స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

"బ్రిక్స్ దేశాలు ఎవరికీ శత్రువులు కాదు'.. మోడీ స్ట్రాంగ్ మెసేజ్..దునియాSwechaa12 Sep 2026, 07:38 PM

"బ్రిక్స్ దేశాలు ఎవరికీ శత్రువులు కాదు'.. మోడీ స్ట్రాంగ్ మెసేజ్..

BRICS: ప్రపంచ రాజకీయాల్లో శతాబ్దాలుగా సాగుతున్న అగ్రరాజ్యాల పెత్తనానికి ఇక కాలం చెల్లినట్లేనా? కేవలం కొద్దిమంది పెత్తందారులు నిర్ణయాలు తీసుకోవడం, మిగిలిన ప్రపంచం వాటిని గుడ్డిగా పాటించడమనే వ్యవస్థకు తెరపడనుందా? ఢిల్లీ వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ వార్షిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికలను ఒక్కసారిగా షేక్ చేసింది. "గ్లోబల్ సౌత్ దేశాలు ఇకపై నిబంధనలు పాటించేవిగా మాత్రమే ఉండకూడదు.. ప్రపంచానికి నిబంధనలను నిర్దేశించే స్థాయికి ఎదగాలి" అంటూ మోడీ చేసిన సింహగర్జన పాశ్చాత్య దేశాలకు నేరుగా పంపిన స్ట్రాంగ్ వార్నింగ్‌గా కనిపిస్తోంది.

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) వైఖరిపై ప్రధాని మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన నిబంధనలతో సాగుతున్న భద్రతామండలిలో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించేలా, అర్హత కలిగిన ఇతర దేశాలకు తక్షణమే శాశ్వత సభ్యత్వం కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కాలానికి అనుగుణంగా మారకపోతే అంతర్జాతీయ సంస్థల ఉనికికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

బ్రిక్స్‌ సమ్మిట్‌లో అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్NationalSwechaa12 Sep 2026, 07:21 PM

బ్రిక్స్‌ సమ్మిట్‌లో అద్భుత దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్

BRICS Summit: ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే మూడు పవర్‌ఫుల్ దేశాలకు చెందిన కీలక నాయకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్ ఒకే దగ్గర కనిపించారు. ప్రధాని మోదీ వారిద్దరి చేతులు పట్టుకుని ఉండగా.. ముగ్గురూ నవ్వులు చిందించారు.

Dance Master Raju :  'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!సినిమాSwechaa12 Sep 2026, 06:59 PM

Dance Master Raju : 'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!

Dance Master Raju : బుల్లితెరపై సంచలనం సృష్టించిన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి తనపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సంచలన ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినప్పటికీ.. దాదాపు మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.డ్యాన్స్ మాస్టర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న రాజు.. వెండితెరపై అవకాశాలు వెతుక్కుంటున్న ఓ యువతిని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాల్లో మంచి ఆఫర్లు ఇప్పిస్తానని, ప్రముఖులతో పరిచయాలు చేయిస్తానని నమ్మించి ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనపై సాగిన వేధింపులు భరించలేక చివరికి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు కంప్లైంట్‌లో వెల్లడించింది.

అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారా? లేకపోతే రారా? కవిత ఫైర్తెలంగాణSwechaa12 Sep 2026, 06:29 PM

అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారా? లేకపోతే రారా? కవిత ఫైర్

Kavitha: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరిని తప్పుపట్టారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చిస్తారని అనుకుంటే.. అసెంబ్లీ బయట అధికార, ప్రతిపక్ష నాయకులు బాహాబాహీలకు పోవడం, ఒకరినొకరు వింత వింత భాషల్లో తిట్టుకోవడం బాధాకరమన్నారు కవిత. అన్నింటికంటే దురదృష్టకరం ఏంటంటే స్పీకర్ ను దుర్భాషలాడటం అని ఆమె వాపోయారు.

మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణంక్రైమ్Swechaa12 Sep 2026, 06:11 PM

మెదక్‌లో ఘోరం.. తల్లి కోసం కొడుకు దారుణం

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. తల్లి కోసం ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి లేదని తెలిసి ఒంటరిగా ఫీలయిన యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది . మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక 19 ఏళ్ల ఆమె కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. పెద్దశంకరం పేటకు చెందిన బేతమ్మ(45) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లింది.అక్కడ వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు సమాచారం. అయితే, నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బేతమ్మ హైదరాబాద్‌లో తను ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసి కొడుకు సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

1980s రెట్రో ట్రెండ్.. పొంచి ఉన్న సైబర్ ముప్పుతెలంగాణSwechaa12 Sep 2026, 05:50 PM

1980s రెట్రో ట్రెండ్.. పొంచి ఉన్న సైబర్ ముప్పు

Retro PhotoScam Alert : సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. పాతకాలం నాటి దుస్తులు, వింటేజ్ హెయిర్‌స్టైల్, నాటి బ్లాక్ అండ్ వైట్‌తో కనిపించే '1980s రెట్రో ఫోటో' ట్రెండ్ నెటిజన్లను ఊపేస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఫోటోలను 80ల నాటి లుక్‌లోకి మార్చుకుని వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సరదా వెనుక డిజిటల్ దొంగలు పన్నిన ప్రమాదకరమైన ఉచ్చు దాగుందని తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద బాంబు పేల్చారు.

మనం సరదా కోసం అప్‌లోడ్ చేసే ప్రతి ఫోటో జీవితాంతం ఇంటర్నెట్ డొమైన్‌లోనే ఉండిపోతుందని పోలీసులు గుర్తుచేస్తున్నారు. ఒక్కసారి ఇంటర్నెట్‌లోకి వెళ్లిన ఫోటోపై మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదని, అవి సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో మార్ఫింగ్ చేసి అశ్లీల సైట్లలో పెట్టే ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

22ఏ కింద..100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa12 Sep 2026, 05:38 PM

22ఏ కింద..100 ఎకరాలు బదలాయించుకున్నారు- హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు

22ఏ పేరుతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేస్తుందో అంతకంటే ఎక్కువ అక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు కవిత. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీశ్ రావు స్కామ్ చేశారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి 100 ఎకరాలను హరీశ్ రావు తన తండ్రి పేరు మీదకు బదలాయించుకున్నారని కవిత చెప్పారు.

22ఏ నిషేధిత జాబితా నుంచి తీసుకుని సిద్ధిపేట పట్టణంలో 100 ఎకరాలు హరీశ్ రావు తన తండ్రి పేరు మీద బదలాయించుకున్నారన్న కవిత.. అందుకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని రేవంత్ ప్రభుత్వానికి పంపిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే దానిపై చర్చ పెట్టాలని, హరీశ్ రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్తెలంగాణSwechaa12 Sep 2026, 05:34 PM

రేవంత్ పాలనలో ఎస్సీలపై ఘోరాలు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. వారి ధన, మాన, ప్రాణాలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలం అయ్యిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కులాంతర వివాహాం చేసుకున్న ఓ యువకుడి ఇంటిని కొందరు దుండగులు కూల్చివేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘రేవంత్ పాలనలో ఎస్సీలపై మరో ఘోరం. గద్వాల జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ యువకుడి ఇంటిని సర్పంచ్ ప్రేరేపణతో కొందరు దుండగులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది అమానవీయ సంఘటన. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే నేరం. అందరు బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీతెలంగాణSwechaa12 Sep 2026, 05:17 PM

కాంట్రాక్టులన్నీ ఒకే కంపెనీకా? : అక్బరుద్దీన్ ఓవైసీ

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏఐఎంఐఎం కీలక నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేరిట మూడు కార్పొరేషన్లుగా రాష్ట్ర ప్రభుత్వం విభజన చేసింది.తాజాగా దీనిపై అక్భరుద్దీన్ ఓవైసీ పలు ప్రశ్నలు సంధించారు. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రభుత్వం ఎందుకు విభజించిందని, అందుకు గల అసలు కారణం ఏంటో చెప్పలేదని శాసనసభ వేదికగా ప్రశ్నించారు. ఉన్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత ఉందని, వేతనాలు సరిపోవట్లేదు అని అధికారులు అంటున్నారని చెప్పారు. అలాంటప్పుడు మరి జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించాల్సిన అవసరం ఏముందని అడిగారు.

Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితెలంగాణSwechaa12 Sep 2026, 05:08 PM

Ponguleti Srinivasa Reddy : పేదల భూములు దోచుకునేందుకే ధరణి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ముసుగులో సాగించిన భూదందాపై శాసనసభ వేదికగా పెను దుమారం రేగింది. ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ సంస్కరణలు చేపడుతోందని చెబుతూనే, గత బీఆర్ఎస్ పాలనపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో 22ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో కేసీఆర్ కుటుంబం, వారి బంధుగణం మాత్రమే విపరీతంగా బాగుపడ్డారని పొంగులేటి విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం హోదాలో కేసీఆర్ రెవెన్యూ శాఖను తనవద్దే అట్టిపెట్టుకోవడం వెనుక ఉన్న అసలు మతలబు భూముల అక్రమాలకు పాల్పడటమేనని ఆయన స్పష్టం చేశారు. ధరణిని అడ్డుపెట్టుకుని గత పాలకులు లక్షలాది ఎకరాలను దర్జాగా దోచుకున్నారని విమర్శించారు.

గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్తెలంగాణSwechaa12 Sep 2026, 04:57 PM

గణేశ్ నవరాత్రులు.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్

గణేశ్ నవరాత్రుల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. వేడుకల నిర్వహణ, బందోబస్తు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు, నిర్వాహకులతో నేరుగా సమీక్షించే సంప్రదాయాన్ని పునరుద్ధరించామన్నారు. నిర్వాహకుల సమస్యలు తెలుసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. నిర్వాహకులు ముందుగా అధికారులకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలని కోరారు.

Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నాతెలంగాణSwechaa12 Sep 2026, 04:42 PM

Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా

Kavitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. సీఎం రేవంత్ ను కరప్షన్ కింగ్ గా, అవినీతి సామ్రాట్ గా అభివర్ణించారు. కమీషన్లు తీసుకునే అవసరం నాకు లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు కవిత. ముఖ్యమంత్రి రేవంత్ మాటలను ఆమె ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మూసీ నుంచి ఇసుక వరకు ప్రతీ దాంట్లో మీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

ఈ అంశాలన్నీ చెప్పేందుకు, ప్రజల ముందు తేటతెల్లం చేయడానికి, మీ పాపాల చిట్టా విప్పేందుకే ఈ నెల 20న కొడంగల్ కు వస్తున్నామని కవిత చెప్పారు. టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ పెడుతున్నామన్నారు. మీ నియోజకవర్గంలో మీ గడ్డ మీద నిలబడి మీరు చేసిన అవినీతిని మొత్తం తెలంగాణ ప్రజలకు చెప్పబోతున్నామని కవిత ప్రకటించారు.

టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?సినిమాSwechaa12 Sep 2026, 04:17 PM

టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?

Tollywood : టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కథ, కథనం, నటీనటుల ప్రతిభ నిర్ణయించేవి. కానీ ఈరోజుల్లో ఆ పరిస్థితి తలకిందులైంది. ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి సొంతంగా తీర్పు ఇచ్చే లోపే, తెరవెనుక కొందరు సృష్టించే ‘నకిలీ హడావుడి’ సినిమా జాతకాన్ని తారుమారు చేస్తున్నాయి. ఆ కృత్రిమ హైప్‌ను సృష్టిస్తుంది మరేదో కాదు పబ్లిక్ రిలేషన్స్ (PR) వ్యవస్థ. సినిమాను ప్రమోట్ చేయాల్సిన ఏజెన్సీలు ఇప్పుడు ఏకంగా సక్సెస్‌లను, అట్టర్ ఫ్లాప్‌లను డిసైడ్ చేసే స్థాయికి ఎదిగాయన్న చేదు నిజం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.అయితే ఇక్కడ ఒక కఠినమైన వాస్తవాన్ని కూడా గుర్తించాలి. పీఆర్ ఏజెన్సీల హంగామా, ప్రమోషన్ల జాతర సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రమే తీసుకురాగలవు. సినిమాలో విషయం లేకపోతే, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ట్రెండ్స్ నడిపినా ప్రేక్షకుడు కనికరించడు. అదే టైంలో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాను ఎంత తొక్కాలని చూసినా, మౌత్ టాక్ ద్వారా అది అఖండ విజయంగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సినిమా కళాత్మకతను బజారుకీడ్చి, ‘డబ్బులిస్తే ఒకలా.. ఇవ్వకుంటే మరోలా’ వ్యవహరిస్తున్న ఈ పీఆర్ ఏజెన్సీల తీరు మారకపోతే.. ఇప్పటికే ఓటీటీలు, టికెట్ రేట్లతో కుదేలవుతున్న చిత్ర పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.

కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్తెలంగాణSwechaa12 Sep 2026, 03:42 PM

కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.నేటితో సెషన్‌కు చివరి రోజు కావడంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వ తరపున మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు చేసిన సూచనలు, ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌‌కు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే కల ఉండేదని.. నగర పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి కో-ఆర్డినేషన్ భేటీ ఏర్పాటు చేయాలని గతంలో తాను ఇచ్చిన సలహాను మాజీ సీఎం పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పుడైనా సీఎం రేవంత్.. సిటీ అభివృద్ధి కోసం హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు.

Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?సినిమాSwechaa12 Sep 2026, 03:36 PM

Bigg Boss : బిగ్ బాస్ విన్నర్ల ‘రియాలిటీ’ ట్రాజెడీ.. కప్పు కొట్టారు సరే.. కెరీర్ ఎక్కడ బ్రదర్?

Bigg Boss : తెలుగు బుల్లితెరపై సంచలనాల రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఈ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు, ఓట్లు గుద్దుతారు, సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌తో యుద్ధాలే చేస్తారు. కానీ, మూడు నెలల హడావుడి ముగిసి, చేతికి ట్రోఫీ రాగానే ఆ విజేతల భవిష్యత్ ఏమవుతోంది? ఇప్పటి వరకు పూర్తయిన తొమ్మిది సీజన్ల రికార్డులను నిశితంగా పరిశీలిస్తే ఒక కఠినమైన నిజం స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన వారెవరికీ వెండితెరపై నిలదొక్కుకునే అదృష్టం దక్కలేదు. చిత్రంగా, షోలో టైటిల్ కొట్టకుండా బయటకు వచ్చిన నటుడు శివాజీ సాధించిన రీ ఎంట్రీ, తొమ్మిది సీజన్ల విన్నర్లలో ఒక్కరికి కూడా సాధ్యం కాకపోవడమే ఇప్పుడు అసలైన హాట్ టాపిక్.మిగిలిన విజేతల విషయంలో బిగ్ బాస్ తెచ్చిన ఫేమ్ కేవలం నీటిబుడగలా ఎందుకు మారిపోయింది? షో ముగిసిన వెంటనే వచ్చే తాత్కాలిక క్రేజ్‌ను ఎలా మార్కెట్ చేసుకోవాలో చాలామందికి సరైన ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణం అనే వాదన కూడా వినిపిస్తోంది. కొందరు తమ వ్యక్తిగత వివాదాలు, తొందరపాటు నిర్ణయాలతో క్రేజ్ తగ్గించుకోగా, మరికొందరు తమకు నటన రాకపోయినా ప్రధాన పాత్రలే కావాలనే భ్రమల్లో ఉండి చేతులు కాల్చుకున్నారు.

మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?తెలంగాణSwechaa12 Sep 2026, 03:18 PM

మాక్ అసెంబ్లీలో ‘కొండా ’ప్రస్తావన.. సీఎం ఏమన్నారంటే?

అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను ఈ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గులాబీ ఎమ్మెల్యేలు వినూత్నంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌లో నిర్వహించిన'మాక్ అసెంబ్లీ'కి హాజరయ్యారు. మాజీ మంత్రి,సనత్‌ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్‌గా పాత్రలో లీనమయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎం హోదాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ‘కొండా సురేఖ బిడ్డ నాకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు ఉండి తొక్కి వచ్చాను. ముఖ్యమంత్రినైన నాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను బర్తరఫ్ చేయక ఏం చేయాలి? కేబినెట్‌లో వేరే వాళ్లు కూడా ఉన్నారుగా.. వాళ్ల గురించి కూడా మాట్లాడొచ్చుగా’ అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.

అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!తెలంగాణSwechaa12 Sep 2026, 03:05 PM

అసెంబ్లీ సాక్షిగా కమలంలో కల్లోలం.. కాషాయ దళంలో ముదురుతున్న గ్రూపుల లొల్లి!

BJP : తెలంగాణ శాసనసభ వేదికగా కాషాయ దళం వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రభుత్వంపై సమష్టిగా దాడి చేయాల్సిన కీలక సమయంలో, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. పార్టీ లైన్ ప్రకారం నడవాల్సింది పోయి, సొంత ఎజెండాలు, వ్యక్తిగత ఈగోలతో నేతలు ఒకరితో ఒకరు తలపడుతుండటంతో అసలు పార్టీ వైఖరి ఏమిటనేది సామాన్య కార్యకర్తకు సైతం అంతుచిక్కడం లేదు.అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేశాయనే వాదన బలంగా వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు బ్రేక్‌ఫాస్ట్ టేబుల్‌పై కూర్చోవడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అధికార పార్టీ ఏర్పాటు చేసే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్తే ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్లాలి, లేదంటే ముక్తకంఠంతో అందరూ డుమ్మా కొట్టాలి. కానీ, కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే వెళ్లి మంత్రుల పక్కన కూర్చొని నవ్వులు చిందించడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు సొంత క్యాడర్ నుంచే వెల్లువెత్తుతున్నాయి. మరికొందరైతే ఏకంగా సభలోనే మంత్రుల పనితీరును ఆకాశానికెత్తుతూ ప్రసంగాలు చేస్తుండటం తోటి పార్టీ నేతలకే మింగుడుపడటం లేదు.

మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలుతెలంగాణSwechaa12 Sep 2026, 02:53 PM

మళ్లీ బాదారు.. ఆర్టీసీ చార్జీలపై ప్రయాణికుల గగ్గోలు

పండుగలు వస్తున్నాయంటే చాలు ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. పండుగలు వచ్చిన ప్రతిసారి బస్సు చార్జీలు పెంచుతుండటంతో ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలకు అంటే ఆధార్ కార్డులు ఉన్నాయని, మా పరిస్థితి ఏంటని పురుష ప్యాసింజర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరిట అధిక చార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌–హన్మకొండ ఏసీ బస్సు ఛార్జీని భారీగా పెంచినట్టు సమాచారం. ఆగస్టులో రూ.410గా ఉన్న టికెట్ ధర..సెప్టెంబర్‌లో ఏకంగా రూ.570 చేసినట్టు తెలుస్తోంది.ఒక్క ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం పడుతున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఛార్జీలు పెంచారంటూ ప్రయాణికలు ఆరోపిస్తున్నారు. పండుగల పేరుతో ప్రయాణికులపై ఆర్టీసీ భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Farmers : 24 గంటల కరెంట్ ఎక్కడ?తెలంగాణSwechaa12 Sep 2026, 02:30 PM

Farmers : 24 గంటల కరెంట్ ఎక్కడ?

తెలంగాణ ప్రభుత్వం మీద అన్నదాతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు యూరియా దొరకడం లేదని, సాగు నీరు కూడా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రైతులు ఆందోళన బాట పట్టారు. ఈసారి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే .. వ్యవసాయబావుల ద్వారా మోటార్ల సాయంతో కొన్ని చోట్ల పంటలకు రైతులు నీళ్లు అందిస్తున్నారు. అయితే, తాజాగా విద్యుత్ సమస్యలు తలెత్తడంతో అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు ఉంటాయని, హామీలు ఇచ్చారని ఇప్పుడు వాటి అమలు ఏమైందని అన్నదాతలు మండిపడుతున్నారు. వెంటనే విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే 24 గంటల కరెంట్ రావడం లేదని సూర్యాపేట జిల్లా రైతులు రోడ్డెక్కారు.

సైలెంట్ కిల్లర్.. భార్యబిడ్డలను చంపేసి తండ్రికి టీ ఇచ్చి..!క్రైమ్Swechaa12 Sep 2026, 02:04 PM

సైలెంట్ కిల్లర్.. భార్యబిడ్డలను చంపేసి తండ్రికి టీ ఇచ్చి..!

దాంపత్యంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.ఆ సమయంలో విచక్షణ మరిచిపోతున్న కొందరు భార్యబిడ్డలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు అని కూడా చూడటం లేదు. రక్తపుటేర్లు పారిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య, ముగ్గురు కూతుర్లను చంపేసి పరార్ అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లోని కార్దానీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..రాహుల్ ఝా తన భార్య గీత, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. ఫస్ట్ ఫ్లోర్‌లో వాళ్లు ఉంటుండగా, కుటుంబ సభ్యులు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే, రాత్రి నిద్రపోయాక భార్య, కుమార్తెలు నందిని(23), రాధిక(18), 14 ఏళ్ల అమ్మాయిని రాహుల్ రాయితో కొట్టి చంపాడు. ఆపై ఉదయాన్నే పాలు తీసుకొచ్చి, టీ తయారు చేసి, తండ్రి లక్ష్మీనాథ్‌కు ఇచ్చి మెల్లగా ఇంటి నుంచి పరార్ అయ్యాడు.

'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!తెలంగాణSwechaa12 Sep 2026, 01:10 PM

'క్యూసెక్కులు తెలీవు.. బ్యాంకు చెక్కులే తెలుసు'.. మాక్ అసెంబ్లీలో పల్లా వ్యంగ్యాస్త్రాలు!

 తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మాక్ అసెంబ్లీ' రసవత్తరంగా సాగింది. ఈ సమాంతర సభలో ఇరిగేషన్ (సాగునీటి) శాఖ మంత్రి పాత్రను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సాగునీటి విధానాలు, మేడిగడ్డ బ్యారేజీ పట్ల నిర్లక్ష్యం, ఇతర రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖల తీరును ఎండగడుతూ పల్లా రాజేశ్వర్ రెడ్డి పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'తెలంగాణSwechaa12 Sep 2026, 12:27 PM

మాక్ అసెంబ్లీలో తలసాని సెటైర్లు.. '100 రోజుల్లో హామీలు అన్నాం.. కానీ ఏ 100 రోజుల్లో చెప్పామా?'

శాసనసభ సమావేశాల సందర్భంగా తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ' (నకిలీ సభ) నిర్వహించింది. ఈ మాక్ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి పాత్ర పోషించగా, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు స్పీకర్ స్థానంలో వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల అమలు తీరుపై సీఎం పాత్రలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పదునైన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?సినిమాSwechaa12 Sep 2026, 12:18 PM

SS.Thaman: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి థమన్ తప్పుకున్నాడా?

SS.Thaman: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెకిస్తున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకి సంబందించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇంతకుముందున్న సంగీత దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ తప్పుకొని, ఆ స్థానంలోకి థమన్ వచ్చి చేరాడు. ఇప్పుడు, థమన్ స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ వచ్చాడని తెలుస్తోంది.

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!తెలంగాణSwechaa12 Sep 2026, 12:14 PM

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన స్వచ్ఛ ఆటో కార్మికుల అరెస్ట్!

 రాజధాని హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు తమ ఉపాధిని కాపాడుకోవాలని కోరుతూ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కార్మికులు శాసనసభ ముట్టడికి యత్నించారు. అయితే, బషీర్ బాగ్ సమీపంలోని ఎల్బీ స్టేడియం వద్ద అలర్ట్ అయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, ముందస్తుగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!వైరల్ న్యూస్Swechaa12 Sep 2026, 11:50 AM

కెనడాలో బీఫ్ గొడవ.. అద్దెదారుడిపై దాడికి దిగిన భారతీయ మహిళ అరెస్ట్!

కెనడాలోని సూర్రే (Surrey) నగరంలో భారత సంతతికి చెందిన ఒక ఇంటి యజమానురాలు (మహిళ), తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగి చివరకు పోలీసుల చేతిలో అరెస్టయింది. అద్దెదారుడు తన స్నేహితుడితో కలిసి ఇంటి బయట బార్‌బెక్యూ (BBQ)లో బీఫ్ (గోమాంసం) వండుకోవడం చూసి సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఆస్తి పాడవుతోందంటూ రాద్ధాంతం చేస్తూ వంట గ్రిల్‌లోని ఆహారాన్ని తొలగించేందుకు యత్నించింది.

Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!సినిమాSwechaa12 Sep 2026, 11:30 AM

Epic 2: ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ కూడానా!

Epic 2: మన ఇండస్ట్రీలో ఒకప్పుడు సీక్వెల్ చిత్రాలు అంతగా ఆడవని టాక్ ఉండేది. కానీ, బాహుబలి2, పుష్ప 2 అది తప్పని ప్రూవ్ చేశాయి. బాహుబలి 1 కంటే 2 భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే, పుష్ప ఫ్రాంఛైజీస్‌లో పార్ట్ 1 కంటే 2 ఊహించని వసూళ్ళు రాబట్టింది. కేజీఎఫ్ 2, కాంతార ఛాప్టర్ 1 కూడా అంతే. అయితే, ఇవన్నీ పాన్ ఇండియా స్కేల్ లో తీసిన సినిమాలు. కాబట్టి, వర్కౌట్ అయ్యాయి.

బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లుNationalSwechaa12 Sep 2026, 11:29 AM

బెంగళూరుకు బ్రేక్..! ఇక ఆ నగరాలే కర్ణాటక కొత్త గ్రోత్‌ ఇంజిన్లు

‘బియాండ్‌ బెంగళూరు’ పేరుతో కర్ణాటక డిజిటల్‌ ఎకానమీ మిషన్‌ ఇప్పటికే ఆ దిశగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. అంటే ఇక కర్ణాటక గ్రోత్‌ స్టోరీ అంటే బెంగళూరు ఒక్కటే కాదు. మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి–ధార్వాడ్‌, బెలగావి, కలబురగి, తుమకూరు, శివమొగ్గ వంటి నగరాలు కూడా తమదైన రంగాల్లో కొత్త కేంద్రాలుగా మారాలన్నదే లక్ష్యం.

యూరప్ దేశాలపై దాడులు  చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్ప్రపంచంSwechaa12 Sep 2026, 11:17 AM

యూరప్ దేశాలపై దాడులు చేయం : రష్యా అధ్యక్షుడు పుతిన్

యూరప్ దేశాలపై ఎలాంటి దాడులు చోయబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టంచేశారు. తమ దేశం నుంచి ఆ దేశాలకు ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. గతంలోనూ రష్యా నుంచి ముప్పు వాటిల్లలేదని తేల్చిచెప్పారు.తాము యూరప్ దేశాలను బెదిరించడం లేదని, మున్ముందు కూడా బెదిరించే ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. ఘర్షణ పడటానికి కూడా తమకు ఎలాంటి బలమైన కారణాలు లేవని, ఆ నిజాన్ని ఎవరూ గుర్తించడం లేదని వెల్లడించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇండియాకు వచ్చిన పుతిన్.. ప్రధాని మోడీ కీలక భేటీ నిర్వహించారు. అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.

తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!తెలంగాణSwechaa12 Sep 2026, 11:04 AM

తెలంగాణ భవన్‌లో 'మాక్ అసెంబ్లీ'.. సీఎంగా తలసాని.. స్పీకర్‌గా మాణిక్యరావు!

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం 'మాక్ అసెంబ్లీ' (నమూనా శాసనసభ) నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు.

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!తెలంగాణSwechaa12 Sep 2026, 10:44 AM

కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపిన పరిణామాల మధ్య మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇటీవల మాజీ ఓఎస్డీ సుమంత్ కుటుంబానికి సంబంధించిన వివాదాలు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సురేఖ హాజరు కాకపోవడం వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి, పార్టీ వ్యవహారాల్లో తిరిగి చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ ఆమెకు హితవు పలికారు.