స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌కు బిగ్ ఛాలెంజ్!!..తెలంగాణSwechaa08 Sep 2026, 08:39 AM

బీఆర్ఎస్ నేతల అరెస్టుపై కేటీఆర్ ఫైర్.. కాంగ్రెస్‌కు బిగ్ ఛాలెంజ్!!..

తెలంగాణ రాజకీయాల్లో అరెస్టుల వ్యవహారం మరోసారి కాక రేపుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టులను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా ఫేక్ కేసులతో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. అరెస్టులు, నిర్బంధాల్లో మాత్రం సక్సెస్ అయిందని ఎద్దేవా చేశారు. 420 హామీలు అమలు చేస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతామని కేటీఆర్ సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ మరింత ముదిరింది.

తెలంగాణలో హైటెన్షన్..  బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!!తెలంగాణSwechaa08 Sep 2026, 08:20 AM

తెలంగాణలో హైటెన్షన్.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్!!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాల తొలిరోజు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు నల్ల టీ-షర్టులతో అసెంబ్లీకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోగా.. తాతా మధు వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు మంగళవారం తెల్లవారుజామున న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Allu Arjun-Raaka: ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ 300 కోట్లు..ఇది ప్రభాస్ కంటే ఎక్కువే?సినిమాSwechaa08 Sep 2026, 07:28 AM

Allu Arjun-Raaka: ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ 300 కోట్లు..ఇది ప్రభాస్ కంటే ఎక్కువే?

Allu Arjun: టాలీవుడ్ లో ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్‌గా పుష్ప ఫ్రాంఛైజీస్‌తో ఐకాన్ స్టార్ మారి, గ్లోబల్ రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా రాకా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకుడు అట్లీ కుమార్. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి మన ఐకాన్ స్టార్ అందుకుంటున్న రెమ్యునరేషన్ రూ.300 కోట్లని లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్తెలంగాణSwechaa07 Sep 2026, 10:11 PM

ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. ఎమ్మెల్యే పీఏ అరెస్ట్

TG: ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భద్రాచలానికి చెందిన రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

కల్యాణ్‌ సుమారు 54 మంది నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి దాదాపు రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల నుంచి తీసుకున్న మొత్తాలను ఉద్యోగాల కోసం యూజ్ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించినట్లు బాధితుడు తన ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!సినిమాSwechaa07 Sep 2026, 09:56 PM

Vishwambara: ‘విశ్వంభర’ను పక్కన పెట్టారా? వేరే ప్రాజెక్టుల్లో బిజీగా చిరంజీవి-వశిష్ఠ!

Vishwambara: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్‌లో తెరకెక్కిన సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్‌పై మరోసారి చర్చ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో మెగా అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

మెగాస్టార్‌ను సరికొత్త ఫాంటసీ ప్రపంచంలో చూపించనున్నారనే ప్రచారంతో ఫస్ట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే వచ్చిన కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. అయితే 2025 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడింది. అనంతరం 2026 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చనే వార్తలు వినిపించినా అది కూడా జరగలేదు. ప్రస్తుతం చిరంజీవి తన కొత్త మూవీ ‘కాకా’ పనుల్లో బిజీగా ఉన్నారు.

స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్‌బాబుతెలంగాణSwechaa07 Sep 2026, 09:36 PM

స్పీకర్‌పై ఆ మాటలేంటి? కేసీఆర్‌ది బాధ్యత కాదా : శ్రీధర్‌బాబు

TG: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా స్పందించారు. సభ్య సమాజం అసహ్యించుకునేలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. కేసీఆర్‌ ఖండించకపోతే ఆ వ్యాఖ్యల వెనుక ఆయన ప్రేరణ ఉందనే అనుమానాలు కలుగుతాయని కామెంట్స్ చేశారు. పార్టీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

పోలీసులపై దాడి చేశారని ఆరోపణ

అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేటీఆర్‌ సహా కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో నడుచుకున్న తీరు ఘోరం ఉందన్నారు. యూనిఫామ్‌లో ఉన్న అధికారుల కాలర్‌ పట్టుకోవడం, గొంతు నొక్కినట్లు కనిపించడం మీడియా ఛానెల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పోలీసులపై ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. పోలీస్ స్టేషన్‌లో కలకలంక్రైమ్Swechaa07 Sep 2026, 09:30 PM

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని.. పోలీస్ స్టేషన్‌లో కలకలం

Fire Self: మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో కలకలం చెలరేగింది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ప్రేమ వ్యవహారంలో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తూ ఆ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..సినిమాSwechaa07 Sep 2026, 09:14 PM

Sukumar: RC 17 ఫైనల్ నరేషన్‌కి రెడీ..చరణ్ ఛేంజస్ చెప్పకపోతే డిసెంబర్ నుంచే..

Sukumar: పుష్ప ఫ్రాంఛైజీస్‌తో రాజమౌళి రేంజ్‌లో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ అండ్ మార్కెట్‌ను సంపాదించుకున్నాడు సుకుమార్. ఇప్పుడు, ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం పూర్తి స్థాయిలో కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. తాజా సమాచారం మేరకు ఆర్సీ 17 ఫుల్ స్క్రిప్ట్ లాకైనట్టుగా తెలుస్తోంది. చరణ్ అపాయింట్మెంట్ ఇవ్వగానే సుక్కూ ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నాడు.

7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?NationalSwechaa07 Sep 2026, 08:45 PM

7 లక్షల మంది.. 8 వేల గదులు..! ఢిల్లీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప్రాణాలకు లెక్క లేదా?

మంచి చదువు.. మంచి కెరీర్.. మంచి భవిష్యత్తు కోసం వేలాది మంది యువత ఢిల్లీ యూనివర్సిటీ వైపు అడుగులు వేస్తారు. కానీ వాళ్లు అక్కడికి వెళ్లిన తర్వాత ఎదురయ్యే అసలు ప్రశ్న.. చదువుకోవడానికి వచ్చాం.. ఉండటానికి సురక్షితమైన చోటు ఎక్కడ? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సత్య నికేతన్ శిథిలాల మధ్య వెతకాల్సిన పరిస్థితి వచ్చింది.

డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీఏపీSwechaa07 Sep 2026, 08:41 PM

డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టులు సరైనవే : శాప్‌ ఎండీ

AP: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని శాప్‌ ఎండీ భరణి అన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీలో ఎలాంటి తప్పులకు తావులేకుండా నిబంధనల ప్రకారమే ఎంపిక చేపట్టినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పాఠశాల విద్య కమిషనర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి ఆమె ఈ రోజు మీడి.జూడో కోటాలో ఎంపికైన అభ్యర్థులపై దాఖలైన పిటిషన్‌ నేపథ్యంలో అన్ని ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. డీవోపీటీ సూచనలు, హైకోర్టు ఆదేశాల మేరకే ప్రక్రియను పూర్తి చేశామని, ఎలాంటి నిబంధనలను మార్చలేదని వెల్లడించారు. ఒకే టోర్నీలో పాల్గొన్న భార్యాభర్తలను కూడా నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. పోటీల్లో పాల్గొనాలంటే తప్పనిసరిగా అదే ప్రాంతంలో చదువుకోవాలనే నిబంధన లేదని వివరించారు.

Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్సినిమాSwechaa07 Sep 2026, 08:27 PM

Nani-Srikanth Odela: ప్యారడైజ్ పోస్ట్ పోన్..(X)లో క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Nani-Srikanth Odela: సోషల్ మీడియా వచ్చాక గంట గంటకి ఒక వార్త వచ్చి జనాలని కన్‌ఫ్యూజ్ చేస్తోంది. ముఖ్యంగా, రాజకీయాలకి.. సినిమాలకి సంబందించి వస్తున్న వార్తల్లో సగానికి సగం ఫేక్ న్యూస్, రూమర్సే ఉంటున్నాయి. ఒక వార్త వచ్చి వైరల్ అయ్యే లోపే..దానికి సంబందించిన వారు వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. వ్యూస్ కోసమో..ఫాలోయింగ్ కోసమో ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం ఒకరకంగా జనాలను తప్పుదోవ పట్టించడమే.

#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?సినిమాSwechaa07 Sep 2026, 08:16 PM

#RanabaaliTeaser: రణబాలి టీజర్‌తో ఆ విషయం క్లారిటీ రానుందా?

#RanabaaliTeaser: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల, మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 9న రణబాలి టీజర్ వస్తుందని ఎక్స్ ద్వారా ప్రకటించారు.

మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. హైకోర్టు సీరియస్..తెలంగాణSwechaa07 Sep 2026, 08:13 PM

మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.. హైకోర్టు సీరియస్..

Telangana High Court: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇవాళ జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న ఘటనలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ్యుల హక్కులు, సభా వ్యవహారాల్లో పోలీసుల అధికార పరిధికి సంబంధించి ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కీలక ఆదేశాలిచ్చింది.

తెలంగాణలో సర్ గడువు పొడిగింపుతెలంగాణSwechaa07 Sep 2026, 07:35 PM

తెలంగాణలో సర్ గడువు పొడిగింపు

తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 16తో ముగియాల్సిన గడువును ఇప్పుడు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు, వివరాల్లో మార్పులు లేదా ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఈ గడువులోగా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ప్రజలకు మరింత సమయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు సంబంధించి భారత ఎన్నికల సంఘం తాజా కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు ఉన్న గడువును పొడిగిస్తూ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ముందుగా సెప్టెంబర్ 16తో ముగియాల్సిన గడువును ఇప్పుడు అక్టోబర్ 7 వరకు పొడిగించింది.

SS.Rajamouli: వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 350 కోట్ల బిజినెస్..అంత జరుగుతుందా?సినిమాSwechaa07 Sep 2026, 07:31 PM

SS.Rajamouli: వారణాసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 350 కోట్ల బిజినెస్..అంత జరుగుతుందా?

SS.Rajamouli: బాహుబలి సినిమాల నుంచి రాజమౌళి తెలుగు సినిమాకి ఒక బ్రాండ్ అయ్యాడు. భారీ తారాగణంతో సినిమా తీస్తున్నప్పటికీ, ఒక్క రాజమౌళి పేరు మీదే యావత్ ప్రపంచమంతా ఊహించని రీతిలో బిజినెస్ జరుగుతోంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న వారణాసి సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే రూ.350 కోట్ల బిజినెస్ జరుగుతున్నట్టుగా సమాచారం.

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..తెలంగాణSwechaa07 Sep 2026, 07:23 PM

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి గ్రీన్ సిగ్నల్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!..

తెలంగాణలోని ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి స్పష్టం చేశారు. ఛార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ప్రమాద, సహజ మరణాలకు ఇందిరమ్మ బీమా పాలసీ తెస్తామన్నారు. అలాగే పర్యావరణహిత ఆటోల కోసం రూ.200 కోట్లతో 18,766 ఆటోలకు ఒక్కోదానికి లక్షన్నర ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

Naga Chaitanya-Vrushakarma: "వృష కర్మ"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?సినిమాSwechaa07 Sep 2026, 07:03 PM

Naga Chaitanya-Vrushakarma: "వృష కర్మ"..ఈ ఏడాది మర్చిపోవాల్సిందేనా?

Naga Chaitanya: టాలీవుడ్‌లో మిగతా హీరోలతో పోల్చి చూసుకుంటే అక్కినేని నాగ చైతన్య కాస్త డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. అంతేకాదు, ఒక్కో కథను చాలా సెలెక్టెడ్‌గా ఎంచుకుంటున్నాడు. గత చిత్రం తండేల్ భారీ విజయాన్ని అందుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత మళ్ళీ కొత్త సినిమాకి సంబందించిన అప్‌డేట్స్ మాత్రం దాదాపు ఆరు నెలల నుంచి రావడం లేదు.

తాతా మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలి- సీఎం రేవంత్తెలంగాణSwechaa07 Sep 2026, 07:02 PM

తాతా మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలి- సీఎం రేవంత్

Cm Revanth: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ తెలంగాణకు చీకటి రోజు అని.. ఇది 4కోట్ల మంది ప్రజలకు జరిగిన అవమానం అని అన్నారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాత మధు సభ్యత్వం బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై సభలో మాట్లాడారు సీఎం రేవంత్. ఎమ్మెల్సీ మధు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హితవు పలికారు. సభలో ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా స్పీకర్ కు సమానమే అని చెప్పారు. అలాంటి స్పీకర్ మనసు గాయపడేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఇది వ్యక్తిగా గడ్డం ప్రసాద్ కుమార్ కి జరిగిన అవమానం కాదని, సభ్య సమాజానికి జరిగిన అవమానం అని రేవంత్ అన్నారు.

Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..NationalSwechaa07 Sep 2026, 06:41 PM

Gas booking: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రీఫిల్ బుకింగ్‌లో కీలక మార్పులు!..

గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 25 రోజులకే ఎల్‌పీజీ సిలిండర్‌ రీఫిల్‌ బుక్‌ చేసుకోవచ్చు. గతంలో సరఫరాపై ఒత్తిడి కారణంగా గ్రామాల్లో 45 రోజుల పరిమితి విధించడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఆ ఆంక్షలను కేంద్రం సడలించింది. ఇక పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో 25 రోజులకే రీఫిల్‌ బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పించింది.

Keerthy Suresh-Nani: క్రేజీ న్యూస్..ప్యారడైజ్‌లో మహానటి!సినిమాSwechaa07 Sep 2026, 06:38 PM

Keerthy Suresh-Nani: క్రేజీ న్యూస్..ప్యారడైజ్‌లో మహానటి!

Keerthy Suresh: ది ప్యారడైజ్..నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. ఈ నెల 24న 7 భాషలలో రిలీజ్ కాబోతోంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఏషనాగుల సాంగ్ యూట్యూబ్ లో సెన్షేషన్ ని క్రియేట్ చేసింది. ఆ ప్రభావమే, ఇప్పుడు కీర్తి కూడా 'ది ప్యారడైజ్. సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోందని వార్త వైరల్ అవుతోంది.

బీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాళ్లపై దాడికి కారణం రేవంతే : కేటీఆర్తెలంగాణSwechaa07 Sep 2026, 06:37 PM

బీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాళ్లపై దాడికి కారణం రేవంతే : కేటీఆర్

KTR: చట్టసభల్లో సమస్యలపై చర్చించడంతో పాటు అవసరమైతే నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు చీర పట్టి లాగడంతో ఆమె కంచెపై పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఘటనలో కోవ లక్ష్మి లేకపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని వ్యాఖ్యానించారు. చివరకు సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, సాధికారత గురించి కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడుతుంటే.. రాష్ట్రంలో వారి పార్టీ ప్రభుత్వం కింద మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం అన్నారు.

బీఆర్ఎస్ వరుస నిరసనలు.. బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దనేనా?తెలంగాణSwechaa07 Sep 2026, 05:44 PM

బీఆర్ఎస్ వరుస నిరసనలు.. బీజేపీకి ఆ ఛాన్స్ ఇవ్వొద్దనేనా?

కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగినప్పుడు ఆ రాజకీయ ప్రయోజనం బీఆర్‌ఎస్‌కు దక్కాలా? లేక బీజేపీకి వెళ్లాలా? బీఆర్‌ఎస్‌ వరుస ఆందోళనలకు దిగుతున్న తీరు చూస్తే.. రెండో అవకాశానికి ఛాన్స్ ఇవ్వకూడదనే వ్యూహంతోనే గులాబీ పార్టీ ముందుకు వెళ్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.బీజేపీకి ప్రతిపక్ష స్పేస్ దక్కకుండా చేయడమే బీఆర్‌ఎస్‌ అసలు టార్గెటా? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.తెలంగాణలో బీజేపీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన బేస్‌ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమల దళం భావిస్తోంది. ఇదే బీఆర్‌ఎస్‌కు అసలు సవాల్‌గా మారుతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళ్లితే గులాబీ పార్టీ రాజకీయంగా మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ‘కాంగ్రెస్‌పై పోరాడేది మేమే.. ప్రజల సమస్యలపై రోడ్డెక్కేది మేమే’ అనే ఇమేజ్‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ గట్టిగా ప్రయత్నిస్తోందనే టాక్ వినిపిస్తోంది.

National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..వ్యాపారంSwechaa07 Sep 2026, 05:34 PM

National: వినియోగదారులకు షాకిచ్చిన మారుతీ సుజుకీ.. పెరిగిన కార్ల ధరలు!..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది.. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై రూ.20 వేల వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. సవరించిన ధరలు సెప్టెంబర్ నుంచే అమల్లోకి వచ్చాయని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ముడిసరుకుల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. కాగా.. ఈ ఏడాది మే నెల నుంచి మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

స్పీకర్‌ను గౌరవిస్తాను, ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా- ఎమ్మెల్సీ తాతా మధుSwechaa07 Sep 2026, 05:25 PM

స్పీకర్‌ను గౌరవిస్తాను, ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా- ఎమ్మెల్సీ తాతా మధు

Mlc Tata Madhu: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపాయి. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల పెద్ద గొడవే జరుగుతోంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు. స్పీకర్ ను నేను ఏమీ అనలేదు అని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని వెల్లడించారు. స్పీకర్ ని ఉద్దేశించి తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. నేను అనని మాటలను నాకు అపాదించడం సరైంది కాదన్నారు. ''ఒకవేళ నేను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్ ను ఉద్దేశించినట్లు భావిస్తే.. ఆ మాటలు నేను ఉపసంహరించుకుంటున్నా. అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నా'' అని తాతా మధు అన్నారు.

Kerala: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్.. పైలట్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం!..NationalSwechaa07 Sep 2026, 04:56 PM

Kerala: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్.. పైలట్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం!..

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండ్‌ చేశారు. ఈ విమానం సోమవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుధాబికి బయల్దేరింది. టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత.. మొదటి ఇంజిన్‌లో ఆయిల్‌ తగ్గడాన్ని పైలట్లు గుర్తించారు. ఆయిల్‌ ప్రెజర్‌ ప్రమాదకర స్థాయికి చేరడంతో వెంటనే ఆ ఇంజిన్‌ను ఆపివేశారు. మిగిలిన ఒకే ఇంజిన్‌తో ప్రయాణం కొనసాగించడం కష్టం కావడంతో విమానాన్ని వెంటే వెనక్కి మళ్లించారు.

అసెంబ్లీలో స్పీకర్ కంటతడి..  సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం!తెలంగాణSwechaa07 Sep 2026, 04:56 PM

అసెంబ్లీలో స్పీకర్ కంటతడి..  సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం!

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సభ కొనసాగుతుండగానే ఛైర్‌లో ఉన్న స్పీకర్ కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసెంబ్లీ వెలుపల స్పీకర్‌ను ఉద్దేశించి తీవ్ర అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సభలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలు సభలో చర్చలు జరుపుతున్న తరుణంలోనే స్పీకర్ కన్నీళ్లు పెట్టుకోవడంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

Vijay: లంచాలను ఈఎంఐల్లాగా తీసుకున్నారు : సీఎం విజయ్NationalSwechaa07 Sep 2026, 04:50 PM

Vijay: లంచాలను ఈఎంఐల్లాగా తీసుకున్నారు : సీఎం విజయ్

CM Vijay: తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి గతంలో వాయిదాల పద్ధతిలో లంచాలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్టుగా.. కాంట్రాక్టర్లు కూడా క్రమం తప్పకుండా లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు.

Cm Revanth: తెలంగాణకు చీకటి రోజు.. 4కోట్ల మందికి అవమానంతెలంగాణSwechaa07 Sep 2026, 04:33 PM

Cm Revanth: తెలంగాణకు చీకటి రోజు.. 4కోట్ల మందికి అవమానం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు ముక్త కంఠంతో తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. అసభ్యపదజాలంతో స్పీకర్ ను దూషించిన తాతా మధును వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

తాతా మధు వ్యవహారంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన ముఖ్యమంత్రి రేవంత్..ఈరోజు నాలుగు కోట్ల ప్రజలకు అవమానం జరిగిందని వాపోయారు. సభాపతికి జరిగిన అవమానం.. సభ్య సమాజానికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. ఇది అనాలోచితంగా జరిగిన చర్య కాదు పథకం ప్రకారం జరిగిందే అని ఆయన ఆరోపించారు.

ఇలాంటి భాష వాడిన తాతా మధును డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అలాగే స్పీకర్ ను ఉద్దేశించి అసభ్యకర భాష వాడిన తాతా మధుతో రాజీనామా చేయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి లాగిన పోలీసులు..?తెలంగాణSwechaa07 Sep 2026, 03:56 PM

సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి లాగిన పోలీసులు..?

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పోలీసులు, బీఆర్ఎస్ శాసనసభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ పాలనా వైఫల్యం, హామీలపై నిలదీస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపిన బీఆఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్దకు పాదయాత్రగా బయలుదేరారు. తీరా అసెంబ్లీ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. నల్ల దుస్తులు, ప్లకార్డులు పట్టుకోని లోనికి వెళ్లడానికి వీల్లేదంటూ ఆపారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు, పోలీసుల నడుమ నెలకొన్న వివాదం ముదిరింది. తోపులాట నెలకొనడంతో పోలీసులు వారిని లాగేశారు.

NHAI: కారులో హైవేపై వెళ్తున్నారా..? ఫొటో తీసి పంపితే చాలు.. రూ.1000 రివార్డ్!NationalSwechaa07 Sep 2026, 03:49 PM

NHAI: కారులో హైవేపై వెళ్తున్నారా..? ఫొటో తీసి పంపితే చాలు.. రూ.1000 రివార్డ్!

NHAI: నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అదిరిపోయే బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఇందుకోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు.. కేవలం హైవేపై టాయిలెట్ల పరిశుభ్రతపై ఫిర్యాదు చేస్తే రూ.1000 విలువైన FASTag రీఛార్జ్‌ను ఉచితంగా మీరు గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా NHAI ప్రత్యేకంగా ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను నిర్వహిస్తోంది. ఈ క్యాంపెయిన్‌ను తాజాగా వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించింది.

ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా 429 మంది ప్రయాణికులు రూ.1000 చొప్పున ఉచిత FASTag రీఛార్జ్ పొందినట్లు తాజాగా NHAI వెల్లడించింది. అయితే ఈ రివార్డ్ పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని చెప్పింది. ఇంతకీ అవి ఏంటో తెలుసా..