స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులుఏపీSwechaa01 Sep 2026, 12:59 PM

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు

ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి అవినాశ్ అనే వ్యక్తి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు కృష్ణా జిల్లా కంకిపాడు వద్ద ఉన్నట్టు సమాచారం లభించింది. రాత్రి 11 గంటల సమయంలో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా...సీఐలు, కానిస్టేబుళ్లపై రాళ్లు, కత్తితో సదరు యువకుడు దాడికి యత్నించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో అవినాశ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని అక్కడి నుంచి క్షేమంగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, మిగతా వారిపైనా దాడికి అవినాశ్ ప్రయత్నించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. అతని కాళ్లపై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

TGRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!తెలంగాణSwechaa01 Sep 2026, 12:52 PM

TGRTC: తెలంగాణ ఆర్టీసీ కొత్త ప్రయోగం.. బస్సుల్లో మెట్రో తరహా ఏర్పాట్లు!

 తెలంగాణ ఆర్టీసీ(TGRTC) ప్రయాణికులకు అందించే సేవలను మరింత ఆధునీకరించడంతో పాటు, సంస్థకు అదనపు ఆదాయ మార్గాలను సమకూర్చుకోవడానికి ఒక నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కేవలం టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడకుండా నాన్-ఫేర్ రెవెన్యూ విధానంలో భాగంగా నగరంలోని ఎలక్ట్రిక్ బస్సుల్లో డిజిటల్ అడ్వర్టైజింగ్, ఇన్ఫోటైన్‌మెంట్ తెరలను అమర్చుతోంది. ఈ సరికొత్త డిజిటల్ వ్యవస్థ ఏర్పాటు కోసం ఆర్టీసీ 'రూట్‌వేవ్' అనే ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

Varanasi-Rajamouli: రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా?సినిమాSwechaa01 Sep 2026, 12:40 PM

Varanasi-Rajamouli: రాజమౌళి సినిమాకి డీల్ కుదరలేదా?

Varanasi: తాజాగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి మూవీకి ఆశించిన మొత్తం రావడం లేదట. డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ వారు వారణాసి సినిమాని అన్నీ భాషలకి కలిపి రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చారట. కానీ, దాన్ని రాజమౌళి తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. వీరు ఊహించినదాని కంటే నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ చాలా తక్కువ ఉందని జక్కన్న నో చెప్పాడని సమాచారం.

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యతెలంగాణSwechaa01 Sep 2026, 12:36 PM

చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

తనకు బెయిల్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదనే మనస్తాపంతో ఓ రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న జైలు అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని చంచల్ గూడ జైలులో వెలుగుచూసింది.కాగా, ఖైదీ మరణంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిపై సమీక్షిస్తున్నట్టు సమాచారం. వివరాల్లోకివెళితే.. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఘటనలో కంది సాగర్(31)ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌లో భాగంగా చంచల్ గూడ జైలుకు తరలించారు. తనకు బెయిల్ ఇప్పించాలని బాధితుడు తన భార్యను వేడుకున్నట్టు సమాచారం. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది జైలులోనే వాష్ రూమ్‌‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది.

పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!క్రీడలుSwechaa01 Sep 2026, 12:24 PM

పాక్ క్రికెట్‌ పతనానికి కారణం ఇదేనా..? మాజీ క్రికెటర్  సంచలన వ్యాఖ్యలు!

వరుస పరాజయాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ క్రికెట్ జట్టులో అంతర్గత వివాదాలు మరింత కలకలం రేపుతున్నాయి. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్, పేసర్ షాహీన్‌షా అఫ్రిది మధ్య నెలకొన్న కెప్టెన్సీ విభేదాలే పాక్ క్రికెట్ పతనానికి ప్రధాన మూలకారణమని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను పాకిస్థాన్ 0-2తో దారుణంగా కోల్పోయిన అనంతరం టీవీ షోలో మాట్లాడిన ఆయన, బాబర్ బలమైన కెప్టెన్ కాదని, ఆటగాళ్ల మధ్య గొడవలు ప్రారంభమైన రోజే పాక్ క్రికెట్ నాశనమైందని విమర్శించారు.

కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!తెలంగాణSwechaa01 Sep 2026, 12:21 PM

కళ్యాణలక్ష్మి,షాదీముుబారక్‌.. ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు, వాటి చట్టబద్ధత అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. మంగళవారం హైకోర్టులో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై కీలక విచారణ జరిగినట్టు సమాచారం. అటు పిటిషనర్, ఇటు ప్రభుత్వం తరఫు లాయర్ పోటాపోటీగా వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. ఈ పథకాలకు చట్టబద్ధత లేదని గతంలో పిటిషనర్ వాదించడంతో వాటి అమలుపై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ‘స్టే’ విధించడం వలన వేలాది మంది పేద లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు.

హైదరాబాద్ చుట్టూ రేవంత్‌ చక్కర్లు.. అసలు లెక్కేంటి?తెలంగాణSwechaa01 Sep 2026, 12:09 PM

హైదరాబాద్ చుట్టూ రేవంత్‌ చక్కర్లు.. అసలు లెక్కేంటి?

రేవంత్‌ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్‌పై ఇంత ఫోకస్ పెంచడానికి కేవలం అభివృద్ధే కారణమా? లేక ముందున్న గ్రేటర్‌ రాజకీయ సమరానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

యాపిల్‌లో ముగిసిన టిమ్‌ కుక్‌ శకం.. నూతన సారథిగా జాన్‌ టెర్నస్‌!వ్యాపారంSwechaa01 Sep 2026, 11:56 AM

యాపిల్‌లో ముగిసిన టిమ్‌ కుక్‌ శకం.. నూతన సారథిగా జాన్‌ టెర్నస్‌!

 ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) నాయకత్వంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. గడిచిన 15ఏళ్లుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO)గా కంపెనీని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లిన టిమ్‌కుక్‌ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి యాపిల్ నూతన సీఈఓగా జాన్‌ టెర్నస్‌ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. 2011 ఆగస్టులో దిగ్గజ నేత స్టీవ్ జాబ్స్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన టిమ్‌కుక్, ఇకపై యాపిల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

పాక్‌లో 125 ఏళ్లనాటి పురాతన ఆలయం కూల్చివేత.. తీవ్ర నిరసనలు!InternationalSwechaa01 Sep 2026, 11:33 AM

పాక్‌లో 125 ఏళ్లనాటి పురాతన ఆలయం కూల్చివేత.. తీవ్ర నిరసనలు!

 పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నరోవల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయం కూల్చివేతకు గురికావడం తీవ్ర వివాదానికి దారితీసింది. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చారిత్రక ఆలయాన్ని ఆగస్టు 21న నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) పార్టీకి చెందిన మత ఛాందసవాదులు ఉద్దేశపూర్వకంగానే కూల్చివేశారని హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

Malavika Mohanan: యంగ్ హీరోకి జోడీగా..మాళవికకి ఇది ఊహించని అవకాశం!సినిమాSwechaa01 Sep 2026, 11:28 AM

Malavika Mohanan: యంగ్ హీరోకి జోడీగా..మాళవికకి ఇది ఊహించని అవకాశం!

Malavika Mohanan: మాస్ మహారాజ్ రవితేజ-శ్రీవిష్ణు కలిసి చేస్తున్న సినిమాలో శ్రీవిష్ణు కి జంటగా మాళవిక మోహనన్ ఎంపికైందట. దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్ రవితేజ సరసన ఎంపికైనట్టుగా తెలుస్తోంది. హసిత్ గోలి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. 2027, సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, ది రాజాసాబ్ తర్వాత ఇక టాలీవుడ్ నుంచి అవకాశాలు రావనుకున్న మాళవికకి ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది నిజమే అయితే..గొప్ప అవకాశమే అనుకోవాలి.

జీడీపీ 7.8% వృద్ధి.. సామాన్యుడికి ఒరిగిందేమిటి?NationalSwechaa01 Sep 2026, 11:23 AM

జీడీపీ 7.8% వృద్ధి.. సామాన్యుడికి ఒరిగిందేమిటి?

జీడీపీ 7.8 శాతం పెరిగిందంటే ప్రతి భారతీయుడి జీతం కూడా 7.8 శాతం పెరిగిందని కాదు. ఇదే విషయాన్ని కేంద్రం ప్రజలకు మరింత స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్న సమయంలో.. ఒక సామాన్య కుటుంబం పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి అద్దె, కిరాణా, వైద్యం, ప్రయాణ ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తోంది.

Revenue22A: 22A ఉచ్చులో చొప్పదండి రైతులు..!తెలంగాణSwechaa01 Sep 2026, 11:16 AM

Revenue22A: 22A ఉచ్చులో చొప్పదండి రైతులు..!

 సమగ్ర భూ సర్వే లోపాలు, అధికారుల నిర్లక్ష్యం కలసి రాష్ట్రంలో మరో రెవెన్యూ సంక్షోభానికి దారితీస్తున్నాయి. శతాబ్దాలుగా సాగులో ఉన్న నిరుపేద రైతుల పట్టా భూములను యథేచ్ఛగా నిషేధిత జాబితా (22A) కింద నమోదు చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములకు సంబంధించిన హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో రైతులు తమ వ్యవసాయ భూములను అధికారులు అన్యాయంగా 22A (నిషేధిత జాబితా) కింద చేర్చారంటూ ఆందోళనకు దిగారు. సొంత భూములను రిజిస్ట్రేషన్ కాకుండా, దరిదాపుల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిషేధిత జాబితాలో చేర్చారంటూ వాపోయారు.

Ravi Teja-Vivek Athreya: మాస్ మహారాజ్ మరో ప్రయోగానికి సిద్ధంసినిమాSwechaa01 Sep 2026, 11:02 AM

Ravi Teja-Vivek Athreya: మాస్ మహారాజ్ మరో ప్రయోగానికి సిద్ధం

Ravi Teja: మాస్ మహారాజ్ కొత్త ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా కథాంశం హర్రర్ అండ్ కామెడీ ప్రధానంగా సాగుతుందట. రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెల్దీ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడు. ఈ సినిమాను అలాంటి జానర్‌లో ట్రై చేస్తున్నాడట. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన మరికొన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

విదేశాల్లో వివాహాలు, పర్యటనలకు వెళ్లకండి :  ప్రధాని మోడీNationalSwechaa01 Sep 2026, 10:58 AM

విదేశాల్లో వివాహాలు, పర్యటనలకు వెళ్లకండి : ప్రధాని మోడీ

భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ మరోసారి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలకు కీలక సందేశం పంపారు. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026-2027 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో దేశం 7.8 శాతం జీడీపీ వృద్ధిని న‌మోదు చేయ‌డంపై ప్ర‌ధాని సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ విజయం భార‌తీయుల సంకల్పం, కృషికి నిద‌ర్శ‌నమని పేర్కొన్నారు. ఈ ఘనత మ‌న స‌మిష్టి బ‌లాన్ని ప్ర‌తిబింబిస్తోంద‌ని వెల్లడించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్లిష్ట‌మైన ఆర్థిక సంక్షోభం ఉన్న‌ప్ప‌టికీ జీడీపీ పెరుగుద‌ల దేశ అభివృద్ధిని సూచిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. ప్ర‌జ‌లు స్వ‌దేశీ మంత్రంతో ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. విదేశాల్లో వివాహాలు చేసుకోవ‌ద్ద‌ని, విదేశీ పర్యటనలకు వెళ్లొద్ద‌ని సూచించారు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాంచందర్ రావు హౌస్ అరెస్టుతెలంగాణSwechaa01 Sep 2026, 10:43 AM

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. రాంచందర్ రావు హౌస్ అరెస్టు

రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పార్టీ నడుమ మాటల యుద్ధం నడుస్తోంది.అది కాస్త చేజారిపోయి పార్టీ ఆఫీసులు, నేతల ఇళ్ల మీద దాడుల వరకు వెళ్లింది.నిన్న నల్గొండ జిల్లాలో బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అదే విధంగా, నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు నిరసనలు తెలిపారు. అనంతరం ఆఫీసు మెయిన్ డోర్ మీద నల్ల ఇంకు చల్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ శ్రేణుల దాడులను నిరసిస్తూ బీజేపీ ఇవాళ నల్గొండ టూర్‌కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావును ముందస్తుగా హౌస్ అరెస్టు చేసినట్టు సమాచారం. తార్నాక‌లోని నివాసంలో రామచంద్ర రావును పోలీసులు గృహ‌ నిర్భందం చేశారు.

IT: ఐటీలో నియామకాల జోరు.. 1.5లక్షల ఉద్యోగాలు రెడీ!టాప్ న్యూస్Swechaa01 Sep 2026, 10:39 AM

IT: ఐటీలో నియామకాల జోరు.. 1.5లక్షల ఉద్యోగాలు రెడీ!

 భారత ఐటీ, టెక్నాలజీ ఉద్యోగ మార్కెట్‌లో దాదాపు మూడేళ్లుగా నెలకొన్న మందగమనం తొలగిపోయి నియామకాల ప్రక్రియ మళ్లీ పుంజుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో ప్రతిభ ఉన్న అభ్యర్థులకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఏఐ విస్తరణ వల్ల ఉద్యోగాలపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, భారత్‌లో మాత్రం టెక్ దిగ్గజాలు కొత్త రిక్రూట్‌మెంట్‌పై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ టెక్ విభాగాల్లో దాదాపు 1.50లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు!..NationalSwechaa01 Sep 2026, 10:29 AM

వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు!..

సెప్టెంబర్ నెల ప్రారంభం కాగానే వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం మరింత పెరగనుంది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్య ప్రజలకు పెద్ద ఊరట లభించింది.

Army : మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు ఏకే 47 తుపాకులు చోరీతెలంగాణSwechaa01 Sep 2026, 10:28 AM

Army : మద్రాస్ రెజిమెంట్‌లో నాలుగు ఏకే 47 తుపాకులు చోరీ

సికింద్రాబాద్‌ మద్రాసు ఆర్మీ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు చోరీ అయినట్టు తెలుస్తోంది. ఆర్మీ పరిసరాల్లోకి సామాన్య మానవుడు ఎవరూ ప్రవేశించలేరు. అందులో పనిచేసేవారికి అధికారులు, ఐడీ కార్డు కలిగిన వారికి మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుంది.సీసీ కెమెరాలతో పాటు భద్రతా సర్వేలెన్స్ కూడా నిత్యం గమనిస్తుంటుంది.అంతటి కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఆయుధాలు ఎలా మిస్ అయ్యాయి అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిలిగింది. రెజిమెంట్‌లోకి చొరబడ్డ దొంగలు 12 అత్యాధునికమైన ఆయుధాలను ఎత్తుకెళ్లినట్టు సమాచారం.దీనిపై అధికారులు బొల్లారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గది తాళాన్ని పగలగొట్టి 12 ఆయుధాలు ఎత్తుకెళ్లగా.. అందులో నాలుగు ఏకే 47, ఆరు పిస్టల్స్ ఉన్నట్టు సమాచారం.అంతేకాకుండా ఒక ఇన్సాస్ రైఫిల్‌తో పాటు పెద్ద మొత్తంలో మందుగుండును కూడా ఎత్తుకెళ్లినట్టు అధికారులు గుర్తించారు.

student :  పుస్తకం తీసుకురాలేదని.. విద్యార్థిని మృతిNationalSwechaa01 Sep 2026, 10:15 AM

student : పుస్తకం తీసుకురాలేదని.. విద్యార్థిని మృతి

బుక్ తీసుకుని రాలేదన్న కోపంతో పదేళ్ల విద్యార్థినిని క్లాస్ టీచర్ ఎండలో నిలబెట్టింది.అయితే, కాసేపటికే విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అనంతరం స్కూల్ యాజమాన్యం పేరెంట్స్‌కు సమాచారం అందించారు. దాంతో విద్యార్థిని తల్లి అంజలి వెంటనే హుటాహుటిన స్కూల్‌కు వెళ్లింది. వెళ్లేసరికి అక్కడ కూతురు ఎండలో నిలబడి ఉండటాన్ని గమనించింది.అప్పటికే ఆరోగ్యం క్షీణించడంతో కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. ఢిల్లీలోని వినోద్ నగర్‌లో గల సర్వోదయ కన్యా విద్యాలయంలో ఈ ఘటన గత నెల 27న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. పుస్తకం తీసుకెళ్లలేదని టీచర్ ఎండలో నిలబెట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని బాధిత పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఐరాస హెచ్చరిక.. దక్షిణాసియాకు భారీ ముప్పు..!InternationalSwechaa01 Sep 2026, 10:13 AM

ఐరాస హెచ్చరిక.. దక్షిణాసియాకు భారీ ముప్పు..!

 గ్లోబల్‌ వార్మింగ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు తీవ్ర వేగంతో పెరుగుతున్నాయని, దీనివల్ల భారతదేశంలోని కోల్‌కతా, ముంబై వంటి తీరప్రాంత మహా నగరాలకు భారీ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి (యూఎన్) తీవ్రంగా హెచ్చరించింది. భూగోళ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం వల్ల హిమనదాలు, మంచు పలకలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనికితోడు సముద్ర నీటి ఉష్ణోగ్రతలు కూడా పెరగడంతో సముద్ర మట్టాలు మరింత పైకి వస్తున్నాయి.

Tollywood - KVN: ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడాలంటే కాకా హిట్ అయితేనే సాధ్యం!సినిమాSwechaa01 Sep 2026, 10:01 AM

Tollywood - KVN: ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడాలంటే కాకా హిట్ అయితేనే సాధ్యం!

Tollywood: ఒక భారీ బడ్జెట్ సినిమా చాలు..ఒక అగ్ర నిర్మాణ సంస్థ మరో నాలుగు సినిమాలు ప్రకటించాలన్నా, పాతాళంలోకి కూరుకుపోవాలన్నా. ప్రస్తుతం కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఇప్పుడు చిరంజీవి మాత్రమే వీరిని గట్టెక్కించేలా కనిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న కాకా హిట్ అయితేనే ‘కేవిఎన్ ప్రోడక్షన్స్’ నిలబడుతుంది.

గుంపు మేస్త్రీ.. చేతలు సున్నా!! మాటలు మిన్న!!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa01 Sep 2026, 09:38 AM

గుంపు మేస్త్రీ.. చేతలు సున్నా!! మాటలు మిన్న!!

సవాళ్లతోనే ప్రజలను మభ్యపెడుతూ సీఎం అయిన రేవంత్ రెడ్డి, అధికారంలో వచ్చి 1,000 రోజులు అయినా మేస్త్రీ మాటలతోనే కోటలు కడుతున్నారు. నిత్యం ఏదో ఒక డైవర్ట్ ఇష్యూని వెతుక్కుని రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిగా మీకు ప్రజలు సర్వ అధికారాలు కట్టబెట్టారు. గత 8 ఏండ్లుగా చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు. పైగా అధికారం అడ్డుపెట్టుకుని కాంప్రమైజింగ్‌తో వేల కోట్లు సంపాదించారని ఆరోపణ. రాష్ట్రంలోని ఎన్నో భూములను మీ గ్యాంగ్ దోపిడీ చేస్తోందని స్వేచ్ఛ న్యూస్ వార్తలు ఇచ్చింది. అదే నిజం. సగం పాలన కంటే ఎక్కువ పూర్తి కాగానే వెయ్యి రోజుల అర్భాటంతో పాటు మీరు చేసిన భూ దందాలు కూడా చెబితే బాగుంటుంది.

కూతురి చదువు కోసం ఓ తల్లి సాహసం.. చెప్పులు చేతబట్టుకుని!వైరల్ న్యూస్Swechaa01 Sep 2026, 09:38 AM

కూతురి చదువు కోసం ఓ తల్లి సాహసం.. చెప్పులు చేతబట్టుకుని!

పిల్లల సంతోషం, భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. ఒక పూట తిన్నా తినకున్నా వారికి మాత్రం కడుపునిండా భోజనం పెట్టాలని ఆలోచన చేస్తుంటారు.ఇలాంటి పేరెంట్స్ ఉండటం వల్లే కటికపేదరికంలో జన్మించినా కొందరు తమ ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతున్నారు. ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. పిల్లలు ప్రగతి బాటలో నడిచారంటే దాని వెనుక పేరెంట్స్ కృషి ఎంతో ఉంటుంది.తాజాగా ఉదాహరణ ఇందుకు అద్దం పడుతుంది.కూతురి చదువుకోసం ఓ తల్లి పెద్ద సాహసమే చేసింది. ఆరోగ్యం సహకరించకున్నా తనను తాను మర్చిపోయి పరుగు పందెంలో పాల్గొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలో మీటర్లు ఆగకుండా పరుగు పూర్తి చేసింది. వివరాల్లోకివెళితే.. కూతురి చదువు కోసం చెప్పులు లేకుండా మారథాన్ ఓ తల్లి మారథన్ గెలిచింది.

అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబైలో ఆస్పత్రికి తరలింపు!NationalSwechaa01 Sep 2026, 09:33 AM

అన్నాహజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబైలో ఆస్పత్రికి తరలింపు!

 దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాల ద్వారా చెరగని ముద్ర వేసిన ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మభూషణ్ అన్నా హజారే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 87ఏళ్ల వయస్సున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బాంబే ఆస్పత్రిలోని ఐసీయూ (ICU) విభాగంలో చేర్పించారు. తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం నిపుణులైన వైద్య బృందం నిరంతర పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తోంది.

'ఎల్‌నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్‌లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!InternationalSwechaa01 Sep 2026, 09:12 AM

'ఎల్‌నినో' ఎఫెక్ట్.. సెప్టెంబర్‌లో సాగు, తాగునీటికి తప్పని ముప్పు!

 దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ నెలలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా సెప్టెంబర్‌లో 167.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈసారి దీర్ఘకాలిక సగటులో 91శాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు, దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరిగి ఎండ తీవ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

'యుద్ధం కాదు.. శాంతే మార్గం' పుతిన్ ముందే మోదీ శాంతి మంత్రం!InternationalSwechaa01 Sep 2026, 09:06 AM

'యుద్ధం కాదు.. శాంతే మార్గం' పుతిన్ ముందే మోదీ శాంతి మంత్రం!

బిష్కెక్‌ వేదికగా జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందే ప్రధాని నరేంద్ర మోదీ శాంతి మంత్రాన్ని జపించారు. "ముగింపు లేని యుద్ధాల నుంచి.. యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడాలి" అని పిలుపునిచ్చారు. గాంధీ, బుద్ధుడు నడిచిన నేతగా భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, శాంతి స్థాపనకు జరిగే ప్రతి ప్రయత్నానికి భారత్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌.. విరాళాల పేరుతో ఆన్‌లైన్ దోపిడీ!..InternationalSwechaa01 Sep 2026, 09:02 AM

సైబర్‌ నేరగాళ్ల కొత్త స్కెచ్‌.. విరాళాల పేరుతో ఆన్‌లైన్ దోపిడీ!..

నేపాల్ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతల మానవత్వాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు, ఫేక్ క్యూఆర్ కోడ్‌లు సృష్టించి వరద బాధితులకు సాయం చేయండి.. అంటూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. ఆగస్టు 26న నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.. ఈ విపత్తులో చిక్కుకున్న బాధితులను ఆదుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే సమయాన్ని సైబర్ ముఠాలు తమకు అనుకూలంగా మలుచుకుని దాతల నుంచి డబ్బులు కాజేసేందుకు సరికొత్త వ్యూహాలకు తెరతీసినట్టు అధికారులు గుర్తించారు.. ఈ క్రమంలో వరద బాధితుల సాయం పేరుతో ఫేస్‌బుక్, వాట్సాప్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, వైబర్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి వరద బాధితుల సహాయం పేర్లతో నకిలీ పేజీలు, గ్రూపులు సృష్టించారు.

సబ్సిడీ నిధులు గోల్‌మాల్.. కలెక్టర్ నివేదికతో కదిలిన ఫైల్!తెలంగాణSwechaa01 Sep 2026, 08:23 AM

సబ్సిడీ నిధులు గోల్‌మాల్.. కలెక్టర్ నివేదికతో కదిలిన ఫైల్!

వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ శాఖలో వేరుశనగ విత్తనాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది! విత్తన సబ్సిడీ నగదు జమలో అక్రమాల ఆరోపణలతో దౌల్తాబాద్ ఎంఏఓ లావణ్యను సస్పెండ్ చేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇదే వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ కాగా, ఉన్నతాధికారుల పాత్రపై విచారణ వేగవంతమైంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది!

కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అంటారు.. ఎందుకు?SpiritualitySwechaa01 Sep 2026, 07:57 AM

కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది అంటారు.. ఎందుకు?

కాలం కూడా మోకరిల్లే పవిత్ర క్షేత్రం కాశీ.. కాశ్యాం తు మరణాన్ముక్తిః అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని మన సనాతన ధర్మం, వేద శాస్త్రాలు తెలియచేస్తున్నాయి.. శాస్త్రాల ప్రకారం, కాశీ కేవలం భూమి మీద ఉన్న నగరం కాదు. ఇది పరమశివుని త్రిశూలం యొక్క కొనపై నిలిచి ఉన్న దివ్య క్షేత్రం. కాశీ మహాక్షేత్రంలో ఒక జీవి తన చివరి శ్వాస విడిచే సమయంలో, స్వయంగా ఆ కాశీ విశ్వనాథుడే అక్కడ ప్రత్యక్షమవుతాడు. మరణించే జీవి కుడిచెవిలో సాక్షాత్తు పరమశివుడే "తారక మంత్రాన్ని" ఉపదేశిస్తాడు.. ఆ క్షణంలో, జన్మజన్మల నుండి ఆ జీవి వెంట వస్తున్న పాపపుణ్యాల సంకెళ్లు, కర్మబంధాలన్నీ ఒక్కసారిగా భస్మమైపోయి.. జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి, ఆ ఆత్మ సాక్షాత్తు పరమశివుని సాన్నిధ్యాన్ని లేదా సాయుజ్య ముక్తిని పొందుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం..

తథాస్తు దేవతలు అంటే ఎవరూ?.. వారికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి?..SpiritualitySwechaa01 Sep 2026, 07:51 AM

తథాస్తు దేవతలు అంటే ఎవరూ?.. వారికి ఆ పేరు రావడానికి కారణం ఏంటి?..

తథాస్తు దేవతలను అశ్విని దేవతలు అని పిలుస్తారు. సూర్య భగవానుడు, సంధ్యాదేవి అశ్వ రూపంలో ఉన్నప్పుడు జన్మించిన నాసత్యుడు, దశ్రుడు అనే కవలలే ఈ అశ్విని దేవతలు. వీరు అత్యంత సౌందర్యవంతులు మాత్రమే కాదు, దేవతలకు వైద్యులుగా సేవలు అందించే మహా ప్రావీణ్యులు. వృద్ధుడైన చ్యావన మహర్షికి తిరిగి యవ్వనాన్ని, చూపును ప్రసాదించింది వీరే అని మన ప్రాచీన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలలో వివరంగా పేర్కొనబడింది..