స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

తెలుగు ప్రజలకు బ్రాండ్‌గా మారిన తెలంగాణ యాస.. భాషస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa30 Aug 2026, 09:29 AM

తెలుగు ప్రజలకు బ్రాండ్‌గా మారిన తెలంగాణ యాస.. భాష

తెలంగాణ జానపద పాటలు, మాండలికం పునరుజ్జీవం మాములుగా లేదు. అది సోషల్ మీడియా అయినా, య్యూటూబ్ అయినా, చివరికి సినిమా అయినా హిట్ కావాలంటే తెలంగాణ యాస, భాష తప్పనిసరి అయింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంస్కృతిక గౌరవం పెరిగింది. ‘‘1990 దశకంలో సినిమాలు, టీవీలు, పాఠశాలల్లో స్టాండర్డ్ తెలుగు అంటూ కోస్తాంధ్ర యాసనే తెలుగు భాషగా మార్చేసి తెలంగాణ యాసను చాలాసార్లు కామెడీ కోసం, విలన్ పాత్రల కోసం, అజ్ఞానం, మొరటుతనం” చూపించడానికి వాడేవారు. తరుచూ ఎగతాళికి గురయ్యేవాళ్లం. ఇంట్లో పిల్లలు యాస మాట్లాడితే పాఠశాలల్లో ఎగతాళి అవుతారని కుటుంబాలు భయపడేవి.

NBK 111 Dubbing: ఇంట్లోనే డబ్బింగ్ సెటప్ రెడీ చేయించుకున్న బాలయ్య!సినిమాSwechaa30 Aug 2026, 09:21 AM

NBK 111 Dubbing: ఇంట్లోనే డబ్బింగ్ సెటప్ రెడీ చేయించుకున్న బాలయ్య!

NBK 111: గాడ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బికే 111 సినిమాకి సంబందించి తాజా అప్‌డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే, ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య డబ్బింగ్ చెప్పేందుకు ఇంట్లోనే ప్రత్యేకంగా సెటప్ రెడీ చేయించారట.

Nepal Floods: నేపాల్‌లో జలప్రళయం.. 675కు చేరిన మృతుల సంఖ్య!NationalSwechaa30 Aug 2026, 09:12 AM

Nepal Floods: నేపాల్‌లో జలప్రళయం.. 675కు చేరిన మృతుల సంఖ్య!

పొరుగు దేశమైన నేపాల్‌ను భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల తాకిడికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు 675మంది మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు. అంతేకాకుండా 589మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది పర్యాటకుల ఆచూకీ లభించకపోవడంతో పర్యాటక శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం తెలిస్తే షాక్ అవుతారు!!..HealthSwechaa30 Aug 2026, 09:03 AM

కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం తెలిస్తే షాక్ అవుతారు!!..

చల్లటి కుల్ డ్రింక్ గొంతులోకి దిగగానే హాయిగా స్వీట్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా నేటి జీవన శైలిలో ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగని వారిని వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.. కొందరైతే రోజుకు ఒకటికన్నా ఎక్కువ తీసుకుంటారు.. కానీ, ఆ డ్రింక్ శరీరంలోకి వెళ్లిన తర్వాత జరిగే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో వైద్యులు పలు సందర్భాలలో వివరించారు.. ఐనా ఐ డోంట్ కేర్ అంటున్నారా? అయితే మీ కోసమే ఈ వార్త..

సాధారణంగా ఒక మనిషి 350 ఎం.ఎల్ డ్రింక్ తాగిన తొలి 10 నిమిషాల్లోనే దాదాపు 10 చెంచాల చక్కెర ఒక్కసారిగా మీ రక్తంలోకి చేరుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.. అయితే ఇంత చక్కెర ఒకేసారి పొట్టలోకి వెళ్తే ఏదో ఒకటి జరగాలి కదా?.. కానీ, డ్రింక్‌లో ఉండే 'ఫాస్ఫరిక్ యాసిడ్' ఆ తీపి తీవ్రతను తగ్గించి, ఎలాంటి ఎఫెక్ట్ బయటపడకుండా అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు..

గోవింద నామస్మరణతో కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?ఏపీSwechaa30 Aug 2026, 08:56 AM

గోవింద నామస్మరణతో కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

ఆపదమొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. వీకెండ్ కావడంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ మేరకు ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

నాలో ధైర్యం నింపాడు.. సంజూ శాంసన్ వ్యక్తిత్వంపై సూర్యకుమార్ హాట్ కామెంట్స్!క్రీడలుSwechaa30 Aug 2026, 08:53 AM

నాలో ధైర్యం నింపాడు.. సంజూ శాంసన్ వ్యక్తిత్వంపై సూర్యకుమార్ హాట్ కామెంట్స్!

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు జగజ్జేతగా నిలవడంలో ఓపెనర్ సంజూ శాంసన్ పాత్ర మరవలేనిది. అద్భుతమైన ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును ముద్దాడిన ఆయన ప్రయాణం ఆరంభంలో తీవ్ర ఒడుదొడుకులకు గురైంది. మెగా టోర్నీకి సరిగ్గా ముందు న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లలో వరుసగా విఫలం కావడంతో అతడిని తుది జట్టు నుంచి పక్కనబెట్టాల్సి వచ్చింది. తన నాయకత్వంలోనే సంజూను బెంచ్‌పై కూర్చోబెట్టడం కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడాడు.

ఆలయాన్ని దర్శించినప్పుడు చేయవలసిన విధులు ఏమిటి?..SpiritualitySwechaa30 Aug 2026, 08:30 AM

ఆలయాన్ని దర్శించినప్పుడు చేయవలసిన విధులు ఏమిటి?..

మన సనాతన ధర్మంలో దేవాలయ దర్శనానికి అత్యుత్తమ స్థానం ఉంది. ఆలయంలో భక్తి పూర్వకంగా దైవాన్ని దర్శించినప్పుడు కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేము.. ఆలయ పరిసరాలు నిత్యం మంత్రోచ్ఛారణాలతో పవిత్రంగా మారి అక్కడికి వెళ్ళిన భక్తుల మనస్సులను ఉత్తేజ భరితం చేస్తాయి. అందుకే ఆలయానికి వెళ్లినప్పుడు శాస్త్రోక్తంగా కొన్ని విధులను పాటించాలని.. అప్పుడే ఆ దర్శనం పూర్ణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి..

అయ్యప్ప-హనుమాన్ మాలధారణ వెనుక ఉన్న ఆథ్యాత్మిక రహస్యం ఏమిటి!..SpiritualitySwechaa30 Aug 2026, 08:17 AM

అయ్యప్ప-హనుమాన్ మాలధారణ వెనుక ఉన్న ఆథ్యాత్మిక రహస్యం ఏమిటి!..

మనిషి తన మనస్సును నియంత్రించుకోవడానికి భక్తి మార్గం వైపు చూపు సారిస్తాడు. కానీ అక్కడితో అయిపోదు.. కఠిన నియమాల మధ్య కోతి లాంటి మనస్సును అదుపులో పెట్టాలంటే ఒక సాధన ఉండాలి.. ఆ సాధన పేరే దీక్ష.. అందుకే మనలో చాలామంది అయ్యప్ప, హనుమాన్ దీక్ష తీసుకోవడం కనిపిస్తుంది. అయితే ఈ దీక్ష తీసుకున్న ప్రతి వారు పవిత్రులైపోతారా? అంటే అది వారి కర్మానుసారంగా వచ్చే ఆలోచనలను బట్టి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి..

కొందరు మాలలు ధరించి కూడా లోకసంబంధమైన విషయాలపట్ల ఆసక్తి కనబరుస్తారు. అబద్ధాలు ఆడటం, అహంకారపు మాటలు మాట్లాడటం వంటి పనులు చేస్తూ.. పవిత్రమైన భక్తిని నలుగురిలో చులకన అయ్యేలా ప్రవర్తిస్తారు.. అయితే మాలాధారణ అనేది భౌతికమైన కట్టుబాట్లను దాటి, మనిషి అంతర్గత ప్రక్షాళనకు, ఆత్మ సాక్షాత్కారానికి చేసే ఒక మహత్తరమైన సాధన అని గుర్తించరు..

Telangana Assembly Sessions: సభా సమరం.. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలుతెలంగాణSwechaa29 Aug 2026, 10:02 PM

Telangana Assembly Sessions: సభా సమరం.. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటల నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ అధికారులు సమాచారం ఇచ్చారు.

Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా?సినిమాSwechaa29 Aug 2026, 09:15 PM

Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా?

Venkatesh-Trivikram: ఆదర్శ కుటుంబం వాయిదా పడుతుందా? అవును ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట గట్టిగా వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతోంది ఆదర్శ కుటుంబం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో, వెంకీ సరసన కేజీఎఫ్, హిట్ 3, తెలుసు కదా ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. వాస్తవానికి, ఈ సినిమాను అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని ప్రకటించారు. కానీ, ఆ డేట్ మారనున్నట్టు తెలుస్తోంది.

స్టార్స్ డేట్స్ ఇవ్వడమే పొరపాటా?సినిమాSwechaa29 Aug 2026, 08:28 PM

స్టార్స్ డేట్స్ ఇవ్వడమే పొరపాటా?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్స్‌గా పాపులారిటీని తెచ్చుకోవాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలో మన ప్రభాస్, ఎన్‌టిర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, యష్ లాంటి వారిని చూస్తే అర్థమవుతుంది. ఇట్టే గ్లోబల్ వైడ్‌గా ఈ హీరోలకి క్రేజ్ అండ్ మార్కెట్ పెరగలేదు. బాహుబలి లాంటి సినిమా కోసం ప్రభాస్ ఎంతగా శ్రమించాడో అందరికీ తెలిసిందే.

హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్మక్రైమ్Swechaa29 Aug 2026, 08:13 PM

హైదరాబాద్‌లో విషాదం.. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్మ

Hyderabad: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో విషాదం చోటు చేసుకుంది. నీట్ పీజీ అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అపరాజిత హాస్టల్ లో నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న యువతి విషం తాగి సూసైడ్ చేసుకుంది. యువతిని కర్నూలుకు చెందిన యశ్వితగా గుర్తించారు. ఆరు నెలలుగా ఆమె హైదరాబాద్‌లో ఉంటూ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతోంది. పరీక్షల మానసిక ఒత్తిడే బలవన్మరణానికి కారణం అని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. యశ్వితను కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తెగా గుర్తించారు. యశ్విత మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!సినిమాSwechaa29 Aug 2026, 07:39 PM

ఇకపై నో రెమ్యునరేషన్..హిట్టైతే లాభాల్లో వాటా!

Ravi Teja: ఇరుముడి హిట్టైతేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని..మీకు మంచి లాభాలు వస్తే అందులో కొంత వాటా ఇవ్వమని అడిగాడట. దాని ప్రకారమే మైత్రీ వారితో రవితేజ ఇరుముడి సినిమాను చేశాడు. ఇప్పుడు సినిమా 150 కోట్ల వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో, ఎంత కాదన్న రవితేజ వాటా 50 కోట్లకి పైగానే వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. ఓటీటీ, శాటిలైట్ అంతా కలుపుకుంటే రవితేజకి మంచి రెమ్యునరేషన్ అందుతుందని అంటున్నారు.

నగరాల్లో వరదలకు ప్రధాన కారణం అదేతెలంగాణSwechaa29 Aug 2026, 07:27 PM

నగరాల్లో వరదలకు ప్రధాన కారణం అదే

Hydraa: దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను వరద ముప్పు భయపెడుతోంది. చిన్న పాటి వర్షం కురిసినా ఈ నగరాలు చిగురుటాకులా వణికిపోయే పరిస్థితి ఉంది. అర్బన్ ఫ్లడ్స్ ఇప్పుడు నగరవాసులను తీవ్రంగా భయపెడుతున్న అంశం. కాగా, నగరాల్లో నెలకొన్న ఈ దుస్థితిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సిటీస్ లో వరదలకు ప్రధాన కారణం చెరువులు లాంటి సహజ జల వనరులు కనుమరుగు కావడమే అని రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన అర్బన్ ఎన్విరాన్ మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాతీయ సదస్సులో రంగనాథ్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు.

కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!తెలంగాణSwechaa29 Aug 2026, 07:11 PM

కాప్రా చెరువుపై హైడ్రా నజర్.. విగ్రహాల నిమజ్జనంపై ట్విస్ట్!

కాప్రా చెరువులో గణేశ్ నిమజ్జానాలకు వెలుసులు బాటు లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు . 2026 ఆగస్టు 29న కాప్రా చెరువును పరిశీలించిన కమిషనర్.. ఈసారి నిమజ్జనాలకు వీలులేదని.. చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని,పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని ఉత్సవ కమిటీకి సూచించారు. 

Power Star: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?సినిమాSwechaa29 Aug 2026, 07:09 PM

Power Star: పవన్ బర్త్ డే స్పెషల్..ఏమీ ఆశించకూడదా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఈ రోజున పవన్ కళ్యాణ్ నటించబోతున్న కొత్త ప్రాజెక్ట్స్‌కి సంబందించిన సాలీడ్ అప్‌డేట్స్ ఉంటాయని ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినీ లవర్స్, ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఏమీ ఆశించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. ఏ అప్‌డేట్స్ రావడం లేదని ఇన్‌సైడ్ టాక్.

Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న "ఇరుముడి"సినిమాSwechaa29 Aug 2026, 06:36 PM

Irumudi OTT Release: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న "ఇరుముడి"

Irumudi OTT Release: ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. అంతేకాదు, సెప్టెంబర్ 18నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా మేకర్స్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో..ఇంకా చెప్పాలంటే 2026 లో ఇప్పటి వరకూ వచ్చిన ఏ సినిమా ఈ రేంజ్ హిట్ అవలేదు. ఇది రవన్న మాస్ ర్యాంపేజ్ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయనుఏపీSwechaa29 Aug 2026, 06:29 PM

జగన్‌కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను

Vijaya Sai Reddy: ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ కు విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. అనేక రకాల అంశాలను అందులో ప్రస్తావించారు. నమ్మక ద్రోహి అంటూ వైసీపీ కోటరీ తనపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన వాపోయారు. జగన్ కు తాను వెన్నుపోటు పొడిచానని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను జగన్ కు ఎన్నడూ నమ్మకద్రోహం చేయలేదు, చేయనని విజయసాయిరెడ్డి చెప్పారు.

జగన్ తో పాటు ప్రతి చార్జిషీట్ లోనూ తనను ఏ2గా చేర్చారని ఆయన గుర్తు చేశారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తాను 15 నెలలు జైల్లో ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ లో తనను ఏ5గా చేర్చారని విజయసాయిరెడ్డి వాపోయారు. తాను నమ్మకద్రోహానికి పాల్పడి ఉంటే ఏనాడో అప్రూవర్ గా మారేవాడినని విజయసాయిరెడ్డి అన్నారు.

మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..తెలంగాణSwechaa29 Aug 2026, 06:08 PM

మంత్రి శ్రీధర్ బాబుతో మారిషస్ మంత్రి భేటీ.. కీలక అంశాలపై చర్చలు!..

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖ మంత్రి లచ్మునా రాజ్ పెంటియా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పాలన, సాంకేతికత, విద్య, నైపుణ్యాభివృద్ధి, సంస్కృతి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. తెలంగాణను నమ్మకమైన భాగస్వామిగా భావిస్తున్నామని మారిషస్ మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వ ఉద్యోగులకు ఆధునిక పరిపాలనపై శిక్షణ అందించాలని కోరారు. అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026కు మారిషస్ మంత్రిని శ్రీధర్ బాబు ఆహ్వానించారు. మారిషస్‌లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తెలంగాణ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వంతెలంగాణSwechaa29 Aug 2026, 05:53 PM

రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం.. సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం

Tummala Nageswara Rao: తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విత్తన చట్టాన్ని తీసుకురావడంలో ఇక ఎలాంటి జాప్యం ఉండకూడదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వచ్చే పంట కాలానికైనా రైతులకు మేలు జరిగేలా విత్తన చట్టాన్ని అమల్లోకి తెచ్చే తదుపరి చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

సచివాలయంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన చట్టం-2025పై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, నాణ్యత, నియంత్రణ, విక్రయాలు, ధరల నియంత్రణతో పాటు విత్తన ఉత్పత్తి రైతుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

సర్‌పై సీఎం అభ్యంతరం.. సీఈసీకి కీలక సూచనలు చేసిన రేవంత్ రెడ్డి!..తెలంగాణSwechaa29 Aug 2026, 05:27 PM

సర్‌పై సీఎం అభ్యంతరం.. సీఈసీకి కీలక సూచనలు చేసిన రేవంత్ రెడ్డి!..

తెలంగాణలో SIR ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు పేరు కూడా తొలగిపోకూడదని.. అనర్హులు జాబితాలో చేరకూడదని సీఈసీకి లేఖ రాశారు. అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు. తాత్కాలికంగా ఇళ్లలో లేని వారిని, శాశ్వతంగా నివాసం మారిన వారిని ఒకేలా పరిగణించవద్దని సూచించారు. నోటీసులు అందుకున్న కూలీలు, వలస కార్మికులు, వృద్ధులకు మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని.. పట్టణాల్లో సహాయ కేంద్రాలు, వికేంద్రీకృత విచారణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా SIR పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని సీఎం కోరారు.

Nani-The Paradise: ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..నానీ-కీర్తి రెచ్చిపోయారుసినిమాSwechaa29 Aug 2026, 05:26 PM

Nani-The Paradise: ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..నానీ-కీర్తి రెచ్చిపోయారు

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'ది ప్యారడైజ్'. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకముందు ఆయా షేర్ అనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చి సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, సెకండ్ సింగిల్ ‘యెషనాగుల’ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం!తెలంగాణSwechaa29 Aug 2026, 04:41 PM

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం!

Ethics Committee: అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ (వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్), బీజేపీ (రాకేశ్ రెడ్డి), సీపీఐ (కూనంనేని సాంబశివరావు), కాంగ్రెస్ (మధుసూదన్ రెడ్డి) సభ్యులు హాజరయ్యారు. గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై చర్చించారు. కౌశిక్ రెడ్డి అంశంపై మరోసారి సమావేశం నిర్వహించాలని ఎథిక్స్ కమిటీలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి ఎథిక్స్ కమిటీ సమావేశం జరగబోతోంది.

ఎమ్మెల్యే అంటే భయం లేదా?తెలంగాణSwechaa29 Aug 2026, 03:35 PM

ఎమ్మెల్యే అంటే భయం లేదా?

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అంటే భయం లేదా? అని సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ అంటే లెక్క లేకుండా పోయిందని అధికారులపై గుస్సా అయ్యారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కుమురంభీం ఆదివాసీ భవన్ లో ఖైరతాబాద్ నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను కార్యక్రమానికి వచ్చేలోపే అధికారులు లక్కీ డ్రా ప్రారంభించడంపై ఎమ్మెల్యే దానం సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై మండిపడ్డారు. ఎమ్మెల్యే వచ్చే వరకు వేచి చూడకుండా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారని దానం నాగేందర్ అధికారులను నిలదీశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులను వదిలేది లేదని, వారిపై చర్యలు తీసుకునేలా ఎంత దూరమైనా వెళ్తానని దానం హెచ్చరించారు. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన దానం నాగేందర్.. కార్యక్రమం మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రాష్ట్రంలో కొత్త పథకం అమలు.. వైద్యం కోసం కిలోమీటర్లు నడవాల్సిన పనిలేదు!ఏపీSwechaa29 Aug 2026, 03:28 PM

రాష్ట్రంలో కొత్త పథకం అమలు.. వైద్యం కోసం కిలోమీటర్లు నడవాల్సిన పనిలేదు!

 ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠమైన వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెలలో పర్యటించిన ఆయన, మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలను అందించే 'ఆరోగ్య రథాలను' జెండా ఊపి ప్రారంభించారు. కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు వైద్యం కోసం మైళ్ల కొద్దీ ప్రయాణించే అవసరం లేకుండా, వారి ముంగిటకే నాణ్యమైన వైద్య సేవలను చేర్చడమే ధ్యేయంగా 'సంజీవని' కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

మరోసారి కోవిడ్ కలకలం.. 47 రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు!..InternationalSwechaa29 Aug 2026, 03:14 PM

మరోసారి కోవిడ్ కలకలం.. 47 రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు!..

అమెరికాలో మళ్లీ కోవిడ్ కలకలం మొదలైంది..! CDC తాజా అంచనాల ప్రకారం.. దేశంలోని 47 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో కొన్ని పాఠశాలలు తాత్కాలికంగా తరగతులను నిలిపివేశాయి. అయితే గతంలో 2020, 2021లో కనిపించినంత తీవ్ర పరిస్థితి ప్రస్తుతం లేదని CDC చెబుతోంది. ఆసుపత్రి చేరికలు కూడా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. అయినప్పటికీ.. కరోనా మళ్లీ విజృంభించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది..

జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో విషాద ఘటన!..క్రైమ్Swechaa29 Aug 2026, 02:36 PM

జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో విషాద ఘటన!..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో విషాదం చోటుచేసుకుంది. కొత్త కారు కొన్న ఆనందంతో పూజ చేయించేందుకు వచ్చిన ఓ కుటుంబంలో ఊహించని దుర్ఘటన జరిగింది. పూజ అనంతరం కారును ముందుకు కదిపే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ వృద్ధుడిపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

BRS: 'బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు': ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్తెలంగాణSwechaa29 Aug 2026, 02:18 PM

BRS: 'బీఆర్ఎస్ 3.0లో దయాదాక్షిణ్యాలు ఉండవు': ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్

కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆయన పలు తీవ్రమైన ప్రశ్నలను సంధించారు. కుటుంబ సభ్యుల భద్రత, కాంగ్రెస్ నేతల వీఐపీ సంస్కృతి, ఓఎస్డీ సుమంత్ కేసు విషయంలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డిలకు ఏ ప్రాతిపదికన 2+2 సెక్యూరిటీ గన్‌మెన్‌లను కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర క్యాబినెట్‌లో తక్షణ మార్పులు అవసరం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!తెలంగాణSwechaa29 Aug 2026, 01:57 PM

రాష్ట్ర క్యాబినెట్‌లో తక్షణ మార్పులు అవసరం.. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు!

తెలంగాణ రాజకీయాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విలేకరులతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన రాష్ట్ర ప్రభుత్వం, అధికార కాంగ్రెస్ పార్టీ శైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లన్నర పూర్తయిన సందర్భంలో, క్యాబినెట్‌లో తక్షణమే మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (షఫ్లింగ్) చేపట్టడం ద్వారా ప్రభుత్వానికి ఒక కొత్తదనం, నూతనోత్సాహం వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఏంటంటే?వ్యాపారంSwechaa29 Aug 2026, 01:11 PM

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. కారణం ఏంటంటే?

 గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేసిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న కీలక పరిణామాల వల్ల దేశీయంగా పసిడి, వెండి రేట్లు వరుసగా నాలుగో రోజు భారీగా పతనమయ్యాయి. శనివారం 24 క్యారెట్ల మేలిమి బంగారం 10గ్రాములపై రూ.2,890 తగ్గి రూ.1,58,240కి చేరగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ.2,650 తగ్గి రూ.1,45,050 వద్ద నిలిచింది.