స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కబ్జాల పై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్.. 22Aలోకి 522 ఎకరాల ఇనాం భూములు!..తెలంగాణSwechaa26 Aug 2026, 09:58 AM

కబ్జాల పై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్.. 22Aలోకి 522 ఎకరాల ఇనాం భూములు!..

గతంలో ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన ఇనాం భూములను తిరిగి ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లోని భూములపై అధికారులు దృష్టి సారించారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో సుమారు 400 ఎకరాలు, నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 122 ఎకరాల ఇనాం భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్సీలు, ఎన్ఓసీలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపట్టి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణంక్రైమ్Swechaa26 Aug 2026, 09:40 AM

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లాలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై కంటైనర్ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రైవేట్ ట్రావెట్స్ బస్సు వెనుకనుంచి ఢీ కొట్టినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటివరకు 6 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్టు సమాచారం. మరో 22 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. నిద్రమత్తులో ఉండగానే పలువురు ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తోంది.

Rashmika: ఇరుముడి చూసి ఎమోషనల్ పోస్ట్..నీ నవ్వు నచ్చింది!సినిమాSwechaa26 Aug 2026, 09:23 AM

Rashmika: ఇరుముడి చూసి ఎమోషనల్ పోస్ట్..నీ నవ్వు నచ్చింది!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా రవితేజ నటించిన ఇరుముడి సినిమా చూసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో చెప్పలేదిని చెప్పారంటూ ఎమోషనల్ అవుతూ..తన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అంతేకాదు, ఇరుముడి సినిమా గురించి స్పెషల్ గా రష్మిక పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మహేష్‌తో సినిమా చేయట్లేదు..షాకిచ్చిన అనిల్ రావిపూడిసినిమాSwechaa26 Aug 2026, 08:59 AM

మహేష్‌తో సినిమా చేయట్లేదు..షాకిచ్చిన అనిల్ రావిపూడి

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబుతో డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా చేయడం లేదంటూ తాజాగా వెల్లడించారు. ఇది, ఒకరకంగా మహేష్ అభిమానులను డిసప్పాయింట్ చేసే వార్త అయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే సాధ్యపడదని అర్థమవుతోంది. అనిల్ రావిపూడి ఇలా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో నాలుగైదు రోజులుగా వస్తున్న వార్తలకి చెక్ పడింది.

రాఖీ పండగా ఎలా వచ్చింది?..పురాణాలు ఏం చెబుతున్నాయి..SpiritualitySwechaa26 Aug 2026, 08:31 AM

రాఖీ పండగా ఎలా వచ్చింది?..పురాణాలు ఏం చెబుతున్నాయి..

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన రక్షాబంధన్ వెనుక ఎన్నో పురాణ కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు దాగి ఉన్నాయి. అందుకే రాఖీ పౌర్ణమి కేవలం వేడుక కాదు... అది జన్మజన్మల బంధానికి శ్రీరామరక్ష. కాలాలకు అతీతంగా, పురాణాల సాక్షిగా నిలిచిన సనాతన ధర్మ మహోన్నత సంప్రదాయం.. ఇక త్రేతాయుగానికి పూర్వమే కృతయుగంలో రాఖీ విశిష్టత కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, రాక్షసరాజు ధాటికి దేవేంద్రుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో ఇంద్రాణి (శచీదేవి) పరమశివుడి అనుగ్రహంతో ఒక పవిత్రమైన రక్షణ దారాన్ని పూజించి, దేవేంద్రుడి మణికట్టుకు కట్టింది. ఆ దివ్య రక్షాసూత్రం ఇచ్చిన బలంతోనే ఇంద్రుడు అసురులపై విజయం సాధించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడని ఇతిహాసం..

Prabhas-Fauzi: రిలీజ్‌కి 100 రోజులు..ఓవర్సీస్‌లో బిజినెస్ క్లోజ్!సినిమాSwechaa26 Aug 2026, 08:24 AM

Prabhas-Fauzi: రిలీజ్‌కి 100 రోజులు..ఓవర్సీస్‌లో బిజినెస్ క్లోజ్!

Prabhas-Fauzi: హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ ఫౌజీ. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 2న ప్రీమియర్స్ పడబోతున్నాయి. అయితే, ఇంకా రిలీజ్ కి 100 రోజుల సమయం ఉన్నా కూడా ఓవర్సీస్‌లో ఫౌజీ చిత్రాన్ని ఫార్స్ ఫిల్మ్ భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతుంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ కొత్త పోస్టర్స్‌ను వదిలారు.

హనుమంతుడికి మంగళవారం ఎందుకు ప్రత్యేకమో తెలుసా?..SpiritualitySwechaa26 Aug 2026, 08:22 AM

హనుమంతుడికి మంగళవారం ఎందుకు ప్రత్యేకమో తెలుసా?..

భక్తికి ప్రతిరూపం, బలానికి ప్రతీక, ధైర్యానికి నిలువెత్తు రూపం హనుమంతుడు.. తనలో అపారమైన శక్తి ఉన్నా... ఆ స్వామిలో ఎక్కడా అహంకారం కనిపించదు. ఎంతటి కార్యమైనా శ్రీరాముడి ఆజ్ఞగా భావించి, నిస్వార్థంగా పూర్తి చేయడమే ఆయన గొప్పతనం.. వినయం, విశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం... ఇలా హనుమంతుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో గుణాలు ఉన్నాయి.. కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గని ఆత్మవిశ్వాసం.. ప్రభువు పట్ల చెక్కుచెదరని భక్తి... అందుకే హనుమంతుడు కేవలం దేవుడు మాత్రమే కాదు.. ప్రతి మనిషికి ధైర్యాన్ని నింపే ఆదర్శమూర్తి! అని పురాణాలు తెలియజేస్తున్నాయి.సాధారణంగా హిందువులు రోజూ పూజలు చేసినప్పటికీ, మంగళవారం రాగానే ఆంజనేయస్వామి దేవాలయాలు భక్తులతో పోటెత్తుతాయి. దీని వెనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన పురాణాలు, జ్యోతిష్య శాస్త్రాలు చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు కూడా ఉన్నాయి.

Raviteja-Yash: టాక్సిక్ ప్రభావం ఇరుముడిపై పడబోతుందా?సినిమాSwechaa26 Aug 2026, 08:00 AM

Raviteja-Yash: టాక్సిక్ ప్రభావం ఇరుముడిపై పడబోతుందా?

Raviteja-Yash: బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్న ఇరుముడి..లక్షల్లో టికెట్స్ బుక్ అవుతూ అన్నీ సెంటర్స్‌లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. అయితే, టాక్సిక్ సినిమా ఆగస్టు 26 (నేడే) రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. జస్ట్ గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడు పోవడం చూస్తుంటే ఎలాంటి సంచలనాన్ని ఈ సినిమా సృష్ఠిస్తుందో అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఖచ్చితంగా, టాక్సిక్ రిలీజ్ రోజు ఇరుముడి వసూళ్లపై గట్టిగానే ప్రభావం ఉంటుందని అర్థమవుతోంది.

Salman: మానసిక ఒత్తిడితో హైదరాబాద్‌కి షిఫ్టవుతున్న భాయ్?సినిమాSwechaa26 Aug 2026, 07:40 AM

Salman: మానసిక ఒత్తిడితో హైదరాబాద్‌కి షిఫ్టవుతున్న భాయ్?

Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎప్పటికప్పుడు సల్మాన్ కి ప్రాణ హాని ఉన్నట్టుగా హెచ్చరికలు వస్తున్నాయి. ప్రస్తుతం, ఆయన ముంబైలో పోలీసు బందోబస్తు నడుమ ఉంటున్నాడు. ఫుల్ టైట్ సెక్యూరిటీ మధ్య ఆయన సినిమాల షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో, ముంబై వీడి హైదరాబాద్ వస్తే కాస్త అన్నిటికీ ఉపశమనం లభిస్తుందని సల్మాన్ ఖాన్ భావించి కొంతకాలం ఇక్కడికి మకాం మార్చాలని నిర్ణయించుకున్నాడట.

Sandeep Reddy Vanga: మనం ఎంత ట్రై చేసినా స్పిరిట్‌కి వచ్చేది ‘A’ సర్టిఫికెటే!సినిమాSwechaa26 Aug 2026, 07:19 AM

Sandeep Reddy Vanga: మనం ఎంత ట్రై చేసినా స్పిరిట్‌కి వచ్చేది ‘A’ సర్టిఫికెటే!

Sandeep Reddy Vanga: ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, అనిమల్ చిత్రాలతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలలో సెన్షేషనల్ డైరెక్టర్‌గా పాపులర్ అయిన సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్‌గా త్రిప్తీ దిమ్రీ నటిస్తోంది. టీ సిరీస్-భద్రకాళి పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తాజాగా, ఆయన.. మనం ఎంత ట్రై చేసినా స్పిరిట్ సినిమాకి ఎ సర్టిఫికెట్ వస్తుందని ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీన్ని, బట్టి ఇది పక్కా వయిలెన్స్ ఎక్కువగా ఉండే సినిమా అని..అర్థమవుతోంది.

మరో ఎన్నికల నగారా.. గ్రేటర్ వార్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోందా?తెలంగాణSwechaa25 Aug 2026, 11:40 PM

మరో ఎన్నికల నగారా.. గ్రేటర్ వార్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోందా?

హైదరాబాద్‌ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నగర రాజకీయాల్లో బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ బలమైన రాజకీయ పునాది ఏర్పాటు చేసుకుంది. బీజేపీ కూడా హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది.

ప్రజల దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్తెలంగాణSwechaa25 Aug 2026, 10:12 PM

ప్రజల దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్

DK Aruna: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు.

కాంగ్రెస్‌లో కొత్త కలకలం.. రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపిన ఏఐసీవీసీ!!..తెలంగాణSwechaa25 Aug 2026, 09:53 PM

కాంగ్రెస్‌లో కొత్త కలకలం.. రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపిన ఏఐసీవీసీ!!..

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ, అంటే ఏఐసీవీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి బహిరంగంగా మద్దతు ఎందుకు ప్రకటించలేదో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు 72 గంటల గడువు ఇచ్చినట్లు ఏఐసీవీసీకి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏఐసీవీసీ పేర్కొంది.

వారణాసి తర్వాత సేఫ్ గేమ్ ప్లాన్ చేస్తున్న సూపర్ స్టార్!సినిమాSwechaa25 Aug 2026, 08:30 PM

వారణాసి తర్వాత సేఫ్ గేమ్ ప్లాన్ చేస్తున్న సూపర్ స్టార్!

Mahesh Babu: మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో ఇంతకముందు సరిలేరు నీకెవ్వరూ సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి సేఫ్ ప్రాజెక్ట్ చేస్తాడు. 150 కోట్లకి మించి ఖర్చు చేయడు. మరి, మహేష్ ఇందుకు ఒప్పుకుంటాడా అనేది చూడాలి.

సొంత పార్టీ వాళ్లని ఆగాం.. లేదంటే బంతాట ఆడేవాళ్లంతెలంగాణSwechaa25 Aug 2026, 08:13 PM

సొంత పార్టీ వాళ్లని ఆగాం.. లేదంటే బంతాట ఆడేవాళ్లం

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నోరు జారారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ ను ప్రశ్నించే స్థాయి సుస్మితకు లేదన్నారు. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఎవరు మాట్లాడినా తప్పే అని తేల్చి చెప్పారు. నా కూతురు అలా కించపరిచేలా మాట్లాడినా తప్పే అన్నారు. కాంగ్రెస్ నాయకులకు పీఏసీలో మాట్లాడే అవకాశం ఉందన్నారు. కానీ, ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

ప్రధాని మోదీ ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్ వెళ్లారుతెలంగాణSwechaa25 Aug 2026, 07:44 PM

ప్రధాని మోదీ ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్ వెళ్లారు

ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా టూర్ ను కేంద్రం అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రిని కాదు తెలంగాణ ప్రజలను బీజేపీ అవమానించింది. రేవంత్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? మోదీ ప్రధాని అయ్యాక ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్ వెళ్లారు. అనధికారికంగా మోదీ పాకిస్తాన్ వెళితే తప్పు లేదు కానీ అధికారికంగా సీఎం రేవంత్ అమెరికా వెళితే తప్పా? తన పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం రేవంత్ విదేశాంగశాఖకు ముందే ఇచ్చారు. అందులో ఎలాంటి సీక్రెట్ లేదు అని జగ్గారెడ్డి అన్నారు.

ఇరుముడి మూవీ టీమ్ కు షాకిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు!..సినిమాSwechaa25 Aug 2026, 07:31 PM

ఇరుముడి మూవీ టీమ్ కు షాకిచ్చిన ఉపాధ్యాయ సంఘాలు!..

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న వేళ.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఉపాధ్యాయ వృత్తిని, ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను కించపరిచేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఏపీటీఎఫ్ ఆరోపించింది. ముఖ్యంగా ఓ మహిళా టీచర్ పాత్రను అనైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తిగా చూపించడం అభ్యంతరకరమని పేర్కొంది.

ఇలా చేయండి మీ ఆదాయం పెంచుకోండి- పసుపు రైతులతో గవర్నర్తెలంగాణSwechaa25 Aug 2026, 06:24 PM

ఇలా చేయండి మీ ఆదాయం పెంచుకోండి- పసుపు రైతులతో గవర్నర్

Governor Shiv Pratap Shukla: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు మెమెంటోలు అందించి అభినందించారు. అనంతరం పసుపు రైతులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు.

అధికార కాంగ్రెస్‌లో హైటెన్షన్.. ఇద్దరు నేతలపై వేటు తప్పదా?..తెలంగాణSwechaa25 Aug 2026, 06:16 PM

అధికార కాంగ్రెస్‌లో హైటెన్షన్.. ఇద్దరు నేతలపై వేటు తప్పదా?..

అధికార కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు, బహిరంగ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ, పార్టీ నాయకుడు చిన్నారెడ్డి వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి నివేదికను ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌కు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. బహిరంగ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన కమిటీ.. కీలక అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఇప్పుడు హైకమాండ్ నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడుతుందా? అన్న చర్చ కాంగ్రెస్‌లో జోరందుకుంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఎవరైనా డబ్బులు అడిగితే..తెలంగాణSwechaa25 Aug 2026, 05:48 PM

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఎవరైనా డబ్బులు అడిగితే..

Pabbu Sathish: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పబ్బు సతీష్ హాజరై స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

Hyderabad:పేదల సొంతింటి కలను నిజం చేయనున్న ఇందిరమ్మ టవర్స్‌.. 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో  పూర్తి అయిన టెండ‌ర్ ప్ర‌క్రియ!..తెలంగాణSwechaa25 Aug 2026, 05:31 PM

Hyderabad:పేదల సొంతింటి కలను నిజం చేయనున్న ఇందిరమ్మ టవర్స్‌.. 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తి అయిన టెండ‌ర్ ప్ర‌క్రియ!..

హైదరాబాద్‌ నగర పరిధిలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌కు టెండర్‌ ప్రక్రియ పూర్తవగా.. 40,900 మంది అర్హులను గుర్తించారు. ఈ నెల 27 నుంచి 30 వరకు అర్హుల సమక్షంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎంపిక కాని వారికి 10 వేల రూపాయల ఈఎండీని తిరిగి చెల్లించనున్నారు. మరో నాలుగు నియోజకవర్గాల్లో 1,920 ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు ఆహ్వానించారు. సెప్టెంబర్‌ 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేద కుటుంబాలకు విలువైన భూమితో పాటు సొంతింటిని అందించడమే ఇందిరమ్మ టవర్స్‌ లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు.

The Paradise: ప్యారడైజ్ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్సినిమాSwechaa25 Aug 2026, 05:17 PM

The Paradise: ప్యారడైజ్ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ది ప్యారడైజ్' సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాకి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. ఇక, మొదటి పాట ఆయా షేర్ ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్..రెండవ పాటను కూడా రాశాడు. ఆ సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తైంది. ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు శ్రీకాంత్ పిక్ ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

మూసీ ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa25 Aug 2026, 04:45 PM

మూసీ ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Cm Revanth: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం. ఈ ప్రాజెక్ట్ ను వేగంగా ముందుకు తీసుకెళ్లడంపై ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ MCRHRD బోధి పెవిలియన్ లో పలు శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పురోగతిపై ఆరా తీశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును వేగవంతం చేసేలా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్, హెచ్ ఎండీఏ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. ప్రశ్నాపత్నం లీకేజీ పై భగ్గుమన్న విద్యార్థులు!..NationalSwechaa25 Aug 2026, 04:23 PM

సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు.. ప్రశ్నాపత్నం లీకేజీ పై భగ్గుమన్న విద్యార్థులు!..

బీహార్ రాజధాని పాట్నాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రశ్నాపత్నం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. గత కొన్ని రోజులుగా గాంధీ మైదాన్‎లో నిరసన తెలుపుతోన్న విద్యార్థులు ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసం ముట్టడికి యత్నించారు.

Yash-Toxic: టికెట్ రేట్లను పెంచేశారు..రోజుకి 5 షోలు..ఇక సునామీనేసినిమాSwechaa25 Aug 2026, 04:02 PM

Yash-Toxic: టికెట్ రేట్లను పెంచేశారు..రోజుకి 5 షోలు..ఇక సునామీనే

Yash-Toxic: ఒక కన్నడ స్టార్ హీరో సినిమాకి తెలుగులో అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుకునే వీలుంటుందా? అనే అమాట ఇటీవల బాగా వినిపించింది. ఇప్పుడు అదే మాట నిజమైంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి ఏపీ, తెలంగాణాలలో టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే, షోస్ కూడా అదనంగా ప్రదర్శించుకునేలా జీవోను పాస్ చేశారు. నైజాంలో సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో 100 రూపాయలు అదనంగా, అలాగే 5 షోలకి అనుమతినిచ్చారు.

లక్షలాది మందితో అసెంబ్లీ ముట్టడి!తెలంగాణSwechaa25 Aug 2026, 03:58 PM

లక్షలాది మందితో అసెంబ్లీ ముట్టడి!

Harish Rao: 22ఏ నిషేధిత భూముల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం రాజకీయాల్లో హీట్ పెంచేసింది. కాంగ్రెస్ సర్కార్ ను ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. 22ఏ బాధితుల పక్షాన నిలిచిన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బేషరతుగా 22ఏ జాబితా నుంచి నిషేధిత భూములను తొలగించాలని రేవంత్ సర్కార్ ను హరీశ్ రావు డిమాండ్ చేశారు.

ఫీజు బకాయి-బీజేపీ లడాయిలో అపశృతి!..తెలంగాణSwechaa25 Aug 2026, 03:50 PM

ఫీజు బకాయి-బీజేపీ లడాయిలో అపశృతి!..

రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు‌రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్షలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఫీజు బకాయి-బీజేపీ లడాయి పేరుతో నిరాహార దీక్ష చేపట్టింది. ఈ పోరాటంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి రాంచందర్ రావు దీక్షలో కూర్చున్న క్రమంలో ఆయన రక్తపోటు 90/60కి పడిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నందున విశ్రాంతి తీసుకోవాలని, దీక్షను విరమించాలని వైద్య బృందం ఆయనకు సూచించింది.

రాష్ట్రంలో అమ్మకానికి గురుకుల సీట్లు?తెలంగాణSwechaa25 Aug 2026, 02:44 PM

రాష్ట్రంలో అమ్మకానికి గురుకుల సీట్లు?

రాష్ట్రంలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలోని సీట్లను కొందరు అక్కమార్కులు అమ్ముకుంటున్నట్టు సమాచారం. ఈ అకడమిక్ ఇయర్‌లో విద్యార్థుల అడ్మిషన్లు రాక ఖాళీగా ఉన్న సీట్లను దళారుల సాయంతో అధికారులు విక్రయిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వ పాఠశాల సీట్లను అమ్ముకోవడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా.. అర్హులైన వారికి కేటాయించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివరాల్లోకివెళితే.. గురుకుల సొసైటీల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఖాళీగా ఉన్న సీట్లను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో, నెలన్నర రోజుల నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాల స్థాయిలో సరైన సమాచారం లేకపోవడంతో, అనేక జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లోని గురుకుల ప్రధాన కార్యాలయం ఎదుట సీటు కోసం తల్లిదండ్రుల పడిగాపులు కాస్తున్నట్టు సమాచారం.

సర్కారీ బడిలో మళ్లీ ఫుడ్ పాయిజన్..తెలంగాణSwechaa25 Aug 2026, 02:24 PM

సర్కారీ బడిలో మళ్లీ ఫుడ్ పాయిజన్..

తాజాగా మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది.ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 13 మంది విద్యార్ధులను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఖమ్మం జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. అల్పాహారం తిన్న కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడిన 13 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్లు అరెస్టుతెలంగాణSwechaa25 Aug 2026, 02:06 PM

హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్లు అరెస్టు

హైదరాబాద్ మహానగరంలో మరోసారి మాయాగాళ్లు పోలీసులకు చిక్కారు. నకిలీ క్లినిక్స్ తెరిచి తాము డాక్టర్లం అని చెప్పుకుని వీరంతా రోగులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి విద్యార్హత లేకుండా వైద్యం చేస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగి వారిని పట్టుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్ కావడం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. ఎలాంటి వైద్య అర్హతలు, కనీసం ప్రాక్టిస్ చేసిన ధ్రువపత్రాలు కూడా లేకుండా వీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు తెలిసింది. నకిలీ డాక్టర్ల ముఠాను సిటీ పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. నగరంలోని పలు ఏరియాల్లో వీరంతా గుట్టుగా క్లినిక్స్ రన్ చేస్తున్నట్టు సమాచారం.