స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

గణేశ్ ఆగమన్ వేడుకలో అపశ్రుతి.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!క్రైమ్Swechaa06 Sep 2026, 01:26 PM

గణేశ్ ఆగమన్ వేడుకలో అపశ్రుతి.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!

హైదరాబాద్ నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాకముందే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించిన ‘గణేశ్ ఆగమన్’ ఊరేగింపు వేడుకల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో బద్రీనాథ్ (19) అనే ఒక యువ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. రాబోయే పండుగ వాతావరణం మధ్య ఒక్కసారిగా సంభవించిన ఈ ఘోర దుర్ఘటన స్థానికులను, గణేష్ భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Actor Prithiveeraj: రాకా షుటింగ్ అనుభవాలను పంచుకున్న సీనియర్ నటుడు..సినిమాSwechaa06 Sep 2026, 01:15 PM

Actor Prithiveeraj: రాకా షుటింగ్ అనుభవాలను పంచుకున్న సీనియర్ నటుడు..

Actor Prithiveeraj: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా రాకా. అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు పృథ్విరాజ్ అప్‌డేట్‌ని పంచుకున్నాడు. అల్లు అర్జున్‌తో సినిమా చేయడం పెద్ద డ్రీమ్ అని ఆయన తెలిపాడు.

మృతురాలు భారతి ముఖి కుటుంబాన్ని ఆదుకుంటా : కేటీఆర్తెలంగాణSwechaa06 Sep 2026, 01:09 PM

మృతురాలు భారతి ముఖి కుటుంబాన్ని ఆదుకుంటా : కేటీఆర్

జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమేని రమేష్ కొడుకు సంజూష్ చేసిన కారు యాక్సిడెంట్‌‌లో మృతి చెందిన భారతి ముఖి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఘటన జరిగి 20 రోజులకు పైనే అవుతున్నా మృతురాలి కుటుంబానికి న్యాయం దొరకలేదు. కనీసం ఆర్థిక సహాయం కూడా అందకపోవడంతో కేటీఆర్ సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఏకైక జీవనాధారం కోల్పోయిన భారతి కుటుంబానికి వీలైనంత త్వరగా ఆర్థిక సహాయం అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు. నేరస్థుడు శిక్ష లేకుండా స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే మృతురాలి కుటుంబం జీవనాధారం కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కన్నా ఎన్డీఏ నాయకుల బంధువులను కాపాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు.

న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ ఆత్మహత్యాయత్నం!క్రైమ్Swechaa06 Sep 2026, 12:44 PM

న్యూడ్ పిక్స్ తీసి వేధిస్తున్న కాంగ్రెస్ నేత.. మహిళ ఆత్మహత్యాయత్నం!

అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఆమె న్యూస్ ఫొటోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు సమాచారం.ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకోకుండా సదరు మహిళనే బెదిరింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.వివరాల్లోకివెళితే.. బక్కమంతులగూడెనికి చెందిన ఓ మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ ఆమె ఇంట్లోకి చొరబడినట్టు సమాచారం.ఆమె బట్టలు మార్చుకుంటుండగా తన ఫోన్‌లో ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. తాను అడిగింది ఇవ్వకపోతే ఆమెకు చెందిన న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బాధితురాలిని వేధింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు రైతుల ఆత్మహత్యతెలంగాణSwechaa06 Sep 2026, 12:23 PM

రాష్ట్రంలో దారుణం.. ఇద్దరు రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో మరో విషాదం నెలకొంది. పంటలు పండక, చేసిన అప్పులు తీర్చలేక ఇద్దరు అన్నదాతలు ఆయుష్షు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ చేస్తుందని, పంట అమ్ముకోగా వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాలని భావించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. మరో వైపు అన్నదాత మరణిస్తే బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన రైతు బీమా కూడా రావడం లేదని తెలియడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మెదక్‌ జిల్లా శౌకత్‌పల్లిలో రవీందర్‌రెడ్డి (40) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం, కుటుంబ అవసరాల కోసం రూ.4.50 లక్షల అప్పులు చేయగా.. అవి తీర్చే మార్గం లేక పొలంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటిలో అశోక్‌ (56) అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Tollywood-Actress: అనుష్క, నయనతారకి మధ్య తేడా అదే!సినిమాSwechaa06 Sep 2026, 11:55 AM

Tollywood-Actress: అనుష్క, నయనతారకి మధ్య తేడా అదే!

Tollywood: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో నయనతార, అనుష్క శెట్టిలది ఓ ప్రత్యేకమైన జర్నీ. టాలెంట్ పరంగా ఇద్దరూ ప్రూవ్ చేసుకున్నారు. భారీ చిత్రాల్లో నటించారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా సౌత్‌లో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, లేడీ సూపర్ స్టార్‌గా నయన్ ఇంకా భారీ చిత్రాలను చేస్తోంది. కానీ, అనుష్క మాత్రం ఏడాది నుంచి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ ప్రకటించలేదు.

రూ. ‘ఇందిరమ్మ ఇళ్లు’ డిపాజిట్ ఎప్పుడిస్తారు?తెలంగాణSwechaa06 Sep 2026, 11:48 AM

రూ. ‘ఇందిరమ్మ ఇళ్లు’ డిపాజిట్ ఎప్పుడిస్తారు?

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులను ఫిల్టర్ చేసింది. లక్షల్లో దరఖాస్తులు రాగా అందులో అర్హులను గుర్తించి ఇటీవల ఎంపిక చేసిన ప్రాంతాల్లో లక్కీ డ్రా తీసిన విషయం తెలిసిందే. మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో లాటరీ ప్రక్రియ కొనసాగింది. అయితే, ఇందిరమ్మ ఇళ్లు లాటరీలో పాల్గొనాల్సిన లబ్దిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ.10 వేల డిపాజిట్ కట్టించుకుంది. లాటరీలో ఎంపికైన వారికి ఆ డబ్బులు తిరిగి చెల్లించరు. ఎవరైతే లాటరీలో పేరు రాని వారు ఉంటారో వారికి మాత్రం డబ్బులు తిరిగి చెల్లిస్తామని అధికారులు ముందే ప్రకటించారు. అయితే, మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో 14,201 దరఖాస్తులను ఫైనల్ చేయగా. 1,920 మందికి లాటరీలో ఎంపికయ్యారు. కాగా, ఇళ్లు రాని వారు తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

కొండా సురేఖకు మంత్రి సీతక్క కౌంటర్తెలంగాణSwechaa06 Sep 2026, 11:27 AM

కొండా సురేఖకు మంత్రి సీతక్క కౌంటర్

మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క తాజాగా కౌంటర్ ఇచ్చారు. తన మంత్రి పదవి పోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, మరి కొందరు కుట్ర చేశారని, హైకమాండ్‌ను ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేశారని కొండా సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. బ్లాక్ మెయిల్‌కు భయపడేంత బలహీనంగా అధిష్టానం లేదని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టంచేశారు. ఆదివారం ఉదయం మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాల్సిందేనని నొక్కిచెప్పారు. పార్టీ నిర్ణయాల విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు.

బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత.. వీడియో వైరల్తెలంగాణSwechaa06 Sep 2026, 11:04 AM

బోరున ఏడ్చేసిన కొండా సుస్మిత.. వీడియో వైరల్

కొండా సురేఖ ఎపిసోడ్ మీద తాజాగా కొండా సుస్మిత స్పందించారు. తన తల్లికి జరిగిన అవమానంపై సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో సీఎం రేవంత్ మీద మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కన్నీళ్లు పెట్టుకుంటూ కొండా సుష్మిత భోరున ఏడ్చేశారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్ల ఈ స్థాయికి వచ్చిన మా అమ్మానాన్నలను ఇంతగా ఇబ్బంది పెట్టాలా?మా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే.. అలా మాట్లాడేదాన్ని కాదు.మా అమ్మ చేసిన ఒక్క తప్పు చూపించండి. పార్టీలో నేనైనా ఉండాలి.. ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి సీఎం దిగజారుతారా? నేను మాట్లాడిన మాటల్లో తప్పులేదు. రేవంత్‌ రెడ్డి ఇంత పగ పడతారని అనుకోలేదు. నా కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నారు’ అంటూ సుష్మిత ఆవేదన వ్యక్తంచేశారు.

Actress Kayadu Lohar: నన్ను అసభ్యకరంగా చూపిస్తా అంటే ఒప్పుకోను!సినిమాSwechaa06 Sep 2026, 10:52 AM

Actress Kayadu Lohar: నన్ను అసభ్యకరంగా చూపిస్తా అంటే ఒప్పుకోను!

Kayadu Lohar: వెండితెరపై వెలిగిన అగ్ర తారల్లో వేళ్ళపై లెక్కపెట్టే వాళ్ళే ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ లో కూడా హద్దుల్లో ఉండి సినిమాలు చేస్తూ..సత్తా చాటుతున్నారు. కొందరు మాత్రం, స్టార్ హీరోయిన్‌గా వెలగాలని లిమిటేషన్స్ ఏమీ పెట్టుకోకుండా, కాస్ట్యూంస్ దగ్గర్నుంచి సినిమాలో ఉన్న పాత్ర..దానికి తగ్గట్టుగా స్కిన్ షో చేయడానికి, హద్దులుదాటి రొమాంటిక్ సీన్స్ చేయడానికి రెడీ అంటున్నారు.

Nepal : 11 రోజుల తర్వాత ప్రాాణాలతో బయటపడ్డ వృద్ధురాలుప్రపంచంSwechaa06 Sep 2026, 10:33 AM

Nepal : 11 రోజుల తర్వాత ప్రాాణాలతో బయటపడ్డ వృద్ధురాలు

నేపాల్ వరదలు ఎంత బీభత్సాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు.ఈ ఉపధ్రవం నుంచి హిమాలయాల దేశం ఇంకా కొలుకోవడం లేదు. ఘటన జరిగి రెండు వారాలు కావొస్తున్న ఆ ఘోరాన్ని నేపాల్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. రూ. వేల కోట్లలో ఆస్తి నష్టం సంభవించగా.. సుమారు 1400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు అంచనా వేశారు. అయితే, నేపాల్‌లో తాజాగా మరో మిరాకిల్ చోటుచేసుకుంది. వరదలు సంభవించిన 11 రోజుల తర్వాత 64 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడింది. వరదల ధాటికి నువాకోట్‌లో చందిక శ్రేష్ఠ(64) 11 రోజుల పాటు ఇంటి శిథిలాల కింద చిక్కుకుపోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా పోలీస్ ఫోర్స్ ఆమెను కాపాడి సురక్షితంగా బయటకు తెచ్చారు.

తెలంగాణలో ఆర్గాన్ స్కామ్.. అత్యంత రహస్యంగా జీవో 33 జారీ?!..తెలంగాణSwechaa06 Sep 2026, 10:22 AM

తెలంగాణలో ఆర్గాన్ స్కామ్.. అత్యంత రహస్యంగా జీవో 33 జారీ?!..

తెలంగాణలో మానవ అవయవ మార్పిడి ప్రక్రియను కార్పొరేట్ ఆస్పత్రుల చేతుల్లో పెడుతూ ప్రభుత్వం అత్యంత రహస్యంగా జీవో 33 జారీ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.. డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ కమిటీ పర్యవేక్షణను పక్కనబెట్టి, ఏడాదికి 25 కంటే ఎక్కువ సర్జరీలు చేసే ప్రైవేటు ఆస్పత్రులకే స్వయంగా అనుమతులు ఇచ్చుకునే ఇన్-హౌస్ సర్వాధికారాలు కట్టబెట్టారు. ఈ రహస్య జీవోతో అవయవ దానంలో రూ.కోట్ల అక్రమ దందాకు దారితీసి, సాధారణ, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందంటూ పౌర సమాజం భగ్గుమంటోంది..

వెబ్‌సైట్‌లో పీఎఫ్ సేవలు బంద్.. ఉమాంగ్ యాప్‌తో డిజిటల్ విప్లవం!వ్యాపారంSwechaa06 Sep 2026, 09:48 AM

వెబ్‌సైట్‌లో పీఎఫ్ సేవలు బంద్.. ఉమాంగ్ యాప్‌తో డిజిటల్ విప్లవం!

ఈపీఎఫ్ఓ (EPFO) ఉద్యోగుల సౌకర్యార్థం డిజిటల్ సేవలను మరింత వేగవంతం, పారదర్శకం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూఏఎన్ (UAN) యాక్టివేషన్, కొత్త యూఏఎన్ జనరేషన్ ప్రాసెస్ కోసం అధికారిక పీఎఫ్ పోర్టల్‌ను ఉపయోగించే అవకాశం లేకుండా చేసింది. ఈ సేవలను పీఎఫ్ వెబ్‌సైట్ నుంచి పూర్తిగా తొలగించి, కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'ఉమాంగ్' (UMANG) యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంచేలా మార్పులు చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారైనా లేదా ఇప్పటికే పీఎఫ్ ఖాతా ఉండి యాక్టివేట్ చేసుకోని వారైనా తప్పనిసరిగా ఉమాంగ్ యాప్ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఎస్ఐఆర్​ పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..తెలంగాణSwechaa06 Sep 2026, 09:30 AM

ఎస్ఐఆర్​ పక్రియలో మరో ట్విస్ట్..ఈసీకి తెలంగాణ సీఈవో కీలక లేఖ!..

తెలంగాణలో జరుగుతున్న ఎస్ఐఆర్​ ప్రక్రియలో మరో 25 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 47 లక్షల మంది ఓటర్లకు మాత్రమే అందాయి. వీరిలో కేవలం 9 లక్షల మంది మాత్రమే అందుకున్న నోటీసులకు సమాధానం అందించారు. అయితే, కొన్ని చోట్ల నోటిసులకు సమాధానం ఇవ్వడానికి ఓటర్లు ముందుకు రావడంలేదని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఓటర్లు ఆసక్తి చూపించడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 16న నోటీసుల ప్రక్రియ పూర్తికానుంది.

జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టుNationalSwechaa06 Sep 2026, 09:28 AM

జార్ఖండ్ మంత్రి హఠాన్మరణం.. జేఎంఎం భావోద్వేగ పోస్టు

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మంత్రివర్గంలోని కీలక నేత హఠాన్మరణం పొందారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. జార్ఖండ్ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి సుదివ్య కుమార్ ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హర్‌సింగరాయ్‌డీహ్‌లోని తన నివాసంలో ఇవాళ ఉదయం తీవ్రమైన ఛాతినొప్పితో ఆయన బాధపడినట్టు తెలిసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గిరిడీహ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మంత్రి సుదివ్య కుమార్ మరణవార్త తెలియడంతో ఆయన కుటుంబీకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.

విశ్వసుందరిగా డొమినికన్ భామ..!క్రీడలుSwechaa06 Sep 2026, 09:14 AM

విశ్వసుందరిగా డొమినికన్ భామ..!

 వియత్నాం వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 73వ మిస్ వరల్డ్ 2026 అందాల పోటీలు ముగిశాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెర్రీ మోలా డొమింగ్వెజ్ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో స్పెయిన్ సుందరి ఎలిసబెత్ రెయిన్స్ మొదటి రన్నరప్‌గా నిలవగా, మలేసియాకు చెందిన తానూసియా చెట్టి రెండో రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్న థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ కొత్త విజేత జోహెర్రీకి మిస్ వరల్డ్ కిరీటాన్ని తొడిగి అభినందనలు తెలిపారు.

ప్రశ్నించినందుకు కారు మీదకు ఎక్కించి ఈడ్చుకెళ్లాడు (వైరల్)క్రైమ్Swechaa06 Sep 2026, 09:09 AM

ప్రశ్నించినందుకు కారు మీదకు ఎక్కించి ఈడ్చుకెళ్లాడు (వైరల్)

యాక్సిడెంట్ ఎందుకు చేశావని ప్రశ్నించినందుకు ఓ బీజేపీ కార్యకర్త దారుణానికి తెగబడ్డాడు. అతన్ని కారుతో ఢీ కొట్టడంతో పాటు కిందపడిపోయిన అతని మీద నుంచి కారు ఎక్కించాడు.చక్రాల కింద సదరు వ్యక్తి ఇరుక్కోగా ఆపకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉండే స్థానికులు తమ మొబైల్ కెమెరాల్లో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..విశాల్ శర్మ అనే బీజేపీ కార్యకర్త ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విక్రాంత్ భారతి అనే వ్యక్తి కారుకు డ్యాష్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహానికి గురైన విక్రాంత్ భారతి.. కారు దిగి విశాల్ శర్మను వారించాడు.కారు నుంచి కిందకు దిగాలని గొడవ పెట్టుకున్నాడు. శర్మ వాహనానికి అడ్డుగా నిలబడ్డాడు. దీంతో విశాల్ శర్మ అతన్ని కారుతో ఢీకొట్టి తన వాహనం ఎక్కించాడు.

తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..ఏపీSwechaa06 Sep 2026, 08:56 AM

తిరుమల అప్‌డేట్.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు!..

శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో ఏడుకొండలవాడి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. ఈ క్రమంలో ఉచిత సర్వదర్శనం కోసం విచ్చేసిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. క్యూలైన్ వైకుంఠం కాంప్లెక్స్ దాటి, బయట ఉన్న బాట గంగమ్మ గుడి వరకు చేరుకుంది. నేడు ఉదయం 8 గంటల తర్వాత ఉచిత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే రూ. 300 శీఘ్రదర్శనానికి వెళ్లే భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతుండగా... టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 5 నుంచి 7 గంటల సమయం పడుతోందని తెలిపింది.

పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!క్రీడలుSwechaa06 Sep 2026, 08:50 AM

పాక్‌పై భారత్ సూపర్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థిపై ఏకపక్ష విజయం!

 మహిళల ఆసియా కప్ 2026టోర్నీలో భారత మహిళల జట్టు తన అజేయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు భారత స్పిన్నర్లు చుక్కలు చూపించారు. దాంతో పాక్ జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్‌కు ఇది అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.

నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..తెలంగాణSwechaa06 Sep 2026, 08:38 AM

నకిలీలకు అడ్డాగా మారిన మీసేవ కేంద్రాలు!..

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసిన మీ సేవ కేంద్రం నకిలీ సర్టిఫికెట్ల తయారీకి అడ్డాగా మారిందన్న ఘటన బోధన్‌లో కలకలం రేపుతోంది. రాకాసిపేట్‌లోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు, టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వ్యవహారం పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో పాటు భారీగా నకిలీ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

Actors: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?సినిమాSwechaa06 Sep 2026, 08:38 AM

Actors: అవకాశాల్లేక విలన్స్‌గా మారుతున్నారా?

Tollywood: ఒకప్పుడు హీరోగా నటించి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకున్న హీరోలు ఇప్పుడు విలన్స్‌గా మెప్పిస్తున్నారు. హీరోలు మాత్రమే కాదు, కొందరు హీరోయిన్స్ కూడా నెగిటివ్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. హీరోగా ఫేడవుట్ అయ్యాక సినిమాలు వదిలేసి వ్యాపారం చేసుకోవచ్చు. కొందరు అలా చేస్తున్నారు కూడా. కానీ, సినిమానే ముందు ప్రాధ్యానం. అందుకే, విలన్ పాత్రలంటే కూడా సై అంటున్నారు. కొందరికైతే, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ విలన్ పాత్రలే పాపులారిటీని తెచ్చాయి.

సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..తెలంగాణSwechaa06 Sep 2026, 08:07 AM

సన్నబియ్యం పేరుతో పీడీఎస్ బియ్యం దందా!..

రేషన్ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలించడం.. అక్కడ పాలిష్ చేయడం.. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు ఉన్నాయో, లేవో స్పష్టత లేని బ్రాండ్ల పేర్లతో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి పంపడం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.కొందరు మిల్లర్లు, వ్యాపారులు పీడీఎస్ ద్వారా లభించే బియ్యాన్ని గ్రామస్థాయిలో ఏజెంట్ల ద్వారా సేకరించి.. మిల్లుల్లో పాలిష్ చేసి.. వివిధ బ్రాండ్ల పేర్లతో కొత్త సంచుల్లో నింపి.. సన్నబియ్యం, సూపర్ ఫైన్ క్వాలిటీ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ తరహా అక్రమ దందా విస్తరించిందనే విమర్శలు వస్తున్నాయి.

Mahakali: సంక్రాంతి పోటీని తట్టుకోవడానికే ప్రశాంత్ వర్మ ఇలా ప్లాన్ చేశాడా!సినిమాSwechaa06 Sep 2026, 08:00 AM

Mahakali: సంక్రాంతి పోటీని తట్టుకోవడానికే ప్రశాంత్ వర్మ ఇలా ప్లాన్ చేశాడా!

Mahakali: 2027, సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టీ పోటీ ఉంది. మన టాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న వెంకటేష్ ‘జనవరి 12 విడుదల’, చిరంజీవి ‘కాకా’, శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’, రజనీకాంత్ ‘ధర్మన్’ చిత్రాలతో పాటు మరికొన్ని పోటీ పడబోతున్నాయి. ఈ సినిమాలకంటే ముందే జనవరి 8న మహాకాళి రిలీజ్ కాబోతోంది. అందుకే, ఇప్పటి నుంచే ప్రశాంత్ వర్మ భారీ స్కెచ్ వేసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

Anil Ravipudi: ‘జనవరి 12 విడుదల’..నవంబర్ కే చుట్టేస్తారా?సినిమాSwechaa06 Sep 2026, 07:27 AM

Anil Ravipudi: ‘జనవరి 12 విడుదల’..నవంబర్ కే చుట్టేస్తారా?

Anil Ravipudi: వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత, ఫ్లాప్ అంటే ఏంటో తెలియని మన టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఇప్పటి వరకూ 9 బ్లాక్ బస్టర్స్ తీసిన అనిల్, 10వ సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమానే ‘జనవరి 12 విడుదల’. టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ని ఒకటిగా పెట్టి ఈ సారి సినిమాపై అంచనాలు పెంచాడు. తాజా సమాచారం మేరకు నవంబర్ వరకూ ఈ సినిమా పూర్తి కానుంది.

Prabhas VS Vishwak Sen: ఒక్కరోజు తేడాతో ఫౌజీ వర్సెస్ లెగసీ!సినిమాSwechaa06 Sep 2026, 07:06 AM

Prabhas VS Vishwak Sen: ఒక్కరోజు తేడాతో ఫౌజీ వర్సెస్ లెగసీ!

Prabhas VS Vishwak Sen: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి ఫౌజీ. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన పీరియాడికల్ కథాంశంతో ఈ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటుస్తున్న రొమాంటిక్ మూవీ లెగసీ ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్ కాబోతోంది. అంటే, డిసెంబర్ 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యంతెలంగాణSwechaa05 Sep 2026, 10:38 PM

కొల్లాపూర్‌ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం

Jupally Krishna Rao: కొల్లాపూర్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మౌలిక వసతులతో పాటు రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థులు, కార్మికుల సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క, ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కొల్లాపూర్‌ పట్టణంలోని రాజా వారి బంగ్లా ఆవరణలో నిర్వహించిన ‘1000 రోజుల ప్రజా ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్InternationalSwechaa05 Sep 2026, 10:32 PM

ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

పాకిస్థాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే.. ఇక మాటలతో సమాధానం ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చినా.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాన్ని ఇచ్చారు.

ప్రజల్లోకి మూడు పార్టీలు.. ఇక సమరమేతెలంగాణSwechaa05 Sep 2026, 10:18 PM

ప్రజల్లోకి మూడు పార్టీలు.. ఇక సమరమే

తెలంగాణలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ.. మూడు పార్టీలు ఒకేరోజు ప్రజల్లోకి దిగి పరస్పర విమర్శలతో హీట్ పెంచాయి. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్షాలు మాట్లాడితే.. తమ పాలనను ఎలివేట్ చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్‌కి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది. శనివారం రాష్ట్రంలో జరిగిన మూడు పార్టీల కార్యక్రమాలు..

Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!సినిమాSwechaa05 Sep 2026, 10:08 PM

Vaishnavi Chaitanya: అప్పుడు అవమానించారు..ఇప్పుడు హీరోయిన్ అంటున్నారు!

Vaishnavi Chaitanya: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ కి మాత్రమే కాదు..26 శాఖలలో ఉన్న వాళ్ళు కూడా కెరీర్ ప్రారంభంలోనో..మధ్యలో డౌన్ ఫాల్ అయితేనో...ఫ్లాపులొచ్చి గ్రాఫ్ పడిపోతేనో అవమానించకుండా ఎవరూ ఉండరు. అసలు, ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడాలంటే చచ్చి బ్రతకాలి. చిరంజీవి, రజినీకాంత్ లాంటి వారికి కూడా అవమానాలు తప్పలేదు.

TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..HealthSwechaa05 Sep 2026, 10:05 PM

TG SAFE Raids: పనీర్‌లో పామాయిల్.. డెయిరీల్లో బొద్దింకలు! హైదరాబాద్‌ సోదాల్లో బయటపడ్డ షాకింగ్ నిజాలు..

హైదరాబాద్‌లో పనీర్, డెయిరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా కొన్ని డెయిరీ యూనిట్లలో పనీర్ తయారీలో పామాయిల్, గ్లిసరాల్ మోనోస్టియరేట్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పలు కేంద్రాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత ప్రమాణాలు సరిగా పాటించడం లేదని వెల్లడైంది.