స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Prabhas - Romanchikam: చిన్న సినిమాకి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్..సినిమాSwechaa02 Sep 2026, 09:49 PM

Prabhas - Romanchikam: చిన్న సినిమాకి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్..

Prabhas: ఈ వారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రోమాంచికం. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించారు. దర్శకుడు సందీప్ రెడ్డి సమర్పణలో ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ మూవీగా ఇది తెరకెక్కింది. ఈ నేపథ్యంలో సినిమాకి మన పాన్ ఇండియన్ ప్రభాస్ తన శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి, సంబందించిన టెమ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

గజ్వేల్‌లో భూదందా..! రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేసిన కాంగ్రెస్ నేతలుతెలంగాణSwechaa02 Sep 2026, 09:30 PM

గజ్వేల్‌లో భూదందా..! రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేసిన కాంగ్రెస్ నేతలు

Gajwel Land Scam: గజ్వేల్ నియోజకవర్గంలో భూదందా వెలుగు చూసింది. కాంగ్రెస్ నాయకులు బరి తెగించారు. రాత్రికి రాత్రే 50 ఎకరాల భూమిని కొట్టేశారు. గజ్వేల్ మండలం హవాడిగూడ గ్రామంలో సర్వే నెంబర్ 49లోని 50 ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా రాత్రికి రాత్రి సిద్ధిపేట కలెక్టర్, రెవెన్యూ అధికారులు మార్చేశారు.

20ఏళ్లుగా ఆ వ్యవసాయ భూమిలో సాగు చేసుకుంటున్న దళిత, గిరిజనులను కాదని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ప్రజా సంబంధాల అధికారి (PRO) తల్లి పేరు మీద 25 ఎకరాలు, మరికొందరి పేరు మీద 25 ఎకరాలు రాయించేసుకున్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడు ఈ 50 ఎకరాలు కొని రికార్డులు తారుమారు చేసేశాడు. అసైన్డ్ భూమిని రాత్రికి రాత్రే కాంగ్రెస్ నాయకుడి పేరు మీదకి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది మార్చేశారు.

నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు- కొండా సురేఖ వార్నింగ్తెలంగాణSwechaa02 Sep 2026, 09:15 PM

నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు- కొండా సురేఖ వార్నింగ్

Konda Surekha: తన కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదంలో మంత్రి కొండా సురేఖ తగ్గేదేలే అన్నట్లుగా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ.. ముఖ్యమంత్రి రేవంత్ తో ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడారు. తనపై చర్యలు తీసుకునేముందు సీఎం రేవంత్ పై యాక్షన్ తీసుకోవాలని కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై చర్యలు తీసుకుంటే బీసీలంతా ఏకం అవుతారని మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. తన కూతురిని రెచ్చగొట్టేలా సీఎం రేవంత్ మాట్లాడారని సురేఖ అన్నారు. తన కూతురు ఏం సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చిందో ఖర్గేకు వివరించానన్నారు. ''మా కంటే ముందు మాట్లాడిన రెడ్డి నేతలపై చర్యలు ఎందుకు లేవు? కొందరు మంత్రులపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్క భార్యల కమీషన్లపైనా ఫిర్యాదులు ఉన్నాయి. వాటికి ఏం సమాధానం చెబుతారు?'' అని కొండా సురేఖ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరుగులుఏపీSwechaa02 Sep 2026, 08:41 PM

ఉత్తరాంధ్రకు గోదారమ్మ పరుగులు

Godavari Water: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపూర్వ ఘట్టం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల అయ్యాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లను విడుదల చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకం ఆవిష్కరించారు చంద్రబాబు. ఆ తర్వాత రెగ్యులేటర్ ఆన్ చేసి నీటిని రిలీజ్ చేశారు. అనంతరం గోదావరికి అఖండ హారతి ఇచ్చారు. ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది.

పాయకరావుపేట మండలం పీఎల్‌ పురం వద్ద ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గోదారమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదారమ్మకు సాష్టాంగ నమస్కారం చేశారు.

Ramana Gogula: ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే!సినిమాSwechaa02 Sep 2026, 08:32 PM

Ramana Gogula: ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయితే!

Ramana Gogula: రమణ గోగుల సంగీతం అందించిన సినిమాలలో పవన్ కళ్యాణ్ నటించిన "తమ్ముడు", "బద్రి", "అన్నవరం", "జానీ" సినిమాలకి సంగీతం అందించాడు. 'బంగాళా ఖాతంలో'.. సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. మ్యూజికల్‌గా పవన్-రమణ మధ్య మంచి బాండింగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ సారాంశంలో మళ్ళీ కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. 'ఓజీ'లో 'లెట్స్ గో జానీ' సాంగ్ రీమిక్స్ పాడించారు.

నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడుతెలంగాణSwechaa02 Sep 2026, 06:49 PM

నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీలో హాట్ కామెంట్స్ కు కేరాఫ్ గా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ కబ్జా చేయలేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం మంచిదే.. కానీ, వారు తమ ఇంట్లోకి వచ్చి తమనే వెళ్లగొడతామంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఆపదలో ఆదుకున్న దేశాలకు నేపాల్ బిగ్ షాక్.. తెరపైకి కొత్త డిమాండ్!..InternationalSwechaa02 Sep 2026, 05:46 PM

ఆపదలో ఆదుకున్న దేశాలకు నేపాల్ బిగ్ షాక్.. తెరపైకి కొత్త డిమాండ్!..

ఆకస్మిక వరదలతో నేపాల్ అతలాకుతలం అయింది. ముఖ్యంగా బోటెకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన జలప్రళయం వల్ల అనేక గ్రామాలు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ రాకాసి వరదల ధాటికి ఇప్పటి వరకు సుమారు 1300లకు పైగా మృతదేహాలను వెలికి తీయగా, మరో 4,500 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటి వరకు నేపాల్ ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన విపత్తులలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ సహా అనేక దేశాలు నేపాల్‍కు ఆపన్న హస్తం అందించాయి. అయితే, ఆపత్కాలంలో అండగా నిలిచిన దేశాల పట్ల కృతజ్ఞత ప్రకటించాల్సిన నేపాల్, అనూహ్యంగా ఒక కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. తమకు కావాల్సింది సాయం కాదు, క్లైమేట్‌ జస్టిస్‌ అని స్పష్టం చేసింది.

Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్సినిమాSwechaa02 Sep 2026, 05:43 PM

Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్

Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్..అతని గత చిత్రం సక్సెస్ ని బట్టే ప్రేక్షకులు సినిమాకి వస్తున్నారన్నారు టాలీవుడ్ టాల్ హీరో కం ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒకప్పుడు ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌కి హీరోల కోసం వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా..ఈ పేరు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుందని అభిప్రాయపడ్డాడు రానా.

నా గురించి మాట్లాడిన వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి- కొండా సురేఖSwechaa02 Sep 2026, 05:40 PM

నా గురించి మాట్లాడిన వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి- కొండా సురేఖ

తాను చెప్పాల్సినవన్నీ పార్టీ పెద్దలకు చెప్పేశానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఢిల్లీలో కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ కు అంతా వివరించానన్న కొండా సురేఖ.. పార్టీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది తనకు తెలియదన్నారు.

ఏఐసీసీ మెంబర్ అయిన తనకు పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వడమే తప్పు అని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధమే లేదన్నారు. తన కూతురు సుస్మిత ఇండిపెండెంట్ అని, ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం అని కొండా సురేఖ మరోసారి తేల్చి చెప్పారు. తన కూతురు రాజకీయ జీవితం తన ఇష్టమన్నారు. ఆమె వ్యాఖ్యలను ఖండించటం కానీ సమర్థించటం కానీ చేయనని చెప్పారు.

నాకు వ్యతిరేకంగా పార్టీలోని కొంతమందితో బలవంతంగా మాట్లాడించారని కొండా సురేఖ ఆరోపించారు. అలా మాట్లాడించిన వారు ఎవరో కూడా తనకు తెలుసున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.

సైదాబాద్‌లో రూ.250కోట్ల భూమిపై ‘NOC’ రగడ!తెలంగాణSwechaa02 Sep 2026, 05:10 PM

సైదాబాద్‌లో రూ.250కోట్ల భూమిపై ‘NOC’ రగడ!

సైదాబాద్ మండలం సైదాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 139లోని సుమారు 13 ఎకరాల సర్పేఖాస్ భూమి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి గతంలో కలెక్టర్ హరిచందన NOC ఇవ్వలేదని చెబుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక హయాంలో NOCకు మార్గం సుగమమవుతోందనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి.

గత కలెక్టర్ హరిచందన ఈ భూమికి NOC ఇవ్వడానికి నిరాకరించినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిందని, ప్రస్తుత కలెక్టర్ ప్రియాంక హయాంలో NOC అంశం ముందుకు సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ హెచ్చరిక!..తెలంగాణSwechaa02 Sep 2026, 04:53 PM

మాంసం విక్రయాలపై జీహెచ్‌ఎంసీ హెచ్చరిక!..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాంసం ప్రియులకు జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 4వ తేదీన నగరవ్యాప్తంగా అన్ని మాంసం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు నగరంలోని రిటైల్ చికెన్, మటన్, బీఫ్ షాపులతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో గుర్తింపు పొందిన పశువధశాలలు సెప్టెంబర్ 4న బంద్ పాటించాలని స్పష్టం చేశారు.

విరిగిన బస్సు స్టీరింగ్.. బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!.. వీడియో వైరల్..తెలంగాణSwechaa02 Sep 2026, 03:51 PM

విరిగిన బస్సు స్టీరింగ్.. బావిలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!.. వీడియో వైరల్..

హుస్నాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.. బస్సు స్టీరింగ్ విరగడంతో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 11 మందికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.. ఇక స్థానికుల కథనం ప్రకారం.. హుస్నాబాద్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 2426 ఆర్టీసీ బస్సు హుస్నాబాద్ నుండి కరీంనగర్ కు 54 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తుంది. అయితే ఇటీవల హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పనులు చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ హరీష్ సుందరగిరి పరిధిలోని పెసరపల్లె దాటిన తర్వాత వచ్చిన మూలమలుపు వద్ద బస్సును టర్న్ చేస్తున్న క్రమంలో స్టీరింగ్ విరినట్టు సమాచారం.. దీంతో బస్సు అదుపుతప్పి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.

సీఎం రేవంత్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలుSwechaa02 Sep 2026, 03:48 PM

సీఎం రేవంత్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Konda Surekha: ఇప్పటికే కూతురి వ్యాఖ్యలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖ.. తగ్గేదేలేదు అంటున్నారు. ఈసారి ఏకంగా సీఎం రేవంత్ ను టార్గెట్ చేశారామె. ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు.

ఎవరిని అడిగి ముఖ్యమంత్రి రేవంత్ ఎమ్మెల్యే టికెట్లు ప్రకటిస్తున్నారు? అని కొండా సురేఖ నిలదీశారు. పదేళ్ల పాటు నేనే సీఎం అని రేవంత్ చెప్పుకోవడం వల్ల మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఇక, రాజీనామా చేయాలని తనతో ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదన్నారు. పార్టీ పెద్దల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. బీసీనైన నాకొక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా? అని సురేఖ ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు.

Raviteja: 200 కోట్ల క్లబ్‌లో "ఇరుముడి"..సినిమాSwechaa02 Sep 2026, 03:40 PM

Raviteja: 200 కోట్ల క్లబ్‌లో "ఇరుముడి"..

Raviteja: ఇరుముడి కాసుల వర్షానికి అసలు అడ్డే ఉండటం లేదు. వర్షాకాలంలో వర్షాలు పడాలి గానీ, ఇలా కాసుల వర్షం పడటం ఏంటో.. అని ఫిల్మ్ సర్కిల్స్‌లో రవితేజ ఇరుముడి సినిమా గురించి సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంత భారీ హిట్ సినిమా అయినా మొదటి వారం తర్వాత చిన్నగా కలెక్షన్స్‌లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ, రవితేజ ఇరుముడి సినిమా మాత్రం బుకింగ్స్‌లో అదే జోరు కొనసాగిస్తోంది. ఫలితంగా, ఇప్పుడు ఈ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరింది.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. రూ.8లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టారుSwechaa02 Sep 2026, 03:18 PM

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు.. రూ.8లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టారు

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు పదేళ్లు పడుతుందని అంటారా? అంటూ బీఆర్ఎస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి విధ్వంసం చేసింది బీఆర్ఎస్ అని ఆయన ఎదురుదాడికి దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందని.. రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసి మా నెత్తిన పెట్టిందని ధ్వజమెత్తారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నామని వివరించారు.

మూసీ రివర్ ఫ్రంట్ భూసేకరణలో సర్కారుకు హైకోర్టు షాక్!తెలంగాణSwechaa02 Sep 2026, 02:59 PM

మూసీ రివర్ ఫ్రంట్ భూసేకరణలో సర్కారుకు హైకోర్టు షాక్!

తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో తమ భూములు ఇవ్వబోమని బాధితులు ముందు నుంచి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భూ బాధితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా..దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు తెలిసింది. ఇదిలాఉండగా, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ పేరిట ప్రభుత్వం హిమాయత్‌సాగర్‌లోని భూములను సేకరించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే, తమ భూములు తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. డీపీఆర్ లేకుండా భూసేకరణ ఎలా చేస్తారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కె.వివేక్ రెడ్డి, కె.ప్రతీక్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిటిషనర్ల భూములని స్వాధీన పరుచుకోవొద్దని ప్రభుత్వాన్నిఆదేశించింది.

తెలంగాణ బీజేపీలో తగ్గని ఆధిపత్య పోరు!..తెలంగాణSwechaa02 Sep 2026, 02:54 PM

తెలంగాణ బీజేపీలో తగ్గని ఆధిపత్య పోరు!..

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి, పక్కా కేడర్‌ బలంతో దూసుకెళ్తూ.. కేంద్రంలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న పార్టీ బీజేపీ అని చెబుతారు.. కానీ పువ్వు గుర్తులో ఉన్న తెలంగాణ నేతల తీరు చూస్తుంటే మాత్రం.. సొంత ఇంటిని సరిదిద్దుకోలేక పొరుగువారిపై పోరు అన్నట్లు తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బిజెపి అగ్రనేతలు, ఎంపీలు అయిన బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.

కొండా సురేఖ విషయంలో అధిష్టానం యూటర్న్?తెలంగాణSwechaa02 Sep 2026, 02:29 PM

కొండా సురేఖ విషయంలో అధిష్టానం యూటర్న్?

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తోంది. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించే విషయంలో అధిష్టానం యూటర్న్? తీసుకున్నట్టు సమాచారం. కొండా సురేఖకు ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు, ఒక అగ్రనేత మద్దతు పలికినట్టు తెలుస్తోంది. ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకున్నా జాగ్రత్తగా వ్యవహరించాలని అధిష్టానాన్ని రాష్ట్ర కీలక నేతలు కోరినట్టు తెలిసింది. మంత్రి కొండా సురేఖపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మరో ఏఐసీసీ కార్యదర్శి అధిష్టానానికి సూచించినట్టు సమాచారం. ఆమెను కేబినెట్ నుంచి తొలగిస్తే తీవ్ర రాజకీయ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ముందస్తు హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆమె పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉందని, దానివల్ల ఉపఎన్నిక అనివార్యమై రాష్ట్రంలో పార్టీపై ప్రతికూల ప్రభావం పడుతుందని కీలక నేతలు అధిష్టానానికి సూచించినట్టు సమాచారం.

తిరుమలలో ఏసీబీ కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు!..ఏపీSwechaa02 Sep 2026, 02:10 PM

తిరుమలలో ఏసీబీ కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు!..

టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లోని ఆయన నివాసంలో నేటి ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నట్టు సమాచారం.. కాగా ఈ సోదాలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొత్తం ఏడు బృందాలు ఏకకాలంలో చేపట్టాయి.

లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమలలో లోకనాథంకు సంబంధించిన గెస్ట్‌హౌస్‌తో పాటు.. తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు.. ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలో సైతం సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.

జాబ్స్ నింపమంటే జేబులు నింపుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్ : కేటీఆర్తెలంగాణSwechaa02 Sep 2026, 01:40 PM

జాబ్స్ నింపమంటే జేబులు నింపుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్ : కేటీఆర్

ముఖ్యమంత్రి బంధువుల ఆసుపత్రుల్లోనే షెల్టర్లు తీసుకుంటారని, వేరే పార్టీల ఎంపీల కుమారులు కారుతో గుద్ది చంపినా.. కేసులు పెట్టకుండా పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. మంత్రుల కొడుకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కేసులు ఉండవని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కలెక్టర్లను బూతులు తిడితే కేసులు ఉండవని, స్వయంగా సీఎం హింసను ప్రేరేపించినా కేసులు పెట్టడం లేదని.. కానీ.. మాపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని, కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీనే గడగడ వణికిందన్నారు.మీ నాయకురాలు సోనియా గాంధీ తడబడి, తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

తెలంగాణ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. నలుగురు ఔట్?టాప్ న్యూస్Swechaa02 Sep 2026, 01:11 PM

తెలంగాణ కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. నలుగురు ఔట్?

రాష్ట్ర కేబినెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకాలం కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరగగా.. ఆశావహులు జోరుగా లాబీయింగ్ చేశారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, బీసీ సామాజికవర్గం, ఎస్సీ సామాజికవర్గం నుంచి కూడా పలువురు లైన్లో ఉన్నారు.వీరంతా తమకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసీసీ వద్ద జోరుగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధిష్టానం రాష్ట్ర కేబినెట్‌లో కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ అంశంపై చర్చిస్తున్న అధిష్టానం పెద్దలు.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల అనంతరం కేబినెట్‌లో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్తవారికి చోటు ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం.అలాగే మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

లేఆఫ్‌ల దెబ్బ..! 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు కట్InternationalSwechaa02 Sep 2026, 12:54 PM

లేఆఫ్‌ల దెబ్బ..! 8 నెలల్లోనే 1.23 లక్షల ఉద్యోగాలు కట్

గతేడాది ఏడాది మొత్తంలో 1,22,606 ఉద్యోగాల కోత.. 2026లో కేవలం 8 నెలల్లోనే ఆ సంఖ్యను దాటిన లేఆఫ్‌లు..! 289 కంపెనీలు ఏకంగా 1.23 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉద్యోగ మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చితికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.

తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!తెలంగాణSwechaa02 Sep 2026, 12:45 PM

తెలంగాణ పాలిటిక్స్‌కు మీనాక్షి గుడ్ బై..!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలంగాణకు వీడ్కోలు చెప్పనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ ఎన్నికలు ఉన్నందున ఆమె అక్కడకు వెళ్లేందుకు నిర్ణయించకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతల నుంచి మీనాక్షీ నటరాజన్‌ తప్పుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ‘ఎస్ఐఆర్’ ప్రక్రియ పూర్తయ్యాక తెలంగాణ నుంచి వెళ్తారని తెలుస్తోంది. ఆమెకు త్వరలోనే పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలపై మీనాక్షీ నటరాజన్‌ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తనకు రాజ్యసభ అవకాశం దక్కకుండా..కొందరు రాష్ట్ర నేతలు అడ్డుకున్నారన్న ఆమె తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు సమాచారం.

కొంపముంంచిన ‘క్లోరోక్విన్’.. పెరుగుతున్న బాధితులుఏపీSwechaa02 Sep 2026, 12:30 PM

కొంపముంంచిన ‘క్లోరోక్విన్’.. పెరుగుతున్న బాధితులు

ఏపీలో క్లోరోక్విన్ బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఆస్పత్రులు విద్యార్థులతో నిండిపోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 71మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. మాత్రల డోస్ ఎక్కువ కావడంతో ఇద్దరు విద్యార్థులు ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స జరుగుతోంది. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన ఏపీలో భారీ కుదుపును తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. ఇటీవల మలేరియా జ్వరంతో ఓ యువతి మృతి చెందగా ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విద్యార్థినులకు ‘క్లోరోక్విన్’ మాత్రలు పంపిణీ చేసినట్టు తెలిసింది. అవి వేసుకున్న కాసేపటికే వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఓ విద్యార్థిని మృతి చెందింది.అలాగే క్లోరోక్విన్ మాత్రలు వేసుకున్న మరికొందరు విద్యార్థినులు సైతం కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యారు.వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. తాజాగా పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోక్విన్ మాత్రలు వికటించి 71 మంది అస్వస్థతకు గురయ్యారు

Chiranjeevi Pawan Kalyan: సంకల్ప సాధకుడు "కళ్యాణ్ బాబు"సినిమాSwechaa02 Sep 2026, 12:13 PM

Chiranjeevi Pawan Kalyan: సంకల్ప సాధకుడు "కళ్యాణ్ బాబు"

Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ రోజు (సెప్టెంబర్ 2). ఈ సందర్భంగా ఆయన అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్ట్ అటు మెగా అభిమానులను, ఇటు సినీ లవర్స్, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

Tg Politics : అష్టదిగ్బంధనంటాప్ న్యూస్Swechaa02 Sep 2026, 11:43 AM

Tg Politics : అష్టదిగ్బంధనం

తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. కాంగ్రెస్‌కు సొంత ఇంటి గొడవలతో ఢిల్లీలో బిజీబిజీగా సీఎం మీటింగ్స్, పార్టీలో సమన్వయం, ఇతర పోస్టులతో నెలకు ఒక్కసారి ఆ వేడి గాలికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ గ్రౌండ్ లెవల్‌లో ఉద్యమాన్ని నిర్మించి ఫైట్ చేసేందుకు అస్త్రాలను సిద్దం చేసుకుంది.ఇప్పటివరకు ప్రతి నియోజక వర్గంలో ఉన్న ప్రజలను అసెంబ్లీ ముట్టడికి పార్టీలు సిద్ధం చేస్తున్నాయి.

రేవంత్  పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవితరాజకీయాలుSwechaa02 Sep 2026, 11:26 AM

రేవంత్ పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవిత

రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తాజాగా స్పందించారు. బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర పోస్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరి పొట్ట నింపింది గానీ, పేదల బతుకులను బాగు చేసింది గానీ లేదన్నారు. హైడ్రా (HYDRA) పేరిట పేదల ఇండ్లను కూల్చారని, సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, అన్నదాతల బలవన్మరణాలు, రోజురోజుకూ పెరిగిపోతున్న హత్యలు, నేరాలే రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన అసలైన ప్రగతి అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!వైరల్ న్యూస్Swechaa02 Sep 2026, 11:00 AM

అమెరికాలో పెరుగుతున్న తెలుగు వారి ఎఫైర్స్.. మహిళ వీడియో వైరల్!

అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైల వివాహేతర సంబంధాల గురించి ఓ మహిళ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వీడియో విడుదల చేసింది.అది కాస్త వైరల్ అవుతోంది. ఇండియాలో పద్ధతిగా ఉన్న కుటుంబ విలువలు అమెరికాకు వచ్చాక దిగజారిపోతున్నాయని,ముఖ్యంగా పెళ్లయిన మహిళలే అధికంగా పెళ్లికాని యువకులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారని సదరు వీడియోలో ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాలోని డల్లాస్‌లో తెలుగు కమ్యూనిటీ ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎన్నారైల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇండియా నుంచి వచ్చిన వారు ఉద్యోగాలు, చదువుల్లో రాణిస్తున్నప్పటికీ వారు అవలంభిస్తున్న కొన్ని విధానాలు మొత్తం తెలుగు కమ్యూనిటీకి చేటు చేసేలా ఉన్నాయని సదరు మహిళ వీడియోలో ప్రస్తావించింది.

Telangana: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై చతుర్ముఖ వ్యూహం.. కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?!తెలంగాణSwechaa02 Sep 2026, 10:31 AM

Telangana: కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై చతుర్ముఖ వ్యూహం.. కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌.. అధికార పార్టీపై పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అసెంబ్లీ వేదికగా, ప్రజా సమస్యలపై సాగించిన పోరాటాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కార్యాచరణను ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నేరుగా ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు ఏడు రోజుల కార్యాచరణను రూపొందించింది.

మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు మరో శుభవార్తతెలంగాణSwechaa02 Sep 2026, 10:02 AM

మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు మరో శుభవార్త

వివిధ కారణాల వలన మూడు నెలల రేషన్ అందుకోని సామాన్యులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ శుభవార్త చెప్పింది. రేషన్ పంపిణీ ప్రక్రియ గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు ప్రకటించింది. పేదలు, సామాన్యులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని తెలిపింది.ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వర్షాలు సమృద్ధిగా కురవలేదు. పంటలు కూడా సరిగా పండలేదని సమాచారం.నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేదలు ఇబ్బంది పడకూడదని ఒకేసారి మూడు నెలల కోటా కింద రేషన్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించిన విషయం తెలిసిందే.