స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?టాప్ న్యూస్Swechaa05 Sep 2026, 12:10 PM

రైతు బీమా బంద్..అన్నదాత ఆగం?

అన్నదాత మరణిస్తే బాధిత కుటుంబానికి భరోసాగా గత ప్రభుత్వం చెల్లించిన రెతు బీమా రూ.5 లక్షలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో రైతు భరోసా, రైతుభీమా కొనసాగిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే రైతు బీమా నిలిపి వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచిన రూ.5 లక్షల భరోసాను తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలిసింది.నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు అర ఎకరం భూమి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబపెద్ద మరణంతో రాంచందర్ మిత్రులు రూ.5 లక్షల రైతుబీమా కోసం స్థానిక ఏఈఓను కలవగా.. రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచిపోయిందని, బీమా క్లెయిమ్ కాదని చెప్పడంతో రాంచందర్ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయినట్టు సమాచారం.

కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa05 Sep 2026, 11:46 AM

కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ సపోర్టు : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ‘ఎస్ఐఆర్’ పావుగా వాడుకుంటున్నారని చెప్పారు. శనివారం కొడంగల్‌లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌‌కు గుర్తింపు వచ్చిందన్నారు. ఇక్కడి ప్రజల అభిమానమే తన బలమని ముఖ్యమంత్రి వెల్లడించారు. మోడీ సర్కార్ SIR పేరుతో నాటకాలు ఆడుతోందని, కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర, బిహార్, బెంగాల్ ఎన్నికల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేసి గెలిచారన్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!సినిమాSwechaa05 Sep 2026, 11:16 AM

'Kalki 2898 AD Part 2': క్రేజీ సీక్వెల్‌లో దీపికను రీప్లేస్ చేస్తున్న ఆలియా!

'Kalki 2898 AD Part 2': పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో కల్కీ పార్ట్ 2 కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలై కొన్నాళ్ళు చిత్రీకరణ జరిగిన తర్వాత మళ్ళీ నిలిచిపోయింది. అయితే, తాజా సమాచారం మేరకు త్వరలో, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. అంతేకాదు, కీలక పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!ఏపీSwechaa05 Sep 2026, 11:16 AM

హైకోర్టు వార్నింగ్.. ఇన్ స్టా మిస్డ్‌కాల్‌తో దొరికిన బాలిక ఆచూకీ!

జూన్ 9వ తేదీన కనిపించకుండా పోయిన బాలికను ఎట్టకేలకు ఏపీ పోలీసులు కనిపెట్టారు. తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచిందని అయినా ఆచూకీ కనిపెట్టలేకపోయారని బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన కోర్టు.. గుంటూరు జిల్లా పోలీసుల పనితీరుపై మండిపడింది. తెల్లవారే సరికి బాలికను న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశాలు ఇవ్వడంతో .. బాలిక ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేకంగా ‘సిట్’ వేసిన ఏపీ డీజీపీ.. విచారణ చేపట్టగా.. హర్యానాలో బాలిక ఆచూకీని గుర్తించారు. ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌ ద్వారా గుంటూరులో కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు చేధించినట్టు తెలిసింది. బాలిక మిస్సింగ్ కేసులో షేక్‌ జాన్‌సైదాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభతెలంగాణSwechaa05 Sep 2026, 10:55 AM

నేడు కరీంనగర్‌కు కేటీఆర్.. ‘జెన్ జీ’తో భారీ సభ

కాంగ్రెస్ పార్టీ తీరు,వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర్‌కు వెళ్లనున్నారు.రానున్న రోజుల్లో ప్రభుత్వ తలరాతను డిసైడ్ చేసేది యువతరం అని గుర్తించిన కేటీఆర్.. వారితో ఇటీవల తరచూ ఇంటరాక్ట్ అవుతున్నారు.వచ్చే ఎన్నికల్లో యువతరమే టార్గెట్‌గా బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు సైతం ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను సర్కార్ మోసం చేసిందని విమర్శిస్తున్న కేటీఆర్.. నేడు కరీంనగర్‌లో ‘జెన్ జీ’తో భారీ సభను నిర్వహిస్తున్నట్టు సమాచారం. అంబేద్కర్‌ మినీ స్టేడియంలో జెన్‌ జీ సభ కోసం ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నాం సభ ప్రారంభంకానుందని సమాచారం. ఈ క్రమంలోనే విద్యార్థులు, యువతతో కేటీఆర్‌ సమావేశం అవుతారని, ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరగనుందని తెలుస్తోంది.

మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..InternationalSwechaa05 Sep 2026, 10:13 AM

మిలటరీ బ్యారక్స్‌లో మృత్యుఘోష.. 10 మందికి పైగా మృతి-60 మందికి గాయాలు!..

దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా లో ఘోర ప్రమాదం సంభవించింది. దేశ రాజధాని లాపాజ్ సమీపంలోని ఓ మిలటరీ బ్యారక్స్‌లో జరిగిన భారీ పేలుడులో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. లాపాజ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వియాచా మున్సిపాలిటీలోని సైనిక స్థావరంలో ఈ పేలుడు సంభవించింది.

డేంజర్స్ బెల్స్..  నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలుప్రపంచంSwechaa05 Sep 2026, 10:07 AM

డేంజర్స్ బెల్స్.. నేపాల్‌లో భారీగా విరిగిపడిన కొండచరియలు

నేపాల్‌లో గతనెల 26న భారీ వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరదల కారణంగా భోటే కోషి (Bhote Koshi) నది పెద్దఎత్తున ఉప్పొగింది. నేపాల్–చైనా సరిహద్దు వద్ద గల ఈ నదిలోకి టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు, మంచు, రాళ్లు, మట్టి చేరడంతో వరద తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయ్యాయి. భారీగా ఆస్తినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా వాటిల్లింది. ఇదిలాఉండగా, నేపాల్‌కు మరో భారీ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. దార్చులా జిల్లా అపి హిమల్ రూరల్ ప్రాంతంలో భట్టార్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.అవి చౌలానీ నది ప్రవాహాన్ని పాక్షికంగా అడ్డుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద పోటెత్తే ప్రమాదం ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో వరద ప్రవాహానికి ఆటంకం లేకుండా ఉండేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!సినిమాSwechaa05 Sep 2026, 10:05 AM

Rajinikanth: జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’ షూటింగ్..ఎన్ని కెమెరాలు వాడుతున్నారంటే!

Rajinikanth: ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తున్నారంటే, అది భారీ మల్టీస్టారర్ అవుతుంది. కానీ, ఇది మల్టీస్టారర్ అనుకోవాలా లేక మల్టీ బిగ్ ప్రాజెక్ట్ అనుకోవాలా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కారణం ఉలగనాయగన్ కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్స్ బ్యానర్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి "ధర్మన్: ది డెడ్లీ డాక్టర్" అనే పేరు పెట్టారు. ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి దాదాపు 8 భారీ కెమెరాలను ఉపయోగిస్తున్నారట.

నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..క్రైమ్Swechaa05 Sep 2026, 09:55 AM

నిత్యం రక్తసిక్తమవుతున్న రహదారులు..రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతి!..

నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లికల్ ఎక్స్‌ రోడ్ సమీపంలోని దయ్యాల గండి వద్ద ద్విచక్ర వాహనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు నాగార్జునసాగర్ పైలాన్‌కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. లేదు.

మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపుతెలంగాణSwechaa05 Sep 2026, 09:48 AM

మూడు నెలల రేషన్ కోటా.. నేటితో గడువు ముగింపు

రేషన్ కార్డు లబ్దిదారులకు ముఖ్యగమనిక. ఎవరైతే మూడు నెలల రేషన్ కోటా తీసుకోలేదో త్వరగా తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఎందుకంటే ఈ కోటా పంపిణీకి నేటి సాయంత్రంతో గడువు ముగియనుంది.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి కోటా మొత్తాన్ని ప్రభుత్వం గత నెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కొందరు లబ్దిదారులు రేషన్ తీసుకోలేదని తెలిసి ఈనెల 5 వరకు పంపిణీ గడువు తేదీని పొడగించింది. కాగా,నేటి సాయంత్రం గడువు ముగియనుంది. రేషన్ తీసుకోనివారు వెంటనే వెళ్లితీసుకోవాలని లేదంటే మళ్లీ నవంబర్ నెలలోనే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

Rashmika-Epic Event: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మికసినిమాSwechaa05 Sep 2026, 09:33 AM

Rashmika-Epic Event: ఎపిక్ ప్రీమియర్స్..నిర్మాతల కంటే ముందే రివీల్ చేసిన రష్మిక

Rashmika Mandanna: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ, క్యూట్ బ్యూటీ..తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎపిక్. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ఆనంద్ దేవరకొండ వదిన, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఎపిక్ సినిమా ప్రీమియర్స్‌ను (సెప్టెంబర్ 10) నిర్మాతల కంటే ముందే రివీల్ చేసింది.

భూమి కోసం తిరగబడుతున్న తెలంగాణ?టాప్ న్యూస్Swechaa05 Sep 2026, 09:31 AM

భూమి కోసం తిరగబడుతున్న తెలంగాణ?

ఇండియాలో భూమి అంటే భక్తికాదు, అదో జీవిత భరోసా.. దాన్నే మింగేసిన నిజాం నుంచి నేటి కాంగ్రెస్ చరిత్ర ఇదే? 1909లో నిజాం రాజు తన భూములు అంటూ చేసిన సర్వేలు, 1925లో రెవెన్యూ పట్టాలుగా మారాయి. గోదావరి, సింగూర్ ప్రాంతాల్లో మాత్రమే పంటలు పండే భూములు పట్టాలుగా ఉండేవి. వాళ్లు మాత్రమే పన్నులు కట్టేవారు. కాని లక్షల ఎకరాల భూమి ఉన్నా, పన్నులు కట్టకుండా నిజాం దేశంలో ప్రజలంతా బతికేస్తున్నారు అంటూ పట్టాలుగా ఇచ్చేశారు. సర్వే నెంబర్స్ కేటాయించారు. ఆనాడు ఈనాటి టెక్నాలజీ లేదు. ఒక ఎకరం కుటుంబం దున్నుకుంటే ఎక్కువ. కానీ, పన్ను మాత్రం అంతటికి చెల్లించాలనే ఉద్దేశంతో 1935 వరకు ఎవరూ చెల్లించలేదు. దీంతో మాజీ పట్టా అని, ఖరీజు ఖాతా అంటూ మార్చారు.

యాత్రికులతో కిక్కిరిసిన శేషాచలం.. స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?ఏపీSwechaa05 Sep 2026, 09:25 AM

యాత్రికులతో కిక్కిరిసిన శేషాచలం.. స్వామి వారి దర్శనానికి ఎన్ని గంటలు అంటే?

గోవింద నామస్మరణతో ఏడుకొండలు మారుమోగిపోతున్నాయి. ఆపదమొక్కులవాడు, అనాథ రక్షకుడైన ఆ శ్రీవేంకటేశ్వరస్వామి దివ్య దర్శనం కోసం తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా పోటెత్తారు. వీకెండ్ కావడంతో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన యాత్రికులతో శేషాచలం కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.

దీంతో భక్తులు కాలినడక మార్గాలు, బయట ఏర్పాటు చేసిన రింగు రోడ్డు క్యూలైన్లలో గంటల తరబడి వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ప్రత్యేక టైమ్ స్లాట్ టోకెన్లు లేకుండా, సాధారణ సర్వదర్శనానికి వస్తున్న భక్తులకు శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించేందుకు దాదాపు 20 గంటల సుదీర్ఘ సమయం పడుతోందని సమాచారం.. ఇప్పటికే ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

హాజరు లేకుండానే హాల్‌టికెట్లు.. యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ స్కాం!..తెలంగాణSwechaa05 Sep 2026, 09:07 AM

హాజరు లేకుండానే హాల్‌టికెట్లు.. యూనివర్శిటీల్లో బయోమెట్రిక్ స్కాం!..

తెలంగాణలో విద్యా వ్యవస్థ గాడితప్పుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇందుకు పలుకారాణాలున్న తాజాగా రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల పరిధిలోని కాలేజీల్లో విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న బయోమెట్రిక్ హాజరు ఫీజుల వ్యవహారం సంచలనంగా మారింది. పలు కాలేజీల్లో బయోమెట్రిక్ ఫీజు పేరిట ఒక్కో సెమిస్టర్‌కు ప్రతి విద్యార్థి దగ్గర నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. గత ఆరేళ్ల బయోమెట్రిక్ వివరాలను పరిశీలిస్తే ఇలాంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.. దాదాపు సగానికి పైగా ఓయూ పరిధిలో ఉన్న ఎంబీఏ కాలేజీల్లో అసలు అధ్యాపకులుండరు. మౌలిక వసతులుండవు. కాలేజీలకు తాళాలు వేసి ఉంటాయనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీలకు రాకుండా పరీక్షల సమయంలో మాత్రమే హాజరవుతున్నారని తెలుస్తుంది.

తెలంగాణ కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్!..తెలంగాణSwechaa05 Sep 2026, 08:33 AM

తెలంగాణ కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్!..

తెలంగాణలో కౌలు రైతుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. భూమిని సాగు చేస్తున్నా.. రైతుగా గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న పరిస్థితి. రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాలు మాత్రమే కాదు.. పంటకు అవసరమైన ఇన్‌పుట్ సబ్సిడీలు పొందడంలోనూ కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా కౌలు రైతులకు ఈ సమస్య రావడానికి కారణం.. భూమిని కౌలుకు తీసుకున్న రైతు దగ్గర సాధారణంగా భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉండవు. ఆ పత్రాలు భూ యజమాని దగ్గరే ఉంటాయి. అయితే కౌలుదారుడికి పత్రాలు ఇస్తే.. భవిష్యత్తులో తన భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందనే భయం కొందరు పట్టాదారుల్లో ఉంది. పాత కౌలు చట్టాలపై ఉన్న అపోహలు, సరైన అవగాహన లేకపోవడం ఈ సమస్య తలెత్తుతుంది..

ఢిల్లీకి రెడ్ అలర్ట్.. వరద ముప్పుతో దేశ రాజధాని విలవిల!NationalSwechaa04 Sep 2026, 11:47 PM

ఢిల్లీకి రెడ్ అలర్ట్.. వరద ముప్పుతో దేశ రాజధాని విలవిల!

ఒకవైపు కుండపోత.. మరోవైపు ఉగ్రరూపం దాల్చుతున్న నదులు.. ఇంకోవైపు రోడ్లపై నిలిచిపోయిన వరద నీరు. దేశ రాజధాని ఢిల్లీకి వాన ముప్పు మరింత తీవ్రమైంది. భారీ వర్షాలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ.. భారత వాతావరణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది.

కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..తెలంగాణSwechaa04 Sep 2026, 10:24 PM

కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ స్పెషల్‌ ఫోకస్‌.. అధికారులకు కీలక ఆదేశాలు!..

కొడంగల్‌ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తూ.. వాటి పురోగతి, నాణ్యత, పూర్తయ్యే గడువుపై అధికారులను ఆరా తీస్తున్నారు.. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు మద్దూరు, దౌలతాబాద్‌, దుద్యాల మండలాల్లో సీఎం పర్యటించారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..తెలంగాణSwechaa04 Sep 2026, 10:00 PM

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేసీఆర్ బిగ్ ప్లాన్!!..

తెలంగాణ రాజకీయాల్లో ఏర్పడుతున్న ఘటనలను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల ను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నాయకత్వం తెలంగాణ కేంద్రంగా కొత్త వ్యూహాల అమలుకు ప్రణాళికలు సిద్దం చేసినట్టు తెలుస్తుంది.. ఇదే సమయంలో కోన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ కు ప్రాణం పోయాడానికి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి..

Deepika: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!సినిమాSwechaa04 Sep 2026, 09:58 PM

Deepika: రియల్ లైఫ్ బేబీ బంప్‌తో రాకా షూట్‌లో దీపిక!

Deepika Padukone: సినిమాలో హీరోయిన్స్ గనక గర్భిణిగా నటించాల్సి వస్తే ఆర్టిఫిషియల్ పెగ్నెన్సీ బంప్(బేబీ బంప్) తో నటిస్తారు. ఇలాంటి సన్నివేశాలలో పర్ఫార్మ్ చేయడం కూడా పెద్ద ఛాలెంజ్. పెళ్లి కాకుండా గర్భవతిగా ఫీలై నటించాల్సి వస్తే మహిళలకి పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ, ఇలాంటి సీన్స్‌లో మన హీరోయిన్స్ చాలామంది జీవించారు.

Megastar-Kaaka: "కాకా" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్సినిమాSwechaa04 Sep 2026, 09:35 PM

Megastar-Kaaka: "కాకా" అప్‌డేట్..హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్

Megastar-Kaaka: మెగాస్టార్ చిరజీవి నటిస్తున్న సినిమాలలో "కాకా" ఒకటి. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఇది, లాంగ్ షెడ్యూల్ అని తెలుస్తోంది.

కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..తెలంగాణSwechaa04 Sep 2026, 09:21 PM

కొండా సురేఖ స్థానంలో.. తెలంగాణ కేబినెట్‌లో లేడీ ఫైర్ బ్రాండ్?!..

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. కొండా సురేఖ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తరువాత కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సురేఖ స్థానంలో మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరోవైపు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే హైకమాండ్ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. సురేఖ పైన వేటు వేస్తూనే.. ఒకే సారి ముగ్గురు మహిళలకు పదవులు కట్టబెట్టడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు చర్చించుకుంటున్నారు.

కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..తెలంగాణSwechaa04 Sep 2026, 08:25 PM

కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి వివేక్!..

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఒక ఫెయిల్డ్ లీడర్ అని.. ఆయన అసమర్థత వల్లే అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమైందని విమర్శించారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్Swechaa04 Sep 2026, 08:15 PM

6న కాంగ్రెస్ మహా ధర్నా.. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేస్తుంటే.. అందుకు కౌంటర్ గా కాంగ్రెస్.. కేసీఆర్ ను టార్గెట్ చేసింది. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల్లో.. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారని, ప్రజా సమస్యలపై ఒక్క రోజు కూడా మాట్లాడలేదని, అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఈ నెల 6న హైదరాబాద్‌ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు.

అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలుSwechaa04 Sep 2026, 07:50 PM

అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ కీలక ఆదేశాలు

సెప్టెంబర్ 7 నుండి శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1గంటకు లంచ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు గులాబీ బాస్. అసెంబ్లీ సమావేశాల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.

కొండా సురేఖకు కచ్చితంగా అవకాశం ఇస్తాంతెలంగాణSwechaa04 Sep 2026, 04:46 PM

కొండా సురేఖకు కచ్చితంగా అవకాశం ఇస్తాం

Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ కొంత బాధాకరమే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సురేఖ తీరు ఆక్షేపణీయంగా ఉన్నందునే ఆమెపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కొండా సురేఖ చెప్పారన్న మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ లో కంటిన్యూ అయితే ఆమెకు అవకాశం ఇస్తామన్నారు. నిన్న కొండా సురేఖ కొంత ఆవేశం, ఆవేదనతో మాట్లాడారన్న మహేశ్ కుమార్ గౌడ్.. ఇకపై కొండా సురేఖ అలా మాట్లాడకూడదని సూచించారు.

కొండా సురేఖ సరే.. పొంగులేటి బర్తరఫ్ ఎప్పుడు?- హరీశ్ రావుతెలంగాణSwechaa04 Sep 2026, 03:59 PM

కొండా సురేఖ సరే.. పొంగులేటి బర్తరఫ్ ఎప్పుడు?- హరీశ్ రావు

Harish Rao: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూములు ఇస్తే.. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి వాటిని లాక్కుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ వేదికగా 22ఏపై పోరాటం చేస్తామని ప్రకటించారు. సిర్పూర్ బీఆర్ఎస్ సభలో హరీశ్ రావు మాట్లాడారు.

కొండా సురేఖ బర్తరఫ్ అంశంపైనా హరీశ్ రావు స్పందించారు. సీఎం రేవంత్ ను తిట్టారని కొండా సురేఖ పై చర్యలు తీసుకున్నారని చెప్పారు. మరి నిషేధిత భూముల పేరుతో ప్రజలను పట్టిపీడిస్తున్న పొంగులేటిపై చర్యలు ఏవి? అని హరీశ్ రావు నిలదీశారు. రేవంత్ తో పొంగులేటికి ఏం పొత్తుందో చెప్పాలన్నారు.

మంత్రి పొంగులేటి కమీషన్ దందా : ఆర్ఎస్‌పీతెలంగాణSwechaa04 Sep 2026, 03:24 PM

మంత్రి పొంగులేటి కమీషన్ దందా : ఆర్ఎస్‌పీ

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితా గురించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది. కమీషన్ల కోసమే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో కమీషన్ల పాలన నడుస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22 A ద్వారా భూములను నిషేధిత జాబితాలో పెట్టి, సిగ్గులేకుండా టోల్‌ఫ్రీ నంబర్ పెట్టామని చెప్తున్నాడు. టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే బాధితుల నంబర్లు తీసుకుని, ఒక వారం రోజులకు వాళ్లకు బ్రోకర్‌ గాళ్లు ఫోన్ చేస్తారు. నీకున్న భూమిలో కొంత మాకు రాసిస్తే, నీ భూమిని నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని చెప్తారు. ప్రభుత్వ అధికారులకు కూడా తెలియకుండానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ద్వారా మన భూములను వేరే వాళ్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు’అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

ప్రియురాలు ఐఫోన్ అడిగిందని అడ్డంగా బుక్కైన ప్రియుడుతెలంగాణSwechaa04 Sep 2026, 02:35 PM

ప్రియురాలు ఐఫోన్ అడిగిందని అడ్డంగా బుక్కైన ప్రియుడు

రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోరిక తీర్చడం కోసం ఓ యువకుడు తన జీవితాన్ని రిస్కులో పడేసుకున్నాడు. ఫలితంగా జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు తెలిసి తెలియని వయసులో చేసే చిన్న తప్పులు వారిపై నేరస్తుడు అనే ముద్ర పడేలా చేస్తున్నది. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మత్తు వినియోగం భారీగా పెరిగింది. విద్యార్థులే అత్యధికంగా మత్తుకు బానిస అవుతున్నారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మత్తుకు బానిసలుగా మారుతుంటే.. మరికొందరు ఈజీ మనీ కోసం మాదకద్రవ్యాలు సరఫరా చేసే వృత్తిని ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఆమె కోరిక తీర్చేందుకు ఓ యువకుడు గంజాయి సప్లయర్‌గా అవతారమెత్తాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన మిత్ర చైతన్య.. హేమలత ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే, ప్రియురాలు ఐఫోన్ కావాలని కోరడంతో ఒడిశాకు వెళ్లి రూ.16 వేలకు 12 కేజీల గంజాయి కొనుగోలు చేసిన చైతన్య.. హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో అతని ప్రియురాలు కూడా ఉన్నట్టు సమాచారం.

నిరీక్షణ ముగిసింది..  బాంబ్‌పేల్చిన కొండా సురేఖరాజకీయాలుSwechaa04 Sep 2026, 02:13 PM

నిరీక్షణ ముగిసింది.. బాంబ్‌పేల్చిన కొండా సురేఖ

మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుసగా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక ఆమె కొంతకాలం పాటు మౌనంగా ఉండిపోతారని అంతా భావించారు. కానీ, అందుకు భిన్నంగా కొండా సురేఖ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి పోయినందుకు బాధగా ఉన్నా దానిని ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ సోష‌ల్ మీడియా (ఫేస్‌బుక్‌)లో ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. ‘ఇక నిరీక్ష‌ణ ముగిసింది’ రాసుకొచ్చారు.త్వరలోనే బిగ్ అప్డేట్ ఉంటుందని, తెలంగాణ వేచి చూడాల‌ని పేర్కొన్నారు. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తొలగించడంతో కొండా సురేఖ తీవ్రంగా హర్ట్ అయినట్టు తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది..

అలా తగ్గి ఇలా పెరిగి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలువ్యాపారంSwechaa04 Sep 2026, 01:17 PM

అలా తగ్గి ఇలా పెరిగి.. మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు

పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి. ఓ రోజు పెరగడం, మరోసారి తగ్గడం జరుగుతోంది. వినియోగదారులు సైతం ధరలు తగ్గినప్పుడు చూద్దాంలే అని అనుకునేలోపు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. శుభాకార్యల సమయం కావడంతో ధరలు ఎక్కువైనా బంగారం కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడం వల్లే పసిడి ధరలు పెరుగుతున్నట్టు సమాచారం.ఇదిలాఉండగా, గత వారం రోజులు బంగారం ధరలు తగ్గడం, పెరగడం జరుగుతోంది. అయితే, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.