స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది!సినిమాSwechaa07 Sep 2026, 09:28 AM

Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది!

Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూకి వశిష్ట కరెక్ట్ కాదేమో..బాలయ్య ఆలోచించాల్సింది! అంటూ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ మొదలైంది. దీనికి కారణం నందమూరి మూడవ తరం వారసుడి ఎంట్రీ అంటే అటు నందమూరి అభిమానుల్లో, ఇటు సినీ ప్రేక్షకుల్లో, సినీ వర్గాలలో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. ఇలాంటి అంచనాల మధ్య మోక్షజ్ఞ మొదటి సినిమాకి ఏమాత్రం ట్రాక్ రికార్డ్ లేని మల్లిడి వశిష్ట దర్శకుడంటే రాంగ్ ఛాయిస్ అని వినిపిస్తోంది.

నేడు సచివాలయంలో ఆటో కార్మికులతో మంత్రుల భేటీ.. సర్కార్ కీలక నిర్ణయం!తెలంగాణSwechaa07 Sep 2026, 09:05 AM

నేడు సచివాలయంలో ఆటో కార్మికులతో మంత్రుల భేటీ.. సర్కార్ కీలక నిర్ణయం!

తెలంగాణలో ఆటో డ్రైవర్లు, కార్మికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సచివాలయంలో నేడు సాయంత్రం 4 గంటలకు ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ భేటీలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆటో యూనియన్ల జేఏసీ (JAC) ముఖ్య ప్రతినిధులు పాల్గొననున్నారు.

ట్రెసా నూతన కార్యవర్గం ఎన్నికతెలంగాణSwechaa06 Sep 2026, 10:16 PM

ట్రెసా నూతన కార్యవర్గం ఎన్నిక

TG:తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA)కు నూతన నాయకత్వం ఖరారైంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కె.గౌతమ్ కుమార్ చేపట్టనుండగా.. ప్రధాన కార్యదర్శిగా ఎల్.రమణ్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఈ మేరకు రెవెన్యూ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ట్రెసా మాజీ అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు సీసీఎల్ఏ యూనిట్‌కు చెందిన ప్రతినిధులు హాజరై నూతన కార్యవర్గ ఎంపికపై చర్చించారు. ఎలాంటి పోటీ లేకుండానే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు పేర్లను ఖరారు చేశారు. ఇటీవల ట్రెసా అధ్యక్షుడిగా ఉన్న వంగ రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ చేయడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయింది .

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశం : భట్టితెలంగాణSwechaa06 Sep 2026, 10:03 PM

ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశం : భట్టి

TG: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ఆదివారం ఈహెచ్‌ఎస్‌ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పారు. ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ (EHS) అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, డిపెండెంట్ల ఆరోగ్య భద్రత కోసం హెల్త్‌ కార్డు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దశాబ్దాలుగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రభుత్వం సీరియస్‌గా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ఇస్రోలో ప్రైవేటీకరణ ప్రకంపనలు..! రాకెట్లు ఇక ప్రైవేట్‌ చేతుల్లోకేనా?NationalSwechaa06 Sep 2026, 09:20 PM

ఇస్రోలో ప్రైవేటీకరణ ప్రకంపనలు..! రాకెట్లు ఇక ప్రైవేట్‌ చేతుల్లోకేనా?

ఇస్రోకు చెందిన తొమ్మిది ఉద్యోగ సంఘాలు తొలిసారి సమష్టిగా గళం విప్పాయి. ఇస్రో ఛైర్మన్‌ వి. నారాయణన్‌కు రెండ్రోజుల కింద‌ట లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానం ఏంటి? భవిష్యత్‌లో ఇస్రో పాత్ర ఏమిటి? వంటి అంశాలపై అధికారిక వివరణ ఇవ్వాలని కోరాయి.

Balakrishna-DADA: "NBK111" టైటిల్ రిలీజ్.."దాదా" వచ్చేస్తున్నాడు!సినిమాSwechaa06 Sep 2026, 08:42 PM

Balakrishna-DADA: "NBK111" టైటిల్ రిలీజ్.."దాదా" వచ్చేస్తున్నాడు!

Balakrishna: గాడ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా భారీ యాక్షన్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి దర్శకుడు గోపిచంద్ మలినేని. ఇంతకముందు వీరి కాంబినేషన్లో వీరసింహా రెడ్డి వచ్చి మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. దీని, తర్వాత చేస్తున్న సినిమా ఎన్‌బికే 111 కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాదు, మరీ ముఖ్యంగా బాలయ్యని ఒక స్టైలిష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ప్రెజెంట్ చేస్తుండడంతో ఆ హైప్ మరింత పెరిగింది.

TG: ‘పబ్‌ ఘటనపై FIR ఎందుకు నమోదు కాలేదు?’: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తెలంగాణSwechaa06 Sep 2026, 08:42 PM

TG: ‘పబ్‌ ఘటనపై FIR ఎందుకు నమోదు కాలేదు?’: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

TG: హైదరాబాద్‌లో జరిగిన పబ్‌ ఘటనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు కాలేదని, నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన సోషల్ మీడియా వేదికగా పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ యువ నేతలు పబ్బుల్లో మునిగి తేలుతుంటే.. నగర పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనపై పబ్‌ యాజమాన్యం ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Nandamuri Mokshagna: అగ్ర నిర్మాణ సంస్థలో నందమూరి వారసుడి డెబ్యూ కన్‌ఫర్మ్సినిమాSwechaa06 Sep 2026, 08:08 PM

Nandamuri Mokshagna: అగ్ర నిర్మాణ సంస్థలో నందమూరి వారసుడి డెబ్యూ కన్‌ఫర్మ్

Nandamuri Mokshagna: గాడ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను ప్రకటించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ డెబ్యూ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇక, ఈ సినిమాను బింబిసార చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చిన మల్లిడి వశిష్ఠ తెరకెక్కించబోతున్నాడు.

అసెంబ్లీలో బలంగా పోరాడండి : కేసీఆర్తెలంగాణSwechaa06 Sep 2026, 07:57 PM

అసెంబ్లీలో బలంగా పోరాడండి : కేసీఆర్

TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. సభలో జరిగే ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా గులాబీ బాస్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ, మండలి సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్‌ అయిందని విమర్శించారు.

TG: తెలంగాణలో 369 కొత్త ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు!తెలంగాణSwechaa06 Sep 2026, 07:26 PM

TG: తెలంగాణలో 369 కొత్త ఛార్జింగ్ స్టేషన్లకు టెండర్లు!

TG: తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించింది.

హైదరాబాద్‌లో 200 ఛార్జింగ్ స్టేషన్లు

హైదరాబాద్‌ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్కో ఏర్పాటు చేసిన 200 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా అభివృద్ధి చేయనున్నారు.

కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ అంశమే ఆయుధంగా ప్రజాక్షేత్రంలోకి!..తెలంగాణSwechaa06 Sep 2026, 06:53 PM

కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ అంశమే ఆయుధంగా ప్రజాక్షేత్రంలోకి!..

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లానంటూ ప్రకటించారు. త్వరలోనే తాను స్వయంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను సందర్శించనున్నట్లుగా బీఆర్ఎల్పీలో ప్రకటించారు.

Palghar Hospital Attack: ఐసీయూలోకి చొరబడి.. డాక్టర్లపై శివసేన నాయకుల దాడిNationalSwechaa06 Sep 2026, 06:32 PM

Palghar Hospital Attack: ఐసీయూలోకి చొరబడి.. డాక్టర్లపై శివసేన నాయకుల దాడి

మహారాష్ట్రలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున పాల్ఘర్‌లోని రిలీఫ్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందిపై శివసేన కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన రిసెప్షనిస్ట్‌పై ఓ కార్యకర్త చెంపదెబ్బ కొట్టినట్లు, మరో మహిళా ఉద్యోగిని బెదిరించినట్లు తెలుస్తోంది. జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన ‘దహీ హండి’ కార్యక్రమంలో పాల్గొని గాయపడిన గోవిందాలకు చికిత్స అందించిన అనంతరం బిల్లు విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం.

ఆస్పత్రి ఉద్యోగి కుందన్‌ సాంకే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శివసేన జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు రాహుల్‌ ఘరాట్‌ తదితరులు ఐసీయూలోకి అత్యవసర ప్రవేశించి వైద్యులతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు.

కేసీఆర్ ప్రతిపక్ష పదవికి న్యాయం చేయాలి: మహేష్ గౌడ్తెలంగాణSwechaa06 Sep 2026, 05:50 PM

కేసీఆర్ ప్రతిపక్ష పదవికి న్యాయం చేయాలి: మహేష్ గౌడ్

TG: కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్క్‌ వద్ద పీసీసీ ఆధ్వర్యంలో ఈ రోజు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష నేత హోదాకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయవద్దని సూచించారు. అసెంబ్లీకి హాజరు కాకపోతే ప్రతిపక్ష నేత పదవిని మరొకరికి అప్పగించాలన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే.. కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

krish Jagarlamudi-"Gen Z Batch": ఫ్లాప్స్ ప్రభావం..కొత్త వాళ్ళతో మొదటి సినిమాలా ప్రయత్నం!సినిమాSwechaa06 Sep 2026, 05:44 PM

krish Jagarlamudi-"Gen Z Batch": ఫ్లాప్స్ ప్రభావం..కొత్త వాళ్ళతో మొదటి సినిమాలా ప్రయత్నం!

krish Jagarlamudi: ఎంత పెద్ద దర్శకుడైనా వరుసగా రెండు ఫ్లాప్స్ గనక ఇస్తే మళ్ళీ ఆ దర్శకుడితో సినిమా చేయడానికి హీరోలు ఆలొచిస్తారు. నిర్మాతలు అంత త్వరగా ముందుకు రాకుండా మొహం చాటేస్తారు. అందుకే, ఇప్పుడు వివి.వినాయక్, పూరి జగన్నాధ్ లాంటి వారు గ్యాప్ తీసుకుంటున్నారు. ఒకదశలో పూరి జగన్నాధ్ స్టార్స్ తో సినిమా చేయలేక సొంత తమ్ముడితో 143 తీసి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇంకా, వినాయక్ ప్రయత్నాలలో ఉన్నాడు.

దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!క్రీడలుSwechaa06 Sep 2026, 05:30 PM

దులీప్ ట్రోఫీ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీని ఆటపట్టించిన తిలక్ వర్మ!

 దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మైదాన పోరులో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, 15ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటుచేసుకున్న ఒక సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈస్ట్ జోన్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ ఆరంభం నుంచే సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడుతూ వేగంగా పరుగులు సాధించాడు. అతని మైండ్ గేమ్‌ను దెబ్బతీసేందుకు తిలక్ వర్మ వైభవ్ దగ్గరకు వెళ్లి "వైస్ కెప్టెన్.. ఏంటిది?" అంటూ సరదాగా ఆటపట్టించాడు.

ys sharmila: వైఎస్ షర్మిల కూతురు వివాహం.. ఎవరీ రఘురామ్..?తెలంగాణSwechaa06 Sep 2026, 05:08 PM

ys sharmila: వైఎస్ షర్మిల కూతురు వివాహం.. ఎవరీ రఘురామ్..?

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఇంట్లో మరోసారి పెళ్లి సందడి నెలకొననుంది. వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో 2024లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయం అయినట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. దీంతో షర్మిల కుటుంబంలో మరోసారి పెళ్లి వేడుకలు అంగరంగ వైభంగా జరగనున్నాయి.

తాజాగా షర్మిల తన కుమార్తె వైఎస్‌ అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

'డీజీపీ కోడళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా?' కానిస్టేబుల్ సస్పెన్షన్‌పై కవిత ఆగ్రహం!తెలంగాణSwechaa06 Sep 2026, 05:06 PM

'డీజీపీ కోడళ్లకు ఇలా జరిగితే ఊరుకుంటారా?' కానిస్టేబుల్ సస్పెన్షన్‌పై కవిత ఆగ్రహం!

 తనపై సోషల్ మీడియాలో తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను కేవలం సస్పెన్షన్ వేటుతో సరిపెట్టడంపై తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టాలను రక్షించాల్సిన పోలీసు శాఖలోనే ఉన్న ఒక ఉద్యోగి మహిళా ప్రజాప్రతినిధిపై అసభ్యకరమైన పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై ఆమె మండిపడ్డారు. సదరు కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపకపోతే, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ విఫల వ్యవస్థను ఎండగడతానని హెచ్చరించారు.

Pune: MPSC అక్రమాలపై సమరభేరి.. విద్యార్థుల పోరుకు CJP అభిజిత్ దీప్కే మద్దతు!NationalSwechaa06 Sep 2026, 05:02 PM

Pune: MPSC అక్రమాలపై సమరభేరి.. విద్యార్థుల పోరుకు CJP అభిజిత్ దీప్కే మద్దతు!

మహారాష్ట్రలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, తప్పులను నిరసిస్తూ విద్యార్థులు చేపడుతున్న ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మహారాష్ట్ర విద్యార్థులకు అండగా నిలుస్తుందని, సోమవారం పుణేలో జరగనున్న భారీ నిరసన ప్రదర్శనకు తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, చీఫ్ అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా వెల్లడించారు.

నాని ప్యారడైజ్‌ విషయంలో కావాలనే స్లో అయ్యాడా..?సినిమాSwechaa06 Sep 2026, 04:26 PM

నాని ప్యారడైజ్‌ విషయంలో కావాలనే స్లో అయ్యాడా..?

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉన్నా ఇప్పటి వరకు ప్రమోషన్లు మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే చర్చ మొదలైంది.

సినిమా విడుదల తేదీపై ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Delhi: కూలిన PG హోస్టల్..  శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..NationalSwechaa06 Sep 2026, 04:02 PM

Delhi: కూలిన PG హోస్టల్.. శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..

దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు ప్రాక్సీమల్‌గా ఉండే ఈ భవనాన్ని విద్యార్థుల కోసం పేయింగ్ గెస్ట్ వసతి గృహంగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఆదివారం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. విరామం తీసుకుంటున్న సమయంలో ఉన్నపళంగా భవనం కూలిపోవడంతో.. వారంతా శిథిలాల కిందే చిక్కుకుపోయారనే ఆందోళన వ్యక్తం అవుతుంది..

సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?తెలంగాణSwechaa06 Sep 2026, 03:22 PM

సురేఖ బర్తరఫ్‌.. వాళ్లందరికీ రేవంత్ సైలెంట్ వార్నింగ్‌..?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ బర్తరఫ్‌ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం వెనుక పార్టీ క్రమశిక్షణ అంశం మాత్రమే కాకుండా.. తనపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ఒక పరోక్ష సందేశం ఇచ్చారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డిపై కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మరికొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వివిధ సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ వ్యవహారాలపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!తెలంగాణSwechaa06 Sep 2026, 03:00 PM

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ముహూర్తం ఖరారు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

 తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక విషయాన్ని తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కార్యాచరణను ఖరారు చేశారు.

ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు!తెలంగాణSwechaa06 Sep 2026, 02:44 PM

ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లపై డీజీపీ సీరియస్.. కీలక ఆదేశాలు!

 హైదరాబాద్ నగరంలో, రాష్ట్రవ్యాప్తంగా శుభకార్యాలు, గృహప్రవేశాలు, నూతన వ్యాపార ప్రాంగణాల వద్ద కొందరు ట్రాన్స్‌జెండర్లు జరుపుతున్న బలవంతపు వసూళ్లు, బెదిరింపు చర్యలపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సీరియస్ గా స్పందించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అరాచకానికి పాల్పడుతున్న ఇలాంటి దందాలను ఏమాత్రం సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ రకమైన దోపిడీలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీసు కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల పరిధిలో తక్షణమే సమగ్ర 'స్పెషల్ డ్రైవ్' చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

రేవంత్ మాటలు కోటలు.. గడప దాటని విద్యార్థుల భవిష్యత్ : హరీశ్ రావుతెలంగాణSwechaa06 Sep 2026, 02:30 PM

రేవంత్ మాటలు కోటలు.. గడప దాటని విద్యార్థుల భవిష్యత్ : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారం అవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సంచలన పోస్టు పెట్టారు. ‘సీఎం రేవంత్ రెడ్డి.. మీ మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ విద్యార్థుల భవిష్యత్ మాత్రం కాలేజీ గడప దాటడం లేదు. రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను, నేడు సర్టిఫికెట్ల కోసం నడిరోడ్డు మీద నిలబెట్టారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద మీకున్న శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదు? బాధిత విద్యార్థులు నన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా... మీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారు’ అని పేర్కొన్నారు.

Surekha: గులాబీ, కమలం పార్టీల గేట్లు మూసివేత.. సురేఖ దారెటు..?తెలంగాణSwechaa06 Sep 2026, 02:25 PM

Surekha: గులాబీ, కమలం పార్టీల గేట్లు మూసివేత.. సురేఖ దారెటు..?

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయిన ప్రస్తుతం ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆమె దీర్ఘకాలంలో హస్తం గూటిన ఉండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినప్పటికీ.. సురేఖ ఏ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. కాంగ్రెస్‌ను వీడితే బీఆర్‌ఎస్, బీజేపీ ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీఆర్‌ఎస్ మాత్రం సురేఖ విషయంలో ముందుగానే స్పష్టమైన వైఖరి తీసుకున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ చూసి వండర్స్.. మన్ కీ బాత్‌లో కడప రైతుకు ప్రధాని ప్రశంసలు!NationalSwechaa06 Sep 2026, 02:22 PM

యూట్యూబ్ చూసి వండర్స్.. మన్ కీ బాత్‌లో కడప రైతుకు ప్రధాని ప్రశంసలు!

 సంప్రదాయ వ్యవసాయానికే పరిమితం కాకుండా నూతన సాంకేతికతను, వినూత్న పంటలను అందిపుచ్చుకుంటూ కడప జిల్లాకు చెందిన ఒక సాధారణ యువ రైతు దేశవ్యాప్త గుర్తింపు సాధించారు. ఏపీలోని కరవు సీమగా పేరొందిన పులివెందుల ప్రాంతానికి చెందిన 30ఏళ్ల కర్ప వరదరాజ్ సాధించిన అరుదైన విజయగాథను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా కొనియాడారు. ఇటీవల దేశవ్యాప్తంగా ప్రసారమైన 137వ 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమంలో ప్రధాని మోదీ, వరదరాజ్ కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందనలు తెలపడంతో ఆ యువ రైతు విజయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌గా మారింది.

Madhuri Rathod: కీలక మలుపు తిరిగిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదం.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !!తెలంగాణSwechaa06 Sep 2026, 02:15 PM

Madhuri Rathod: కీలక మలుపు తిరిగిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వివాదం.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !!

పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ప్రముఖ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈశ్వర్ సాయి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది. తన జీవితంతో ఆడుకున్న ఈశ్వర్ సాయిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో గతంలో కేసు నమోదైనప్పటికీ, పోలీసులు ఇప్పటివరకు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యాయం కోసం పోలీసు స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురైన మాధురి రాథోడ్ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం..

కేసీఆర్ తీరు మారకుంటే మరో పదేళ్లు అక్కడే : మంత్రి శ్రీధర్ బాబుతెలంగాణSwechaa06 Sep 2026, 02:07 PM

కేసీఆర్ తీరు మారకుంటే మరో పదేళ్లు అక్కడే : మంత్రి శ్రీధర్ బాబు

మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత రెండున్నరేండ్లలో ఆయన కేవలం రెండు మూడు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని.. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని ..ప్రజాసమస్యలపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఆయన సభకు రాకుండా తన వాళ్లను సభకు పంపించి గందరగోళం సృష్టించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. బాధ్యత గల ప్రతిపక్షనేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని లేదా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహాధర్నా'లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారని నిరసిస్తూ ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు,మంత్రులు, కార్యకర్తలు హాజరయ్యారు.

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌ల కొనుగోలు.. తెరపైకి సాంకేతిక సమస్య!తెలంగాణSwechaa06 Sep 2026, 01:57 PM

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌ల కొనుగోలు.. తెరపైకి సాంకేతిక సమస్య!

హైదరాబాద్ నగరంలో దినదినాభివృద్ధి చెందుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో రైలు సేవలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఐటీ ఉద్యోగులతో పాటు సాధారణ ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో అదనపు కోచ్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అమలు చేసే సమయంలో ఒక సంక్లిష్టమైన సాంకేతిక సవాలు వెలుగులోకి వచ్చింది. కొత్తగా కొనుగోలు చేయనున్న అత్యాధునిక కోచ్‌లను ప్రస్తుత పాత సిగ్నలింగ్ వ్యవస్థతో అనుసంధానించాలా లేక మెట్రోలోని మొత్తం సిగ్నలింగ్ టెక్నాలజీనే అప్‌గ్రేడ్ చేయాలా అనే దానిపై అధికారులు తీవ్ర ఊగిసలాటలో పడ్డారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దం.. రేపటి నుంచే మొదలవనున్న సమరం!..తెలంగాణSwechaa06 Sep 2026, 01:57 PM

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్దం.. రేపటి నుంచే మొదలవనున్న సమరం!..

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశం ఉందని ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో పోలీస్, ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్ పేర్కొన్నారు. అలాగే అన్నిశాఖల అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సారి అసెంబ్లీలో 21 ఏళ్లకే చట్ట సభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు.. క్యూర్, ల్యాండ్ పూలింగ్, 22ఏ భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆస్తిపన్ను విధానం, హైడ్రా పాత్ర, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా ఈ సెషన్లో కీలకంగా మారనున్నాయి.