స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావుతెలంగాణSwechaa24 Aug 2026, 09:21 PM

భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావు

ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తి కావన్నారు. భూసేకరణ, ఆర్అండ్ఆర్, అటవీ అనుమతులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

Balakrishna: NBK111 టైటిల్స్ పరిశీలనలో దాదా..గాడ్!సినిమాSwechaa24 Aug 2026, 09:13 PM

Balakrishna: NBK111 టైటిల్స్ పరిశీలనలో దాదా..గాడ్!

Balakrishna: గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కలయికలో ఇంతకముందు వీర సింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ టైటిల్, బాలయ్య మేకోవర్ బాగా కుదిరాయి. దాంతో, ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమా లుక్ అండ్ టైటిల్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల టీజర్ ను వదిలారు. అందులో బాలయ్య లుక్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్ కూడా ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటాయని హింట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఇక, ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ ని రిజిస్టర్ చేయించారట. వాటిలో ఒకటి 'దాదా' కాగా, మరో టైటిల్ 'గాడ్'. కథకి ఈ రెండు టైటిల్స్ బాగా యాప్ట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారట.

God Of War: ఎన్టీఆర్ లుక్ కోసం త్రివిక్రమ్ చేస్తున్నదేంటీ?సినిమాSwechaa24 Aug 2026, 08:46 PM

God Of War: ఎన్టీఆర్ లుక్ కోసం త్రివిక్రమ్ చేస్తున్నదేంటీ?

God Of War: ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇది, ఓ మైథలాజికల్ సబ్జెక్ట్. అంతేకాదు, ఈ సినిమా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. అందుకే, ఈ సినిమా కోసం త్రివిక్రమ్..చాలా రీసెర్చ్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని దేవుడిగా చూపించబోతున్నాడు. అంతేకాదు, ‘శివుడి కుమారుడు, పార్వతి గర్వకారకుడు అయిన సుబ్రహ్మణ్య స్వామి.. పాత్రలో తారక్ అలరించబోతున్నాడు. అందుకే, ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ కి సంబందించిన వర్క్ గురించే విఎఫ్ఎక్స్ టీమ్ తో త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నాడు.

జాతిని విచ్ఛిన్నం చేసే ఫౌండేషన్‌తో మీకేం పని?తెలంగాణSwechaa24 Aug 2026, 08:39 PM

జాతిని విచ్ఛిన్నం చేసే ఫౌండేషన్‌తో మీకేం పని?

సీఎం రేవంత్ భాష అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. గూట్లో రాయి తీయలేనొడు ఏట్లో రాయి తీస్తా అన్నాడట అట్లా ఉంది రేవంత్ తీరు అని ఎద్దేవా చేశారు. ఆక్స్ ఫర్డ్, విదేశీ చదువులు అని రేవంత్ అంటున్నారు.. అంతకంటే ముందు నుంచే నలందా, తక్షశిల లాంటి మన విద్యా సంస్థలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. జాతిని విచ్ఛిన్నం చేసే జార్జి సొరస్ ఫౌండేషన్ తో మీకు ఏం పని? అని రేవంత్ ను ప్రశ్నించారు. ప్రధాని మోదీని టెర్రరిస్ట్ తో పోల్చిన మేయర్ మామ్డానిని ఎందుకు కలవాలి అనుకున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వాళ్ళ గ్రోత్ రేట్, మన గ్రోత్ రేటు మీద చర్చకు సిద్ధమా? అని ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ విసిరారు ఎంపీ ఈటల రాజేందర్.

Wanaparthy: విద్యుత్‌ రంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట.. సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు!..తెలంగాణSwechaa24 Aug 2026, 08:28 PM

Wanaparthy: విద్యుత్‌ రంగ బలోపేతానికి ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట.. సబ్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు!..

వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం దావాజిపల్లిలో 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. కొత్త సబ్‌స్టేషన్‌తో పరిసర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా మెరుగుపడి, లో-వోల్టేజీ సమస్యలు, విద్యుత్‌ అంతరాయాలు తగ్గనున్నాయి. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో పాటు, రహదారులు, సాగునీరు, పర్యాటక రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు.

ఎక్కువ నీరు వాడుకుంటున్నారు-ఏపీపై తెలంగాణ ఫిర్యాదుతెలంగాణSwechaa24 Aug 2026, 08:25 PM

ఎక్కువ నీరు వాడుకుంటున్నారు-ఏపీపై తెలంగాణ ఫిర్యాదు

KRMB Meeting: హైదరాబాద్ జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి తెలంగాణ ఈఎన్సీ రమేశ్ బాబు, ఏపీ ఈఎన్సీ నరసింహమూర్తి హాజరయ్యారు. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి పంపిణీపై చర్చించారు. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై చర్చించేందుకు త్రిసభ్య కమిటీని సమావేశ పరిచారు.

Nirmal: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు!..తెలంగాణSwechaa24 Aug 2026, 07:37 PM

Nirmal: వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు!..

నిర్మల్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సంచలన దాడి చేశారు. జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్‌ను అనుకూలంగా తయారు చేసేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ స్టేట్ టాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తొలుత లక్ష రూపాయలు డిమాండ్ చేసి.. చివరకు రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. బాధితుడి ఫిర్యాదుతో వల పన్నిన అధికారులు లంచం నగదు స్వీకరిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది.

సీఎం రేవంత్ సోదరుడు, ఏసీపీ అధికారిపై సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa24 Aug 2026, 07:14 PM

సీఎం రేవంత్ సోదరుడు, ఏసీపీ అధికారిపై సంచలన ఆరోపణలు

Arvind Dharmapuri: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. నాయకులు ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగంపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో ఒక ఏసీపీ స్థాయి అధికారి తన కదలికలపై నిఘా పెట్టారని అర్వింద్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ దికగా తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ఉద్దేశించి ఆయన ఒక పోస్ట్ పెట్టారు.

Varanasi: AI వాయిస్‌లను రిజెక్ట్ చేసిన రాజమౌళి!1500 రియల్ వాయిస్‌లేసినిమాSwechaa24 Aug 2026, 06:52 PM

Varanasi: AI వాయిస్‌లను రిజెక్ట్ చేసిన రాజమౌళి!1500 రియల్ వాయిస్‌లే

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాకి సంబందించిన ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం నిన్నా మొన్నటి వరకూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్‌లను ఉపయోగించబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అది పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 1500 మంది డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్‌లను టెస్ట్ చేశారట. ఒరిజినల్ వాయిస్‌లతోనే డబ్బింగ్ చెప్పించనున్నట్టు తెలుస్తోంది.

Hyderabad: చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు చేసిన అధికారులు.. 100 టన్నులు సీజ్!..తెలంగాణSwechaa24 Aug 2026, 06:44 PM

Hyderabad: చికెన్ వేస్ట్ మాఫియా గుట్టురట్టు చేసిన అధికారులు.. 100 టన్నులు సీజ్!..

సైబరాబాద్‌లో చికెన్ వ్యర్థాల మాఫియా గుట్టురట్టైంది. పోలీసులు, వెటర్నరీ అధికారులు కలిసి అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాత్రివేళల్లో వ్యర్థాలను లారీల్లో తరలించి, ఆంధ్రప్రదేశ్‌లోని చేపల చెరువులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలతో పెంచిన చేపలు ఆరోగ్యానికి హానికరమని, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైనా దందా కొనసాగడంతో అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.

Delhi: నేతల కోసం వృధా అవుతున్న ప్రజా ధనం.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!?..NationalSwechaa24 Aug 2026, 06:03 PM

Delhi: నేతల కోసం వృధా అవుతున్న ప్రజా ధనం.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!?..

ఢిల్లీలోని లూటియెన్స్ బంగ్లా జోన్‌లో నివసించే కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల మరమ్మతులు, పునరుద్ధరణ, ఫర్నీషింగ్ కోసం 2025-26 ఆర్థిక ఏడాదిలో రికార్డు స్థాయిలో రూ.92.35 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడైంది. 2014-15లో ఖర్చు చేసిన రూ.27.47 కోట్లతో పోలిస్తే ఇది మూడింతలు పెరిగింది. పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమాధానంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa24 Aug 2026, 05:36 PM

కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ అంశం పార్టీ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని తెలిపారు. పార్టీ అంతర్గత అంశాలపై తాను మాట్లాడను అని పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు.

2027 Sankranti: ఈ సారి బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా ఉండబోతోంది.సినిమాSwechaa24 Aug 2026, 04:48 PM

2027 Sankranti: ఈ సారి బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా ఉండబోతోంది.

2027 Sankranti: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలకి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రతీ ఏటా ప్రారంభంలో వచ్చే పొంగల్‌కి చిన్న నుంచి పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ పడుతున్నాయి. అలాగే, 2027 సంక్రాంతికి కూడా మెగాస్టార్, సాయి దుర్గ తేజ్, అక్షయ్ ఖన్నా, శర్వానంద్, వెంకటేష్ పోటీ పడబోతున్నారు. ఈ సారి బాక్సాఫీస్ వార్ రసవత్తరంగా ఉండబోతోంది.

వరంగల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. కొండా సుస్మిత చూపు ఆ పార్టీ వైపు!..తెలంగాణSwechaa24 Aug 2026, 04:47 PM

వరంగల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. కొండా సుస్మిత చూపు ఆ పార్టీ వైపు!..

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. షోకాజ్ నోటీసులు, అసమ్మతి ఎమ్మెల్యేల బహిరంగ వ్యతిరేకత, ఏఐసీసీకి పీసీసీ నివేదికతో సురేఖపై అధిష్ఠానం నిర్ణయం కీలకంగా మారింది. ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటే.. కొండా కుటుంబం నెక్ట్స్ స్టెప్ ఏంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. మరోవైపు సుస్మిత జనసేన నేతలతో భేటీ కానున్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. పరకాల టికెట్‌తో పాటు ఉమ్మడి వరంగల్‌లో పార్టీ బాధ్యతలపై కూడా చర్చ జరగొచ్చన్న టాక్ ఉంది.

బంగ్లాదేశ్‌లో హిందూ ఫ్యామిలీ హత్య కేసులో సంచలన విషయాలుక్రైమ్Swechaa24 Aug 2026, 04:21 PM

బంగ్లాదేశ్‌లో హిందూ ఫ్యామిలీ హత్య కేసులో సంచలన విషయాలు

Bangladesh Hindu Family: బంగ్లాదేశ్ లో హిందూ ఫ్యామిలీ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుటుంబాన్ని చంపిన దుండగులు ఆ తర్వాత అదే ఇంట్లో ఉండి చేసిన పనులు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. కుటుంబాన్ని హత్య చేశాక రాత్రి అదే ఇంట్లోనే గడిపారు. అక్కడే స్నానం చేశారు. ఫ్రిజ్ లో ఉన్న ఆహారం తిన్నారు. అంతేకాదు అక్కడే డ్రగ్స్ కూడా తీసుకున్నారని పోలీసులు గుర్తించారు. వెళ్లిపోయే ముందు ఇంట్లోని వస్తువులు, దుస్తులను చిందరవందరగా పడేసిపోయారు. బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లారు. ఫోన్లను మాత్రం డిటర్జెంట్ కలిపిన నీటిలో పడేసి ధ్వంసం చేశారని పోలీసులు వెల్లడించారు.

Prabhas-Spirit: అనుకున్నట్టుగా షూటింగ్ జరగడం లేదు..రిలీజ్ వాయిదానా?సినిమాSwechaa24 Aug 2026, 04:08 PM

Prabhas-Spirit: అనుకున్నట్టుగా షూటింగ్ జరగడం లేదు..రిలీజ్ వాయిదానా?

Prabhas-Spirit: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోంది స్పిరిట్. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ న్యూస్ పై మేకర్స్ స్పదించారు. రిలీజ్ డేట్ మారుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ముందు చెప్పినట్టుగానే 2027, మార్చి మొదటి వారంలోనే రిలీజ్ అని కన్‌ఫర్మ్ చేశారు.

Telangana: 22 A భూముల విషయంలో క్లారిటీ ఇచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి!..తెలంగాణSwechaa24 Aug 2026, 03:41 PM

Telangana: 22 A భూముల విషయంలో క్లారిటీ ఇచ్చిన రెవెన్యూ శాఖ మంత్రి!..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 22A భూముల పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.  22A బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు.   అధికారులతో తరుచుగా రివ్యూలు చేస్తున్నామని.. అలాగే సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. ఇప్పటి వరకు టోల్ ఫ్రీ నంబర్ కు 1162 కాల్స్ వచ్చాయి..జెన్యూన్ సమస్యలను 24 గంటల్లోగా పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు..

పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల దిశగా దేశీయ స్టాక్ మార్కెట్లు!వ్యాపారంSwechaa24 Aug 2026, 03:03 PM

పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల దిశగా దేశీయ స్టాక్ మార్కెట్లు!

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరత, తీవ్ర ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి. సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ, మధ్యాహ్న సమయానికి అమ్మకాల ఒత్తిడి విపరీతంగా పెరగడంతో సూచీలు పతనం అయ్యాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం మదుపర్లలో భయాందోళనలను కలిగిస్తోంది.

హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి.. పోటెన్సీ టెస్ట్ ఆదేశాలపై పిటిషన్!తెలంగాణSwechaa24 Aug 2026, 02:49 PM

హైకోర్టును ఆశ్రయించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి.. పోటెన్సీ టెస్ట్ ఆదేశాలపై పిటిషన్!

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారంలో న్యాయపరమైన పోరాటం ముమ్మరమైంది. తనపై నమోదైన వివాదాస్పద కేసు విచారణలో భాగంగా, తనకు పోటెన్సీ టెస్ట్ (లైంగిక సామర్థ్యాన్ని అంచనా వేసే వైద్య పరీక్ష) నిర్వహించాలంటూ రాజేంద్రనగర్ కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టులో ఆయన ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

పనిమనుషులుగా విద్యార్థులు.. తినాలంటే చేసుకోవాల్సిందేనా?తెలంగాణSwechaa24 Aug 2026, 02:48 PM

పనిమనుషులుగా విద్యార్థులు.. తినాలంటే చేసుకోవాల్సిందేనా?

రాష్ట్రంలో విద్యావ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్థిక స్థోమత లేక చదువు బాగా చెబుతారని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు బాధపడేలా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి వడ్డించే భోజనం, ఇచ్చే దుస్తులు సరిగా ఉండటం లేదని,టీచర్లు పాఠాలు సరిగా చెప్పడం లేదని, పిల్లలతోనే అన్ని పనులు చేయించుకుంటున్నారని పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థుల చేత ప్రిన్సిపాల్ చపాతీలు చేయించినట్టు తెలిసింది. వారిని ప్రిన్సిపాల్, వార్డెన్లు పనిమనుషులుగా మార్చినట్టు సమాచారం. ప్రభుత్వం వంట మనుషులకు జీతం ఇస్తున్నా వారితో పనిచేయించకుండా విద్యార్థుల చేతే వంట పనులు చేయించడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు.

అంజయ్య నగర్ విషాదం.. భవన యాజమాని అరెస్టుతెలంగాణSwechaa24 Aug 2026, 02:29 PM

అంజయ్య నగర్ విషాదం.. భవన యాజమాని అరెస్టు

హైదరాబాద్ మహా నగరంలోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కూలిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. బిల్డర్, భవన యజమాని పరార్ అయ్యారు. ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 40 గజాలలోపు స్థలంలో ఏడంస్తుల నిర్మాణం చేపట్టడం వల్లు ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన జరిగిన నాటి నుంచి యజమాని కోసం గాలిస్తున్నారు. అయితే, దేశం విడిచి పారిపోతుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఓనర్ సయ్యద్ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే సాజిద్ G+6 భవనం నిర్మించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తేల్చారు.

కృష్ణా జలాల పంపకాలపై ఉత్కంఠ.. త్రిసభ్య కమిటీ భేటీలో  తెలంగాణ, ఏపీ భిన్న వాదనలు!తెలంగాణSwechaa24 Aug 2026, 02:02 PM

కృష్ణా జలాల పంపకాలపై ఉత్కంఠ.. త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ, ఏపీ భిన్న వాదనలు!

హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ ‘జలసౌధ’ వేదికగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్(KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం ఉత్కంఠ భరితంగా ప్రారంభమైంది. కేఆర్‌ఎంబీ మెంబర్ సెక్రటరీ సతీష్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహ మూర్తి హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల తాగునీరు, ఇతర అత్యవసర అవసరాల కోసం ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

ఫార్చ్యునర్ కారులో వచ్చి చెత్త క్లీనింగ్‌.. మున్సిపల్ కార్మికుడి లైఫ్‌‌స్టైల్ వైరల్వైరల్ న్యూస్Swechaa24 Aug 2026, 01:47 PM

ఫార్చ్యునర్ కారులో వచ్చి చెత్త క్లీనింగ్‌.. మున్సిపల్ కార్మికుడి లైఫ్‌‌స్టైల్ వైరల్

సాధారణంగా మున్సిపల్ కార్మికులు ఉదయాన్నే ఐదు గంటలకు విధుల్లో చేరిపోతుంటారు.వారికి పెద్దగా వాహనాలు కూడా ఉండవు.. ప్రభుత్వ వాహనంలో వచ్చి తమ డ్యూటీ చేసుకుని తిరిగి ప్రభుత్వ వాహనం లేదా బస్సుల్లో జర్నీ చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కొందరు బైకుల మీద వస్తున్నారు. వచ్చామా? అటెండెన్స్ వేసుకున్నామా? తమకు కేటాయించిన ఏరియాలో చెత్త క్లీన్ చేశామా? వెళ్లిపోయామా? ఇదే వారి లైఫ్ స్టైల్..

అయితే, వారికి కూడా పెద్దపెద్ద కోరికలు ఉంటాయని ఎవరికీ తెలియకపోవచ్చు. వారికి కార్లలో తిరగాలని ఉన్నా బయటకు చెప్పుకోరు.ఎందుకంటే వారు చేసే డ్యూటీ.. వారికి వచ్చే ఆదాయం. కుటుంబ పరిస్థితుల కారణంగా ఏది చేయలేకపోతుంటారు. కానీ, ఓ మున్సిపల్ కార్మికుడు మాత్రం అందరిలా ఆలోచించలేదు. తోటి కార్మికులకు భిన్నంగా ఉండాలని కూడా అనుకోలేదు. చేసేది మున్సిపల్ కార్మిక వృత్తి అయినా దర్జాగా కారులో తిరగాలని భావించాడు.అనుకున్నదే తడవుగా ఫార్చ్యునర్ కారు కొనుగోలు చేశాడు.అదే కారులో రోజు ఉదయం డ్యూటీకి వచ్చి తన పని ముగించుకుని తిరిగి అదే వాహనంలో ఇంటికి పయనం అవుతున్నాడు.ఈ ఘటన కర్ణాటకలోని బంట్వాళలో వెలుగుచూసింది. పారిశుద్ధ్య కార్మికుడు శేషప్పణ్ణ ప్రతిరోజూ ఫార్చునర్ కారులో చెత్త క్లీన్ చేయడానికి వస్తుంటాడని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.

Guinea:  చెత్త కారణంగా 30 మంది మృతి.. డంపింగ్ యార్డు ప్రాంతాల్లో మోగుతున్న డేంజర్ బెల్స్!..InternationalSwechaa24 Aug 2026, 01:45 PM

Guinea: చెత్త కారణంగా 30 మంది మృతి.. డంపింగ్ యార్డు ప్రాంతాల్లో మోగుతున్న డేంజర్ బెల్స్!..

పశ్చిమ ఆఫ్రికాలోని గినియా రాజధాని కోనక్రీలో ఘోర ప్రమాదం సంభవించింది. నగరంలోని దార్‌ ఎస్‌ సలామ్‌ లో ఉన్న అతిపెద్ద డంపింగ్ యార్డ్ లో కొండలా పేరుకుపోయిన చెత్త ఒక్కసారిగా కూలిపోయి.. సమీపంలోని పూరి గుడిసెలపై పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం.

కరెంట్ సబ్సిడీ ఎత్తివేసేందుకే స్మార్ట్ మీటర్లు : కవితతెలంగాణSwechaa24 Aug 2026, 01:06 PM

కరెంట్ సబ్సిడీ ఎత్తివేసేందుకే స్మార్ట్ మీటర్లు : కవిత

తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఇస్తున్న కరెంట్ సబ్సిడీని ఎత్తేయాలని రేవంత్ సర్కార్ చూస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు.స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అందుకే ప్రజల బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. దీనిలో భాగంగానే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల నెక్లెస్ రోడ్డులో స్మార్ట్ మీటర్ల ఉపయోగం పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉందని పదే పదే నిరూపించుకుంటోందని ఆరోపించారు.

Mahakali-Glimpse:గ్లింప్స్‌తోనే గూస్‌బంప్స్..మహాకాళి మరో ఇండస్ట్రీ హిట్ పక్కాసినిమాSwechaa24 Aug 2026, 12:55 PM

Mahakali-Glimpse:గ్లింప్స్‌తోనే గూస్‌బంప్స్..మహాకాళి మరో ఇండస్ట్రీ హిట్ పక్కా

Mahakali-Glimpse: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా భారీ చిత్రాలను అందిస్తున్నాడు. ఇప్పుడు వస్తోన్న మహాకాళి కూడా ఈ యూనివర్స్ నుంచే వస్తోంది. ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ సమర్పిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘శుక్రాచార్యుడి వార్ క్రై’ పేరుతో మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్యుడు’ పాత్రలో నటిస్తుండగా, ఓజీతో మళ్ళీ లైం లైట్ లోకి వచ్చిన శ్రియా రెడ్డి ‘మహాకాళి’గా అలరించనుంది.

ఉగ్ర లింకులు.. రామగుండంలో ఎన్‌ఐఏ సోదాలు.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్!టాప్ న్యూస్Swechaa24 Aug 2026, 12:48 PM

ఉగ్ర లింకులు.. రామగుండంలో ఎన్‌ఐఏ సోదాలు.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్!

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర సంచలనం సృష్టించాయి. రామగుండంలోని అయోధ్య నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు నిర్వహించిన ఈ సోదాల్లో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు.. రామగుండానికి చెందిన ముజామిల్ ఖాన్ అనే ఇంజినీరింగ్ విద్యార్థికి కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్‌లతో అండర్‌గ్రౌండ్ లింకులు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులకు పక్కా సమాచారం అందింది.

రేవంత్ ఇలాకలో  సన్నబియ్యం దందాతెలంగాణSwechaa24 Aug 2026, 12:43 PM

రేవంత్ ఇలాకలో సన్నబియ్యం దందా

రాష్ట్రంలో జోరుగా సన్నబియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి కర్ణాటకకు పెద్దఎత్తున పీడీఎస్ రైస్ సరఫరా అవుతున్నట్టు సమాచారం.కేవలం వికారాబాద్ జిల్లాలోనే ప్రతినెలా రూ.10 కోట్ల సన్న బియ్యం అక్రమ దందా అవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో కొందరు దుండగులు అక్రమాలకు తెర లేపినట్టు సమాచారం. ప్రతీ కుటుంబానికి దాదాపు 50 నుంచి 100 కేజీల సన్న బియ్యం రావడంతో వారి నుంచి ఒక్కో కేజీ రూ.10 నుంచి రూ.12కే కొనుగోలు చేసి అనంతరం దానిని దళారులు క్యాష్ చేసుకుంటున్నట్టు తెలిసింది. గ్రామాల్లో ఉదయమంతా తిరిగి బియ్యం సేకరించి, రాత్రికి రాత్రే కొడంగల్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్టు సమాచారం.రూ.10కి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, కర్ణాటకలోని గుర్మిట్కల్ మార్కెట్లో కేజీ బియ్యం రూ.40కి విక్రయిస్తున్నట్టు తెలిసింది.

వైరస్ కలకలం.. దేశంలో పెరుగుతున్న H1N1 ఫ్లూ కేసులు!NationalSwechaa24 Aug 2026, 12:24 PM

వైరస్ కలకలం.. దేశంలో పెరుగుతున్న H1N1 ఫ్లూ కేసులు!

దేశంలో ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెంజా ఎ (H1N1) కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రజలను అప్రమత్తం చేస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న H1N1 వైరస్‌లు ఎలాంటి కొత్త స్ట్రెయిన్‌కు చెందినవి కాదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. గతేడాదిగా ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఉన్న పాత వేరియంట్‌నేనని, దీనిపై ప్రజలు ఎలాంటి అనవసర ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.

కొడుకు కోసం రంగంలోకి ఎంపీ లింగమనేని.. బెస్ట్ డీల్ ఆఫర్?తెలంగాణSwechaa24 Aug 2026, 12:17 PM

కొడుకు కోసం రంగంలోకి ఎంపీ లింగమనేని.. బెస్ట్ డీల్ ఆఫర్?

కారు యాక్సిడెంట్ చేసి ఓ ప్రాణం పోవడానికి కారకుడైన తన కొడుకును విడిపించేందుకు అతని తండ్రి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కొడుకు మీద అసలు కేసు లేకుండా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్టు టాక్ వినిపిస్తోంది. అందుకోసం ఏకంగా పోలీసులతో డీల్స్ మాట్లాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ‘నా కొడుకుని కేసు నుంచి కాపాడితే ఎంతైనా ఇస్తా’ అని మాదాపూర్ పోలీసులకు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ ఆఫర్లు ఇస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. స్టేషన్ ఉన్నతాధికారి, లింగమనేని కుటుంబానిది ఒకే సామాజికవర్గం కావడంతో స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 16వ తేదీన ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగి భారతి ముఖి (26) అనే యువతిని అతివేగంగా వచ్చి కారుతో ఢీకొట్టిన ఘటనలో లింగమనేని రమేష్ కొడుకు సంజుష్ నిందితుడిగా ఉన్నాడు.