స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కాంగ్రెస్ భూస్కామ్‌పై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్తెలంగాణSwechaa11 Sep 2026, 01:37 PM

కాంగ్రెస్ భూస్కామ్‌పై హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్

 రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న 22A నిషేధిత భూముల వ్యవహారంపై బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి వందలాది మంది 22A భూబాధితులు శుక్రవారం తెలంగాణ భవన్‌కు భారీగా పోటెత్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులను నేరుగా కలసి తమ భూముల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమ హక్కు భుక్తంలో ఉన్న భూములను రీ-సర్వేల పేరుతో అక్రమంగా కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.

Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..సినిమాSwechaa11 Sep 2026, 12:59 PM

Samyuktha Menon: ఎనర్జిటిక్ స్టార్ కి జంటగా సంయుక్త..

Samyuktha Menon: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చారు మేకర్స్. ఇన్ని రోజులు ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు హీరోయిన్ సంయుక్త మేనన్ పుట్టిన రోజు సందర్భంగా..ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆమె నటిస్తున్న విషయాన్ని అఫీషియల్‌గా మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు.

ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!InternationalSwechaa11 Sep 2026, 12:45 PM

ఢిల్లీకి VVIP అతిథులు.. నోరూరించే విందు సిద్ధం!

రాజకీయ నాయకులు టేబుల్‌పై ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, భద్రత వంటి అంశాలపై చర్చించబోతున్నారు. అదే సమయంలో వారి ప్లేట్‌పై మాత్రం భారత్ తన సంప్రదాయాన్ని, సంస్కృతిని, ఆతిథ్యాన్ని పరిచయం చేయబోతోంది. అందుకే ఈసారి బ్రిక్స్ సమ్మిట్‌లో దౌత్యంతో పాటు.. భారతీయ రుచికి కూడా ఓ ప్రత్యేక స్థానం దక్కబోతోంది.

Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?సినిమాSwechaa11 Sep 2026, 12:34 PM

Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూలో బాలయ్య కీ రోల్?

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే, ఈ సినిమాకి సంబందించిన ప్రకటన వచ్చింది. దసరా పండుగనాడు అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయనున్నారు. అయితే, తాజా సమాచారం మేరకు మోక్షజ్ఞ మొదటి సినిమాలో బాలకృష్ణ కూడా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!సినిమాSwechaa11 Sep 2026, 12:34 PM

తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను టాలీవుడ్ పరిశ్రమలో తన ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తనకు ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గిపోయి, క్రమంగా అవకాశాలు లేకుండా పోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యం ఉన్న కథలు, సినిమాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ, కేవలం ఒకే ప్రాంతానికి చెందిన నేపథ్యం ఉన్నంత మాత్రాన ఎవరికీ అవకాశాలు ఊరికే వచ్చేయవని ఆమె స్పష్టం చేశారు.

POLITICAL MEMES: '1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!వైరల్ న్యూస్Swechaa11 Sep 2026, 12:20 PM

POLITICAL MEMES: '1980ల ఏఐ ట్రెండ్'తో రాజుకున్న రాజకీయాలు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మీమ్స్ వార్!

 సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న '1980ల ఏఐ ఫొటో ట్రెండ్' భారత రాజకీయాల్లో కొత్త రచ్చకు దారితీసింది. నెటిజన్లు, ప్రముఖులు తమ నేటి ఫొటోలను 1980ల కాలంనాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకునే సరదా ట్రెండ్‌గా ప్రారంభమైన ఈ ప్రక్రియ, చివరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలు, ఏఐ మీమ్ వార్‌గా పరిణమించింది. ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ పరస్పరం విమర్శలు గుప్పించుకోవడానికి ఈ ఏఐ చిత్రాలను వాడటంతో సోషల్ మీడియా వేదికలు వేడెక్కాయి.

ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?వైరల్ న్యూస్Swechaa11 Sep 2026, 11:36 AM

ElephantRescue: మెడకు ట్రాక్టర్ టైరు చిక్కుకుని ఏనుగు విలవిల.. చివరికి ఏం జరిగిందంటే?

 అస్సాంలోని గోలాఘాట్ జిల్లా పరిధిలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు ప్రాణసంకటంలో చిక్కుకుంది. ప్రమాదవశాత్తు దాని మెడకు ఒక పెద్ద ట్రాక్టర్ టైరు బిగుసుకుపోవడంతో సరిగా నడవలేక, కనీసం ఆహారం, నీరు కూడా తీసుకోలేక కొన్ని రోజులుగా తీవ్ర నరకయాతన అనుభవించింది. అడవిలో విలవిలలాడుతున్న ఆ మూగజీవి దీనస్థితిని గమనించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని స్థానిక అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!క్రైమ్Swechaa11 Sep 2026, 11:07 AM

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం!

 తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఆయన ఒకేసారి 40 నిద్రమాత్రలు మింగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కుటుంబసభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో సుబ్రహ్మణ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.

ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!InternationalSwechaa11 Sep 2026, 10:57 AM

ఒకే వేదికపై మోదీ–జిన్‌పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!

ఒకే నగరంలో.. ఒకే సమయంలో.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగల ముగ్గురు అగ్రనేతలు అడుగుపెట్టబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భేటీ కానున్నారు.

Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!సినిమాSwechaa11 Sep 2026, 10:10 AM

Gopichand Malineni: మైత్రీతో మరో సినిమా చేస్తా..అదెలా ఉంటుందంటే!

Gopichand Malineni: మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా ఇరుముడి సక్సెస్ ఈవెంట్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌తో ఓ సినిమా చేయాలి ఉంది. కానీ, కుదరలేదు. ఈ సారి చేసే సినిమా ఇరుముడి కంటే పెద్ద హిట్ అవుతుంది. ఆ తర్వాత శివ నిర్వాణ, అనిల్ రావిపూడి అంతకంటే పెద్ద హిట్ తీయడానికి ట్రై చేయాలని అన్నాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!ఏపీSwechaa11 Sep 2026, 10:09 AM

AP: పట్టాలు తప్పిన గూడ్స్.. 8 బోగీలు పడిపోయి నిలిచిన రైళ్ల రాకపోకలు!

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం ఉదయం ఒక రైలు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం-విజయవాడ ప్రధాన రైల్వే మార్గంలో ఉన్న కొవ్వూరు, పశివేదల మధ్య నడుస్తున్న ఒక గూడ్స్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రసాయనిక ఎరువుల (ఫెర్టిలైజర్స్) లోడుతో ఒడిశా నుంచి మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తున్న ఈ సరుకు రవాణా రైలుకు చెందిన 8 బోగీలు ఒక్కసారిగా ట్రాక్ తప్పి పక్కకు పడిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

Epic Movie-Oublic Talk: కథ రొటీన్..ఎందుకు తీశారో అర్థం కాదు!సినిమాSwechaa11 Sep 2026, 09:33 AM

Epic Movie-Oublic Talk: కథ రొటీన్..ఎందుకు తీశారో అర్థం కాదు!

Epic Movie: తాజాగా(11/09/2026) ప్రేక్షకుల ముందుకు వచ్చింది యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్'. 'బేబీ' సినిమాతో ఇద్దరూ మంచి పర్ఫార్మర్స్‌గా పాపులర్ అయిన జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేసిన సినిమా ఇది. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించాడు. ప్రమోషన్స్‌లో అద్భుతమైన సినిమా అంటూ ఊదరగొట్టారు. కానీ, సినిమా ఎందుకు తీశారో అర్థం కావడం లేదనేది ప్రేక్షకుల మాట.

AP: రూ.25కోట్ల ఆస్తి కోసమే .. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!క్రైమ్Swechaa11 Sep 2026, 09:30 AM

AP: రూ.25కోట్ల ఆస్తి కోసమే .. విచారణలో నోరు విప్పిన సాధిక్‌ఖాన్!

ఏపీలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాధిక్‌ఖాన్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. సర్పవరం పోలీసులు జరిపిన మూడు రోజుల కస్టడీ విచారణలో భాగంగా పక్కా సాంకేతిక ఆధారాలను ముందంచడంతో, నూకరాజు అల్లుడైన జగదీశ్వరరెడ్డిని తానే పథకం ప్రకారం విషం ఇచ్చి హత్య చేసినట్లు నిందితుడు స్పష్టం చేశాడు.

వీడిన బొల్లారం ఆయుధాల చోరీ కేసు మిస్టరీ.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో మాజీ మిలటరీ అధికారి!క్రైమ్Swechaa11 Sep 2026, 09:08 AM

వీడిన బొల్లారం ఆయుధాల చోరీ కేసు మిస్టరీ.. నలుగురి అరెస్ట్.. నిందితుల్లో మాజీ మిలటరీ అధికారి!

 సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాగారం (Armoury) నుంచి వెపన్స్ చోరీ కేసు మిస్టరీ వీడింది. ఈ సంచలనాత్మక కేసులో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ విజయం సాధించారు. రెండు వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ చోరీకి గురైన ఆయుధాలు, భారీ మొత్తంలో బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రిటైర్డ్ మిలిటరీ అధికారితో పాటు ఆయనకు సహకరించిన మరో ముగ్గురు సిబ్బందిని/అధికారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భారత్‌లో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. యుద్ధంపై మోదీతో కీలక చర్చలు..!InternationalSwechaa11 Sep 2026, 08:51 AM

భారత్‌లో అడుగుపెట్టిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. యుద్ధంపై మోదీతో కీలక చర్చలు..!

 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఉదయం భారత రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ (కేవీ సింగ్) ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో అత్యంత ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) ద్వారా పుతిన్ రాకను ధ్రువీకరిస్తూ, భారత్-రష్యాల మధ్య ఉన్న ప్రత్యేక, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి?HealthSwechaa11 Sep 2026, 06:24 AM

హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది? ముందుగా కనిపించే లక్షణాలు ఏంటి?

మారుతున్న నేటి జీవనశైలిలో 'హార్ట్ ఎటాక్' వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ భయపెడుతోంది. ఒకప్పుడు పెద్దవారికే పరిమితం అనుకున్న ఈ ప్రమాదం వల్ల ప్రస్తుతం రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది.. తీరిక లేని పరుగెత్తే జీవితం, మితిమీరిన మానసిక ఒత్తిడి, సరిగ్గా నిద్రలేని రాత్రులు... వీటితో పాటు జంక్ ఫుడ్ సంస్కృతి మన గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వినాయక చవితి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!SpiritualitySwechaa11 Sep 2026, 05:56 AM

వినాయక చవితి వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

వినాయక చవితి అంటే కేవలం గణపయ్యను ఇంటికి తీసుకొచ్చి పూజించే పండుగ మాత్రమే కాదు.. మనిషి జీవితానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందించే పవిత్రమైన రోజని మన వేదాలు చెబుతాయి.. పురాణాల్లో గణపతిని విఘ్నేశ్వరుడిగా, జ్ఞానానికి అధిపతిగా, బుద్ధికి ప్రతీకగా వర్ణించారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించే సంప్రదాయం వెనుక కూడా ఇదే అంతరార్థం ఉంది. ఇక గణపతి రూపంలోనే ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయని పేర్కొంటారు..

Kurnool: పోతిరెడ్డిపాడు వద్ద భారీ ప్రమాదం.. తెగిపోయిన  9వ గేటు రోప్!..ఏపీSwechaa11 Sep 2026, 05:51 AM

Kurnool: పోతిరెడ్డిపాడు వద్ద భారీ ప్రమాదం.. తెగిపోయిన 9వ గేటు రోప్!..

కర్నూలు జిల్లాలోని ప్రముఖ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో, హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించి గేట్లను పైకి ఎత్తుతున్న క్రమంలో అకస్మాత్తుగా 9వ గేటుకు సంబంధించిన రోప్ తెగిపోయింది. ఈ ఘటనతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గేటు కిందపడిపోవడంతో నీటి విడుదల నియంత్రణకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తిరుమలలో తెలియని ఆధ్యాత్మిక విశేషం.. పరిమళపు అర రహస్యం!..SpiritualitySwechaa11 Sep 2026, 05:40 AM

తిరుమలలో తెలియని ఆధ్యాత్మిక విశేషం.. పరిమళపు అర రహస్యం!..

తిరుమల శ్రీవారి ఆలయంలో అడుగడుగునా ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంటుందని మన పురాణాలు చెబుతాయి. అలాంటి విశిష్ట ప్రదేశాల్లో ఒకటి.. యోగ నరసింహస్వామి ఆలయ ప్రదక్షిణ మార్గంలో, దక్షిణాభిముఖంగా ఉన్న రాతిశిల. భక్తులు ప్రేమగా దీనిని పరిమళపు అర అని పిలుస్తారు.

పూర్వకాలంలో ప్రతి గురువారం.. మరుసటి రోజు జరిగే శుక్రవార అభిషేకానికి ఏర్పాట్లు ఇక్కడే జరిగేవని ఆలయ సంప్రదాయం చెబుతోంది. ముఖ్యంగా.. శ్రీవారి నుదుటన అలంకరించే ఊర్ధ్వపుండ్రానికి అవసరమైన పచ్చకర్పూరాన్ని ఈ సానరాతిపై నూరేవారు. అంతేకాదు.. పునుగు, జవ్వాది, కస్తూరి, కుంకుమపువ్వు వంటి పరిమళ ద్రవ్యాలను కూడా ఇక్కడే సిద్ధం చేసేవారని చెబుతారు.

మంత్రి పదవిపై హైకమాండ్‌ మాటిచ్చింది : రాజగోపాల్‌ రెడ్డితెలంగాణSwechaa10 Sep 2026, 10:07 PM

మంత్రి పదవిపై హైకమాండ్‌ మాటిచ్చింది : రాజగోపాల్‌ రెడ్డి

TG : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనకు మంత్రి పదవి విషయంలో అధిష్ఠానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి ఇవ్వడం సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో లేదని.. హైకమాండ్ నిర్ణయమే కీలకమని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాజగోపాల్‌ రెడ్డి తన రాజకీయ వైఖరిపై జరుగుతున్న ప్రచారంపైనా స్పందించారు. మంత్రి పదవి కోసం తాను సీఎం రేవంత్‌రెడ్డితో రాజీపడ్డానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అయితే తనకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే హైకమాండ్‌ మాట ఇచ్చిందని పేర్కొన్నారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

రంగారెడ్డి జిల్లాలో  ప్రముఖ రియల్టర్ ఆత్మహత్యక్రైమ్Swechaa10 Sep 2026, 09:59 PM

రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య

Ram Reddy: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లో ప్రముఖ రియల్టర్, హోమ్ ల్యాండ్ సంస్థ అధినేత రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కందుకూరు మండలం నేదునూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన ఉరి వేసుకున్నారు. పటాన్‌చెరులో 280 ఎకరాల్లో రాంరెడ్డి నూతన వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్ కు సంబంధించి తలెత్తిన వివాదాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

సింపతీ కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాకులాట.. మరి ప్రజా సమస్యలు..?తెలంగాణSwechaa10 Sep 2026, 09:58 PM

సింపతీ కోసం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాకులాట.. మరి ప్రజా సమస్యలు..?

TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతోంది. కానీ ప్రజల సమస్యలపై చర్చించాల్సిన వేదికగా భావించే అసెంబ్లీలో జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తే మాత్రం అసలు అజెండా ఎప్పుడో పక్కకు వెళ్లిపోయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా ఆరోపణలు, ప్రత్యారోపణలే కనిపించాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

అసెంబ్లీలో మూడు రోజుల పాటు పెద్దగా చర్చ జరగకుండా, రాజకీయ వివాదాలకే పరిమితం అయ్యిందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నాలుగో రోజు కూడా 22ఏ అంశంపై కొంత సేపు చర్చ జరిగింది. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పోలిస్తే ఈ ఒక్క అంశంపై జరిగిన ఆ కొద్ది పాటి చర్చ ఎంత వరకు ఉపయోగపడిందన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి మేధావి వర్గం వరకు వినిపిస్తున్నాయి.

పోలీసుల విచారణకు కొండా సురేఖ మాజీ ఓఎస్డీతెలంగాణSwechaa10 Sep 2026, 09:32 PM

పోలీసుల విచారణకు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ

Sumanth: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చాడు. ఓ రియల్టర్ పై దాడి కేసులో సుమంత్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు సుమంత్ గైర్హాజరులోనే ఉన్నాడు. ఇటీవల సుమంత్ కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుమంత్ తో పాటు మరో ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇదే సమయంలో సుమంత్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. పోలీసుల విచారణ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి.. పోలీసుల పిటిషన్తెలంగాణSwechaa10 Sep 2026, 09:23 PM

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలి.. పోలీసుల పిటిషన్

TG Politics : రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారిగా హాట్‌టాపిక్‌గా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిల కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నమోదైన కేసులో.. ఇద్దరు ఎమ్మెల్సీలకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా పోలీసులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.అసెంబ్లీ వద్ద ఆందోళన సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగడం, విధులకు ఆటంకం కలిగించడం, స్పీకర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసుల రిమాండ్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా నాంపల్లి కోర్టు ఇద్దరు ఎమ్మెల్సీలకు బెయిల్ మంజూరు చేసింది.

ఫ్లాష్‌ సర్వే చేయించాం.. బీఆర్‌ఎస్‌దే తప్పని ప్రజలు చెప్తున్నారు : సీఎం రేవంత్తెలంగాణSwechaa10 Sep 2026, 08:50 PM

ఫ్లాష్‌ సర్వే చేయించాం.. బీఆర్‌ఎస్‌దే తప్పని ప్రజలు చెప్తున్నారు : సీఎం రేవంత్

TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తాజాగా మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. గత మూడు రోజులుగా అసెంబ్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రభుత్వం నిర్వహించినట్లు చెబుతున్న ఫ్లాష్ సర్వే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే ఫలితాలను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో పంచుకున్నారు.అసెంబ్లీ సమావేశాల టైంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్రతరమైన వేళ ఈ ఫ్లాష్ సర్వే అంశం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, బీఆర్ఎస్ తీరుపైనే ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలో తేలిందంటూ సీఎం చెప్పడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ను నింపే అంశంగా మారింది.

అయితే ఇది ప్రభుత్వ అంతర్గతంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వేకు సంబంధించిన సమాచారం కావడంతో.. దాని పూర్తి వివరాలు, నమూనా, సర్వే విధానం వంటి అంశాలు బయటకు వస్తేనే ప్రజాభిప్రాయంపై స్పష్టమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

మొత్తంగా చూస్తే.. అసెంబ్లీ రచ్చను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రయత్నిస్తున్న వేళ.. “ప్రభుత్వంపై యాంటీ లేదు.. బీఆర్ఎస్ తీరునే ప్రజలు తప్పుబట్టారు” అన్న రేవంత్‌రెడ్డి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.

బీఆర్ఎస్‌ కుట్రలను ప్రజలకు వివరించాలి : సీఎం రేవంత్తెలంగాణSwechaa10 Sep 2026, 08:06 PM

బీఆర్ఎస్‌ కుట్రలను ప్రజలకు వివరించాలి : సీఎం రేవంత్

TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా జరుగుతోంది. ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి సూచించారు.

అయితే ఈ సమావేశంలో గులాబీ పార్టీపై రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “బీఆర్ఎస్‌కు అధికారం పోయినా అహంకారం పోలేదు” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపించారు.

ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు- కేటీఆర్ సెటైర్తెలంగాణSwechaa10 Sep 2026, 07:54 PM

ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు- కేటీఆర్ సెటైర్

KTR: సీఎం రేవంత్‌ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నా చేపట్టడం కలకలం రేపుతోంది. తమ పొలాలకు విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలన్నీ ఎండిపాయే నగాదారిలో’ అంటూ పాటలు పాడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

కొండారెడ్డిపల్లి రైతుల నిరసనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో స్పందించారు. రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని విమర్శించారు. సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి రైతులు ఆవేదన చూడండి అంటూ రైతులు నిరసన తెలిపిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారాయన. కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు ఇదే అంటూ సెటైర్ వేశారు కేటీఆర్.

ఢిల్లీకి బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..తెలంగాణSwechaa10 Sep 2026, 07:27 PM

ఢిల్లీకి బీఆర్ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు..

TG: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు జాతీయ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ వారు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు కంప్లైంట్ చేయనున్నారు.

ఇటీవల అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగినట్లు ఆరోపణలు రావడం తీవ్ర వివాదానికి దారితీసింది.

Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!సినిమాSwechaa10 Sep 2026, 06:47 PM

Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!

Sardar 2: నేడు(సెప్టెంబర్ 10) భారీ స్థాయిలో తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన సినిమా సర్దార్ 2. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ద్విపాత్రాభియంలో నటించాడు. సర్దార్ కి దర్శకత్వం వహించిన పి.ఎస్.మిత్రన్ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించాడు. హీరోయిన్స్‌గా ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ సర్దార్ 2పై భారీ అంచనాలు పెట్టుకుంటే అవి కాస్తా నిరాశపరిచాయి.

ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవుతెలంగాణSwechaa10 Sep 2026, 06:19 PM

ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు కరెంటు కోసం, నీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే కృష్ణా జలాలను ఏపీకి వదులుతున్నారని చెప్పారు. కళ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. కల్వకుర్తిలో 3 మోటార్లు ఎందుకు బంద్ పెట్టారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.