స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

జనసేన ఎంపీ కొడుకును అరెస్టు నుంచి తప్పించలేదు : డీసీపీ రితిరాజ్తెలంగాణSwechaa22 Aug 2026, 12:39 PM

జనసేన ఎంపీ కొడుకును అరెస్టు నుంచి తప్పించలేదు : డీసీపీ రితిరాజ్

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద రెండ్రోజుల కిందట జరిగిన కారు ప్రమాదంలో లైఫ్‌స్టైల్‌లో పనిచేసే ఓ యువతి దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మృతికి కారణమైన ఏపీ జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ ప్రస్తుతం బయటే తిరుగుతున్నట్టు సమాచారం. ఆయన్ను పోలీసులు ఇంకా అరెస్టు చేయలేదని తెలిసింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితుడిని నేటికి అరెస్టు చేయకుండా విచారణ పేరిట మాదాపూర్ పోలీసులు కాలయాపన చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, డబ్బులకు అమ్ముడుపోయారా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ.. మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో సంజూష్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదో డీసీపీ రితిరాజ్ వివరణ ఇచ్చారు.

21 సీట్ల ఫార్ములాకు పవన్ నో.. టీడీపీతో జనసేన దూరం పెరుగుతోందా?ఏపీSwechaa22 Aug 2026, 12:18 PM

21 సీట్ల ఫార్ములాకు పవన్ నో.. టీడీపీతో జనసేన దూరం పెరుగుతోందా?

2024లో జనసేన టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ డిప్యూటీ సీఎంగా కీలక పాత్రలో ఉన్నారు. కానీ ఇప్పుడు జనసేనను కేవలం కూటమిలోని చిన్న భాగస్వామిగా కాకుండా.. సొంతంగా బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం మొదలైందా? అనే వాద‌న తెర‌పైకి వ‌స్తోంది.

Punjab : రేప్ కేసులో రూ.5 కోట్ల డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యకు ఎన్‌హెచ్‌ఆర్సీ షాక్NationalSwechaa22 Aug 2026, 12:16 PM

Punjab : రేప్ కేసులో రూ.5 కోట్ల డిమాండ్.. పంజాబ్ సీఎం భార్యకు ఎన్‌హెచ్‌ఆర్సీ షాక్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్యపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఓ అత్యాచారం కేసును తొక్కి పెట్టేందుకు ఆమె రూ. 5 కోట్ల లంచం డిమాండ్ చేశారంటూ పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి భార్యపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ గర్జన.. మరో ఉద్యమానికి సిద్ధమా?NationalSwechaa22 Aug 2026, 11:56 AM

‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’ గర్జన.. మరో ఉద్యమానికి సిద్ధమా?

దేశంలో మరో రివల్యూషన్ రాబోతున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తయింది. వెనకబడిన వర్గాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, ఈ రిజర్వేషన్ల కారణంగా తాము నష్టపోతున్నామని కొందరు విద్యార్థులు, అగ్రవర్ణాల వారు ఆందోళన చెందుతున్నారు.అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, మధ్యతరగతి వారు ఉన్నారని, కులాల ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం వలన తాము పేదరికంలో ఉన్నా తమకు రిజర్వేషన్లు వర్తించడం లేదని, తీరా కష్టపడి చదివి జాతీయ స్థాయిల్లో ర్యాంకులు సాధిస్తే రిజర్వేషన్ల కారణంగా అనుకున్న కాలేజీ,వర్సిటీల్లో సీట్లు రావడం లేదని వాపోతున్నారు. అందుకే కులం ఆధారిత రిజర్వేషన్లు తొలగించి కేవలం ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రస్తుతం డిమాండ్లు వినిపిస్తున్నాయి..ఈ క్రమంలోనే ‘రిజర్వేషన్ హటావో ఆందోళన్’పేరిట నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శన జరిగింది. ఇది దేశం దృష్టిని ఆకర్షించింది.

ఎమ్మెల్యేలకు కార్లపై వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. కారణం ఇదేనా?NationalSwechaa22 Aug 2026, 11:34 AM

ఎమ్మెల్యేలకు కార్లపై వెనక్కి తగ్గిన సీఎం విజయ్.. కారణం ఇదేనా?

తమిళనాడు సీఎం విజయ్‌ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు అందరికీ కొత్త వాహనాలు ఇస్తామని ప్రకటించిన సీఎం అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఇదివరకు ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేసిన వారికి సైతం లగ్జరీ కార్లు ఇస్తామని సీఎం ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టీవీకే చీఫ్, సీఎం విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది.ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.అందులో టీవీకే పార్టీ నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన వారు చాలా మందే ఉన్నారు. వారితో పాటే డీఎంకే, ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నికలైన వారు కూడా ఉన్నారు.వీరికి నూతన వాహనంతో పాటు ఫ్యూయల్,మెయింటెన్స్ కోసం నెలకు రూ.1 లక్ష అలవెన్స్ ఇస్తామని ముందుగా సీఎం విజయ్ ప్రకటన చేశారు.

వాన కుర‌వ‌దు.. చెరువు నిండ‌దు! క‌రువు కోర‌ల్లో తెలంగాణతెలంగాణSwechaa22 Aug 2026, 11:22 AM

వాన కుర‌వ‌దు.. చెరువు నిండ‌దు! క‌రువు కోర‌ల్లో తెలంగాణ

తెలంగాణ పల్లెలకు ఇప్పుడు కావాల్సింది మరో హామీ కాదు.. వాన. వరుణుడు కరుణిస్తే రైతు పొలం మళ్లీ పచ్చబడుతుంది. లేకపోతే ఈ వర్షాభావం క్రమంగా కరువు రూపం దాల్చే ప్రమాదం ఉంది. అందుకే రాబోయే 10–15 రోజులు గ్రామీణ తెలంగాణకు కీలకమైన సమయం.

అవును.. నిజంగానే చిరంజీవి తొక్కేశాడు  : హైపర్ ఆదిసినిమాSwechaa22 Aug 2026, 09:54 AM

అవును.. నిజంగానే చిరంజీవి తొక్కేశాడు : హైపర్ ఆది

చిరంజీవి నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా ఆయనపై విమర్శలు చేసిన వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఫ్యామిలీని నుంచి సుమారు ఆరుగురు కంటే ఎక్కువ మందే హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ విమర్శలన్నింటీకి హైపర్ ఆది చెక్ పెట్టాడు. ‘అవును.. చిరంజీవి తొక్కేశాడు!.తెలుగు సినిమా ఇండస్ట్రీలో NO.1గా ఎవరు కంటిన్యూ కాలేరు అనే అహంకారాన్ని తొక్కేసి 30 ఏళ్లు NO.1గా ఉన్నాడు. పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్‌లోనే ఉంటాయి, అది టాలీవుడ్‌లో సాధ్యం కాదు అనే ఊహలను తొక్కేశాడు. డ్యాన్స్ అంటే నడవడం, హీరోయిన్ చుట్టూ తిరగడం అనే భ్రమను తొక్కేశాడు. హీరోలు అంటే డబ్బులు సంపాదించుకుంటారు అనుకునే వాళ్ల రాంగ్ మైండ్‌సెట్‌ను తొక్కేశాడు. తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవడు అనే ఆలోచనలను తొక్కేసి, కొడుకును తండ్రిని మించిన హీరోగా తయారు చేశాడు’ అని హైపర్ ఆది చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

స్ట్రీట్ ఫైట్‌లో రాహుల్.. యూత్ కోసం కాంగ్రెస్ కొత్త గేమ్ ప్లాన్NationalSwechaa22 Aug 2026, 09:53 AM

స్ట్రీట్ ఫైట్‌లో రాహుల్.. యూత్ కోసం కాంగ్రెస్ కొత్త గేమ్ ప్లాన్

రాహుల్ గాంధీ ఎందుకు పదేపదే స్ట్రీట్ పాలిటిక్స్ వైపు వెళ్తున్నారు? లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక మార్గం. కానీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవడం, విద్యార్థుల వెంట నిలబడటం, నిరసనల్లో నేరుగా పాల్గొనడం మరో రకమైన రాజకీయ యుద్ధం.

Kaaka Teaser: స్టైలిష్ లుక్ లో అదిరిపోయిన మెగాస్టార్..సంక్రాంతికి రెడీగా ఉండండి..సినిమాSwechaa22 Aug 2026, 09:51 AM

Kaaka Teaser: స్టైలిష్ లుక్ లో అదిరిపోయిన మెగాస్టార్..సంక్రాంతికి రెడీగా ఉండండి..

Kaaka Teaser: Kaaka Teaser: మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రానికి 'కాకా' అనే టైటిల్ పెట్టారు. ఈ రోజు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా, ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తూ చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి పండుగ సదర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు.

పాజిటివ్ టాక్, సాలీడ్ ఓపెనింగ్స్..రవితేజ ఖాతాలో హిట్సినిమాSwechaa22 Aug 2026, 09:31 AM

పాజిటివ్ టాక్, సాలీడ్ ఓపెనింగ్స్..రవితేజ ఖాతాలో హిట్

Irumudi: Irumudi: మాజ్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా బేనీ నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఇక, ఈ సినిమా బాక్సాఫీస్ భారీ ఓపెనింగ్ రాబట్టడమే కాదు, చాలా కాలంగా హిట్ లేక ఎదురుచూస్తున్న రవితేజ ఖాతాలో సాలీడ్ హిట్ పడింది.

లండన్‌కు పొయినంత ఈజీ కాదు?తెలంగాణSwechaa22 Aug 2026, 09:16 AM

లండన్‌కు పొయినంత ఈజీ కాదు?

ఓవైపు కాంగ్రెస్‌ లోకల్ ఫైటింగ్ కార్యకర్తలకు కంగారు పుట్టిస్తుంటే, ఇంకోవైపు రవ్వంత రేవంత్‌పై ప్రేమ ఉండే నాయకులకు అమెరికా టూర్ రద్దు నిరాశ కల్పించింది. ఎందుకు ముందస్తుగా సీఎం స్థాయి లేని మీటింగ్స్‌తో అనుమతి పొందారనే విమర్శలు తావిస్తున్నాయి. ఇక్కడ రేవంతా, మరో వ్యక్తియా అని కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లే మీటింగ్‌కు కనీసం అక్కడ కూడా ఒక రాష్ట్రానికి చెందిన నేతల బిజినెస్ జరగాలి. అలాంటి విదేశీ బిజినెస్ మీటింగ్ ఏమీ లేకపోవడంతో గుంపు మేస్త్రీ టీం పనితనం లోకల్‌లోనే తప్ప విదేశాల్లో లేదని తెలిసిపోయింది. కనీసం మంత్రులు కూడా పోవాల్సిన అవసరం లేని మీటింగ్స్‌కు సీఎం ఎందుకు ప్రాముఖ్యత చూపించారనేది కీలకంగా మారింది. అంతేకాదు, అక్కడి నుంచి దుబాయ్ షెడ్యూల్ ఎందుకు వచ్చిందనేది కూడా రేవంత్ ఆర్ధిక వ్యవహారాలను చూసే టీంకు ప్రశ్నలు మొదలయ్యాయి.

రైజింగ్ స్టేట్‌లో  డ్రైనేజ్ ఫైటింగ్?తెలంగాణSwechaa22 Aug 2026, 08:59 AM

రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజ్ ఫైటింగ్?

పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అంతా రైజింగ్‌యే. కానీ, బంగారు తెలంగాణ పేరుతో కొన్ని కుటుంబాలు మాత్రమే బంగారంగా మారాయని, అప్పట్లో కేసీఆర్‌ని కచరా అన్నట్లు ప్రచారం చేశారు. ఇప్పుడు రేవంత్ పాలనలో రైజింగ్ పేరుతో ఆనాటి రైజింగ్‌ను డ్రైనేజీగా మార్చేశారు. స్వేచ్ఛ న్యూస్ వద్ద మీ ప్రతి డ్రైనేజ్ పనికి సమాధానం ఉంది. పార్టీలో, ప్రధాన అనుచరులు అంటూ చెత్తను అంతా తీసుకొచ్చి ప్రభుత్వంపై రుద్ది గందరగోళం సృష్టించారు. 32 నెలల్లోనే పట్టు తప్పిన పాలనతో ఏగలేమని చేతులు ఎత్తేసింది నిజం కాదా? గురువారం జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ డ్రైనేజీ మాటలతో జరుగుతున్న నష్టం ఏంటో స్వేచ్ఛ న్యూస్ పరిచయం మాత్రమే చేసింది.

‘బంగారం’ ఇచ్చేందుకు సిద్ధమైన సీఎం విజయ్NationalSwechaa22 Aug 2026, 08:30 AM

‘బంగారం’ ఇచ్చేందుకు సిద్ధమైన సీఎం విజయ్

తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సీఎం విజయ్.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు ‘బంగారు’ ఉంగరం అందించే కార్యక్రమాన్ని రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన అర్హులైన శిశువులందరికీ "తాయిమామన్ తంగ మోతిర తిట్టం" పేరిట ఒక్క గ్రాము బంగారు ఉంగరం అందించాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్.అన్నాదురై జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అయితే, బంగారం ధర మినహా తయారీ, రవాణా, ఇన్సూరెన్స్ అన్నింటికీ కేవలం ఒక్క పైసా మాత్రమే కోట్ చేసి జోస్ అలుక్కాస్ జువెలరీ సంస్థ టెండర్ దక్కించుకున్నట్టు సమాచారం.

సీఎం రేవంత్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్తెలంగాణSwechaa21 Aug 2026, 11:23 PM

సీఎం రేవంత్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

BRS: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ తన సోదరుడు కొండల్ కు చెందిన కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ సహా ఐదుగురిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును లోకాయుక్త స్వీకరించింది. 835/2026 నెంబర్ కేటాయించింది. త్వరలో ఈ కేసు లిస్టింగ్ అయి విచారణ జరగనుందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

ఎల్‌నినో సవాళ్లను విపత్తుగా కాకుండా అవకాశంగా మార్చుకోవాలితెలంగాణSwechaa21 Aug 2026, 10:49 PM

ఎల్‌నినో సవాళ్లను విపత్తుగా కాకుండా అవకాశంగా మార్చుకోవాలి

ఎల్‌నినో ప్రభావంతో రానున్న సవాళ్లను ముందుగానే గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని పలువురు మంత్రులు అధికారులకు సూచించారు. ఎల్‌నినో సాధారణ పరిస్థితి కాదని ముఖ్యంగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పంటలు చేతికొచ్చే సమయంలో నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Jupally Krishna Rao: టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లితెలంగాణSwechaa21 Aug 2026, 08:59 PM

Jupally Krishna Rao: టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి

Jupally Krishna Rao: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రెవెన్యూ దరఖాస్తులపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్న ఫైల్స్ పెండింగ్ లో ఉండడంపై మంత్రి సీరియస్ అయ్యారు.

ఎకరం రూ.264 కోట్లు.. రికార్డులు బద్దలు కొట్టిన రాయదుర్గం భూములుతెలంగాణSwechaa21 Aug 2026, 08:41 PM

ఎకరం రూ.264 కోట్లు.. రికార్డులు బద్దలు కొట్టిన రాయదుర్గం భూములు

రాయదుర్గంలోని పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించారు. పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర పలికింది. ఇది రిజర్వ్ ధర కంటే దాదాపు 51 శాతం అధికమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఈ వేలం ఫలితం స్పష్టం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. రాయదుర్గంలో భూముల విలువ వేగంగా పెరుగుతున్న దానికి ఈ వేలం మరో ఉదాహరణగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, మా ప్రభుత్వం దిగిపోతుంది-మంత్రి వివేక్ షాకింగ్ కామెంట్స్తెలంగాణSwechaa21 Aug 2026, 07:41 PM

వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, మా ప్రభుత్వం దిగిపోతుంది-మంత్రి వివేక్ షాకింగ్ కామెంట్స్

పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడే క్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా, మా ప్రభుత్వం దిగిపోతుంది.. అందుకే నేను మీకు గ్యారెంటీ ఇవ్వలేను అని పాలిటెక్నిక్ విద్యార్థులతో మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. అటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి.

చిత్రం లేదు
సినిమాSwechaa21 Aug 2026, 06:58 PM

Indian film industry: భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్న నటి!..

షావుకారు జానకి సాధించిన రికార్డ్ చిత్రపరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ నటి నాలుగు తరాల ముఖ్యమంత్రులతో నటించి చరిత్ర సృష్టించారు. దీంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మరే ఇతర నటికీ సాధ్యంకాని అత్యంత అరుదైన, మహోన్నత గౌరవం పద్మశ్రీ షావుకారు జానకిగారి సొంతం అయ్యింది.

అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదుతెలంగాణSwechaa21 Aug 2026, 06:46 PM

అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తన యూఎస్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. అటు ఈ అంశంలో రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. వివాదం ముదురుతున్న తరుణంలో కేంద్రం స్పందించింది.

Karimnagar:  కలెక్టరేట్ ముట్టడించిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. జీవో 97 రద్దుకు పెరుగుతున్న డిమాండ్!..తెలంగాణSwechaa21 Aug 2026, 05:57 PM

Karimnagar: కలెక్టరేట్ ముట్టడించిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. జీవో 97 రద్దుకు పెరుగుతున్న డిమాండ్!..

తెలంగాణలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల తీసుకువచ్చిన జీవో 97 ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. ఒకవైపు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని చెబుతుంటే, మరోవైపు విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యల ను పరిష్కరించాలని నిరసనకు దిగారు.. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ ను ముట్టడించారు.

పిల్లల విషయంలో నేతల ఎస్కేప్ పాలిటిక్స్‌.. బాధ్యత ఎవరిది?..తెలంగాణSwechaa21 Aug 2026, 05:05 PM

పిల్లల విషయంలో నేతల ఎస్కేప్ పాలిటిక్స్‌.. బాధ్యత ఎవరిది?..

పార్టీ ఏదైనా పదవులు ఏవి ఉన్నా.. రాజకీయం అంటే రాచకీయం అనేలా మారిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజల మనిషిగా జీవిస్తూ.. అంటే నటిస్తూ.. ప్రజలే దేవుళ్ళు అని రోడ్లు పట్టుకుని ప్రచారాలు చేసే నాయకులు.. ఎన్నికలు ముగియగానే పరాయివాళ్ళలా ప్రవర్తించడం తెలిసిందే. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణ.. గతంలో బండి భగీరత్ విషయంలో బండి సంజయ్ మాట్లాడిన మాటలపై ప్రజల్లో చర్చ మొదలైంది. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు తప్పు చేస్తే ఆ నాయకులకు సంబంధం లేదా? పిల్లలు వేరు, మేము వేరు అంటూ చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు తలెత్తాయి..

ఆ భయంతోనే.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు!తెలంగాణSwechaa21 Aug 2026, 04:53 PM

ఆ భయంతోనే.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు!

రేవంత్ అమెరికా పర్యటన రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సీఎం రేవంత్ యూఎస్ టూర్ రద్దుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు, భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే రేవంత్ తన టూర్ ను రద్దు చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్స్ నిర్వహిస్తున్నారని, ఆ భయంతోనే పర్యటన రద్దు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.

అమెరికా పర్యటనకు కేంద్రం 'నో'.. రేవంత్ రెడ్డి ట్రిప్ రద్దుపై రాజకీయ దుమారం!తెలంగాణSwechaa21 Aug 2026, 03:15 PM

అమెరికా పర్యటనకు కేంద్రం 'నో'.. రేవంత్ రెడ్డి ట్రిప్ రద్దుపై రాజకీయ దుమారం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించిన అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఊహించని షాక్ ఇచ్చింది. 'తెలంగాణ రైజింగ్' అనే లక్ష్యంతో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు, విద్యా సంబంధిత ఒప్పందాల కోసం అమెరికాలో పర్యటించాల్సిన సిఎంకు, కేంద్రం రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించింది. ఇప్పటికే యూకే పర్యటనలో ఉన్న సిఎం, అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంతో తన షెడ్యూల్ మార్చుకుని స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత!సినిమాSwechaa21 Aug 2026, 02:58 PM

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత!

టాలీవుడ్‌ సీనియర్‌ నటి, సుప్రసిద్ధ తార షావుకారు జానకి (Sowcar Janaki) తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, వారం రోజుల క్రితం శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడంతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ధృవీకరించారు.

ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లు సహా ఎనిమిది మంది దుర్మరణం!InternationalSwechaa21 Aug 2026, 02:49 PM

ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్లు సహా ఎనిమిది మంది దుర్మరణం!

అమెరికాలోని పశ్చిమ అలస్కాలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్యంత మారుమూల ప్రాంతంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) బోర్డు ఛైర్మన్ క్లింట్ జాన్సన్ మీడియాకు వెల్లడిస్తూ అధికారికంగా ధ్రువీకరించారు. యాంకరేజ్ ప్రాంతం నుంచి కేప్ న్యూన్‌హామ్ వైపు రెండు ఇంజిన్లతో కూడిన సెస్నా చార్టర్ విమానం తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

‘కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే : సీఎల్పీ నేతలుతెలంగాణSwechaa21 Aug 2026, 02:46 PM

‘కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే : సీఎల్పీ నేతలు

అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గమంటున్నారు. నిన్న తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, అవి తన వ్యక్తిగతమని మంత్రి కొండా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చింది.అయితే, మంత్రి కొండా చెప్పిన సమాధానంతో పార్టీ సంతృప్తి చెందలేదని సమాచారం.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు గాంధీభవన్ వేదికగా సమావేశం అయ్యారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కొండా సుస్మిత చేస్తున్న విమర్శలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) వేదికగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర ప్రెస్‌మీట్ నిర్వహించి కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని,పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

డబ్బు కంటే బాధ్యతే ముఖ్యం.. నైతిక విలువల కోసం భారీ ఆఫర్లను వ‌దులుకున్న‌ స్టార్లు!..సినిమాSwechaa21 Aug 2026, 02:26 PM

డబ్బు కంటే బాధ్యతే ముఖ్యం.. నైతిక విలువల కోసం భారీ ఆఫర్లను వ‌దులుకున్న‌ స్టార్లు!..

నేటి సమాజంలో నైతిక విలువలు అనేవి భూతద్దం పెట్టి వెతుక్కోవలసిన పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో కోట్లాది రూపాయ‌ల‌ రెమ్యునరేషన్- విపరీతమైన క్రేజ్ ఉన్న వారు సైతం విలువలను కాపాడుకుంటలేరనే ఆరోపణలున్నాయి. డబ్బు ఎవరికి ఊరికే రాదు.. కానీ డబ్బు సంపాదించే మార్గాలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని అంటారు..

అలాంటి వారు మన భారతీయ చిత్రపరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తారనే టాక్ ఉంది. ముఖ్యంగా సమాజం విష‌యంలో బాధ్యతను, నైతిక విలువలను ప్ర‌ధానంగా భావించే కొందరు స్టార్లు కేవలం డబ్బు లేదా పబ్లిసిటీ కోసం కాకుండా తమ నిర్ణయం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోన‌ని ఆలోచించి కొన్ని అవకాశాలను, ప్రకటనలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి.

‘బర్ల కొట్టంలో బడి..’ తనిఖీకి వెళ్లిన ‘బొద్దింక పార్టీ’ నేతలకు చుక్కెదురు!NationalSwechaa21 Aug 2026, 01:53 PM

‘బర్ల కొట్టంలో బడి..’ తనిఖీకి వెళ్లిన ‘బొద్దింక పార్టీ’ నేతలకు చుక్కెదురు!

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని బయటపెట్టే లక్ష్యంతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) నేతలు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ గ్రామానికి వెళ్తూ అక్కడి పాఠశాలల పరిస్థితిని పరిశీలించేందుకు ‘స్కూల్ ఠీక్ కరో’ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా, బగ్రూ నియోజకవర్గం పరిధిలోని రాంపూరా కన్వార్‌పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ నేతలకు చుక్కెదురైంది.

మొదటి టెస్టు విజయం తర్వాత.. టీమిండియాకు కొలంబోలో ప్రత్యేక విందు!క్రీడలుSwechaa21 Aug 2026, 01:42 PM

మొదటి టెస్టు విజయం తర్వాత.. టీమిండియాకు కొలంబోలో ప్రత్యేక విందు!

శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత క్రికెట్ జట్టుకు కొలంబోలో ఘనమైన ఆతిథ్యం లభించింది. ఇరు జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు, శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా భారత, శ్రీలంక ఆటగాళ్లందరికీ ప్రత్యేకంగా విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. కొలంబోలోని ప్రఖ్యాత 'ఇండియా హౌస్' వేదికగా గురువారం రాత్రి ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ విందు సమావేశానికి సంబంధించిన విశేషాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంది.