స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మీనాక్షి నటరాజన్ ఔట్? కొత్తగా వచ్చేది ఎవరు?తెలంగాణSwechaa14 Sep 2026, 01:30 PM

మీనాక్షి నటరాజన్ ఔట్? కొత్తగా వచ్చేది ఎవరు?

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను త్వరలోనే తప్పించనున్నారని మరోసారి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అధికార పార్టీలో నెలకొన్న పరిస్థితులు, కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించడం, మరో నలుగురు జిల్లా స్థాయి నేతలకు షోకాజు నోటీసులు ఇవ్వడం..పదవుల కోసం కొందరు సీనియర్లు అధికారపార్టీనే టార్గెట్ చేయడం, పదే పదే నేతలు ఢిల్లీకి వస్తూ ఫిర్యాదులు చేస్తుండటంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఏం చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం అయినట్టు తెలుస్తోంది. నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంటే మీనాక్షి నటరాజన్ సరిగా హ్యండిల్ చేయలేకపోతున్నారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె స్థానంలో కొత్తవారిని నియమించేందుకు అధిష్టానం కసరత్తు చేేస్తున్నట్టు తెలిసింది.

ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ దంపతుల తొలి పూజ!తెలంగాణSwechaa14 Sep 2026, 01:19 PM

ఖైరతాబాద్ గణేషుడికి గవర్నర్ దంపతుల తొలి పూజ!

 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భాగ్యనగర ఆధ్యాత్మిక ప్రతీక, ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన ‘శ్రీ పంచముఖి సంకటహర మహాగణపతి’కి తొలి పూజ అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రథమ పూజ నిర్వహించారు. అంతకుముందు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ సమితి సభ్యులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికి ప్రధాన మండపం వద్దకు గౌరవపూర్వకంగా తీసుకెళ్లారు.

తెలంగాణకు కేంద్రం షాక్.. రీజినల్ రింగ్ రోడ్డుకు బ్రేక్!తెలంగాణSwechaa14 Sep 2026, 01:02 PM

తెలంగాణకు కేంద్రం షాక్.. రీజినల్ రింగ్ రోడ్డుకు బ్రేక్!

 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగానికి ‘సూపర్ గేమ్ ఛేంజర్’గా భావిస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టు నిర్మాణంలో కీలక అవరోధం ఏర్పడింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు చెందిన దక్షిణ భాగం (South Segment) ఎలైన్‌మెంట్ ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో పడిపోవడంతో పనుల్లో పురోగతి నిలిచిపోయింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై తీవ్ర అనిశ్చితి నెలకొనగా, శీఘ్రగతిన ఆమోదం తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఏపీలో పిడుగుల బీభత్సం.. నలుగురు మృతిఏపీSwechaa14 Sep 2026, 01:01 PM

ఏపీలో పిడుగుల బీభత్సం.. నలుగురు మృతి

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది.రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అల్పపీడనం ప్రభావం కారణంగా గత రెండ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని కన్నీటిపర్యంతమైన అన్నదాత నేడు వర్షాలు కురుస్తుండటంతో పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదిలాఉండగా, పల్నాడు జిల్లాలో పలు చోట్ల పిడుగులు పడగా పలువురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి భారీ వర్షంతో పాటు పెద్దఎత్తున పిడుగులు పడినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిడుగుపాటుకు గురై ఒకేరోజు నలుగురు మృతి చెందినట్టు సమాచారం.

తెలంగాణ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు : సీఎం రేవంత్తెలంగాణSwechaa14 Sep 2026, 12:49 PM

తెలంగాణ ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు : సీఎం రేవంత్

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షాలు తెలిపారు. ‘విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ, పవిత్రమైన "వినాయక చవితి" సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆదిదేవుడైన గణనాథుని కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. సమాజంలో సౌభ్రాతృత్వం, సద్భావన, మానవతా విలువలు మరింత పరిఢవిల్లాలి. సకల సంకల్పాలకు విఘ్నాలు తొలగించి, మన అడుగులకు విజయబాటలు వేయాలని.. జ్ఞానాన్ని, ధైర్యాన్ని, సత్ప్రవర్తనను ప్రసాదించాలని ఆదిపూజ్యుడైన ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిద్దాం. వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత శోభాయమానంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి’ అంటూ సీఎంవో కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

థేమ్స్‌ తీరంలో గంగమ్మ వెలుగు..! లండన్‌లో భారతీయ ఆధ్యాత్మిక నాదంInternationalSwechaa14 Sep 2026, 12:49 PM

థేమ్స్‌ తీరంలో గంగమ్మ వెలుగు..! లండన్‌లో భారతీయ ఆధ్యాత్మిక నాదం

లండన్‌ నగరం..! ఆధునికతకు ప్రతీకగా నిలిచే మహానగరం. ఆ నగరం మధ్యగా నిశ్శబ్దంగా ప్రవహించే థేమ్స్‌ నది. సాధారణంగా అక్కడ కనిపించేది నగర జీవన సందడి. కానీ ఓ సాయంత్రం.. అదే నదీ తీరం భారతీయ ఆధ్యాత్మికతతో పులకించింది. గంగానది ఒడ్డున తరతరాలుగా కొనసాగుతున్న పవిత్ర గంగా హారతి స్ఫూర్తితో.. థేమ్స్‌ తీరంలో దీపాలు వెలిగాయి.

AGI vs Robots: మానవ ఉనికికే ముప్పు? రోబోల వేగంపై నిపుణుల తీవ్ర హెచ్చరికలు!InternationalSwechaa14 Sep 2026, 12:34 PM

AGI vs Robots: మానవ ఉనికికే ముప్పు? రోబోల వేగంపై నిపుణుల తీవ్ర హెచ్చరికలు!

 గడిచిన దశాబ్ద కాలంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం సాధించిన పురోగతి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పదేళ్ల క్రితం కేవలం చిన్నపాటి ఆదేశాల ఆధారంగా ముందుకు వెనక్కి కదిలే 'చిన్న ప్లాస్టిక్, ఐరన్ డబ్బాల' (Mechanical Boxes) స్థాయిలో ఉన్న రోబోలు.. నేడు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేంత అత్యాధునిక సాంకేతిక స్థాయికి ఎదిగాయి. కేవలం పరిశ్రమల్లో బరువులు మోసేందుకే పరిమితం కాకుండా, మానవుల భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ విశ్లేషణాత్మకంగా ప్రవర్తిస్తుండటం ఈ రంగానికి సరికొత్త రూపానిచ్చింది.

Nakirekal: 200మంది  నేతన్నల రోదన.. సొసైటీ ఎన్నికల్లో అక్రమాలు!తెలంగాణSwechaa14 Sep 2026, 12:05 PM

Nakirekal: 200మంది నేతన్నల రోదన.. సొసైటీ ఎన్నికల్లో అక్రమాలు!

 నల్గొండ జిల్లాలోని నకిరేకల్ చేనేత సహకార సంఘం వేదికగా దారుణమైన అక్రమాల పర్వం వెలుగులోకి వచ్చింది. నిత్యం మగ్గం నేసి, దారాలు వడికి చెమటోడ్చే అమాయక చేనేత కార్మికుల నోటికాడ కూడును సొసైటీలోని కొందరు పెద్దలు దారుణంగా దోచేస్తున్నారు. మగ్గానికి, నేత వృత్తికి ఎలాంటి సంబంధం లేని వ్యాపారులు సొసైటీని హస్తగతం చేసుకుని, ఏకంగా 200 మంది అర్హులైన నిజమైన చేనేత కార్మికులను కుట్రపూరితంగా రోడ్డున పడేసిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అల్వాల్‌లో దారుణం.. బాలికపై ఎనిమిది మంది లైంగికదాడి!క్రైమ్Swechaa14 Sep 2026, 11:39 AM

అల్వాల్‌లో దారుణం.. బాలికపై ఎనిమిది మంది లైంగికదాడి!

  హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే భయంకరమైన ఘాతుకం వెలుగుచూసింది. 16 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు వరుసగా లైంగిక దాడికి పాల్పడినట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి. నగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, నిందితుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, మహిళా మండళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

మానవ నియంత్రణ లేని ఏఐతో ప్రయోజనం లేదు:  సత్య నాదెళ్లInternationalSwechaa14 Sep 2026, 11:17 AM

మానవ నియంత్రణ లేని ఏఐతో ప్రయోజనం లేదు:  సత్య నాదెళ్ల

 కృత్రిమ మేధ (AI) అభివృద్ధి వేగం, దాని భద్రతపై అంతర్జాతీయ టెక్నాలజీ ప్రపంచంలో జరుగుతున్న తీవ్రమైన చర్చలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భాగమయ్యారు. సూపర్‌ఇంటెలిజెన్స్ రూపకల్పనలో మానవ నియంత్రణ, మానవాళి శ్రేయస్సే అత్యంత ప్రాథమిక సూత్రాలుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్‌మన్ వంటి టెక్ దిగ్గజాలు వ్యక్తం చేసిన ఆందోళనలకు ఆయన తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

లైట్లు ఆపేసి అర్ధరాత్రి మాపై దాడులు చేశారు : మహిళా రైతులుతెలంగాణSwechaa14 Sep 2026, 11:06 AM

లైట్లు ఆపేసి అర్ధరాత్రి మాపై దాడులు చేశారు : మహిళా రైతులు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు తెలుపుతూనే ఉన్నారు.ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 1200ఎకరాల భూమిని సేకరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించగా.. తమ భూములు ఇచ్చేది లేదని రైతులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లా పరిగి మండలం కలాపూర్, రాపోల్ గ్రామస్తులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి లైట్లు ఆర్పి మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి లైట్లు ఆపేసి పోలీసులు తమపై దాడులు చేశారని మహిళా రైతులు ఆరోపిస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇచ్చేది ఇచ్చేది లేదంటూ ఆ రెండు గ్రామాల ప్రజలు పోరాటం చేస్తున్నారు.

శంషాబాద్‌లో భారీ ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్ బస్సుక్రైమ్Swechaa14 Sep 2026, 10:49 AM

శంషాబాద్‌లో భారీ ప్రమాదం.. హోటల్‌లోకి దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు

శంషాబాద్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి హోటల్‌లోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 10 మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. శంషాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారి మీద హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ లారీ అకస్మాత్తుగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అధిక వేగమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడగా.. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పక్కన నిలిపిన పలు వాహనాలు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొని పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది.

ఆ శాఖల్లోనే ఎక్కువ లంచం డిమాండ్?  భారతీయ విద్యార్థి సంచలన ఆవిష్కరణవైరల్ న్యూస్Swechaa14 Sep 2026, 10:30 AM

ఆ శాఖల్లోనే ఎక్కువ లంచం డిమాండ్? భారతీయ విద్యార్థి సంచలన ఆవిష్కరణ

ఇండియాలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు శాఖలు, కార్యాలయాల్లో లంచం లేనిదే పనికాదు అనేది ఎవరిని అడిగినా చెబుతున్నారు. ప్రభుత్వశాఖల్లో అయితే మరి ఘోరం.. వృద్ధులకు పెన్షన్ ధ్రువపత్రాలు ఇవ్వడానికి కూడా లంచాలు డిమాండ్ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. శాఖ ఏదైనా డబ్బులు ముట్టజెప్పనిదే ఫైల్ కదలదు అనేది జగమెరిగిన సత్యం. అయితే, పనివిషయంలో అధికారులు లంచం డిమాండ్ చేశారా? ఎవరైనా చెల్లించారా? లేదా నిరాకరించారా? ఏ శాఖలో ఎక్కువగా లంచం డిమాండ్ చేస్తున్నారు? వంటి వివరాలతో భారతీయ విద్యార్థి ఏఐ కోడింగ్ సాయంతో ప్రత్యేకంగా ఓ వైబ్‌సైట్ బిల్డ్ చేశాడు. లంచాల నిరోధం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంచేందుకే ‘మహారాజా అగ్రసేన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ విద్యార్థి ఆర్యన్ నిషాద్ ఒక వినూత్న పోర్టల్‌కు శ్రీకారం చుట్టాడు. bribes.fyi పేరిట ఈ వెబ్‌సైట్‌ను జులై 2న లాంచ్ చేశాడు.

ముంబైలో ఆ వినాయకుడి ఖజానా అంతా సేవకే.. ఏళ్ల చరిత్ర, కోట్ల ఆదాయం వెనుక అసలు కథ ఇదే!NationalSwechaa14 Sep 2026, 10:28 AM

ముంబైలో ఆ వినాయకుడి ఖజానా అంతా సేవకే.. ఏళ్ల చరిత్ర, కోట్ల ఆదాయం వెనుక అసలు కథ ఇదే!

ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం. వ్యాపారవేత్తల నుంచి సినీ ప్రముఖుల వరకు.. రాజకీయ నాయకుల నుంచి సామాన్య భక్తుల వరకు.. ఎంతోమంది ఈ గణపయ్యని దర్శించుకుంటారు. ముంబైలోని ఈ ఆలయం మత, సామాజిక భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే పుణ్యక్షేత్రంగా నిలిచింది.

కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు!తెలంగాణSwechaa14 Sep 2026, 10:25 AM

కేటీఆర్ పీఏ, పీఆర్వోలకు సైఫాబాద్ పోలీసుల నోటీసులు!

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈనెల 7వ తేదీన గేట్ నంబర్-3 వద్ద చోటుచేసుకున్న నిరసన ఘటనలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ కుంబాల మహేందర్ రెడ్డి, పీఆర్వో మాణిక్య మహేష్‌లకు సైఫాబాద్ పోలీసులు విచారణాధికారి ఎదుట హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడటం, అధికారులను అడ్డుకున్నారన్న ఫిర్యాదుల ఆధారంగా నమోదు చేసిన క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టారు.

గణపయ్య కోసం బాహబాహీ.. ఒకరు మృతిక్రైమ్Swechaa14 Sep 2026, 09:51 AM

గణపయ్య కోసం బాహబాహీ.. ఒకరు మృతి

రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయకచవితి పండుగ సందర్భంగా గణపయ్య విగ్రహం కోసం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన ఘట్‌కేసర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..చౌదరిగూడ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఆదివారం అర్ధరాత్రి వినాయక విగ్రహం కొనుగోలు చేసేందుకు జోడిమెట్ల సమీపంలోని వినాయక విగ్రహాల షెడ్డు వద్దకు వెళ్లారు. అక్కడ విగ్రహాలు విక్రయిస్తున్న వ్యాపారులతో ధర విషయంలో వాగ్వాదం నెలకొంది.మాటమాట పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. వ్యాపారుల దాడిలో చౌదరిగూడకు చెందిన పసులాది కిరణ్‌ (34)కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం.

ఖైరతాబాద్ గణేషుడికి 72 ఏళ్లు.. ఈసారి ఎత్తు 70 అడుగులా? 69 అడుగులా? క్లారిటీ ఇదే!తెలంగాణSwechaa14 Sep 2026, 09:47 AM

ఖైరతాబాద్ గణేషుడికి 72 ఏళ్లు.. ఈసారి ఎత్తు 70 అడుగులా? 69 అడుగులా? క్లారిటీ ఇదే!

భాగ్యనగర ఆధ్యాత్మిక ప్రతీక, ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశుడి ఉత్సవాలు విశేషంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 'శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి' దివ్య రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 1954లో కేవలం ఒక్క అడుగు విగ్రహంతో ప్రారంభమైన ఈ మహోజ్వల ప్రయాణం ఏటేటా శోభిల్లుతూ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, విగ్రహ ఎత్తుపై భక్తుల్లో నెలకొన్న గందరగోళానికి ఉత్సవ సమితి స్పష్టతనిచ్చింది. 1954లో 1 అడుగుతో ప్రారంభమై 2014 నాటికి (60వ ఏట) 60 అడుగులకు చేరిన తర్వాత, ప్రతి సంవత్సరం ఒక అడుగు పెంచే సంప్రదాయాన్ని నిలిపివేశారు. ఆ తర్వాత నుంచి పర్యావరణ పరిరక్షణ (మట్టి విగ్రహం బరువు), నిమజ్జన ఊరేగింపులో విద్యుత్ తీగలు, మెట్రో లైన్లు వంటి రవాణా సాంకేతిక కారణాల దృష్ట్యా ఎత్తును 60 నుంచి 70 అడుగుల పరిమితిలోనే ఉత్సవ సమితి నిర్ణయిస్తోంది.

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు.. పోలీసులను నిలదీసిన భూ బాధితులు!!..తెలంగాణSwechaa14 Sep 2026, 09:30 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు.. పోలీసులను నిలదీసిన భూ బాధితులు!!..

ఆలేరు రాజకీయాల్లో భూవివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై బాధితులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వారసత్వంగా తమకు వచ్చిన, సుమారు 37 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిని తమ నుంచి బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ భూమికి సంబంధించిన పత్రాలను అక్రమంగా సృష్టించి హక్కులు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. శంకర్ నాయక్, చాడా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులను ముందుంచి తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాదు.. పోలీసులను అడ్డుపెట్టుకుని భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారులను నిలదీశారు.

Hyderabad:హైదరాబాద్‌పై "క్యూర్" ఫోకస్.. 70 ఏళ్ల తర్వాత కొత్త చట్టం!!..తెలంగాణSwechaa14 Sep 2026, 08:47 AM

Hyderabad:హైదరాబాద్‌పై "క్యూర్" ఫోకస్.. 70 ఏళ్ల తర్వాత కొత్త చట్టం!!..

హైదరాబాద్‌ నగర భవిష్యత్‌ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఫోకస్ పెట్టింది. 70 ఏళ్ల తర్వాత జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూనే.. కోటి 30 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా ‘క్యూర్’ చట్టాన్ని తీసుకొచ్చింది. సీఎం చైర్మన్‌గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసి.. పట్టణ అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. మరోవైపు, అన్ని కీలక శాఖల అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలను అమలు చేయనున్నారు. అంటే హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల పట్టణాల అభివృద్ధిని ఒకే సమగ్ర ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యం.

నగరంలో మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం!..తెలంగాణSwechaa14 Sep 2026, 08:14 AM

నగరంలో మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం!..

మరోవైపు వినాయక చవితి పర్వదినాన భాగ్యనగరాన్ని వరుణుడు పలకరించాడు. తెల్లవారుజామున ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకుని, పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురవడంతో హైదరాబాద్‌ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచే చల్లటి ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షంతో నగర ప్రజలకు ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం లభించింది. అయితే మరోవైపు భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచి వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

Nandamuri Mokshagna-Debue: మోక్షజ్ఞ డెబ్యూ..రీల్ లైఫ్‌లోనూ తండ్రిగా బాలయ్య!సినిమాSwechaa14 Sep 2026, 08:11 AM

Nandamuri Mokshagna-Debue: మోక్షజ్ఞ డెబ్యూ..రీల్ లైఫ్‌లోనూ తండ్రిగా బాలయ్య!

Nandamuri Mokshagna: గత నాలుగైదేళ్ళుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, ఏదో ఒక కారణం వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. పైగా అప్పట్లో మోక్షజ్ఞ చాలా లావుగా ఉండేవాడు. హీరోగా పరిచయం కాబోతున్నాడు..అని వార్తలు వస్తున్నా కూడా తన ఫిజిక్ చూస్తే సినిమాలపై ఆసక్తి లేదని చెప్పుకున్నారు. ఎట్టకేలకి, మోక్షజ్ఞ ఎంట్రీ కన్‌ఫర్మ్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దసరాకి ఈ ప్రాజెక్ట్ గ్రాండ్‌గా ఓపెనింగ్ జరగనుందని సమాచారం.

Tirupati: శ్రీవారి దర్శనానికి వెళ్తే ఇదేం పరిస్థితి బాబోయ్!!..ఏపీSwechaa14 Sep 2026, 07:49 AM

Tirupati: శ్రీవారి దర్శనానికి వెళ్తే ఇదేం పరిస్థితి బాబోయ్!!..

తిరుపతిలో గరిష్ఠ చిల్లర ధరలకు తిలోదకాలు ఇచ్చారు. ప్రధానంగా భక్తులు, యాత్రికులు, ప్రయాణికులను యథోచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ ఇది మరింత అధికంగా ఉంటోంది. నాసిరకం వస్తువులు అంటగట్టడం, ప్రతిదానిపై రూ.5 నుంచి రూ.10 అదనంగా దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారింది. బస్టాండ్‌లోని ఓ దుకాణంలో రూ.20 నీటి బాటిల్‌కు ఏకంగా రూ.30 వసూలు చేశారు. లేదంటే ఇచ్చేది లేదంటూ తేల్చి చెప్పారు.

ఈ పువ్వులతో చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో!!..HealthSwechaa14 Sep 2026, 07:30 AM

ఈ పువ్వులతో చేసిన టీ తాగితే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో!!..

మన పెరట్లో, దారి పక్కన కనిపించే నీలిరంగు శంఖం పువ్వులు మనందరికీ సుపరిచితమే. శంఖం ఆకారంలో ఉండటం వల్ల వీటిని శంఖం పువ్వులు అని, ఇంగ్లీష్ లో బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్ అని పిలుస్తారు. పూర్వకాలం నుండి మన ఆయుర్వేద వైద్యంలోనూ, సంప్రదాయ గృహ వైద్యంలోనూ ఈ పువ్వులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక సాధారణంగా దేవుడి పూజలకు మాత్రమే వాడతామని అనుకునే ఈ పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి..

Health:జ్వరం వచ్చినప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి!!..HealthSwechaa14 Sep 2026, 07:25 AM

Health:జ్వరం వచ్చినప్పుడు ఈ తప్పులు మాత్రం చేయకండి!!..

జ్వరం వచ్చిన వెంటనే చాలామందికి వచ్చే సందేహాలు రెండే.. అన్నం తినవచ్చా? స్నానం చేయవచ్చా? ఈ రెండింటిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ వైద్య నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తే.. జ్వరం వచ్చినప్పుడు ఆహారం, నీరు, పరిశుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది.సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్.. అంటే 38 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని జ్వరంగా పరిగణిస్తారు. జ్వరంతో పాటు నీరసం, చలి, తలనొప్పి, చెమటలు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే జ్వరం అనేది శరీరంలో జరుగుతున్న మార్పునకు సంకేతం అంటారు..

మహావిష్ణువు వరాహరూపం ఎందుకు ధరించారు?..SpiritualitySwechaa14 Sep 2026, 07:17 AM

మహావిష్ణువు వరాహరూపం ఎందుకు ధరించారు?..

సనాతన ధర్మంలో శ్రీమహావిష్ణువు అవతారాలకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. లోకంలో ధర్మానికి విఘాతం కలిగినప్పుడు.. సృష్టి సమతుల్యత దెబ్బతిన్నప్పుడు.. అవసరానికి తగిన రూపంలో స్వామివారు అవతరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలా భూదేవిని రక్షించడానికి ఆవిర్భవించిన అవతారమే.. వరాహావతారం అని అంటున్నారు. పురాణ కథనం ప్రకారం.. హిరణ్యాక్షుడి కారణంగా భూమి జలగర్భంలోకి వెళ్లిపోయింది. భూదేవిని తిరిగి పైకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు శ్రీమహావిష్ణువు మహా వరాహరూపాన్ని ధరించి.. ఆ అగాధ జలాల్లోకి ప్రవేశించాడు. తన బలమైన కోరలపై భూదేవిని నిలిపి.. సముద్ర గర్భం నుంచి పైకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత భూదేవిని తన స్థానంలో ప్రతిష్ఠించి.. హిరణ్యాక్షుడిని సంహరించాడు.

వినాయకుడికి ఈ మూడు సమర్పణలు ఎందుకు అంత ప్రీతికరం?..SpiritualitySwechaa14 Sep 2026, 07:08 AM

వినాయకుడికి ఈ మూడు సమర్పణలు ఎందుకు అంత ప్రీతికరం?..

వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంటా గణనాథుడి నామస్మరణతో పాటు రకరకాల పూలతో అలంకరణ కూడా కనిపిస్తుంది.. అయితే గణపయ్యకు పూలు సమర్పించడం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు.. ప్రతి పుష్పం, ప్రతి పత్రం వెనుక ఒక ఆధ్యాత్మిక సంకేతం దాగి ఉందని సనాతన ధర్మ సంప్రదాయం చెబుతోంది.

Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు.. వాళ్లను నమ్మి మోసపోవద్దుతెలంగాణSwechaa13 Sep 2026, 10:11 PM

Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్లు.. వాళ్లను నమ్మి మోసపోవద్దు

Indiramma Houses Scheme: సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఎల్‌ఐజీ గృహాల లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను ఈ వారంలోనే అందజేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ పి.వి.గౌతం తాజాగా స్పష్టం చేశారు. దీంతో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.ఇళ్ల కేటాయింపుల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను పకడ్బందీగా పూర్తి చేశారు. పారదర్శక పద్ధతిలో నిర్వహించిన కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా తొలుత 7,340 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వకుండా.. అధికారులు స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు.

Mumbai Mahaganpati : దేశంలోనే రిచెస్ట్ గణపయ్య.. రూ.703 కోట్ల ఇన్సూరెన్స్.. 66 కేజీల బంగారంతో అలంకరణదునియాSwechaa13 Sep 2026, 10:01 PM

Mumbai Mahaganpati : దేశంలోనే రిచెస్ట్ గణపయ్య.. రూ.703 కోట్ల ఇన్సూరెన్స్.. 66 కేజీల బంగారంతో అలంకరణ

Mumbai Mahaganpati: దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ మొదలవుతున్న వేళ.. వాణిజ్య రాజధాని ముంబైలోని ప్రముఖ గణేష్ పండల్ మరోసారి సరికొత్త సంచలనానికి వేదికైంది. దేశంలోనే అత్యంత సంపన్నమైన గణపతిగా పేరుగాంచిన ముంబై కింగ్స్ సర్కిల్‌లోని గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ్ సేవా మండల్ మహాగణపతి శనివారం తొలిసారిగా భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా చేరుకున్న భక్తులు స్వామివారి దివ్య వైభవాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. అయితే ఈసారి నిర్వాహకులు స్వామివారికి చేసిన భద్రతా ఏర్పాట్లు, అలంకరించిన ఆభరణాల విలువ తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.కింగ్స్ సర్కిల్ మహాగణపతిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు అనేంత అద్భుతంగా నిర్వాహకులు గణపయ్యను అలంకరించారు. స్వచ్ఛమైన బంగారు, వెండి వస్తువులతో పాటు అత్యంత విలువైన రత్నాలు, వజ్రాభరణాలతో విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గణపయ్య అలంకరణలో ఏకంగా 66 కిలోలకు పైగా స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఆభరణాలు, దాదాపు 335 కిలోల వెండి కిరీటాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విలువైన రత్నాలను వాడారు. ధగధగ మెరిసిపోతున్న గణనాథుడిని దర్శించుకునేందుకు మొదటి రోజే భక్తజనం పోటెత్తారు.

Dancer Raju Case : ఢీ షో రాజు కేసులో అసలు నిజాలేంటి.. రూ.12 లక్షలు ఎందుకు తీసుకున్నాడు..?సినిమాSwechaa13 Sep 2026, 09:44 PM

Dancer Raju Case : ఢీ షో రాజు కేసులో అసలు నిజాలేంటి.. రూ.12 లక్షలు ఎందుకు తీసుకున్నాడు..?

Dancer Raju Case : ‘ఢీ’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ రాజు అసలు రంగు బయటపడింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా లక్షలాది రూపాయలు కాజేసిన వ్యవహారంలో అతడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. హైదరాబాద్ మియాపూర్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ గోకుల్ ప్లాట్స్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరో అంతస్తులో 28 ఏళ్ల యువతి బొటిక్ నడుపుతోంది. అదే భవనంలోని మూడో అంతస్తులో ‘ఢీ’ ఫేమ్ చిట్టి మాస్టర్ నిర్వహిస్తున్న డాన్స్ స్టూడియో ఉంది. ఈ స్టూడియోకు ‘ఢీ’ సీజన్-10 విన్నర్ అయిన రాజు రోజు ప్రాక్టీస్ కోసం వచ్చేవాడు.

మహబూబాబాద్ అడ్డాగా సర్వే వార్.. ఎవరి బలం ఎంత?తెలంగాణSwechaa13 Sep 2026, 09:10 PM

మహబూబాబాద్ అడ్డాగా సర్వే వార్.. ఎవరి బలం ఎంత?

TG Politics : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో అప్పుడే ఎన్నికల వేడి తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ప్రధాన పార్టీలు ప్రజల నాడి పట్టుకునేందుకు చేపడుతున్న అంతర్గత సర్వేలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటై వేయి రోజుల మైలురాయి దాటుతున్న వేళ.. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నియోజకవర్గాల్లో ఒకరు డిజిటల్ సర్వే నిర్వహిస్తే, మరొకరు సీక్రెట్‌గా గ్రౌండ్ రియాలిటీని శోధిస్తున్నాయి.ఈ ముందస్తు రాజకీయ కసరత్తులో బీఆర్ఎస్ అధిష్టానం ఒక అడుగు ముందే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచారం లీక్ కాకుండా ఉండేందుకు అత్యంత పకడ్బందీగా ‘ఆన్‌లైన్ లింకుల’ ద్వారా సర్వే నిర్వహిస్తోంది.