స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..ఏపీSwechaa28 Aug 2026, 06:49 PM

జగన్ కు తలనొప్పిగా మారిన లోకల్ వార్!..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక సమరానికి తెరలేస్తోంది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష వైసీపీ నేతలకు తీవ్రమైన టెన్షన్ తెచ్చిపెడుతున్నట్టు పొలిటికల్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ముఖ్యంగా రాష్ట్రంలో పదహారు కార్పొరేషన్లలో మేయర్ స్థానాలు, పలు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ అభ్యర్థుల ఎంపిక వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జులకు నిద్రలేకుండా చేస్తోందని చర్చించుకుంటున్నారు.. మేయర్, ఛైర్మన్ ఎన్నికలు నేరుగా ప్రజల ద్వారా జరిగే ప్రత్యక్ష పోరు కావడంతో, ప్రలోభాలకు లొంగకుండా చివరి నిమిషం వరకూ పోరాడే బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటి నుండే ఆరా తీస్తున్నట్టు చెప్పుకొంటున్నారు.. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని స్థానిక ఎన్నికల్లో ఎదుర్కోవడం వైసీపీకి అంత తేలిక కాదు. రాబోయే మూడేళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది కాబట్టి.. అభివృద్ధి పనులు జరగాలంటే అధికార పార్టీ నేతలను గెలిపించుకోవడమే మేలని ప్రజలు భావించే అవకాశాలున్నాయి.

Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?సినిమాSwechaa28 Aug 2026, 06:32 PM

Toxic: వంద కోట్ల లాసైనా భరించాల్సింది వాళ్ళిద్దరే?

Toxic: యష్..వెంకట్‌లతో దిల్ రాజు ముందుగానే తెలివిగా ఒప్పందం చేసుకున్నాడట. సినిమా లాస్ అయితే, 45 రోజుల్లో డబ్బు తిరిగి ఇచ్చేసేలా మాట్లాడుకున్నారట. దిల్ రాజు కూడా అలాగే, 45 రోజుల్లో బయ్యర్స్ కి డబ్బు రిటన్ ఇస్తానని ప్రామిస్ చేశాడట. కాబట్టి, టాక్సిక్ ఫ్లాప్ అవడం వల్ల నష్టాలను మోసేది నిర్మాతలు వెంకట్, యష్ మాత్రమే. మిగతావారంతా సేఫ్. యష్ కి రామాయణ సినిమాలో వాటా ఉంది. అది, హిట్ అయితే లాభాలలో వాటా అందుతుంది. టాక్సిక్ కూడా ఇంతే. కానీ, టాక్సిక్ వల్ల నష్టాలు తప్పవంటున్నారు.

గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!సినిమాSwechaa28 Aug 2026, 06:29 PM

గ్రేట్ బయోపిక్‌లో ఛాన్స్! ఈ ఒక్కటి చేస్తే చాలు!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నకి ఓ గొప్ప బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం దక్కినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ సరసన రణబాలి మూవీ చేస్తోంది. అలాగే, మైసా అనే మరో ఫీమేల్ సెంట్రిక్ మూవీలోనూ నటిస్తోంది రష్మిక, ఈ సినిమా షూటింగ్ సమయంలో గాయం కారణంగానే రెండు నెలలపాటు బ్రేక్ తీసుకుంది. అయితే, తాజా సమాచారం మేరకు లెజండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాంతెలంగాణSwechaa28 Aug 2026, 05:42 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం

Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఫైర్ అయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. రెండూ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు మర్చిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేస్తామని ప్రగల్బాలు పలికి.. విషాద నగరంగా మార్చారని ధ్వజమెత్తారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో బీజేపీదే విజయం అని విశ్వాసం వెలిబుచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ విధానాలకు ఆకర్షితులై పలువురు మేధావులు, విద్యావంతులు, ప్రముఖులు తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీ బలోపేతానికి సమన్వయంతో కృషి చేయాలని కార్యకర్తలంతా పిలుపునిచ్చారు రాంచందర్ రావు.

Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?సినిమాSwechaa28 Aug 2026, 05:22 PM

Bhagyashri Borse: హిట్ పడ్డా ఛాన్సులు లేవే? భాగ్యశ్రీ ప్లాన్స్ ఎంటో?

Bhagyashri Borse: ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో ఒకే ఒక్క సినిమా అఫీషియల్‌గా ఉంది. అది కూడా తమిళ సినిమా 'సేయాన్'. 'లెనిన్' లాంటి భారీ హిట్ తర్వాత కూడా భాగ్యశ్రీకి ఎందుకనో తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. వచ్చినా ఆమె మంచి సినిమా చేయాలని ఒప్పుకోవడం లేదా..లేక ఒకే ఒక్క హిట్ కదా..అని మేకర్స్ ఆలోచిస్తున్నారా తెలియదు. చూడాలి, మరి భాగ్యశ్రీకి రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో. ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నదాని ప్రకారం జార్జి క్రిష్‌లో తానే హీరోయిన్ అని. అధికారికంగా మాత్రం ఏ కన్‌ఫర్మేషన్ లేదు.

బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..తెలంగాణSwechaa28 Aug 2026, 05:19 PM

బీసీ-ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!..

విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ విడతలో 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుంది. మొత్తం 350 మందిలో 250 మంది బీసీ విద్యార్థులు ఉంటారు. మరో 100 మంది ఈబీసీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఇందిరమ్మ ఇళ్లు.. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చుతెలంగాణSwechaa28 Aug 2026, 04:28 PM

ఇందిరమ్మ ఇళ్లు.. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు

Indiramma Houses: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోందన్నారు. మరో 10 రోజుల్లో రెండో విడత లబ్దిదారుల జాబితా విడుదల చేస్తామన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి రెండు మూడు రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు లక్కీ డ్రాలో మంత్రి పాల్గొన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతలో భాగంగా 7,350 ఇళ్ల కేటాయింపులకు సంబంధించి లక్కీ డ్రా ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పాదర్శకంగా నిర్వహిస్తోందని మంత్రి వెల్లడించారు.

నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..ఏపీSwechaa28 Aug 2026, 04:21 PM

నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం!..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా ప్రముఖ నటుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు బాధ్యతలను స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తన భార్య పద్మజతో కలిసి పాల్గొన్న ఆయన... వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజల నడుమ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం వేదపండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు.

నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..InternationalSwechaa28 Aug 2026, 03:56 PM

నేపాల్ వరదలపై ముందే హెచ్చరికలు!..

నేపాల్ ఆకస్మిక వరదలపై ఐదు నెలల ముందే ప్రమాద ఘంటికలు మోగినట్టు కథనాలు వెలువడుతున్నాయి.. ఖాట్మండు కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ ఈ ఏడాది మార్చిలోనే హిందూకుష్ హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయని రెండు నివేదికల ద్వారా హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతుంది.. మరోవైపు 2000 సంవత్సరం నుంచి హిందూకుష్ హిమాలయాల్లో మంచు కరిగే వేగం రెట్టింపు అయిందని ఐసీఐఎంఓడీ తాజాగా నివేదిక వెల్లడించింది.. 1975 నుంచి ఇప్పటివరకు దాదాపు 27 మీటర్ల మంచు పొర కరిగిపోయిందని, 1990-2020 మధ్య కాలంలో ఈ ప్రాంతంలోని హిమానీనదాలు తమ మొత్తం విస్తీర్ణంలో 12 శాతం, మంచు నిల్వల్లో 9 శాతాన్ని కోల్పోయినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని, ఈ విపత్తును ఆపడం సాధ్యం కాకపోవచ్చని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది.

దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!NationalSwechaa28 Aug 2026, 03:10 PM

దేశమంతా రక్షాబంధన్ వేడుకలు.. ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు!

 తోబుట్టువుల మధ్య ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ పండుగను దేశవ్యాప్తంగా శుక్రవారం (ఆగస్టు 28) అత్యంత వైభవంగా నిర్వహించారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రక్షా సూత్రాలు కట్టి వారి శ్రేయస్సును ఆకాంక్షించగా, సోదరులు వారికి రక్షణగా ఉంటామని మాట ఇస్తూ బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆత్మీయంగా రాఖీలు కట్టారు.

చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..InternationalSwechaa28 Aug 2026, 02:55 PM

చరిత్రలోనే భయానక విషాదం.. ఓడిపోతున్న మానవ మేధస్సు!..

మనిషి అభివృద్దిలో ఎంత ఎదిగినా.. ప్రకృతి ముందు ఒడిపోతూనే ఉన్నాడు.. మరణాన్ని జయించే దిశగా ప్రయోగాలు జరుగుతున్న.. ప్రకృతి సృష్టించే విపత్తుల ముందు తన తెలివి, తన బలం, ఈ టెక్నాలజీ నిలవలేక పోతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను పేర్కొనవచ్చు.. వందల సంవత్సరాల అభివృద్దిని సైతం ఒక బలమైన ప్రకృతి ప్రకోపానికి నామ రూపాలు లేకుండా పోవచ్చు.. అంటే మానవుడు మేధస్సులో ఉన్నతుడైన ప్రకృతి ముందు బలహీనుడే అని ఎప్పటికప్పుడు ఈ వైఫ్యల్యాలు నిరూపిస్తున్నాయి..

ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం  : హరీశ్ రావుతెలంగాణSwechaa28 Aug 2026, 02:49 PM

ప్రతిపక్షాలు, ప్రజలపై పోలీసుల జులుం : హరీశ్ రావు

రాష్ట్రంలో కొనసాగుతున్న పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసుల దాడులు క్షమించరానిదని పేర్కొన్నారు. ‘మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడు. నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు. నేడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై CI దౌర్జన్యం.సీఎం రేవంత్ రెడ్డి.. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా? ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం.. ప్రజలపై పోలీసులతో జులుం.. ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులు.. హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన?’ అంటూ ప్రశ్నించారు.

నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్ఏపీSwechaa28 Aug 2026, 02:31 PM

నాన్న నువ్వు జాగ్రత్త.. దంపతుల ఆఖరి మాటలు వైరల్

ఏపీలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సమాచారం. అయితే, దంపతులు చనిపోయే ముందు తమ మూడేళ్ల పాపను స్కూటీ మీదే వదిలేసి నీళ్లలోకి దూకినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి(29), శిరీష(28) దంపతులకు మూడేళ్ల పాప ఉన్నది. వీరికి ఆరేళ్ల కిందట వివాహం అవ్వగా.. ఉపాధి కోసం సాయి కృష్ణ హైదరాబాద్‌కు వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. అక్కడ అప్పుల పాలు అయినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం భీమవరంలోని బంధువుల ఇంటికి సాయికృష్ణ ఫ్యామిలీతో వచ్చినట్టు సమాచారం.ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడ బ్రిడ్జి వద్దకు కుటుంబంతో కలిసి చేరుకున్న సాయి.. తన కూతురిని స్కూటీ మీద వదిలేసి భార్యాభర్త ఇద్దరూ గోదావరిలోకి దూకేశారు.

ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!క్రీడలుSwechaa28 Aug 2026, 02:22 PM

ఫుల్ జోష్‌లో టీమిండియా.. లంకపై సిరీస్ గెలుపుతో గిల్ ఆనందం!

 శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకోవడంతో టీమిండియా ఫుల్ జోష్‌లో ఉంది. ఈ విజయం పట్ల భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, ఈ పర్యటన ద్వారా భారత జట్టుకు పలువురు అత్యుత్తమ యువ ఆటగాళ్లు దక్కారని కొనియాడాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో దేవ్‌దత్ పడిక్కల్, బౌలింగ్‌లో మానవ్ సుతార్ చూపించిన అద్భుత ప్రదర్శనలు టీమిండియాకు కొత్త బలాన్నిచ్చాయని వ్యాఖ్యానించాడు.

కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!తెలంగాణSwechaa28 Aug 2026, 02:09 PM

కోదాడలో సీఐ దాష్టీకం.. మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం!

తమ జీవనాధారం తొలగించారని, న్యాయం చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా దుకాణాల తొలగింపును నిరసిస్తూ బాధితులు నిరసనకు దిగారు. ఆ ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలికి చేరుకున్న కోదాడ టౌన్‌ సీఐ శివశంకర్‌.. ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్‌పై దాడికి పాల్పడినట్టు సమాచారం.అతన్ని అందరి ముందే నెట్టేయడంతో బాధితుడు కిందపోయిన దృశ్యాలు వీడియోలో స్పష్టం కనిపిస్తోంది. బాధితులతో సీఐ ప్రవర్తించిన తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జీవనాధారం కోల్పోయిన వారు నిరసన చేస్తే ఇలాగేనా వారితో ప్రవర్తిస్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా సీఐ శివశంకర్ తీరును ఎండగడుతున్నారు.

బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!ప్రపంచంSwechaa28 Aug 2026, 02:08 PM

బాస్ కాదు అంతకు మించి.. ప్రమోషన్లను నిర్ణయిస్తున్న ఏఐ!

కార్పొరేట్ ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలంటే సాధారణంగా మేనేజర్లు, హెచ్‌ఆర్ (HR) టీమ్‌ల నిర్ణయాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త మార్క్ లోర్‌కు చెందిన ప్రముఖ ఫుడ్-టెక్ దిగ్గజం ‘వండర్’ (Wonder) కంపెనీలో మాత్రం ఈ కీలక బాధ్యతలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థకు అప్పగించారు. మానవ మాత్రులకు ఉండే పక్షపాతాలు, వ్యక్తిగత విద్వేషాలకు తావులేకుండా కేవలం పనితీరు, డేటా ఆధారంగా ప్రమోషన్లను ఖరారు చేసేందుకు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

TG: మైన్స్ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!క్రైమ్Swechaa28 Aug 2026, 01:51 PM

TG: మైన్స్ఏడీ జయరాజ్‌కు 14రోజుల రిమాండ్!

భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (Mines AD) జయరాజ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, లెక్కింపునకు మించి ఉన్న భారీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ఉదయం ఆయనను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించడంతో అధికారులు ఆయనను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.

సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?తెలంగాణSwechaa28 Aug 2026, 01:49 PM

సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన కొండా సురేఖ.. పదవీ గండం గట్టెక్కినట్టేనా?

తన కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిన మంత్రి కొండా సురేఖకు పదవీ గండం పొంచి ఉన్న విషయం తెలిసిందే. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మంత్రి కొండా.. తన కూతురు సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని,వాటితో తనకు సంబంధం లేదని కమిటీ పెద్దలకు సమాధానం ఇచ్చారు. మంత్రి వివరణపై క్రమశిక్షణా కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దీంతో మంత్రి పదవి నుంచి కొండాను తప్పించాలని పార్టీ అధిష్టానానికి క్రమశిక్షణా కమిటీ రిపోర్టు పంపించినట్టు తెలిసింది. ఇదిలాఉండగా, ఇవాళ రాఖీ పండుగ కావడంతో మంత్రి కొండా సురేఖ, మరో మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు బంగారు రాఖీ కట్టారు. దీంతో ఆమెకు పొంచి ఉన్న పదవీ గండం తప్పినట్టేనా? అని ప్రచారం జరుగుతోంది.

ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)ఏపీSwechaa28 Aug 2026, 01:16 PM

ఉపాధ్యాయుడిని వెంబడించి మరీ యువకుల దాడి.. (వీడియో)

ఏపీలో కొందరు యువకులు రెచ్చిపోయారు. ఉపాధ్యాయుడు అనే గౌరవం లేకుండా వెంబడించి మరీ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడులో చోటుచేసుకుంది. గుంటూరు నుంచి పెదకూరపాడుకు వెళ్తున్న ఉపాధ్యాయుడు జంపని నరేష్ బాబును కొందరు యువకులు వెంబడించి మరీ ఆపారు. అయితే, రెండు కార్లు స్వల్పంగా ఢీకొనడంతోనే ఈ వివాదం నెలకొన్నట్టు సమాచారం. గొడవ చేయొద్దని కూర్చుని మాట్లాడుకుందామని సదరు ఉపాధ్యాయుడు చెబుతున్నా..సదరు యువకులు వినకుండా కారును వెంబడించినట్టు తెలిసింది. పాఠశాల రహదారిలో ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి మరీ ఉపాధ్యాయుడిని కారులో నుంచి కిందకు లాగి దాడికి పాల్పడినట్టు సమాచారం. చేతులతో, కొబ్బరి మట్టలతో దాడికి పాల్పడినట్టు తెలిసింది.

ChinaEarthquake: 5.1 తీవ్రతతో  చైనాలో భారీ భూకంపం!InternationalSwechaa28 Aug 2026, 01:02 PM

ChinaEarthquake: 5.1 తీవ్రతతో చైనాలో భారీ భూకంపం!

దక్షిణ చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం సిచువాన్ ప్రాంతంలోని లాంగ్‌చాంగ్ (Longchang) నగరాన్ని కేంద్రంగా చేసుకుని ఈ భూకంపం వచ్చినట్లు అంతర్జాతీయ భూకంప పరిశోధన సంస్థలు వెల్లడించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైందని చైనా ఎర్త్‌క్వాక్ నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) అధికారికంగా స్పష్టం చేసింది. లాంగ్‌చాంగ్ నగర పరిధిలో భూమికి దాదాపు 13 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని (Epicenter) గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.సినిమాSwechaa28 Aug 2026, 12:45 PM

Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం.

Sharwanand Bhogi: ‘భోగి’ నుంచి రాఖీ లుక్..ఈసారి శర్వా గట్టిగా కొట్టేయడం ఖాయం. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే అదే అర్థమవుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. డింపుల్ హయాతి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనట్టుగా తెలుస్తోంది. ఈరోజు రాఖీ పండుగ. ఈ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

రాఖీకి ‘స్పెషల్’ బాదుడు.. ఇదేం దోపిడీ అంటున్న ప్యాసింజర్స్తెలంగాణSwechaa28 Aug 2026, 12:44 PM

రాఖీకి ‘స్పెషల్’ బాదుడు.. ఇదేం దోపిడీ అంటున్న ప్యాసింజర్స్

రాష్ట్రంలో ఓ వైపు పండుగ వాతావరణం కనిపిస్తుంటే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయివేట్ వాహనాల్లో వెళితే భద్రత ఉండదని భావించి టీజీఎస్‌ఆర్టీని నమ్ముకున్న ప్యాసింజర్స్‌ జేబులకు మాత్రం చిల్లు పడుతోంది. మొన్నటివరకు ఉన్న సాధారణ చార్జీల కంటే ఇవాళ ఎక్కువ వసూలు చేస్తున్నారని ప్యాసింజర్స్ గగ్గోలు పెడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులకు ‘స్పెషల్’ అని బోర్డులు పెట్టి విపరీతంగా దోచేస్తున్నారని మండిపడుతున్నారు. ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సులో చార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు రూ. 290 టికెట్ చార్జ్ చేయగా.. రాఖీ రోజున రూ.400 వసూలు చేస్తున్నట్టు ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పండుగల పేరుతో ఆర్టీసీ ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతున్నదని, దానికి సంబంధించిన టికెట్ ఫేర్, డ్రైవర్ వాయిస్‌ను వీడియో తీసి ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.

భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!InternationalSwechaa28 Aug 2026, 12:22 PM

భారీ వరదలు.. నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇతర దేశాలతో కలిపి భారత్‌కు షాక్!

 భారీ ఆకస్మిక వరదలతో అల్లాడిపోతున్న నేపాల్ ప్రభుత్వం ఒక అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు, రెస్క్యూ చర్యలలో విదేశీ బృందాల సాయాన్ని తీసుకోకూడదని నిర్ణయించింది. తమ దేశ భద్రతా బలగాలు మాత్రమే సహాయక చర్యలు చేపట్టగలవని స్పష్టం చేస్తూ, భారత్, చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలు పంపిన రెస్క్యూ సహాయ ప్రతిపాదనలను తిరస్కరించింది.  తాజా సమాచారం ప్రకారం.. ఈ విపత్తులో ఇప్పటివరకు 469 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు వెయ్యి మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa28 Aug 2026, 12:12 PM

కార్పొరేట్ చేతికి కర్రెగుట్టలు !

ములుగు జిల్లా వెంకటాపురం -వాజేడు సరిహద్దుల కర్రె గుట్టలో MEIL, Greenko కి దారులు తెరుచుకున్నాయి. సోలార్ , స్టోరేజీ పేరుతో ఒప్పందాలు చేసుకుని అక్కడ తిష్టవేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. కర్రె గుట్టలు అంటే ఒట్టి ఖాళీ కొండలు కాదు. తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దు, 60 కిలోమీటర్ల పొడవు. 10 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు, 20 గుట్టలు, జలపాతాలు , గుహలు, ఇరుకు లోయలు, డోలి గుట్ట తెలంగాణలోనే అత్యంత ఎత్తైనా పాయింట్లలో ఒక్కటి. సముద్రానికి 980 మీటర్ల ఎత్తు ఉంటుంది. గోదావరి పరివాహాక ప్రాంతం వీటన్నింటిని ఇన్నాళ్లు మావోయిస్టలు వాళ్ల తుపాకులతో కాపాడారు. మావోయిస్ట్ ఫ్రీ స్టేట్ గా ప్రకటనల ఎప్పుడైనా వస్తుందనే ఆశతో 2025లో లెక్కలు కుదుర్చుకున్నారు.

బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..ఏపీSwechaa28 Aug 2026, 12:10 PM

బాలికను కిడ్నాప్ చేసిన యువతీ, యువకుడు..

ఏపీలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలికను ఓ యువతి, యువకుడు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్రంలో వరుసగా క్రైమ్ ఘటనలు జరుగుతుండటం అక్కడి పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. విజయవాడకు చెందిన సయ్యద్ అబ్దుల్ హఫీజ్ గని, సయ్యద్ శేషమ్మ భార్యాభర్తలు..వీరు దుకాణల్లో ధూపం వేస్తూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖ వచ్చి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అక్కడే ఎదురుగా ఉన్న బస్టాప్‌లో రాత్రిపూట వారి అమ్మాయి(4)తో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించారు.అయితే, అదే సమయంలో ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను ఓ యువతీ,యువకుడు కిడ్నాప్ చేసినట్టు తెలిసింది.

భారీగా పతనమైన బంగారం ధరవ్యాపారంSwechaa28 Aug 2026, 11:58 AM

భారీగా పతనమైన బంగారం ధర

గతనెల రోజులుగా బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూనే పోతున్నాయి. ఫలితంగా బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు జంకుతున్నారు.ఆషాఢం సేల్ పూర్తవడంతో ఆఫర్లు కూడా పెద్దగా లేవు. మరోవైపు శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది. దీంతో బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి వరుసగా షాకులు తగిలాయి. ఈ క్రమంలోనే తాజాగా పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. రాఖీ పండుగ వేళ బంగారం ధరలు దొగొచ్చాయి. తాజాగా తగ్గిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.3,160 తగ్గగా రూ.1,59,820 వద్దకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ గోల్డ్ విషయానికొస్తే 10 గ్రాములపై రూ.2,900 మేర తగ్గి రూ.1,46,500 కు చేరుకుంది.

రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!వ్యాపారంSwechaa28 Aug 2026, 11:29 AM

రూ.22 వేల కోట్ల అప్పు.. రూ.6.5 కోట్లకే సెటిల్‌మెంట్!

బ్యాంకుల నుంచి రూ. వేల కోట్ల అప్పు తీసుకుని ఎగ్గొట్టే వారు క్రమంగా పెరుగుతున్నారు.దేశంలో ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులను ముంచిన వారి చిట్టా చాలానే ఉంది. తాజాగా దేశంలో మరో డిఫాల్టర్ వెలుగులోకి వచ్చారు. ఏకంగా రూ.22 వేల కోట్లు బ్యాంకులకు ఆయన అప్పుపడినట్టు తెలిసింది. అయితే, కేవలం రూ.6.5 కోట్లకే బ్యాంకులతో సెటిల్‌మెంట్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అంగీకరించడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకివెళితే.. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర రుణాల చెల్లింపు విషయంలో దివాళా తీశారు. ఆయన చేసిన రూ.22,006.57 కోట్లు అప్పు తీర్చలేక చేతులెత్తేశాడు. దీంతో దీంతో బ్యాంకులు ఏకంగా 99.97 శాతం మేర తమ డబ్బులను కోల్పోనున్నాయి.

ఇవాళ జనసేన కీలక భేటీ..! లోక‌ల్ ఎన్నిక‌ల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?ఏపీSwechaa28 Aug 2026, 11:26 AM

ఇవాళ జనసేన కీలక భేటీ..! లోక‌ల్ ఎన్నిక‌ల్లో.. పవన్ కొత్త లెక్క ఏంటి?

ఈ స‌మావేశానికి పవన్ కల్యాణ్ వ‌స్తారో రారో తెలియ‌దు. ఆయన సూచనలు, ఆదేశాలను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతలకు వివరించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ కూడా ఇదే రోజు సమావేశం కానుంది.

తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!SpiritualitySwechaa28 Aug 2026, 11:16 AM

తిరుమలలో భక్తుల కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం!

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, బయట ఉన్న క్యూలైన్లలో కూడా శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది.

Megastar 2 movies: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?సినిమాSwechaa28 Aug 2026, 10:45 AM

Megastar 2 movies: చిరు నుంచి ఒకేసారి రెండు సినిమాలను రిలీజ్ చేస్తారా?

Megastar: Megastar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలను కొన్ని రోజుల గ్యాప్‌లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారా? ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతున్న విశ్వంభర మూవీని యూవీ వారు డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇది, అఫీషియల్ కన్‌ఫర్మ్.