స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్సినిమాSwechaa27 Aug 2026, 01:41 PM

Official: రణబాలి కొత్త రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ ఇదుగో పోస్టర్

Official: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ సినిమాకి టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్. పెళ్లి తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఇక, తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా కన్‌ఫర్మ్ చేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ని వదిలారు. అక్టోబర్ 16న రణబాలి విడుదలకి సిద్ధమవుతోంది.

స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులువైరల్ న్యూస్Swechaa27 Aug 2026, 01:37 PM

స్వీట్ పంచాయితీ..కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు

స్వీట్ షాపులో చిన్న వివాదం కాస్త చిలికిచిలికి గాలి వానలా మారింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీబాలాజీ రమేశ్ స్వీట్ హౌసుకు వెళ్లిన వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన రాజు.. ఓ స్వీటు కొనుగోలు చేశాడు. అయితే, ఇతరులకు ఇచ్చిన ధరకు కాకుండా తన నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని రాజు యజమానిని నిలదీశాడు. ఈ క్రమంలో రాజుతో స్వీట్ హౌస్ యజమాని దురుసుగా ప్రవర్తించగా, ఆగ్రహానికి గురైన కస్టమర్ షట్టర్ కిందికి వేసేందుకు యత్నించాడు.దీంతో షాపు యజమాని 112కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న నలుగురు పోలీసులు రాజుపై విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దుతూ, నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్ వరకు తీసుకెళ్లారు. అయితే, కాసేపటికి వదలిపెట్టగా గాంధీచౌక్ వద్ద నిరసనకు దిగిన రాజు.. పోలీసులు తనను అవమానించారని, ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశాడు.

అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!ఏపీSwechaa27 Aug 2026, 01:19 PM

అమ్మాయిల కోసం కత్తులతో టీడీపీ నేతల పరస్పర దాడులు!

రేవ్ పార్టీలో అమ్మాయిల కోసం కత్తులతో దాడులు చేసుకున్న ఘటన ఏపీలో ఆలస్యంగా వెలుగుచూసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నేతలు కొందరు విశాఖపట్నంలో జరిగిన ఓ రేవ్ పార్టీకి హాజరయ్యారు. అక్కడ మద్యం సేవించి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత అమ్మాయిల విషయంలో వారిలోవారికే మనస్పర్దలు వచ్చినట్టు సమాచారం.దీంతో చిన్న వాగ్వాదం నెలకొంది. అది కాస్త చిలికిచిలికి గాలివానగా మారినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. విశాఖపట్నంలోని ఓ రిసార్ట్‌లో జబర్దస్త్ నటి అను బర్త్ డే వేడుకలకు TNSF నేతలు హాజరయ్యారు.పార్టీ జరుగుతున్న క్రమంలో అమ్మాయిల కోసం గొడవపడినట్టు సమాచారం. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలుకొట్టుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే వెంకట దినేష్ అనే టీడీపీ నాయకుడిని చరణ్ తేజ్ అనే మరో నేత కత్తితో పొడిచినట్టు సమాచారం.

కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?రాజకీయాలుSwechaa27 Aug 2026, 01:02 PM

కొండాకు పదవీ గండం.. నేడు పీసీసీ చీఫ్‌తో కొండా మురళి భేటీ?

అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం హీటెక్కింది.పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేస్తున్నది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంది.వీరిద్దరి పదవులు తొలగించాలని ఏఐసీసీకి రిపోర్టు పంపించింది. తాజాగా మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. క్రమశిక్షణా కమిటీ కూలంకషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందని, దానిని ఏఐసీసీ వ్యవహరాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించామన్నారు. ఆమె పరిశీలించాక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదికపై ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని పీసీసీ చీఫ్ తెలిపారు. కొండా మురళి వచ్చి కలిస్తే తప్పకుండా మాట్లాడుతానని వెల్లడించారు.

BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!InternationalSwechaa27 Aug 2026, 12:58 PM

BRICS 2026: ఢిల్లీకి రష్యా, చైనా అధినేతలు.. భారత్ చారిత్రాత్మక దౌత్య విజయం!

భారతదేశం మరో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ సమావేశానికి వేదిక కాబోతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న 'బ్రిక్స్ (BRICS) 2026' సదస్సుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సును దిగ్విజయం చేసేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రష్యాలో ఏకకాలంలో పర్యటించి ఆయా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వారి ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ ప్రతినిధి బృందాలతో ఢిల్లీకి వచ్చేందుకు సానుకూలంగా స్పందించారు.

ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!NationalSwechaa27 Aug 2026, 12:39 PM

ఆకస్మిక వరదలు.. కైలాష్ యాత్ర బృందం గల్లంతుపై సద్గురు ఆందోళన.. చైనాకు రిక్వెస్ట్!

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. టిబెట్‌లోని గ్యిరాంగ్ ప్రాంతంలో వచ్చిన భారీ వరదల్లో చిక్కుకుని గల్లంతైన కైలాష్ మానస సరోవర్ యాత్రికుల ఆచూకీపై ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను కాపాడుకోవడానికి, గాలింపు చర్యల్లో చైనా అధికారులకు తమ వంతు సహకారం అందించడానికి గానూ గ్యిరాంగ్ వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఆయన చైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!క్రైమ్Swechaa27 Aug 2026, 12:31 PM

సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని యువతిని లైంగికంగా వాడుకుని దూరం పెట్టిన విజయవాడకు చెందిన యువడైరెక్టర్ పవన్ సాదినేని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, విచారణలో భాగంగా పలు షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పవన్ సాదినేనికి ఇదివరకే పెళ్లైయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరికొందరు మహిళలతో సంబంధం ఉన్నట్టు బాధితురాలు ఆరోపించింది. గోల్కొండ ప్రాంతంలో నివసించే యువతి.. 20 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతూ 2023 నుంచి మంచానికే పరిమితమై ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈమెకు ఏడాది క్రితం పరిచయమైన పవన్.. నాటి సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. బాధితురాలికి ఆర్థికంగా సహాయం చేయడం, ఆసుపత్రులకు తీసుకెళ్లడం, వైద్య బిల్లులు చెల్లించడం వంటివి చేశాడు. ఆమె ఆరోగ్యం, కెరీర్, ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటానని హామీ ఇచ్చి, మెల్లిగా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.

రేవంత్  రెడ్డి.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావుతెలంగాణSwechaa27 Aug 2026, 12:13 PM

రేవంత్ రెడ్డి.. కమీషన్ల కోసమేనా ఈ దందా? : హరీశ్ రావు

రాష్ట్రంలో 22 ఏ నిషేధితా జాబితా అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు గురువారం ఉదయం ‘ఎక్స్’ వేదికగా మరోసారి స్పందించారు. కమీషన్ల కోసమే పట్టా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. రైతు భూములు కూడా 22A నిషేధిత జాబితాలో పెడతారా? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం రైతుల భూములను కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. ఇబ్రహీంపట్నం రామదాస్‌పల్లిలో 300 ఎకరాలకు పైగా రైతుల పట్టా భూములను 22Aలో చేర్చి, రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల వ్యవసాయ భూములతో పాటు, ఇతర మూడు లేఅవుట్లలోని భూములు, బాండెడ్ లేబర్‌కు కేటాయించిన భూములు కూడా 22A నిషేధిత జాబితాలో చేర్చారన్నారు.22Aలో చేర్చడం వల్ల వారికి రైతుబంధు, రైతుబీమా లేదని, బ్యాంకు రుణాలు లేవని, యూరియా కూడా అందడం లేదన్నారు.

స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!వ్యాపారంSwechaa27 Aug 2026, 12:02 PM

స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!

 స్విగ్గీ థియేటర్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. సినిమా హాల్‌లోని మీ సీటు వద్దకే నేరుగా ఫుడ్ డెలివరీ చేసే ప్రత్యేకమైన ‘ఆర్డర్‌-ఇన్‌-సినిమాస్‌’ సేవలను స్విగ్గీ డైన్‌అవుట్ వేదికగా ప్రారంభించింది. సినీపోలిస్, ఏషియన్ సినిమాస్‌ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలతో జట్టుకట్టి ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఇంటర్వెల్ సమయంలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ లేదా ఇతర స్నాక్స్ కోసం సుదీర్ఘ క్యూలలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా, సులభంగా తమకు నచ్చిన పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు.

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణంక్రైమ్Swechaa27 Aug 2026, 11:55 AM

ఫోన్ మాట్లాడొద్దన్నందుకు తండ్రి కళ్లెదుటే కూతురి దారుణం

ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దు అన్నందుకు ఓ బాలిక తల్లిదండ్రులకు దారుణ శిక్ష విధించింది. తండ్రి కళ్ల ముందే రైలు కింద పడి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని ఛత్రినాకలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఛత్రినాకలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కూతురు తేజస్వి(17) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువు కోసమని తండ్రి ఆమెకు మొబైల్ ఇప్పించాడు.అయితే, ఈ మధ్య తన కూతురు అర్ధరాత్రి వరకు ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడటం గమనించిన శ్రీనివాస్.. నిన్న మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన తేజస్విని.. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అది చూసిన తండ్రి ఆమెను అనుసరించాడు.ఈ క్రమంలోనే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ వద్ద తండ్రి కళ్ల ముందే వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది.

రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!వ్యాపారంSwechaa27 Aug 2026, 11:37 AM

రూ.6వేల కోట్ల అప్పుకి రూ.14వేల కోట్లు చెల్లించా.. విజయ్ మాల్యా ఆవేదన!

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు చెల్లించకుండా లండన్‌లో పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై, బ్యాంకింగ్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. బ్యాంకులకు తాను చెల్లించాల్సిన మూల రుణం కంటే చాలా ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసుకున్నప్పటికీ, తనకు చట్టపరంగా లభించాల్సిన సరైన ప్రాధాన్యత లేదా న్యాయం దక్కడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!సినిమాSwechaa27 Aug 2026, 11:33 AM

అనుకున్నదే అయింది చిరుతో రీషుట్ తప్పలేదు!

Vishwambhara: విశ్వంభర సినిమా అప్‌డేట్..అదే రిలీజ్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కానీ, తాజా సమాచారం మేరకు..ఈ సినిమాకి సంబందించి కొంత రీషూట్ చేయాల్సి ఉండటంతో దర్శకుడు వశిష్ట అభ్యర్థన మేరకు చిరు 4 రోజుల పాటు డేట్స్ ఇచ్చారట. ఈ నాలుగు రోజుల్లోనే పెండింగ్ ఉన్న సీన్స్ కంప్లీట్ చేసుకోవాలి వశిష్ట. అయితే, ఈ రీషూట్ విషయం ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలుతెలంగాణSwechaa27 Aug 2026, 11:11 AM

హరీశ్ రావు హౌస్ అరెస్టు.. భగ్గుమన్న బీఆర్ఎస్ నేతలు

జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు నిర్వహిస్తుండటం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన ‘శక్తి’స్కీంను వ్యతిరేకిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులు..కొత్తగా తెచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లేందుకు సిద్ధమైన మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. దానికి మద్దతు తెలిపేందుకు హరీశ్‌రావు వరంగల్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. మాజీ మంత్రి పర్యటనకు అనుమతి లేదంటూ గృహనిర్బంధంలో ఉంచారు. ఎవరూ బయటకు వెళ్లకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించినట్టు సమాచారం.

కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!క్రీడలుSwechaa27 Aug 2026, 11:11 AM

కీవీస్ గడ్డపై 'భారత్' క్రేజ్.. 48 గంటల్లోనే 26 వేల టికెట్లు స్వాహా!

 అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాకున్న తిరుగులేని క్రేజ్ మరోసారి నిరూపితమైంది. ఈ ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో భారత్ జరపనున్న సుదీర్ఘ పర్యటనపై అక్కడి అభిమానులు వీరతాళ్ళు వేస్తున్నారు. న్యూజిలాండ్ క్రికెట్ (NZC) అంతర్జాతీయ సీజన్ టికెట్ల విక్రయాలను ప్రారంభించగా, 'క్రికెట్ నేషన్' సభ్యుల ప్రీ-సేల్ మొదలైన కేవలం 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 26,000 టికెట్లు అమ్ముడయ్యాయి. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ జట్లు 12 మల్టీ-ఫార్మాట్ మ్యాచ్‌లలో (T20లు, వన్డేలు, టెస్టులు) తలపడనున్నాయి.

కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!NationalSwechaa27 Aug 2026, 10:51 AM

కులగణనపై కొత్త రగడ.. మోదీ సర్కార్‌కు రాహుల్ బిగ్ క్వ‌శ్చ‌న్!

రాహుల్ గాంధీ, ఖర్గే వాదన ప్రకారం.. దేశంలోని ఒకే కులానికి వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు, ఉపకులాల పేర్లు, స్పెల్లింగ్‌లు ఉండొచ్చు. వాటిని విడివిడిగా నమోదు చేస్తే ఒకే సామాజిక వర్గం అనేక కేటగిరీలుగా విడిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఫలితంగా OBC జనాభా ఎంత అన్నదానిపై ఖచ్చితమైన లెక్క తేల‌ద‌నేది కాంగ్రెస్ ఆందోళన.

సీపీఎస్ రద్దు,  బకాయిలు  విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నాతెలంగాణSwechaa27 Aug 2026, 10:49 AM

సీపీఎస్ రద్దు, బకాయిలు విదుదల చేయాల్సిందే : ఉద్యోగ జేఏసీ మహాధర్నా

రాష్ట్ర ప్రభుత్వంపై మరో ఉద్యమానికి ఉద్యోగ జేఏసీ సిద్ధపడినట్టు తెలుస్తోంది.చాలా కాలంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సర్కార్ ఫెయిల్ అయ్యిందని వారు ఆరోపిస్తున్నారు. అడిగినప్పుడల్లా అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం అని కేవలం ఉత్తమాటలు చెబుతున్నారని, కాలయాపన చేస్తూ తమ సమస్యలు తీర్చడం లేదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగు జేఏసీ నేతలు మహాధర్నాకు పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిసింది. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాచేపట్టామని ఉద్యోగ జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ మహాధర్నా కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, నిరనన ప్రదర్శనలు చేపడతామని పేర్కొన్నారు.

ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి వైద్యంఏపీSwechaa27 Aug 2026, 10:34 AM

ఆస్పత్రిలో నో కరెంట్.. మొబైల్ టార్చ్ వెలుగులో బాలుడికి వైద్యం

ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఆస్పత్రికి సిబ్బందిపై రోగి తరఫు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో నూతనంగా ప్రారంభించిన సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే కాలిన గాయాలతో వచ్చిన ఐదేళ్ల బాలుడికి మొబైల్ టార్చ్‌లైట్ వెలుగుల్లో ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు. బిడ్డిక జీవన్(5)పై ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడ్డాయి. దీంతో తీవ్రగాయాలు కావడంతో వెంటనే మన్యం ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అదే సమయంలో ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడం, జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వైద్యులు మొబైల్ టార్చ్ ‌లైట్ వెలుగులోనే బాలుడికి వైద్యం అందించినట్టు తెలిసింది.

నేపాల్ ఆకస్మిక వరదలకు కారణం అదే.. ముంచుకొస్తున్న మరో ప్రళయం!NationalSwechaa27 Aug 2026, 10:16 AM

నేపాల్ ఆకస్మిక వరదలకు కారణం అదే.. ముంచుకొస్తున్న మరో ప్రళయం!

నేపాల్‌లో సంభవించిన బీభత్సమైన ఆకస్మిక వరదలకు భూకంపం కారణం కాదని 'అమెరికా భూగర్భ సర్వే సంస్థ' (USGS) స్పష్టం చేసింది. నేపాల్-చైనా సరిహద్దుల్లో భారీ హిమనదం (Glacial collapse) ఒక్కసారిగా కూలిపోవడమే ఈ విపత్తుకు ప్రధాన కారణమని వెల్లడించింది. తొలుత ఉదయం 8:37 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికీ, ఉపగ్రహ చిత్రాలు, ప్రకంపనల ఆధారాలను విశ్లేషించిన తర్వాత అక్కడ ఎలాంటి భూకంపం రాలేదని, మంచు-రాళ్లతో కూడిన కొండచరియలు విరిగిపడటం వల్లే ఆ తీవ్రత నమోదైందని యూఎస్‌జీఎస్ తేల్చిచెప్పింది.

తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దుఏపీSwechaa27 Aug 2026, 10:07 AM

తిరుమల శ్రీవారికి భక్తులకు బిగ్ ‌అప్డేట్.. ఇలా అస్సలే చేయొద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి దర్శనం మరికొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదని పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం శ్రావణమాసం చివరి వారం కావడం, శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో భక్తులు పెద్దఎత్తున తిరుమలకు వెళ్తున్నట్టు తెలిసింది.అయితే, స్వామి వారి దర్శనానికి చాలా సమయం పడుతోందని, భక్తులు అందుకు సహకరించాలని టీటీడీ కోరింది. గురువారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనార్థం భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి. గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. భక్తులు భారీగా రావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్ని పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు వెలుపల శిలాతోరణం వరకు బారులు తీరినట్టు సమాచారం. దీంతో టైమ్ స్లాట్ టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

బిజినెస్ జరగకనే రిలీజ్ వాయిదా పడుతోందా?సినిమాSwechaa27 Aug 2026, 10:00 AM

బిజినెస్ జరగకనే రిలీజ్ వాయిదా పడుతోందా?

The Paradise: సెప్టెంబర్ 24న రిలీజ్ కాబోతున్న ది ప్యారడైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియడం లేదు. హిట్ 3 కూడా నానికి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. అందుకే, ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వారున్నా, కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ ఉన్నా, క్యూట్ హీరోయిన్ కయాదు లోహర్ అలరించబోతున్నా..సినిమాపై మాత్రం ఎందుకనో హైప్ రావడం లేదు. ఇంకా 20 కోట్ల వరకూ లాస్ కనిపిస్తుందట. అనుకున్నట్టుగా బిజినెస్ జరగలేదని తెలుస్తోంది.

భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!తెలంగాణSwechaa27 Aug 2026, 09:51 AM

భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజు నివాసంలో ఏసీబీ సోదాలు!

రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని పలు విభాగాల్లో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన వారి మీద, వారి బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ వరుస దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రభుత్వ అధికారిపై ఏసీ కొరడా ఝలిపించినట్టు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్టు సమాచారం. గురువారం తెల్లవారు జామున ఆయన ఇళ్లు,బంధువులు, బినామీల ఇండ్లపై దాడులు జరిపినట్టు తెలుస్తోంది.ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

మీరాలం చెరువును సీఎం ఆకస్మిక సందర్శన.. పర్యాటక రంగానికి కొత్త హంగులు!తెలంగాణSwechaa27 Aug 2026, 09:50 AM

మీరాలం చెరువును సీఎం ఆకస్మిక సందర్శన.. పర్యాటక రంగానికి కొత్త హంగులు!

హైదరాబాద్ నగరాభివృద్ధి, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాతబస్తీలోని చారిత్రాత్మక మీరాలం చెరువును గురువారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఆధ్వర్యంలో చెరువు పరిసరాల్లో సాగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. పనుల ప్రస్తుత పురోగతిపై సంబంధిత అధికారులతో ఆరా తీసిన సీఎం.. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సడెన్ విజిట్‌తో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.

నేపాల్ వరద భారత్‌కు హెచ్చరిక.. హిమనీ సరస్సులు ఎంత ప్రమాదకరం?NationalSwechaa27 Aug 2026, 09:46 AM

నేపాల్ వరద భారత్‌కు హెచ్చరిక.. హిమనీ సరస్సులు ఎంత ప్రమాదకరం?

హిమాలయాల్లో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు చిన్నగా కనిపిస్తున్న హిమనీ సరస్సు.. రేపు భారీ నీటి నిల్వగా మారవచ్చు. మంచు చరియ, భూకంపం లేదా భారీ వర్షం.. ఏదో ఒకటి ఆ సహజ అడ్డుకట్టను బలహీనపరిస్తే.. దిగువన ఉన్న జనావాసాలకు స్పందించే సమయం ఉండ‌దు.

Ram Pothineni: సీనియర్స్‌తో పోటీ రిస్కేమో రామ్?సినిమాSwechaa27 Aug 2026, 09:30 AM

Ram Pothineni: సీనియర్స్‌తో పోటీ రిస్కేమో రామ్?

Ram Pothineni: రామ్ పోతినేని సినిమా ప్రకటించినప్పుడే డిసెంబర్ టార్గెట్‌గా వస్తున్నామని వెల్లడించాడు. కానీ, అప్పటికీ ప్రభాస్ ఫౌజీ, కింగ్ 100, బాలయ్య-గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. ఆ తర్వాత ఈ ముగ్గురు స్టార్స్ తమ సినిమాలను డిసెంబర్ నెలలో రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇది, ఇప్పుడు రామ్ పోతినేని సినిమాకి గట్టి పోటీగా మారింది. వెనక్కి తగ్గుతాడని అందరూ భావిస్తుంటే, రామ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. చూడాలి, మరి మన రామ్ పోటీలో ఎంతవరకూ నెగ్గుకొస్తాడో.

పల్నాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణంఏపీSwechaa27 Aug 2026, 09:28 AM

పల్నాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

ఏపీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. నిన్న రాత్రి పల్నాడుతో మరో ఘోరం చోటుచేసుకుంది. చిలకలూరిపేట వద్ద ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.మృతులను బొంత బాబు, మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మీ, గంగమ్మగా గుర్తించారు.మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చిలకలూరిపేట, గుంటూరు ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రకాశం జిల్లా కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకల కోసం బాధితులు ఆటోలో వెళ్లినట్టు సమాచారం. వేడుకలు ముగించుకుని వేలూరు గ్రామానికి తిరిగి వస్తుండగా విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రైజింగ్ స్టేట్‌లో మనీ మత్తు వదలాలి!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa27 Aug 2026, 09:25 AM

రైజింగ్ స్టేట్‌లో మనీ మత్తు వదలాలి!

బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎన్ని పాపాలు చేసినా 5 ఏండ్ల తర్వాతనే సమాజానికి అర్ధం అయింది. కానీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేండ్లు కాకుండానే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 10 ఏండ్లు నేనే సీఎం అనే రేవంత్‌కు కూడా పార్టీలు మార్చినట్లు ప్రత్యేకంగా సీఎం ఉండాలనే పొలిటికల్ రోల్ పెంచుకున్నారు. ఇదంతా 3 నెలల ముందు కూడా అందరూ ఆయన చేసిన పనులకు పకృతి కలిసి పని చేసింది. కానీ, ఇప్పుడు రెవెన్యూపై పుట్టిన దురుద్దేశం మొత్తం పార్టీకే కాదు అన్నింటి నాశనాన్ని కొరుకుంటోంది. రెవెన్యూ మినిస్టర్ అయిన శ్రీనివాసరెడ్డి ఎన్ని దందాలు చేశారో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్లకు తెలుసు.

తరం మారుతోంది గోపాల్!తెలంగాణSwechaa27 Aug 2026, 09:16 AM

తరం మారుతోంది గోపాల్!

ఆనాడు ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగి ఉద్యమాన్ని నీరుగార్చిన మేనేజ్‌మెంట్స్‌ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ ఉద్యమం ఆపారా? పదవులు కాదు, ఎంత పైసలు అయినా ‌ఖర్చు చేస్తా అంటూ కారు డిక్కీలో పట్టే డబ్బులు ఆనాడు తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలను తలొగ్గకుండా చేసింది మీరే కదా? ఆ ఉద్యమంలో మీ కాంగ్రెస్ ఎంపీల పాత్రను ఎవరూ కాదనలేరు. కానీ, ఇదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వ్యతిరేకంగా ఈనాడు రాశాడంటే ఎందుకు అంతగా రియాక్ట్ ఆయ్యారు.

బ్రోకర్లను నమ్మొద్దుస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa27 Aug 2026, 09:07 AM

బ్రోకర్లను నమ్మొద్దు

22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం దిగి వస్తోంది. ఒక్కొక్క కాలనీని 22ఏ నిషేధిత జాబితా నుంచి అధికార యంత్రాంగం తొలగిస్తోంది. 22ఏ లిస్ట్ నుంచి క్లియర్ చేస్తామని బ్రోకర్లతో ఒక్కో కాలనీలో కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు బేరసారాల దందాకు ప్రయత్నం జరిగింది. ఈ చీకటి వ్యవహారాన్ని స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల వెలుగులోకి తెచ్చారు. దీని ఆధారంగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో రేవంత్ సర్కార్ దిగి వచ్చింది. ఒక్కొక్క కాలనీని 22ఏ జాబితా నుంచి అధికారులు తొలగిస్తున్నారు.

Ram Charan-Sukumar: ఎంత ఊహించుకున్నా అంతకుమించే ఉంటుంది!సినిమాSwechaa27 Aug 2026, 08:55 AM

Ram Charan-Sukumar: ఎంత ఊహించుకున్నా అంతకుమించే ఉంటుంది!

Ram Charan-Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో RC 17 మొదలవ్వాల్సి ఉంది. ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ గతంలోనే వచ్చింది. పూజా కార్యక్రమాలతో త్వరలో ఈ ప్రాజెక్ట్ ని లాంచ్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా, నిర్మాతలలో ఒకరైన రవి శంకర్..ఎంతైనా ఊహించుకోండి..అంతకు మించే ఉంటుంది.. అని హైప్ ఇచ్చాడు.

టాలీవుడ్‌లో విషాదం..  ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత!సినిమాSwechaa27 Aug 2026, 08:39 AM

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత!

తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన మరణవార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో శోకఛాయలు అలముకున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.