స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఎవరి ఓటు ఉంటుంది? ఎవరి ఓటు పోతుంది? నేటి నుంచే కొత్త‌ లెక్క!తెలంగాణSwechaa26 Aug 2026, 11:25 PM

ఎవరి ఓటు ఉంటుంది? ఎవరి ఓటు పోతుంది? నేటి నుంచే కొత్త‌ లెక్క!

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. మూడు ప్రధాన రాజకీయ శక్తులు వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే తమ తమ రాజకీయ లెక్కలు వేసుకుంటున్నాయి. అలాంటప్పుడు ఓటర్ లిస్ట్‌లో జరిగే ప్రతి మార్పు పార్టీలకు కీలకమే. ఒక నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు తగ్గినా.. మరికొన్ని వేల ఓట్లు కొత్తగా చేరినా.. ఎన్నికల ఫలితాలపై దాని ప్రభావం ఉండొచ్చు

మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..తెలంగాణSwechaa26 Aug 2026, 08:35 PM

మీడియాకు రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..

కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ముఖ్య నాయకుల భేటీలపై రకరకాల ప్రచారాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. జరగని విషయాలను జరిగినట్టుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్న ఆంధ్రా మీడియాపై మండిపడ్డారు

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదుతెలంగాణSwechaa26 Aug 2026, 08:06 PM

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

Ponguleti Srinivas Reddy: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం చేస్తుందని అనుకున్నాం, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 31 వరకు పూర్తైన ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేదల కోసం రూ.185 కోట్లు విడుదల చేశామన్నారు. 15వేల 475 మంది లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో చివరి బిల్లులు జమ చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..తెలంగాణSwechaa26 Aug 2026, 07:04 PM

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లాటరీ నియోజకవర్గాల వారీ షెడ్యూల్ వివరాలు!..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం పరిధిలో హైదరాబాద్‌లో నిర్మించనున్న ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు తెలంగాణ హౌసింగ్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28 నుండి 31 వరకు.. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున పూర్తి పారదర్శకంగా డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి. గౌతం తెలిపారు. ఈ లాటరీ ప్రక్రియను ఎటువంటి అనుమానాలకు, అపోహాలకు తావులేకుండా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రజలు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలంటే.. అధికారిక వెబ్‌సైట్ tghb.telangana.gov.in సందర్శించాలని తెలిపారు.. అలాగే హౌసింగ్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా ఖాతాలైన tghd.official ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా చూడవచ్చని పేర్కొన్నారు.

డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలుతెలంగాణSwechaa26 Aug 2026, 06:48 PM

డిజిటల్ మార్కెటింగ్ హబ్‌లుగా మీ సేవా కేంద్రాలు

Sridhar Babu: తెలంగాణలోని ప్రతి మీ సేవా కేంద్రాన్ని డిజిటల్ మార్కెటింగ్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక వ్యాపారులకు డిజిటల్ ప్రచార అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా మీ సేవా-మెటా సంయుక్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని షెరటాన్‌ హోటల్‌లో బుధవారం మీ సేవా డిజిటల్ మార్కెటింగ్ శిక్షణ రెండో దశ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 140 మందికి పైగా మీ సేవా విలేజ్‌ లెవల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు (వీఎల్‌ఈలు) హాజరయ్యారు. వీరికి ‘డిజిటల్ బిజినెస్ అంబాసిడర్లుగా’ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

రాహుల్ గాంధీకి ఏలేటి బహిరంగ లేఖ.. డిమాండ్స్ ఇవేతెలంగాణSwechaa26 Aug 2026, 06:33 PM

రాహుల్ గాంధీకి ఏలేటి బహిరంగ లేఖ.. డిమాండ్స్ ఇవే

Alleti Maheshwar Reddy: 22ఏ నిషేధిత భూముల వివాదంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతిలో జరుగుతున్న అవకతవకలు, 22ఏ నిషేధిత భూముల జాబితా ద్వారా జరుగుతున్న అనేక చీకటి ఒప్పందాల మీద రాహుల్ గాంధీ స్పందించాలని.. ఈ తప్పిదాలను వెంటనే సరి చేసి బాధ్యులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతి నెల 200 కోట్లు మీకు పంపుతున్నట్లుగా మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో జరిగే గుసగుసను మేము నమ్మాల్సి వస్తుందన్నారు.

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..NationalSwechaa26 Aug 2026, 06:16 PM

నేపాల్‌లో ప్రకృతి బీభత్సం..భారీగా ప్రాణ నష్టం!..

నేపాల్‌లో ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్ర చేసింది. రసువా జిల్లాలో భోటేకోషి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో డజనుకు పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ప్రవాహానికి జనావాసాలు కొట్టుకుపోగా.. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు. వెయ్యి మందికి పైగా గల్లంతై ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. నాలుగు వేల మందికి పైగా ప్రభావితమైనట్లు అధికారులు చెబుతున్నారు. బాధితుల కోసం సైనిక హెలికాప్టర్లతో సహా భారీగా రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఐదు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

Irumudi vs Toxic: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!సినిమాSwechaa26 Aug 2026, 05:53 PM

Irumudi vs Toxic: చరిత్రలోనే మొదటిసారి..షోలు తొలగించినందుకు ధర్నా!

Irumudi: ఆగస్టు 26న కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల హౌజ్ ఫుల్ తో రన్ అవుతున్న ఇరుముడి మూవీని టాక్సిక్ కోసం తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా.. మక్తల్‌లో చోటు చేసుకుంది. ఈ ఊరిలో ఉన్న వెంకటరమణ థియేటర్ నుంచి ఈ బుధవారం నాడు టాక్సిక్ సినిమాను హఠాత్తుగా తొలగించడంతో ప్రేక్షకులు ధర్నా చేశారు. దీనిపై, థియేటర్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో.

Rukmini: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!సినిమాSwechaa26 Aug 2026, 05:15 PM

Rukmini: టాక్సిక్‌లో వల్గర్ రోల్..ఒప్పుకోవాల్సింది కాదు!

Rukmini Vasanth: కాంతార ఛాప్టర్ 1లో ఎంతో హుందాతనమైన పాత్రలో నటించి ఒక్కసారిగా సౌత్ మొత్తం క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి.. టాక్సిక్ సినిమా ఒప్పుకోవడం బిగ్ మిస్టేక్. ఆమె పాత్ర వల్గారిటీగా డిజైన్ చేశారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పైగా కెరీర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. రుక్మిణి కథ వినే టాక్సిక్ ఒప్పుకుందా? రెమ్యునరేషన్ భారీగా ఇస్తామన్నారా? యష్‌తో సినిమా చేస్తే గుర్తింపు వస్తుందని కమిటైందా? ఇలాంటి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి.

కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం..తెలంగాణSwechaa26 Aug 2026, 04:12 PM

కొండా సురేఖ ఎపిసోడ్‌లో కీలక పరిణామం..

Konda Murali: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొండా సురేఖపై చర్యలు తప్పవన్న సంకేతాలు బలంగా వస్తున్న తరుణంలో కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. ఏఐసీసీ నిర్ణయానికి ముందే కొండా సురేఖ భర్త కొండా మురళి రాయబారం మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. ఈ భేటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు.

22A Lands Row: డిఫెన్స్ కాలనీ సొసైటీ భూములపై కీలక విజయంతెలంగాణSwechaa26 Aug 2026, 03:06 PM

22A Lands Row: డిఫెన్స్ కాలనీ సొసైటీ భూములపై కీలక విజయం

22ఏ జాబితా నుంచి ప్రజల ఆస్తులను తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ (O/R) లిమిటెడ్, డిఫెన్స్ కాలనీకి చెందిన సుమారు A.112:03 గుంటల భూమికి సంబంధించి కీలకమైన పరిపాలన, చట్టపరమైన పురోగతి లభించింది. సొసైటీ తరపున నిరంతర ప్రయత్నాలు, సంబంధిత అధికారులతో సమన్వయం, అవసరమైన పత్రాల సమర్పణ, చట్టపరమైన ఫాలోఅప్ తర్వాత సొసైటీ భూములకు సంబంధించి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల నుంచి అవసరమైన NOC (నిరభ్యంతర ధృవీకరణ పత్రం) మంజూరు అయ్యింది. అదే విధంగా సొసైటీ భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-A కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి తొలగించే ప్రక్రియలో కీలకమైన అడుగు పడింది.

కాగా, 22 ఏ నిషేధిత జాబితా నుంచి మీ భూములు, ప్రాపర్టీలు తొలగిస్తామని కొందరు బ్రోకర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. అటువంటి వారిని నమ్మి డబ్బులు చెల్లించొద్దని స్వేచ్ఛ న్యూస్ హెచ్చరిస్తోంది.

అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణ యువకులు మృతితెలంగాణSwechaa26 Aug 2026, 03:02 PM

అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు తెలంగాణ యువకులు మృతి

రాష్ట్రంలో మరో తీవ్ర విషాదం నెలకొంది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్లోరిడా రాష్ట్రంలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే కారులోని ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్టు సమాచారం. మృతుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా (నవీపేట)కు చెందిన రాహుల్‌గా గుర్తించారు. ఉన్నత విద్య కోసం సుమారు మూడు నెలల క్రితమే రాహుల్ అమెరికా వెళ్లినట్టు తెలిసింది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలను ఫ్లోరిడాలోని స్థానిక అధికారులు వారి కుటుంబాలకు సమాచారం అందించారు. మిగిలిన ఇద్దరు విద్యార్థుల గురించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రముఖ నటి ఫిర్యాదుతో యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్!..సినిమాSwechaa26 Aug 2026, 01:59 PM

ప్రముఖ నటి ఫిర్యాదుతో యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ అరెస్ట్!..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని వివాదంలో చిక్కుకున్నారు.  పెళ్లి చేసుకుంటానని మోసం చేశారంటూ ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో  పోలీసులు పవన్ ను అరెస్ట్ చేశారు. చాలా కాలంగా తనతో సహజీవనం చేసి లైంగికంగా వాడుకున్నారని ఆరోపించింది.  దీంతో పవన్ సాధినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

దిల్ రాజుకి టాక్సిక్ ఎఫెక్ట్..ఈసారి దెబ్బ ఇంకా గట్టిగా తగిలింది.సినిమాSwechaa26 Aug 2026, 01:57 PM

దిల్ రాజుకి టాక్సిక్ ఎఫెక్ట్..ఈసారి దెబ్బ ఇంకా గట్టిగా తగిలింది.

Dil Raju: దిల్ రాజుకి టాక్సిక్ ఎఫెక్ట్..ఈసారి దెబ్బ ఇంకా గట్టిగా తగిలింది. అవును..ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేసింది దిల్ రాజు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి డివైడ్ టాక్ కూడా కాదు, ఏకంగా ఫ్లాప్ టాక్ వచ్చింది. కనీసం మధ్యాహ్నం షో కూడా పడకముందే ఇలాంటి టాక్ రావడంతో అందరూ పాపం దిల్ రాజు అంటూ సానుభూతి చూపిస్తున్నారు. టాక్సిక్ డిస్ట్రిబ్యూషన్‌తో ఎన్ని కోట్ల లాస్ మోయనున్నాడో దిల్ రాజు అంటున్నారు.

హిజాబ్‌పై తీర్పు.. న్యాయమూర్తులపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలుతెలంగాణSwechaa26 Aug 2026, 01:46 PM

హిజాబ్‌పై తీర్పు.. న్యాయమూర్తులపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

పాఠశాలలో హిజాబ్ ధరించి వచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హిజాద్ అనేది ఇస్లాంలో తప్పనిసరి కాదని, ఈ మేరకు సరైన ఆధారాలు కూడా లేవని కోర్టు అభిప్రాయపడింది. విద్యాసంస్థల్లో యూనిఫామ్ అనేది పాటించాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టారు. తాజాగా ఆయన నగరంలోని ఓ ఈవెంటులో మాట్లాడుతూ.. హిజాబ్ వివాదంపై కోర్టు తీర్పుపై స్పందించారు. స్కూల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతి నిరాకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు.ఈ తీర్పును ఇస్లాంపై దాడిగా అభివర్ణించారు. ‘ఇది మా మతం, ఏది అవసరమో మేమే నిర్ణయించుకుంటాం. నిర్ణయించడానికి న్యాయమూర్తులు ఎవరు?’ అంటూ ఫైర్ అయ్యారు. ఇస్లాంకు ఏది ముఖ్యమో, ఏది కాదో నిర్ణయించడం న్యాయమూర్తుల పని కాదన్నారు.

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్!..NationalSwechaa26 Aug 2026, 01:31 PM

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్!..

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని మహర్షి వాల్మీకి అభివృద్ధి సంస్థలో రూ.89 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి. సంస్థ అధికారి చంద్రశేఖరన్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం, మంత్రి బి.నాగేంద్ర రాజీనామాకు దారితీసింది.. ఈ ఆరోపణలతో గతంలో పదవికి దూరమైన నాగేంద్ర పై విచారణ కొనసాగుతున్న క్రమంలో తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.

నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి : ఎమ్మెల్యే మాధవరంరాజకీయాలుSwechaa26 Aug 2026, 01:22 PM

నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి : ఎమ్మెల్యే మాధవరం

బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘నా మీద పగ ఉంటే చంపేయండి’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.కూకట్ పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి హైదరాబాద్‌లో.. మరొకటి మల్కాజ్‌గిరిలో.. ఇంకొకటి సైదాబాద్‌లో కలిపారని ఫైర్ అయ్యారు.తన మీద కోపంతో నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయొద్దని వ్యాఖ్యానించారు. 22 ఏ నిషేధిత జాబితా నుంచి కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల భూములు, ఆస్తులను తొలగించకపోతే నిన్ను వదిలిపెట్టను రేవంత్ రెడ్డి అంటూ వార్నింగ్ ఇచ్చారు.

పోలవరానికి పోటెత్తిన గోదావరి.. 48 గేట్లు ఎత్తివేత!తెలంగాణSwechaa26 Aug 2026, 12:57 PM

పోలవరానికి పోటెత్తిన గోదావరి.. 48 గేట్లు ఎత్తివేత!

గోదావరి నదికి వరద ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు, మూడు రోజులుగా తెలంగాణతో పాటు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భారీగా వరద నీరు దిగువకు చేరుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ప్రవాహం తీవ్రరూపం దాల్చింది.

పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటిమట్టం 30.30 మీటర్లకు చేరుకోగా, స్పిల్‌వే వద్ద 30.20 మీటర్లుగా నమోదైంది. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు అధికారులు స్పిల్‌వేకు చెందిన మొత్తం 48 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం సుమారు 4.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి  భూ కబ్జాదారుడు : హరీశ్ రావురాజకీయాలుSwechaa26 Aug 2026, 12:52 PM

రేవంత్ రెడ్డి భూ కబ్జాదారుడు : హరీశ్ రావు

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ, ప్రయివేటు భూములను చేర్చడం ద్వారా పట్టాదారులు, అసలైన ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. చాలా మంది తమ బిడ్డల పెళ్లిళ్లు, ఉన్నత చదువుల కోసం భూములు, భవనాలు అమ్ముకుందామని ప్రయత్నిస్తే 22ఏ నిషేధిత జాబితాలో తమ ప్రాపర్టీలు ఉన్నాయని, వాటిని అమ్మడానికి లేదని రిజిస్ట్రార్ అధికారులు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా 22 ఏ నిషేధిత జాబితాలో తమ ఆస్తులు చేరడం వలన ఇబ్బందులు పడుతున్న బాధితులతో మాజీ మంత్రి హరీశ్ రావు బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాడ్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఓ కబ్జాదారుడు అని ఆరోపించారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటూ, అసైన్డ్ భూములను లాక్కుంటూ, ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన రేవంత్ అసలైన కబ్జాదారుడు అని విమర్శించారు. 22-Aను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కబ్జాదారులు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ ప్రజలు కబ్జాదారులా? అని నిలదీశారు.

బీజేపీ సర్కారుపై విమర్శలు.. ఆరేళ్ల బాలుడి అరెస్టు (వీడియో వైరల్)NationalSwechaa26 Aug 2026, 12:32 PM

బీజేపీ సర్కారుపై విమర్శలు.. ఆరేళ్ల బాలుడి అరెస్టు (వీడియో వైరల్)

బిహార్‌ రాష్ట్రంలో విద్యావ్యవస్థలోని సమస్యలు, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు నిర్వహిస్తున్న ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు.దీంతో అక్కడ తోపులాట జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే 70వ BPSC పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసనల్లో ఓ ఆరేళ్ల బాలుడు పాల్గొన్నాడు.ఈ సందర్భంగా తమ స్కూల్‌లో కనీస వసతులు లేవని, టీచర్లు కూడా సరిగ్గా రావడం లేదని విషయాల్ని బాలుడు మీడియా ముఖంగా లేవనెత్తాడు.అలాగే, నేరస్తుల్ని పట్టుకోలేరు కానీ, విద్యాహక్కు కోసం పోరాడుతున్న విద్యార్థులపై చెయ్యి చేసుకుంటారా? అని నిలదీశాడు. ఆ బాలుడిని సామ్రాట్ చౌదరిగా గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడంతో భారీ బందోబస్తు మధ్య ఆ బాలుడ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. అతన్ని పోలీసులు రోడ్డు మీద తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త!..తెలంగాణSwechaa26 Aug 2026, 12:30 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త!..

రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మార్చి నెల వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న దాదాపు 16,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా మొత్తం రూ.185 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా నిధులు సకాలంలో రాకపోవడంతో బిల్లుల చెల్లింపు ఆలస్యమైంది. అయితే, లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే తమ సొంత నిధుల నుంచి సర్దుబాటు చేసి నిధులు విడుదల చేసింది.

బాంబ్ పేల్చిన ట్రంప్.. ఆందోళనలో విద్యార్థులు, ఉద్యోగులుప్రపంచంSwechaa26 Aug 2026, 12:14 PM

బాంబ్ పేల్చిన ట్రంప్.. ఆందోళనలో విద్యార్థులు, ఉద్యోగులు

అమెరికా వెళ్లేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులు, అల్రెడీ అక్కడ ఉద్యోగాలు చేస్తూ సెలవుల మీద స్వదేశాలకు వీసా పని మీద వెళ్లిన వారికి ట్రంప్ సర్కార్ బిగ్‌షాక్ ఇచ్చింది. వీసా అపాయింటెమెంట్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో చాలా మంది ఇరకాటంలో పడినట్టు సమాచారం.కొందరేమో చదువుల కోసం, మరికొందరు ఉద్యోగాలు, మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.తాజాగా ట్రంప్ సర్కార్ నిర్ణయంతో వీరింతా అయోమయంలో పడ్డారు. ఉద్యోగులు అయితే తమ జాబ్స్ ఎక్కడ పోతాయో అని భయాందోళనలో ఉన్నట్టు సమాచారం.

వరంగల్ ఎంజీఎంలో అరిగోస.. వీల్ చైర్ లేదని రోగిని!తెలంగాణSwechaa26 Aug 2026, 11:48 AM

వరంగల్ ఎంజీఎంలో అరిగోస.. వీల్ చైర్ లేదని రోగిని!

వరంగల్ ఎంజీఎంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు చుక్కలు చూస్తున్నారు. మెరుగైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సైతం సమయానికి అక్కడ ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా వీల్ చైర్ లేదని ఓ రోగిని తన కుటుంబసభ్యులు భుజాల మీద మోసుకుని ఆస్పత్రి లోనికి తీసుకొచ్చారు. రోగిని ‘ఎక్స్‌రే’కు తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ లేకపోవడంతో ఇలా చేయాల్సివచ్చిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇక్కడ ఆస్పత్రికి సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది.నడవలేని పరిస్థితిలో ఉన్న రోగికి వీల్ చైర్ అందించాల్సిన సిబ్బంది పట్టించుకోలేదని కూడా సమాచారం.వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా వైద్యశాఖ మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఆసుపత్రి కాదు నరకకూపం అని, రోగులకు కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం ఎందుకని ప్రజలు మండిపడుతున్నారు.

రాహుల్ vs కంగనా! పొలిటిక‌ల్ వార్‌గా కృతి యాడ్..NationalSwechaa26 Aug 2026, 11:44 AM

రాహుల్ vs కంగనా! పొలిటిక‌ల్ వార్‌గా కృతి యాడ్..

రాహుల్‌ వ్యాఖ్యతో ఈ వివాదానికి ఒక్కసారిగా రాజకీయ రంగు వచ్చింది. ఇప్పటివరకు ఇది ఒక సినిమా నటి, ఒక ప్రకటన, సోషల్‌ మీడియా విమర్శలకు పరిమితమైన వ్యవహారం. కానీ రాహుల్‌ ఎంట్రీతో మహిళా స్వేచ్ఛ, పితృస్వామ్యం, సంప్రదాయాలు వంటి అంశాలపై రాజకీయ చర్చ మొదలైంది.

Toxic Twitter Review: ట్విట్టర్ లో నెగిటివ్ రివ్యూస్..సినిమా పోయినట్టేనా?సినిమాSwechaa26 Aug 2026, 11:42 AM

Toxic Twitter Review: ట్విట్టర్ లో నెగిటివ్ రివ్యూస్..సినిమా పోయినట్టేనా?

Toxic Twitter Review: కొత్తగా రిలీజైన సినిమా మీద సోషల్ మీడియా ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఏ సినిమాకైనా ట్విట్టర్‌లో పాజిటివ్ రివ్యూస్ వస్తే అదే ఊపు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నెగిటివ్‌గా గనక రివ్యూలు, కామెంట్స్ వస్తే ఇక.. ఆ సినిమా ఫ్లాప్ కాబోతుందని హింట్ అనుకోవచ్చు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాక్సిక్ సినిమా పరిస్థితి చూస్తుంటే ఇలాగే ఉంది.

Rowdy Janardhana: మళ్ళీ రీషూట్..దిల్ రాజు ఒప్పుకుంటాడా?సినిమాSwechaa26 Aug 2026, 11:04 AM

Rowdy Janardhana: మళ్ళీ రీషూట్..దిల్ రాజు ఒప్పుకుంటాడా?

Rowdy Janardhana: ప్రస్తుతం దిల్ రాజు ఉన్న పరిస్థితికి రీషూట్స్ ఒప్పుకుంటాడా? ఇదే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల కాలంలో నిర్మాతగా దిల్ రాజు లాభాలను చూడలేదంటున్నారు. అలాగే, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల నుంచి ఆశించిన లాభాలు అందుకోలేదని చెప్పుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా వల్ల తీవ్రంగా నష్టాలను చూసిన దిల్ రాజు ఇంకా కోలుకోలేదు. ఇలాంటి, సమయంలో రీషూట్స్ అంటే ఎలా?

గడ్కరీ గేమ్ ఇదేనా? మోదీ తర్వాతి లెక్కలపై బీజేపీలో కలకలం!NationalSwechaa26 Aug 2026, 10:55 AM

గడ్కరీ గేమ్ ఇదేనా? మోదీ తర్వాతి లెక్కలపై బీజేపీలో కలకలం!

రాజకీయాల్లో మాట కంటే టైమింగ్ ముఖ్యం. 2029పై చర్చ మొదలైన సమయంలోనే.. ఇంకా మనమేనా? అనే ప్రశ్న రావడం.. యువతకు అవకాశం ఇవ్వాలి అని చెప్పడం.. ఇవన్నీ కలిపి చూస్తే.. గడ్కరీ మాటలకు సాధారణ వ్యాఖ్యలకంటే ఎక్కువ పొలిటికల్ వెయిట్ కనిపిస్తోంది.

‘బిగ్ రివీల్’పేరిట అటెన్షన్ గ్రాబ్ .. రూ.8.5 కోట్లు స్వాహాక్రైమ్Swechaa26 Aug 2026, 10:53 AM

‘బిగ్ రివీల్’పేరిట అటెన్షన్ గ్రాబ్ .. రూ.8.5 కోట్లు స్వాహా

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ ప్రకటనలు, పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ కొందరు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నట్టు తెలుస్తోంది. మరికొందరు సోషల్ మీడియాను వాడే క్రమంలో వారికి తెలియకుండానే సైబర్ దాడుల బారిన పడుతున్నారు. అయితే, బిగ్ రివీల్ పేరిట ఓ కేటుగాడు రూ. 8.5 కోట్లు దోచేశాడు. బాధితుల్లో ఒకరు సోషల్ మీడియాలో అసలు విషయం పోస్టు చేయగా.. ఈ నేరం వెలుగులోచి వచ్చింది.

కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘25 August 2026’ పేరిట ఓ కేటుగాడు ఖాతా తెరిచాడు.ఆగస్టు 25న ఓ పెద్ద రహస్యం బయటపెట్టబోతున్నానని.. కొన్ని రీల్స్ పోస్ట్ చేశాడు. తాను రివీల్ చేయబోయే సీక్రెట్ చూసి ఎవరూ పశ్చాత్తాపపడరని ప్రచారం చేశాడు. అదేంటో తెలియాలంటే.. తన టెలిగ్రామ్ ఛానల్‌లోకి రావాలంటూ ఆహ్వానించాడు. ఆ స్పెషల్ వీడియో చూసేందుకు.. ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేశాడు. ఇలా 1.66 లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించడంతో రూ. 8.5 కోట్లు వచ్చినట్టు తెలిసింది. ఆగస్టు 25న ఆ వీడియో రివీల్ చేయగా అందులో ‘బిగ్ రివీల్’ లేనే లేదని, ‘సమయం ఎంతో విలువైనది’ అనే మోటివేషనల్ వీడియో మాత్రమే ప్లే అయ్యిందని సమాచారం.

పాలిటెక్నిక్ భూములపై సీఎం రేవంత్ కన్ను?తెలంగాణSwechaa26 Aug 2026, 10:28 AM

పాలిటెక్నిక్ భూములపై సీఎం రేవంత్ కన్ను?

రాష్ట్రవ్యాప్తంగా 60 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా.. వాటికి చెందిన భూములును కాజేయాలని రేవంత్ సర్కార్ పన్నాగం పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటి విలువ సుమారు రూ 30,000 కోట్ల ఉంటుందని అంచనా వేశాయి. అందుకే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీలో విలీనం చేయాలని కుట్రకు తెరలేపారని ప్రచారం జరుగుతోంది.ఇంజినీరింగ్  చేసిన విద్యార్ధుల కన్నా ఎక్కువగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్ధులకే తొందరగా ఉద్యోగాలు వస్తుండటం ఆ కాలేజీలు,కోర్సులు ఎంత అవసరమో నిరూపిస్తున్నాయి. అయితే, రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీ పెద్దగా ఆదరణ లభించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. పాలిటెక్నిక్ కాలేజీలకు ఉన్న రూ.వేల కోట్ల భూమి మీద రేవంత్ కన్ను పడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

SVC: రవితేజ-దిల్ రాజు.."దాగుడు మూతల దండాకోర్"..2027 సంక్రాంతికిసినిమాSwechaa26 Aug 2026, 10:00 AM

SVC: రవితేజ-దిల్ రాజు.."దాగుడు మూతల దండాకోర్"..2027 సంక్రాంతికి

SVC: SVC: టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు నిర్మాణంలో రవితేజ కొత్త చిత్రం ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాకి 'దాగుడు మూతల దండాకోర్' అనే టైటిల్‌ని ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాను 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కాబోతుందని కూడా అధికారికంగా కన్‌ఫర్మ్ చేశారు. ఇరుముడి సక్సెస్ జోష్‌లో ఉన్న రవితేజ ఇప్పుడు కొత్త చిత్రాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా పట్టాలెక్కిస్తున్నాడు.