స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?సినిమాSwechaa13 Sep 2026, 11:18 AM

Vishwak Sen: కేవలం 36 రోజులు..3 సినిమాలు విశ్వక్ ఖాతాలో హిట్స్ ఎన్ని?

Vishwak Sen: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ మ్యానరిజం, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరోలలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. గత చిత్రాలు వరుసగా వచ్చి ఫ్లాపైయ్యాయి. అయినా, ఇప్పుడు 36 రోజుల్లో మూడు డిఫరెంట్ జానర్ సినిమాలతో రాబోతున్నాడు. ఇలా, స్టార్ హీరోలు కూడా ఇంత తక్కువ గ్యాప్‌లో మూడు సినిమాలను రిలీజ్ చేయలేదు.

యువకుడి ఇంటి కూల్చివేత.. ఏడుగురు నిందితుల అరెస్టుతెలంగాణSwechaa13 Sep 2026, 11:04 AM

యువకుడి ఇంటి కూల్చివేత.. ఏడుగురు నిందితుల అరెస్టు

స్వేచ్ఛ న్యూస్,గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు జేసీబీ సాయంతో కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.గద్వాల మండలం రేపల్లి గ్రామంలో ఈ నెల 10న వివాహం చేసుకున్న యువకుడి ఇంటిని ధ్వంసం చేసిన ఘటనపై గద్వాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో టీ. వీరన్న, పరశురాములు @ పరుష, వెంకటేష్‌ @ టీ. వెంకటేష్‌ నాయుడు, పరశురాములు, రామాంజనేయులు, గోపాల్‌, తిమ్మన్న @ తిమ్మప్పలను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం నిందితులను అలంపూర్‌ జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి న్యాయ రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు.

రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, అజిత్ సర్‌ప్రైజ్.. ఫొటోలు వైరల్!వైరల్ న్యూస్Swechaa13 Sep 2026, 10:52 AM

రేసింగ్ ట్రాక్‌పై సీఎం విజయ్, అజిత్ సర్‌ప్రైజ్.. ఫొటోలు వైరల్!

 తమిళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్న హీరో అజిత్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ మధ్య జరిగిన అరుదైన ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బ్రిటన్‌లోని ప్రఖ్యాత 'సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్' వేదికగా వీరిద్దరూ కలుసుకోవడం తమిళ నాట, క్రీడా, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ఒకే వేదికపై ఇద్దరు దిగ్గజాలు నవ్వుతూ కనిపించడం అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.

లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు.. కార్లకు నిప్పు, భారీగా ఆస్తుల ధ్వంసంప్రపంచంSwechaa13 Sep 2026, 10:40 AM

లాస్ ఏంజెల్స్‌లో అల్లర్లు.. కార్లకు నిప్పు, భారీగా ఆస్తుల ధ్వంసం

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అల్లరిమూకలు రెచ్చపోయారు.నగరంలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ (ICE) విభాగం చేపట్టిన కఠినమైన వలస విధానాలు, దాడులకు నిరసనగా పెద్ద ఎత్తున అల్లర్లు, ఉద్రిక్తతలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వందలాది మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌లోని రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో భద్రతాబలగాలు వెంటనే రంగంలోకి దిగాయి. మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ (Metropolitan Detention Center) వెలుపల వేలాది మంది ప్రదర్శనకారులు గుమిగూడి ఫెడరల్ ఏజెంట్లపైకి రాళ్లు, సీసాలు విసిరినట్టు సమాచారం. కొందరు అల్లరిమూకలు దుకాణాల అద్దాలు పగలగొట్టి, వస్తువులను లూటీ చేసినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఖరీదైన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టడంతో పాటు ప్రభుత్వ బస్సులు, భవనాలపై గ్రాఫిటీ రాసి ధ్వంసం చేసినట్టు కథనాలు వస్తున్నాయి.

80s Trend: 80s ఫొటోల ట్రెండ్.. పర్యావరణానికి ఎంత ముప్పో తెలుసా?InternationalSwechaa13 Sep 2026, 10:25 AM

80s Trend: 80s ఫొటోల ట్రెండ్.. పర్యావరణానికి ఎంత ముప్పో తెలుసా?

 సోషల్ మీడియా వినియోగంతో స్కామర్ల నుంచి ముప్పు అని విన్నాం కానీ, పర్యావరణానికి ముప్పు కలగడం ఏంటని అనుకుంటున్నారా? అవును.. నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌తో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో '1980ల నాటి ఏఐ ఫోటోల' (80s AI Trend) ట్రెండ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. తమ సాధారణ సెల్ఫీలను అప్‌లోడ్ చేసి, 80వ దశకం నాటి రెట్రో లుక్, వింటేజ్ దుస్తులు, పాతకాలపు హెయిర్‌స్టైల్స్‌తో కూడిన చిత్రాలుగా మార్చుకునేందుకు నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపిస్తున్నారు.

Dil Raju-The Paradise: దిల్ రాజుకి దక్కని 'ది ప్యారడైజ్' రైట్స్!సినిమాSwechaa13 Sep 2026, 10:13 AM

Dil Raju-The Paradise: దిల్ రాజుకి దక్కని 'ది ప్యారడైజ్' రైట్స్!

The Paradise: టాలీవుడ్ అగ్ర నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా 'ది ప్యారడైజ్' థియేట్రికల్ రైట్స్ దక్కలేదు. సాధారణంగా ఒకప్పుడు చిన్న సినిమా నుంచి పెద్ద హీరో సినిమా వరకూ ఎక్కువశాతం నైజంలో సినిమాను డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు దక్కించుకునేవాడు. కానీ, గత కొన్నేళ్లుగా ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి, పోటీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో నాని సినిమా అయినా కూడా దిల్ రాజు దక్కించుకోలేకపోయాడు.

అమీర్‌పేటలో  ఘోరప్రమాదం.. యువతి దుర్మరణంక్రైమ్Swechaa13 Sep 2026, 10:10 AM

అమీర్‌పేటలో ఘోరప్రమాదం.. యువతి దుర్మరణం

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి మొబైల్ రిపేర్ కోసం వెళ్తుండగా.. బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.ఆమె వెంట ఉన్న ర్యాపిడో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..ఏపీలోని భీమవరానికి చెందిన హేమదుర్గ (26) బంజారాహిల్స్‌లోని ఓ కార్ల కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె వినియోగిస్తున్న మొబైల్ పాడవడంతో రిపేర్ కోసం అమీర్ పేట వెళ్లేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలోనే ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని బయలు దేరింది. అయితే, అమీర్ పేట శ్రీనగర్ కాలనీ సమీపంలో బిగ్ బజార్ వెనుక గేటు వద్ద ర్యాపిడో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్టు సమాచారం.దీంతో ర్యాపిడో రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న హేమదుర్గ ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో రైడర్‌కు స్వల్ప గాయాలు అవ్వగా.. ఉద్యోగిని హేమదుర్గకు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం.

Delhi: ఢిల్లీలో ఉత్కంఠ.. భారత్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20కి వర్షం ముప్పు..!క్రీడలుSwechaa13 Sep 2026, 09:51 AM

Delhi: ఢిల్లీలో ఉత్కంఠ.. భారత్-ఆఫ్ఘనిస్థాన్ తొలి టీ20కి వర్షం ముప్పు..!

 భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ఇవాళ (ఆదివారం) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌పై వర్షం నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంకేతాలు ఇవ్వడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పోరు సజావుగా సాగుతుందా లేదా వర్షం కారణంగా రద్దవుతుందా అనే దానిపై క్రీడా వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాతావరణ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం మ్యాచ్ జరిగే ఆదివారం ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం దాదాపు 64 శాతంగా ఉంది.

హైదరాబాద్‌ను కమ్మేసిన మేఘాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు!!..తెలంగాణSwechaa13 Sep 2026, 09:48 AM

హైదరాబాద్‌ను కమ్మేసిన మేఘాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు!!..

భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ముసురుతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలైన కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ, మూసాపేట్, ప్రగతినగర్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్‌లలో తెల్లవారుజాము నుంచే వాన జోరుగా కురుస్తోంది. అటు ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్‌లతో పాటు.. లింగంపల్లి, చందానగర్, మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. ఉదయం నుంచే ఆకాశం పూర్తిగా మేఘావృతమై, చీకట్లు కమ్ముకోవడంతో వాతావరణం చల్లబడింది. ఈ హఠాత్తు వర్షంతో ఉదయాన్నే ఆఫీసులకు, పనులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రియుడిని నమ్మివెళ్లినందుకు ముక్కలుగా నరికాడుక్రైమ్Swechaa13 Sep 2026, 09:41 AM

ప్రియుడిని నమ్మివెళ్లినందుకు ముక్కలుగా నరికాడు

ప్రేమ, వివాహేతర సంబంధం మోజులో పడి కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కొందరు భర్తలు, అత్తమామలు,పేగు తెంచుకుని పుట్టిన పిల్లలను కడతేరుస్తుంటే.. మరికొందరు తమ కోసం వచ్చిన ప్రియురాలినే అంతం చేస్తున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు గాను ఓ వ్యక్తి ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని కనిపించకుండా చేశాడు. వివరాల్లోకివెళితే.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన స్వప్న(40) భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.గతంలో తల్లిదండ్రులతో కలిసి పూజ కోసం బళ్లారికి వెళ్లినప్పుడు అక్కడ ఆమెకు డ్రైవర్ బసవరాజ్‌తో పరిచయం ఏర్పడింది.అది కాస్త వివాహేతర బంధానికి దారితీయగా పెళ్లి చేసుకోవాలని బసవరాజ్‌ను కోరిన స్వప్న కోరింది. అతను ఒప్పుకోకపోవడంతో స్వప్న బ్లాక్ మెయిల్ చేయగా.. ఆమెను హత్య చేసి ముక్కలుగా నరికినట్టు సమాచారం.

TibetEarthquake: చైనా టిబెట్‌లో 5.3 తీవ్రతతో ప్రకంపనలు.. నేపాల్‌లో 'ఫ్లడ్ అలర్ట్'!NationalSwechaa13 Sep 2026, 09:36 AM

TibetEarthquake: చైనా టిబెట్‌లో 5.3 తీవ్రతతో ప్రకంపనలు.. నేపాల్‌లో 'ఫ్లడ్ అలర్ట్'!

చైనాలోని టిబెట్ ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించి ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు భూవిజ్ఞాన కేంద్రం అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న నేపాల్‌లోని పలు ఉత్తర, పశ్చిమ జిల్లాల్లోనూ స్పష్టంగా కనిపించడంతో సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. టిబెట్ సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్‌లోని హిమ నదులు, పర్వత ప్రాంతాలు తీవ్ర ప్రకంపనలకు గురికావడంతో పర్వత హిమపాతం (మంచు చరియలు విరిగిపడటం) లేదా హిమనదీయ సరస్సులు తెగిపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ధరణి-భూ భారతి ఒక్కటే!!..తెలంగాణSwechaa13 Sep 2026, 09:25 AM

ధరణి-భూ భారతి ఒక్కటే!!..

బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై 22ఏ నిషేధిత జాబితా భూములకు సంబంధించి కాంగ్రెస్‌ నేతలు ముప్పేట దాడికి దిగారు. ఆరోపణలకు జవాబివ్వకుండా చర్చను పక్కదోవ పట్టించేందుకు అసెంబ్లీలో శతవిధాలా యత్నించారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. నిషేధిత జాబితా మాటున ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణాలకు, క్విడ్‌ ప్రోకో పద్దతిలో పాల్పడుతున్నదని నిప్పులు చెరిగారు.

పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలు.. మహిళా బీఎల్‌వోపై దాడితెలంగాణSwechaa13 Sep 2026, 09:17 AM

పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలు.. మహిళా బీఎల్‌వోపై దాడి

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ఐఆర్‌ లిస్టులో పేరు లేనివారికి, తప్పులు ఉన్నవారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. అందుకు సమాధానాలు ఇవ్వాలని ఓటర్లను కోరింది. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి సుమారు కోటి ఓట్లు పోతాయని తెలుస్తోంది. ఇటీవల ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇప్పటికే 70 లక్షలకుపైగా ఓట్లు గల్లంతు అవ్వగా.. మరో 25 లక్షల మంది నుంచి ఎస్ఐఆర్ ఫామ్స్ తిరిగి రాలేదని సమాచారం. ఇదిలాఉండగా, పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. బీఎల్‌వో అధికారుల మీద దాడులకు పాల్పడుతున్నట్టు వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా పాతబస్తీలో ఓ మహిళా బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్)పై దాడి జరిగింది. ఎంఐఎం పార్టీ నేత హసన్ మహిళా అధికారిణిపై దాడి చేసి చంపుతానని బెదిరించినట్టు తెలిసింది. దీంతో బాధితులురాలు ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

SWECHAA EFFECT: 22ఏ ఇష్యూను నెల రోజుల్లోనే అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన స్వేచ్ఛ న్యూస్స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa13 Sep 2026, 09:12 AM

SWECHAA EFFECT: 22ఏ ఇష్యూను నెల రోజుల్లోనే అసెంబ్లీ దాకా తీసుకొచ్చిన స్వేచ్ఛ న్యూస్

ధరణి పేరుతో బీఆర్ఎస్ హయాంలో భూములు దోచుకున్నారు. ఇప్పుడు భూ భారతి పేరుతో అదే దోపిడీ కొనసాగుతోంది. ఈ విషయాన్ని స్వేచ్ఛ న్యూస్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. 22ఏ అంశంలో సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని మొదట వెలుగులోకి తెచ్చింది స్వేచ్ఛ న్యూస్. ఇష్టానుసారంగా రాత్రికి రాత్రే ప్రైవేట్ భూమి 22ఏ లోకి వెళ్లడంపై ప్రశ్నిస్తూ కథనాలు రాసింది. ధరణి బిడ్డనే భూ భారతి అంటూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. నెల రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం!!..తెలంగాణSwechaa13 Sep 2026, 09:06 AM

ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం!!..

నెల రోజుల క్రితం రవ్వంతగా మొదలైన 22ఏ సమస్య.. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసింది! ఈ వ్యవహారంపై మొదటి నుంచీ ఫైట్ చేసింది స్వేచ్ఛ న్యూస్. అధికారుల అక్రమ వ్యవహారాలను ఆధారాలతో పసిగట్టి, పట్టుదలతో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ధరణి బిడ్డే భూభారతి.. దగా మాత్రం సేమ్ టు సేమ్ అంటూ నెల రోజుల క్రితమే స్వేచ్ఛ న్యూస్ హెచ్చరించింది. ‘ధరణి దగా.. భూభారతి హారతి’ అంటూ క్యాంపెయిన్ నడిపింది. ఇప్పుడు అదే అంశం పొలిటికల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఆధారాలు.. కావాల్సిన వారికి కోకొల్లలుగా ఇస్తాం. ఇదే స్వేచ్ఛ న్యూస్ ఫైట్!

ప్రపంచానికి కొత్త టెన్షన్.. ఏఐ విస్తరణతో నీటి సంక్షోభం ముప్పు!?..InternationalSwechaa13 Sep 2026, 08:45 AM

ప్రపంచానికి కొత్త టెన్షన్.. ఏఐ విస్తరణతో నీటి సంక్షోభం ముప్పు!?..

ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సినిమాల్లో మాత్రమే కనిపించే ఊహాజనిత ప్రపంచం.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. మన చుట్టూ ఏదో ఒక రూపంలో AI పనిచేస్తూనే ఉంది. మనం చూసే సోషల్ మీడియా పోస్టుల నుండి.. మనం వింటున్న పాటలు, చూస్తున్న వీడియోలు, షాపింగ్ చేసే వస్తువుల సూచనల వరకు.. AI ప్రభావం రోజువారీ జీవితంలోకి చొచ్చుకొచ్చింది.

Aadarsha Kutumbam-Trivikram: ప్రమోషన్స్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!సినిమాSwechaa13 Sep 2026, 08:42 AM

Aadarsha Kutumbam-Trivikram: ప్రమోషన్స్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్!

Aadarsha Kutumbam: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. విక్టరీ వెంకటేష్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. ఇతర కీలక పాత్రల్లో నివేతా పేతురాజ్, నారా రోహిత్ కనిపించబోతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా, ‘ఆదర్శ కుటుంబం’ నుంచి టీజర్ వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని రేకిత్తించగా..ఇప్పుడు గురూజీ స్పెషల్‌గా ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నాడు.

జీలకర్ర నీటితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!!..HealthSwechaa13 Sep 2026, 08:36 AM

జీలకర్ర నీటితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు!!..

మన వంటింట్లో రోజూ వాడే జీలకర్ర కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు జీలకర్ర నీళ్లు తాగడం వల్ల ఒంటికి లభించే మేలు అంతా ఇంతా కాదని అంటారు. జీలకర్ర నీరు జీర్ణ వ్యవస్థకు తిరుగులేని ఔషధంగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం, వికారం, అతిగా వచ్చే త్రేన్పుల సమస్యలు తగ్గుతాయి. మన జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చి, ఆకలిని పెంచుతుంది. అలాగే కడుపులో ఏర్పడే అల్సర్లు, మలబద్ధకం, మొలల సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

ఉదయాన్నే ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి!!..HealthSwechaa13 Sep 2026, 08:28 AM

ఉదయాన్నే ఈ అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి!!..

ఉదయాన్నే ఒక గ్లాస్ పండ్ల రసం తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, త్వరగా బరువు తగ్గొచ్చని చాలామంది భావిస్తారు. కొందరైతే బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా కేవలం జ్యూస్‌లతోనే కడుపు నింపేస్తుంటారు. కానీ పరగడుపున ఇలా జ్యూస్‌లు తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నారింజ, బత్తాయి, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకున్నప్పుడు కడుపులో ఆమ్లత్వం విపరీతంగా పెరిగి గ్యాస్, తీవ్రమైన ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.

గణపతి పండుగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు చెబుతారు?SpiritualitySwechaa13 Sep 2026, 08:18 AM

గణపతి పండుగ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని ఎందుకు చెబుతారు?

వినాయక చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల నీలాపనిందలు వస్తాయని గణేశ పురాణం, ఇతర సంప్రదాయ కథనాల్లో చెప్పబడింది. అసలు దీనికి కారణమేంటి అంటే.. ఒకసారి గణపతి తన భక్తుల ఇళ్లకు వెళ్లి పూజలు స్వీకరించి, ప్రసాదాలు స్వీకరిస్తూ రాత్రివేళ తన వాహనమైన మూషికంపై తిరిగి వస్తుండగా, ఆయనను చూసిన చంద్రుడు గణపతి రూపాన్ని చూసి పరిహాసంగా నవ్వాడని పురాణ కథనం. చంద్రుడి అందం, గర్వానికి ప్రతీకగా భావిస్తారు. ఆ గర్వంతో గణపతిని అవహేళన చేయడంతో వినాయకుడు చంద్రుడిని శపించాడని కథ చెబుతుంది. ఆ శాపంలో భాగంగానే చంద్రుడిని చూసినవారిపై నిందలు పడతాయని పురాణాలు వివరిస్తాయి.

గణపతి పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు!.SpiritualitySwechaa13 Sep 2026, 08:08 AM

గణపతి పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు!.

తొలిపూజలందుకునే ఆదిదేవుడు, విఘ్న నివారకుడు శ్రీ వినాయకుని జన్మదినమే వినాయక చవితి.. సృష్టిలోని జ్ఞానానికి, బుద్ధికి, వివేకానికి ప్రతీకగా ఆరాధించే దైవతత్వం. అందుకే ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణనాథుడిని స్మరించడం మన సనాతన సంప్రదాయంలో అనాదిగా వస్తున్న ఆచారం.. మన జీవితంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించడంతో పాటు.. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అహంకారం నుంచి వినయం వైపు మనలను నడిపించమని గణపతిని ప్రార్థించే పవిత్ర సందర్భం వినాయక చవితి...అందుకే గణపతి పండుగ రోజు చేసే ప్రతి పని వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుందని చెబుతారు. అదే సమయంలో కొన్ని పనులను చేయకూడదని పెద్దలు పేర్కొంటారు.

The Paradise-Promotions: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?సినిమాSwechaa12 Sep 2026, 10:35 PM

The Paradise-Promotions: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?

The Paradise: నేచురల్ స్టార్ నానిని మునుపెన్నడూ చూడని ఓ వింత గెటప్ అండ్ రోల్‌లో చూడబోతున్నాము. ఆ సినిమానే ది ప్యారడైజ్. ఇందులో హీరోయిన్‌గా ఫుల్ ఫాంలో ఉన్న బ్యూటీ కయాదు లోహర్ నటించింది. కీలక పాత్రల్లో కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో అలరించబోతోంది. దసరా లాంటి కల్ట్ క్లాసిక్‌ని తీసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!తెలంగాణSwechaa12 Sep 2026, 10:03 PM

Garika Puja: గరిక పూజతో వినాయకుడు ఎందుకు ప్రసన్నుడవుతాడు? అసలు రహస్యమిదే!

Garika Puja: హిందూ సంప్రదాయంలో విఘ్నాధిపతి అయిన వినాయకుడి పూజకు విశిష్టమైన స్థానం ఉంది. వినాయక చవితి లేదా నిత్య పూజల్లో మాచీ పత్రం, బృహతీ పత్రం, దత్తూర పత్రం, అర్క పత్రం వంటి 21 రకాల దివ్య ఔషధ గుణాలు కలిగిన 'ఏకవింశతి పత్రాల'తో స్వామిని ఆరాధిస్తాం. ఎన్ని రకాల సుగంధ పుష్పాలు, విశేష పత్రాలు సమర్పించినప్పటికీ.. చివరకు గడ్డి జాతికి చెందిన చిన్న 'గరిక' లేకపోతే గణపతి పూజ అసంపూర్ణంగానే భావిస్తారు. అసలు సాక్షాత్తు దేవదేవుళ్లందరూ చేయలేని ఉపశమనాన్ని కేవలం గరిక మాత్రమే ఎలా ఇవ్వగలిగింది? గరిక పూజ వెనుక దాగి ఉన్న పురాణ రహస్యం ఏమిటి? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.పురాణాల ప్రకారం పూర్వం 'అనలాసురుడు' (అనగా అగ్ని స్వరూపుడైన రాక్షసుడు) అనే రాక్షసుడు సమస్త లోకాలను, దేవతలను, మునులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. అతని అరాచకాల నుంచి కాపాడాలని దేవతలంతా వెళ్లి విఘ్నేశ్వరుడిని శరణు వేడారు. అప్పుడు లోక రక్షణ కోసం ఆ విఘ్ననాయకుడు ఏకంగా ఆ రాక్షసుడిని అమాంతం మింగివేశాడు. అయితే, అగ్ని తత్వమున్న రాక్షసుడిని మింగిన తర్వాత వినాయకుడి ఉదరంలో, శరీరంలో తీవ్రమైన మంటలు, విపరీతమైన వేడి పుట్టుకొచ్చాయి. ఆ వేడిని తగ్గించడానికి దేవతలంతా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.

22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చిందితెలంగాణSwechaa12 Sep 2026, 09:48 PM

22ఏ కొత్తది కాదు.. 27ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది

22A Row: తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి 22ఏ అంశంపై మాట్లాడారు. కీలక విషయాలు వెల్లడించారు. నిషేధిత భూముల జాబితా (22ఏ) కొత్తగా వచ్చింది కాదని, గతంలో ఉన్నదేనని మంత్రి పొంగులేటి తెలిపారు. 22ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది కాదన్నారు. 27ఏళ్ల క్రితమే 1999లో ప్రభుత్వ భూములను కాపాడేందుకు 22ఏ తీసుకొచ్చారని వెల్లడించారు.

Srikanth Odela-Yeshanagula Song: ఏషనాగుల సాంగ్ గురించి దర్శకుడేమన్నాడంటే!సినిమాSwechaa12 Sep 2026, 09:40 PM

Srikanth Odela-Yeshanagula Song: ఏషనాగుల సాంగ్ గురించి దర్శకుడేమన్నాడంటే!

Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల..ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కారణం హైదరాబాద్-సికిందరాబాద్ నేపథ్యంగా ది ప్యారడైజ్ అనే టైటిల్‌తో సినిమా చేస్తుండటమే. హైదరాబాద్ మహా నగరానికి ఎంతో పేరుంది. కానీ, ఎవరికీ దీన్ని కేంద్ర బిందువుగా చేసుకొని సినిమా చెయ్యాలని ఆలోచన రాలేదు. శ్రీకాంత్ కి వచ్చింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అందరి చూపు ఉంది.

Modi - Jinping : ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి నడుద్దాం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ!దునియాSwechaa12 Sep 2026, 09:30 PM

Modi - Jinping : ఇరుదేశాల ప్రయోజనాల కోసం కలిసి నడుద్దాం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీతో జిన్‌పింగ్ భేటీ!

Modi - Jinping : ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తూ, భారత్ - చైనా సంబంధాలలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీ అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కొనసాగుతున్న తరుణంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్వయంగా భారత్‌తో కలిసి నడవాలంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి.కేవలం మాటలకే పరిమితం కాకుండా, భారత్‌తో దీర్ఘకాలిక, వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు ప్రకటించడం అత్యంత కీలక పరిణామం. ప్రధానంగా ఇరు దేశాల మధ్య ప్రధాన సమస్యగా మారిన సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక వాణిజ్య లోటు, టెక్నాలజీ రంగాల్లో సహకారం తదితర కీలక అంశాలపై మోడీ, జిన్‌పింగ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆసియాలోని రెండు అగ్రరాజ్యాలు చేతులు కలిపితే అంతర్జాతీయ వాణిజ్య ముఖచిత్రమే మారిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Aadarsha Kutumbam Teaser: నాకో ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు..కానీ!సినిమాSwechaa12 Sep 2026, 08:25 PM

Aadarsha Kutumbam Teaser: నాకో ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు..కానీ!

Aadarsha Kutumbam Teaser: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ సినిమా ఆదర్శ కుటుంబం. ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కేజీఎఫ్, తెలుసు కదా ఫేమ్ శ్రీనిధి శెట్టి వెంకీ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. తాజాగా, ఈ సినిమా నుంచి అందరూ ఎదురుచూస్తున్న టీజర్ రిలీజైంది.

బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదందునియాSwechaa12 Sep 2026, 08:09 PM

బ్రిక్స్ సదస్సు.. ఢిల్లీ డిక్లరేషన్‌కు ఆమోదం

Delhi Declaration : అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ, గ్లోబల్ మార్కెట్లను శాసించేందుకు కొన్ని దేశాలు విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలు, సుంకాల బాదుడుపై బ్రిక్స్ కూటమి సమరశంఖం పూరించింది. ఢిల్లీ వేదికగా ముగిసిన శిఖరాగ్ర సదస్సులో సభ్యదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించిన చారిత్రక ‘ఢిల్లీ డిక్లరేషన్’ ద్వారా గ్లోబల్ ట్రేడ్ ప్రొటెక్షనిజంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.

ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాథమిక సూత్రాలను కాలరాస్తూ సాగుతున్న ఒంటెత్తు పోకడలను ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశాయి.డబ్ల్యూటీవో మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు పాశ్చాత్య దేశాలు అమలు చేస్తున్న ఏకపక్ష వాణిజ్య సుంకాలు ప్రపంచ సరఫరా వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ చట్టాల పరిధికి బయట తీసుకుంటున్న ఆర్థిక నిర్బంధ చర్యలు కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలనే కాక, యావత్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని హెచ్చరించారు. ఈ విధ్వంసకర వాణిజ్య ఆంక్షలను తక్షణమే నిలిపివేయాలని, పారదర్శకమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థే అందరి అభివృద్ధికి ఏకైక పరిష్కారమని ‘ఢిల్లీ డిక్లరేషన్’ తేల్చి చెప్పింది.

Varanasi-Updates: దసరా నుంచి వరుస అప్‌డేట్స్..సినిమాSwechaa12 Sep 2026, 07:52 PM

Varanasi-Updates: దసరా నుంచి వరుస అప్‌డేట్స్..

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ఈ సినిమా నుంచి అప్పుడెప్పుడో వచ్చిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో టైటిల్ గ్లింప్స్..ఆ సమయంలో వచ్చిన సంచారి సాంగ్..మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్‌ల లుక్స్ తప్ప ఇంకేమీ లేదు. ఆ తర్వాత మహేష్ బర్త్ డేకి టీజర్ వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ, అది జరగలేదు. కానీ, తాజా సమాచారం మేరకు దసరా నుంచి వరుస అప్‌డేట్స్ ప్లాన్ చేస్తున్నారట.

Meenakshi Chaudhary-Vrusha Karma: చేతిలో ఉంది ఒక్క సినిమానే..అది గనక అటు ఇటు అయితే!సినిమాSwechaa12 Sep 2026, 07:41 PM

Meenakshi Chaudhary-Vrusha Karma: చేతిలో ఉంది ఒక్క సినిమానే..అది గనక అటు ఇటు అయితే!

Meenakshi Chaudhary: కొంతమంది హీరోయిన్స్‌కి హిట్స్ వస్తున్నా ఎందుకనో ఆశించిన విధంగా అవకాశాలు రాకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు హాట్ బ్యూటీస్‌లో మీనాక్షి చౌదరి పరిస్థితి ఇలాగే ఉంది. హిందీ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్‌కి వచ్చింది మీనాక్షి. ఇక్కడ అప్పుడొకటి అప్పుడొకటి అన్నట్టుగా సినిమాలు చేసింది. ఇప్పుడు, చేస్తున్న సినిమా ఒక్క వృష కర్మ మాత్రమే. దీని తర్వాత మీనూ పరిస్థితేంటీ? అనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ.