స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగంక్రైమ్Swechaa31 Aug 2026, 12:24 PM

ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం

ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముగ్గురు యువకులు అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అయితే, రైడర్ వాహనాన్ని వేగంగా నడపటంతో అదుపుతప్పి రవవాండ్లపల్లి వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం బైక్‌లో మంటలు చెలరేగినట్టు సమాచారం.మంటల్లో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోగా.. మృతులు అనిల్, దీక్షిత్, అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!సినిమాSwechaa31 Aug 2026, 12:13 PM

Mamitha Baiju: రెండు హిట్లతో రూ.3 కోట్ల రెమ్యునరేషన్!

Mamitha Baiju: అటు తమిళంలో ఇటు తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా వెలుగుతున్న మమిత బైజు..వరుసగా రెండు హిట్లు అందుకుంది. దాంతో, ఒక్కో సినిమాకి రూ.3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. 'ప్రేమలు' సినిమాతో మమిత గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఒకే నెలలో మూడు సినిమాలతో సౌత్ ప్రేక్షకులను పలకరించింది. ఆ మూడు సినిమాలు మూడు వేరే వేరే భాషల్లో వచ్చినవి.

Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!సినిమాSwechaa31 Aug 2026, 12:02 PM

Seed Ganesh: వినాయక చవితి వేడుకల వేళ.. భక్తులకు చిరంజీవి రిక్వెస్ట్!

 వెండితెరపై మెగాస్టార్‌గా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సమాజ హితం కోరే సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందే ఉంటారని మరోసారి నిరూపించారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా దశాబ్దాలుగా ఎంతోమందికి పునర్జన్మనిస్తున్న ఆయన, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపిస్తుంటారు. ఇప్పుడు విఘ్నేశ్వరుని నవరాత్రుల వేళ సామాజిక బాధ్యతను గుర్తు చేశారు. విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపును కాంక్షిస్తూ మెగాస్టార్ చిరంజీవి భక్తులకు ఒక కీలక పిలుపునిచ్చారు.

డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!తెలంగాణSwechaa31 Aug 2026, 11:51 AM

డిప్యూటీ సీఎం భట్టికి నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డుకున్న మహిళలు!

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటన కొనసాగించింది. ఇవాళ కూడా ఆయన పర్యటనలో భాగంగా బయలు దేరగా.. ఆయన కాన్వాయ్‌ను కొందరు మహిళలు అడ్డుకున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లా చింతకానిలో ఈ ఘటన జరిగింది. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొందరు దళిత మహిళలు రోడ్డుకు అడ్డంగా వచ్చినట్టు సమాచారం. అదే సమయంలో అటుగా వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. దళితులకు ఇస్తానని చెప్పిన మూడెకరాల భూమి ఇంకెప్పుడు ఇస్తారని మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన తెలిపినట్టు సమాచారం.

నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..ప్రపంచంSwechaa31 Aug 2026, 11:17 AM

నేపాల్ వరదల్లో హైదరాబాద్ మహిళ మిస్సింగ్..

నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టడంతో గుట్టలుగా పేరుకుపోయిన మృతదేహాలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడైతే వరద తాకిడి ఎక్కువగా ఉందో ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, నేపాల్‌ వరదల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయినట్టు తెలుస్తోంది.కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో విషాదం జరిగినట్టు సమాచారం. గల్లంతైన మహిళను శ్రీదేవి వేజెళ్లగా గుర్తించారు. శ్రీదేవి కనిపించకుండా పోయిందని ఆమె భర్త దీపక్‌ వెల్లడించారు. వరదలు వచ్చిన సమయంలో శ్రీదేవి ఇమ్మిగ్రేషన్‌ భవనంలో ఉన్నదని పేర్కొన్నారు.

Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!క్రీడలుSwechaa31 Aug 2026, 11:11 AM

Womens T20: దీప్తిశర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే టాప్ వికెట్ టేకర్‌గా రికార్డు!

 ఆకాశమే హద్దుగా సత్తా చాటుతున్న నారీశక్తికి క్రికెట్ మైదానమూ మినహాయింపు కాదని భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మరోసారి నిరూపించింది. సాంకేతిక రంగాలు, పాలన, అంతరిక్ష పరిశోధనల నుంచి క్రీడా ప్రపంచం వరకు ప్రతీ రంగంలోనూ పురుషులకు తీసిపోమని ప్రకటిస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న భారత మహిళా క్రికెట్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అగ్రస్థానాన నిలిచింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.  దుబాయ్ వేదికగా మహిళల ఆసియా కప్‌లో థాయ్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అత్యద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రపంచ రికార్డును తన పేరిట నమోదు చేసుకుంది.

ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియోవైరల్ న్యూస్Swechaa31 Aug 2026, 10:45 AM

ఆ చిన్నారి ఏం పాపం చేసింది తల్లి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

ఓ తల్లి చిన్నారిని ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ‘అమ్మా అమ్మా’ అంటూ ఆ చిన్నారని ఆస్పత్రిలో గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలు అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలోని ఓ ఆసుపత్రిలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆస్పత్రికి రాగా.. ఓ బిడ్డను ఎమర్జెన్సీ వార్డులో వదిలేసి, మరో బిడ్డను తనతో తీసుకెళ్లింది.ఆకలితో అలమటిస్తున్న ఆ బాబు ‘అమ్మా అమ్మా’ అంటూ ఒకటే గుక్కపట్టి ఏడుస్తూ కనిపించాడు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆ బాబుకు పాలు, బిస్కెట్లు, కొత్త బట్టలను అందించారు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా..అక్కడకు చేరుకున్న ఖాకీలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అవినీతి లింకులపై  ఈడీకి ఇచ్చే దమ్ముందా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa31 Aug 2026, 10:38 AM

అవినీతి లింకులపై ఈడీకి ఇచ్చే దమ్ముందా?

వెనుకబడ్డ బీజేపీ.. సమన్వయ లోపమా..

సర్దుబాటా.. వ్యక్తిగత ప్రయోజనాలా?

ప్రత్యక్ష పోరాటాలకు ససేమీరా అంటున్న కేంద్ర ప్రభుత్వ నేతలు?

ప్రజలకు అన్నీ తెలిశాక 4, 5 తేదీల్లో పోరాటాలా?

మీరు ఉద్యమాల పట్ల లేట్ అయినా తెలంగాణ ప్రజలు కాదు?

అన్నీ తెలిసిపోయాయి.. మీరు ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు?

అక్రమాల లెక్కలను స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి పక్కాగా ఇస్తారు

భూ దందాలు, బినామీ మాఫియా ఆగడాలను పూస గుచ్చినట్టు చూపిస్తారు

కనీసం ఇన్‌కం ట్యాక్స్ కేసు అయినా పెడతారా.. బినామీ కేసులను అప్లికేబుల్ చేస్తారా?

ఎక్కడ ఎఫ్‌ఐఆర్ అయినా ఈడీ తీసుకుంటుంది..

కానీ, తెలంగాణలో అవినీతి మూలలను బయటపెట్టే దమ్ముందా?

స్వేచ్ఛగా మేము ఆధారాలు ఇస్తాం.. మీరు సిద్ధమా?

-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియోవైరల్ న్యూస్Swechaa31 Aug 2026, 10:26 AM

నా జీవితాన్ని నరకంలా మార్చిన మోడీ.. ‘రుచిక’ మరో సంచలన వీడియో

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్ జీ నిర్వహించిన నిరసనల్లో రుచిక అనే పదిహేనెళ్ల బాలిక పాల్గొన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ఆమె తీవ్ర విమర్శలు చేయడంతో పాటు దుర్భాషలాడారు.అయితే, నాటి నుంచికొందరు గూండాలు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ఇంటి ఓనర్స్‌కు సైతం బెదిరింపులు రావడంతో వారు తమను ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరో వీడియో విడుదల చేసిన రుచిక.. మోడీ తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చేశారని ఆరోపించింది. తనకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. ‘మోడీ ఓ పిరికివాడు.. నా జీవితాన్ని నరకంలా మార్చేశారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ తనను ఎంతలా హింసించారంటే సర్వస్వం కోల్పోయా అంటూ రుచిక ఆవేదన వ్యక్తం చేసింది.

1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa31 Aug 2026, 10:15 AM

1000 డేస్ కాంగ్రెస్ క్రాకర్స్‌లో కాంప్రమైజ్ పాలిటిక్స్?

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి 1000 రోజులు పూర్తి అవుతుంది. ఆయన పాలనలో ప్రజలకు ఏం చేశారనేది ముఖ్యం. కానీ, అంతకంటే ఎక్కువగా విమర్శల పాలయ్యారు. మొండి పట్టుదలతో, విజన్ లీడరింగ్‌తో డీఎన్ఏలో వచ్చే నాయకత్వ లక్షణాలతో చదరంగంలో రాజులా కాకుండా ముఖ్యమైన హోం శాఖ, మున్సిపాలిటీతో పాటు మరెన్నో శాఖలు తన వద్ద పెట్టుకుని మంత్రిగా పాలనలో రూపురేఖలు తీసుకొచ్చారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, కార్మికులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యక్ష లబ్ధి చేకూర్చే పథకాలను రూపొందిచారని చెప్పుకుంటున్నారు.

మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మిడిల్ఈస్ట్.. అమెరికా-ఇరాన్ మ‌ధ్య భీక‌ర దాడులు! అసలు టార్గెట్‌ హోర్ముజ్‌?InternationalSwechaa31 Aug 2026, 10:13 AM

మ‌ళ్లీ ర‌ణ‌రంగంగా మిడిల్ఈస్ట్.. అమెరికా-ఇరాన్ మ‌ధ్య భీక‌ర దాడులు! అసలు టార్గెట్‌ హోర్ముజ్‌?

యుద్ధం మళ్లీ పెద్దదవుతుందా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. అమెరికా తన దాడిని పరిమితమైన సైనిక చర్యగా చెబుతోంది. హోర్ముజ్‌లో నౌకాయానానికి ముప్పు కలిగించే చర్యలను అడ్డుకోవడమే లక్ష్యమని అంటోంది. మరోవైపు ఇరాన్‌ మాత్రం అమెరికా దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రతీకారం కొనసాగుతుందని హెచ్చరిస్తోంది.

Womens Asia Cup: ‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!క్రీడలుSwechaa31 Aug 2026, 09:43 AM

Womens Asia Cup: ‘ఆరంభం అదిరింది..’ థాయ్‌లాండ్‌పై భారత్ ఘన విజయం!

 దుబాయ్ వేదికగా ప్రారంభమైన మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం నాటి తమ తొలి లీగ్ పోరులో థాయ్‌లాండ్‌ను 94పరుగుల తేడాతో చిత్తు చేసి టోర్నీలో బోణీ కొట్టింది. టాస్ ఓడి ముందస్తు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను నిర్ణీత 20ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 159 పరుగులు నమోదు చేసింది. భారత వికెట్ల వరుస పతనంతో మధ్యలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భారీ లక్ష్యాన్నే నమోదు చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 36 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 పరుగులు బాది జట్టుకు మంచి పునాది వేసింది.

‘నా కొడుకేం ఉగ్రవాది కాదు..’ ట్రోలర్స్ పై యష్ తల్లి ఆగ్రహం!సినిమాSwechaa31 Aug 2026, 09:15 AM

‘నా కొడుకేం ఉగ్రవాది కాదు..’ ట్రోలర్స్ పై యష్ తల్లి ఆగ్రహం!

 తల్లికి కొడుకుపై ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనది, నిస్వార్థమైనది. అతనికి ఏ చిన్న కష్టం వచ్చినా తనే ముందు నిలబడుతుంది. లోకమంతా కొడుకుని తప్పుపట్టినా, వేలెత్తి చూపినా.. తల్లి మాత్రం అతనికి ఆసరాగా నిలిచి, ప్రేమతో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. కొడుకు సంతోషమే తన శ్వాసగా భావించే తల్లి ప్రేమను ఏ మాటల్లోనూ వర్ణించలేము. కన్నడ రాకింగ్ స్టార్ యష్ తల్లి ఆవేదనే ఇందుకు ఉదాహరణ. యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టాక్సిక్' చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Actress Namitha: ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగకపోవడానికి కారణం అదే!సినిమాSwechaa31 Aug 2026, 09:14 AM

Actress Namitha: ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎదగకపోవడానికి కారణం అదే!

Actress Namitha: కెరీర్ ప్రారంభంలో సినిమా వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో తెలియక ఎంతో గర్వం చూపించిందట నమిత. ఇలా ఉండకూడదు..అవకాశాలు రావు.. అని తోటివారు చెప్పినా అప్పుడు అర్థం చేసుకునేంత పరిజ్ఞానం లేదని ఆమె తాజా ఇంటవ్యూలో చెప్పుకొచ్చింది. ఆ కారణంగానే నాకు ఎన్నో సినిమాలలో అవకాశాలు వచ్చి వెళ్ళిపోయాయి. చాలా ఏళ్ళకి గానీ నేను చేసిన పొరపాటు అర్థం కాలేదు..అని రియలైజ్ అవుతూ చెప్పింది.

హైదరాబాద్‌కు మరో మకుటం.. ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!తెలంగాణSwechaa31 Aug 2026, 08:52 AM

హైదరాబాద్‌కు మరో మకుటం.. ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం!

 హైదరాబాద్‌ను అంతర్జాతీయ క్రీడా పటంలో అగ్రస్థానంలో నిలిపేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో రూపొందుతున్న ఈ ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణం కోసం అధికారులు ఇప్పటికే స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఈ భారీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డితెలంగాణSwechaa30 Aug 2026, 11:23 PM

అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: అలంపూర్ ఆలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకంలో భాగంగా ఇప్పటికే పలు పనులు చేశామని, భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని పవిత్ర జోగులాంబ ఆలయంలో మల్టీమీడియా ‘సౌండ్ అండ్ లైట్ షో’ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారని, భక్తులకు ప్రతి రోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేస్తూ ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

అరగంట ఆలస్యంగా వెళ్లి ఉంటే..! 77 మంది కోసం సద్గురు ఆవేదన.. అసలేం జరిగింది?NationalSwechaa30 Aug 2026, 11:22 PM

అరగంట ఆలస్యంగా వెళ్లి ఉంటే..! 77 మంది కోసం సద్గురు ఆవేదన.. అసలేం జరిగింది?

తమవాళ్లు ఎక్కడున్నారో తెలియక 77 కుటుంబాలు క్షణక్షణం భయాందోళనతో ఎదురుచూస్తున్నాయి. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగినా.. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో గల్లంతైన వారి నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు. ఈ ఘటనపై ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్జీ వాసుదేవ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత.. పాలనలో వెయ్యి రోజుల మైలురాయితెలంగాణSwechaa30 Aug 2026, 10:45 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత.. పాలనలో వెయ్యి రోజుల మైలురాయి

Congress Govt: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం పాలనలో విజయవంతంగా వెయ్యి రోజుల మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 1 నాటికి వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను పునర్ నిర్మించడం, సంక్షేమాన్ని విస్తరించడం, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం, రైతులు-మహిళలు-యువతకు భరోసా కల్పించడం, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకురావడం, భవిష్యత్ తెలంగాణకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో ఈ వెయ్యి రోజుల పాలన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. ఈ వెయ్యి రోజుల పాలనలో రంగాల వారీగా తాము సాధించిన విజయాలను, తెచ్చిన మార్పులను, చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలియచేసింది.

ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీతెలంగాణSwechaa30 Aug 2026, 10:04 PM

ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రభుత్వ భూములను అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ అంటూ విరుచుకుపడ్డారు. అజామాబాద్‌లో 500 కోట్ల విలువైన ప్రభుత్వ 'ఆయిల్‌ఫెడ్' భూమిని కేవలం రూ.87 కోట్లకే ఒక ప్రైవేట్ వ్యక్తికి ధారాదత్తం చేయడం వెనుక ఉన్న మతలబు ఏంటి? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు హరీశ్ రావు. ఆ డబ్బులు చెల్లించడానికి ఆయిల్‌ ఫెడ్ సంస్థ సిద్ధంగా ఉన్నా కాదని, సుప్రీంకోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కి కారు చౌకగా ప్రైవేట్ పరం చేయడం దారుణం అని విరుచుకుపడ్డారు.

జగన్‌ వ్యూహమా.. కూటమి బలమా! లోక‌ల్ వార్‌లో ఎవ‌రి స‌త్తా ఎంత‌..?ఏపీSwechaa30 Aug 2026, 09:56 PM

జగన్‌ వ్యూహమా.. కూటమి బలమా! లోక‌ల్ వార్‌లో ఎవ‌రి స‌త్తా ఎంత‌..?

లోకల్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ–జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ అమలు చేయాలా? లేక పార్టీలకి ఉన్న స్థానిక బలం ఆధారంగా సీట్లు పంచుకోవాలా? అన్నది కీలక ప్రశ్నగా మారింది. మ‌రి జ‌గ‌న్ ప్లానేంటి..?

Kiara Advani - Ki An Kaa: కి అండ్ కా సీక్వెల్‌లో కియారా?సినిమాSwechaa30 Aug 2026, 09:20 PM

Kiara Advani - Ki An Kaa: కి అండ్ కా సీక్వెల్‌లో కియారా?

Kiara Advani: కియారా అద్వానీ..అటు బాలీవుడ్ ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్. తాజాగా ఆమె నటించిన పాన్ ఇండియన్ సినిమా టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద ప్రదర్శింపబడుతోంది. యష్ సరసన ఆమె వైల్డ్ పర్ఫార్మెన్స్‌తో బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. అదే 'కి అండ్ కా'.

మార్కెట్ యార్డులోనే మత్తు దందా!..క్రైమ్Swechaa30 Aug 2026, 09:18 PM

మార్కెట్ యార్డులోనే మత్తు దందా!..

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటంతో.. గద్వాల పట్టణంలో గంజాయి విక్రయాలు, సరఫరాపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాపారం జరుగుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tollywood - Directors: జెట్ స్పీడ్‌లో సినిమాను పూర్తి చేస్తున్న డైరెక్టర్స్..సినిమాSwechaa30 Aug 2026, 08:46 PM

Tollywood - Directors: జెట్ స్పీడ్‌లో సినిమాను పూర్తి చేస్తున్న డైరెక్టర్స్..

Tollywood: కథ-కథనం, పాత్రల ఎంపిక, బడ్జెట్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఏ దర్శకుడైనా సినిమాను మూడు నెలల్లో రిలీజ్ చేస్తారనడానికి పూరి జగన్నాధ్ పెద్ద ఉదాహరణ. ఆయనలా వారం రోజుల్లో కథ, ఇంకో వారం రోజుల్లో డైలాగ్స్ కంప్లీట్ చేసే దర్శకరచయిత ఇంకొకరు ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీలో లేడనే చెప్పొచ్చు. 60 రోజుల్లో షెడ్యూల్ కంప్లీట్ చేయడం పూరికే సాధ్యమైంది. ఇంకా, తక్కువ రోజుల్లోనూ పూర్తి చేసిన సినిమాలున్నాయి.

నల్ల బజార్ లో రేషన్ బియ్యం.. పర్యవేక్షణ లోపమా!? అధికారుల నిర్లక్ష్యమా!?..తెలంగాణSwechaa30 Aug 2026, 08:41 PM

నల్ల బజార్ లో రేషన్ బియ్యం.. పర్యవేక్షణ లోపమా!? అధికారుల నిర్లక్ష్యమా!?..

పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్‌ రేషన్‌ బియ్యంపై అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. కాకినాడకు తరలిస్తే ఎక్కువ కిరాయి ఇస్తామని చెప్పడంతో.. మొగిల్ల శివ ప్రసాద్ తన వాహనంలో ఏకంగా 40 క్వింటాళ్ల బియ్యాన్ని లోడ్ చేసుకుని బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో టేకులపల్లి పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. సుమారు లక్షా ఒక వెయ్యి 250 రూపాయల విలువైన బియ్యాన్ని, అశోక్‌ లేల్యాండ్‌ వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్‌ కింద కూడా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్‌ఐ తిరుపతి హెచ్చరించారు.

రాజగోపాల్​రెడ్డికి మంత్రి పదవి.. టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు!!..తెలంగాణSwechaa30 Aug 2026, 07:22 PM

రాజగోపాల్​రెడ్డికి మంత్రి పదవి.. టీపీసీసీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు!!..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పరిణామాలు, నేతల అసంతృప్తులపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనేది ఒక మహా సముద్రం లాంటిదని, ఇక్కడ నేతలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అనుకున్న సమయానికి ఇవ్వలేకపోయామని, రాజకీయాల్లో ఓపిక అవసరమని పేర్కన్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలన్నింటికీ సెప్టెంబర్ నెలలోనే పూర్తి పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

NBK 112 - Aarya: బాలయ్య సినిమాలో క్రేజ్ లేని కోలీవుడ్ హీరో!సినిమాSwechaa30 Aug 2026, 07:05 PM

NBK 112 - Aarya: బాలయ్య సినిమాలో క్రేజ్ లేని కోలీవుడ్ హీరో!

NBK 112: కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. వాస్తవానికి కొరటాల-బాలయ్య సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. కానీ, బాలయ్యకి గాయం అయిన కారణంగా ఆలస్యం అయింది. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్రకి ఎంపికైనట్టుగా తెలుస్తోంది.

నేపాల్ భీభత్సం పై శాస్త్రవేత్తల నివేదికలో సంచలన నిజాలు!..InternationalSwechaa30 Aug 2026, 06:32 PM

నేపాల్ భీభత్సం పై శాస్త్రవేత్తల నివేదికలో సంచలన నిజాలు!..

నేపాల్ హిమాలయాల్లో సంభవించిన పెను విపత్తు.. ఊహించని బీభత్సాన్ని సృష్టించింది. గంటకు 169 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన మంచు, రాళ్లు, బురద వరద.. మార్గంలోని ప్రాంతాలను ముంచెత్తింది. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం.. లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వత శ్రేణిలో 16,700 అడుగుల ఎత్తు నుంచి భారీ మంచు శిఖరం విరిగిపడింది. దాదాపు 1.5 కిలోమీటర్ల వెడల్పున్న ఈ మంచు పర్వతం నదిలో కుప్పకూలడంతో 300 అడుగుల ఎత్తున రాకాసి అల ఎగసిపడింది. ఆ వరద ధాటికి గిరాంగ్ పోర్ట్ ప్రాంతం క్షణాల్లోనే జలసమాధిగా మారింది. వాతావరణ మార్పులే ఇలాంటి విపత్తులకు కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Puri Jagannadh: ప్రొడ్యూసర్ రోజూ నిద్ర మాత్రలు వేసుకోవాలి!సినిమాSwechaa30 Aug 2026, 05:59 PM

Puri Jagannadh: ప్రొడ్యూసర్ రోజూ నిద్ర మాత్రలు వేసుకోవాలి!

Puri Jagannadh: ప్రొడ్యూసర్ రోజూ నిద్ర మాత్రలు వేసుకోవాలి! అవును ఇప్పుడు చాలామంది ప్రొడ్యూసర్స్ ని చూస్తుంటే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా నిర్మాత పెట్టుబడి పెడితేనే అది తెరపైకి వస్తుంది. ఇదే, సినిమా గనక బాక్సాఫీస్ వద్ద తిరగబడితే ఆ నిర్మాత పరిస్థితి వర్ణనాతీతం. అందుకే, సినిమా జరుగుతున్నన్ని రోజులు నిర్మాత నిద్రపోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోవాల్సిందేనని పూరి చెప్పారు.

పవిత్ర పీఠానికి పట్టిన గ్రహణాలు.. గురుస్థానంలో ఉంటూ అరాచకానికి ఒడిగడుతున్న కీచకులు!!.తెలంగాణSwechaa30 Aug 2026, 05:45 PM

పవిత్ర పీఠానికి పట్టిన గ్రహణాలు.. గురుస్థానంలో ఉంటూ అరాచకానికి ఒడిగడుతున్న కీచకులు!!.

మెదక్ జిల్లా పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు నర్సింలుపై కొందరు విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమతో వెకిలిగా ప్రవర్తించడంతో పాటు, డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారని విద్యార్థినులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తనపై పలువురు విద్యార్థినులు ఇతర ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, చైల్డ్ హెల్ప్‌లైన్‌ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అధికారుల విచారణ పరిధిలో ఉన్నట్లు సమాచారం.

Panjaa Movie: పవన్ ఫ్లాప్ సినిమాకి రీరిలీజ్ లో ఇంత క్రేజా!సినిమాSwechaa30 Aug 2026, 05:27 PM

Panjaa Movie: పవన్ ఫ్లాప్ సినిమాకి రీరిలీజ్ లో ఇంత క్రేజా!

Panjaa Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ సినిమా పంజా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (సెప్టెంబర్ 2)కి రీరిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా..ఇప్పటికే కోటిన్నర టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. ఇంకా, రిలీజ్ కి రెండు రోజుల సమయం ఉంది. అప్పటి వరకూ ఎన్ని లక్షల టికెట్స్ అమ్ముడవుతాయో చూడాలి.