స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Zombie Reddy-2 (Nxt Lvl): జాంబీ రెడ్డి 2 అనౌన్స్‌మెంట్ పోస్టర్ తోనే కదిలించేశారు!సినిమాSwechaa23 Aug 2026, 05:46 PM

Zombie Reddy-2 (Nxt Lvl): జాంబీ రెడ్డి 2 అనౌన్స్‌మెంట్ పోస్టర్ తోనే కదిలించేశారు!

Zombie Reddy-2 (Nxt Lvl): నేడు యువ కథానాయకుడు తేజ సజ్జా పుట్టినరోజు. ఈ సందర్భంగా జాంబీ రెడ్డి చిత్రానికి సీక్వెల్ జాంబీ రెడ్డి నెక్స్ట్ లెవల్ చిత్రాన్ని ప్రకటించి శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఇక, ఈ సినిమాకి సుపర్ణ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక, తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ వీడియో, పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జాంబీ రెడ్డి 2 ని టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ప్రశాంత్ వర్మ కలిసి నిర్మిస్తున్నారు. అలాగే, కథ-కథనాలలో భాగమయ్యాడు ప్రశాంత్ వర్మ.

సీఎం రేవంత్‌ చుట్టూ రాజకీయ వ్యూహం.. బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ ఏంటి?..తెలంగాణSwechaa23 Aug 2026, 04:49 PM

సీఎం రేవంత్‌ చుట్టూ రాజకీయ వ్యూహం.. బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ ఏంటి?..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవికి గండం ఏర్పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులను చూస్తున్న వారు.. అసలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం రేవంత్ రెడ్డి అన్న విషయం అందరూ ఒప్పుకోవలసిందే.. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత ఇక తెలంగాణ బీఆర్ఎస్ దొరల సొంతం అని భావించి.. తమకు ఎదురులేదని కేటీఆర్, కేసీఆర్, కవిత మురిసిపోయిన విషయం అందరికీ తెలిసిందే..

తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం!తెలంగాణSwechaa23 Aug 2026, 03:30 PM

తెలంగాణ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం!

తెలంగాణ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో చక్కటి శుభవార్త అందింది. దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించే క్రమంలో రైల్వే శాఖ మరో కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు వరకు రాకపోకలు సాగించేలా (22363/22364) ఈ కొత్త అమృత్ భారత్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును రైల్వే అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్ రైలు జార్ఖండ్, బీహార్‌లోని గయా మీదుగా ప్రయాణించి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి సమీపంలోని రేణిగుంట జంక్షన్ గుండా కోయంబత్తూరు చేరుకుంటుంది.

‘రేవంత్ రెడ్డిపై కేంద్రం రాజకీయ కక్ష..’ యూఎస్ టూర్ రద్దుపై ఐఓసీ అమెరికా అభ్యంతరం!తెలంగాణSwechaa23 Aug 2026, 03:20 PM

‘రేవంత్ రెడ్డిపై కేంద్రం రాజకీయ కక్ష..’ యూఎస్ టూర్ రద్దుపై ఐఓసీ అమెరికా అభ్యంతరం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా అనుమతి నిరాకరించింది. విదేశాంగ శాఖ (MEA) తీసుకున్న ఈ నిర్ణయంతో సీఎం పర్యటన పూర్తిగా రద్దయింది. ముఖ్యమంత్రి హోదాకు, ఆ పర్యటన లక్ష్యానికి తగిన స్థాయిలో అధికారిక కార్యక్రమాలు లేవని పేర్కొంటూ కేంద్రం ఈ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై 'ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్' (IOC) అమెరికా విభాగం తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి, రాజకీయ కక్ష సాధింపు చర్యకు నిదర్శనమని ఆరోపించింది.

రేవంత్ సర్కార్ కు కొత్త సవాలు.. హాట్‌టాపిక్‌గా మారుతున్న కాంగ్రెస్ రాజకీయాలు!..తెలంగాణSwechaa23 Aug 2026, 03:02 PM

రేవంత్ సర్కార్ కు కొత్త సవాలు.. హాట్‌టాపిక్‌గా మారుతున్న కాంగ్రెస్ రాజకీయాలు!..

అధికార కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై జరుగుతున్న వ్యాఖ్యల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి, పార్టీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసినట్లు సమాచారం.

ఆటో కార్మికులు తొందరపడొద్దు.. సమస్యలు పరిష్కారిస్తాం  : మంత్రి పొన్నంతెలంగాణSwechaa23 Aug 2026, 02:50 PM

ఆటో కార్మికులు తొందరపడొద్దు.. సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి పొన్నం

నేటి అర్ధరాత్రి నుంచి ఆటో డ్రైవర్లు బంద్‌ పిలుపుపై తాజాగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీంతో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్లు తలపెట్టిన నిరవధిక బంద్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమ్మెల వల్ల సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2015 తర్వాత రాష్ట్రంలో ఆటో చార్జీలు పెరగలేదని మంత్రి గుర్తుచేశారు. పెరిగిన నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని ఆటోఛార్జీల పెంపుపై అధ్యయనం చేయడానికి త్వరలో ప్రత్యేక కమిటీని వేస్తామన్నారు.ఇందులో ఆటో కార్మికుల ప్రతినిధులతో పాటు రవాణా శాఖ అధికారులను భాగస్వామ్యం చేస్తామన్నారు.

నేను చేసింది తప్పే.. భార్య ఉండగా అలా చేయాల్సింది కాదు : ఈశ్వర్ సాయివైరల్ న్యూస్Swechaa23 Aug 2026, 02:31 PM

నేను చేసింది తప్పే.. భార్య ఉండగా అలా చేయాల్సింది కాదు : ఈశ్వర్ సాయి

తెలంగాణ జానపద నటులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ‘బాసింగ బలాలు’ సాంగ్‌తో వీరికి మంచి క్రేజ్ వచ్చింది. అలా జరిగిన కొన్ని రోజుల్లోనే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ కలిసి ఒకే రూంలో అర్ధనగ్నంగా దొరకడంతో సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఆడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, తాజాగా వ్యవహారంపై ఈశ్వర్ సాయి స్పందించాడు.ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. ఒత్తిడి కారణాల దృష్ట్యా హోటల్‌లో అలా చేయాల్సి వచ్చిందని, భార్య ఉండగా తాను అలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని అంగీకరించాడు. మాధురి రాథోడ్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ తర్వాత తనది తప్పని ఈశ్వర్ సాయి ఒప్పుకోవడంతో నెటిజన్లు సైతం భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు మాధురికి సపోర్టు చేస్తుంటే మరికొందరు ఇద్దరిదీ తప్పని తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

ఒక్కటిగా పెరిగి, చిన్నతనం నుంచి కలిసి చదువుకుని..చివరకు!NationalSwechaa23 Aug 2026, 02:09 PM

ఒక్కటిగా పెరిగి, చిన్నతనం నుంచి కలిసి చదువుకుని..చివరకు!

ఇద్దరు ఫ్రెండ్స్ జీవితంలో ఎదురైన ఇబ్బందులు, ఒత్తిడితో కూడిన జీవితాన్ని ఇకముందు లీడ్ చేయలేమని భావించి ఆత్మహత్యకు యత్నించారు. ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భ‌దోహిలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. యూపీ రాష్ట్రం భ‌దోహికి చెందిన క‌విత‌, సాధ‌న ఇద్దరు మంచి ఫ్రెండ్స్. చిన్న‌ప్ప‌టి నుండి క‌లిసే చ‌దువుకున్నారు. 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు క‌లిసి పెరిగిన వీరిద్దరూ ఒక‌రి క‌ష్ట‌సుఖాలు మ‌రొక‌రు పంచుకుంటూ ఉండేవారు. సాధ‌న‌కు రెండు నెల‌ల కిందట త‌న‌కు ఇష్టంలేని వ్య‌క్తితో కుటుంబ స‌భ్యులు పెళ్లి చేశారు. భ‌ర్త తీరు న‌చ్చ‌క‌పోవ‌డంతో నెల‌రోజులుగా సాధ‌న ఇంట్లోనే ఉంటోంది. దీంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైంది.మ‌రోవైపు క‌విత ఓ వ్య‌క్తిని ప్రేమించ‌గా కుటుంబ స‌భ్యులు అత‌డిని పెళ్లి చేసుకునేందుకు నిరాక‌రించారు. దీంతో క‌విత సైతం తీవ్ర‌ ఒత్తిడికి లోనైంది. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని విషపు గులికలు మింగారు. ఈ ఘటనలో కవిత మరణిచంగా..సాధన ప్రాణాాపాయ స్థితిలో ఉంది.

Hero Karthi: కార్తి లైనప్‌లో ఊహించని మార్పులు!సినిమాSwechaa23 Aug 2026, 02:03 PM

Hero Karthi: కార్తి లైనప్‌లో ఊహించని మార్పులు!

Hero Karthi: కోలీవుడ్ హీరోలలో కార్తికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్న సూర్య తో పాటు కార్తి కూడా ప్రయోగాత్మక చిత్రాలను, కమర్షియల్ సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం, కార్తి నుంచి మూడు సినిమాలు రాబోతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం తన లైనప్‌లో మార్పు చోటు చేసుకుంది. కార్తి 30 ద్విభాషా చిత్రం ముందు రాబోతోంది.

Software Layoffs: 'వయసు తక్కువ' అనే సాకు.. సాఫ్ట్‌వేర్ రంగంలో లేఆఫ్స్ కలకలం!వైరల్ న్యూస్Swechaa23 Aug 2026, 02:00 PM

Software Layoffs: 'వయసు తక్కువ' అనే సాకు.. సాఫ్ట్‌వేర్ రంగంలో లేఆఫ్స్ కలకలం!

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాల తొలగింపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ టెక్కీని ప్రముఖ దిగ్గజ సంస్థ 'మైక్రోసాఫ్ట్' విధుల్లో నుంచి తొలగించడం ఐటీ సర్కిళ్లలో చర్చనీయాంశమైంది. తాను వయసులో చిన్నవాడినని, కుటుంబ బాధ్యతలు తక్కువగా ఉంటాయనే విచిత్రమైన సాకుతో తనను ఉద్యోగం నుంచి తీసేసినట్లు సదరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రముఖ సోషల్ మీడియా వేదిక 'రెడ్డిట్' ద్వారా తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రస్తుతం ఆయన కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు.

ఆరోగ్య శ్రీపై రేవంత్ రెడ్డికి కక్ష : హరీశ్ రావుతెలంగాణSwechaa23 Aug 2026, 01:43 PM

ఆరోగ్య శ్రీపై రేవంత్ రెడ్డికి కక్ష : హరీశ్ రావు

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వంపై మాజీ మంత్రి, శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మరోసారి మండిపడ్డారు. సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదని, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందడం లేదని.. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో హరీశ్ రావు ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో వైఫల్యం. సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ వైఫల్యం!.ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్ రెడ్డి’ అంటూ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తూర్పారబట్టారు.

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్తెలంగాణSwechaa23 Aug 2026, 01:25 PM

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సుమంత్ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అతని మీద హత్యాయత్నం మీద కేసు నమోదు కావడంతో అప్పటి నుంచి అబ్‌స్కాండ్ అయినట్టు సమాచారం. మంత్రి కొండా మాజీ ఓఎస్డీ కోసం వెతుకుతున్న పోలీసులు..ఇవాళ ఉదయం తెల్లాపూర్‌లోని సుమంత్ ఇంటి ముందు అతని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశాడని,చంపేందుకు ప్రయత్నించాడని ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు సుమంత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.తాజాగా సుమంత్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అసలు నిందితుడి కోసం విచారించనున్నట్టు సమాచారం.

గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్, ప్లైవుడ్ గోదాములు దగ్ధం!క్రైమ్Swechaa23 Aug 2026, 01:19 PM

గుడిమల్కాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్, ప్లైవుడ్ గోదాములు దగ్ధం!

హైదరాబాద్‌ నగరంలో ఒక్కసారిగా జరిగిన భారీ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొగల్ కానాల ప్రాంతంలో ఉన్న పలు ఫర్నిచర్, ప్లైవుడ్ గోదాముల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాముల నిండా భారీ మొత్తంలో చెక్క సామగ్రి, ప్లైవుడ్ బోర్డులు, అలాగే డైపర్లు వంటి ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉండటంతో మంటలు క్షణాల వ్యవధిలోనే చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడిన దట్టమైన నల్లటి పొగలతో ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం సంతరించుకుంది.

Pawan kalyan: నూతన శకంలోకి భారత అంతరిక్ష రంగం : పవన్ కల్యాణ్ఏపీSwechaa23 Aug 2026, 01:11 PM

Pawan kalyan: నూతన శకంలోకి భారత అంతరిక్ష రంగం : పవన్ కల్యాణ్

జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రాత్మక చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా ల్యాండింగ్ కావడం, ఆదిత్య-ఎల్1 ద్వారా సూర్యుని అన్వేషణ జరగడం వంటి ఘనతలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంతరిక్ష రంగంలో భారతదేశ భవిష్యత్తుకు సరికొత్త అవకాశాలను తెరుస్తున్న అద్భుతమైన స్పాడెక్స్ (SPADEX) డాకింగ్ ప్రదర్శనల వరకు ఇస్రో, మన శాస్త్రవేత్తలు సాధించిన అసాధారణ విజయాలను దేశం గర్వంగా వేడుక చేసుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు.

ChatGPT for Teens: ‘చాట్‌జీపీటీ ఫర్ టీన్స్’.. ఇది టీనేజర్లకు మాత్రమే!వ్యాపారంSwechaa23 Aug 2026, 12:54 PM

ChatGPT for Teens: ‘చాట్‌జీపీటీ ఫర్ టీన్స్’.. ఇది టీనేజర్లకు మాత్రమే!

యువత డిజిటల్ వాతావరణాన్ని మరింత సురక్షితంగా, బాధ్యతాయుతంగా మార్చే దిశగా ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 13 నుంచి 17 సంవత్సరాల వయసు గల టీనేజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘చాట్‌జీపీటీ ఫర్ టీన్స్’ ఫీచర్‌ను గ్లోబల్‌గా అందుబాటులోకి తెచ్చింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికే కాకుండా, యువతలో విమర్శనాత్మక ఆలోచనా విధానాన్ని (Critical Thinking) పెంపొందించేలా దీన్ని రూపొందించడం విశేషం.

రైల్వే దుప్పట్ల దొంగలు.. నడిరోడ్డు మీద తిరుగుతూ జల్సా (వైరల్)వైరల్ న్యూస్Swechaa23 Aug 2026, 12:53 PM

రైల్వే దుప్పట్ల దొంగలు.. నడిరోడ్డు మీద తిరుగుతూ జల్సా (వైరల్)

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, దోచుకోవడం కొందరికి బాగా అలవాటు అయ్యింది. ప్రజాధనంతో కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తుంటే కొందరు మాత్రం ఆటంకాలు కలిగిస్తున్నారు.దేశం పరువు తీరుస్తున్నారు. రైల్వేలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ స్లీపర్ క్లాసుల్లో దుప్పట్లు ఏర్పాటు చేస్తే కొందరు వాటిని దొంగిలించడం కామన్ అయిపోయింది. తాజా ఓ ముగ్గురు వ్యక్తులు రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన దుప్పట్లను దొంగిలించారు.వాటిని శాలువాగా కప్పుకుని బయట సంచరిస్తుంటం గమనించిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ అవుతోంది. వెస్టర్న్ రైల్వే అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాలువాలుగా కప్పుకొని మార్కెట్లో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన దృశ్యాలు పలువురిని షాక్‌కు గురిచేశాయి.వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో  భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరికతెలంగాణSwechaa23 Aug 2026, 12:26 PM

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరిక

రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నిన్న రాత్రి ఉన్నట్టుండి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. సుమారు గంటన్నర నుంచి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అల్పపీడనం ప్ర‌భావం కారణంగా నేడు, రేపు విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఉత్త‌ర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, పెద్ద‌ప‌ల్లి, జ‌గిత్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, భద్రాద్రి కొత్త‌గూడెం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, నిర్మ‌ల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపారు.

'ఇరుముడి' కథ రిజెక్ట్ చేసి హిట్ మిస్సైయ్యాడా?సినిమాSwechaa23 Aug 2026, 12:09 PM

'ఇరుముడి' కథ రిజెక్ట్ చేసి హిట్ మిస్సైయ్యాడా?

Naga Chaithanya:నాగ చైతన్యకి మజిలీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ.. తాజాగా వచ్చి హిట్ కొట్టిన ఇరుముడి కథను ముందు చైతూకే వినిపించాడట. కథ, బాగా నచ్చినప్పటికీ..ప్రస్తుతం కమిటైన వృష కర్మ చిత్రానికి ఎక్కువగా డేట్స్ ఇచ్చి ఉండటంతో, ఇరుముడి చిత్రానికి సర్దుబాటు చేయలేకపోయాడట. దీంతో, ఇరుముడి కథను వదులుకోవాల్సి వచ్చిందట. అయితే, ఇది మంచికే అంటున్నారు.

'నన్ను కిడ్నాప్ చేశారు' అంటూ ప్రియురాలికి మెసేజ్.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు!క్రైమ్Swechaa23 Aug 2026, 11:54 AM

'నన్ను కిడ్నాప్ చేశారు' అంటూ ప్రియురాలికి మెసేజ్.. పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు!

సరదాగా చేసిన ఒక పని ముగ్గురు యువకులను ఊహించని విధంగా కష్టాల్లోకి నెట్టింది. మద్యం మత్తులో ప్రియురాలికి పంపిన ఒక అబద్ధపు సందేశం, చివరకు వారి ఫ్లాట్‌లో దాచిపెట్టిన అక్రమ బెట్టింగ్ సొమ్మును పోలీసుల ముందు బట్టబయలు చేసింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ విచిత్ర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రగిరి ప్రాంతానికి చెందిన దేశినేని సుమంత్, మాకాటి మనోజ్, కనుమూరి గౌతమ్ అనే ముగ్గురు యువకులు కేపీహెచ్‌బీలోని 'ఇండిస్ వన్ సిటీ' గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నారు.

వెంకీ-కీర్తి, కళ్యాణ్ రామ్-కృతీలపై స్పెషల్ సాంగ్సినిమాSwechaa23 Aug 2026, 11:43 AM

వెంకీ-కీర్తి, కళ్యాణ్ రామ్-కృతీలపై స్పెషల్ సాంగ్

‘జనవరి 12 విడుదల’: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘జనవరి 12 విడుదల’ అనే చిత్రం తెరకెక్కుతోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. షైన్ స్క్రీన్ బ్యానర్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. సాహు గారపాటి, సురేష్ బాబు నిర్మాతలు. హీరోయిన్‌గా కీర్తి సురేష్, కృతీ శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడట. దీని కోసం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో భారీ సెట్ వేసినట్టుగా తెలుస్తోంది.

గుడిలో దీపం కోసం ఇళ్లల్లోని దీపాలు ఆర్పుతారా? : ఎమ్మెల్సీ  త్రిమూర్తులుఏపీSwechaa23 Aug 2026, 11:35 AM

గుడిలో దీపం కోసం ఇళ్లల్లోని దీపాలు ఆర్పుతారా? : ఎమ్మెల్సీ త్రిమూర్తులు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.దీంతో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొన్ని ఇండ్లను కూల్చాల్సి వస్తున్నది.ఈ క్రమంలోనే అధికారులు అర్ధరాత్రి ఇండ్లను కూల్చేందుకు పోలీసుల సాయంతో ఘటనా స్థలానికి వెళ్లగా ప్రజలు, అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏన్నో ఏండ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, పుష్కరాల కోసం తమ ఇండ్లను తొలగించడం ఏంటని అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారి సమస్యలు విన్నారు. ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. అనంతరం అధికారులతో మాట్లాడినట్టు తెలిసింది.

లంకతో రెండో టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. కొత్త ఆల్‌రౌండర్‌ అరంగేట్రం!క్రీడలుSwechaa23 Aug 2026, 11:27 AM

లంకతో రెండో టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. కొత్త ఆల్‌రౌండర్‌ అరంగేట్రం!

శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాలెలో జరిగిన తొలి టెస్టులో 165పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా, ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌తో మధ్యప్రదేశ్‌కు చెందిన యువ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ సరాన్ష్ జైన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఊడిన కుట్లు, వెలిసే రంగులు.. ఇదేనా రేవంత్ చెప్పే ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ? : హరీశ్ రావురాజకీయాలుSwechaa23 Aug 2026, 11:13 AM

ఊడిన కుట్లు, వెలిసే రంగులు.. ఇదేనా రేవంత్ చెప్పే ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ? : హరీశ్ రావు

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు, చెబుతున్న మాటలపై మాజీ మంత్రి, శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు.మాట్లాడితే అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేస్తున్నానని చెప్పే రేవంత్ రెడ్డి.. విద్యార్థులకు అందించే యూనిఫామ్స్ ఇవేనా? అని ప్రశ్నించారు.చాలా చోట్ల ఒక జత యూనిఫామ్స్ కూడా అందలేదని, అందిన చోట క్వాలిటీ బాలేదని, నాసిరకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు హరీశ్ రావు ఆదివారం ఉదయం ఎక్స్ వేదికగా రాష్ట్రంలోని విద్యార్థులకు అందించిన యూనిఫామ్స్‌కు సంబంధించి క్లిప్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Yash-Toxic: మ్యాప్‌లో ఇండియన్ సినిమా ఉండాలి..2000 కోట్లు పక్కా!సినిమాSwechaa23 Aug 2026, 10:59 AM

Yash-Toxic: మ్యాప్‌లో ఇండియన్ సినిమా ఉండాలి..2000 కోట్లు పక్కా!

Yash-Toxic: పాన్ ఇండియన్ సినిమాను.. పాన్ వరల్డ్ సినిమాగా తీసుకెళ్ళేందుకు యష్ ఎంతో శ్రమించాడని దిల్ రాజు అన్నారు. అంతేకాదు, కేజీఎఫ్ సిరీస్ తర్వాత కొత్త దర్శకురాలితో సినిమా చేస్తున్న విషయం తెలిసి షాకయ్యానని అన్నాడు. కేజీఎఫ్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత పెద్ద దర్శకులకి కమిటవుతారు ఏ హీరో అయినా. అలాంటిది, యష్ మాత్రం కథ, దర్శకురాలిపై నమ్మకంతో డెబ్యూ డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చాడని, మన ఇండియన్ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా నిలబెట్టేందుకు ఎంతో కృషి చేస్తున్నాడని, యష్ గురించి పొగడ్తల వర్షం కురిపించాడు దిల్ రాజు. ఇక, ఈ సినిమా గ్యారెంటీగా 2000 కోట్ల వసూళ్ళను రాబడుతుందని దిల్ రాజు ధీమాను వ్యక్తం చేశాడు.

మంటల్లో మానవత్వం.. వెనక్కి వెళుతున్న సమాజం!..క్రైమ్Swechaa23 Aug 2026, 10:58 AM

మంటల్లో మానవత్వం.. వెనక్కి వెళుతున్న సమాజం!..

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు.. జీవిత విలువలను ప్రశ్నిస్తున్నాయి. మనిషి ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. అతనిలోని మానవత్వం మాత్రం ఎందుకు తగ్గిపోతోందనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఒకప్పుడు కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, పరస్పర గౌరవం మనిషి జీవితానికి పునాదులుగా ఉండేవి. కానీ నేడు చిన్నచిన్న విభేదాలకే హత్యలు, దాడులు, ప్రతీకారాలతో మనుషులు రగిలిపోతున్నారు.

ఆవేశాన్ని, కోపాన్ని అదుపు చేసుకోలేక ప్రాణాలు తీయడమో, లేక ప్రాణాలు తీసుకోవడమో చేస్తున్నారు.. ఈ లోకంలో మనిషి ప్రాణం విలువ కంటే క్షణికావేశం, అహంకారం, డబ్బు, ఆధిపత్యం ముఖ్యమైపోతున్నాయా అనే సందేహం కలుగుతోంది.

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. వణికిపోయిన టోక్యో నగరం!InternationalSwechaa23 Aug 2026, 10:56 AM

Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. వణికిపోయిన టోక్యో నగరం!

జపాన్ తూర్పు ప్రాంతాన్ని ఆదివారం తెల్లవారుజామున పెను భూకంపం కుదిపేసింది. రాజధాని టోక్యోతో పాటు పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ కేంద్రంగా, భూమికి సుమారు 70 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) దీనిని 5.8గా నమోదు చేసింది. ఈ ఘటనలో 23 మంది గాయపడగా, వారిలో ఎక్కువ మందికి స్వల్ప గాయాలైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఆటోల బంద్‌ కు సిద్దమైన డ్రైవర్లు.. నేటి అర్ధరాత్రి నుంచి అమలు!..తెలంగాణSwechaa23 Aug 2026, 10:45 AM

ఆటోల బంద్‌ కు సిద్దమైన డ్రైవర్లు.. నేటి అర్ధరాత్రి నుంచి అమలు!..

సమస్యలకు నిలయంగా మారుతున్న తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్‌ డ్రైవర్ల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల నిరవధిక బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి..

రద్దు చేయడానికి రిజర్వేషన్స్ దానంగా రాలేదు  : చిరాగ్ పాశ్వాన్NationalSwechaa23 Aug 2026, 10:38 AM

రద్దు చేయడానికి రిజర్వేషన్స్ దానంగా రాలేదు : చిరాగ్ పాశ్వాన్

రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రస్తుతం దేశంలో కొత్త ఉద్యమం పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ పేరిట సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం.. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. కులాల వారీగా రిజర్వేషన్లు రద్దు చేసి కేవలం ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయాలని రిజర్వేషన్ హటావో ఆందోళన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వీరికి దేశవ్యాప్తంగా సామాజిక మాద్యమాల్లో మద్దతు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, జంతర్‌మంతర్ 'రిజర్వేషన్ హఠావో' పేరిట ఆందోళనలు చేస్తున్న వారిపట్ల కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రిజర్వేషన్లు ఏమీ దానం కాదని, అవి ఎవరి డిమాండ్ మేరకో రద్దు చేసేది కాదని’ పేర్కొన్నారు. నిన్న పాట్నాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తరతరాలుగా సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న వర్గాలకు అండగా నిలిచేందుకే రాజ్యాంగం కల్పించిన హక్కు రిజర్వేషన్ అని గుర్తుచేశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆరోగ్య పథకంలో కీలక మార్పులు!తెలంగాణSwechaa23 Aug 2026, 10:37 AM

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆరోగ్య పథకంలో కీలక మార్పులు!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 'న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' (NEHS) మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. పథకం ప్రారంభమైన జులై 17నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య చికిత్స పరిమితిని పెంచడంతో పాటు పలు కీలక వెసులుబాట్లను కల్పించింది.

అంజయ్య నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. ఆ కట్టడాలు కూల్చుతారా?తెలంగాణSwechaa23 Aug 2026, 10:14 AM

అంజయ్య నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. ఆ కట్టడాలు కూల్చుతారా?

హైదరాబాద్‌ మహానగరంలోని మాదాపూర్ పరిధిలో ఉన్న అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల అక్రమ నిర్మాణం నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. భవనం ఒక్కసారిగా కూలడంతో పక్కన ఉన్న అపార్ట్ మెంట్స్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన కార్మికులు మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులుగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి శిథిలాల తొలగింపులో ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా? మరణించి ఉన్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండా, నిన్న కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాలు పక్కన ఉండే జయదర్శి అపార్ట్‌మెంట్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే, దానిని కూడా ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేసే అవకాశం కూడా ఉంది.అంజయ్య నగరలో మరో నాలుగు అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిని కూడా కూల్చుతామని నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.