో కుమారుడితో కలిసి తల్లి వద్దే ఉంటున్న పుష్పలతకు.. రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కాస్త పుష్పలత తల్లి లక్ష్మి (48) తెలియడంతో... అతనికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయితే, తమ ఏకాంతానికి తల్లి లక్ష్మి అడ్డుగా ఉందని భావించిన పుష్పలత.. ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసింది.

ముంబయి ట్రాఫిక్ పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు!!..NationalSwechaa13 Sep 2026, 01:31 PM

ముంబయి ట్రాఫిక్ పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు!!..

ముంబయి ట్రాఫిక్‌.. చివరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా ఇబ్బంది పెట్టింది. వర్లీ నుంచి బయల్దేరిన గడ్కరీ.. ట్రాఫిక్‌లో చిక్కుకుని కార్యక్రమానికి గంట ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ముంబయి రోడ్ల పరిస్థితిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఫ్లైఓవర్లు, మౌలిక వసతులు.. పెరుగుతున్న వాహన రద్దీకి సరిపోవడం లేదన్నారు. పాత ఫ్లైఓవర్ల స్థానంలో ఆధునిక సాంకేతికతతో మల్టీ-లెవల్ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్ నగరాలకు ఇదే పరిష్కారమని గడ్కరీ స్పష్టం చేశారు.

Congress : పార్టీ ఫిరాయిస్తే 10 ఏళ్లు  నిషేధం విధించాలి : కపిల్ సిబల్NationalSwechaa13 Sep 2026, 01:25 PM

Congress : పార్టీ ఫిరాయిస్తే 10 ఏళ్లు నిషేధం విధించాలి : కపిల్ సిబల్

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సరిపోవడం లేదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పూర్తిగా మార్చాలని చెప్పారు. పార్టీ మారే ప్రజాప్రతినిధుల కోసం కఠిన నిబంధనలు తేవాలన్నారు. మధ్యలో పార్టీ మారిన ప్రజాప్రతినిధిని పదేళ్ల పాటు ప్రభుత్వ పదవి,ప్రజా పదవి లేదా రాజ్యాంగబద్ధమైన హోదా చేపట్టకుండా నిషేధించాలని అన్నారు. అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందని కీలక ప్రతిపాదన చేశారు. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ‘ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్’ నిర్వహించిన ‘హార్స్-ట్రేడ్ అండ్ డెమోక్రసీ’ అంశంపై ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిపైనే కాకుండా, రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేసే కొత్త తరహా ఫిరాయింపులపైనా పదేండ్ల నిషేధం విధించాలని సిబల్ వెల్లడించారు.యాంటీ డిఫెక్షన్ చట్టంలోని రూల్స్ ఎలా దుర్వినియోగానికి గురయ్యాయో చెప్పేందుకు గతంలోని బీఎస్పీ ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

ఫ్రీ బస్సులో సీటు కోసం లొల్లి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!వైరల్ న్యూస్Swechaa13 Sep 2026, 01:08 PM

ఫ్రీ బస్సులో సీటు కోసం లొల్లి.. జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు!

 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి మహిళల మధ్య సీట్ల కోసం గొడవలు పడటం నిత్యకృత్యమవుతున్నాయి. తాజాగా పరిగి డిపో నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక పల్లె వెలుగు బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళా ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగారు. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్సులో సీటు దక్కించుకునే క్రమంలో మొదలైన మాటల యుద్ధం, క్షణాల్లోనే పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లి బస్సులో ఉద్రిక్తత నెలకొంది.  

సైమా వేదికపై తెలుగు తారల మెరుపులు!!..సినిమాSwechaa13 Sep 2026, 12:50 PM

సైమా వేదికపై తెలుగు తారల మెరుపులు!!..

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభకు పట్టం కట్టే ప్రతిష్టాత్మక వేదిక.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్.. సైమా 2026 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో వేదిక మొత్తం సందడిగా మారింది.

మాజీ మంత్రి ‘కొండా’కు కీలక పదవి? బ్యాలెన్స్ చేస్తారా?తెలంగాణSwechaa13 Sep 2026, 12:23 PM

మాజీ మంత్రి ‘కొండా’కు కీలక పదవి? బ్యాలెన్స్ చేస్తారా?

మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆమె పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆమె దూరంగా ఉన్నారు. దీంతో కొండా సురేఖ ఏం చేస్తున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? పార్టీలో ఉంటారా? వేరే పార్టీలోకి వెళ్తారా? అనే చర్చ మరోసారి మొదలైంది. మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించాకా? ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలకు తెరలేపుతారని అంతా భావించారు. కానీ, ఆమె మాత్రం పదవికి రాజీనామా చేయబోనని..కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఇదిలాఉండగా, కొండా సురేఖ పార్టీ మీద, సీఎం రేవంత్, కీలక నేతల మీద అలకబూనినట్టు అధిష్టానం గుర్తించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొండా సురేఖకు కీలక పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచన చేసినట్టు తెలుస్తోంది. TPCC అధ్యక్షురాలిగా ఆమెకు అధిష్టానం బాధ్యతలు అప్పగించనుందని సమాచారం. ఈ విషయంపై చర్చలు జరిపేందుకే.. హస్తినకు రావాల్సిందిగా అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.

జావా సముద్రంలో మునిగిన నౌక.. 240 మంది గల్లంతు!ప్రపంచంSwechaa13 Sep 2026, 11:59 AM

జావా సముద్రంలో మునిగిన నౌక.. 240 మంది గల్లంతు!

ఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక అకస్మాత్తుగా గల్లంతయ్యింది. దీంతో వందల మంది నడిసంద్రంలో గల్లంతు అయినట్టు సమాచారం. విషయం తెలియడంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. ఇండోనేషియా తూర్పు జావాలోని సురబయ నుంచి దక్షిణ కలిమంతన్ ప్రాంతంలోని బంజర్మసిన్‌కు ప్రయాణికులతో బయలుదేరిన విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8 నౌక అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుంది. సముద్రంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్స్ కోల్పోయి, కమ్యూనికేషన్ కట్ అయినట్టు తెలిసింది. ఆ సమయంలో నౌకలో సుమారు 240 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌పై లాడెన్ కన్ను!InternationalSwechaa13 Sep 2026, 11:48 AM

సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌పై లాడెన్ కన్ను!

 అల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ 2001 సెప్టెంబర్ 11న అమెరికాపై జరిపిన భీకర ఉగ్రదాడులకు కంటే ముందే భారత్‌ను తన దాడి లక్ష్యాల (హిట్ లిస్ట్) జాబితాలో చేర్చినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) తాజాగా విడుదల చేసిన అత్యంత రహస్య పత్రాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. 9/11 దాడులకు సంబంధించిన 100 పేజీలకు పైగా నిఘా సమాచారంతో కూడిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ డైలీ బ్రీఫ్‌లను CIA ప్రజల ముందుకు ఉంచడంతో ఈ చారిత్రక నిజాలు బయటపడ్డాయి.

ఫిలిప్పీన్స్‌లో ఘోర బోటు ప్రమాదం: 76కు చేరిన మృతుల సంఖ్యInternationalSwechaa13 Sep 2026, 11:21 AM

ఫిలిప్పీన్స్‌లో ఘోర బోటు ప్రమాదం: 76కు చేరిన మృతుల సంఖ్య

ఫిలిప్పీన్స్ దేశంలో సంభవించిన భయంకరమైన టూరిస్ట్ బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజధాని మనీలా నుంచి సుమారు 130 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక పర్యాటక బోటులో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో క్షణాల్లో మంటలు దట్టంగా వ్యాపించాయి. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ప్రయాణికులు బయటకు రావడానికి సరైన ద్వారాలు, మార్గాలు లేకపోవడంతో చాలామంది బోటులోనే చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?సినిమాSwechaa13 Sep 2026, 11:18 AM

Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?

Vishwak Sen: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోలలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. గత చిత్రాలు వరుసగా వచ్చి ఫ్లాపైయ్యాయి. అయినా, ఇప్పుడు 36 రోజుల్లో మూడు డిఫరెంట్ జానర్ సినిమాలతో రాబోతున్నాడు. ఇలా, స్టార్ హీరోలు కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలను రిలీజ్ చేయలేదు.