స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఆకాశమే హద్దు.. రక్షణ రంగంలో మహిళల దూకుడు!NationalSwechaa02 Sep 2026, 09:40 AM

ఆకాశమే హద్దు.. రక్షణ రంగంలో మహిళల దూకుడు!

భారత వాయుసేనలో వైద్య విభాగానికి చెందని మహిళా అధికారుల్లో తొలిసారిగా ఎయిర్ వైస్ మార్షల్ హోదాను అందుకుని శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఒక ప్రమోషన్ కాదు.. భారత రక్షణ రంగంలో మహిళల ప్రయాణం ఎంత దూరం వచ్చిందో చెప్పే కీలక మైలురాయి.

రేవంత్ దోపిడీ.. వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలంతెలంగాణSwechaa02 Sep 2026, 09:40 AM

రేవంత్ దోపిడీ.. వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లాల్లో ఆ పార్టీ నేతలు వేడుకలు చేస్తున్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, సాధించిన ఘనతలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని జిల్లా డీసీసీ నేతలకు నిన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు పంపారు. అయితే, నిన్న రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనకు వ్యతిరేకంగా నగగరంలో పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. వెయ్యి రోజుల పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లో పోస్టర్లు అంటించడంతో నగరవాసులు జోరుగా చర్చించుకుంటున్నారు. ‘1000 డేస్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్’ అనే శీర్షికతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేసినట్టు సమాచారం.TGSMS’ పేరుతో పోస్టర్లు వెలిశాయి.సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ‘ఏఐ’ చిత్రాలను వ్యంగ్యంగా ముద్రించారు. ఓ వైపు నోట్ల కట్టలతో ఉన్న భారీ మూటను సీఎం మోసుకెళ్తుండగా.. మరోవైపు ప్రజలు, యువత ఆవేదనతో చేతులెత్తి సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు, ఆర్తనాదాలు చేస్తున్నట్టు ఆ చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి.

జీహెచ్‌ఎంసీలో బయటపడ్డ అవినీతి.. ప్రత్యేక ఆడిట్‌తో గుట్టు రట్టు!తెలంగాణSwechaa02 Sep 2026, 09:32 AM

జీహెచ్‌ఎంసీలో బయటపడ్డ అవినీతి.. ప్రత్యేక ఆడిట్‌తో గుట్టు రట్టు!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC)లో డబుల్‌ బిల్లింగ్‌ పేరుతో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందనే వార్తలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులతో పాటు.. డూప్లికేట్ బిల్లుల్లో అదనపు మొత్తాలు చెల్లించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో భాగంగా 102 మంది కాంట్రాక్టర్లకు సుమారుగా రూ.70 కోట్ల డబుల్ బిల్లులు చెల్లించినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఫారిన్‌లో నడిరోడ్డుపై దీపం పెట్టిన జంట.. బ్లాక్ మ్యాజిక్ చేశారంటూ!వైరల్ న్యూస్Swechaa02 Sep 2026, 09:17 AM

ఫారిన్‌లో నడిరోడ్డుపై దీపం పెట్టిన జంట.. బ్లాక్ మ్యాజిక్ చేశారంటూ!

ఇండియా నుంచి ఫారిన్ వెళ్లిన కొందరు ఇంకా ఇక్కడి సంప్రదాయాలను పాటించడం మర్చిపోలేదని తెలుస్తోంది. అయితే, వారు పాటించే సంప్రదాయాలు కొందరికి అనుమానంతో పాటు భయాన్ని కూడా కలిగిస్తోందని సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రత్యక్షం అవ్వగా అది కాస్త వైరల్ అవుతోంది.అందులో ఓ జంట నడిరోడ్డుపై దీపం పెట్టారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే, వారు ఏదో తాంత్రిక పూజలు చేస్తున్నారని అక్కడి వారు అనుమానించడం గమనార్హం. వివరాల్లోకివెళితే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ శివారు Knowsley Avenueలో.. ఆగస్టు 29న ఓ ఇండియన్ జంట ప్రధాన రహదారిపై దీపం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అవ్వగా.. ఆ ఫుటేజ్‌ను Wyndham TVకు గుర్జీత్ అనే స్థానికుడు అందించాడు.

శరీరంపై పులిపిరులు రావడానికి కారణం ఏంటి?HealthSwechaa02 Sep 2026, 08:35 AM

శరీరంపై పులిపిరులు రావడానికి కారణం ఏంటి?

శరీరంపై చిన్నగా, గట్టిగా కనిపించే పులిపిరులను చాలామంది సాధారణ చర్మ సమస్యగానే భావిస్తారు. కానీ హ్యూమన్ పాపిలోమా వైరస్.. అంటే HPV వల్ల ఇవి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మంపై చిన్నపాటి కోతలు, గీతలు లేదా రాపిడుల ద్వారా HPV వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. పులిపిరులు ఏర్పడే అవకాశం ఉంటుందని వెల్లడిస్తున్నారు..

అలాగే ఈ పులిపిరులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడమే కాకుండా.. మన శరీరంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కూడా వ్యాపించే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు.. అయితే అన్ని పులిపిరులు ఒకేలా ఉండవని నిపుణులు తెలియచేస్తున్నారు.. సాధారణంగా అవి ఐదు రకాలని చెబుతూ వాటి గురించి వివరిస్తున్నారు..

శ్రీకృష్ణ జన్మాష్టమి జరపడంలో ఉన్న అంతరార్థం ఏమిటి?..SpiritualitySwechaa02 Sep 2026, 08:21 AM

శ్రీకృష్ణ జన్మాష్టమి జరపడంలో ఉన్న అంతరార్థం ఏమిటి?..

శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది కేవలం కృష్ణుని పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు.. అది మానవ జీవితంలో అజ్ఞానమనే చీకటిని తొలగించి, ఆధ్యాత్మిక వెలుగును ప్రసరింపజేసే దివ్యమైన సంకేతంగా భావిస్తారు.. శ్రీమద్భగవద్గీతలోని నాల్గవ అధ్యాయంలో భగవంతుడు స్వయంగా ఇలా చెబుతాడు.. "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత్... పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని..

సమాజంలో అధర్మం పెరిగిపోయి, సజ్జనులకు రక్షణ లేనప్పుడు, ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించడానికి పరమాత్ముడే స్వయంగా మానవ రూపంలో అవతరిస్తాడు. ద్వాపర యుగంలో కంసుడు, జరాసంధుడు వంటి అసురుల అరాచకాలు పెరిగిపోయినప్పుడు, భూభారాన్ని తగ్గించి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని మన పురాణాలు చెబుతాయి..

నిజమైన భక్తికి అర్థం ఎవరు?..SpiritualitySwechaa02 Sep 2026, 08:11 AM

నిజమైన భక్తికి అర్థం ఎవరు?..

ఆ సర్వేశ్వరుడు ఈ అనంత విశ్వానికి, సమస్త జీవకోటికి నాధుడు.. అంతటి భగవంతుని మనసా స్మరిస్తూ, 'అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అని మనల్ని మనం ఆ పరమాత్మకు సంపూర్ణంగా అర్పించుకోవడమే నిజమైన భక్తి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పరాత్పరుని నామస్మరణలో ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా, తన్మయత్వం చెందడం భక్తికి పరాకాష్ఠగా సూచిస్తున్నారు..

సముద్రం ముంచుకొస్తోంది..! ముంబై, కోల్‌కతా మునిగిపోతాయా..?NationalSwechaa02 Sep 2026, 12:15 AM

సముద్రం ముంచుకొస్తోంది..! ముంబై, కోల్‌కతా మునిగిపోతాయా..?

సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.. తీరప్రాంత‌ నగరాలపై ముప్పు వేగంగా పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదం కాదు.. ఇప్పటికే మొదలైన సంక్షోభం అని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భారత్‌లోని ముంబై, కోల్‌కతా నగరాలతో పాటు దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాల్లో నివసిస్తున్న కోట్లాది మందికి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది.

2030 నుంచి JEE Advancedలో కొత్త విధానం..! కోచింగ్‌కు చెక్ పెట్టేలా అడాప్టివ్ టెస్టింగ్NationalSwechaa01 Sep 2026, 11:40 PM

2030 నుంచి JEE Advancedలో కొత్త విధానం..! కోచింగ్‌కు చెక్ పెట్టేలా అడాప్టివ్ టెస్టింగ్

ఇంజినీరింగ్ విద్యలో ప్రతిష్టాత్మకమైన JEE Advanced పరీక్ష విధానంలో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఒకే స్థాయి ప్రశ్నపత్రంతో విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసే విధానానికి బదులుగా.. అభ్యర్థి ప్రతిభకు అనుగుణంగా ప్రశ్నల కఠినత మారే అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకురావాలని IITలు ఆలోచిస్తున్నాయి.

నిప్పులాంటి నిజాలు, సత్యాలే వార్తలుగా ఎక్స్‌క్లూజివ్ కథనాలు.. స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్తెలంగాణSwechaa01 Sep 2026, 09:21 PM

నిప్పులాంటి నిజాలు, సత్యాలే వార్తలుగా ఎక్స్‌క్లూజివ్ కథనాలు.. స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్

స్వేచ్ఛ న్యూస్.. సత్యాలే వార్తలుగా మీ ముందుకు ఎక్స్‌క్లూజివ్ కథనాలు తెస్తోంది. నిప్పులాంటి నిజాలతో రోజుకో ప్రత్యేక కథనం ఇస్తోంది. మేఘా లూటీ కథనానికి హడలెత్తిన మేఘా కృష్ణారెడ్డి.. నోటీసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. 22 (A) పై యుద్దం మొదలెట్టిందే స్వేచ్చ న్యూస్. సమాఖ్యతో కలిసి బషీర్ బాగ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత రాజకీయ ఉద్యమం ఊపందుకుంది. ఏకంగా మంత్రి పొంగులేటి సారీ చెప్పాల్సి వచ్చింది.

ఇలా మేము మీ ముందు నిజాలు, సత్యాలే వార్తలుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ధైర్యమే పెట్టుబడిగా వార్తలు రాస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం.

స్వేచ్ఛ న్యూస్ ఆగస్టు రిపోర్ట్...

Kollywood: తెలుగు, తమిళ్‌లో సూర్య-నాగ్ మల్టీస్టారర్!సినిమాSwechaa01 Sep 2026, 09:05 PM

Kollywood: తెలుగు, తమిళ్‌లో సూర్య-నాగ్ మల్టీస్టారర్!

Kollywood: తెలుగు, తమిళ్‌లో సూర్య-నాగ్ మల్టీస్టారర్ రూపొందబోతుందా!..ప్రస్తుతం అవుననే మాట బలంగా వినిపిస్తోంది. మల్టీస్టారర్స్ చేయడానికి నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అలాగే, తమిళ స్టార్ హీరో సూర్య కూడా మల్టీస్టారర్ మూవీస్ అంటే ఆసక్తి ఎక్కువే. టాలీవుడ్ స్టార్, కోలీవుడ్ స్టార్ కలిసి రెండు భాషలలో మల్టీస్టారర్ అంటే ఆ క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు కింగ్ నాగార్జున, సూర్య కలిసి ఓ మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నారట.

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ కీలక చర్చలుతెలంగాణSwechaa01 Sep 2026, 08:48 PM

కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ కీలక చర్చలు

Cm Revanth: ఢిల్లీ పర్యటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. గంటకు పైగా వీరి సమావేశం జరిగింది. తెలంగాణలో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలపై వేణుగోపాల్ తో చర్చించారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో ప్రధానంగా మంత్రి కొండా సురేఖ వివాదంతో పాటు ఇతర రాజకీయ అంశాలపై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.

Nithya Menon: సమంత బాటలో నిత్యా..నిర్మాతగా న్యూ జర్నీసినిమాSwechaa01 Sep 2026, 08:07 PM

Nithya Menon: సమంత బాటలో నిత్యా..నిర్మాతగా న్యూ జర్నీ

Nithya Menon: నిత్యా మేనన్..ఈ పేరు చెప్తే గుర్తుకొచ్చేది కొన్ని సినిమాలే అయినా..అవి మాత్రం సూపర్ హిట్ చిత్రాలే. నిత్యా మేనన్‌ నటిగా మాత్రమే కాకుండా, గాయనిగానూ సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో నటించింది. అలాగే, వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. ఆన్ స్క్రీన్‌పై ఏ హీరోకి లిప్ లాక్ ఇవ్వకపోయినా..ఓ వెబ్ సిరీస్‌లో మాత్రం సహ నటితో లిప్ లాక్ ఇచ్చింది.

వెయ్యి రోజులు, వెయ్యి అక్రమాలు, వెయ్యి అబద్ధాలు..తెలంగాణSwechaa01 Sep 2026, 08:01 PM

వెయ్యి రోజులు, వెయ్యి అక్రమాలు, వెయ్యి అబద్ధాలు..

Telangana BJP: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ వెయ్యి రోజుల పాలనపై బీజేపీ చార్జ్‌షీట్ విడుదల చేసింది. వెయ్యి రోజులు, వెయ్యి అక్రమాలు, వెయ్యి అబద్దాల పేరుతో ఈ చార్జ్‌షీట్ ను రిలీజ్ చేశారు. తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు అయ్యిందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.

ఢిల్లీ వేదికగా హస్తం పంచాయితీ.. హైకమాండ్ ఏం తేల్చబోతోంది?..తెలంగాణSwechaa01 Sep 2026, 06:22 PM

ఢిల్లీ వేదికగా హస్తం పంచాయితీ.. హైకమాండ్ ఏం తేల్చబోతోంది?..

ఢిల్లీ వేదికగా జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు సెంట్రల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారాయి. గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు నేరుగా ఢిల్లీకి చేరడం ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తన నాసిక్ పర్యటనను సైతం అత్యవసరంగా రద్దు చేసుకుని హస్తినలో అందుబాటులోకి రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సమావేశంలో పాల్గొనడం చర్చంశనీయమైంది.

బీజేపీ ఆఫీసులపై దాడులు.. నితిన్ నబీన్ సీరియస్తెలంగాణSwechaa01 Sep 2026, 06:21 PM

బీజేపీ ఆఫీసులపై దాడులు.. నితిన్ నబీన్ సీరియస్

Nitin Nabin: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆఫీసులపై దాడులు, ఆ పార్టీ నేతల అరెస్టులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పందించారు. రేవంత్ సర్కార్ పై ఆయన సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. బీజేపీ నేతల అరెస్టులపై తాను రాంచందర్ రావుతో ఫోన్ లో మాట్లాడినట్లు నితిన్ నబీన్ వెల్లడించారు. కాంగ్రెస్ అరాచక ముఠాలు దాడులు చేసినప్పుడు మౌనంగా ఉండే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు.. బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ నాయకులు వస్తే మాత్రం అరెస్టులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగం గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పే నీతులు కేవలం నాటకమే అని విమర్శించారు. రేవంత్ సర్కార్ నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని నితిన్ నబీన్ హెచ్చరించారు.

Kayadu Lohar: మూడు సినిమాలతో అలరించబోతున్న గ్లామర్ బ్యూటీ!సినిమాSwechaa01 Sep 2026, 05:55 PM

Kayadu Lohar: మూడు సినిమాలతో అలరించబోతున్న గ్లామర్ బ్యూటీ!

Kayadu Lohar: కయాదు లోహర్ నటించిన మూడు సినిమాలు ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీకి అటు తమిళ్, ఇటు తెలుగు భాషలలో మంచి క్రేజ్ ఉంది. మంచి ఆఫర్స్ కూడా దక్కించుకుంటోంది. పర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా ఇటు ప్రేక్షకులను అటు ఫిల్మ్ మేకర్స్‌ను కయాదు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ గ్లామర్ బ్యూటీ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కాబోతుండటం విశేషం.

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ లో కీలక పరిణామం!..తెలంగాణSwechaa01 Sep 2026, 05:33 PM

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ లో కీలక పరిణామం!..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానాశ్రయానికి అనువైన ప్రాంతాల ఎంపిక కోసం కేంద్ర బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఈ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఉన్న అవకాశాలను కేంద్ర సాంకేతిక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుందని పేర్కొన్నారు..

కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు!..తెలంగాణSwechaa01 Sep 2026, 04:54 PM

కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు!..

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే ఎత్తివేస్తూ తీర్పు ఇవ్వడంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. స్టే కారణంగా నిలిచిపోయిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులను వక్రీకరించి ప్రతిపక్షాలు ప్రజలను గందరగోళ పరిచాయని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం పేద, బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, లబ్ధిదారులకు త్వరితగతిన సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.

షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..తెలంగాణSwechaa01 Sep 2026, 04:15 PM

షాదీ ముబారక్-కల్యాణ లక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!..

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్కింది. వీటిపై సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సీజే ధర్మాసనం రద్దు చేసింది. 2014 నుంచి ఇచ్చిన 8 జీవోలను సవాల్ చేస్తూ ఓ లాయర్ వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ హక్కులకు ఎలాంటి భంగం కలగలేదని, దీనిని పిల్ కింద చూడలేమని ఏజీ వాదించారు. ఇలాంటి ప్రభుత్వ విధానాలపై విచారణ సింగిల్ జడ్జి పరిధిలోకి రాదని చెప్పారు. ఏజీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఆ స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్Swechaa01 Sep 2026, 04:08 PM

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రంగనాథ్ ను తొలగించాలని సింగిల్ బెంచ్ ఆదేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. సింగిల్ బెంచ్ ఆర్డర్ ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3 కు వాయిదా వేసిన హైకోర్టు.

MYSAA: రష్మిక మందన్న మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్సినిమాSwechaa01 Sep 2026, 04:07 PM

MYSAA: రష్మిక మందన్న మూవీ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్

MYSAA: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ మూవీ మైసా. తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో, ఈ మూవీ విడుదల తేదీని కూడా కన్‌ఫర్మ్ చేశారు. ఇప్పటి వరకూ చేయని ఓ ఛాలెంజింగ్ రోల్‌లో రష్మిక నటిస్తోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో 2026 నవంబర్ 27న విడుదల కాబోతోంది.

కవిత నిర్వాకంతో కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారుతెలంగాణSwechaa01 Sep 2026, 03:46 PM

కవిత నిర్వాకంతో కేసీఆర్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు

Vemula Prashanth Reddy: టీఆర్ఎస్ చీఫ్ కవిత తన గురించి చేసిన విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తనపై కవిత చేసిన ఆరోపణలను వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. కష్టకాలంలో ఉన్న కేసీఆర్ ను వదిలేసి వెళ్లింది కవితే.. నేను కాదు అని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్ ప్రధాన అనుచరులను కవిత టార్గెట్ చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కవిత నిర్వాకంతో ఆమె తండ్రి కేసీఆర్ తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని ప్రశాంత్ రెడ్డి వాపోయారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై తాను పోరాటం చేస్తూనే ఉన్నానని తెలిపారు. తాను కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపానని కవిత చెప్పడం పూర్తిగా అవాస్తవం అన్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం, నిరాధారం అని చెప్పారు. కవిత కాంగ్రెస్ నేతలను రహస్యంగా కలిశారా? లేదా? వారితో సంప్రదింపులు జరిపారా? లేదా? అన్న విషయం చెప్పగలరా అని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఒకరి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!..క్రైమ్Swechaa01 Sep 2026, 03:43 PM

ఒకరి మృతికి కారణమైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!..

రాయదుర్గంలో హిట్‌ అండ్‌ రన్‌ ఘటన కలకలం రేపింది. ఓఆర్‌ఆర్‌ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న నందులాలను ఇన్నోవా కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో కారు ఢీకొట్టడంతో నందులాల మృతి చెందగా, విద్యార్థి జైద్‌షా కద్రీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ఆగకుండా వెళ్లిపోయిన కారు యజమాని ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి కుమారుడు సందీప్‌ అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి, కారును సీజ్‌ చేశారు..

రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితెలంగాణSwechaa01 Sep 2026, 02:50 PM

రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్న మూసారాం బ్రిడ్జి ప్రారంభోత్సవంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కేసీఆర్‌కు నాకు నందికి, పందికి ఉన్న తేడా ఉంది. గాడిదకు ఎంత రంగు పూసినా అది రేసుగుర్రం కాదు’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డిది పంది కంటే హీనమైన బతుకు. వెలిగొండ ప్రాజెక్టు గురించి, కృష్ణా జలాల దోపిడి గురించి మాట్లాడేందుకు ఎందుకు ఉచ్చ పడుతుంది రేవంత్ రెడ్డికి, మంత్రులకు? నీకు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరుకు ఇంత ద్రోహం చేస్తావా, మళ్లీ వలసల జిల్లాగా మారుస్తావా? తెలంగాణకు సమైక్య వాదుల కంటే ఎక్కువ ద్రోహం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంకా సిగ్గులేకుండా కేసీఆర్ గురించి ఎలా మాట్లాడుతున్నావు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ గతే కాంగ్రెస్‌కు పడుతుంది : బండి సంజయ్రాజకీయాలుSwechaa01 Sep 2026, 02:07 PM

కేసీఆర్ గతే కాంగ్రెస్‌కు పడుతుంది : బండి సంజయ్

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి గతంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావును హౌస్ అరెస్ట్‌పై చేయడంపై బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు, నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడులు చేసేవారిని కాపాడటమేనా? కాంగ్రెస్ చెబుతున్న 'ఇందిరమ్మ రాజ్యం'? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేసిన నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని నిలదీశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీకి బయలుదేరిన మంత్రి కొండాతెలంగాణSwechaa01 Sep 2026, 01:55 PM

ఢిల్లీకి బయలుదేరిన మంత్రి కొండా

రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెకు ఢిల్లీ నుంచి పిలుపురావడంతో హుటాహుటిన బయలుదేరివెళ్లారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, మంత్రి పదవి నుంచి తొలగించాలని క్రమశిక్షణా కమిటీ నివేదిక ఇవ్వడంతో ఆమె సీడబ్ల్యూసీ మెంబర్ కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోరినట్టు సమాచారం. అయితే, ఢిల్లీకి వచ్చి మాట్లాడాలని ఆయన చెప్పడంతో మంత్రి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టు తెలిసింది. కాగా, ఆమె విజ్ఞప్తిని అధిష్టానం ఆలకిస్తుందా? లేదా?? అనేది తెలియాల్సి ఉంది.

Chanakya strategy’s:  వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజల మూడ్ ఏంటి? జెన్-జీ షాకింగ్ తీర్పు!తెలంగాణSwechaa01 Sep 2026, 01:53 PM

Chanakya strategy’s: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. ప్రజల మూడ్ ఏంటి? జెన్-జీ షాకింగ్ తీర్పు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన రాజకీయ సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. రాష్ట్ర రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం, బీఆర్ఎస్, బీజేపీల ప్రభావం, ముఖ్యంగా జెన్-జీ(Gen Z), యువ ఓటర్ల రాజకీయ ఆలోచనలపై ఈ సర్వే కీలక సంకేతాలు ఇచ్చినట్లు చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. 2023అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రాఫ్ గణనీయంగా పెరిగిందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కేవలం ఒక శాతం ఓటు శాతం ఎక్కువగా సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ ఐదు శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది.

పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!క్రైమ్Swechaa01 Sep 2026, 01:28 PM

పటాన్ చెరులో బాలిక కిడ్నాప్..పేరెంట్స్‌పై దాడి!

హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను గుర్తు తెలియని దుండుగులు ఎత్తుకెళ్లారు. పటాన్‌చెరు పరిధిలోని పోచారం శివారులో గల సాయి దర్శన్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.నిందితుల కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకివెళితే.. సాయి దర్శన్ కాలనీలో 17 ఏళ్ల బాలిక స్థానికంగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నది. అక్కడే స్థానికంగా తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. అయితే, గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు నిన్న అర్ధరాత్రి బాలిక ఉంటున్న గుడిసెలోకి చొరబడినట్టు సమాచారం. అడ్డుకోబోయిన బాలిక తల్లిదండ్రులపై కర్రలు, బీర్ సీసాలతో దాడికి యత్నించినట్టు తెలిసింది.

మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!తెలంగాణSwechaa01 Sep 2026, 01:14 PM

మోసపోయానని మాధురి రాథోడ్ ఫిర్యాదు.. పరారీలో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!

 ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తాను మోసపోయానని బాధితురాలు మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పోలీసులకు అందుబాటులో లేకుండా పోవడంతో నిందితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.  కొన్ని రోజుల క్రితం ఒక హోటల్ గదిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.