స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..తెలంగాణSwechaa29 Aug 2026, 01:07 PM

సంచలనంగా మారిన మంగ్లీ విదేశీ ప్రయాణం.. ఈ ప్రశ్నలకు సమాధానం ఏది?..

మైక్రో ఫైనాన్స్ వివాదంలో గాయని మంగ్లీకి సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంగ్లీతో తాను రాజీ పడినట్లు వస్తున్న వార్తలను అడ్వకేట్ సుబ్బు ఖండించారు. కోట్ల ఆఫర్ వచ్చినా తాను లొంగలేదని, ఈ కేసులో నిజా నిజాలు తేలే వరకు మంగ్లీకి విదేశాల్లో అవకాశాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. బాధితులపై ఆంక్షలు విధిస్తున్న పోలీసులు, నిందితురాలిగా ఉన్న మంగ్లీ దేశం దాటి వెళ్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారని నిలదీశారు. ఆమెను కాపాడుతున్న ఆ కేంద్ర మంత్రి ఎవరని ప్రశ్నిస్తూ, కీలక సాక్షి అయిన డ్రైవర్ ఏమయ్యాడో చెప్పాలని సుబ్బు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.

Deepika - Raaka: 'రాకా' రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు మాడమ్..అల్లు అర్జున్ క్రేజ్ నీకంటే తక్కువా?సినిమాSwechaa29 Aug 2026, 01:03 PM

Deepika - Raaka: 'రాకా' రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారు మాడమ్..అల్లు అర్జున్ క్రేజ్ నీకంటే తక్కువా?

Deepika Padukone: లేటెస్ట్ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొన్ చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ప్రభాస్ అభిమానులు దీపికను గట్టిగానే టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంది సరే. లేనిపోని మాటలెందుకు..ఒద్దనుకుంది..ఊరుకుంటే సరిపోయేది కదా!

మోదీ, రాహుల్ తర్వాత విజయ్..! ద‌ళ‌ప‌తి మాయ ఏంటి?NationalSwechaa29 Aug 2026, 12:52 PM

మోదీ, రాహుల్ తర్వాత విజయ్..! ద‌ళ‌ప‌తి మాయ ఏంటి?

విజయ్ ఫార్ములా.. స్టార్ ఇమేజ్ + యూత్ కనెక్ట్ + కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం. ఈ మూడు కలిస్తే సోషల్ మీడియాలో ఒక నాయకుడి ఇమేజ్ ఎంత వేగంగా జాతీయ స్థాయికి వెళ్లగలదో విజయ్ ఉదాహరణగా మారుతున్నారు.

ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్‌మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!InternationalSwechaa29 Aug 2026, 12:52 PM

ట్రంప్‌నకు 'మెంటల్ ట్రీట్‌మెంట్' అవసరం.. ఇరాన్ వ్యంగ్యాస్త్రాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) అమెరికా భూభాగంగా చూపిస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోపై టెహ్రాన్ మండిపడింది. ట్రంప్ వాస్తవాలను గుర్తించలేని భ్రమల్లో బతుకుతున్నారని, ఆయనకు మానసిక నిపుణుల పర్యవేక్షణలో 24 గంటల చికిత్స అత్యవసరమంటూ ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కజెమ్ ఘరీబాబాది తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.

పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..NationalSwechaa29 Aug 2026, 12:18 PM

పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..

దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులపై మరోసారి ఇంధన భారం పడింది. ఢిల్లీ, దాని పరిసర నగరాల్లో CNG (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధర కిలోకు రూ.3.89 చొప్పున పెరిగింది. సీఎన్‍జీ ధర పెరగబోతోందని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) శుక్రవారం రాత్రి ప్రకటించగా పెరిగిన ధర ఇవాళ (శనివారం) ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.

ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డు.. పాంటింగ్ రికార్డు బ్రేక్!క్రీడలుSwechaa29 Aug 2026, 12:10 PM

ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డు.. పాంటింగ్ రికార్డు బ్రేక్!

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డును రూట్ అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు స్వదేశంలో (Home Tests) అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికీ పాంటింగ్ (7,578 పరుగులు) పేరిట ఉన్న రికార్డును, లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో జో రూట్ (7,594 పరుగులు) అధిగమించాడు.

King 100: డబ్బు లేనప్పుడు లూజర్..ఉన్నప్పుడు కింగ్..అదిరిపోయిన గ్లింప్స్సినిమాSwechaa29 Aug 2026, 12:04 PM

King 100: డబ్బు లేనప్పుడు లూజర్..ఉన్నప్పుడు కింగ్..అదిరిపోయిన గ్లింప్స్

King 100: ఈరోజు (ఆగస్టు 29) టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున పుటినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న బెంచ్ మార్క్ ఫిల్మ్ 100వ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే కటిక పేదవాడి నుంచి అపర కోటీశ్వరుడి వరకూ నాగార్జున ఎదిగిన ప్రయాణాన్ని చూపించబోతున్నట్టుగా అర్థమవుతోంది. మొత్తానికి, అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కింగ్ 100 నుంచి గ్లింప్స్ రిలీజై ఆకట్టుకుంటోంది.

కేసీఆర్ మార్కు చెరిపేసే ప్రయత్నం వికటించిందా? కళ తప్పిన స్కిల్స్ యూనివర్సిటీ..!తెలంగాణSwechaa29 Aug 2026, 11:44 AM

కేసీఆర్ మార్కు చెరిపేసే ప్రయత్నం వికటించిందా? కళ తప్పిన స్కిల్స్ యూనివర్సిటీ..!

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' (YISU) ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విజయవంతంగా నడిచిన 'తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్' (TASK) సంస్థను పక్కనపెట్టి, భారీ బడ్జెట్ వెచ్చించి తీసుకొచ్చిన ఈ కొత్త విశ్వవిద్యాలయం రెండేళ్ల కాలంలో కేవలం 1,000 మందికి మాత్రమే నైపుణ్య శిక్షణ అందించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ ఈ విఫల ప్రయోగానికి తెరలేపిందని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.

గ్రేటర్‌లో కాంగ్రెస్ బిగ్ ప్లాన్! బీఆర్ఎస్.. బీజేపీకి చెక్ పెట్టేనా?తెలంగాణSwechaa29 Aug 2026, 11:29 AM

గ్రేటర్‌లో కాంగ్రెస్ బిగ్ ప్లాన్! బీఆర్ఎస్.. బీజేపీకి చెక్ పెట్టేనా?

గ్రేటర్‌లో ఎవరు గెలుస్తారో నిర్ణయించేది కేవలం పార్టీ గుర్తు కాదు. ఎవరు ప్రజల స్థానిక సమస్యలను బలంగా పట్టుకుంటారు? ఎవరు క్యాడర్‌ను మొబిలైజ్ చేస్తారు? ఎవరి నేరేటివ్ సోషల్ మీడియాలో బలంగా వెళ్తుంది? హైడ్రా, మూసీ, ట్రాఫిక్, డ్రైనేజీ వంటి సమస్యలపై ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారు? ఇవన్నీ కీలకం.

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యం తీసుకోకపోతే నేరుగా ఖాతాల్లోకే నగదు!ఏపీSwechaa29 Aug 2026, 11:23 AM

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యం తీసుకోకపోతే నేరుగా ఖాతాల్లోకే నగదు!

ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రేషన్ డిపోల వద్ద బియ్యం తీసుకోని లబ్ధిదారులకు, వారి ఉచిత బియ్యం కోటా స్థానంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే నగదు జమ చేసే వినూత్న విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, డీలర్ల వద్ద జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఇప్పటికే గుజరాత్‌లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC) విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేస్తుండగా, ఇటీవల ఏపీ పౌరసరఫరాల శాఖ అధికారుల బృందం అక్కడ పర్యటించి అధ్యయనం చేసింది.

చిత్రం లేదు
తెలంగాణSwechaa29 Aug 2026, 11:01 AM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు!

 బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పుల కారణంగా ఉపరితల ఆవర్తనం తీవ్రమై అల్పపీడనంగా మారే సంకేతాలు స్పష్టమవుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. దీని ప్రభావంతో రానున్న కొన్ని రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా రెండు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Bigg Boss 10 Telugu: నాగ్ బర్త్ డే ట్రీట్..బిగ్ రియాలిటీ షో అప్‌డేట్ వచ్చేసిందిసినిమాSwechaa29 Aug 2026, 10:56 AM

Bigg Boss 10 Telugu: నాగ్ బర్త్ డే ట్రీట్..బిగ్ రియాలిటీ షో అప్‌డేట్ వచ్చేసింది

Bigg Boss 10 Telugu: ఈరోజు నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ మా బృందం ప్రోమోను వదిలారు. అలాగే, ఈ షో ఎప్పటి నుంచి మొదలబోతుందో కన్‌ఫర్మ్ చేశారు. ఈ సెప్టెంబర్ 6,7 తేదీలలో బిగ్ బాస్ 10 కర్టెన్ రైజర్ ఎపిసోడ్ తో గ్రాండ్ గా మొదలు పెట్టనున్నట్టు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజన్ 10 కి హోస్ట్ మారబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో ఎలాంటి మార్పూ లేదని మరోసారి నాగ్ బర్త్ డే సందర్భంగా కన్‌ఫర్మ్ చేశారు.

సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa29 Aug 2026, 10:29 AM

సుమంత్ కేసులో సంచలనాలు.. పోలీసుల తీరుపై పలు అనుమానాలు!

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్, వ్యాపారి గొంగిడి హరికృష్ణల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ, రూ.10కోట్ల వసూళ్ల వివాదంలో పోలీసుల విచారణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సుమంత్, అతడి అనుచరులను అరెస్ట్ చేయడంపైనే దృష్టి సారించిన పోలీసులు, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వసూళ్లకు సంబంధించిన లోతైన అంశాలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జూలై 30న దాడి జరిగిందని చెబుతున్న హరికృష్ణ, చాలా రోజుల ఆలస్యంగా ఫిర్యాదు చేయడం, అలాగే ఫిర్యాదు సమయంలో సీఎంతో సన్నిహిత సంబంధాలు కలిగిన కిరణ్ అనే వ్యక్తి ఆయన వెంట ఉండటం వెనుక పెద్ద రాజకీయ కోణమే దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది.

Nayanthara: నయన్‌కేమైంది అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఎంచుకుంటోంది?సినిమాSwechaa29 Aug 2026, 10:11 AM

Nayanthara: నయన్‌కేమైంది అన్నీ ఫ్లాప్ సినిమాలనే ఎంచుకుంటోంది?

Nayanthara: ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ నయనతార. ఎంత సీనియారిటీ ఉన్నా కొన్నిసార్లు ఎంచుకున్న కథలు కలిసి రాక ఫ్లాప్స్ చూడాల్సి వస్తుంది. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నయన్, ఇప్పుడు వచ్చిన రెండు సినిమాలతో ఫ్లాప్స్ చూసింది. ఆ సినిమాలే టాక్సిక్, హాయ్. వీటిలో ఒకటి పాన్ ఇండియన్ సినిమా..ఇంకోటి తమిళ సినిమా. దీంతో నయన్‌కేమైంది అని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

RayadurgamAuctions: రియల్ ఎస్టేట్ రైజింగ్ మాయ?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa29 Aug 2026, 09:22 AM

RayadurgamAuctions: రియల్ ఎస్టేట్ రైజింగ్ మాయ?

రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 83/1 బంగారు గని. అందరి కళ్లు రాయదుర్గం పైనే అంటూ 15 రోజుల క్రితం స్వేచ్ఛ న్యూస్ కథనం ఇచ్చింది. అందుకు ఆ సర్వే నెంబర్స్‌లో ఉన్న లిటిగేషన్స్‌పై నిఘా ఉంచుతామని కూడా స్పష్టం చేసింది. అనుకున్నట్లే వారం వ్యవధిలోనే ఎకరం రూ.5 కోట్లు అదనంగా ప్రభుత్వ భూమి రేటు పెరిగింది. రెవెన్యూ మంత్రి గతంలో ప్రభుత్వం వేలంలో కొనుగోలు చేసిన భూములను సైతం ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి దందా చేయాలనుకున్నారు.

Suicide: విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..క్రైమ్Swechaa29 Aug 2026, 09:06 AM

Suicide: విశాఖలో కలకలం.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!..

విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులతో రాఖీలు కట్టించుకున్న ప్రవీణ్ కుమార్.. రాత్రి సమయంలో ఉరివేసుకుని మరణించగా.. అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు విషపదార్థం తిని ఆత్మహత్య చేసుకున్నారు.

NepalFloods: సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!NationalSwechaa29 Aug 2026, 08:59 AM

NepalFloods: సాయం వద్దని.. 24గంటల్లోనే మాట మార్చిన నేపాల్!

భారీ ఆకస్మిక వరదలతో కకావికలమైన నేపాల్ ప్రభుత్వం తన గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సహాయక చర్యల కోసం విదేశీ బలగాలు అవసరం లేదని 24గంటల ముందే స్పష్టం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా పెరిగిన దౌత్య ఒత్తిడి కారణంగా తన వైఖరిని సవరించుకుంది. భోటేకోశీ పరివాహక ప్రాంతాల్లో వందలాది మంది విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో, సాంకేతిక, ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల బృందాలను మాత్రమే తమ దేశంలోకి అనుమతించేందుకు నేపాల్ సర్కార్ సానుకూలంగా స్పందించింది.

కంటికి కనిపించే ఈ జగత్తు నిజమా? లేక భ్రమనా?..SpiritualitySwechaa29 Aug 2026, 08:24 AM

కంటికి కనిపించే ఈ జగత్తు నిజమా? లేక భ్రమనా?..

ఆథ్యాత్మికత హైందవ ధర్మానికి దొరికిన అనంతమైన నిధి అని అంటారు.. ఈ భూమి పుట్టిన మొదలు నుండి నేటి వరకు కాలచక్రం తిరుగుతుంది. పగలు రాత్రి మారుతుంది.. జనన మరణాలు అన్నీ జీవులలో జరుగుతుంది. మానవ జీవన విధానంలో సైతం ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.. అయిన ఈ సృష్టిలో ఎన్నో రహస్యాలు ఇంకా అంతుచిక్కకుండా ఉన్నాయి. వాటిలో కొన్ని మనిషిని భ్రమలో జీవించేలా చేస్తున్నాయి..

అయితే మనిషి ఎంత ఎదిగినా కానీ మన కళ్లకు కనిపించే రూపాలు, చెవులకు వినబడే శబ్దాలు, మనం అనుభవించే సంతోషాలు, బాధలు... ఇవన్నీ నిజమే అని మన శరీర ఇంద్రియాలు నిరంతరం నమ్మిస్తూనే ఉంటాయి. కానీ, మన సనాతన ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబు మనల్ని ఆధ్యాత్మిక లోతుల్లోకి తీసుకెళ్తుంది.

పరమేశ్వరుని తత్త్వం మనిషికి ఏం నేర్పుతుంది?SpiritualitySwechaa29 Aug 2026, 08:10 AM

పరమేశ్వరుని తత్త్వం మనిషికి ఏం నేర్పుతుంది?

శివుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు అనే పదాలు రూపం లేని ఆ పరంజ్యోతికి లయకారకుడైన మహాదేవుడిలోని వేర్వేరు భక్తి భావాలను తెలియజేస్తాయి. శివుడు అంటే అత్యంత మంగళకరమైనవాడని.. ఈశ్వరుడు అంటే సమస్త విశ్వాన్ని పరిపాలించే సర్వశక్తిమంతుడని.. పరమేశ్వరుడు అంటే దేవతలకు కూడా దేవుడైన మహాదేవుడని ఆథ్యాత్మిక గ్రంధాలు బోధిస్తాయి.. త్రినేత్రుడిగా పిలవబడుతున్న ఆ శ్మశాన నివాసి జీవితం ఎంతో లోతైన తత్వాన్ని తెలియజేస్తుంది. జ్ఞానులు మాత్రమే దర్శించగలిగే అంత నిగూఢమైన సత్యం ఆయన ప్రతి రూపంలోనూ దాగుంది. శరీరానికి బూడిద పూసుకునే దిగంబరుడు... సమస్త బంధాలు, భౌతిక వ్యామోహాలు తాత్కాలికమేనని గుర్తుచేస్తాడు. కాళకూట విషాన్ని గొంతులో దాచిన నీలకంఠుడు... లోక కళ్యాణం కోసం త్యాగానికి ప్రతిరూపంగా నిలుస్తాడు. అలాగే సృష్టి, స్థితి, లయలను తనలో ఇముడ్చుకున్న ఆ ఈశ్వర తత్త్వం మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప సత్యాలను తెలియచేస్తుంది.

భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?InternationalSwechaa29 Aug 2026, 12:04 AM

భాగవత్ సభకు అమెరికాలో ఆటంకాలు.. అసలేం జరుగుతోంది?

భాగవత్ న్యూయార్క్ వేదికపై ఏం మాట్లాడబోతున్నారన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఆర్‌ఎస్ఎస్ భావజాలంపై వస్తున్న విమర్శలకు ఆయన నేరుగా స్పందిస్తారా? అమెరికాలోని భారతీయ సమాజానికి ఏం సందేశం ఇస్తారు? హిందూ ఐక్యత, భారతీయ సంస్కృతి, ప్రపంచ శాంతి, మత సామరస్యం వంటి అంశాలపైనే దృష్టి పెడతారా?

అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!తెలంగాణSwechaa28 Aug 2026, 11:27 PM

అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!

ఈసారి అసెంబ్లీ సమావేశాలపై గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ కూడా కనిపించే అవకాశం ఉంది. హైదరాబాద్‌పై పట్టు సాధించడం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత కీలకం. అందుకే నగరానికి సంబంధించిన ఏ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినా.. దానికి రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది.

Irumudi Director: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?సినిమాSwechaa28 Aug 2026, 11:21 PM

Irumudi Director: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?

Shiva Nirvana: ఇప్పుడు ముగ్గురు హీరోలు శివ నిర్వాణతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారట. వారిలో అక్కినేని నాగ చైతన్య ముందు ఉన్నాడని తెలుస్తోంది. గతంలో చైతూ-శివ నిర్వాణ కలిసి మజిలీ సినిమాను చేసి భారీ హిట్ అందుకున్నారు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించడం విశేషం. ఇక, కోలీవుడ్ నుంచి సూర్య, ధనుష్ కూడా ఇరుముడి సినిమా చూసి ఈ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురుపించడమే కాదు, కథ ఉంటే రమ్మని కూడా ఆఫర్ చేశారట. ధనుష్, సూర్య ఇద్దరు తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసి హిట్ కొట్టినవారే.

Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!సినిమాSwechaa28 Aug 2026, 10:50 PM

Deepika Padukone: అందుకే స్పిరిట్ నుంచి అవుట్..ప్రభాస్‌నే అవమానించిందిగా!

Deepika Padukone: తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక స్పిరిట్ నుంచి ఎందుకు తప్పుకుందో ఓపెన్‌గానే చెప్పింది. "ఆ మధ్య ఓ పెద్ద హీరో సినిమా నుంచి తప్పుకున్నాను..ఆ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో నాకు తెలుసు. నాకున్న మార్కెట్ ఏంటో నాకు తెలుసు. అందుకే, ఆ హీరోతో సమానంగా రెమ్యునరేషన్ అడిగాను. నిజానికి, మార్కెట్లో ఆ హీరో కంటే నాకే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అందుకు తగ్గట్టే నా రెమ్యునరేషన్ చెప్పాను. కానీ, మేకర్స్ అంత బడ్జెట్ లేదన్నారు. అందుకే, ఆ ప్రాజెక్ట్ నుంచి వాకౌట్ చేశానని చెప్పింది. ఇదంతా కూడా ప్రభాస్ గురించి అని డార్లింగ్ ఫ్యాన్స్ కి అర్థమైంది.

ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లుతెలంగాణSwechaa28 Aug 2026, 10:44 PM

ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరా రూ.269 కోట్లు

Raidurg Lands: హైదరాబాద్‌ రాయదుర్గం భూములు కాసుల పంట పండిస్తున్నాయి. ఇక్కడి భూములు మరోసారి రికార్డ్ ధరలు పలికాయి. రాయదుర్గంలో తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్లకు అమ్ముడైంది. వారం రోజుల క్రితం (ఈ నెల 21) ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.264 కోట్లు పలకగా.. తాజాగా ఆ రికార్డ్ బద్దలైంది.

సమగ్ర, లోతైన విశ్లేషణతోనే నేరాల నియంత్రణ-డీజీపీ సీవీ ఆనంద్తెలంగాణSwechaa28 Aug 2026, 10:18 PM

సమగ్ర, లోతైన విశ్లేషణతోనే నేరాల నియంత్రణ-డీజీపీ సీవీ ఆనంద్

DGP CV Anand: అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు డీజీపీ సీవీ ఆనంద్. నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. నేరాల సమీక్షను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా ప్రతి నేరం వెనుక కారణాలు, దర్యాప్తు తీరు, ఆయా కేసుల పరిష్కారాన్ని సమగ్రంగా విశ్లేషించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో గతంలో 70 నుంచి 80 శాతంగా ఉన్న సీసీటీఎన్‌ఎస్‌ డేటా అప్‌డేట్‌.. అధికారులు, సిబ్బంది కృషితో 96 శాతానికి చేరడం అభినందనీయం అని డీజీపీ అన్నారు.

Ravi Teja - Vivek: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా 'ఇరుముడి' ఎఫెక్టే!సినిమాSwechaa28 Aug 2026, 10:03 PM

Ravi Teja - Vivek: హర్రర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్..ఇదంతా 'ఇరుముడి' ఎఫెక్టే!

Ravi Teja - Vivek: వివేక్ ఆత్రేయ చెప్పిన హర్రర్ కథ కూడా మన మాస్ రాజాకి నచ్చేసింది. కానీ, నిర్మాతలే లేక ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఇక, ఇరుముడి కొట్టిన భారీ సక్సెస్‌తో ఈ సినిమాకి నిర్మాతలు దొరికారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా, విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేశారు.

Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..తెలంగాణSwechaa28 Aug 2026, 08:52 PM

Telangana: పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు!..

SIR ప్రక్రియలో సాధారణ ఓటరైనా, ప్రజాప్రతినిధైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని ఈ సంఘటన నిరూపించింది.. ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పులను గుర్తించడం, వాటిని ఆధారాలతో సరిచేయడం ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం.. అందుకే ఓటర్ల జాబితా కచ్చితంగా ఉండేలా చూడటమే SIR ప్రక్రియ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు.. ఇక తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారి (BLO) నోటీసులు జారీ చేశారు. మంత్రి ఓటర్ గుర్తింపు కార్డులో ఆయన తండ్రి పేరు తప్పుగా నమోదు కావడమే దీనికి కారణంగా తెలుస్తుంది..

వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్ఏపీSwechaa28 Aug 2026, 08:35 PM

వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టంట్

Ambati Rambabu: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. గుండెకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం అంబటి రాంబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

Toxic - Geethu Mohandas: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!సినిమాSwechaa28 Aug 2026, 07:25 PM

Toxic - Geethu Mohandas: ఏం తీయాలో క్లారిటీ లేకపోతే టాక్సిక్ లాంటి టార్చరే చూడాల్సి వస్తుంది!

Toxic: గీతూ మోహన్ దాస్ కి అసలు అనుభవమే లేదని టాక్సిక్ సినిమా చూసిన ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఆమె మాటల్లో కూడా అదే వినిపించింది. అసలు, యష్ లాంటి హీరో డేట్స్ ఇస్తే ఇలాంటి టార్చర్ సినిమాను ఎవరైనా తీస్తారా? తీసారు ఎందుకు తీయరు..గీతూ మోహన్ దాస్ లాంటి వారున్నారుగా..ఇదే ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఆమె ఎలాంటి కథ చెప్పాలనుకుంది..ఎందుకు చెప్పాలనుకుంది.! ముందు ఈ విషయంలోనే ఆమెకి క్లారిటీ లేదు.

ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు..ఏపీSwechaa28 Aug 2026, 07:19 PM

ప్రత్యక్ష ఎన్నికలు జగన్‌కు ఇష్టం లేదు..

Cm Chandrababu: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. తాజాగా వైసీపీ అధినేత జగన్ టార్గెట్ గా సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు జరగడం గొడ్డలి పార్టీ నాయకుడికి ఇష్టం లేదు అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.