స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

అంజయ్య నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. ఆ కట్టడాలు కూల్చుతారా?తెలంగాణSwechaa23 Aug 2026, 10:14 AM

అంజయ్య నగర్‌లో కొనసాగుతున్న రెస్క్యూ.. ఆ కట్టడాలు కూల్చుతారా?

హైదరాబాద్‌ మహానగరంలోని మాదాపూర్ పరిధిలో ఉన్న అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల అక్రమ నిర్మాణం నిన్న కుప్పకూలిన విషయం తెలిసిందే. భవనం ఒక్కసారిగా కూలడంతో పక్కన ఉన్న అపార్ట్ మెంట్స్ సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన కార్మికులు మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్ కార్మికులుగా గుర్తించారు.ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రెస్య్కూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. కాగా, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి శిథిలాల తొలగింపులో ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా? మరణించి ఉన్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలాఉండా, నిన్న కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాలు పక్కన ఉండే జయదర్శి అపార్ట్‌మెంట్ మీద పడటంతో అది కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే, దానిని కూడా ఇవాళ హైడ్రా అధికారులు కూల్చివేసే అవకాశం కూడా ఉంది.అంజయ్య నగరలో మరో నాలుగు అక్రమ కట్టడాలు ఉన్నాయని, వాటిని కూడా కూల్చుతామని నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

హర్మూజ్ జలసంధి మాదే.. మరో మ్యాప్‌తో  ట్రంప్ సంచలన పోస్ట్!InternationalSwechaa23 Aug 2026, 10:10 AM

హర్మూజ్ జలసంధి మాదే.. మరో మ్యాప్‌తో ట్రంప్ సంచలన పోస్ట్!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఏకంగా 'అమెరికా కొత్త భూభాగం' అంటూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు హర్మూజ్ జలసంధి ప్రాంతాన్ని అమెరికా భూభాగంగా స్పష్టంగా హైలైట్ చేస్తున్న ఒక సరికొత్త మ్యాప్‌ను ట్రూత్ సోషల్ వేదికగా ఆదివారం(నేడు) ఆయన పోస్ట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మణిపూర్ వర్సెస్ ఏపీ.. కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థుల ఘర్షణఏపీSwechaa23 Aug 2026, 10:02 AM

మణిపూర్ వర్సెస్ ఏపీ.. కాకినాడ నర్సింగ్ కాలేజీలో విద్యార్థుల ఘర్షణ

ఏపీలోని కాకినాడ జిల్లాలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఏపీ, మణిపూర్ విద్యార్థినులు రెండు గ్రూపులుగా ఏర్పడి దాడులు చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం స్పందించారు.హుటాహుటిన ఘర్షణ నెలకొన్న హాస్టల్‌కు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..ఏపీలోని కాకినాడ జిల్లాలో గల ఓ మహిళా నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో మొబైల్ ఫోన్ మాయమైంది. ఫోన్ పొగొట్టుకున్న విద్యార్థిని తోటి విద్యార్థినులను ప్రశ్నించగా.. చిన్న వాగ్వాదం నెలకొన్నట్టు సమాచారం.తీరా అది కాస్త తెలుగు వర్సెస్ మణిపూర్ విద్యార్థుల మధ్య గ్రూప్ వార్‌గా మారింది. విద్యార్థినుల మధ్య వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయగా.. బకెట్లు, కర్రలు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నట్టు సమాచారం.

దేశంలో 8.7కోట్ల మంది యువత ఖాళీ.. నీతి ఆయోగ్ సంచలన నివేదిక!InternationalSwechaa23 Aug 2026, 09:34 AM

దేశంలో 8.7కోట్ల మంది యువత ఖాళీ.. నీతి ఆయోగ్ సంచలన నివేదిక!

చేతిలో డిగ్రీలు ఉన్నా.. చదువు పూర్తి చేసినా.. యువతకు మాత్రం సరైన ఉపాధి దొరకడం లేదు. దేశంలో నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నీతి ఆయోగ్ తాజా నివేదిక అద్దం పడుతోంది. చదువు, ఉద్యోగం, కనీసం నైపుణ్య శిక్షణ కూడా లేకుండా కోట్లాది మంది యువతీయువకులు ఖాళీగా ఉంటున్న వైనం దేశ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో యువత ఉపాధి, నైపుణ్యాల పరిస్థితిపై నీతి అయోగ్ నివేదికలో ఆందోళనకరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా 15 నుంచి 29ఏళ్ల వయసున్న సుమారు 8.7కోట్ల మంది యువతీయువకులు ప్రస్తుతం ఎలాంటి చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణ లేకుండా ఖాళీగా ఉంటున్నట్లు తేలింది.

Surya vs Ravi Teja: విశ్వనాథ్‌కి బ్రేక్ వేసిన ఇరుముడి!సినిమాSwechaa23 Aug 2026, 09:21 AM

Surya vs Ravi Teja: విశ్వనాథ్‌కి బ్రేక్ వేసిన ఇరుముడి!

Surya vs Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి ఈ ఆగస్టు 21న రిలీజైంది. ధమాకా తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు మాస్ రాజా. అయితే, డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకొని ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా రాబట్టలేనంతగా, 2 రోజుల్లోపే బ్రేకీవెన్ అయింది ఇరుముడి. దీంతో, సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ కి వస్తున్న కలెక్షన్స్ పూర్తిగా డ్రాపయ్యాయి.

ఒక్క చుక్క చమురు కూడా బయటకు పోనివ్వం.. ప్రపంచ దేశాలకు ఇరాన్ హెచ్చరిక!InternationalSwechaa23 Aug 2026, 08:59 AM

ఒక్క చుక్క చమురు కూడా బయటకు పోనివ్వం.. ప్రపంచ దేశాలకు ఇరాన్ హెచ్చరిక!

తమపై అమెరికా ముమ్మరం చేసిన ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామ్యం అయితే, వాటిని కూడా తమ శత్రువుల జాబితాలోనే చేరుస్తామని ఇరాన్ హెచ్చరించింది. అమెరికాతో కలిసి తాలను ఒంటరి చేసేందుకు ప్రయత్నించే దేశాల ప్రయోజనాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తామని తేల్చిచెప్పింది. ఒకవేళ పొరుగు దేశాలు కూడా ఈ దిగ్బంధనంలో భాగమైతే, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ఒక్క చుక్క నూనె కూడా బయటకు వెళ్లకుండా పూర్తిగా అడ్డుకుంటామని స్పష్టం చేసింది.

టాక్సిక్ ఈవెంట్‌లో అపశృతి.. సంచలన కామెంట్స్ చేసిన మల్లారెడ్డి కోడలు!..తెలంగాణSwechaa23 Aug 2026, 08:55 AM

టాక్సిక్ ఈవెంట్‌లో అపశృతి.. సంచలన కామెంట్స్ చేసిన మల్లారెడ్డి కోడలు!..

మల్లారెడ్డి యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లడ్ లైట్ స్తంభం మీదపడి పలువురు యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ కార్యక్రమం సందర్భంగా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం మన గ్రౌండ్‍లో జరగాలంటే మన బిహేవియర్ సరిగా ఉండాలని సూచించారు. ఏదైనా పొరపాటు జరిగితే మళ్లీ మన క్యాంపస్‍లో ఇలాంటి కార్యక్రమం జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఈవెంట్స్ మళ్లీ జరగాలంటే మీరు ఫస్ట్ సరిగా ప్రవర్తించండి అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.

రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ వ్యవస్థ పార్ట్ -3..  రైజింగ్ కాదు.. డ్రైనేజ్ అనేది ఇందుకే!..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa23 Aug 2026, 08:22 AM

రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ వ్యవస్థ పార్ట్ -3.. రైజింగ్ కాదు.. డ్రైనేజ్ అనేది ఇందుకే!..

సైబరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రాజకీయ అండదండలతో చిన్న స్థలాల్లోనే బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గచ్చిబౌలిలో 50 గజాల్లో నిర్మించిన ఏడు అంతస్తుల భవనం కూలిన ఘటన ఈ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అయ్యప్ప సొసైటీలో అనుమతులు, భద్రతపై సందేహాలున్న భవనాల్లో విద్యాసంస్థలు నడుస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, వారికి పోస్టింగులు ఇప్పిస్తున్న రాజకీయ పెద్దలు బాధ్యత వహించాలని స్వేచ్ఛ ప్రశ్నిస్తోంది.

Kaaka: ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే..ముందుంది అసలు పండుగసినిమాSwechaa23 Aug 2026, 08:18 AM

Kaaka: ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే..ముందుంది అసలు పండుగ

Kaaka Teaser: బాబీ..తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ చిత్రాలతో హిట్ కొడుతున్న దర్శకుల్లో ఒకరు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మెగా 158 సినిమాకి సంబందించి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. కాకా అనే టైటిల్ తో పాటు చిరు పాత్ర ఎలా ఉండబోతుంది..అనేది జస్ట్ ఓ శాంపిల్ ని వదిలాడు బాబి. ముఖ్యంగా థమన్ బీజీఎం ఎప్పటిలాగే మోగిపోయింది. దీనిపై, బాబీ మాట్లాడుతూ, కాకా టైటిల్ టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు ఇంకా అద్భుతాలు చూస్తారని తెలిపాడు.

మాటే మంత్రమని ఎందుకు అన్నారు?SpiritualitySwechaa23 Aug 2026, 07:56 AM

మాటే మంత్రమని ఎందుకు అన్నారు?

మాట అనేది కత్తికంటే పదునైనది. బ్రతికి ఉండగా జీవచ్ఛవంలా మార్చేది.. అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడమని అనుభవజ్ఞులు చెబుతారు. అలాగే మాటే మంత్రం అనే నానుడి ఉంది. ఈ మాట చెప్పడం వెనుక కేవలం లోకజ్ఞానమే కాదు, మహోన్నతమైన ఆధ్యాత్మిక రహస్యం కూడా దాగి ఉందని జ్ఞానవంతులు చెబుతారు. సృష్టి ఆరంభంలో మొదట వెలువడింది శబ్దమే అని, దీనినే శాస్త్రాలు "శబ్ద బ్రహ్మం" అని పిలిచాయని పేర్కొంటారు.

మనం నోటి నుంచి పలికే ప్రతి మాట ఒక నిర్దిష్టమైన శబ్ద తరంగాన్ని, కంపనాన్ని సృష్టిస్తుంది. మంత్రం అంటే ఏదో అపరిచితమైన శబ్దం కాదు.. "మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే మనస్సును పవిత్రం చేసి, ఆపదలనుంచి రక్షించేది అని అర్థం. మనం మాట్లాడే ప్రతి పదం మనలోని, మన చుట్టూ ఉన్న పరిసరాలలోని శక్తిని ప్రభావితం చేస్తుంది కాబట్టే మాటను మంత్రంతో పోల్చారని పండితులు చెబుతారు..

Ravi Teja-Irumudi: మాస్ రాజా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్..రెండవరోజే లాభాల్లోకి!సినిమాSwechaa23 Aug 2026, 07:52 AM

Ravi Teja-Irumudi: మాస్ రాజా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్..రెండవరోజే లాభాల్లోకి!

Ravi Teja-Irumudi: సరైన హిట్ పడాలే గానీ, రవి తేజ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాన్ని అందుకోగలడో తాజాగా విడుదలైన ఇరుముడి సినిమా నిరూపించింది. ఒకప్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్న రవి తేజ క్రాక్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు. మళ్ళీ ఇంతకాలానికి, ఇరుముడి సినిమాతో భారీ హిట్ కొట్టాడు. కేవలం 2 రెండు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం గొప్ప విషయం.

మానవుడు దేవుడిని మెప్పించడానికి చేయవలసిన అసలైన పూజ ఏమిటి?..SpiritualitySwechaa23 Aug 2026, 07:44 AM

మానవుడు దేవుడిని మెప్పించడానికి చేయవలసిన అసలైన పూజ ఏమిటి?..

నేటి సమాజంలో భక్తి అనేది చాలా వరకు ఒక అవసరంగా మారిందే తప్ప ఆథ్యాత్మిక ప్రయాణంగా భావించలేకపోతున్నారనే భావన ఉంది. నుదుట బొట్టు,మెడలో రుద్రాక్షలు.. పుణ్య తిథులు, పండగలు, వ్రతాలు ఉన్నప్పుడు ఆడంబరమైన పూజలు.. హంగామా.. కానీ మనస్సులో ప్రేమ, దయ, సానుభూతి.. సాటి మనషులపట్ల గౌరవ భావం కనిపించడం లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజలు చేస్తూ, ఆలయాలకు వెళ్ళే వాళ్ళు నిత్యం తమ జీవితంలో ఆ సర్వాంతర్యామి నియమాలను పాటిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారా అంటే.. చాలా వరకు లేరనే సమాధానం వస్తుంది.

ఆలయానికి వెళ్ళిన ఆ నిమిషం భక్తి పొంగి పోరలుతుంది. కానీ ఆలయం దాటి బయటికి వచ్చాడా అప్పటి వరకు ఉన్న భక్తిపరుడు వ్యాపారుడు అవుతాడు. మళ్ళీ మామూలు మనిషిలా జంతువు కంటే హీనంగా ప్రవర్తిస్తాడు. మరి అప్పటి వరకు ఉన్న భక్తి ఎక్కడ పోయింది? అందుకే భగవంతుడికి కావలసింది బాహ్య ఆడంబరాలు, కోట్ల కొద్దీ ధనం ఖర్చు పెట్టి చేసే గొప్ప పూజలు, నోళ్లు తిరగని మంత్రోచ్ఛారణలు కావని పురాణాలు చెబుతున్నాయి.

రష్యాకు జైశంకర్.. అమెరికా ఒత్తిడి మధ్య భారత్ కొత్త గేమ్?InternationalSwechaa23 Aug 2026, 01:03 AM

రష్యాకు జైశంకర్.. అమెరికా ఒత్తిడి మధ్య భారత్ కొత్త గేమ్?

ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాతో సంబంధాలను తగ్గించుకోవాలని పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌పై ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ న్యూఢిల్లీ తన విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చుకోలేదు. భారత్‌కు ఏ దేశంతో సంబంధాలు ఎలా ఉండాలన్నది ప్రధానంగా జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయిస్తామని జైశంకర్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు.

సాయుధ చైతన్య విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయంతెలంగాణSwechaa23 Aug 2026, 12:10 AM

సాయుధ చైతన్య విద్యార్థుల ప్రతిభ ప్రశంసనీయం

శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ పోలీస్ బెటాలియన్ సాయుధ చైతన్య పాఠశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులతోపాటు అతిథి గృహ భవన ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ తో పాటు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. అతిథులకు పోలీసుల గౌరవ వందనం అనంతరం పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని అతిధులు ఆవిష్కరించి పూజలు నిర్వహించారు. అనంతరం నూతన తరగతి గదులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

లండన్‌లో కేసీఆర్‌తో   సీక్రెట్ మీటింగ్.. సీఎం రేవంత్  ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారుతెలంగాణSwechaa22 Aug 2026, 11:19 PM

లండన్‌లో కేసీఆర్‌తో సీక్రెట్ మీటింగ్.. సీఎం రేవంత్ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారు

Alleti Maheshwar Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లండన్ పర్యటనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. లండన్ టూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్య సమావేశం జరిగిందన్నారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో ఈ భేటీ జరిగిందని ఆయన ఆరోపించారు. బెంగళూరు సమావేశానికి కొనసాగింపుగానే ఈ సీక్రెట్ మీటింగ్ జరిగిందన్నారు.

గతంలో కాపాడాను, ఇప్పుడా అవకాశం లేదు..తెలంగాణSwechaa22 Aug 2026, 10:54 PM

గతంలో కాపాడాను, ఇప్పుడా అవకాశం లేదు..

కొండా సురేఖ అంశంపై చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖను గతంలో తాను కాపాడానని ఆయన తెలిపారు. అప్పుడు అవకాశం ఉండటంతో కొండా సురేఖను కాపాడానని, ఇప్పుడు కాపాడే అవకాశం లేదని తేల్చి చెప్పారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం-మంత్రి కొండా సురేఖ మరో సంచలన లేఖతెలంగాణSwechaa22 Aug 2026, 10:29 PM

వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం-మంత్రి కొండా సురేఖ మరో సంచలన లేఖ

Konda Surekha: మంత్రి కొండా సురేఖ తగ్గేదేలే అంటున్నారు. సై అంటే సై అంటూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. సీఎం రేవంత్ పై తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసిన కొండా సురేఖ.. ఇప్పుడు మరో లేఖ సంధించారు. తనను టార్గెట్ చేసిన వారి వెనుకున్నది ఎవరో తేల్చి వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

Mallu Ravi: మంత్రి కొండా సురేఖపై చర్యలు? మల్లు రవి కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa22 Aug 2026, 09:10 PM

Mallu Ravi: మంత్రి కొండా సురేఖపై చర్యలు? మల్లు రవి కీలక వ్యాఖ్యలు

Mallu Ravi: మూడు విషయాల మీద సుదీర్ఘంగా చర్చించినట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన రిప్లయ్ చూశామన్నారు. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడిన మాటలు వీడియోలు కూడా చూశామన్నారు. ముఖ్యమంత్రిని మామూలు వ్యక్తిగా అనుచిత వాఖ్యలు చేసిందని మల్లు రవి అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ ఇస్తామని చెప్పారన్న మల్లు రవి.. అందరూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఆ రెండు సినిమాలు ఆగిపోలేదు..కానీ!సినిమాSwechaa22 Aug 2026, 08:44 PM

ఆ రెండు సినిమాలు ఆగిపోలేదు..కానీ!

Chiranjeevi: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో విశ్వంభర, శీకాంత్ ఓదెల సినిమాల నుంచి ఇటీవల ఏ అప్‌డేట్ రాలేదని మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. కానీ, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అప్‌డేట్స్ ఇచ్చారు, ఆయా చిత్రాల మేకర్స్. ఈ రెండు సినిమాలు ఆగిపోలేదని కన్‌ఫర్మ్ అయింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆ సినిమాలపై మళ్ళీ అంచనాలను పెంచుకుంటున్నారు.

ఏరోజు ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, ఇంచు భూమి కబ్జా చేయలేదుతెలంగాణSwechaa22 Aug 2026, 07:32 PM

ఏరోజు ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, ఇంచు భూమి కబ్జా చేయలేదు

25ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, ఏ రోజు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఇంచు భూమి కూడా కబ్జా చేయలేదని, ఏ పనికీ ఒక్క పైసా తీసుకోలేదని మంత్రి జూపల్లి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేస్తున్నానని, అందుకే ప్రజలు సుదీర్ఘకాలంగా తనను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతగా పని చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, క్షేత్ర స్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన పర్యటనల ఉద్దేశమని వెల్లడించారు.

చిరంజీవిపై బీజేపీ ఎంపీ ప్రశంసల వర్షంతెలంగాణSwechaa22 Aug 2026, 07:08 PM

చిరంజీవిపై బీజేపీ ఎంపీ ప్రశంసల వర్షం

Eatala Rajendar: పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ కూకట్ పల్లిలో రక్తదాన, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు. కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. కాపు సంఘం ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వారిని, రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు.

Raaka Movie: ఐకాన్ స్టార్ పాన్ వరల్డ్ మూవీలో మంచు లక్ష్మీ.!?సినిమాSwechaa22 Aug 2026, 07:00 PM

Raaka Movie: ఐకాన్ స్టార్ పాన్ వరల్డ్ మూవీలో మంచు లక్ష్మీ.!?

Raaka Movie: Raaka Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో మంచు ఫ్యామిలీ అమ్మాయి, నటి-నిర్మాత-హోస్ట్ మంచు లక్ష్మీ ఓ కీలక పాత్రలో కనిపించబోతుందనేది లేటెస్ట్ న్యూస్. మంచు లక్ష్మీ గుండెల్లో గోదావరి, అనగనగా ఓ ధీరుడు లాంటి సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. మళ్ళీ, ఇంతకాలానికి 'రాకా'లో కనిపించబోతుందట.

కరీంనగర్ కార్పొరేషన్‌పై ‘జెన్-జీ వాచ్‌ డాగ్’ నిఘా..తెలంగాణSwechaa22 Aug 2026, 06:51 PM

కరీంనగర్ కార్పొరేషన్‌పై ‘జెన్-జీ వాచ్‌ డాగ్’ నిఘా..

Gen Z Watchdog: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. నగరంలో తొలిసారిగా యువతను భాగస్వామ్యం చేస్తూ ‘జెన్-జీ విజిలెన్స్ వాచ్‌ డాగ్ కమిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Allu Arjun: కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యానే..చిరుకి బర్త్ డే విషెస్..వైరల్‌గా పోస్ట్సినిమాSwechaa22 Aug 2026, 06:27 PM

Allu Arjun: కట్టె కాలే అంత వరకు చిరంజీవి ఫ్యానే..చిరుకి బర్త్ డే విషెస్..వైరల్‌గా పోస్ట్

Allu Arjun: Allu Arjun: నేడు(ఆగస్టు 22) టాలీవుడ్ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి మెగా ఫ్యామిలీ మెంబర్స్, టాలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు, చిరుతో ఉన్న ప్రత్యేకమైన జర్నీ, అనుబంధాన్ని గురించి ప్రత్యేకంగా పంచుకున్నారు. అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిరుకి బర్త్ డే విషెస్ చెప్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Priya Bhavani Shankar: తెలుగులో ఫస్ట్ బ్లాక్ బస్టర్..ఇక క్రేజీ ఆఫర్స్సినిమాSwechaa22 Aug 2026, 05:39 PM

Priya Bhavani Shankar: తెలుగులో ఫస్ట్ బ్లాక్ బస్టర్..ఇక క్రేజీ ఆఫర్స్

Priya Bhavani Shankar: Priya Bhavani Shankar: ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ గురించే. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ ఆగస్టు 21న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. బేబీ నక్షత్ర కీలక పాత్రలో ఆకట్టుకుంది. ఇంతకముందే తెలుగులో సినిమాలు చేసినా, మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ మాత్రం ప్రియ భవానీకి ఇరుముడి.

వీవీఐపీ హత్యలు.. ఆగేదెన్నడు? బడా బాబుల పిల్లలకు శిక్షలు పడవా?అభిప్రాయంSwechaa22 Aug 2026, 05:05 PM

వీవీఐపీ హత్యలు.. ఆగేదెన్నడు? బడా బాబుల పిల్లలకు శిక్షలు పడవా?

VVIP Killing: ఈ దేశంలో వీవీఐపీ కిల్లింగ్స్ కొనసాగుతున్నాయి. బడా బాబుల పిల్లల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. కోట్ల రూపాయల విలువైన లగ్జరీ కార్లతో సామాన్యులను గుద్ది చంపేస్తున్నారు. మర్డర్ చేసినా వారిలో ఎలాంటి భయం కనిపించడం లేదు. ఎందుకంటే వారిని కన్న బాబులు బిగ్ షాట్స్, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు, సంపన్నులు కావడమే. డబ్బున్న వాళ్ల పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కారుతో గుద్ది చంపుతున్న ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వారి ఖరీదైన కార్ల చక్రాల కింద ఎన్నో ప్రాణాలు నలిగిపోయాయి, ఇంకా నలుగుతూనే ఉన్నాయి. అయినా వీవీఐపీ కిల్లింగ్స్ కు ఎండ్ కార్డ్ పడటం లేదు.

నాపై అత్యాచారం చేశాడు.. ఏలూరు యువకుడిపై యువతి ఫిర్యాదుతెలంగాణSwechaa22 Aug 2026, 02:44 PM

నాపై అత్యాచారం చేశాడు.. ఏలూరు యువకుడిపై యువతి ఫిర్యాదు

ఏపీకి చెందిన యువకుడిపై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేయడంతో పాటు అశ్లీల వీడియాలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకివెళితే.. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన పాస్టర్ మల్లిపూడి సువర్ణ రాజు కుమారుడిపై ఓ యువతి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్యాచారంతో పాటు బ్లాక్ మెయిల్ కేసు కూడా పెట్టింది.కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి తండ్రి మల్లిపూడి సువర్ణ రాజును గచ్చిబౌలి పోలీసులు ఆయన స్వగ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

కల్తీదారులను వణికిస్తున్న ‘తుకారం ముండే’.. ఆయన ఎవరంటే?NationalSwechaa22 Aug 2026, 02:01 PM

కల్తీదారులను వణికిస్తున్న ‘తుకారం ముండే’.. ఆయన ఎవరంటే?

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ తుకారాం ముండే.. మరోసారి వార్తల్లో నిలిచారు. 2026 మేలో FDA కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం 3 నెలల్లోనే ఆయన తీసుకున్న వేగవంతమైన చర్యల వలన పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి చిన్న దుకాణాలు, వీధి వ్యాపారుల వరకు ప్రభావం చూపుతున్నాయి. FDA కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆహార భద్రత, పరిశుభ్రతపై ముండే దృష్టి పెట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు, పాఠశాల క్యాంటీన్లు, ఇతర ఆహార వ్యాపార సంస్థల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన చోట నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్సుల సస్పెన్షన్ వంటి చర్యలు చేపట్టారు.

లవ్ మ్యాటర్?.. విశాఖలో నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్ వార్ఏపీSwechaa22 Aug 2026, 01:25 PM

లవ్ మ్యాటర్?.. విశాఖలో నడిరోడ్డుపై విద్యార్థుల గ్యాంగ్ వార్

ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో నడిరోడ్డుపై కొందరు విద్యార్థులు వీరంగం సృష్టించారు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తిమ్మాపురం రోడ్డులోని శివశక్తి నగర్‌లో రెండు రోజుల క్రితం జరిగినట్టు తెలిసింది. రెండు వర్గాలుగా విడిపోయిన స్టూడెంట్స్ దారుణంగా దాడులు చేసుకున్నారు.అయితే, యువకుల మధ్య కొట్లాటకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. చంద్రంపాలెం పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం చిలికి చిలికి గ్యాంగ్ వార్‌గా మారినట్టు తెలుస్తోంది. ఘర్షణ జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఆపిన విద్యార్థులు అతనిపై కూడా దాడి చేశారు.

నా ఫోన్ దొంగిలించి వీడియోలు వైరల్ చేశారు : ఫోక్ యాక్టర్ మాధురి రాథోడ్వైరల్ న్యూస్Swechaa22 Aug 2026, 01:09 PM

నా ఫోన్ దొంగిలించి వీడియోలు వైరల్ చేశారు : ఫోక్ యాక్టర్ మాధురి రాథోడ్

ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 19న మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి ఇద్దరూ ఓకే రూంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఈశ్వర్ సాయి భార్య వీరిని పట్టుకోవడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే,ఆ సమయంలో ఈశ్వర్ సాయి భార్య తనను ఇష్టాను సారంగా దూషించడంతో పాటు తన ఫోన్‌ను దొంగిలిచిందని, అందులోని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిందని వేములవాడ పీఎస్‌లో మాధురి ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక అంశాలను చేర్చినట్టు తెలిసింది. ఈ నెల 19న రెడ్డి భవన్‌లో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించి దాడి చేసిందని మాధురి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన సమయంలో సుమారు రూ.50 వేల విలువైన తన ఐఫోన్‌ను కూడా తీసుకెళ్లారని ఆరోపించారు.