స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ప్రముఖ యూట్యూబర్ నందన ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్!క్రైమ్Swechaa07 Sep 2026, 03:16 PM

ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. ప్రముఖ యూట్యూబర్ నందన ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్!

సోషల్ మీడియా వేదికగా ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయక నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసగించిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ఆమె విదేశాలకు పారిపోకుండా ఇదివరకే విచారణ అధికారులు లుకౌట్ సర్క్యులర్ (Lookout Notice) జారీ చేసి ఉంచడంతో, విమానాశ్రయానికి చేరుకున్న ఆమెను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి వెంటనే స్వాధీనం చేసుకున్నారు.

అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!..తెలంగాణSwechaa07 Sep 2026, 02:56 PM

అసెంబ్లీలో హిట్ ఎక్కిన రాజకీయం.. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!..

తెలంగాణ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ ఎపిసోడ్ తరువాత ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే బీఆర్ఎస్ నేతల నిరసనలు వివాదాస్పదంగా మారాయి. గులాబీ నేతలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఆ ఎమ్మెల్సీ పై వేటు వేయాలంటూ మంత్రులు ఫిర్యాదు చేసారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది.

చిత్రం లేదు
NationalSwechaa07 Sep 2026, 02:48 PM

దేశ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం: లోక్‌సభ స్పీకర్

భారతదేశ చరిత్ర, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వంలో మహిళలు ఎల్లప్పుడూ మహత్తర మార్పునకు మార్గదర్శకులుగా నిలుస్తూ దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జాతీయ మహిళా కమిషన్ (NCW) ఆధ్వర్యంలో మహిళా శాసనసభ్యుల కోసం నిర్వహించిన రెండు రోజుల జాతీయ సామర్థ్య పెంపుదల వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళల్లో ఉన్న సహజసిద్ధమైన నాయకత్వ పటిమను మరింత బలోపేతం చేసేందుకు, వారికి సమాజంలో తగిన ప్రోత్సాహం, సరైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిలయ్యారా..?తెలంగాణSwechaa07 Sep 2026, 02:41 PM

ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిలయ్యారా..?

TG: తెలంగాణలో ఈరోజు నుంచి సభాపర్వం మొదలైంది. ఎప్పట్లాగానే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, శాసనసభ విపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు తీర్పుకనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన కేసీఆర్ ఇప్పటి వరకు వేళ్ళ మీద లెక్కించినన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరై అపకీర్తిని మూట పెట్టుకున్నారు. అధికారం దూరమైందన్న కారణంగానే ఆయన అసెంబ్లీకి రావడం మానేశారనే విమర్శలను బీఆర్ఎస్ అధినేత నిజం చేస్తున్నారా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎస్ఐఆర్ మాటున కోటి ఓట్లు తొలగించే కుట్ర : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa07 Sep 2026, 02:40 PM

ఎస్ఐఆర్ మాటున కోటి ఓట్లు తొలగించే కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ఎస్ఐఆర్ మాటున ఒక కోటి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తమ వ్యతిరేక ఓట్లను గుర్తించేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఏజెన్సీలను పెట్టుకుందని, 2009 నుంచి ఓటింగ్ సరళని పరిశీలించి వారికి అనుకూల ఓట్లను ఉంచుకుని, వ్యతిరేక ఓట్లను డిలీట్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవస్థ సిద్ధమవుతోందని గ్రహించి ‘ఎస్ఐఆర్’ రూపంలో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు. తెలంగాణలో దాదాపు కోటి ఓట్లు తొలగిస్తున్నా బీఆర్ఎస్ వాళ్లు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. సోమవారం రవీంద్రభారతిలో ప్రముఖ రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సెక్యూలర్ శక్తులు సమిష్టిగా మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు.

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీ స్థాపనపై కీలక విషయాలు వెల్లడి!ఏపీSwechaa07 Sep 2026, 02:28 PM

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. పార్టీ స్థాపనపై కీలక విషయాలు వెల్లడి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇటీవల సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ స్జాపనకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో సోమవారం(నేడు) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ప్రత్యక్ష ఎన్నికల రేసులో కానీ, ముఖ్యమంత్రి పదవి రేసులో కానీ ఉండబోనని తేల్చిచెప్పారు.

KCR: 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞానికి ఈ విషయం తెలియదా!?..తెలంగాణSwechaa07 Sep 2026, 02:23 PM

KCR: 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞానికి ఈ విషయం తెలియదా!?..

అసెంబ్లీకి కేసీఆర్ దూరంగా ఉండాలన్న నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఎమ్మెల్యేగా ఉంటూ సభకు హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇక కేసీఆర్ సాగునీటి అంశాన్ని ముందుకు తీసుకొస్తుండటంతో ఆయన మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తారా అన్న ఆసక్తి పెరిగింది. మరోవైపు జనంలోకి నేను పోను, అలాగే అసెంబ్లీకి పోనే పోను అంటున్నప్పుడు… మరి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే సరిపోతుందనే డిమాండ్ కాంగ్రెస్ నేతల నుండి వినిపిస్తుంది..

ఇది శాసనసభనా లేదా కౌరవ సభనా? : హరీశ్ రావుతెలంగాణSwechaa07 Sep 2026, 02:16 PM

ఇది శాసనసభనా లేదా కౌరవ సభనా? : హరీశ్ రావు

రాష్ట్రంలో పాలనా వైఫల్యం, ప్రతిపక్ష నేతల మీద పోలీసుల దాడులపై తెలంగాణ భవన్ బయట మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్యుల రక్షణ సంగతేంటని ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్యంలో ఈరోజు బ్లాక్ డే.రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు నొక్కి దాడి చేశారు. పబ్లిక్‌గా పోలీసులు మా మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారు.ఆ రోజు దుర్యోధనుడు ప్రవర్తించినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు.సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు తోస్తే ఇనుప చువ్వల మీద పడేది.. ఆమె చేయి పట్టి లాగి మా మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాపాడింది.మా సోదరి సునీతమ్మ చీర లాగిన, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులు సప్త సముద్రాలు దాటి దాక్కున్నా వదిలిపెట్టం.. మీకు తగిన గుణపాఠం చెప్తాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రీల్స్, పోస్టుల కట్టడికి త్వరలో కొత్త నిబంధనలు!NationalSwechaa07 Sep 2026, 02:00 PM

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. రీల్స్, పోస్టుల కట్టడికి త్వరలో కొత్త నిబంధనలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిజిటల్ ప్రవర్తన, సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్), ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు చేసే పోస్టులపై ప్రత్యేకంగా ఒక సమగ్ర 'సోషల్ మీడియా కోడ్ ఆఫ్ కండక్ట్' (Social Media Code of Conduct) రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించి, దీనిపై సమగ్ర అధ్యయనం చేసి నూతన మార్గదర్శకాలను ఖరారు చేయాలని సీనియర్ అధికారుల బృందాన్ని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.

నిజాయితీ చాటిన కండక్టర్ (వీడియో)వైరల్ న్యూస్Swechaa07 Sep 2026, 01:48 PM

నిజాయితీ చాటిన కండక్టర్ (వీడియో)

బస్సులో మర్చిపోయిన నగదును ప్రయాణికుడికి అందజేసి ఓ మహిళా కండక్టర్ తన నిజాయితీని చాటుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె నిజాయితీ పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.సాధారణంగా ఏదైనా వస్తువును ప్రయాణికులు మర్చిపోతే వాటిని మర్చిపోవాల్సిందే.ఎందుకంటే తిరిగి వెళ్లేసరికి అక్కడ ఆ వస్తువు ఉండదు.తోటి ప్రయాణికులు సైతం దానిని తీసుకోనిపోవచ్చు. డబ్బులు, నగదు ఉంటే మరల దొరుకుతాయనే ఆశ కూడా ఉండదు. వాటిని చూస్తే ఎవరికైనా అత్యాశ కలుగక మానదు. కానీ, ఆర్టీసీ సిబ్బంది మాత్రం అలా చేయలేదు.నిజాయితీగా ప్రయాణికుడు మర్చిపోయిన పార్సిల్‌ను సేఫ్‌గా వారికి అందజేశారు. వివరాల్లోకివెళితే.. షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త జహంగీర్ తన భార్యతో కలిసి హజ్ యాత్రకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటూ శనివారం హైదరాబాద్‌ వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులో అనుకోకుండా రూ.3 లక్షల నగదును మర్చిపోయాడు. మరల ఆ డబ్బును అతనికి అందజేయడంతో సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు! బీఆర్ఎస్ స్ట్రీట్ ఫైట్ వెనుక వ్యూహమేంటి..?తెలంగాణSwechaa07 Sep 2026, 01:15 PM

కేసీఆర్ చెప్పారు.. కేటీఆర్, హరీష్ చేశారు! బీఆర్ఎస్ స్ట్రీట్ ఫైట్ వెనుక వ్యూహమేంటి..?

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ మళ్లీ తన పాత పోరాట పంథాలోకి అడుగుపెడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ నిన్న ఇచ్చిన పిలుపు.. అసెంబ్లీ వేదికగా అమల్లోకి వచ్చింది. కేటీఆర్, హరీష్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగడం, పోలీసులు అదుపులోకి తీసుకోవడం.. ఇవన్నీ చూస్తే ఇది యాదృచ్ఛికంగా జరిగిన నిరసన కాదనే అభిప్రాయం కలుగుతోంది.

కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు : మంత్రి ఉత్తమ్తెలంగాణSwechaa07 Sep 2026, 12:58 PM

కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తారు : మంత్రి ఉత్తమ్

శాసనసభ ప్రాంగణంలో నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ లక్ష మందితో కాళేశ్వరం పాదయాత్ర చేస్తానని అంటున్నారు. అలా చేస్తే ప్రజలు నవ్వుతారని చెప్పారు.మేడిగడ్డ పియర్లు కుంగిన ప్రాజెక్టు వద్దకు కేసీఆర్‌ ఏ ముఖంతో వెళ్తారని ప్రశ్నించారు.రాష్ట్రంలో సాగు నీటి సమస్యకు ఎల్‌నినోతో పాటు కేసీఆర్‌ పాలనా వైఫల్యమే కారణమన్నారు. నీటి కష్టాలపై మాట్లాడే ముందు తన పదేళ్ల పాలనపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ!తెలంగాణSwechaa07 Sep 2026, 12:40 PM

తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ!

 తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర నిరసనలు, గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం 10గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రతిపక్షాల ఆందోళనలతో తీవ్ర కలకలం రేగింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ప్రారంభించిన పది నిమిషాల వ్యవధిలోనే 15నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా సమయం ముగిసి గంటకు పైగా సమయం దాటినా తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకపోవడంతో సభ పునఃప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపుతెలంగాణSwechaa07 Sep 2026, 12:26 PM

తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు.. రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టడానికి ప్రయత్నించడంతో కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు తోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా,అరెస్టు అయిన నేతలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా అక్కడ భేటీ అయ్యారు. తోపులాటలో భాగంగా కేటీఆర్,హరీశ్ రావుకు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం.వారికి వైద్యులు చికిత్స అందించినట్టు సమాచారం.

షాకింగ్.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు!ఏపీSwechaa07 Sep 2026, 12:14 PM

షాకింగ్.. మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. శస్త్రచికిత్స చేసి తొలగించిన వైద్యులు!

 ఏపీలోని పల్నాడు జిల్లాలో అత్యంత అరుదైన, విస్మయపరిచే వైద్య అద్భుత ఘట్టం వెలుగుచూసింది. తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఒక మహిళను పరిశీలించిన వైద్యులకు మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలిసింది. ఆమె కడుపులో వస్తువులు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, శస్త్రచికిత్స ద్వారా ఏకంగా 14 ప్లాస్టిక్ పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తిని బయటకు తీశారు. మానసిక అనారోగ్యం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన తీవ్ర వేదన కారణంగానే ఆ మహిళ ఈ రకమైన ప్రమాదకర చర్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి గాయంతెలంగాణSwechaa07 Sep 2026, 11:59 AM

తోపులాటలో కిందపడిపోయిన జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కాలికి గాయం

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లదుస్తులు ధరించి రావడంపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ శాసనసభ్యులను లోనికి అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్లకార్డులు వదిలేసి, నల్లదుస్తులు తీసేసి రావాలని చెప్పడంతో శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎవరు మమ్మల్ని అడ్డుకోవడానికి అని మండిపడ్డారు. ఇదిలాఉండగా, అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాసేపు అక్కడ తోపులాట నెలకొనడంతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కిందపడిపోయారు.ఆ గుంపులో నుంచి ఆయన్ను తోటి ఎమ్మెల్యేలు బయటకు తీసుకుని రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగదీశ్ రెడ్డి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు అందులో స్పష్టంగా కనిపిస్తోంది.

NBK 112-Aishwarya Lekshmi: బాలయ్య సరసన మలయాళ భామ ఫిక్స్!సినిమాSwechaa07 Sep 2026, 11:42 AM

NBK 112-Aishwarya Lekshmi: బాలయ్య సరసన మలయాళ భామ ఫిక్స్!

NBK 112: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో భారీ మాస్ అండ్ యాక్షన్ సినిమాను మొదలపెట్టబోతున్నారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి హీరోయిన్‌గా మలయాళ భామ ఎంటరవబోతుందని తాజా సమాచారం. ఆమెవరో కాదు..ఐశ్వర్య లక్ష్మీ. ప్రస్తుతం, ఈ బ్యూటీ సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఆటోమొబైల్ రంగానికి పండుగ శోభ.. వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు!వ్యాపారంSwechaa07 Sep 2026, 11:27 AM

ఆటోమొబైల్ రంగానికి పండుగ శోభ.. వాహనాల విక్రయాల్లో సరికొత్త రికార్డు!

 భారతీయ ఆటోమొబైల్ రీటైల్ రంగం ఆగస్టు మాసంలో మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించింది. 'ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్' (FADA) సోమవారం వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఆగస్టులో అన్ని విభాగాల్లో కలిపి ఏకంగా 24,23,201 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఆగస్టు నెల విక్రయాలతో పోలిస్తే ఇది 17.51 శాతం ప్రతిష్టాత్మకమైన వార్షిక వృద్ధిని నమోదు చేసింది. పండుగల సీజన్ ముందస్తు డిమాండ్, మెరుగైన గ్రామీణ ఆర్థిక పరిస్థితులు మరియు వాహనాలపై లభిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లు ఈ రికార్డు స్థాయి కొనుగోళ్లకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..తెలంగాణSwechaa07 Sep 2026, 11:10 AM

Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..

దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధికి అడుగులు పడ్డాయి.. నేటి సోమవారం వేకువజామున 2:58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో రూ. 10 కోట్లతో చేపట్టిన శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.‎వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించడం జరుగుతుందని మరో వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అభివృధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు.

Epic Movie: ఆనంద్ కోసం మొన్న వదిన..రేపు అన్న!సినిమాSwechaa07 Sep 2026, 10:58 AM

Epic Movie: ఆనంద్ కోసం మొన్న వదిన..రేపు అన్న!

Epic Movie: ఒకే ఫ్యామిలీలో ఇద్దరు హీరోలుంటే..వాళ్ళే చాలు ఒకరి సినిమాను ఇంకొకరు ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు దేవరకొండ ఫ్యామిలీలోనూ అదే జరుగుతోంది. టాలీవుడ్ లో రౌడీ హీరోగా పాపులారిటీని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ..తన సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన ఎపిక్ సినిమా ప్రీలీజ్ ఈవెంట్‌కి రాబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతోంది.

అసెంబ్లీ వద్ద రణరంగం.. టీ షర్ట్ విప్పేసిన హరీశ్ రావు, కేటీఆర్ అరెస్టు!తెలంగాణSwechaa07 Sep 2026, 10:45 AM

అసెంబ్లీ వద్ద రణరంగం.. టీ షర్ట్ విప్పేసిన హరీశ్ రావు, కేటీఆర్ అరెస్టు!

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. నల్ల దుస్తులు ధరించి లోపలికి రాకూడదని పోలీసులు అడ్డుచెప్పడంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు భగ్గుమన్నారు. నల్లదుస్తులు ధరించి రాకూడదని ఎవరూ చెప్పారంటూ పోలీసుల మీద ఫైర్ అయ్యారు.సమావేశాలు ప్రారంభానికి ముందు గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. అయితే,నల్ల దుస్తులు ధరించారనే కారణంతో పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నారు.దీంతో అక్కడ పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు టీ షర్టు విప్పేసి అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు హరీశ్ రావు ప్రయత్నించగా.. అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నాలుగు రోజుల్లో 117 మంది మృతి.. యెమెన్‌లో యుద్ధజ్వాలలు!InternationalSwechaa07 Sep 2026, 10:35 AM

నాలుగు రోజుల్లో 117 మంది మృతి.. యెమెన్‌లో యుద్ధజ్వాలలు!

 యెమెన్ రాజ్యాంగంలో తీవ్ర ఉద్రిక్తతలు మళ్లీ చోటుచేసుకున్నాయి. పశ్చిమ ప్రావిన్సులైన తాయిజ్, హోదైదా ప్రాంతాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వ దళాలకు, ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య గత నాలుగు రోజులుగా భీకర భూతల పోరాటం సాగుతోంది. గత రెండేళ్లుగా ప్రశాంతంగా ఉన్న సరిహద్దులు ఒక్కసారిగా రణరంగంగా మారడంతో దేశంలో మళ్లీ పూర్తిస్థాయి అంతర్యుద్ధం చెలరేగుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తాజా ఘర్షణల్లో ఇప్పటివరకు కనీసం 117 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు.

ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!ఏపీSwechaa07 Sep 2026, 10:33 AM

ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. షెడ్యూల్ ప్రకటించిన ప్రభుత్వం!

ఏపీలో సంక్షేమ పథకాల అమలులో మరో కీలక అడుగు పడింది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మేరకు అర్హులైన పేదలు, వృద్ధులు, వితంతువులు తదితర అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. కొత్ పింఛన్లకు రేపటి నుంచి ఈ నెల16 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు కార్యాలయాల్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన అప్లికేషన్లను ఈ నెల 17 నుంచి 21 వరకు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతారు. ఇక సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. చివరగా సెప్టెంబర్ 25, 26 తేదీల్లో పింఛన్‌కు అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించనున్నారు.

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులుతెలంగాణSwechaa07 Sep 2026, 10:18 AM

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని నిరసిస్తూ గన్‌పార్క్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శాసన సభ్యులను పోలీసుల అడ్డుకున్నారు. వారిని లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. నల్లదుస్తులు ధరించి రాకూడదని చెప్పడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ శాసనసభ సభ్యులను పోలీసులు అడ్డుకోవడానికి యత్నించారు. ఈ క్రమంలోనే ఓ పోలీసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.

గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..తెలంగాణSwechaa07 Sep 2026, 10:04 AM

గ్రేటర్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. త్వరలోనే అందుబాటులోకి మల్టీ మోడల్ పాస్‌లు!..

హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్టీసీ, మెట్రో రైలు సేవలను మరింత సులువుగా, ఒకే టికెట్ విధానంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పాస్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఉమ్మడి పాస్‌ల జారీ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అసెంబ్లీలో బీజేపీ తాడో పేడోతెలంగాణSwechaa07 Sep 2026, 09:57 AM

అసెంబ్లీలో బీజేపీ తాడో పేడో

నేటి నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానుండగా.. సెషన్స్ ప్రారంభమైన కాసేపటికే సీఎం రేవంత్ రెడ్డి పలు బిల్లులను శాసనసభ ముందు ఉంచనున్నారు. అనంతరం ప్రశ్నోర్థరాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధం అవుతున్నాయి. అసెంబ్లీ ప్రారంభానికి ముందే ఉదయం 8:30 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని నిన్న నిర్వహించిన భేటీలో బీజేపీఎల్పీ నిర్ణయానికి వచ్చింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, 22A, రైతు సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల పై సమాధానం చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!సినిమాSwechaa07 Sep 2026, 09:53 AM

Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!

Venkey-Trivikram: మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న రెండు క్రేజీ చిత్రాలలో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోకి అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాలలో మంచి అంచనాలున్నాయి. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమాకి హైప్ తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ తోడవబోతున్నాడు.

రాష్ట్రంలో భారీ వర్షాలుతెలంగాణSwechaa07 Sep 2026, 09:34 AM

రాష్ట్రంలో భారీ వర్షాలు

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ సహా మొత్తం 6 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మేడ్చల్‌, నల్గొండ, రంగారెడ్డిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరిలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఎవరూ బయటకు రాకూడదని వెల్లడించింది.

మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొలిపే 16 ఆధ్యాత్మిక కళలు!..SpiritualitySwechaa07 Sep 2026, 09:30 AM

మనిషిలో దివ్యత్వాన్ని మేల్కొలిపే 16 ఆధ్యాత్మిక కళలు!..

సనాతన ధర్మంలోని పదహారు కళలు కేవలం మానవ నైపుణ్యాలు మాత్రమే కావు... జీవాత్మ, పరమాత్మ తత్త్వాన్ని చేరుకునే క్రమంలో వికసించే అత్యున్నత దివ్య శక్తులు! ఈ పదహారు ఆధ్యాత్మిక కళలతో సంపూర్ణంగా ప్రకాశించిన శ్రీకృష్ణ పరమాత్ముడే మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో 'పూర్ణావతారం'గా పూజలందుకుంటున్నాడు.

నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!తెలంగాణSwechaa07 Sep 2026, 09:29 AM

నేటి నుంచే అసెంబ్లీ సమరం.. ప్రతిపక్షాల వ్యూహాలపై సర్వత్రా ఉత్కంఠ!

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అత్యంత వేడెక్కింది. ఉదయం 9 గంటలకు సచివాలయంలో నూతనంగా నిర్మించిన 'అసెంబ్లీ సెంట్రల్ హాల్'ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. సభ ప్రారంభం కాకముందే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలడంతో, ఈ సమావేశాల్లో ఆరోగ్యకరమైన చర్చ సాగుతుందా లేక గందరగోళం, నిరసనలతో రచ్చ నెలకొంటుందా? అనేది ఆసక్తి సర్వత్రా నెలకొంది.