స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఫ్యూచర్ సిటీ హామీలు అబద్ధం.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు!తెలంగాణSwechaa25 Aug 2026, 02:00 PM

ఫ్యూచర్ సిటీ హామీలు అబద్ధం.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు!

తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రికి, ఆయన మంత్రివర్గ సహచరులకు మధ్య కనీస సయోధ్య లేదని సచివాలయ వేదికగానే బయటపడిందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి కూర్చున్న 10 నిమిషాల తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం వారి మధ్య ఉన్న తీవ్ర విభేదాలకు అద్దం పడుతోందన్నారు. ఒకే కేబినెట్ సబ్ కమిటీలో ఉండి కూడా మంత్రులు సమయానికి హాజరు కాకపోవడం పాలనా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.

కాంగ్రెస్ నేతలకు మీనాక్షి వార్నింగ్తెలంగాణSwechaa25 Aug 2026, 01:51 PM

కాంగ్రెస్ నేతలకు మీనాక్షి వార్నింగ్

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియను చేపట్టగా సుమారు 70 లక్షలకు పైగా ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకున్నారు.రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున ఓట్లు డిలీట్ అయ్యాయని, కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారని ఆమె సీరియస్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహా పీసీసీ చీఫ్ మిగతా రాష్ట్రస్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో ఆమె జూమ్ మీటింగ్ నిర్వహించినట్టు తెలిసింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2% ఓట్లతోనే అని గుర్తుచేశారు.ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా లక్షల ఓట్లు తొలగిపోతున్నాయని, ఆ ఓట్లను కాపాడే బాధ్యత మనదేనని నాయకులకు ఆమె తేల్చి చెప్పినట్టు సమాచారం.

సోషల్ మీడియాపై సీఎం రేవంత్ ఫోకస్.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ కార్యాచరణ!తెలంగాణSwechaa25 Aug 2026, 01:19 PM

సోషల్ మీడియాపై సీఎం రేవంత్ ఫోకస్.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా కాంగ్రెస్ కార్యాచరణ!

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను అత్యంత సమర్థవంతంగా ఉపయోగిస్తోందని, దానికి సరైన రీతిలో చెక్ పెట్టకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవాలని, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేలా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం విస్తృతంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరికాదు : అలహాబాద్ హైకోర్టుNationalSwechaa25 Aug 2026, 01:11 PM

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరికాదు : అలహాబాద్ హైకోర్టు

హిజాబ్ సంస్కృతి అనేది పాఠశాలల్లో వర్తింపజేయాలని ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పాఠశాలలో తాను యూనిఫామ్‌తో పాటు తలకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని, ఈ మేరకు పాఠశాలకు ఆదేశాలివ్వాలని సదరు విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఇస్లాంలో హిజాబ్ ధరించడం అత్యవసరమైన మతపరమైన ఆచారమని నిరూపించేందుకు వాస్తవ, చట్టపరమైన ఆధారాలను లేవని స్పష్టంచేసింది. ఈ ఘటన యూపీ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌‌లో వెలుగుచూసింది. ప్రయాగ్ రాజ్‌‌లో అత్తర్ సూయియా ప్రాంతంలో ఠాగూర్ పబ్లిక్ స్కూల్ ఉంది. అందులో చదివే ఓ విద్యార్థిని సుకైనా రిజ్వీ.. తన తల్లి ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దానిని కొట్టివేసింది.

అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఫుడ్ లైసెన్సులు రద్దువ్యాపారంSwechaa25 Aug 2026, 01:06 PM

అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ ఫుడ్ లైసెన్సులు రద్దు

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు అయిన అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్‌లకు సంబంధించిన ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఆహారంగా తీసుకునేందుకు ఎందుకు పనికిరాని, విషపూరితమైన ఉమ్మెత్త కాయలు, వాటి విత్తనాలను స్టోర్ చేసి మరీ విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ కోల్డ్ స్టోరేజీల్లో ఉమ్మెత్త కాయలు,వాటి విత్తనాలు లభ్యం కావడంతో ఆయా సంస్థల ఫుడ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఫ్యూచర్ సిటీలో భూదందా.. యజమానుల సంతకాలు ఫోర్జరీ.. నలుగురి అరెస్ట్!తెలంగాణSwechaa25 Aug 2026, 01:04 PM

ఫ్యూచర్ సిటీలో భూదందా.. యజమానుల సంతకాలు ఫోర్జరీ.. నలుగురి అరెస్ట్!

ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీ భూదందా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూ యజమానుల సంతకాలను ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల విలువైన భూములను హస్తగతం చేసుకునేందుకు యత్నించడం సంచలనంగా మారింది. అసలు యజమానులకు తెలియకుండా వారి పేర్లతో 'డెవలప్‌మెంట్ అగ్రిమెంట్-కమ్-ఇర్రెవొకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)' సృష్టించి అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసు రిమాండ్ కేస్ డైరీ (RCD) ఆధారంగా సంచలన నిజాలు బయటపడ్డాయి.

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ.. యువత కోసం రేవంత్ బిగ్ ప్లాన్!తెలంగాణSwechaa25 Aug 2026, 12:39 PM

సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ.. యువత కోసం రేవంత్ బిగ్ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన కీలక భేటీలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయి, సభ ముందుకు రానున్న అజెండా అంశాలు ఏమిటనే దానిపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.

అమెరికా చదువులు మాకొద్దు.. భారత యువత సంచలన నిర్ణయంప్రపంచంSwechaa25 Aug 2026, 12:21 PM

అమెరికా చదువులు మాకొద్దు.. భారత యువత సంచలన నిర్ణయం

అమెరికాలో చదవాలనే కోరికను భారతీయ విద్యార్థులు తగ్గించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఆ దేశ అధ్యక్షుడు అయ్యాక ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నవారిలో భారతీయులే ఉన్నారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న వారు, చదువుకుంటున్న వాళ్లు, గ్రీన్‌కార్డు ఉన్నవారు సైతం ట్రంప్ తీసుకునే నిర్ణయాలకు వణికిపోతున్నారు. స్టూడెంట్ వీసా చార్జీలు పెంచడం, హెచ్ 1బీ వీసా మీద ఆంక్షలు, గ్రీన్ కార్డు ఉన్నవారికి సైతం ఆంక్షలు, రివ్యూలు చేస్తుండటంతో ఇండియన్స్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో చదువుకోసం ఏటా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. అక్కడి UG కోర్సుల్లో భారతీయ విద్యార్థుల దరఖాస్తులు 15 శాతం తగ్గినట్లు సమాచారం. యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనలు కఠినతరం కావడంతో భారతీయ విద్యార్థుల ఉన్నత కలలు చెదిరిపోతున్నాయి.

కాళేశ్వరంపై కాంగ్రెస్ ‘దుష్ప్రచారం’ పటాపంచలు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ధ్వజం!తెలంగాణSwechaa25 Aug 2026, 12:09 PM

కాళేశ్వరంపై కాంగ్రెస్ ‘దుష్ప్రచారం’ పటాపంచలు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ధ్వజం!

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిగా కుప్పకూలిందని, నీటిని ఎత్తలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారం అబద్ధమని ఎన్డీఎస్‌ఏ (NDSA) అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (CWPRS) నివేదికల ద్వారా స్పష్టమైందని బీఆర్ఎస్ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని స్వయంగా ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేయడంతో పాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోని ఏ బ్లాక్‌లోనూ ఎలాంటి నిర్మాణపరమైన లోపాలు లేవని, కాంక్రీట్ నాణ్యత బాగుందని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ తేల్చిచెప్పినట్లు ఆయన తెలిపారు.

తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో అక్కాతమ్ముడి  సత్తాతెలంగాణSwechaa25 Aug 2026, 12:09 PM

తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో అక్కాతమ్ముడి సత్తా

తెలంగాణలో నిర్వహించిన తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌–2026లో అక్కా తమ్ముడు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒకేసారి నాలుగు పతకాలు సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్న మాలోత్ సాన్వి రియా, మాలోత్ ఆరుష్ మిథుల్ సత్తా చాటారు.దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు 12 దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 9వ తరగతి చదువుతున్న సాన్వి రియా 14 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం, పూమ్సే విభాగంలో కాంస్య పతకం సాధించింది. సాన్వి రియా తమ్ముడు, 3వ తరగతి విద్యార్థి ఆరుష్ మిథుల్ 8 ఏళ్లలోపు క్యోరుగి విభాగంలో స్వర్ణ పతకం సాధించగా, వేగవంతమైన పంచింగ్‌ విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు.

Rashmika Mandanna: ‘రణబాలి’ రిలీజ్ డేట్ మారడానికి కారణం రష్మిక!సినిమాSwechaa25 Aug 2026, 11:33 AM

Rashmika Mandanna: ‘రణబాలి’ రిలీజ్ డేట్ మారడానికి కారణం రష్మిక!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న సినిమాలలో ‘రణబాలి’ కూడా ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాను సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, రష్మికకి గాయం అయిన కారణంగా ఇప్పుడు అక్టోబర్ 30కి విడుదల వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.

చక్కెర ‘హోల్‌సేల్’ ఊరట... ‘రిటైల్’ నిరాశ!వ్యాపారంSwechaa25 Aug 2026, 11:09 AM

చక్కెర ‘హోల్‌సేల్’ ఊరట... ‘రిటైల్’ నిరాశ!

దేశంలో చక్కెర ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వరుస చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు 10లక్షల టన్నుల ముడి పంచదారను ఎలాంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం, అలాగే అక్రమ నిల్వలపై ఉక్కుపాదం మోపడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు వేగంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజుల్లోనే హోల్‌సేల్ ధరలు 15శాతం మేర తగ్గి, ఫ్యాక్టరీ గేట్ వద్ద క్వింటాల్‌పై దాదాపు రూ.800 వరకు తగ్గుదల నమోదైంది.

ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. ప్రభుత్వ నిర్ణయంపై వివాదం!తెలంగాణSwechaa25 Aug 2026, 10:44 AM

ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. ప్రభుత్వ నిర్ణయంపై వివాదం!

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద బస్ భవన్ సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన ఆరున్నర ఎకరాల ఆర్టీసీ భూమిని స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విలువైన ప్రాంగణంలో నిరుపేదల కోసం 'ఇందిరమ్మ ఇండ్లు' నిర్మించాలని సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో హైదరాబాద్-3 డిపోగా సేవలందించిన ఈ స్థలాన్ని, ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ తమ నూతన బస్సుల ఛాసీ(బస్సు బాడీని మోసే కింది భాగంలోని ప్రధాన ఫ్రేమ్‌)లను నిలిపే యార్డుగా ఉపయోగిస్తోంది.

భిక్షురాలి ఇంట్లో కట్టల కొద్దీ నగదువైరల్ న్యూస్Swechaa25 Aug 2026, 10:25 AM

భిక్షురాలి ఇంట్లో కట్టల కొద్దీ నగదు

భిక్షాటన చేసే ఓ వృద్ధురాలి ఇంట్లో రూ.40 లక్షల నగదు లభ్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యలో వెలుగుచూసింది. స్థానికంగా ఉండే మసీదు వద్ద ఓ వృద్ధురాలి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేంది. అయితే, ఏళ్లుగా మసీదు బయట భిక్షాటన చేస్తూ జీవించిన హూర్ అనే వృద్ధురాలు ఇటీవల మృతి చెందింది. అంత్యక్రియల అనంతరం ఆమె ఇంటికి వెళ్లిన స్థానికులకు గోనె సంచుల్లో భారీగా నగదు, నాణేలు కనిపించడంతో అంతా షాక్‌ అయ్యారు.వాటిని లెక్కించగా..దాదాపు రూ.30-40 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. తనను కుటుంబ సభ్యులు పట్టించుకోవడం లేదని, భిక్షాటనే తన జీవనాధారమని హూర్ చెప్పేదని స్థానికులు తెలిపారు.ఆమె దాచుకున్న డబ్బును మసీదుకు విరాళంగా ఇవ్వాలని కొందరు సూచించగా.. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించబోమని మసీదు కమిటీ తిరస్కరించినట్లు సమాచారం.

H1B Visa: హెచ్-1బీ వీసా రుసుము పెంపు..!InternationalSwechaa25 Aug 2026, 10:23 AM

H1B Visa: హెచ్-1బీ వీసా రుసుము పెంపు..!

అమెరికాలో ఉద్యోగం చేయాలని భావిస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్ రంగానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (DHS) భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్‌లపై అదనంగా 1,03,265 డాలర్ల (సుమారు రూ.86లక్షలకు పైగా) భారీ రుసుమును వసూలు చేయాలని ప్రతిపాదించింది. దరఖాస్తు దాఖలు చేసే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ ప్రాసెసింగ్ ఫీజులకు పూర్తిగా అదనమని స్పష్టం చేసింది.

ఇరాన్‌పై అమెరికా ఆంక్ష‌లు.. త‌గ్గేదే లేదంటున్న టెహ్రాన్! ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌దా?InternationalSwechaa25 Aug 2026, 10:11 AM

ఇరాన్‌పై అమెరికా ఆంక్ష‌లు.. త‌గ్గేదే లేదంటున్న టెహ్రాన్! ఈ యుద్ధం ఇప్ప‌ట్లో ఆగ‌దా?

అమెరికా లక్ష్యం ఇరాన్‌ను ఆర్థికంగా బలహీనపరిచి చర్చల బాట పట్టించడం అయితే.. ఆంక్షలు మరింత పెరగడం వల్ల ఇరాన్‌ వెనక్కి తగ్గుతుందా? లేక తనపై ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా?

ఈవీఎంలు ఫుల్లీ  సేఫ్..అవి ఇంటర్నెట్‌తో కనెక్ట్  కావు : సీఈసీNationalSwechaa25 Aug 2026, 10:02 AM

ఈవీఎంలు ఫుల్లీ సేఫ్..అవి ఇంటర్నెట్‌తో కనెక్ట్ కావు : సీఈసీ

ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు పదే పదే వస్తుండటంతో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఉపయోగించే ఈవీఎంలు ప్రభుత్వ రంగానికి చెందిన పరిశ్రమల్లో తయారవుతాయని.. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి వైర్‌లెస్ టెక్నాలజీలతో అవి కనెక్ట్ కాలేవన్నారు.యూపీలోని లక్నో పర్యటనలో భాగంగా చారిత్రాత్మక ‘కొల్విన్ తాలూక్దార్స్ కాలేజ్’లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ,ఎన్నికల ప్రక్రియ,ఈవీఎంల నమ్మకం, యువ ఓటర్ల ప్రాముఖ్యతపై మాట్లాడారు. ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని స్పష్టంచేశారు. దేశంలో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు నిర్వహించడం ఒక బృహత్తర బాధ్యత అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

స్వేచ్ఛ న్యూస్‌కు మేఘా నోటీస్?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa25 Aug 2026, 09:58 AM

స్వేచ్ఛ న్యూస్‌కు మేఘా నోటీస్?

ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల యజమానిగా స్వేచ్ఛ న్యూస్ పురుడు పోసుకుని రెండు నెలలు కూడా కాలేదు. వేలు దాటి లక్షల వ్యూస్‌కు ఇంకా చేరలేదు. ఎక్స్ అకౌంట్‌లో మీ వార్త చదివింది 76 మందే. ఆ చిన్న న్యూస్‌కే దేశంలోనే అత్యంత సంపద కలిగిన పవర్ ఫుల్ కంపెనీ, 20 దేశాలకు పైగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్న ఎంఈఐఎల్ సంస్థ లీగల్ నోటీస్‌కు సిద్ధమైంది.

అన్నింటికి సిద్ధమై సత్యాలే వార్తలుగా డేర్ అండ్ డ్యాషింగ్‌తో ఇన్వెస్టిగేటివ్ కథనాలను ప్రజల ముందు ఉంచుతున్నాం. అయితే, ఈ చిన్న వార్తకు సుప్రీంకోర్టు మాజీ సెక్రెటరీ పేరుతో నోటీసులు రావడం వెనుక భవిష్యత్‌పై భయం అయినా అయి ఉండాలి. లేదా గత ఐదేండ్లలో మేఘాపై ఇన్వెస్టిగేషన్ కథనాలతో పొలిటికల్ లీడర్స్‌కు, అధికారులకు ఎలా తెలియజేశామో గుర్తుకు వచ్చి ఉండాలి.

మీరు స్వేచ్ఛ న్యూస్‌ను ఒక పెద్ద వ్యవస్థగా మార్చాలనుకుంటే... నేను కూడా ప్రతిరోజూ ఆధారాలతో వార్తలు రాయడానికి సిద్ధంగా ఉన్నాను. కోర్టులు, కేసుల పేరుతో చేసే ఎలాంటి కుట్రలకూ నేను భయపడను. మీరు నోటీసుకు సిద్ధమైతే... నేను కూడా చట్టపరంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను.

చెత్తలో పడేసిన చాక్లెట్ల కోసం ఎగబడిన జనం (వీడియో)వైరల్ న్యూస్Swechaa25 Aug 2026, 09:47 AM

చెత్తలో పడేసిన చాక్లెట్ల కోసం ఎగబడిన జనం (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతున్నది. కొందరు జనాలు చెత్త కుప్పలో పడేసినా చాక్లెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అసలు వీళ్లు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఉచితంగా వస్తుందంటే చాలు.. ఎగబడి మరీ ఎత్తుకెళ్తారు అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చెత్తలో పడేసిన ఎక్స్‌పైరీ చాక్లెట్ల కోసం జనం ఎగబడిన దృశ్యాలు చూసి చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని పంకి ప్రాంతంలోచోటు చేసుకుంది. కాలం చెల్లిన చాక్లెట్లను ఓ షాప్ సిబ్బంది సమీపంలోని చెత్తకుప్పలో పడేయగా.. గమనించిన ప్రజలు.. వెంటనే ఆ చాక్లెట్లు ఎత్తుకెళ్లడం కోసం క్యూ కట్టారు. చెత్తలో ఎందుకు పడేశారని ఆలోచించకుండా.. అందినకాడికి పట్టుకెళ్లారు.

మిలాద్-ఉన్-నబీ 'జల్సా'.. నేటి సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలుతెలంగాణSwechaa25 Aug 2026, 09:46 AM

మిలాద్-ఉన్-నబీ 'జల్సా'.. నేటి సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న 'జల్సా' కార్యక్రమం నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా దరుస్సాలం రోడ్డు పరిసర ప్రాంతాలలో భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్ ప్రకటించారు. ఈ ఆంక్షలు ఆగస్టు 25 సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 26 ఉదయం 4 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.

జలదిగ్భంధంలో ఢిల్లీ ప్రధాన రహదారులుNationalSwechaa25 Aug 2026, 09:28 AM

జలదిగ్భంధంలో ఢిల్లీ ప్రధాన రహదారులు

దేశరాజధాని ఢిల్లీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో రాజధానిలోని ప్రధాన రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మెయిర్ రోడ్డులు చెరువులను తలపిస్తున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు సమాచారం. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తమ గమ్యస్థానాలకు చేరుకోలేక సామాన్యలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులపై రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజా రవాణా వైపు మళ్లినట్టు సమాచారం.దీంతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరో 24 గంటల పాటు ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

యూపీఐకి పదేళ్లు.. రికార్డు స్థాయి లావాదేవీలు!వ్యాపారంSwechaa25 Aug 2026, 09:27 AM

యూపీఐకి పదేళ్లు.. రికార్డు స్థాయి లావాదేవీలు!

పదేళ్ల కిందట ఏ వస్తువు కొనడానికి అయినా నగదు రూపంలో కానీ, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుల రూపంలో చెల్లింపులు జరిగేవి. ఆ తర్వాత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) రాకతో ప్రపంచ ఆర్థిక స్థితిగతులే మారిపోయి భారత్ డిజిటల్ ఇండియాగా అవతరించింది. భారత డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలుస్తున్న యూపీఐ తన ప్రస్థానంలో విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యూపీఐకి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించింది.

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ!తెలంగాణSwechaa25 Aug 2026, 09:21 AM

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ!

అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేయడంతో రైతన్నల మొఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అయితే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇబ్బందులను కూడా సృష్టిస్తున్నాయి.

ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తున్నాయా?..SpiritualitySwechaa25 Aug 2026, 09:10 AM

ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తున్నాయా?..

ధ్యానం చేస్తున్నప్పుడు మనసులో ఏవో ఒక ఆలోచనలు రావడం చాలా సహజం. అలా ఆలోచనలు వచ్చిన ప్రతిసారీ అయ్యో! నా ధ్యానం పాడైపోయింది అని ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అసలు ధ్యానం అంటే ఆలోచనలను బలవంతంగా ఆపేయడం కాదు. మనస్సు అనేది ఒక పరికరం మాత్రమే. అది ఇన్నాళ్లూ తనకిష్టమొచ్చినట్లు పరిగెత్తి అలవాటు పడింది..

పతంజలి మహర్షి యోగసూత్రాలలో యోగానికి ఇచ్చిన నిర్వచనం చిత్తవృత్తి నిరోధం.. అంటే మన చిత్తం అడుగు పొరల్లో, ఎన్నో జన్మల సంస్కారాలు దాగి ఉంటాయి. మన సైకాలజీ చెప్పే సబ్‌కాన్షస్ మైండ్ లాంటిదే ఈ చిత్తం. సరస్సు అడుగున ఏర్పడిన బుడగలు పైకి ఉబికి వచ్చినట్లుగా.. ఆ సంస్కారాల నుంచే ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల్లో పడి కొట్టుకుపోకుండా ఉండటమే మనం చేయాల్సిన మొదటి పని.

మరణించిన పితృ దేవతలకు తర్పణాలు ఎందుకు!..SpiritualitySwechaa25 Aug 2026, 07:44 AM

మరణించిన పితృ దేవతలకు తర్పణాలు ఎందుకు!..

సనాతన ధర్మంలో తల్లిదండ్రులకు, పూర్వీకులకు అత్యున్నతమైన స్థానం ఉంది. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పడమే కాకుండా, వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా వారితో మనకున్న అనుబంధం తెగిపోదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అదే పితృ తర్పణాల విశిష్టత.. ఇక తర్పణం అంటే తృప్తిపరచడం. మన రక్తసంబంధీకులు, మన వంశకర్తలు పితృలోకంలో ఉన్నప్పుడు, వారికి నీరు, నువ్వులతో అర్పించే అంజలినే తర్పణం అంటాం. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే... మనిషి శరీరం నశిస్తుంది కానీ ఆత్మ అమరం. శరీరాన్ని వదిలిన ఆత్మ తన పూర్వ కర్మల ఆధారంగా ముందుకు సాగుతుంది. ఆ ప్రయాణంలో వారికి కావలసిన సూక్ష్మ శక్తినీ, శాంతినీ మన భక్తిపూర్వకమైన తర్పణాలు అందిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి..

అంతర్జాతీయ న్యాయ సేవలకు వేదికగా హైదరాబాద్తెలంగాణSwechaa25 Aug 2026, 12:06 AM

అంతర్జాతీయ న్యాయ సేవలకు వేదికగా హైదరాబాద్

Uttam Kumar Reddy: అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలతో అనుసంధానం చేస్తూ, వివిధ దేశాలకు సంబంధించిన న్యాయ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్’ హైదరాబాద్ కార్యాలయాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.

క్యూట్ గున్నావు.. మీటవుతావా? మాజీ క్రీడా మంత్రిపై సంచలన ఆరోపణలువైరల్ న్యూస్Swechaa24 Aug 2026, 11:52 PM

క్యూట్ గున్నావు.. మీటవుతావా? మాజీ క్రీడా మంత్రిపై సంచలన ఆరోపణలు

Pratibha Thakkadpally: అంతర్జాతీయ అథ్లెట్, తెలంగాణ క్రీడాకారిణి తక్కడపల్లి ప్రతిభ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని క్రీడా శాఖ మంత్రిపై ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రతిభ మాట్లాడారు. అదే సమయంలో తన జీవితంలో, క్రీడా రంగంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె వాపోయారు. ఇక, పొలిటికల్ గా గత ప్రభుత్వంలో ఉన్న క్రీడా శాఖ మంత్రికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో ప్రతిభ చెప్పారు. ఆ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వివరించారు.

చైనాకు మళ్లీ దగ్గరవుతున్న భారత్‌? జిన్‌పింగ్‌ రాక వెనుక అసలు లెక్కేంటి?InternationalSwechaa24 Aug 2026, 11:36 PM

చైనాకు మళ్లీ దగ్గరవుతున్న భారత్‌? జిన్‌పింగ్‌ రాక వెనుక అసలు లెక్కేంటి?

భారత్‌, చైనా రెండూ ప్రస్తుతం మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నాయి. అమెరికా వాణిజ్య విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిణామాలు వంటి అంశాలు ఇరు దేశాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూనే.. కొన్ని అంతర్జాతీయ అంశాల్లో కలిసి పనిచేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది.

Raviteja-Shiva Nirvana: ఇరుముడి సంబరాల్లో మునిగితేలుతున్న చిత్రబృందంసినిమాSwechaa24 Aug 2026, 09:46 PM

Raviteja-Shiva Nirvana: ఇరుముడి సంబరాల్లో మునిగితేలుతున్న చిత్రబృందం

Raviteja-Shiva Nirvana: ఇరుముడి సంబరాల్లో మునిగితేలుతున్న చిత్రబృందం. అవును..ఈ ఆగస్టు 21న భారీ స్థాయిలో రిలీజైంది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఒకే ఒక్కరోజులో పబ్లిక్ టాక్ దెబ్బకి బ్లాక్ బస్టర్ అని సెలబ్రేషన్స్ జరిపారు. ఒకటిన్నర రోజులోనే లాభాల్లోకి వచ్చింది ఈ చిత్రం. తాజాగా, ఈ సినిమా భారీ హిట్ అయిన నేపథ్యంలో భారీ కేక్ కట్ చేసి దర్శకుడు శివ నిర్వాణ హీరో రవితేజ డాన్సులతో ఎంజాయ్ చేశారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్‌ నాయకత్వం కుట్రతెలంగాణSwechaa24 Aug 2026, 09:33 PM

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్‌ నాయకత్వం కుట్ర

Cm Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంపై గుజరాత్ ఆధిపత్యాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్రం తనను అడ్డుకున్నా, తన లక్ష్యాన్ని మాత్రం అడ్డుకోలేదని అన్నారు. డిసెంబర్​లో ఫ్యూచర్​ సిటీలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో పెట్టుబడులకు అవకాశాలను వివరిస్తామన్నారు. తన విదేశీ పర్యటనలో ఎలాంటి గోప్యతా లేదని, మొత్తం షెడ్యూల్​ను విదేశాంగశాఖ ముందుంచామన్నారు. లండన్​ పర్యటన ముగించుకుని హైదరాబాద్​ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్రం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.