స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!తెలంగాణSwechaa12 Sep 2026, 10:32 AM

మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై చర్యలేవి?.. డీజీపీకి కేటీఆర్ సూటి ప్రశ్న!

 తెలంగాణ శాసనసభ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన ఘటనలను ఆధారం చేసుకుని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ (X) వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను దారుణంగా దుర్వినియోగం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకే ఈ అసత్య కేసులు బనాయించారని, ఇది కాంగ్రెస్ అహంకార రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.

Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?సినిమాSwechaa12 Sep 2026, 10:27 AM

Devi Sri Prasad: RC 17 నుంచి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడా?

Devi Sri Prasad: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీప్రసాద్‌కి ఉన్న క్రేజ్ ఎటువంటిదో ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. సినిమాకి ఆయన సంగీతం అందిస్తున్నాడంటే, ఆ సినిమా మ్యూజికల్‌గా డెఫినెట్‌గా హిట్టే. బీజీఎం కూడా కథకి తగ్గట్టుగా అందిస్తాడు. ఈ విషయంలో ఎక్కువగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను అనుసరిస్తాడు. అయితే, తనకి ఎంతో ఇష్టమైన దర్శకుడు సుకుమార్ సినిమాకి రాక్ స్టార్ మిస్ అవుతున్నాడని అంటున్నారు.

TG: నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?తెలంగాణSwechaa12 Sep 2026, 09:49 AM

TG: నేటితో ముగియనున్న వర్షాకాల అసెంబ్లీ.. 22-A భూములపై రేవంత్ స్పష్టతనిచ్చేనా?

 తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో (సెప్టెంబర్ 12, శనివారం) ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో ఉభయ సభలు తీవ్ర ఉత్కంఠ మధ్య సాగే అవకాశముంది. నిషేధిత భూముల జాబితా పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22-A అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో సమగ్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్నారు. విపక్షాల విమర్శలకు బదులివ్వడంతో పాటు గత ప్రభుత్వంలో 22-A పేరుతో జరిగిన భూ అక్రమాలను వెలికితీసి, బాధితులకు ఊరట కల్పించేలా స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం సభ ముందుంచనుంది. అయితే, అసెంబ్లీలో 22-A నిషేధిత భూముల సమస్యపై చేపట్టే స్వల్పకాలిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని పలు కీలక అంశాలపై స్పష్టత ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సివుంది.

Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలుసినిమాSwechaa12 Sep 2026, 09:40 AM

Sai Durgha Tej: సంబరాల ఏటి గట్టు.. హీరోతోనే మొదలు

Sai Durgha Tej: మెగా హీరోలలో సాయి దుర్గ తేజ్ కి ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ మెగా హీరో నటించిన సినిమాలన్నీ చాలా క్లీన్ మూవీస్ గా వచ్చి హిట్ అందుకున్నాయి. విరూపాక్ష తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి దుర్గ తేజ్ ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటి గట్టు. ఈ సినిమాకి సంబందించిన డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది.

‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!NationalSwechaa12 Sep 2026, 09:15 AM

‘మోదీజీ.. ఒక్క ఫొటో దిగొచ్చా?..’ ప్రధానితో ఫొటోకు ఎగబడిన విదేశీ డెలిగేట్లు!

న్యూఢిల్లీ వేదికగా భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ఘట్టాల్లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన డెలిగేట్లు (విదేశీ ప్రతినిధులు) భారత ప్రధాని మోదీతో కలసి గ్రూప్ ఫొటో దిగేందుకు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీకి లభించిన ఈ అరుదైన గౌరవం, అంతర్జాతీయ ప్రతినిధుల ఆదరణకు సంబంధించిన దృశ్యాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వీడియో ద్వారా వెలుగులోకి వచ్చాయి.

The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాంసినిమాSwechaa12 Sep 2026, 09:10 AM

The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాం

The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..సెప్టెంబర్ 24న వస్తున్నాం.. అని నేచురల్ స్టార్ నాని మరోసారి 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఆయన హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కితున్న మాగ్నమస్ 'ది ప్యారడైజ్'. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అందరూ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా నాని కామెంట్స్ చూస్తుంటే థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం లేదు కాబట్టి సినిమానే నేరుగా థియేటర్స్‌లో చూడమంటున్నాడు.

BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!InternationalSwechaa12 Sep 2026, 09:03 AM

BRICSలోకి పాకిస్థాన్ ఎంట్రీకి భారత్ బ్రేక్..? మోదీ ‘నో’ వెనుక అసలు గేమ్ ఇదే!

BRICSలో కొత్త సభ్యుడిని చేర్చడం అంత సులభం కాదు. సభ్యత్వ నిర్ణయాలు ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాలి. అంటే.. ఒక్క కీలక సభ్య దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా పాకిస్థాన్ ఎంట్రీ ఆగిపోవచ్చు. ఇప్పుడు పాక్‌కు భార‌త్ నో చెబుతోంది.

కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్తెలంగాణSwechaa12 Sep 2026, 09:01 AM

కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం తప్పు: కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోగ్యం, వ్యక్తిగత అంశాలపై తోటి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ చనిపోవాలని ఏ ఒక్కరూ కోరుకోవడం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. సొంత పార్టీకి చెందిన షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబడుతూ దానం నాగేందర్ ఆయనకు బహిరంగంగానే గట్టి చురకలంటించారు.

బెంగాల్‌లో నాన్‌వెజ్‌పై బాబా వార్నింగ్.. కాళీఘాట్‌లో చేపలు తిన్న సువేందు!NationalSwechaa11 Sep 2026, 11:49 PM

బెంగాల్‌లో నాన్‌వెజ్‌పై బాబా వార్నింగ్.. కాళీఘాట్‌లో చేపలు తిన్న సువేందు!

బెంగాల్‌లో ఒక చేప ముక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దుర్గాపూజ వేళ చేపలు, మాంసం తినకూడదంటూ బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. ఇప్పుడు కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి చేపల భోగ్ స్వీకరించడంతో మరో మలుపు తిరిగింది

మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఎందుకింత ఆసక్తి..! ఢిల్లీలో ఏం జ‌ర‌గ‌బోతోంది..?InternationalSwechaa11 Sep 2026, 11:19 PM

మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఎందుకింత ఆసక్తి..! ఢిల్లీలో ఏం జ‌ర‌గ‌బోతోంది..?

ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపూ ఢిల్లీ వైపే ఉంది. కారణం.. భారత్‌ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు మాత్రమే కాదు.. దానికి మించిన మరో కీలక పరిణామం. అదే ప్రధాని నరేంద్ర మోదీ–చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ.

Raj Gopal Reddy: మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి ఆశలు.. ఇంకా ఎందుకు?తెలంగాణSwechaa11 Sep 2026, 10:17 PM

Raj Gopal Reddy: మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డికి ఆశలు.. ఇంకా ఎందుకు?

Raj Gopal Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కుతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే నిన్న మొన్నటి వరకు సొంత ప్రభుత్వంపైనే, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే బాహాటంగా విమర్శలు చేసిన రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ కావడం వెనుక కారణమేంటన్న చర్చ మొదలైంది.మంత్రి పదవిపై హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన తన వైఖరిని మార్చుకున్నారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై బహిరంగంగానే ప్రశ్నలు సంధించిన ఆయన.. ఇప్పుడు మాత్రం సీఎంతో సన్నిహితంగా కనిపించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో “మంత్రి పదవి కోసమే రాజగోపాల్‌రెడ్డి మెత్తబడ్డారా?” అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

తలరాతను మార్చే ఏకైక ఆయుధం విద్యే: సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa11 Sep 2026, 10:10 PM

తలరాతను మార్చే ఏకైక ఆయుధం విద్యే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : "ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా.. అక్షర జ్ఞానానికి దూరమైతే సమాజంలో వెనుకబడిపోవడం ఖాయం. ఒక మనిషి తలరాతను, ఒక జాతి భవిష్యత్తును సమూలంగా మార్చే ఏకైక తిరుగులేని ఆయుధం విద్య మాత్రమే" అని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. విద్య, భవిష్యత్ తరాల పునర్నిర్మాణంపై మాట్లాడిన సీఎం, రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రకటించారు.2024లో రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక సర్వే (సీపెక్) నివేదికలను ఉటంకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. సామాజికంగా ఎవరైనా వెనుకబడి ఉన్నారంటే దానికి ప్రధాన కారణం చదువు లేకపోవడమేనని ఆ సర్వే తేల్చిచెప్పిందన్నారు. "ప్రపంచవ్యాప్తంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు వచ్చిన తర్వాత విద్యా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మన బోధనా విధానాన్ని తీర్చిదిద్దాలి. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను నెలకొల్పిన పండిట్ నెహ్రూ మార్గంలో నడుస్తూ.. నేటి జెన్ జీ తరంతో పాటు రాబోయే జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాల భవితవ్యాన్ని ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే నిర్మిస్తాం" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

ఆర్మీ ఆయుధాలు చోరీ.. ఏం చేద్దామనుకున్నాడు? టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయా?క్రైమ్Swechaa11 Sep 2026, 10:08 PM

ఆర్మీ ఆయుధాలు చోరీ.. ఏం చేద్దామనుకున్నాడు? టెర్రరిస్టులతో లింకులు ఉన్నాయా?

Army Weapons Theft: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక వివరాలను వెల్లడించారు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్. విచారణ ఏ విధంగా జరిగింది, నిందితుడిని ఎలా గుర్తించారు, అతడు ఆయుధాలను ఏ విధంగా చోరీ చేశాడు, వెపన్స్ ను ఎక్కడ దాచాడు వంటి వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు.

సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేపట్టారు. ఆయుధాలను చోరీ చేసింది రిటైర్డ్ ఆర్మీ అధికారి అని ప్రాథమికంగా గుర్తించారు. నాగర్ కర్నూల్ లోని ఆర్మీ మాజీ అధికారి మల్లేశ్ ఇంటి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ మాజీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో కీలక విషయాలు రాబట్టారు.

418 Movie Trailer: సెన్సార్ వాళ్ళే భయపడ్దారుగా!సినిమాSwechaa11 Sep 2026, 09:33 PM

418 Movie Trailer: సెన్సార్ వాళ్ళే భయపడ్దారుగా!

418 Movie Trailer: హర్రర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. అప్పటి విఠలాచార్య సినిమాల నుంచి ఇటీవల మానస శర్మ రూపొందించిన రాకాస సినిమా వరకూ చాలామంది దర్శకులు ఇటివంటి జానర్స్ ని తీయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి సినిమాలకి సపరేట్ ఫ్యాన్స్, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఇలాంటి జానర్ నుంచి వస్తోన్న సినిమా 418. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

కోల్ స్కామ్‌తో AMRకు లింకులు.. మహేశ్‌రెడ్డి ఆఫీసులు, నివాసాల్లో ఈడీ సోదాలుతెలంగాణSwechaa11 Sep 2026, 09:27 PM

కోల్ స్కామ్‌తో AMRకు లింకులు.. మహేశ్‌రెడ్డి ఆఫీసులు, నివాసాల్లో ఈడీ సోదాలు

AMR GROUP : పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపిన అక్రమ బొగ్గు మైనింగ్, నిధుల మళ్లింపు వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రముఖ మౌలిక వసతుల సంస్థ 'ఏఎంఆర్ గ్రూప్' మెడకు చుట్టుకుంది. దాదాపు రూ.650 కోట్ల భారీ స్కామ్, హవాలా లింకులపై గురిపెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. ఏఎంఆర్ అధినేత ఎ.మహేశ్‌రెడ్డి లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో మెరుపు దాడులు చేపట్టారు.హైదరాబాద్ బంజారాహిల్స్ కమలాపురి కాలనీలోని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ప్రధాన కార్యాలయం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని మహేశ్‌రెడ్డి నివాసాలు, అనుబంధ కంపనీల్లో ఈడీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, ఝార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో స్థానిక ఈడీ అధికారులు కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, భారీ ఆర్థిక లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Chit Fund Scam: కూకట్‌పల్లిలో చిట్టీల పేరుతో టోకరా.. రూ.20 కోట్లతో పరార్క్రైమ్Swechaa11 Sep 2026, 08:31 PM

Chit Fund Scam: కూకట్‌పల్లిలో చిట్టీల పేరుతో టోకరా.. రూ.20 కోట్లతో పరార్

హైదరాబాద్ కూకట్‌పల్లిలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగుచూసింది. కిలాడీ దంపతులు అమాయకులను నిండా ముంచేశారు. సుమారు 20కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. కూకట్ పల్లిలోని సాయిచరణ్ కాలనీకి చెందిన రమణా రెడ్డి, సీతమ్మ దంపతులు కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. 15ఏళ్లుగా అక్కడే ఉంటూ స్థానికుల్లో మంచి నమ్మకం సంపాదించారు. వీరి దగ్గర సుమారు 50 మంది వరకు చిట్టీలు కట్టారు.

తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం..!తెలంగాణSwechaa11 Sep 2026, 08:03 PM

తెలంగాణలో అనలాగ్‌ పనీర్‌పై నిషేధం..!

TG SAFE: రాష్ట్రంలో కల్తీ, నకిలీ ఆహార పదార్థాల విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనలాగ్‌, నాన్‌-డెయిరీ, ఆర్టిఫిషియల్ (కృత్రిమ) పనీర్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

పనీర్‌ పేరుతో మార్కెట్లోకి వస్తున్న నాన్-డెయిరీ, కృత్రిమ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని టీజీ సేఫ్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006లోని సెక్షన్ 30(2)(a) నిబంధనల ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ అప్పటి నుంచే..!దునియాSwechaa11 Sep 2026, 07:12 PM

ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ అప్పటి నుంచే..!

Flipkart : ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఏడాదంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే అతిపెద్ద పండుగ రానే వస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చే 'బిగ్ బిలియన్ డేస్' సేల్ కోసం దేశవ్యాప్తంగా కోట్ల మంది వేచి చూస్తుంటారు. అయితే, కంపెనీ అధికారికంగా ప్రకటించకముందే ఈ మెగా సేల్ ఎప్పుడు మొదలవుతుందనే పక్కా సమాచారం నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తోంది.సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ లీక్ కలకలం రేపుతున్నప్పటికీ, దీనిపై ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. సంస్థ అంతర్గత ప్రణాళికలను బట్టి తేదీల్లో స్వల్ప మార్పులు చేర్పులు ఉండే అవకాశమూ లేకపోలేదు. పూర్తి షెడ్యూల్, బ్రాండ్ల వారీ ఆఫర్ల వివరాలు బయటకు రావాలంటే కంపెనీ లాంఛనంగా ప్రటించే వరకు వేచి చూడాల్సిందే. అయితేనేం, షాపింగ్ లిస్ట్ రెడీ చేసుకునేందుకు ఈ లీక్ అయిన సమాచారం కొనుగోలుదారులకు మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి.

మూసీ ప్రాజెక్టుకు మళ్లీ చిక్కులు..తెలంగాణSwechaa11 Sep 2026, 06:53 PM

మూసీ ప్రాజెక్టుకు మళ్లీ చిక్కులు..

Musi Project: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఒకటి. అత్యంత ప్రధానమైన ఈ ప్రాజెక్టుకు న్యాయపరమైన చిక్కులు తప్పడం లేదు. మూసీ ప్రాజెక్ట్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అప్పీల్ చేశారు. ఈ అప్పీల్ పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Anil Ravipudi-Venkey: జనవరి 12 విడుదల హంగామా మొదలైంది..సినిమాSwechaa11 Sep 2026, 06:21 PM

Anil Ravipudi-Venkey: జనవరి 12 విడుదల హంగామా మొదలైంది..

Anil Ravipudi: ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న 'జనవరి 12 విడుదల' సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మూవీ ఓపెనింగ్ నుంచే అనిల్ గత చిత్రాల మాదిరిగానే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్ లో అన్నట్టుగా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే 'జనవరి 12 విడుదల' సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్ళేందుకు జంధ్యాల నుంచి పలువురు దర్శకులను, సంగీత దర్శకులను వాడేశాడు.

భారీ బడ్జెట్ మూవీలు ఎందుకు బోల్తాపడుతున్నాయి?సినిమాSwechaa11 Sep 2026, 06:16 PM

భారీ బడ్జెట్ మూవీలు ఎందుకు బోల్తాపడుతున్నాయి?

Tollywood : చిత్రపరిశ్రమలో ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రం మార్మోగుతోంది.. అదే ‘పాన్ ఇండియా’. వందల కోట్ల బడ్జెట్, ఇంటర్నేషనల్ లెవెల్ టెక్నీషియన్లు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, మునుపెన్నడూ చూడని స్టార్ క్యాస్టింగ్ ఉంటే చాలు.. బాక్సాఫీస్ బద్దలైపోతుందని చాలామంది నిర్మాతలు నమ్ముతున్నారు. కానీ, థియేటర్ల ముందు సీన్ చూస్తుంటే మాత్రం పరిస్థితి తలకిందులవుతోంది. వందల కోట్లు గుమ్మరించినా కథలో సత్తా లేకపోతే ప్రేక్షకులు సింపుల్‌గా నో చెబుతున్నారు. భారీ బడ్జెట్ అంచనాలు తప్పుతుండటానికి, వరుస ప్లాప్‌లకు వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు టాలీవుడ్‌లో వేడివేడి చర్చకు దారితీస్తున్నాయి.వందల కోట్ల బడ్జెట్లు, హాలీవుడ్ స్థాయి విజువల్స్ సినిమాకు ఆకర్షణ మాత్రమే కానీ.. ఆత్మ కాదు. సినిమాకి అసలైన సోల్ స్టోరీ, ఆకట్టుకునే కథనం మాత్రమే. రీ-షూట్లను తగ్గించి, బడ్జెట్‌పై నియంత్రణ సాధించి, స్టార్ రెమ్యూనరేషన్ల కంటే కంటెంట్‌పై పెట్టుబడి పెట్టినప్పుడే పాన్ ఇండియా కలలు నిజమవుతాయి. లేకపోతే బాక్సాఫీస్ దగ్గర ఈ వందల కోట్ల లెక్కలు తప్పుతూనే ఉంటాయి.

Samyuktha Menon-Bdy Spl: 'స్వయంభు' మూవీ నుంచి స్పెషల్ వీడియో..తమన్నానే కనిపిస్తుందే!సినిమాSwechaa11 Sep 2026, 05:48 PM

Samyuktha Menon-Bdy Spl: 'స్వయంభు' మూవీ నుంచి స్పెషల్ వీడియో..తమన్నానే కనిపిస్తుందే!

Samyuktha Menon: నేడు మలయాళ భామ సంయుక్త మేనన్ పుట్టినరోజు( సెప్టెంబర్ 11.09.2026). ఈ సందర్భంగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ నుంచి అప్‌డేట్స్ ని ఇచ్చారు మేకర్స్. రామ్ పోతినేని నటిస్తున్న రాపో 23 లో సంయుక్త మేనన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయాన్ని తాజాగా ప్రకటించారు. అలాగే, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమా నుంచి బర్త్ డే విషెస్ తెలుపుతూ సంయుక్త పాత్రకి సంబందించిన చిన్న వీడియోను రిలీజ్ చేశారు.

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాల కలకలం..తెలంగాణSwechaa11 Sep 2026, 05:25 PM

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాల కలకలం..

ED Raids: హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్ కలకలం రేపాయి. AMR గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా AMR కంపెనీ ఆఫీసుల్లో సోదాలు చేశారు. హైదరాబాద్‌తో పాటుగా ఢిల్లీ, జార్ఖండ్, కోల్‌కతా‌లో ఏఎంఆర్ ఆఫీసుల్లో తనిఖీలు చేశారు.

కోల్‌కతా‌లోని ఈడీ జోనల్ ఆఫీస్ నుంచి ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వచ్చాయి. హైదరాబాద్ ఈడీ అధికారులతో సంయుక్తంగా ఏఎంఆర్ కంపెనీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కోల్‌కతాలో నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఏకకాలంలో ఈ రైడ్స్ జరిగాయి. నిధుల మళ్లింపుపైనా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

Telangana Politics : తెలంగాణలో కేసులు, ఫిర్యాదుల పర్వం.. ఇక రణరంగమేనా?తెలంగాణSwechaa11 Sep 2026, 05:21 PM

Telangana Politics : తెలంగాణలో కేసులు, ఫిర్యాదుల పర్వం.. ఇక రణరంగమేనా?

Telangana Politics : తెలంగాణ రాజకీయం అసెంబ్లీ గేట్లు దాటి కౌంటర్ కేసులు, పోలీస్ స్టేషన్ల పంచాయితీల వైపు మళ్లాయి. నిన్నటిదాకా మైకుల ముందు మాటల యుద్ధానికే పరిమితమైన నేతలు.. ఇప్పుడు ప్రత్యర్థులపై న్యాయపరంగా ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. "నువ్వు నాపై కంప్లైంట్ ఇస్తే.. నీపై అంతకంటే పెద్ద సెక్షన్లతో కేసు పెట్టిస్తా" అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ ఎఫ్‌ఐఆర్‌లతో రణరంగాన్ని తలపిస్తున్నారు.శాసనసభ వేదికగా మొదలైన రాజకీయ సెగలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టాయి. నల్ల చొక్కాలతో నిరసన తెలిపేందుకు సిద్ధమైన గులాబీ దళానికి, అసెంబ్లీ వద్ద మోహరించిన భద్రతా బలగాలకు మధ్య జరిగిన తోపులాటే ఈ కేసుల పర్వానికి తెరలేపింది. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై అనుచితంగా ప్రవర్తించారంటూ కేటీఆర్, హరీష్ రావు సహా కీలక బీఆర్ఎస్ నేతలపై సైఫాబాద్ పోలీసులు నాన్ బెయిలబుల్ స్థాయి ఆరోపణలతో కేసులు నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

'రేవంత్ ప్రభుత్వంలో ప్రజల భూములకు రక్షణ కరువు'తెలంగాణSwechaa11 Sep 2026, 04:48 PM

'రేవంత్ ప్రభుత్వంలో ప్రజల భూములకు రక్షణ కరువు'

తెలంగాణలో 22-ఏ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భూమి అనేది ప్రజల హక్కు అనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు. వ్యాపారంలో ఉన్నప్పుడు భూమి ఒక ఆస్తి కావచ్చని.. కానీ ప్రభుత్వంలో భూమి అనేది ప్రజల హక్కు అనే సోయి మరిచి జనాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి లక్షలాది మంది జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని విమర్శించారు.22-ఏ కారణంగా పిల్లల చదువులు, పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ఓ ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఊరంతా కలిసి ఆ వివాహాన్ని జరిపించిందని చెప్పారు. అయితే ఇంకా ఎన్ని పెళ్లిళ్లు ఇలా ఆగిపోయాయి? ఎన్ని గుండెలు పగిలిపోయాయి? ఎన్ని చదువులు నిలిచిపోయాయో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.

తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం..!తెలంగాణSwechaa11 Sep 2026, 04:20 PM

తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం..!

KTR: తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబసభ్యులు భూ దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం భూ రాబందులకు స్వర్ణయుగంలా మారిందని ధ్వజమెత్తారు. కొంగర కలాన్‌లో 100 ఎకరాల రైతుల భూమిపై కన్నేశారని.. ఒక సంస్థకు ఆ భూమిని కట్టబెట్టి వెయ్యి కోట్లు కాజేసే కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. కొంగర కలాన్ భూముల కుట్రపై ఆ సంస్థకు లేఖ రాస్తానని కేటీఆర్ తెలిపారు.

Indian-3: శంకర్-కమల్ ల సినిమాను లైట్ తీసుకుంటున్నారా?సినిమాSwechaa11 Sep 2026, 04:09 PM

Indian-3: శంకర్-కమల్ ల సినిమాను లైట్ తీసుకుంటున్నారా?

Indian-3: ఒకప్పుడు ఇండియన్ జేంస్ కెమరూన్ అనే పేరున్న దర్శకుడు శంకర్..ఇప్పుడు ఓ సాదా సీదా కొత్త దర్శకుడిగా హిట్ కోసం వెంపర్లాడుతున్నాడు. దీనికి, కారణం ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడమే. మళ్ళీ, ఇండియన్ సీక్వెల్ మూవీ ఇండియన్ 3తో వచ్చేందుకు శంకర్ రెడీ అవుతున్నాడట. కానీ, మళ్ళీ ఆయన సినిమాలు చూసేంత సాహసం చేయడానికి ఎవరూ రెడీగా లేరని చెప్పుకుంటున్నారు.

Harish : 22ఏతో లక్షల మంది భూములు కొట్టేయడానికి రేవంత్ కుట్రలు : హరీశ్‌రావుతెలంగాణSwechaa11 Sep 2026, 03:07 PM

Harish : 22ఏతో లక్షల మంది భూములు కొట్టేయడానికి రేవంత్ కుట్రలు : హరీశ్‌రావు

తెలంగాణలో 22-ఏ భూముల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. 22-ఏ అనేది లక్షల మంది ప్రజల ఆవేదనగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ సమస్య ఉందని, ఎవరి నోట విన్నా 22-ఏపై ఆవేదనే వినిపిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సమస్య మొదలైందని బాధితులు చెబుతున్నారని ఆయన అన్నారు. 1908లో బ్రిటిష్ కాలంలో 22-ఏ నిబంధనను తీసుకొచ్చారని హరీశ్‌రావు వివరించారు. నిర్దిష్టమైన భూములను నిషేధించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం దీని ఉద్దేశమన్నారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను కాపాడేందుకు 22-ఏ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. 22-ఏ 1(ఏ) కింద ప్రభుత్వ, పోరంబోకు భూములు, 22-ఏ 1(బీ) కింద ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, 22-ఏ 1(సీ) కింద దేవాదాయ, వక్ఫ్ భూములు, 22-ఏ 1(డీ) కింద ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన భూములు వస్తాయని చెప్పారు.

సభకు రాని కొండా సురేఖ.. సొంత ఎజెండాతోనే ముందుకు!తెలంగాణSwechaa11 Sep 2026, 02:39 PM

సభకు రాని కొండా సురేఖ.. సొంత ఎజెండాతోనే ముందుకు!

TG : మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచి సీనియర్ నాయకురాలు కొండా సురేఖ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పదవి ఊడగానే "త్వరలోనే నా దారెంటో చూపిస్తా" అంటూ హెచ్చరికలు చేసిన సురేఖ, ఆ తర్వాత మిన్నకుండిపోవడం వెనుక ఉన్నది నిస్తేజం కాదు... విస్ఫోటనానికి ముందున్న నిశ్శబ్దమేనా అనే సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సభకు విధిగా హాజరవుతుంటే సురేఖ మాత్రం అసెంబ్లీ గేటు కూడా తొక్కకపోవడం అధికార పార్టీలో తీవ్ర అంతర్మథనానికి దారితీసింది.ఎప్పుడూ దూకుడైన రాజకీయాలు చేసే కొండా దంపతులు ప్రస్తుతానికి కామ్‌గా కనిపిస్తున్నా, ఈ మౌనం వెనుక భారీ ప్రణాళికే దాగి ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి దూరంగా జరిగిన సురేఖ, సరైన ముహూర్తం చూసి కాంగ్రెస్‌పై ఏ తరహా బాంబు పేలుస్తారో అన్న ఉత్కంఠ ఇప్పుడు గాంధీభవన్‌లో మొదలైంది.

Naga Chaithanya-Nag: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..డిసెంబర్ లో అక్కినేని హీరోలుసినిమాSwechaa11 Sep 2026, 01:49 PM

Naga Chaithanya-Nag: ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్..డిసెంబర్ లో అక్కినేని హీరోలు

Naga Chaithanya: అక్కినేని ఫ్యామిలీ హీరోలు అక్కినేని నాగార్జున, తన తనయుడు నాగ చైతన్యలు నటిస్తున్న సినిమాలు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. ఆల్రెడీ నాగార్జున నటిస్తున్న 'కింగ్ 100' డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. అఫీషియల్‌గా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇప్పుడు, చైతూ కూడా డిసెంబర్ 4న 'వృష కర్మ' సినిమాతో రాబోతున్నాడు.