స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నాతెలంగాణSwechaa05 Sep 2026, 09:49 PM

ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా

Cm Revanth : నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. ఇక దండయాత్రే.. సిరిసిల్ల, సిద్ధిపేట వస్తున్నా.. కాస్కోండి.. అంటూ కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ''ఈడ ఆడ కాదు.. ఇక సిరిసిల్ల వస్తా.. సిరిసిల్ల గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేస్తా. సిరిసిల్ల తర్వాత సిద్ధిపేట మీద దండయాత్ర చేస్తాం'' అని రేవంత్ రెడ్డి అన్నారు. బావ బామ్మర్దుల్లారా.. బంధువులనే తెచ్చుకుంటారో, బానిసలనే తెచ్చుకుంటారో, ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి.. సిరిసిల్ల, సిద్ధిపేటలో తేల్చుకుందాం.. కాస్కోండి కల్వకుంట్ల కుటుంబమా?'' అంటూ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పట్టినట్టేనా?తెలంగాణSwechaa05 Sep 2026, 09:31 PM

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి పట్టినట్టేనా?

సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని ఆయనతో పదేపదే మాట్లాడుతూ కనిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. తన ప్రసంగం ప్రారంభంలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించగానే సభలో కాంగ్రెస్ కార్యకర్తలు ఈలలు, అరుపులతో హోరెత్తించారు. దీంతో సీఎం కాసేపు తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.ఇటీవల వరకు రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని సందర్భాల్లో సీఎంపైనే నేరుగా విమర్శలు చేసిన నేతగా రాజగోపాల్ రెడ్డి పేరు వినిపించింది.

ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..తెలంగాణSwechaa05 Sep 2026, 09:11 PM

ఉచిత బస్సు ‎పై సీఎం రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు!..

మహిళల ఉచిత బస్సు స్కీమ్‎పై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు మహిళలకు ఉచిత బస్సు పథకం ఉంటుందని ప్రకటించారు. ఇవాళ కోటి మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం చూసి కొందరు తట్టుకోలేకపోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేయాలని ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?సినిమాSwechaa05 Sep 2026, 08:52 PM

Shekar Master: జానీ మాస్టర్ భార్యపై శేఖర్ మాస్టర్ ఫిర్యాదు.. అసలు వివాదం ఏంటంటే?

జానీ మాస్టర్ భార్య సుమలత ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం నన్ను తీవ్రంగా బాధించిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన డాన్సర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రఘు మాస్టర్, ఫెడరేషన్‌కు సుమలతతో పాటు సీనియర్ డాన్సర్ లక్ష్మిపై ఫిర్యాదు చేశారు.

90.. లేదంటే 117 ..దేక్ లేంగే కేసీఆర్తెలంగాణSwechaa05 Sep 2026, 08:48 PM

90.. లేదంటే 117 ..దేక్ లేంగే కేసీఆర్

Cm Revanth Vs Kcr: నకిరేకల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా విరుచుకుపడ్డారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాస్కో కేసీఆర్.. ఇదే నా సవాల్ అంటూ ఆవేశంగా మాట్లాడారు. ''ఆనాడు పెద్దలు జానారెడ్డి, జైపాల్ రెడ్డి లాంటోళ్లు ఈ దుర్మార్గులతో మనకెందుకు అనుకున్నారు. కానీ, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలా అనుకోరు. దెబ్బకు దెబ్బ తీస్తారు. వెనక్కి తగ్గరు. జీవితాంతం గుర్తుంచుకోండి. సీట్లు పెరిగితే 117.. ఉన్న సీట్లే ఉంటే 90 సీట్లతో గెలుస్తాం. 2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం కేసీఆర్ ఇదేనా సవాల్'' అని రేవంత్ అన్నారు.

ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..ఏపీSwechaa05 Sep 2026, 08:15 PM

ఇంద్రకీలాద్రిపై గోల్డ్ స్కాం.. సస్పెండ్ చేసినా మారని తీరు!..

ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు సమర్పించిన అమ్మవారి బంగారు ఆభరణాల విషయంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలపై గోల్డ్ అప్రైజర్లు చేతివాటం ప్రదర్శిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలను రసీదుల్లో తక్కువ తూకం చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనే గోల్డ్ అప్రైజర్ షమీపై తీవ్ర ఆరోపణలు రావడంతో, అప్పటి ఈవో శీనా నాయక్ ఆయనను సస్పెండ్ చేశారు. కానీ, ఇప్పుడు మళ్లీ అదే వ్యక్తి పునఃప్రవేశం చేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోల్‌మాల్‌పై సమగ్ర విచారణ జరిపించి, అసలు సూత్రధారులను తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన "సర్"వైరల్ న్యూస్Swechaa05 Sep 2026, 08:02 PM

SIR Effect: 35 ఏళ్ల తర్వాత అన్నదమ్ములను కలిపిన "సర్"

ఒక సర్టిఫికెట్ కోసం వెతుకులాట.. 35 ఏళ్లుగా దూరమైన అన్నను కలిపింది. SIR వెరిఫికేషన్ కోసం చిన్ననాటి స్కూల్ సర్టిఫికెట్ కావాల్సి రావడంతో తన పుట్టిన ఊరికి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. పాత పాఠశాల సిబ్బంది సర్టిఫికెట్ కోసం ఆరా తీస్తుండగా.. అతడి కుటుంబ వివరాలు వెలుగులోకి వచ్చాయి. చివరకు 35 ఏళ్లుగా కనిపించని అన్న ఆచూకీ లభించింది. అన్నను కళ్లారా చూసిన క్షణంలో తమ్ముడి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.

చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాంతెలంగాణSwechaa05 Sep 2026, 08:01 PM

చేతనైతే అసెంబ్లీ రండి.. లెక్కలు తేల్చుకుందాం

Cm Revanth: వెయ్యి రోజుల పాలనలో అద్భుతమైన పథకాలు అందిస్తే కొంత మంది దుర్మార్గులు, సన్నాసులు ప్రభుత్వం విఫలమైంది మంత్రి వర్గం రాజీనామా చేయాలని ఊరూరా తిరుగుతున్నారు అని ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పండుగనాడు గంగిరెద్దులోల్లు వచ్చినట్లు పిచ్చిపిచ్చిగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. విజ్ఞులైన ప్రజలు నాటి 10 సంవత్సరాల పాలనను, మా వెయ్యి రోజుల పాలనన బేరీజు వెయ్యాలని రేవంత్ కోరారు. వాళ్ళు ప్రజలకిచ్చిన హామీలను మా కాంగ్రెస్ తెచ్చిన సంక్షేమాన్ని అంచనా వేయాలన్నారు.

The Paradise-Nani: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?సినిమాSwechaa05 Sep 2026, 07:54 PM

The Paradise-Nani: వారం వెనక్కి అంటే వెంకీకి కష్టాలే?

The Paradise: చిన్న కథ, సింపుల్‌గా ఉంటే డ్రామా, మెలో డ్రామ చిత్రాలను రిలీజ్ చేయడంలో పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. పక్కా కమర్షియల్ సినిమా అయినా అంతే. కానీ, పాన్ ఇండియా సినిమా అన్నప్పుడే టెక్నికల్‌గా చాలా విషయాలలో అసలు కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిలీజ్ చేయ్యాలి. లేదంటే, ఒక్క షోతోనే ఏళ్ళు కష్టపడి తీసిన శ్రమంతా వృధా అయిపోతుంది. సరైన ప్లానింగ్ లేక విడుదలైన సినిమాలు చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

bjp: 22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్!..తెలంగాణSwechaa05 Sep 2026, 07:34 PM

bjp: 22ఏపై బీజేపీ సమరభేరి.. రేవంత్ సర్కార్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్!..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం అంశం తెరపైకి వచ్చింది... భూభారతి చట్టం.. సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా.. పేదల ఇళ్ల కూల్చివేతలు.. ఇవే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త రాజకీయ యుద్ధానికి కారణంగా మారాయి.పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటోందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు..

Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!సినిమాSwechaa05 Sep 2026, 07:24 PM

Naga Vamsi: ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్ పోన్ అవుతుందా..నిర్మాత ఏమన్నారంటే!

Naga Vamsi: వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి, చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. అయితే, తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాను అక్టోబర్‌లోనే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్‌ఫర్మ్ చేశాడు.

తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతోతెలంగాణSwechaa05 Sep 2026, 07:20 PM

తెలంగాణకు భారీ పెట్టుబడి.. రూ.70వేల కోట్లతో

Telangana Investment: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు తరలిరానున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడికి టీసీఎస్ తో ఒప్పందం కుదిరింది. సచివాలయంలో టీసీఎస్, హైపర్ వాల్ట్ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. దేశంలోనే అతి పెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటునకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హైదరాబాద్ లో దాదాపు రూ.70వేల కోట్లతో 250 ఎకరాల్లో 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7వేల మందికి ఉపాధి అవకాశం లభించనుందని అధికారులు భావిస్తున్నారు.

AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు :లోకేశ్!ఏపీSwechaa05 Sep 2026, 07:07 PM

AP: 2029లోగా మరో 3 డీఎస్సీలు :లోకేశ్!

విజహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో చేపడుతున్న సంస్కయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వరణలు, డీఎస్సీ నియామకాలు, పాఠశాలల్లో తీసుకొస్తున్న మార్పులను ఆయన వివరించారు.

టాక్సిక్ గుణపాఠం.. టాలీవుడ్ చాలా నేర్చుకోవాలిసినిమాSwechaa05 Sep 2026, 06:38 PM

టాక్సిక్ గుణపాఠం.. టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి

సినిమా ఎంత పెద్దదైనా.. హీరోకు ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా.. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించేది మాత్రం కంటెంటే. తాజాగా విడుదలైన యశ్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ సినిమాలు ఈ విషయాన్ని మరోసారి బలంగా నిరూపిస్తున్నాయి. ఒకటి భారీ అంచనాలు, పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌తో థియేటర్లలోకి వస్తే.. మరొకటి పెద్దగా హైప్ లేకుండా ప్రాంతీయ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల విషయంలో కనిపిస్తున్న సీన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీని మనమంతా నిషేధిత జాబితాలో పెట్టాలితెలంగాణSwechaa05 Sep 2026, 06:21 PM

కాంగ్రెస్ పార్టీని మనమంతా నిషేధిత జాబితాలో పెట్టాలి

T BJP: 22ఏ నిషేధిత భూముల జాబితాకు నిరసనగా బీజేపీ మహా ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ మహా ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని మనమంతా నిషేధిత జాబితాలో పెట్టాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, 22ఏలో భూములు ఎందుకు పెట్టారో, రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారో చెప్పాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

టీచర్లను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ప్రభుత్వం : సంజయ్తెలంగాణSwechaa05 Sep 2026, 05:35 PM

టీచర్లను ఇబ్బంది పెడుతున్న రేవంత్ ప్రభుత్వం : సంజయ్

బడినే సర్వస్వంగా భావించి కొవ్వొత్తిలా కరిగిపోయిన రిటైర్డ్ ఉపాధ్యాయులు సైతం పదవీ విరమణ అనంతరం తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. టీచర్స్ డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

22A Row: కుట్రపూరితంగానే 22ఏ నిషేధిత జాబితాలోకి భూములు..తెలంగాణSwechaa05 Sep 2026, 05:03 PM

22A Row: కుట్రపూరితంగానే 22ఏ నిషేధిత జాబితాలోకి భూములు..

Ramchander Rao: రేవంత్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్.. ధరణి తెచ్చి ప్రజలను వేధిస్తే.. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పేరుతో ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల జాబితా పేరిట పెద్ద ఎత్తున భూ దోపిడీ జరుగుతోందన్నారు.

రైతులు, పేదల భూములను కుట్రపూరితంగానే 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. నిషేధిత జాబితా నుంచి భూమిని తీసేయాలంటే 30శాతం కమీషన్ అడుగుతున్నారని చెప్పారు. ఈ మొత్తం వివాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర భూ భారతి, 22ఏకు నిరసనగా బీజేఎల్పీ ఆధ్వర్వంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులెవరు..?తెలంగాణSwechaa05 Sep 2026, 04:48 PM

తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులెవరు..?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ పదవుల చుట్టూ హీట్ పెరుగుతోంది. గవర్నర్ కోటాలో నవంబర్ 14, 2026న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది. గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ మూడు స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa05 Sep 2026, 03:41 PM

తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..! మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Mahesh Goud: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ గురించి కాంగ్రెస్ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జోరుగా ప్రచారం నడిచింది. మంత్రి పదవులపై ఆశావహులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారి విస్తరణ జరిగితే తమకు అమాత్య పదవులు ఖాయం అని ఎంతో ధీమాగా ఉన్నారు. అయితే, క్యాబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బాంబు పేల్చారు. ఆశాశహుల ఆశలపై ఆయన నీళ్లు చల్లారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్!..తెలంగాణSwechaa05 Sep 2026, 03:13 PM

సీఎం పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్!..

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో నకిరేకల్‌లో.. పొలిటికల్ హీట్ పెరిగినంది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.. ఈ క్రమంలో ఆయన తన నివాసంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నకిరేకల్ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు..

రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్తెలంగాణSwechaa05 Sep 2026, 02:52 PM

రెండేళ్లు టైమివ్వండి.. అప్పుడు ‘నా పనికి మీరే మార్కులు వేయండి’ : సీఎం రేవంత్

రెండేళ్లు సమయం ఇచ్చి సహకరిస్తే.. పీఆర్సీ, ఇంక్రిమెంట్ల వంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిరుపేదల భవిష్యత్‌ను తీర్చిదిద్దడానికి విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టిన ఈ దశలో రాష్ట్ర విద్యా వ్యవస్థను దేశానికి ఒక దిక్సూచిలా నిలబెట్టడానికి టీచర్లంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.శనివారం కొడంగల్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం మాట్లాడుతూ.. “ఆర్థిక వెసులుబాటును బట్టి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం. మిగతా శాఖలతో పోల్చితే విద్యా శాఖ ఆదర్శంగా నిలబడాలి. పిల్లల భవిష్యత్‌కు మార్గదర్శకులు మీరే. రెండేండ్లు టైం ఇవ్వండి. ప్రతి ఉపాధ్యాయుడికి విజ్ఞప్తి చేస్తున్నా.రెండేళ్లలో సమస్యలన్నింటినీ మీరు అడక్కుండానే పరిష్కరించే బాధ్యత నాది” అని స్పష్టంచేశారు.

Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?తెలంగాణSwechaa05 Sep 2026, 02:44 PM

Ramchander Rao : బీజేపీ అభ్యర్థుల ఆశలకు షాక్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలోకి రామచంద్రరావు?

తెలంగాణలో వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో అప్పుడే హీట్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంపై ప్రధాన పార్టీల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సమయంలో.. గతంలో ఇదే స్థానం నుంచి విజయం సాధించిన ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మరోసారి బరిలోకి దింపే అంశంపై పార్టీ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావుతెలంగాణSwechaa05 Sep 2026, 02:34 PM

పాలిటెక్నిక్ పిల్లల మీద కేసులు పెడితే ఖబడ్దార్ : హరీశ్ రావు

తమ డిమాండ్లను పరిష్కరించాలని పాలిటెక్నిక్ విద్యార్థినులు శనివారం సికింద్రాబాద్ పరిధిలోని సంగీత్ జంక్షన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ పాలిటెక్నిక్ విద్యార్థినులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి వాహనాల్లో తరలించారు. విద్యార్థులను పోలీసు వాహనాల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థినులను అరెస్టు చేసిన విషయం తెలియడంతో మాజీ మంత్రి హరీశ్ రావు ఓ పబ్లిక్ మీటింగులో విద్యార్థినులకు మద్దతుగా మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద కేసులు పెడుతున్న పోలీసులను హెచ్చరించారు. ‘మీ పోలీసులకు కూడా డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీలు రావడం లేదు.. మీకు కూడా రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. మా పిల్లలను ఒక్క దెబ్బ కొట్టినా హరీష్ రావు అడ్డంగా ఉంటాడు.. ఖబర్దార్..!.కేసు పెట్టాల్సి వస్తే మీరు పెట్టాల్సింది రేవంత్ రెడ్డి మీద. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా పిల్లల చదువు ఆగం చేసిన రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని బాండ్ పేపర్లు పంపి మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి’ అని మండిపడ్డారు.

మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!క్రైమ్Swechaa05 Sep 2026, 02:10 PM

మైనర్ డ్రైవింగ్.. రెండు కార్ల మధ్య ఇరుకున్న స్కూటీ..!

మైనర్ బాలురు స్కూటీని రోడ్డు మీదకు తీసుకుని రావడం, వారి డ్రైవింగ్ మూలనా రెండు కార్లు ఢీకొన్నాయి. ఫలితంగా ఇద్దరు బాలురు రెండు కార్ల మధ్య ఇరుక్కున్న ఘటనలో ఒకరు మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కామారెడ్డి పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్ల మధ్య స్కూటీ ఇరుక్కుపోయింది. ఆ సమయంలో మైనర్ వాహనం నడిపినట్టు తెలుస్తోంది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బాలురు 9వ తరగతి చదువుతున్న లోకేశ్, హేమంత్‌గా గుర్తించారు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా తెలిసింది. అయితే, ఈ ప్రమాదంలో హేమంత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లోకేష్‌కు తీవ్ర గాయాలు అవ్వగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది.

Bhagyashri-MohanLal: "లెనిన్" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!సినిమాSwechaa05 Sep 2026, 02:07 PM

Bhagyashri-MohanLal: "లెనిన్" హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న భాగ్యశ్రీ!

Bhagya Shree Borse: లెనిన్ హిట్‌తో మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సాలీడ్ హిట్ అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాతో ఇద్దరికీ దక్కింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ, తెలుగు కంటే ముందు మలయాళం సినిమాలో ముఖ్య పాత్రను దక్కించుకుంది. ఇందులో, మోహన్ లాల్ హీరోగా నటిస్తుండటం విశేషం.

ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..తెలంగాణSwechaa05 Sep 2026, 01:38 PM

ఎమ్మెల్సీ పోరుపై హస్తం మార్క్ స్కెచ్.. తెరపైకి కొత్త అభ్యర్థులు!..

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా ఇంకా మోగలేదు.. నోటిఫికేషన్‌కు మరో నాలుగు నెలల సమయం ఉంది.. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు.. ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల లాబీయింగ్‌తో హస్తం శిబిరంలో సందడి మొదలైంది. ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎవరిని అధిష్టానం పక్కన పెడుతుంది? అన్న చర్చలు పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది.

రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్తెలంగాణSwechaa05 Sep 2026, 01:16 PM

రేవంత్ ఓటుకు నోటు దొంగ.. జాక్‌పాట్ సీఎం : కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీల అమలుపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లోని అంబేడ్కర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ‘జెన్ జీ’ సభకు హాజరైన కేటీఆర్..రేవంత్ సర్కారు ప్రభుత్వ విధానాలు, పాలన తీరుపై విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరిట 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నారని, 1000 రోజులు అయింది ఏం చేశారని ప్రశ్నించారు. బకాసురులులాగా తింటున్నారు, కుంభకర్ణుల్లా పండుకుంటున్నారు, పంది కొక్కుల్లా తింటున్నారు.. అది తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు.

Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?సినిమాSwechaa05 Sep 2026, 01:10 PM

Vishwambhara: చిరు సినిమాకి కూడా OTT కష్టాలా?

Vishwambhara: చిన్న సినిమా పెద్ద సినిమా..ఏదైనా పదే పదే గనక విడుదల వాయిదా పడితే, ఆ సినిమాపై చాలామందికి సందేహాలు మొదలవుతాయి. సినిమా ఆడేది కాదులే అనే నెగిటివ్ టాక్ మొదలవుతుంది. దీంతో, ఆటోమేటిక్‌గా బిజినెస్ పరంగానూ లెక్కలు, అంచనాలు మారిపోతాయి. ఇలాంటివన్నీ పెద్ద హీరోల సినిమాలకి కూడా వర్తిస్తాయి. మెగాస్టార్ సినిమాకి ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే తలెత్తినట్టుగా తెలుస్తోంది.

రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!క్రైమ్Swechaa05 Sep 2026, 12:50 PM

రోడ్డుపైనే రెచ్చిపోయిన కామాంధుడు.. తరిమిన శునకం!

మానవ రూపంలో ఉన్న కొన్ని మృగాలు రోడ్ల మీద సంచరిస్తున్న, ఒంటరిగా ఉండే మహిళలు, మైనర్ బాలికలను టార్గెట్‌గా చేసుకుంటాయి. ఎవరూలేని సమయంలో వారి మీద అఘాయిత్యాలకు పాల్పడంతో పాటు ఎక్కడ పోలీసులకు దొరికిపోతామనే భయంతో అమాయకులను బలిగొంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా వెలుగుచూస్తున్నాయి. తమిళనాడులో ఓ దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఓ కామాంధుడి కన్ను పడింది. చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించిన మనిషి రూపంలో ఉన్న మృగం.. ఒక్కసారిగా ఆ మహిళపై తన కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నించింది. బాధితురాలు వదిలిపెట్టాలని వేడుకున్నా వినిపించుకోలేదు. అక్కడే సంచరిస్తున్న ఓ శునకం మాత్రం ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించింది.

Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!సినిమాSwechaa05 Sep 2026, 12:11 PM

Shriya Reddy: మహాకాళి కోసం కత్తిసాము..లేటెస్ట్ ఫొటోస్ వైరల్!

Shriya Reddy: కథ డిమాండ్ చేస్తే బెగ్గర్‌గా, అపర కోటీశ్వరుడిగానైనా, భక్తుడిగా అయినా, దేవుడిగా అయినా ఆన్ స్క్రీన్‌పై కనిపించి అలరించాల్సిందే. కథ-కథనాలకి తగ్గట్టు పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి గెటప్ అయినా వెయ్యాల్సిందే. ఎంతటి కఠోర శ్రమైనా తట్టుకోవాల్సిందే. సినిమా కోసం హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా రోజుల తరబడి కష్టపడుతున్నారు.