స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!InternationalSwechaa01 Sep 2026, 12:19 AM

అమెరికాలో భారతీయులకు మరో షాక్.. H-4 వర్క్ పర్మిట్లపై ట్రంప్ గురి!

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలాది మంది భారతీయ H-1B ఉద్యోగులకు మరో ఆందోళన మొదలైంది. భర్త H-1B వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే.. భార్య H-4 వీసాతో అక్కడే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం చాలామంది భారతీయ కుటుంబాలకు కీలకంగా మారింది. ఇప్పుడు అదే అవకాశాన్ని తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టుక్రీడలుSwechaa31 Aug 2026, 11:48 PM

మెస్సీ రిటైర్మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ పోస్టు

Cm Revanth: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు. దాంతోపాటు మెస్సీతో తాను కలుసున్న అరుదైన ఫొటోను షేర్ శారు రేవంత్ రెడ్డి.

ప్రియమైన మెస్సీ అంటూ తన సందేశాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీరు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఎంతగానో ఉత్తేజపరిచారు, మీ అద్భుతమైన ఆటతీరుతో మమ్మల్ని అలరించారు అని మెస్సీని ప్రశంసించారు. మీరు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కితాబిచ్చారు. హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ లో మీతో కాసేపు గడిపిన క్షణాలను గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని రేవంత్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మెస్సీ లేని ఫుట్‌బాల్ మునుపటిలా ఉండదని కాస్త ఎమోషనల్ అయ్యారు. మీకు ఇదే మా వీడ్కోలు, మీ స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి" అని తన పోస్టులో ఆకాంక్షించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బైక్రీడలుSwechaa31 Aug 2026, 11:40 PM

ఫుట్‌బాల్‌లో ఓ యుగం ముగిసింది! అంతర్జాతీయ ఆటకు మెస్సీ గుడ్‌బై

మెస్సీ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ కాదు. అతను ఫుట్‌బాల్‌లో ఒక అనుభూతి. ఒక జ్ఞాపకం. ఒక తరం గుండెల్లో నిలిచిపోయిన పేరు. అతను అర్జెంటీనా జెర్సీకి గుడ్‌బై చెప్పాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు తెరదించాడు. కానీ ఫుట్‌బాల్ అభిమానుల హృదయాల్లో మాత్రం మెస్సీకి రిటైర్మెంట్ ఉండదు.

రైల్వే హబ్‌గా గద్వాల జిల్లాతెలంగాణSwechaa31 Aug 2026, 11:29 PM

రైల్వే హబ్‌గా గద్వాల జిల్లా

Gadwal: అమృత్ భారత్ పథకం ద్వారా మంజూరైన రూ.42.82 కోట్ల నిధులతో గద్వాల రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం గద్వాల రైల్వే స్టేషన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో కలిసి కేంద్రమంత్రి పరిశీలించారు.

Tamannaah: రెమ్యునరేషన్‌తో హడలెత్తిస్తున్న మిల్కీ బ్యుటీ..ఐటం సాంగ్స్ కూడా పాయే!సినిమాSwechaa31 Aug 2026, 11:08 PM

Tamannaah: రెమ్యునరేషన్‌తో హడలెత్తిస్తున్న మిల్కీ బ్యుటీ..ఐటం సాంగ్స్ కూడా పాయే!

Tamannaah Bhatia: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇంకా క్రేజ్ ఉందనే చెప్పాలి. లేదంటే హీరోయిన్‌గా టాలీవుడ్, కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోయినా బడా హీరోల పక్కన ఐటం సాంగ్స్ మాత్రం చేస్తూ వేడి పుట్టిస్తోంది. అయితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో తాజాగా వినిపిస్తున్నదాని ప్రకారం తమన్నా ఐటం సాంగ్ కోసం భారీగా డిమాండ్ చేయడం వల్ల ఆ అవకాశాలు కూడా చేజారిపోతున్నాయట.

Rashmika - Ranabaali: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..సినిమాSwechaa31 Aug 2026, 10:11 PM

Rashmika - Ranabaali: రణబాలి సెట్స్‌లోకి రష్మిక రీ ఎంట్రీ..

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కాబోతోంది. తాజాగా, దీనికి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్వయంగా, రష్మిక తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. మైసా సినిమా షూటింగ్ సమయంలో రష్మిక నడుముకు గాయం అయిన కారణంగా గత కొన్ని వారాలుగా రెస్ట్ తీసుకుంటోంది. ఈ అక్టోబర్ నుంచి మళ్ళీ కెమెరా ముందుకు రాబోతోంది.

Cm Revanth: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలితెలంగాణSwechaa31 Aug 2026, 09:31 PM

Cm Revanth: కేసీఆర్ ఖర్చు రూ.22కోట్లు.. వెంటనే రాజీనామా చేయాలి

Cm Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి చెలరేగిపోయారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు విఫలం అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల పాలనలో కేసీఆర్ రూ.1.24 కోట్ల జీతం తీసుకున్నారని తెలిపారు. ఇక కేసీఆర్ సెక్యూరిటీ, ఇల్లు, కాపలా, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం ప్రభుత్వం 21 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ వెల్లడించారు. జీతం తీసుకుని ఉద్యోగానికి రాకపోతే ఏం చేయాలి? అని సీఎం రేవంత్ నిలదీశారు. మొత్తంగా 22 కోట్ల 24 లక్షల 40వేల రూపాయల ప్రభుత్వ సొమ్మును కేసీఆర్ మెక్కారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.

హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలనుతెలంగాణSwechaa31 Aug 2026, 09:10 PM

హరీశ్ రావునైనా క్షమిస్తా.. ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదలను

Kavitha: బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి టార్గెట్ గా చెలరేగిపోయారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. తండ్రిని, బిడ్డను విడదీయడంలో ప్రశాంత్ రెడ్డిది ప్రధాన పాత్ర అని కవిత ఆరోపించారు. పెద్ద కొడుకులా భావించి ఆయనకి కేసీఆర్ తిండి పెడితే తండ్రిని, బిడ్డని విడదీసి శకునిలా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. జీవితంలో హరీశ్ రావునైనా క్షమిస్తాను కానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం వదిలేది లేదన్నారు కవిత. నా ఉసురు తగులుతుంది అంటూ శాపనార్ధాలు పెట్టారు కవిత. నిజామాబాద్ జిల్లా పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!సినిమాSwechaa31 Aug 2026, 08:52 PM

Jailer-2 : అప్‌డేట్స్ లేవు..రూమర్స్ కి ఛాన్స్ ఇచ్చిన మేకర్స్!

Jailer-2 : ఇండియా, అమెరికా మాత్రమే కాకుండా చైనా, జపాన్ లాంటి అగ్ర దేశాలలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. పాన్ ఇండియన్ సిదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ లో రజినీని చూపించిన విధానానికి ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అందుకే, పార్ట్ 2 మీద ఆసక్తి రెట్టింపైంది. జైలర్ 2లో ఎస్.జె.సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, విధ్యబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్ణ స్పెషల్ నంబర్ లో కనిపిస్తోంది. ఇవన్నీ సినిమాకి ప్రధాన బలంగా మారనున్నాయి. వాస్తవానికి ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత దసరా బరిలో అక్టోబర్ 15న దింపాలనుకున్నారు. కానీ, మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!సినిమాSwechaa31 Aug 2026, 08:24 PM

NTR-NEEL: అక్టోబర్ నుంచి డ్రాగన్ సెట్స్‌లో తారక్!

NTR-NEEL: టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో డ్రాగన్ ఒకటి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్.టి.ఆర్. హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్స్‌లో ఎన్.టి.ఆర్. భుజానికి గాయం అవడంతో అప్పటి నుంచి షూటింగ్‌కి బ్రేక్ పడింది. తాజా సమాచారం మేరకు మళ్ళీ ఎన్.టి.ఆర్. అక్టోబర్ మొదటి వారం నుంచి సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట.

పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగోతెలంగాణSwechaa31 Aug 2026, 08:15 PM

పదేళ్ల తర్వాత.. GHMCకి కొత్త లోగో

GHMC New Logo: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కి కొత్త లోగో వచ్చింది. ఈ కొత్త లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దాదాపు పదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీకి నూతన లోగో వచ్చింది. అలాగే జీహెచ్ఎంసీ నుంచి వేరుపడిన మ‌ల్కాజ్ గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (ఎంఎంసీ), సైబ‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్ (సీఎంసీ) నూత‌న లోగోల‌ను కూడా సీఎం రేవంత్ లాంచ్ చేశారు. న్యూ ఐడెంటిటీ, న్యూ డెస్టినీ, న్యూ లోగో అని అధికారులు అభివర్ణించారు.

Balakrishna NBK 111: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్సినిమాSwechaa31 Aug 2026, 07:39 PM

Balakrishna NBK 111: సెప్టెంబర్ 6న రెండు సర్‌ప్రైజెస్

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా నుంచి సెప్టెంబర్ 6వ తేదీన డబుల్ ట్రీట్ ఉండబోతుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇటీవలే మళ్ళీ బాలయ్య షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. శరవేగంగా ఆయనపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. బాలయ్య మళ్ళీ షూటింగ్‌లో జాయిన్ కావడంతో అందరిలోనూ జోష్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న టైటిల్ అండ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నట్టుగా సమాచారం.

మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' ఉద్రిక్తం..తెలంగాణSwechaa31 Aug 2026, 07:00 PM

మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' ఉద్రిక్తం..

Mala Mahanadu: మాలల ''ఛలో సెక్రటేరియట్‌'' తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోస్టర్ విధానాన్ని సవరించాలని.. జీవో 99 వల్ల రాష్ట్రంలో మాలలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని.. తక్షణమే దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ తో ఛలో సెక్రటేరియట్ కు మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఇచ్చిన పిలుపుతో భారీగా మాలలు తరలివచ్చారు. పోలీసుల నిర్భందాలను ఛేదించుకుని వచ్చి మరీ సెక్రటేరియట్ ను ముట్టడించారు.

Kavya-Kala Bhairava: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!సినిమాSwechaa31 Aug 2026, 06:42 PM

Kavya-Kala Bhairava: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!

Tollywood: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన ఎం.ఎం.కీరవాణి తనయుడు కాల భైరవ, యువ నటి కావ్య కళ్యాణ్‌రామ్ ప్రేమలో ఉన్నట్టుగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలిపారు. కాల భైరవ-కావ్య కళ్యాణ్‌రామ్ ల ప్రేమ విషయం తెలిసి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్ళి వార్త ఎప్పుడు..ఏడేట్..ప్లేస్ ఎక్కడా అనే చర్చ మొదలైంది. కాల భైరవ సంగీత దర్శకుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' సాంగ్ పాడాడు. ఈ పాటకి ఆస్కార్ వచ్చింది. ఇందులోనే 'కొమరం భీముడో' సాంగ్ పాడాడు. 'బాహుబలి 2'లో 'దండాలయ్య', 'అరవింద సమేత'లో 'పెనివిటి' సాంగ్ పాడాడు. కాల భైరవ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మనసంతా నువ్వే సినిమాతో కావ్య కళ్యాణ్‌రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ఇక, పెద్దయ్యాక బలగం సినిమాతో హీరోయిన్‌గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.

సీఎం రేవంత్‌కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదుతెలంగాణSwechaa31 Aug 2026, 06:18 PM

సీఎం రేవంత్‌కు హోంశాఖ నిర్వహించే హక్కు లేదు

Harish Rao: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నర్సు హత్య కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. నర్సుపై లైంగిక దాడికి యత్నించిగా.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అత్యాచారం కూడా చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో బిహార్ కు చెందిన మహమ్మద్ సనావుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యాచార ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. మహిళల భద్రతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Trisha Krshnan: టాలీవుడ్ కంబ్యాక్ మూవీపై ఆశలు..అసలు రిలీజవుతుందా?సినిమాSwechaa31 Aug 2026, 05:33 PM

Trisha Krshnan: టాలీవుడ్ కంబ్యాక్ మూవీపై ఆశలు..అసలు రిలీజవుతుందా?

Trisha Krshnan: మెగాస్టార్‌తో చేస్తున్న విశ్వంభరతో హిట్ కొట్టాలనుకుంది. కానీ, త్రిష భావిస్తున్న హిట్ దక్కుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. టాలీవుడ్‌లో దాదాపు అందరి సరసన నటించిన త్రిష భారీ హిట్సే అందుకుంది. ఒకదశలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంది. డేట్స్ సర్దుబాటు కూడా చేయలేనంత బిజీగా గడిపింది. మళ్ళీ, అలాంటి జోరు చూపించాలని కలలు కంటున్న త్రిష నిజమవుతాయో లేదో విశ్వంభర రిలీజయ్యాకే తెలుస్తుంది.

కృష్ణా జలాలు.. తెలంగాణకు సీఎం రేవంత్ తీరని ద్రోహంతెలంగాణSwechaa31 Aug 2026, 05:24 PM

కృష్ణా జలాలు.. తెలంగాణకు సీఎం రేవంత్ తీరని ద్రోహం

Harish Rao: కృష్ణా జలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై ఎక్స్ లో విరుచుకుపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా సీఎం రేవంత్ మౌనం వీడటం లేదని హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణకు సీఎం రేవంత్ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి రైతులకు కాంగ్రెస్ సర్కార్ ద్రోహం చేస్తోందన్నారు. కృష్ణా జలాలను ఏపీ తరలిస్తున్నా కేఆర్ఎంబీ ప్రేక్షకపాత్ర వహిస్తోందని వాపోయారు. కృష్ణా జలాల విషయంలో తక్షణమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో కలకలం.. కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటోతెలంగాణSwechaa31 Aug 2026, 04:06 PM

కాంగ్రెస్‌లో కలకలం.. కనిపించని కొండా సురేఖ పేరు, ఫొటో

Konda Surekha: కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖపై వేటు ఖాయమనే ప్రచారం జోరుగా నడుస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీల్లో కొండా సురేఖ ఫొటో కనిపించలేదు. అంతేకాదు శిలాఫలకాల్లోనూ మంత్రి పేరుని అధికారులు చేర్చలేదు. దీంతో అనుమానాలు పెరిగాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, శిలాఫలకాల్లో కొండా సురేఖ ఫొటో కానీ పేరు కానీ లేకపోవడం దేనికి సంకేతం అనే డిస్కషన్ జరుగుతోంది.

పదేళ్లలో ఊహించని ఫలితాలు.. 2030 నాటికి భారత్‌లో ఆ వ్యాధి ఉండదు!NationalSwechaa31 Aug 2026, 03:32 PM

పదేళ్లలో ఊహించని ఫలితాలు.. 2030 నాటికి భారత్‌లో ఆ వ్యాధి ఉండదు!

మలేరియా మహమ్మారిపై సాగిస్తున్న పోరాటంలో భారతదేశం అత్యంత గణనీయమైన పురోగతిని సాధించింది. గత పదేళ్ల కాలంలో (2015 నుంచి 2025 వరకు) దేశంలో మలేరియా కేసులు మరియు దాని వల్ల సంభవించే మరణాలు ఏకంగా 80 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన నివేదికలో స్పష్టం చేసింది. ఒకప్పుడు మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాల సంఖ్య 155 ఉండగా, ప్రస్తుతం అది 33కి పడిపోవడం విశేషం. అంతేకాకుండా, 2022 నుంచి 2025 మధ్యకాలంలో దేశంలోని సుమారు 160 జిల్లాల్లో ఒక్క స్థానిక మలేరియా కేసు కూడా నమోదు కాకపోవడం భారత్ సాధించిన సాధనకు నిదర్శనం.

ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలుతెలంగాణSwechaa31 Aug 2026, 02:47 PM

ఆలంపూర్‌లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు

కేంద్ర బొగ్గు,గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఆలంపూర్‌లోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.ఆదివారం రాత్రి హరిత హోటల్లో బస చేసిన కేంద్రమంత్రి ఉదయం మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో కలిసి మొదట బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో, మేళతాళాలతో ముఖ్య అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. మొదట వినాయకుని పూజల్లో పాల్గొన్న అతిథులు..ఆ తర్వాత స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాల్లో కేంద్ర మంత్రి ఇతర అతిథులతో కలిసి మొక్కను నాటారు. ఆలయ అధికారులు, పూజారులు అతిథులకు స్వామి,అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆ తర్వాత ఆలయ అధికారులు క్షేత్ర విశిష్టతను అతిథులకు వివరించారు.

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్యాంగ్ రేప్క్రైమ్Swechaa31 Aug 2026, 02:26 PM

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. కదిలే బస్సులో మైనర్‌పై గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటుచేసుకుంది.నిత్యం పోలీసుల పహారా, చెక్ పోస్టులు ఉండే ప్రాంతంలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 4 తేదీన చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా, ఈ దారుణ ఘటనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దేశరాజధానిలో అమ్మాయిలకు భద్రత కరువైందని, మైనర్లకు రక్షణ కల్పించడంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వివరాల్లోకివెళితే.. ఉత్తరప్రదేశ్ మైన్‌పురి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని(16) తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రాత్రి సమయంలో నోయిడాలోని బంధువుల ఇంటికి బయల్దేరింది. గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ వద్ద ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కగా.. అందులో ఆ బాలిక తప్ప మరెవ్వరూ లేకపోవడంతో డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు.

‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!తెలంగాణSwechaa31 Aug 2026, 02:22 PM

‘రేవంత్ క్యాబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు..’ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సంచలన కామెంట్స్!

 తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుపై కూటమి భాగస్వామ్యపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ కరువైందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. మంత్రులు తమ శాఖలపై సంపూర్ణ అధికారాలు, బాధ్యతలతో స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. క్యాబినెట్ సహచరులకు తగిన స్వేచ్ఛ నివ్వకపోతే భవిష్యత్తులో కొత్త సమస్యలు ఉత్పన్నమై ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు :  మన్నె క్రిశాంక్తెలంగాణSwechaa31 Aug 2026, 02:07 PM

రేవంత్ చెబితే కొండల్ రెడ్డి కంపెనీతో ఇజ్రాయెల్ ఒప్పందాలు : మన్నె క్రిశాంక్

రాష్ట్రంలో మరోమారు టెస్సరాక్ట్ కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కంపెనీతో ఇజ్రాయెల్ ప్రతినిధులు తాజాగా ఒప్పందాలు చేసుకున్నారని, అలా ఎలా సాధ్యం అయ్యిందని బీఆర్ఎస్ కీలక నేతల మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డికి కీలక ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు.సీఎం రేవంత్ చెప్పడం వల్లే ఇజ్రాయెల్ ప్రతినిధులు కొండల్ రెడ్డి కంపెనీ అయిన టెస్సెరాక్ట్‌తో ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈ సంవత్సరం దావోస్‌కి వెళ్లి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ వాళ్లని కలిశారని, వాళ్లు అనుముల కొండల్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని చెప్పారు.

‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్తెలంగాణSwechaa31 Aug 2026, 01:50 PM

‘కొండా’ వస్తానంటే మాకు ఓకే : ఎంపీ అర్వింద్

మంత్రి పదవి పోతే కొండా సురేఖ బీజేపీలోకి వెళ్లనుందని జోరుగా ప్రచారం సాగుతున్న వేళ.. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. ‘కొండా సురేఖ బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం. ఆమెపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం వల్ల ఆమె పార్టీలోకి రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా,పరకాల నుంచి తన కూతురు సుస్మితకు బీజేపీ టికెట్ ఇస్తా అంటే ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కాగా, కొండా మురళి మాత్రం తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం.

Rajinikanth-Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?సినిమాSwechaa31 Aug 2026, 01:50 PM

Rajinikanth-Ram Pothineni: సూపర్ స్టార్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని?

Ram Pothineni: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్‌గా రామ్ పోతినేని నటిస్తున్నాడా..! ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీ తన 173వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా సిమ్రాన్, రాశీఖన్నా నటిస్తున్నారు. వీరితో పాటు మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్నట్టుగా సమాచారం. ఇందులో ఆయనది విలన్ పాత్ర అని తెలుస్తోంది.

కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!ఏపీSwechaa31 Aug 2026, 01:22 PM

కరవు నేలపై కృష్ణమ్మ సవ్వడులు.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభించిన సీఎం చంద్రబాబు!

ఉమ్మడి ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల ప్రజలు గత మూడు దశాబ్దాలుగా కంటున్న కల ఎట్టకేలకు సాకారమైంది. కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం నేలలకు సంజీవని లాంటి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. నల్లమల గిరులను చీల్చుకుంటూ నిర్మించిన సొరంగాల ద్వారా ఉరకలెత్తుతూ వస్తున్న కృష్ణా జలాలను చూసి ఆ ప్రాంత రైతాంగం సంతోషంతో ఉప్పొంగిపోయింది. దశాబ్దాల తరబడి తాము ఎదురుచూసిన సాగు, తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరబోతున్నాయన్న ఆనందం రైతుల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది.

కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..క్రైమ్Swechaa31 Aug 2026, 12:57 PM

కూతురిని నడుముకు కట్టుకుని ఓ తల్లి దారుణం..

ఓ తల్లి దారుణానికి పాల్పడింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డను తీసుకుని బావిలో దూకింది. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తల్లిబిడ్డలు ఇద్దరు మరణించారనే విషయం తెలిసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత(26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కూతురు అక్షిత(6), కుమారుడు మహేందర్(18 నెలలు)ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా కొన్నాళ్లుగా రజిత తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది.పుట్టింటికి వచ్చినా భర్త వేధింపులు ఆగకపోడంతో తన కూతురిని నడముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!క్రైమ్Swechaa31 Aug 2026, 12:43 PM

కిటికి నుంచి దూరి నర్సుపై అఘాయిత్యం.. ఆపై కిరాతకం!

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. నర్సు మీద ఓ దుండగుడు అత్యాచారయత్నం చేయడంతో పాటు ఆమె కిరాకతంగా హతమార్చాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది.నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. మృతురాలిని శిరీష(21) గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం హత్యగా ధ్రువీకరించారు. తుక్కుగూడలోని ‘ప్రైమ్ సూపర్ స్పెషాలిటీ’ ఆసుపత్రిలో శిరీష నర్సుగా పనిచేస్తోంది. ఎప్పటిలాగే విధులు ముగించికుని వచ్చి తన గదిలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే, బిహార్‌కు చెందిన సలావుల్లా (35) స్థానికంగా ఓ బైక్ మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. అతను పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శిరీష గదిలో ఒంటరి ఉంటున్నట్టు కనిపెట్టిన అతను.. అర్ధరాత్రి కిటికి ద్వారా గదిలోకి చొరబడినట్టు సమాచారం. ఆమె మీద అత్యాచారయత్నానికి పాల్పడ్డగా..బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమె గొంతు నులిమి మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా విఫలం కావడంతో ఆగ్రహానికి గురైన సనావుల్లా ఆమెను సుత్తితో కొట్టి చంపినట్టు తెలిసింది.

King 100 - Aishwarya Rajesh: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!సినిమాSwechaa31 Aug 2026, 12:38 PM

King 100 - Aishwarya Rajesh: నాగ్ సరసన ఐశ్వర్య రాజేష్ కన్‌ఫర్మ్!

King 100: ఐశ్వర్య రాజేష్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ఆయన 100వ సినిమా కింగ్ 100 లో నటిస్తోంది. తాజాగా, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది ఐశ్వర్య. రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నాగార్జున బర్త్ డే సందర్భంగా వదిలిన గ్లింప్స్ తో ఈ సినిమా హిట్ ఖాయమనే భావన అందరిలో కలిగింది. ఈ గ్లింప్స్ ని ఐశ్వర్య కూడా తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది.

కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?తెలంగాణSwechaa31 Aug 2026, 12:24 PM

కొండాకు ఢిల్లీ పిలుపు..! రేవంత్‌ శిబిరం లెక్క ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్‌ శిబిరం ఢిల్లీ నుంచి ఏం కోరుకుంటోంది? అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.