స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!తెలంగాణSwechaa28 Aug 2026, 10:44 AM

ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC / TSRTC) ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వినూత్న డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. నాన్‌స్టాప్ బస్సు సర్వీసుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా ‘సెల్ఫ్ టికెటింగ్’ (Self-Ticketing) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు ఎక్కే సమయంలో టికెట్‌ కోసం వేచి చూడకుండా, ప్రయాణికులే స్వయంగా తమ ఫోన్‌ ద్వారా స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసే వెసులుబాటును ఈ విధానం కల్పిస్తుంది.

భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వేNationalSwechaa28 Aug 2026, 10:36 AM

భారీగా పడిపోయిన బీజేపీ గ్రాఫ్.. ప్రధానిగా మోడీనే బెస్ట్ : ఎంవోటీఎన్ సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమికి సీట్లు భారీగా తగ్గనున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంవోటీఎన్)’ నిర్వహించిన తాజా సర్వే -2026 ఈ విషయాన్ని స్పష్టంచేసింది.కేంద్రంలో ఎన్డీయే కూటమే బలంగా ఉన్నప్పటికీ గత ఆరు నెలలతో పోలిస్తే బలం కొంత తగ్గిందని పేర్కొంది.జనవరిలో నిర్వహించిన సర్వేలో 352 సీట్లు ఎన్డీయేకు వస్తాయని అంచనా వేయగా.. తాజాగా ఈ సంఖ్య 326కు పడిపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు రాగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ పార్టీ 261 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని ఎంవోటీఎన్ సర్వే అంచనా వేసింది. కాగా, 2024 ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 106 సీట్లు గెలుచుకోగలదని వెల్లడించింది.

నేపాల్‌లో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తున్నా మాన‌స స‌రోవ‌ర్ ఎందుకు..?  హిందువుల క‌ఠిన యాత్రకు కార‌ణాలేంటి...?NationalSwechaa28 Aug 2026, 10:29 AM

నేపాల్‌లో వ‌ర‌ద‌లు వ‌ణికిస్తున్నా మాన‌స స‌రోవ‌ర్ ఎందుకు..? హిందువుల క‌ఠిన యాత్రకు కార‌ణాలేంటి...?

మానస సరోవర్‌ అనేది కేవలం హిమాలయాల్లో ఉన్న ఒక సరస్సు కాదు. హిందూ విశ్వాసంలో దీనికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. మానస సరోవర్‌కు సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని పరమశివుడి నివాసంగా భక్తులు భావిస్తారు. అందుకే కైలాసం, మానస సరోవరం రెండింటినీ కలిపి దర్శించుకోవడం అనేది కోట్లాది మంది హిందువులకు జీవితకాల ఆధ్యాత్మిక కోరికగా ఉంటుంది

హరీశ్ రావుకు బడా కంపెనీలు.. కవిత ఆరోపణలు అక్షర సత్యమేనా?తెలంగాణSwechaa28 Aug 2026, 10:13 AM

హరీశ్ రావుకు బడా కంపెనీలు.. కవిత ఆరోపణలు అక్షర సత్యమేనా?

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్,మాజీ మంత్రి హరీశ్ రావుకు బడా కంపెనీలు ఉన్నాయని, ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇదే విషయంపై నిన్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ‘ఎక్స్’ ఖాతా వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆసుపత్రులతో వ్యాపారం చేస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారని ఆరోపించింది. ARVAIS NATURES PRODUCTS PRIVATE LIMITED (Milchy Milk) హరీశ్ రావు వైద్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కంపెనీ ఒక్క ఏడాదిలోనే 614% వృద్ధి సాధించిందని.. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు దాని రూ.7 కోట్ల మాత్రమే అని తెలిపింది.

ప్రజ్ఞానంద ప్రభంజనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత!క్రీడలుSwechaa28 Aug 2026, 10:10 AM

ప్రజ్ఞానంద ప్రభంజనం.. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా ఘనత!

భారత యువ గ్రాండ్‌మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద చదరంగంలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ప్రపంచ క్రీడా వేదికపై భారతదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తూ, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, అమెరికా దిగ్గజం ఫ్యాబియానో కరువానాపై ప్రజ్ఞానంద అద్భుత విజయం సాధించాడు. దీంతో ఈ ప్రతిష్టాత్మక టోర్నీని సొంతం చేసుకున్న మొట్టమొదటి భారత చెస్ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

CMCPRO: సీఎం సీపీఆర్వో అతి!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa28 Aug 2026, 09:49 AM

CMCPRO: సీఎం సీపీఆర్వో అతి!

ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో జీతం తీసుకుంటున్న సీఎం సీపీఆర్వో మల్సూర్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కోసం పని చేయడం విమర్శలకు దారి తీసింది. బాధ్యతలు మరచి పార్టీకి సలహాదారు మాదిరిగా కాంగ్రెస్‌ నేతలకు పాఠాలు చెప్పడంపై ప్రతిపక్ష నేతలతోపాటు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, అధికార పార్టీకి మధ్య ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన హద్దులను చెరిపేసి, టీవీ డిబేట్లలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడాలో గాంధీ భవన్‌లో మల్సూర్ క్లాసులు తీసుకున్నారు.

సామాన్యులకు షాక్.. చక్కెర కొనుగోలుపై పరిమితులు!NationalSwechaa28 Aug 2026, 09:46 AM

సామాన్యులకు షాక్.. చక్కెర కొనుగోలుపై పరిమితులు!

దేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత రెండు వారాలుగా ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కేజీ షుగర్ రూ.45 నుంచి ప్రస్తుతం రూ.80 వరకు ఎగబాకింది. దీంతో పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు.తమ వేతనాలు పెరగడం లేదని కానీ, నిత్యావసరాలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగకుండా ప్రభుత్వాలు కట్టడి చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెద్దమొత్తంలో కొనుగోలు చేసి స్టాక్ నిల్వ చేయకుండా ఉండేందుకు కొనుగోళ్లపై పరిమితులు విధించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే క్విక్ కామర్స్ కంపెనీలు అయిన బ్లింకిట్, జెప్టో,స్విగ్గీ, ఇన్ స్టామార్ట్ గరిష్టంగా రూ.3 నుంచి 5 కేజీల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్టు సమాచారం. డీమార్ట్‌ వంటి రిటైలర్ దిగ్గజం కూడా ఇదే బాటలో నడుస్తున్నట్టు తెలిసింది.

రెండవ రోజు హెవీ డ్రాప్..నష్టాలు తప్పవా?సినిమాSwechaa28 Aug 2026, 09:44 AM

రెండవ రోజు హెవీ డ్రాప్..నష్టాలు తప్పవా?

Yash-Toxic: వారం రోజుల వ్యవధిలో వచ్చిన రెండు సినిమాలను ఇప్పుడు పోల్చి చూసుకుంటే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీజనల్ సినిమా ఇరుముడి. సున్నితమైన అంశాన్ని తండ్రీ-కూతురు మధ్య జోడించి అద్భుతమైన కథ-కథనాలతో, మంచి పాత్రధారులతో తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రెండవ వారం కూడా లక్షల్లో టికెట్స్ సేల్ అవుతున్నాయి. కానీ, కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ మూవీ మాత్రం రెండవ రోజే హెవీ డ్రాప్ కనిపించింది. కథ-కథనాలే అర్థం-పర్థం లేకుండా ఉన్నాయి. ఏ సన్నివేశం ఎందుకు రాశారో-తీశారో..ఏ పాత్రను ఎందుకు ఎంచుకున్నారో..ఒక అడల్ట్ సీన్..ఓ యాక్షన్ సీక్వెన్స్..ఇదే ప్యాట్రన్‌లో సినిమా మొత్తం సాగుతుంది. అసలు, ఎమోషనల్ సీన్స్ అనేవి మచ్చుకైనా కనిపించవు.

NBK: ఆన్‌సెట్స్ నుంచి బాలయ్య లుక్ రివీల్!సినిమాSwechaa28 Aug 2026, 09:08 AM

NBK: ఆన్‌సెట్స్ నుంచి బాలయ్య లుక్ రివీల్!

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ మూవీ రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు, రాజ్యలక్ష్మి కిలారు నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి ఆన్‌సెట్స్ లో ఉన్న బాలయ్య లుక్ రిలీజైంది. ఇలా, బాలయ్య లుక్ వచ్చిందో లేదో అలా వైరల్ అయింది.

ముఖ్యనేత పీఏ బూతు పురాణం?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa28 Aug 2026, 08:42 AM

ముఖ్యనేత పీఏ బూతు పురాణం?

ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. కానీ, హద్దులు మీరితే ఎవరైనా ఒకటే. డీజీపీ అయినా, కానిస్టేబుల్ అయినా ఒకటే రూల్. కానీ, ముఖ్య నేత వద్ద పీఏగా ఉంటున్న ఆర్టీఏ కానిస్టేబుల్‌ తనకు రూల్స్ పట్టవు. నా రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేతకు దగ్గరి బంధువు కావడం, పీఏగా అధికారికంగా నియమకం కావడంతో ఫోన్ కాల్స్ తప్పనిసరి అవుతోంది. వర్క్ ప్రెజరా లేక ఇలానే ఉంటేనే పనులు అవుతాయనే వైఖరో కానీ, బూతులతో కుమిలిపోయిన వాళ్లు బయటపడుతున్నారు.

నేపాల్‌లోప్రకృతి విలయం.. 392కు పెరిగిన మృతుల సంఖ్య!..NationalSwechaa28 Aug 2026, 08:08 AM

నేపాల్‌లోప్రకృతి విలయం.. 392కు పెరిగిన మృతుల సంఖ్య!..

నేపాల్‌ను వరద ప్రవాహాలు వణికించాయి. ఎటు చూసినా ప్రకృతి విలయమే కనిపిస్తోంది. కళ్లముందే కూలిపోతున్న భవనాలు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోతున్న వాహనాలు.. బురదలో కూరుకుపోతున్న గ్రామాలు.. ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న ప్రజలు.. నేపాల్‌లో నెలకొన్న భయానక పరిస్థితికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి.

రసువా జిల్లాలో మొదలైన వరద, బురద ప్రవాహం దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లి పలు జిల్లాల్లో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. భూకంపంతో మంచు, రాళ్లు, శిథిలాలు కొట్టుకొచ్చి లిండే నది ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుపడ్డాయి. ఆ అడ్డంకి తొలగిపోవడంతో ఒక్కసారిగా భారీగా నీరు, బురద దిగువకు పోటెత్తింది. భోటే కోశీ, త్రిశూలి నదులు ఉగ్రరూపం దాల్చడంతో పరిస్థితి మరింత విషమించింది.

యోగములు ఎన్ని రకాలు? అవి ఏమిటి?SpiritualitySwechaa28 Aug 2026, 06:36 AM

యోగములు ఎన్ని రకాలు? అవి ఏమిటి?

యోగం అంటే కేవలం ఆసనాలు వేయడం, శ్వాసాభ్యాసం చేయడం ఒక్కటే కాదు. మనిషి తన శరీరం, మనసు, బుద్ధి, ఆత్మను ఉన్నతమైన చైతన్యంతో అనుసంధానం చేసుకునే ఆధ్యాత్మిక మార్గం.. అదేవిధంగా భగవద్గీతలో ప్రధానంగా కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం అనే మూడు మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఆరో అధ్యాయంలో ధ్యానయోగం గురించి శ్రీకృష్ణుడు వివరంగా ఉపదేశిస్తాడు.

మనిషి మరణించే సమయంలో ఏం జరుగుతుంది!SpiritualitySwechaa28 Aug 2026, 06:26 AM

మనిషి మరణించే సమయంలో ఏం జరుగుతుంది!

మనిషి జీవితం ఒక వెలిగే జ్యోతి వంటిది.. ప్రమిదలో నూనె ఉన్నంతవరకు దీపం వెలుగుతుంది.. ఆ నూనె అయిపోయిన క్షణమే జ్యోతి ఆరిపోతుంది. అలాగే మానవ దేహంలో ప్రాణం ఉన్నంతవరకే జీవితం కొనసాగుతుంది. శ్వాస ఆగిపోయిన క్షణంలో.. మనం ఎంతో ప్రేమగా చూసుకున్న ఈ దేహం కేవలం పంచభూతాల సమాహారంగా మిగిలిపోతుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే.. మరణం శరీరానికి మాత్రమే ఆత్మకు కాదు..

ఇక ప్రతి ఒక్కరి జీవితంలోనూ తప్పనిసరిగా వచ్చే చివరి ఘట్టం మరణం.. అయితే ఒక మనిషి మరణించే సమయంలో ఏం జరుగుతుంది?.. చివరి శ్వాస తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?.. మనిషి చనిపోయిన వెంటనే అంతా అయిపోయినట్టేనా?.. లేక అక్కడి నుంచే మరో ప్రయాణం మొదలవుతుందా?.. అనే ప్రశ్నలు ఆథ్యాత్మిక భావాలతో జీవించే వారి మదిలో తరచుగా మెదులుతాయి.. అయితే వీటికి సమాధానాలు గరుడ పురాణంలో వివరించినట్టు పండితులు చెబుతారు.

ఆకాశంలో ఇంటర్నెట్ వార్..! స్టార్‌లింక్‌ వర్సెస్ అమెజాన్.. భారత్ మార్కెట్ ఎవ‌రిది..?ప్రపంచంSwechaa28 Aug 2026, 12:19 AM

ఆకాశంలో ఇంటర్నెట్ వార్..! స్టార్‌లింక్‌ వర్సెస్ అమెజాన్.. భారత్ మార్కెట్ ఎవ‌రిది..?

ప్రస్తుతం స్టార్‌లింక్ దూకుడుగా ముందుకెళ్తోంది. అమెజాన్ వేగంగా తన ఉపగ్రహాల సంఖ్యను పెంచుతోంది. భారత్‌లో జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు తమ బలమైన నెట్‌వర్క్, కస్టమర్ బేస్‌తో ఈ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మరోవైపు OneWeb వంటి సంస్థలు కూడా భారత శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్‌లో ఉన్నాయి.

డీలిమిటేషన్‌పై ఢిల్లీలో కదలిక..! అఖిలపక్ష భేటీకి ఖర్గే డిమాండ్.. దక్షిణాది సీట్ల లెక్క ఏంటి?NationalSwechaa27 Aug 2026, 11:34 PM

డీలిమిటేషన్‌పై ఢిల్లీలో కదలిక..! అఖిలపక్ష భేటీకి ఖర్గే డిమాండ్.. దక్షిణాది సీట్ల లెక్క ఏంటి?

డీలిమిటేషన్ కేవలం ఒక బిల్లు కాదు. ఇది వచ్చే దశాబ్దాల భారత రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉన్న అంశం. ఒకవైపు మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరం అన్న వాదన ఉంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా నియంత్రణకు ఇచ్చిన ప్రాధాన్యం దెబ్బతినకూడదని కోరుతున్నాయి.

Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!సినిమాSwechaa27 Aug 2026, 10:17 PM

Nivetha Thomas: నివేదా థామస్ సన్నబడింది..మళ్ళీ ఛాన్సులొస్తాయేమో!

Nivetha Thomas: Nivetha Thomas: నివేదా థామస్..సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె సహజమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో నివేదా థామస్ చేసిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ, ఇటీవల కాలంలో ఆమె స్క్రీన్‌కి దూరమయ్యారు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారు. అయితే, ఓనం పండుగ సందర్భంగా నివేదా థామస్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. చక్కగా చీరలో మెరిసింది.

అక్క‌ చెల్లెమ్మల‌కు సీఎం రేవంత్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలుతెలంగాణSwechaa27 Aug 2026, 09:27 PM

అక్క‌ చెల్లెమ్మల‌కు సీఎం రేవంత్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Rakhi Purnima Wishes: రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మల‌కు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు, ఆరోగ్యం వెల్లి విరియాలన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే బృహత్ సంకల్పంలో భాగంగా అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

తాండూరులో ఏసీబీ సోదాల కలకలం.. మైన్స్‌ ఏడీ జయరాజ్‌ ఆస్తులపై మెరుపు దాడులుతెలంగాణSwechaa27 Aug 2026, 09:21 PM

తాండూరులో ఏసీబీ సోదాల కలకలం.. మైన్స్‌ ఏడీ జయరాజ్‌ ఆస్తులపై మెరుపు దాడులు

ACB Raids: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (మైన్స్‌ ఏడీ) బొజ్జ జయరాజ్‌కు సంబంధించిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గురువారం చేపట్టిన మెరుపు సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌ బోడుప్పల్‌, భూపాలపల్లి, సూర్యాపేట, వికారాబాద్‌ జిల్లా తాండూరుతో పాటు జయరాజ్‌కు సంబంధించిన బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాలు కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగాయి.

నేపాల్ వరదలు.. తెలంగాణ వాసుల భద్రతకు రేవంత్ సర్కార్ చర్యలుతెలంగాణSwechaa27 Aug 2026, 08:22 PM

నేపాల్ వరదలు.. తెలంగాణ వాసుల భద్రతకు రేవంత్ సర్కార్ చర్యలు

Nepal Flash Floods: నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలంగాణ పర్యాటకులు, యాత్రికులు, ఇతర పౌరుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అందించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రాథమికంగా 23 మంది తెలంగాణ వాసులను గుర్తించినట్లు మంత్రి వెల్లడించారు.

మిర్ ఆలం చెరువుకు స‌ర్కార్ కొత్త హంగులుతెలంగాణSwechaa27 Aug 2026, 07:54 PM

మిర్ ఆలం చెరువుకు స‌ర్కార్ కొత్త హంగులు

Mir Alam Tank: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మిర్ ఆలం చెరువుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త రూపు, సరికొత్త హంగులు ఇవ్వాల‌ని యోచ‌న చేస్తోంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా ప్రముఖ పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మిర్ ఆలం చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పనుల పురోగతిని సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

పెండింగ్ బిల్లుల కోసం దీక్షకు దిగుతాతెలంగాణSwechaa27 Aug 2026, 06:58 PM

పెండింగ్ బిల్లుల కోసం దీక్షకు దిగుతా

Mla Anirudh Reddy: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన నియోజకవర్గానికి రావాల్సిన నిధుల కోసం సొంత ప్రభుత్వంపైనే పోరాటం చేస్తానని చెప్పారు. పెండింగ్ బిల్లులు పరిష్కరించుకుంటే దీక్షకు కూడా దిగుతానని ఆయన హెచ్చరించారు. అందులో తప్పేమీ లేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పెడితే ఎవరినైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు. నాకు ఓటు వేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు, వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అయినా కొట్లాడతానని చెప్పారు.

Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?సినిమాSwechaa27 Aug 2026, 06:34 PM

Rajinikanth vs Vijay Devarakonda: జైలర్ 2తో రణబాలి పోటీ..తేడా కొడితే?

Rajinikanth vs Vijay Devarakonda: 'ర‌ణ‌బాలి' కి సోలో డేట్ దొరికిందని అనుకున్నారు. అయితే, సోలో రిలీజ్ దొరికే అవకాశం లేదని చాలామందికి తెలియదు. ఇప్పటికే, బాక్సాఫీస్ బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 మూవీతో పోటీ పడుతున్నాడు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అక్టోబర్ 15న విడుదలవుతోంది. అంతేకాదు, ధనుష్ నటిస్తున్న 'ఓం' సినిమాను అక్టోబర్ 16న రిలీజ్ చేయనున్నట్లు ఇంతకముందే ప్రకటించారు.

భారీ ఆర్డర్ దక్కించుకున్న L&T రెన్యూవబుల్స్ వ్యాపార విభాగంవ్యాపారంSwechaa27 Aug 2026, 06:03 PM

భారీ ఆర్డర్ దక్కించుకున్న L&T రెన్యూవబుల్స్ వ్యాపార విభాగం

L&T: ఎల్&టి పునరుత్పాదక ఇంధన వ్యాపార విభాగం, మిడిల్ ఈస్ట్ లోని ఒక ప్రముఖ క్లయింట్ కోసం మూడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఒక పెద్ద ఆర్డర్‌ను దక్కించుకుంది. నిల్వ సౌకర్యాలతో పాటు, ఈ ప్యాకేజీల పరిధిలో పూలింగ్ సబ్‌స్టేషన్లు, భూగర్భ కేబుళ్లతో సహా గ్రిడ్ అనుసంధానాలు కూడా ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టులు సమిష్టిగా 6 గిగావాట్-గంటల నిల్వ సామర్థ్యాన్ని అందిస్తాయి. ఇది మిడిల్ ఈస్ట్ అంతటా గ్రిడ్ ఆధునీకరణ, పునరుత్పాదక ఇంధన ఏకీకరణలో అత్యంత ప్రభావవంతమైన పురోగతులలో ఒకటిగా నిలుస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన నిల్వ రంగంలో ఇది ఎల్&టిని ఒక కీలకమైన EPC సంస్థగా నిలబెడుతుంది.

Toxic-Yash: Day 1 కలెక్షన్స్ 150 కోట్లు..ఇది కేవలం యష్ సత్తా మాత్రమేసినిమాSwechaa27 Aug 2026, 05:42 PM

Toxic-Yash: Day 1 కలెక్షన్స్ 150 కోట్లు..ఇది కేవలం యష్ సత్తా మాత్రమే

Toxic-Yash: టాక్సిక్ సినిమాను ఆగస్టు 26న పాన్ ఇండియా రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. మొదటి షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. దాంతో, నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్‌కి భారీ నష్టాలని ప్రచారం మొదలైంది. వాటిన్నిటికీ ధీటుగా డే 1 కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. మొదటి రోజు టాక్సిక్ కలెక్షన్స్ 150 కోట్లని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

కేసీఆర్‌కి వెన్నుపోటు పొడిచి  బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్రతెలంగాణSwechaa27 Aug 2026, 05:21 PM

కేసీఆర్‌కి వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకునేందుకు గుంటనక్క కుట్ర

Kavitha: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు టార్గెట్ గా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిపరుడు, వెన్నుపోటుదారుడు అంటూ హరీశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకుని కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే రాజకీయం చేస్తున్నారని హరీశ్ రావుపై మండిపడ్డారు కవిత. మెదక్ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్న హరీశ్ రావు.. మెదక్ లో అన్ని సీట్లు గెలిస్తే నేను బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకోగలుగుతానని, అందుకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఓపెన్ గా చెప్పారని, ఇది వాస్తవం అని కవిత అన్నారు. బీఆర్ఎస్ పైనా కవిత విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయిందని, విలువలు వదిలేసిందని ధ్వజమెత్తారు.

మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోందితెలంగాణSwechaa27 Aug 2026, 03:47 PM

మొత్తం ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోంది

Kavitha: ప్రత్యేక రాష్ట్రం వచ్చినా, ప్రభుత్వాలు మారినా తెలంగాణలో ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. రేవంత్ సర్కార్ పాలనపై కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలో ఆంధ్ర వాళ్ల పెత్తనమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇరిగేషన్, విద్యుత్ ఇలా ఏ డిపార్ట్ మెంట్ లోని చూసినా ఆంధ్రా పెత్తనమే నడుస్తోందన్నారు. యాదగిరి గుట్ట ఆలయ బోర్డులో ఒక ప్రముఖ నటుడి భార్యను మెంబర్ చేయడాన్ని కవిత తప్పుపట్టారు.

హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!తెలంగాణSwechaa27 Aug 2026, 02:47 PM

హనుమకొండలో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి హరీశ్‌ రావు అరెస్ట్.. కాలినడకన పీఎస్‌కు తరలింపు!

హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై నిరసన తెలుపుతున్న టిఎన్‌జీవో(TNGO) ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకుడు హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమస్యలు ఎదుర్కొంటున్న పాలిటెక్నిక్ విద్యార్థులను కలిసేందుకు వెళ్తున్న ఆయనను మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!క్రైమ్Swechaa27 Aug 2026, 02:20 PM

కుప్పకూలిన విమానం..  నీటిలో మునిగి నలుగురు మృతి!

 అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక చిన్నపాటి విమానం నియంత్రణ కోల్పోయి నీటిలో కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంకరేజ్ నగరం నుంచి బయలుదేరి సెల్డోవియా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానిక అధికారులు అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదానికి గురైన పైపర్ పీఏ-24 (Piper PA-24) రకానికి చెందిన ఈ చిన్న విమానం యాంకరేజ్‌లోని మెరిల్ ఫీల్డ్ విమానాశ్రయం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

Chiru: "ఇరుముడి"పై మెగా ట్వీట్.. "మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి"!సినిమాSwechaa27 Aug 2026, 02:18 PM

Chiru: "ఇరుముడి"పై మెగా ట్వీట్.. "మనం బతకాలి… ఇతరులనూ బతికించాలి"!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇరుముడి సినిమా చూసిన తర్వాత ఆయన ఎక్స్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ ని మెగా అభిమానులు కూడా వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీ గురించి..ఇక్కడ కొందరు చాటుగా చేస్తున్న రాజకీయాల గురించి చిరు ఇచ్చిన పంచ్ తగలాల్సిన వాళ్ళకి గట్టిగా తగిలిందంటున్నారు.

2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!NationalSwechaa27 Aug 2026, 01:46 PM

2036 ఒలింపిక్స్ లక్ష్యంగా ముందుకెళ్లండి.. యువతకు ప్రధాని మోదీ దిశానిర్దేశం!

 జాతీయ క్రీడా దినోత్సవం-2026 సందర్భంగా నిర్వహించిన 'ఖేలో ఇండియా డైలాగ్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ఉన్న యువతను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. 'మేరా యువ భారత్' (MY Bharat) ఆధ్వర్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాల స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో, 2036 ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా యువ క్రీడాకారులు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.