స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

సరికొత్త చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ధోనీ ఆల్ టైమ్ రికార్డు బద్దలు!క్రీడలుSwechaa24 Aug 2026, 12:02 PM

సరికొత్త చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ధోనీ ఆల్ టైమ్ రికార్డు బద్దలు!

భారత క్రికెట్ చరిత్రలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో తన దూకుడైన ఆటతీరుతో మరోసారి సత్తా చాటిన పంత్, విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు టీమిండియా మాజీ లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పంత్ విజయవంతంగా అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు విదేశీ లేదా తటస్థ వేదికలపై టెస్టుల్లో ధోనీ 2,496 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పంత్ తాజా ఇన్నింగ్స్‌తో 2,501 పరుగుల మైలురాయిని తాకి ధోనీని వెనక్కి నెట్టాడు.

నాడు ప్రియుడి కోసం.. నేడు అదే ఇంజెక్షన్‌తో నర్సు దారుణంక్రైమ్Swechaa24 Aug 2026, 11:48 AM

నాడు ప్రియుడి కోసం.. నేడు అదే ఇంజెక్షన్‌తో నర్సు దారుణం

ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులను కడతేర్చిన ఓ యువతి ..తాజాగా ఆత్మహత్యకు పాల్పడింది.పేరెంట్స్‌ను ఎలాగైతే ఓవర్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చిందో అదే విధంగా సదరు యువతి సైతం తనకు తాను ఇంజెక్షన్ తీసుకుని మరణించినట్టు సమాచారం. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న సురేఖ.. నిన్న ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నప్పుడు సురేఖ ఓ అబ్బాయిని ప్రేమించింది. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో, వారిపై పగ పెంచుకున్న సురేఖ.. ఇదే ఏడాది జనవరిలో.. వికారాబాద్‌లోని యాచారంలో పేరెంట్స్‌కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే.అనంతరం జైలుకెళ్లి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చింది.

మక్కా నుంచి కొత్త ప్రపంచం..! ముస్లిం దేశాలన్నీ ఒక్కటవుతున్నాయా?InternationalSwechaa24 Aug 2026, 11:46 AM

మక్కా నుంచి కొత్త ప్రపంచం..! ముస్లిం దేశాలన్నీ ఒక్కటవుతున్నాయా?

మిడిల్ ఈస్ట్‌లో పాత రాజకీయ మ్యాప్ మారుతోంది. పాత శత్రుత్వాలు కొత్త భాగస్వామ్యాలుగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఇకపై అమెరికా చెప్పే భద్రతా లెక్కలే నడుస్తాయా? లేక మక్కా నుంచి కొత్త పవర్ సెంటర్ పుట్టుకొస్తుందా అన్న‌దే ఆస‌క్తిక‌రం.

కాకినాడకు సాధిక్.. ఏఈ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామంఏపీSwechaa24 Aug 2026, 11:33 AM

కాకినాడకు సాధిక్.. ఏఈ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

ఏపీలో సాధిక్ అనే కోచ్ కారణంగా కాకినాడ ఏఈ నూకరాజు ఫ్యామిలీ సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. నూకరాజు, అతని భార్య, కోడలు, మనవడు గోదావరిలో దూకగా.. కేవలం మనవడు ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వారంతా మరణించిన విషయం తెలిసిందే. వీరి మరణానికి కోచ్ సాధిక్ కారణమని..అతను తన కుటుంబాన్ని వేధించాడని,తన కొడుకు భాస్కర్ రెడ్డి మరణానికి కారకుడు అని.. తన కోడలిని వేధింపులకు గురిచేయడంతో పాటు అశ్లీల వీడియోలు,ఫొటోలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. నలుగురి మరణానికి కారణమైన సాధిక్.. మొన్నటివరకు అజ్ఞాతంలోకి వెళ్లగా.. నిందితుడు సాధిక్ ఖాన్‌ను ఢిల్లీలో కాకినాడ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి రైలులో సాధిక్ ఖాన్‌ను కాకినాడకు తరలించగా.. జి.మేడపాడు నుంచి వాహనంలో కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.

'చీతా', 'టైగర్', 'రెడ్ హార్స్'..  తెలంగాణలో కొత్త  మద్యం బ్రాండ్లు!తెలంగాణSwechaa24 Aug 2026, 11:22 AM

'చీతా', 'టైగర్', 'రెడ్ హార్స్'.. తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు!

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు త్వరలోనే మరిన్ని కొత్త రకాల బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. మార్కెట్లో ట్రెండ్‌కు తగినట్లుగా సరికొత్త రుచులు, విభిన్న నాణ్యతతో కూడిన మద్యం విక్రయాలను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వివిధ ప్రముఖ డిస్టిలరీలు, బ్రూవరీస్ నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మద్యం మార్కెట్‌ను మరింత విస్తృతం చేసే ఉద్దేశంతో దాదాపు 18కి పైగా కంపెనీలు సరికొత్తగా 121కొత్త మద్యం బ్రాండ్లను రాష్ట్రంలోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖకు అధికారికంగా దరఖాస్తులు సమర్పించాయి.

త్వ‌ర‌లో కేబినెట్ రీష‌ఫుల్..! సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి..? కాంగ్రెస్ అస‌లు గేమ్ ఏంటి..?తెలంగాణSwechaa24 Aug 2026, 10:48 AM

త్వ‌ర‌లో కేబినెట్ రీష‌ఫుల్..! సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి..? కాంగ్రెస్ అస‌లు గేమ్ ఏంటి..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్న కొద్దీ పార్టీలో ఆశలు, అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై ఆశలు ఉన్నాయి. సీనియర్ నేతలకు తమ రాజకీయ ప్రాధాన్యంపై లెక్కలు ఉన్నాయి. మంత్రులుగా ఉన్నవారికి తమ పవర్ కొనసాగాలనే ఆసక్తి ఉంది.

ఇథనాల్ కారణం కాదు.. చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం కీలక వివరణ!NationalSwechaa24 Aug 2026, 10:43 AM

ఇథనాల్ కారణం కాదు.. చక్కెర ధరలు పెరగడంపై కేంద్రం కీలక వివరణ!

పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా సామాన్యులకు చక్కెర ధరల రూపంలో భారీ షాక్ తగిలింది. మార్కెట్లలో పంచదార ధరలు అనూహ్యంగా పెరిగిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కిలో రిటైల్ ధర ఏకంగా రూ. 65 మార్కును దాటేసింది. ఈ ఆకస్మిక ధరల పెరుగుదలపై రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, ఎథనాల్ ఉత్పత్తి కోసం చెరకును పెద్ద మొత్తంలో మళ్లించడం వల్లే దేశంలో పంచదార కొరత ఏర్పడి ధరలు భగ్గుమంటున్నాయని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాయి. ఈ రాజకీయ విమర్శలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ స్పష్టతనిచ్చారు.

కేరళ యువతికి 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' కిరీటం..!NationalSwechaa24 Aug 2026, 10:25 AM

కేరళ యువతికి 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' కిరీటం..!

అందాల పోటీల వేదికపై భారతదేశం తరఫున మరో యువ సంచలనం సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. గతేడాది విజేత మణికా విశ్వకర్మ ఆమెకు కిరీటం తొడిగి అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు. ఇక ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ రెండో స్థానంలో నిలవగా, గుజరాత్‌కు చెందిన అనుశ్రీ సతావలేకర్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.

‘మాధురి నన్ను క్షమించు’.. ఈశ్వర్ సాయి మరో వీడియోవైరల్ న్యూస్Swechaa24 Aug 2026, 10:15 AM

‘మాధురి నన్ను క్షమించు’.. ఈశ్వర్ సాయి మరో వీడియో

తెలంగాణ జానపద నటులు ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ ఒకే గదిలో అర్ధనగ్నం దొరకడంతో దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.‘బాసింగ బలాలు’ సాంగ్‌తో వీరిద్దరికి మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా, వీరిద్దరి కాంబోలో చాలానే ఫోక్స్ వచ్చాయి. వాస్తవానికి వీరు ఒకే గదిలో దొరికిన కొన్ని గంటల్లో వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన సాంగ్స్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చాయి.ఈ జంట ఎవరా? అని తెలుసుకోవడానికి వీరు నటించిన సాంగ్స్ కోసం నెటిజన్స్ ప్రయత్నించినట్టు తెలిసింది. దీనిపై మాధురి రాథోడ్ ప్రస్తుతం మౌనంగా ఉండిపోగా.. ఈశ్వర్ సాయి మాత్రం తాజాగా మరో వీడియో విడుదల చేశారు. ‘బాత్రూమ్ వాడుకోడానికే మాత్రం నేను మాధురి గదికి వెళ్లా.. నేను, మాధురి కేవలం ఎమోషనల్‌గానే కనెక్ట్ అయ్యాం.నా భార్యను కొందరు తప్పు దారి పట్టించారు. ఆ ఆవేశంలోనే ఆమె దాడి చేసింది. ఆ క్షణంలో ఏమీ మాట్లాడొద్దని మౌనంగా ఉన్నా. అమ్మా మాధురి! ఈ విషయంలో నీకు క్షమాపణ చెబుతున్నా.. మీడియా, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి’ అంటూ వేడుకున్నారు.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కేసు.. మరో ముగ్గురి అరెస్ట్!క్రైమ్Swechaa24 Aug 2026, 10:10 AM

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ కేసు.. మరో ముగ్గురి అరెస్ట్!

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ సుమంత్ వివాదాస్పద వ్యవహారానికి సంబంధించిన కేసులో దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ హైప్రొఫైల్ కేసులో విచారణను వేగవంతం చేసిన పోలీసులు, నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు విస్తృతం చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నేటి నుంచి  ఓటర్లకు నోటీసులు.. ఇంటింటికీ బీఎల్‌వోలు!తెలంగాణSwechaa24 Aug 2026, 09:58 AM

నేటి నుంచి ఓటర్లకు నోటీసులు.. ఇంటింటికీ బీఎల్‌వోలు!

రాష్ట్రంలోని ఓటర్లకు నోటీసులు పంపించే ప్రక్రియను ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) లో భాగంగా ఎవరైతే ఎన్యూమరేషన్ ఫారమ్స్ బీఎల్‌వోల నుంచి అందుకోలేదో, అందుకున్న వారు ఎవరైతే తిరిగి అప్పగించలేదో అనగా వివరాలు అందజేయని వారికి తాజాగా ఈసీ నోటీసులు జారీ చేయనుంది. వారంతా ఆ నోటీసుల్లో ఉన్న అంశాల మేరకు వారు భారతీయులు అని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆ నోటీసుల్లో పేర్కొన్న విధంగా ధ్రువపత్రాలు ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణలో నేటి నుంచి ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, ఈ నెల 17వ తేదీన ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 93 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నట్టు ఈసీ తెలిపింది.

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. ఆసుపత్రి ఎన్‌ఐసీయూలో ముగ్గురు నవజాత శిశువులు మృతి!క్రైమ్Swechaa24 Aug 2026, 09:43 AM

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం.. ఆసుపత్రి ఎన్‌ఐసీయూలో ముగ్గురు నవజాత శిశువులు మృతి!

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆసుపత్రి మూడో అంతస్తులో అత్యంత సున్నితమైన ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (NICU)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటనతో ఆసుపత్రి పరిసరాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. అప్పుడే పుట్టిన చిన్నారులు మంటల్లో సజీవదహనం కావడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.

ఆగిపోలేదు..ఏకంగా షూటింగే స్టార్ట్ అవుతోంది!సినిమాSwechaa24 Aug 2026, 09:38 AM

ఆగిపోలేదు..ఏకంగా షూటింగే స్టార్ట్ అవుతోంది!

NBK 112: ఎన్‌బికే 112 ఈ ఆగస్టు నుంచే షూటింగ్ ప్రారంభం కాబోతుందని తాజా సమాచారం. బాలయ్య డేట్స్ ఇవ్వడంతో ఆగస్టు చివరి వారంనుంచి, ఆయన లేని సన్నివేశాలను ఇతర తారాగణంపై ప్లాన్ చేస్తున్నాడట. సెప్టెంబర్ చివరి వారం నుంచి బాలయ్య సెట్స్‌లో జాయిన్ అవుతాడట. సో మొత్తానికి అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ అయిందనని వస్తున్న వార్తలకి అధికారికంగా ఈ నెలలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారు మేకర్స్. కొరటాల సినిమా అంటే పవర్ ఫుల్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఇక, బాలయ్య అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి కాంబోలో వచ్చే సినిమా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ.

పెరిగిన ఉల్లి ధరలు..వినియోగదారులకు కేంద్రం శుభవార్తNationalSwechaa24 Aug 2026, 09:38 AM

పెరిగిన ఉల్లి ధరలు..వినియోగదారులకు కేంద్రం శుభవార్త

ఉల్లి ధరలు కొండెక్కిన వేళ కేంద్రం వినియోగదారులకు శుభవార్త చెప్పింది.బఫర్ స్టాక్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, చెన్నయ్, కొచ్చి, గుహవాటి తదితర ప్రాంతాలకు నాసిక్ (మహారాష్ట్ర) నుంచి కందా ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో తక్కువ ధరలకు ఉల్లిని అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఢిల్లీ,ముంబై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఉల్లి కిలోకు రూ.50 నుంచి 70 పలుకుతోంది.

రైతాంగ ఉద్యమ నేత కన్నుమూత!..తెలంగాణSwechaa24 Aug 2026, 09:37 AM

రైతాంగ ఉద్యమ నేత కన్నుమూత!..

కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి(88) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో జన్మించి, చిన్ననాటి నుంచే ప్రజా సమస్యల పట్ల స్పందించే తత్వాన్ని పుణికిపుచ్చుకున్న సారంపల్లి.. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో బలమైన గొంతుకగా నిలిచారు.

వర్షాలు పడట్లేదని ఆ గ్రామంలో వింత చర్యతెలంగాణSwechaa24 Aug 2026, 09:22 AM

వర్షాలు పడట్లేదని ఆ గ్రామంలో వింత చర్య

వర్షాలు కురవడం లేదని తెలంగాణలోని ఓ గ్రామంలోని ప్రజలు వింత చర్యకు పూనుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా వారు చేసిన పని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.ఇలా కూడా ఉన్నారా? జనాలు అని చర్చ జరుగుతోంది.వర్షాలు రాకపోతే పూజలు చేయడం చూసి ఉంటారు. కప్పు తల్లి ఆటలు,గాడిదలకు పెళ్లి చేయడం వంటివి నేటికీ కొన్ని గ్రామాల్లో ప్రజలు పాటిస్తుంటారు. కానీ, పై వాటికి భిన్నంగా ఈ ఘటన ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వివరాల్లోకివెళితే.. వర్షాలు పడడం లేదని పూడ్చిన శవాన్ని బయటకు తీసి తిరిగి దహనం చేశారు గ్రామపెద్దలు.ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామంలో చోటుచేసుకోగా..ఆలస్యంగా వెలుగుచూసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు, రేపు  అతిభారీ వర్షాలు!తెలంగాణSwechaa24 Aug 2026, 09:07 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు, రేపు అతిభారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిరోజులుగా వర్షాలకు కాస్త బ్రేక్ పడినప్పటికీ, తాజాగా ఏర్పడిన వాతావరణ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో వానలు మళ్లీ జోరుందుకున్నాయి. రెండు రోజుల పాటు (ఆగస్టు 24, 25 తేదీల్లో) రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ 'ఎల్లో అలర్ట్' జారీ చేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

సీఎం రేవంత్‌రెడ్డి లండన్ టూర్ ముగింపు.. సాయంత్రం ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ!తెలంగాణSwechaa24 Aug 2026, 08:42 AM

సీఎం రేవంత్‌రెడ్డి లండన్ టూర్ ముగింపు.. సాయంత్రం ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను ముగించుకుని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. యూకే పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని, అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రతిపాదిత యూఎస్ టూర్‌కు రాజకీయ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే, విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, విద్యాపరమైన అవకాశాలపై కేంద్రం మోకాలడ్డడంపై లండన్ పర్యటనలోనే సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

సీఎం శాఖలో వసూళ్ల దందా?  రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ వ్యవస్థపై ఫైటింగ్ పార్ట్-4స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa24 Aug 2026, 08:14 AM

సీఎం శాఖలో వసూళ్ల దందా? రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ వ్యవస్థపై ఫైటింగ్ పార్ట్-4

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో సాగిన డబుల్ శాలరీ దందాపై సీఎస్ సంజయ్ జాజు నివేదికకు ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. సీఎం సొంత శాఖలోనే మరో దందాకు తెరలేపారనే ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. బహిరంగ నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాల పేరుతో.. కేవలం నెల రోజుల్లోనే నిరుద్యోగుల నుంచి భారీగా వసూళ్లు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో ఏళ్లుగా పనిచేస్తున్న వేలాది మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.

అంతరిక్షంలో భారత్ బిగ్ గేమ్.. ఇక స్టార్టప్‌లదే హవా!NationalSwechaa23 Aug 2026, 10:59 PM

అంతరిక్షంలో భారత్ బిగ్ గేమ్.. ఇక స్టార్టప్‌లదే హవా!

భారత స్పేస్‌టెక్ స్టార్టప్‌లు 2026లో ఇప్పటికే వందల మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. మరోవైపు దేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 9 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, వచ్చే దశాబ్దంలో 40–45 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

congress: 22A నిషేధిత జాబితాపై ఉద్యమానికి సిద్దం.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన హరీష్ రావు!..తెలంగాణSwechaa23 Aug 2026, 10:37 PM

congress: 22A నిషేధిత జాబితాపై ఉద్యమానికి సిద్దం.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన హరీష్ రావు!..

తెలంగాణలో పొలిటికల్ వార్ పీక్ స్టేజీకి చేరుకుంటుంది. 22A నిషేధిత జాబితాపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా ప్రతిపక్షాలు ఈ అంశంపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి, హేమానగర్ కాలనీలను 22A జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ నిర్వహించిన సమావేశంలో ఆయన బాధితులకు అండగా నిలిచారు. మధ్యతరగతి ప్రజలు జీవితాంతం కష్టపడి, అప్పులు చేసి నిర్మించుకున్న ఇళ్లను 22A జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఇళ్లు అమ్ముకోలేక, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారని హరీశ్ రావు ఆరోపించారు.

సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. సమ్మె విరమించిన ఆటో డ్రైవర్లు!..తెలంగాణSwechaa23 Aug 2026, 10:04 PM

సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. సమ్మె విరమించిన ఆటో డ్రైవర్లు!..

మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించడంతో ఆటో సంఘాల డిమాండ్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆటో కార్మికుల కోసం వెల్ ఫెర్ బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 2015 తర్వాత ఆటోచార్జీలు పెంచలేదని గుర్తు చేసిన ఆయన.. పెరిగిన ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుని కమిటీ వేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఆటోకార్మికుల ప్రతినిధులు,రవాణా అధికారుల్ని భాగస్వామ్యం చేస్తామన్నారు. మరోవైపు పాత ఆటోల్ని స్ప్రాప్ చేసి ఈవీ ఆటోల కొనుగోలులో ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. దీంతో సమ్మెను విరమించేందుకు ఆటో సంఘాలు నిర్ణయించినట్టు సమాచారం. సమ్మె విరమణతో నగర ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. రోజువారీ రాకపోకలపై ఆందోళనలో ఉన్న ప్రజలకు ఇది ఊపిరిపీల్చుకునే వార్తగా మారింది. మొత్తంగా.. ఆటో సమ్మెకు బ్రేక్ పడే సూచనలు కనిపించడంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ కి ఆ భాషలలో డబ్బింగ్ సమస్య..రాజమౌళికి ఇది ఛాలెంజే!సినిమాSwechaa23 Aug 2026, 09:54 PM

మహేష్ కి ఆ భాషలలో డబ్బింగ్ సమస్య..రాజమౌళికి ఇది ఛాలెంజే!

Varanasi: ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్, ఎస్.ఎస్.కార్తికేయ కలిసి దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 120 దేశాలలో 20 భాషలలో రిలీజ్ చేయనున్నారు. అయితే, ముఖ్యంగా మహేష్ బాబు ఎన్ని భాషల్లో డబ్బింగ్ చెప్తాడు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. తెలుగు, తమిళ భాషలలో అయితే ఖచ్చితంగా మహేష్ చెప్పగలడు.

నామినేటెడ్ పోస్టుల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్!..తెలంగాణSwechaa23 Aug 2026, 08:29 PM

నామినేటెడ్ పోస్టుల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్!..

నిజామాబాద్ జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేడు ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పని చేస్తున్నామని, కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల వచ్చాయని పీసీసీ చీఫ్ తెలిపారు. జిల్లాలో రూ. 600 కోట్లతో రహదారుల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటవుతున్నాయన్నారు. అలాగే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిబద్ధత కలిగిన కార్యకర్తలకే రాబోయే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

NBK 111: డిసెంబర్ 24..రిలీజ్ డేట్ లాక్?సినిమాSwechaa23 Aug 2026, 07:25 PM

NBK 111: డిసెంబర్ 24..రిలీజ్ డేట్ లాక్?

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తన 111 చిత్రానికి సంబందించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారట. ఆ దిశగా అక్టోబర్, నవంబర్ నెలలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.

అంజయ్య నగర్‌లో హైటెన్షన్.. ఆక్రమనిర్మాణం కూల్చివేతకు రంగం సిద్దం!..తెలంగాణSwechaa23 Aug 2026, 07:09 PM

అంజయ్య నగర్‌లో హైటెన్షన్.. ఆక్రమనిర్మాణం కూల్చివేతకు రంగం సిద్దం!..

గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో మరో అక్రమ నిర్మాణంపై అధికారులు కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరు అంతస్తుల భవనాన్ని కూల్చివేయడానికి భారీ బాహుబలి యంత్రం ఘటనా స్థలానికి చేరుకుంది. మరికొద్దిసేపట్లోనే కూల్చివేత పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

జెన్‌జీకి స్టాక్ మార్కెట్ షాక్.. ₹1.05 లక్షల కోట్ల నష్టం!వ్యాపారంSwechaa23 Aug 2026, 06:50 PM

జెన్‌జీకి స్టాక్ మార్కెట్ షాక్.. ₹1.05 లక్షల కోట్ల నష్టం!

ట్రేడింగ్ యాప్స్ ఇప్పుడు కేవలం ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్స్‌గా కాకుండా సోషల్ మీడియా యాప్స్‌లా అనిపించేలా మారుతున్నాయి. నోటిఫికేషన్లు, ట్రెండింగ్ స్టాక్స్, వాచ్‌లిస్టులు, ర్యాంకింగ్స్, రియల్‌టైమ్ చార్ట్స్.. ఇవన్నీ యూజర్‌ను మరింత తరచుగా యాప్‌లోకి తీసుకువస్తాయి. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌గా ఉండాల్సిన వ్యక్తి.. రోజూ మార్కెట్

రాకింగ్ స్టార్ యష్‌పై కాంతార బ్యూటీ కామెంట్స్ వైరల్!సినిమాSwechaa23 Aug 2026, 06:25 PM

రాకింగ్ స్టార్ యష్‌పై కాంతార బ్యూటీ కామెంట్స్ వైరల్!

Rukmini Vasanth: కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ టాక్సిక్. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ మొదటిసారి మెగా ఫోన్ పట్టి రూపొందించిన సినిమా. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి హాజరైన హీరోయిన్ రుక్మిణి వసంత్..యష్‌తో వర్క్ చేయడం గొప్ప అనుభూతి అని వ్యాఖ్యానించింది.

ఏపీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ!..ఏపీSwechaa23 Aug 2026, 06:04 PM

ఏపీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ!..

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఉన్న ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కాసేపట్లో ఆయన్ను ఈడీ అధికారులు విచారించనున్నట్లు సమాచారం.

వేల మంది ఫ్రెండ్స్‌.. అయినా ఒంటరే! అసలు మనిషికి ఏమైంది?అభిప్రాయంSwechaa23 Aug 2026, 05:57 PM

వేల మంది ఫ్రెండ్స్‌.. అయినా ఒంటరే! అసలు మనిషికి ఏమైంది?

ఉద్యోగం, కెరీర్‌, ఆర్థిక స్వాతంత్రం కోసం చాలామంది కుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు. కొత్త పరిచయాలు ఏర్పడుతున్నా.. వాటిలో చాలావరకు డీప్ కనెక్షన్‌గా మారడం లేదు. వందల మంది కాంటాక్ట్స్‌ ఉన్నా.. కష్ట సమయంలో ఫోన్‌ చేయగలిగే వ్యక్తుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.