స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!NationalSwechaa30 Aug 2026, 03:10 PM

మోదీ మన్ కీ బాత్.. యువత సృజనాత్మకతపై ప్రశంసల జల్లు!

ఢిల్లీలో యువత (Gen Z) చేపట్టిన నీట్ (NEET) నిరసనల సెగ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన పాఠాలే నేర్చుకున్నట్లు స్పష్టమవుతోంది. ఆందోళనల తదనంతర పరిణామాలను గ్రహించిన మోదీ, ప్రస్తుతం ఏ బహిరంగ సభలో మాట్లాడినా, ఏ సామాజిక మాధ్యమ పోస్ట్ పెట్టినా లేదా 'మన్ కీ బాత్' వంటి వేదికల ద్వారా ప్రసంగించినా యువత అంశాలకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. నవతరం ఆలోచనలను, వారి సృజనాత్మకతను నిరంతరం ప్రశంసిస్తూ, 'డ్రగ్-ఫ్రీ ఇండియా' లాంటి ప్రచారాల్లో వారినే భాగస్వాములను చేస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’NationalSwechaa30 Aug 2026, 03:08 PM

రైలు బ్రేకులు జామ్.. జనాలను పరిగెత్తించిన ‘పొగ’

రైలులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్స్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.ఒక్కసారిగా బోగిలోకి భారీగా పొగ రావడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు కిందకు దిగి పారిపోయారు.రైలులో అగ్నిప్రమాదం సంభవించిందని అంతా భావించినట్టు తెలిసింది. ప్యాసింజర్స్ ఒక్కసారిగా హాహాకారాలు చేయడంతో ఇతర కోచుల్లోని ప్రయాణికులు సైతం అప్రమత్తం అయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కిందకు దిగేందుకు ప్రయత్నించారు. తీరా విషయం తెలిసే సరికి అంతా శాంతించారు. వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని కర్జత్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న కోయినా ఎక్స్‌ప్రెస్ చక్రాల నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వెలువడింది.దాంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు.కొద్దిసేపటి వరకు రైల్వే స్టేషన్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. టెక్నికల్ టీమ్ వెంటనే రంగంలోకి దిగి కొన్ని నిమిషాల్లోనే ఈ సమస్యను పరిష్కరించింది

గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన  వాహనాలుNationalSwechaa30 Aug 2026, 02:42 PM

గ్యాస్ లీక్.. నాగ్‌పూర్ టు ముంబై రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు

దేశంలో మరో విషాదం చోటుచేసుకోకుండా అధికారులు అడ్డుకున్నారు. గ్యాస్ లీకేజీ కావడంతో 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ను మళ్లించారు.మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో ఉన్న గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) పైప్‌లైన్ నుంచి గ్యాస్ లీక్ అయినట్టు సమాచారం. స్థానికులు వెంటనే గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులను సంప్రదించి సమాచారం పాస్ చేశారు. అనంతరం ఉన్నతాధికారులకు సైతం ఇన్ఫర్మేషన్ అందించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం పైప్‌లైన్ రెండువైపులా ఉన్న వాల్వ్‌లను మూసివేసేందుకు చర్యలు చేపట్టారు. అందుకోసం నిపుణులను సంప్రదించినట్టు తెలిసింది.

తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!సినిమాSwechaa30 Aug 2026, 02:34 PM

తప్పు చేశా.. ఇకపై నా లక్ష్యం అదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్!

 సినీ ఇండస్ట్రీలో మనసులో అనుకున్న మాటలను నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పే వారిలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఒకరు. సినిమా ఫంక్షన్లలో తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ హీరో అభిమానులను ఉర్రూతలూగిస్తుంటారు. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ కామెంట్లు, పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.  తన జీవితంలో గతంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని బహిరంగంగా అంగీకరించిన ఆయన, ఇకపై తన పూర్తి దృష్టి కేవలం సినిమాల నిర్మాణంపైన మాత్రమే ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

Raaka - Allu Arjun: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!సినిమాSwechaa30 Aug 2026, 02:29 PM

Raaka - Allu Arjun: మెగాస్టార్‌లా మూడు పాత్రల్లో ఐకాన్ స్టార్!

Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో, అల్లు అర్జున్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడట.

ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!NationalSwechaa30 Aug 2026, 02:14 PM

ఖర్గే సభా వేదికపై ‘శుద్ధి’.. దేశ రాజకీయాల్లో కొత్త రగడ!

ఈ నెల 8న హల్ద్వానీలో జరిగిన కాంగ్రెస్‌ సభలో పార్టీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్నారు. సభ పూర్తయిన అనంతరం ఆ వేదిక వద్ద పూజ, శుద్ధి కార్యక్రమం నిర్వహించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాజకీయ వివాదం మొదలైంది. వేదికను ఎందుకు శుద్ధి చేశారన్న ప్రశ్న చుట్టూనే ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!ఏపీSwechaa30 Aug 2026, 02:10 PM

అన్నదాతల కష్టం ఆవిరి.. పొలాల్లోకి ఏనుగుల గుంపు!

ఓ వైపు వర్షాలు లేక పంటలు పండటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఎలాగైనా శ్రమించి దేశానికి అన్నం పెట్టాలని భావించిన రైతుల కష్టాన్ని ఏనుగులు నీళ్ల పాలు చేశాయి. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో ఈసారి చాలా మేరకు వరి సాగుకు అన్నదాతలు ముందుకు రాలేదు.పంటమార్పిడి విధానం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు అధికారులు అన్నదాతలకు కీలక సూచనలు చేశారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి సాగు చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే వరి నాట్లు వేయగా.. అనుకోకుండా ఏనుగుల గుంపు పొలాల్లోకి వచ్చింది.అంతటితో ఆగకుండా నాట్లు మొత్తం తొక్కేశాయి. సుమారు 8 ఏనుగులు పొలాల్లోకి రావడంతో అన్నదాతలు పరుగులు తీశారు. తమ పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గుమడ–కోటిపాం పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంది.

నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!NationalSwechaa30 Aug 2026, 02:04 PM

నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!

 నేపాల్‌లోని నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలో ఉన్న శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి విపత్తు వేళ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఉదయం 9:20గంటల సమయంలో పాఠశాలలో 1,643మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండగా ఎగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయని ప్రిన్సిపాల్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ప్రారంభంలో మూడంతస్తుల కాంక్రీట్ భవనం సురక్షితమేనని భావించినప్పటికీ, పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకుని ఆయన తక్షణమే స్పందించారు.

పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటితెలంగాణSwechaa30 Aug 2026, 01:47 PM

పదవులు, డబ్బుల కోసం ఇంకెంత దిగజారుతావ్ హరీశ్ : మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. 22 ఏ విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కార్నర్ చేశారు. ప్రజలు, రైతులకు చెందిన పట్టా భూములను నిషేధితా జాబితాలో ఎందుకు పెట్టారు? వాటిని విడిపించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, కమీషన్ల కోసమే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఈ దందాకు తెరలేపారని మాజీ మంత్రి ఆరోపించారు. అయితే, హరీశ్ రావు వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పదవులు, డబ్బుల కోసమే మాజీ మంత్రి హరీశ్ రావు ఎంత నీచానికైనా దిగజారి రాజకీయం చేస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. బీఆర్ఎస్‌ను కబ్జా చేసేందుకు హరీశ్ రావు మరింతగా దిగజారారని ఫైర్ అయ్యారు. మామ కేసీఆర్ ఆరోగ్యం బాగుండకూడదని క్షుద్రపూజలు చేయించారని, ఈ విషయం స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ప్రకటించారని, దీనిని బట్టి హరీష్ వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చని ‘ఎక్స్’ వేదికగా రియాక్ట్ అయ్యారు.

కెప్టెన్‌గా వైభవ్: దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!క్రీడలుSwechaa30 Aug 2026, 01:47 PM

కెప్టెన్‌గా వైభవ్: దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!

 భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని దాటాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్ సందర్భంగా కేవలం 15ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే గోల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ అనుకోకుండా గాయపడటంతో, వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ స్టాండింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.

Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?సినిమాSwechaa30 Aug 2026, 01:45 PM

Ananthika Sanilkumar: పాన్ ఇండియా సినిమాకి వయసే అడ్డంకిగా మారిందా?

Ananthika Sanilkumar: శ్రీకాంత్ ఓదెల, నాని కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. అయితే, వాస్తవానికి ముందు ఈ పాత్ర కోసం అనంతిక సనిల్ ని పరిశీలించారట. ఫొటో షూట్ కూడా నిర్వహించారు. కానీ, నాని సరసన ఆమె చాలా చిన్న అమ్మాయిగా కనిపించడంతో ఆ ఛాన్స్ కయాదు లోహర్ కి దక్కింది. ఈ విషయాన్ని తాజాగా అనంతిక వెల్లడించింది.

ఆస్పత్రిలో అంబటి.. ఫోన్‌లో యోగక్షేమాలు ఆరా తీసిన జగన్!ఏపీSwechaa30 Aug 2026, 01:31 PM

ఆస్పత్రిలో అంబటి.. ఫోన్‌లో యోగక్షేమాలు ఆరా తీసిన జగన్!

 మాజీ మంత్రి, వైఎస్సార్ సీనియర్ నేత అంబటి రాంబాబును ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరాతీశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనకు తగిన విశ్రాంతి అవసరమని, త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వైద్యులు తనకు అందించిన చికిత్స వివరాలను అంబటి రాంబాబు ఈ సందర్భంగా జగన్‌కు వివరించారు.

Nepal Floods: ఒక టీ కప్పు.. ఐదుగురి ప్రాణాలను కాపాడింది!వైరల్ న్యూస్Swechaa30 Aug 2026, 01:17 PM

Nepal Floods: ఒక టీ కప్పు.. ఐదుగురి ప్రాణాలను కాపాడింది!

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు మిత్రుల నేపాల్ ఆధ్యాత్మిక యాత్ర ఊహించని భయానక అనుభవంగా మారింది. ఇటీవల నేపాల్‌ను ముంచెత్తిన ఘోరమైన వరద బీభత్సం నుంచి వారు కేవలం ఒక కప్పు టీ తాగడం వల్ల త్రుటిలో ప్రాణాలతో బయటపడటం గమనార్హం. రాయ్‌పూర్‌కు చెందిన నారాయణ్ సేన్, దినేష్ ఓఝా, ప్రేమ్ సింగ్ జగత్, యతేంద్ర ప్రకాశ్, దినేష్ సింగ్ ఠాకూర్ అనే ఐదుగురు స్నేహితులు పశుపతినాథ్, మనోకామన ఆలయాల దర్శనం కోసం ఆగస్టు 21న అద్దె కారులో నేపాల్ పర్యటనకు బయల్దేరారు.

ఒకే మహిళ కోసం ఇద్దరు.. ఒకరు మృతి, మరొకరి ఇంటికి నిప్పు!క్రైమ్Swechaa30 Aug 2026, 01:15 PM

ఒకే మహిళ కోసం ఇద్దరు.. ఒకరు మృతి, మరొకరి ఇంటికి నిప్పు!

వివాహేతర సంబంధాల మత్తులో పడి కొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజా ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. ఒకే మహిళతో ఇద్దరు వ్యక్తులు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయం తెలియడంతో ఇద్దరు గొడవ పడ్డారు. మహిళ సేఫ్‌గానే ఉండగా.. ఒకరిపైమరొకరు కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరు హత్యకు గురవ్వగా.. బాధితుడి బంధువులు హత్యకు పాల్పడిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెం గ్రామంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరోసారి భారీ వర్షసూచనతెలంగాణSwechaa30 Aug 2026, 12:42 PM

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మరోసారి భారీ వర్షసూచన

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఎల్ నినో ప్రభావంతో ఈసారి ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా పెద్దగా వర్షాలు కురవలేదు.దీంతో ఈసారి సమ్మర్‌లో హీట్ వేవ్స్ ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది.అయితే, వర్షాకాలం ముగియడానికి వస్తున్న తరుణంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో ఉన్నట్టుండి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.గతవారం రోజులుగా రాష్ట్రంలో చెదురుమొదురు వర్షాలు కురుస్తున్నాయి. నేడు సైతం తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Srinath: మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా టీమిండియా దిగ్గజం.. సోషల్ మీడియాలో వైరల్!క్రీడలుSwechaa30 Aug 2026, 12:31 PM

Srinath: మెట్రోలో సాధారణ ప్రయాణికుడిలా టీమిండియా దిగ్గజం.. సోషల్ మీడియాలో వైరల్!

 ఒకప్పుడు తన పదునైన వేగంతో ప్రపంచంలోని దిగ్గజ బ్యాటర్లను భయపెట్టిన భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్, బెంగళూరు ‘నమ్మ మెట్రో’లో సాధారణ ప్రయాణికుడిలా దర్శనమిచ్చారు. చేతిలో ట్రాలీ బ్యాగ్ పట్టుకుని, చెవులకు ఇయర్ బడ్స్ పెట్టుకుని నిలబడి ఉన్న ఆయన ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్న ఆయనను చూసి అభిమానులు 'శ్రీనాథ్ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్' అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

నేపాల్‌కు మరో ముప్పు.. NDRRMA హెచ్చరికలు జారీప్రపంచంSwechaa30 Aug 2026, 12:24 PM

నేపాల్‌కు మరో ముప్పు.. NDRRMA హెచ్చరికలు జారీ

నేపాల్‌ను భారీ వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపించడంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రస్తుతం వరదలు తగ్గడంతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.భవన శిథిలాల కింద తవ్వేకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొరుగుదేశం నేపాల్‌కు భారత్ మానవతా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, నేపాల్ ప్రజలు సాధారణ పరిస్థితులను ఇప్పుడిప్పుడే చూస్తుండగా.. ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ NDRRMA కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌‌లో మళ్లీ వరదలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. భోటేకోషి నదిలో నీటిమట్టం మరోసారి భారీగా పెరుగుతోందని, ఈ మేరకు శబ్దాలను గుర్తించినట్లు రసువా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి సమాచారం వచ్చిందని వెల్లడించింది. రసువా, ధాండింగ్, నువాకోట్, చిత్వాన్ ప్రాంతాలు హై అలర్ట్‌లో ఉండాలని NDRRMA పలు సూచనలు చేసింది.

కొండా సురేఖ మంత్రి పదవి సేఫ్.. టీపీసీసీ చీఫ్ హింట్ ఇచ్చారా?తెలంగాణSwechaa30 Aug 2026, 12:05 PM

కొండా సురేఖ మంత్రి పదవి సేఫ్.. టీపీసీసీ చీఫ్ హింట్ ఇచ్చారా?

రాష్ట్రంలో కొండా సురేఖ వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆమె మంత్రి పదవి ఉంటుందా? పోతుందా? అనే దానిమీదే రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొందరేమో ఆమె పదవి పోవడం ఖామయని అంటుంటే.. మరికొందరు పోదని కేవలం వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని చర్చ జరుగుతున్నది. కొండా సురేఖ తప్పు లేదని.. ఆమె కూతురు చేసిన దానికి తనను శిక్షిస్తే ఏం వస్తుందని కాంగ్రెస్ పార్టీలోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బీసీ లీడర్లు పరోక్షంగా కొండాకు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘బీసీలకు తెలంగాణ మంత్రివర్గంలో సరైన వాటా దక్కలేదు. మంత్రి పదవుల కేటాయింపులో బీసీలకు తగిన న్యాయం జరగలేదని రాహుల్ గాంధీకి చెప్పాను. అలాంటప్పుడు సురేఖను మంత్రి పదవి ఎందుకు తొలగిస్తాము? మరల ఆమె స్థానంలో కొత్తవారికి ఎందుకు చాన్స్ ఇస్తాము?’ అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

వీల్‌చైర్‌లో నీరజ్ చోప్రా.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన!క్రీడలుSwechaa30 Aug 2026, 11:56 AM

వీల్‌చైర్‌లో నీరజ్ చోప్రా.. అభిమానుల్లో తీవ్ర ఆందోళన!

భారత స్టార్ అథ్లెట్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ఢిల్లీ విమానాశ్రయంలో వీల్‌చైర్‌లో ఉన్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన మడమ భాగంలో లిగమెంట్ తీవ్రంగా దెబ్బతినడంతో స్వయంగా నడవలేక వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. దేశానికి ఎన్నో ప్రతిష్ఠాత్మక పతకాలు తెచ్చిపెట్టిన ఛాంపియన్ ప్లేయర్ ఈ స్థితిలో కనిపించడంతో క్రీడాభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన అథ్లెట్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియా వ్యాప్తంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

Trivikram Coolie no 1: ‘ఆదర్శ కుటుంబం’లో దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య రీమిక్స్!సినిమాSwechaa30 Aug 2026, 11:46 AM

Trivikram Coolie no 1: ‘ఆదర్శ కుటుంబం’లో దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య రీమిక్స్!

Trivikram: గత కొంతకాలంగా మన తెలుగు సినిమాలలో ఓల్డ్ ఛార్ట్ బస్టర్స్ ని మళ్ళీ రీమిక్స్ చేసి సినిమాలలో ప్రత్యేక సందర్భంలో ఉపయోగిస్తున్నారు. అలా, రీమిక్స్ చేసిన చాలా సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు, కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా కోసం వెంకీ నటించిన కూలీ నంబర్ 1 లోని 'దండాలయ్యా ఉండ్రాళ్ళయ్య' సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్నారట.

భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా కల: అనన్య బంగర్!క్రీడలుSwechaa30 Aug 2026, 11:34 AM

భారత్‌కు వరల్డ్ కప్ అందించడమే నా కల: అనన్య బంగర్!

టీమిండియా మాజీ క్రికెటర్, మాజీ కోచ్ సంజయ్ బంగర్ కుమార్తె అనన్య బంగర్ తన క్రికెట్ కెరీర్‌లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్ఠాత్మక మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఆమెకు అధికారికంగా అర్హత కల్పించింది. ఈ మైలురాయిని చేరుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, టీమిండియా తరఫున ప్రాతినిధ్యం వహించి దేశానికి ప్రపంచకప్ అందించడమే తన అంతిమ లక్ష్యమని ఉద్ఘాటించింది.

The Paradise Yeshanagula: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?సినిమాSwechaa30 Aug 2026, 11:08 AM

The Paradise Yeshanagula: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?

The Paradise: ఐటం సాంగ్ అంటే ఎలా ఉండాలి. ప్రతీ ఒక్కరితోనూ ఊర మాస్ స్టెప్పులేయించాలి. బాక్సులు బద్దలవ్వాలి..థియేటర్స్ దద్దరిల్లాలి. కానీ, తాజాగా 'ది ప్యారడైజ్' సినిమా నుంచి వచ్చిన డాన్స్ నంబర్ 'యేశనాగుల' సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. నాని, కీర్తి సురేష్‌లపై ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఆట సందీప్, ఆయన భార్య డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. కానీ, ఆశించిన స్థాయిలో ఈ సాంగ్ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?తెలంగాణSwechaa30 Aug 2026, 11:00 AM

మద్యం సేవించి ‘నీట్’కు హాజరు.. అధికారులు ఏం చేశారంటే?

దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వగా.. 8:30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్ద ప్రధాన గేట్లు మూసివేసినట్టు తెలిసింది. పలుచోట్ల నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించలేదని సమాచారం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనుంది. ఈ క్రమంలోనే పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉండగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలో నీట్‌ పీజీ పరీక్షా కేంద్రానికి ఓ అభ్యర్థి మద్యం సేవించి హాజరైనట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ రిజ్వాన్ అనే విద్యార్థి ఫుల్లుగా మద్యం సేవించి పరీక్షా కేంద్రానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.అతను పరీక్షా హాల్‌లోకి వెళ్లిన అనంతరం సిబ్బంది అతని తీరును గమనించారు. కాసేపటికే పరీక్ష రాయకుండా హాల్‌ నుంచి బయటకు పంపించి వేసినట్టు తెలిసింది.

ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు :  చీఫ్ మోహన్ భగవత్NationalSwechaa30 Aug 2026, 10:40 AM

ఆర్ఎస్ఎస్ మతాన్ని చూడదు..అలా చేస్తే హిందువులు అసలే కారు : చీఫ్ మోహన్ భగవత్

ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ముస్లింలను భారత్ నుంచి పంపించి వేయాలనుకునే వారు హిందువులు కారని ఆయన కీలక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొని ప్రసంగించారు.కార్యక్రమానికి హాజరైన పలువురు ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్బంగా ఆయన ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. తమను హిందూ దేశం నుంచి వెళ్లగొడతారా? అని గతంలో ముస్లిం ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన తాజాగా న్యూయార్క్ వేదిక‌గా స‌మాధానం ఇచ్చారు. తమను తాము హిందువుగా చెప్పుకునే ప్రతి ఒక్కరూ అన్ని మార్గాలు(అన్ని మతాలు) ఒకే గమ్యస్థానానికి చేరుస్తాయని నమ్మాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!క్రీడలుSwechaa30 Aug 2026, 10:38 AM

WomenHockeyWC: డచ్ ఆధిపత్యానికి బ్రేక్.. విశ్వవిజేతగా అర్జెంటీనా!

మహిళల హాకీ ప్రపంచ కప్‌లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించింది. గత నాలుగు ఎడిషన్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వరుసగా ప్రపంచ కప్ టైటిళ్లను ముద్దాడిన నెదర్లాండ్స్ జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ వేసింది. శనివారం రాత్రి ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1 స్కోరుతో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో డచ్ జట్టుపై 3-1తేడాతో అర్జెంటీనా ఘన విజయాన్ని సాధించి, ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా కిరీటాన్ని కైవసం చేసుకుంది.

విషాదంలో అద్భుతం.. మృత్యువును జయించిన చిన్నారి!..InternationalSwechaa30 Aug 2026, 10:34 AM

విషాదంలో అద్భుతం.. మృత్యువును జయించిన చిన్నారి!..

నేపాల్‌లో సంభవించిన ఘోర వరదల్లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. హిమాలయ దేశాన్ని అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల కారణంగా 670 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు జరిగిన మూడు రోజుల తర్వాత, రసూవా జిల్లాలోని టిమురే ప్రాంతంలో వరదల వల్ల గల్లంతైన వారి కోసం ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బృందం శుక్రవారం గాలిస్తుండగా, శిథిలాల కింద నుంచి చిన్నారి ఏడుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన బృందాలు, బాలికను సురక్షితంగా బయటకు తీశాయి.

రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతెలంగాణSwechaa30 Aug 2026, 10:20 AM

రాహుల్ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

బీజేపీ దళితులను అవమానించిందని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఖండించారు. రామ్ లీలా మైదానం శుద్ధీకరణ గురించి ఆదివారం జాతీయ మీడియాకు ఆయన క్లారిటీ ఇచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన పూజా కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.ఆయన చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. రామ్ లీలా మైదానంలో జరిగిన క్రతువులో దళితులు కూడా పాల్గొన్నారని స్పష్టంచేశారు.ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గే ప్రసంగం తర్వాత శుద్ధీకరణ చేశామనడంలో వాస్తవం లేదన్నారు.అవన్నీ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు మాత్రమే అని వెల్లడించారు.వేరే ఇతర కారణాల వలన అక్కడ పూజ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అసలు విషయం రాహుల్ గాంధీకి తెలిసినప్పటికీ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ చీఫ్ రామచందర్ రావు మండిపడ్డారు.

దిగివచ్చిన బంగారం, వెండి.. నేడు ఊహించని ధరలు!వ్యాపారంSwechaa30 Aug 2026, 10:12 AM

దిగివచ్చిన బంగారం, వెండి.. నేడు ఊహించని ధరలు!

 గత కొన్ని రోజులుగా చుక్కలంటుతూ వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల ఉధృతికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. దేశీయ బులియన్ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఊహించని విధంగా భారీగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, విలువైన లోహాల విక్రయాల ఒత్తిడి కారణంగా స్వదేశీ మార్కెట్లలో కూడా పసిడి దిగివచ్చింది. ముఖ్యంగా పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు ఊరటనిస్తూ వెండి ధర ఒక్కరోజు వ్యవధిలోనే కిలోకు ఏకంగా రూ.5,000 మేర పతనమవడం విశేషం.

పంజాబ్‌లో ఎన్నికల్ హీట్.. ఆప్ కీలకనేత దారుణ హత్యNationalSwechaa30 Aug 2026, 10:07 AM

పంజాబ్‌లో ఎన్నికల్ హీట్.. ఆప్ కీలకనేత దారుణ హత్య

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అయితే, దీని వెనుక బీజేపీ హస్తం ఉందని అధికార ఆప్ పార్టీ నేతలు ఆరోపిస్తుండగా..తమకు సంబంధం లేదని బీజేపీ కొట్టిపారేసింది. పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లా మమ్‌దోట్ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గుర్‌ప్రీత్ సింగ్ గోపీని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గోపి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు వెంబడించి మరీ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుర్‌ప్రీత్ సింగ్ గోపీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

శ్రావణంలో తగ్గని చికెన్ ధరలు.. షాక్‌లో నాన్-వెజ్ ప్రియులు!తెలంగాణSwechaa30 Aug 2026, 09:40 AM

శ్రావణంలో తగ్గని చికెన్ ధరలు.. షాక్‌లో నాన్-వెజ్ ప్రియులు!

పవిత్రమైన శ్రావణ, కార్తీక మాసాలు వచ్చాయంటే నాన్‌వెజ్‌కు డిమాండ్ తగ్గడం సాధారణమే. చాలామంది భక్తులు ఈ మాసాల్లో మాంసాహారానికి దూరంగా ఉంటారు. కానీ శ్రావ‌ణంలోనూ చికెన్ ధ‌ర‌లు నాన్ వెజ్ ప్రియుల‌కు షాక్ ఇస్తున్నాయి. గ‌త‌వారం కేజీ స్కిన్ లెస్ చికెన్ ధ‌ర రూ.200 నుండి రూ.240 మ‌ధ్య ప‌ల‌క‌గా నేడు 220 నుండి 270 వ‌ర‌కు ప‌లుకుతోంది. నిజామాబాద్ లో అత్య‌ధికంగా కేజీ ధ‌ర రూ.270 ప‌లుకుతోంది. వ‌రంగ‌ల్, సూర్యాపేట‌, కామారెడ్డి రూ.250గా ఉంది. ఖ‌మ్మంలో రూ.220 నుండి రూ.240 మ‌ధ్య అమ్ముతున్నారు. గుంటూరులో కేజీ రూ.260, ప‌ల్నాడులో రూ.230 నుండి రూ.250 మ‌ధ్య ఉంది. విశాఖ ప‌ట్నంలో కేజీ రూ.240 ఉండ‌గా, చిత్తూరులో కేజీ రూ.220గా ఉంది. శ్రావ‌ణంలోనూ ధ‌ర‌లు ఈ స్థాయిలో ఉండ‌టంతో చికెన్ ల‌వ‌ర్స్ నిరాశ చెందుతున్నారు. మ‌రోవైపు కోడిగుడ్ల ధ‌ర‌లు సైతం భారీగా పెరిగిన సంగ‌తి తెలిసిందే. మ‌టన్ ధ‌ర‌లు కూడా నాన్ వెజ్ ప్రియుల‌కు షాక్ ఇస్తూనే ఉన్నాయి. శ్రావ‌ణంలో కూడా మ‌ట‌న్ ధ‌ర‌లు స్థిరంగా ఉంటున్నాయి.