స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మొదటి టెస్టు విజయం తర్వాత.. టీమిండియాకు కొలంబోలో ప్రత్యేక విందు!క్రీడలుSwechaa21 Aug 2026, 01:42 PM

మొదటి టెస్టు విజయం తర్వాత.. టీమిండియాకు కొలంబోలో ప్రత్యేక విందు!

శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న భారత క్రికెట్ జట్టుకు కొలంబోలో ఘనమైన ఆతిథ్యం లభించింది. ఇరు జట్ల మధ్య త్వరలో ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు, శ్రీలంకలోని భారత హైకమిషనర్ సంతోష్ ఝా భారత, శ్రీలంక ఆటగాళ్లందరికీ ప్రత్యేకంగా విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. కొలంబోలోని ప్రఖ్యాత 'ఇండియా హౌస్' వేదికగా గురువారం రాత్రి ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ విందు సమావేశానికి సంబంధించిన విశేషాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకుంది.

షార్ట్స్ వేసుకున్నారని.. ఓ టూరిస్టు ఫ్యామిలీపై దాడి (వీడియో)వైరల్ న్యూస్Swechaa21 Aug 2026, 01:40 PM

షార్ట్స్ వేసుకున్నారని.. ఓ టూరిస్టు ఫ్యామిలీపై దాడి (వీడియో)

కొందరు మనుషుల వింత ప్రవర్తన కారణంగా ఓ వర్గం ప్రజలపై ద్వేషం పెరుగుతోందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛతో పాటు నచ్చినట్టు జీవించే హక్కును పుట్టుకతోనే కలిగి ఉంటారు.అలాంటిది కొందరు మతాల పేరిట, కల్చర్ పేరిట అడ్డంకులు సృష్టించడం, వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. వివరాల్లోకివెళితే.. పుణే సమీపంలోని సింహగడ్ కోటకు ఓ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి(39) తన ఫ్యామిలీతో కలిసి సందర్శించడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న టైంలో ‘సమస్త్ హిందూ బంధవ్ ఆర్మీ’ అనే సంస్థకు చెందిన వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. టూరిస్టుల్లో ఓ మహిళ వేసుకున్న షార్ట్స్.. 8 ఏళ్ల చిన్నారి ధరించిన పొట్టి డ్రెస్‌పై వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఇది మన హిందూ సంస్కృతికి విరుద్ధం.. ఇలాంటి దుస్తులతో ఎలా వచ్చారంటూ వారిపై దాడికి పాల్పడినట్టు తెలిసింది.

షాకిస్తున్న తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల చిట్టా!..తెలంగాణSwechaa21 Aug 2026, 01:25 PM

షాకిస్తున్న తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆస్తుల చిట్టా!..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న దేశాని శ్రీనివాస్ రెడ్డి నివాసాల మీద ఏకకాలంలో 15 చోట్ల నిర్వహించిన దాడులలో ఏకంగా వంద కోట్ల విలువైన ఆస్తులు బహిర్గతం అయ్యాయి. అధికారిక రికార్డుల ప్రకారం ఈ దాడుల్లో పట్టుబడిన ఆస్తుల విలువ రూ.6.87 కోట్లుగా కనిపిస్తున్నా బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్ల పైన ఉంటుందని చెబుతున్నారు.

కార్ యాక్సిడెంట్.. ఎంపీ లింగమనేని కొడుకు కేసులో కీలక పరిణామంక్రైమ్Swechaa21 Aug 2026, 01:22 PM

కార్ యాక్సిడెంట్.. ఎంపీ లింగమనేని కొడుకు కేసులో కీలక పరిణామం

హైదరాబాద్‌లోని మాదాపూర్ సమీపంలో గల ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు ఏపీకి చెందిన జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కొడుకు సంజూశ్‌గా పోలీసులు గుర్తించారు. ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే యువతి ప్రమాదవశాత్తు మృతి చెందిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో నిర్లక్ష్యంగా కారు నడిపి యువతి మరణానికి కారణమైన ఎంపీ లింగమేని కొడుకు సంజూశ్ మీద మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే, నిందితుడిని ముందుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు .. అతనికి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినట్టు సమాచారం. ఎందుకంటే మద్యం మత్తులో కారు నడిపాడా? అని తెలుసుకునేందుకు ఇలా చేసినట్టు తెలిసింది.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఈ టెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

భారత్‌లో ఇంకా 4G లేని గ్రామాలు..  పరిష్కారంపై ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్!NationalSwechaa21 Aug 2026, 01:04 PM

భారత్‌లో ఇంకా 4G లేని గ్రామాలు.. పరిష్కారంపై ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్!

దేశంలో ఇంటర్నెట్ సదుపాయం సరిగాలేని మారుమూల ప్రాంతాలకు తమ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ 'స్టార్‌లింక్' ఎంతగానో ఉపయోగపడుతుందని స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అంతరాన్ని పూడ్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో దేశంలోని ఇంటర్నెట్ నెట్‌వర్క్ పరిస్థితులపై వచ్చిన ఓ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘జీవో 97 రద్దు చేయాల్సిందే..’ ఆగని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు!తెలంగాణSwechaa21 Aug 2026, 12:51 PM

‘జీవో 97 రద్దు చేయాల్సిందే..’ ఆగని పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు!

జీవో నంబర్ 97 కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడుతోందని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయదుర్గం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ ఎదుట సుమారు 200 మంది డిప్లొమా విద్యార్థులు ధర్నాకు దిగారు. SBTET పరిధిలో కొనసాగుతున్న తమ డిప్లొమా కోర్సులను 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' పరిధిలో విలీనం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

హన్మకొండలో దారుణం..  రెండ్రోజులుగా కారు డిక్కీలోనే  డెడ్ బాడీ!తెలంగాణSwechaa21 Aug 2026, 12:51 PM

హన్మకొండలో దారుణం.. రెండ్రోజులుగా కారు డిక్కీలోనే డెడ్ బాడీ!

రాష్ట్రంలో మరో దారుణ ఘటన కలకలం రేపింది.కారు డిక్కీలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది.రెండ్రోజులుగా కారు అక్కడే ఉండటాన్ని గుర్తించిన స్థానికులు.. డిక్కీలో నుంచి దుర్వాసన రావడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు డిక్కీ తెరిచి చూడగా...అందులో కుళ్లినస్థితికి చేరుకున్న ఓ యువతి డెడ్ బాడీ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారు (TS 03 FF 8094) డిక్కీలో గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యమైంది. ఎక్కడో చనిపోయిన యువతి బాడీని గుర్తు తెలియని దుండగులు కారులో తీసుకొచ్చి వదిలేసిపోయినట్టు తెలిసింది. ఘటనా స్థలంలో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కారులో దొరికిన మృతదేహం గోదావరిఖని సెంటినరీ కాలనీకి చెందిన ‘మానస’గా గుర్తించారు.

ఏకాంతానికి అడ్డుతగిలిన విద్యుత్ తీగలు.. అడవిలో యువజంట కేకలుఏపీSwechaa21 Aug 2026, 12:31 PM

ఏకాంతానికి అడ్డుతగిలిన విద్యుత్ తీగలు.. అడవిలో యువజంట కేకలు

ఏకాంతంగా గడుపుదామని అడవికి వెళ్లిన ఓ జంటకు విద్యుత్ తీగలు యమపాశంలా మారాయి. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో విద్యుత్ తీగలు మీద పడటంతో యువతి, యువకుడు తీవ్ర గాయాలపాలయ్యారు. అడవిలోనే కిందపడిపోయి లేవలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు వారి కేకలు విని అటుగా వచ్చిన గొర్రెల కాపరులు వారిని గుర్తించి ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటన ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండలం బత్తలపల్లి తండా అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

వామ్మో పెద్దపులి.. డప్పు చాటింపులు, మైకుల్లో హెచ్చరికలు!తెలంగాణSwechaa21 Aug 2026, 12:02 PM

వామ్మో పెద్దపులి.. డప్పు చాటింపులు, మైకుల్లో హెచ్చరికలు!

రాష్ట్రంలో మరోసారి అలజడి నెలకొంది. ఉత్తర తెలంగాణలో మరోసారి పెద్దపులి సంచారం అక్కడి ప్రజలు, రైతులను నిద్రలేకుండా చేస్తున్నది.రాత్రిళ్లు బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. పశువులు, చిన్న పిల్లలను కాపాడుకునేందుకు రాత్రిబవళ్లు కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నట్టు సమాచారం.ఫారెస్టు అధికారులు సైతం అడుగు జాడలను గుర్తించడంతో పులి సంచారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. దీంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించినట్టు సమాచారం. కౌటాల, సిర్పూర్, చింతలమానేపల్లి మండలాల్లో పెద్దపులి సంచరించినట్టు స్థానిక రైతులు గుర్తించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించినట్టు తెలిసింది. ఆడేపల్లి, శీర్ష గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో పులి పాదముద్రలు కలకలం రేపడంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. నిజంగానే అవి పెద్దపులి పాదముద్రలుగా నిర్దారించారు

హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై ఇరాన్ దాడి.. వీడియో రిలీజ్!InternationalSwechaa21 Aug 2026, 11:40 AM

హర్మూజ్ జలసంధిలో భారత నౌకపై ఇరాన్ దాడి.. వీడియో రిలీజ్!

హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే సరుకు రవాణా నౌకలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఓ భయానక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. 2026 ఏప్రిల్ 22న 21 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న పనామా జెండాతో కూడిన 'యూఫోరియా' అనే కంటైనర్ నౌకపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) దళాలు దాడి చేసిన దృశ్యాలను ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) విడుదల చేసింది.

టెట్ ఫెయిల్.. నవవధువు షాకింగ్ నిర్ణయంఏపీSwechaa21 Aug 2026, 11:17 AM

టెట్ ఫెయిల్.. నవవధువు షాకింగ్ నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కొందరు యువతీయువకులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలుస్తోంది. జాబ్స్ కోసం అహర్నిషలు కష్టపడుతున్న నేటితరం యువత.. ఫలితం కాస్త వ్యతిరేకంగా వచ్చేసరికి తీసుకోలేకపోతున్నారు. ఇక ఈ జీవితం చాలు అనుకుని జీవిత ప్రయాణాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు.ఫలితంగా కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది. ఏపీలోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామానికి చెందిన తనూజ(22)..రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)రాసింది. పరీక్షలో ఆమె ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

సీఎం రేవంత్‌రెడ్డి యూఎస్ పర్యటనకు బ్రేక్.. లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగుపయనం!తెలంగాణSwechaa21 Aug 2026, 11:04 AM

సీఎం రేవంత్‌రెడ్డి యూఎస్ పర్యటనకు బ్రేక్.. లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగుపయనం!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' అధికారిక ప్రతినిధి బృందం అమెరికా పర్యటనను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అడ్డుకుంది. రాజకీయ కోణంలో పరిశీలించి ఈ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు (Political Clearance Denied) కేంద్రం స్పష్టం చేయడంతో సీఎం తన యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. యూకే, అమెరికా పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం అనుమతి కోరగా, కేంద్రం కేవలం బ్రిటన్ పర్యటనకు మాత్రమే ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని అధికారిక బృందం లండన్ చేరుకున్న తర్వాత కేంద్రం తెలిపింది.

నా టార్గెట్ రేవంత్ మాత్రమే.. కాంగ్రెస్ కాదు : కొండా సుస్మితతెలంగాణSwechaa21 Aug 2026, 11:03 AM

నా టార్గెట్ రేవంత్ మాత్రమే.. కాంగ్రెస్ కాదు : కొండా సుస్మిత

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి.మినిస్టర్ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల హీట్ అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. కూతురి వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కొండాకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడంతో ఆమె నిన్న గాంధీభవన్‌కు వచ్చి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు..నన్ను ఎలా బాధ్యులు చేస్తారని’ కొండా సురేఖ కమిటీ ఎదుట వివరణ ఇచ్చినట్టు తెలిసింది. తాజాగా మరోసారి కొండా సుస్మిత సోషల్ మీడియాలో మరో వీడియోను పోస్టు చేస్తూ సీఎం రేవంత్, కాంగ్రెస్ పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే.. కాంగ్రెస్ పార్టీ కాదు. రేవంత్ రెడ్డి, అతని సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడానికి రేవంత్‌కు ఏ అధికారం ఉంది? నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.

టాప్ గేర్‌లో జగన్.. కూటమికి కొత్త టెన్షన్! డీఎస్సీపై ఆధారాలతో దూకుడుఏపీSwechaa21 Aug 2026, 11:01 AM

టాప్ గేర్‌లో జగన్.. కూటమికి కొత్త టెన్షన్! డీఎస్సీపై ఆధారాలతో దూకుడు

ప్ర‌తిపక్షంలో జగన్‌ యాక్టివ్‌గా లేరు అనే విమర్శలు ఇంత‌కాలం వినిపించాయి. కానీ ఇప్పుడు డీఎస్సీ అంశాన్ని ఎత్తుకొని, ఉద్యోగార్థుల సమస్యను రాజకీయ అస్త్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత‌. కూటమి ప్రభుత్వానికి ఇది ప్రతిపక్ష ఆరోపణగా తీసిపారేయగల అంశం కాదు. ఎందుకంటే ఇది యువత ఉద్యోగాల విషయం. మెరిట్ విషయం.

నెదర్లాండ్స్‌లో పానీపూరి ఆస్వాదించిన జాంటీ రోడ్స్.. దేశీ స్టైల్ రిప్లై వైరల్!క్రీడలుSwechaa21 Aug 2026, 10:44 AM

నెదర్లాండ్స్‌లో పానీపూరి ఆస్వాదించిన జాంటీ రోడ్స్.. దేశీ స్టైల్ రిప్లై వైరల్!

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ప్రపంచ ప్రఖ్యాత ఫీల్డర్ జాంటీ రోడ్స్‌కు భారతదేశం అన్నా, ఇక్కడి సంస్కృతి, ఆహారపు అలవాట్లన్నా అమితమైన ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. తాజాగా నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌ నగరంలో ఉన్న 'కోయిలా' అనే భారతీయ రెస్టారెంట్‌లో ఆయన పానీపూరిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ కనిపించారు. ఆ సమయంలో అక్కడ చోటుచేసుకున్న ఓ సరదా సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

బెజవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త!..తెలంగాణSwechaa21 Aug 2026, 10:15 AM

బెజవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త!..

బెజవాడ దుర్గమ్మ గుడికి పదేళ్ల తర్వాత మహర్దశ పట్టింది. ఇంతకాలం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేయాలంటే కొండ దిగువన మాత్రమే అవకాశం ఉంది. పదేళ్ల కిందట అంటే 2016లో కొండపై ఉన్న అన్నదానం భవనాలను కూలగొట్టారు. అప్పటి నుంచి కొండ దిగువన మహామండపంలో అన్నదానం పెడుతున్నారు. అదే విధంగా ప్రసాదం కూడా వేరే చోట తయారు చేసుకొచ్చి కొండమీద విక్రయిస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ అన్నదానం, ప్రసాదం తయారీకి ఆలయ ఆధ్వర్యంలో సొంత భవనాలను నిర్మించారు.

మాకు ఓటు హక్కు వస్తే రేవంత్‌ను  మళ్లీ రానివ్వం : పాలిటెక్నిక్ విద్యార్థులుతెలంగాణSwechaa21 Aug 2026, 10:09 AM

మాకు ఓటు హక్కు వస్తే రేవంత్‌ను మళ్లీ రానివ్వం : పాలిటెక్నిక్ విద్యార్థులు

సీఎం రేవంత్ సర్కారు మీద పాలిటెక్నిక్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘శక్తి’ స్కీం తీసుకొచ్చిన సర్కారు.. అందులోనే స్కిల్డ్ కోర్సులు అన్నింటినీ అనుసంధానం చేయాలని విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సీఎం ఆలోచన చేసిన విషయం తెలిసిందే. దీంతో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ కోర్సు పూర్తి అయ్యాక బీటెక్ చేయడం కంటే టెక్నికల్, బ్లూకాలర్ స్కిల్డ్ కోర్సులు నేర్పించి ఉద్యోగావకాశాలు చూపించాలని పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, శక్తి స్కీం ద్వారా మూడేళ్ల సాంకేతిక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సును సాధారణ నైపుణ్య శిక్షణ లేదా ఐటీఐ స్థాయికి కుదించి, దాని ప్రత్యేక గుర్తింపును మరుగున పరిచే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.పాలిటెక్నిక్ తర్వాత నేరుగా ఇంజినీరింగ్ (B.Tech) రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పించే 'ఈసెట్' (ECET) లాటరల్ ఎంట్రీ విధానం దెబ్బతింటుందని, దీనివల్ల నేరుగా బీటెక్ చదివే అవకాశాన్ని కోల్పోతామని విద్యార్థులు భయపడుతున్నట్టు తెలుస్తోంది.

Smartphone Price Hike: చుక్కలు చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ల ధరలు.. పండగ ఆఫర్లపై ఆశలు!వ్యాపారంSwechaa21 Aug 2026, 10:05 AM

Smartphone Price Hike: చుక్కలు చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ల ధరలు.. పండగ ఆఫర్లపై ఆశలు!

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు మొబైల్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి. రియల్‌మీ, ఒప్పో, వివో, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి దిగ్గజ బ్రాండ్లు తమ ఎంపిక చేసిన మోడళ్లపై భారీగా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీలో అత్యంత కీలకమైన చిప్‌సెట్లు, ర్యామ్ (RAM), స్టోరేజీ మెమోరీ విడిభాగాల వ్యయం అంతర్జాతీయంగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణంగా కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.

స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు!తెలంగాణSwechaa21 Aug 2026, 09:53 AM

స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు!

తెలంగాణ ప్రజల నెత్తిన మరో పిడుగు పడనుంది. రాష్ట్ర విద్యుత్ శాఖలో స్మార్ట్ కరెంట్ మీటర్లు అమర్చాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఈ అంశం తెరమీదకు రాగా.. అమలులో ఆలస్యం జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. సీఎంవో నుంచి విద్యుత్ శాఖకు ఆదేశాలు వెళ్లాలని కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు అమర్చాలని సర్కార్ సంకల్పించినట్టు తెలుస్తోంది. అయితే, పాత మీటర్ల కంటే స్మార్ట్ మీటర్లు అమర్చుకోవాలంటే కాస్త ఎక్కువ ఖర్చు భరించాల్సి ఉంటుంది. మరి ఈ ఖర్చును ఎవరు భరిస్తారన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎందుకంటే సర్కారు వద్ద డబ్బులు లేవని పదే పదే చెబుతోంది. సమయం, సందర్బం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని ఊటంకిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అమర్చడం వలన రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించుకోవాలని, ఆదాయం పెంచుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

భ‌గ్గుమంటున్న బంగారం ధ‌ర‌లు.. కియోసాకి చెప్పినట్టే జరుగుతోందా?వ్యాపారంSwechaa21 Aug 2026, 09:45 AM

భ‌గ్గుమంటున్న బంగారం ధ‌ర‌లు.. కియోసాకి చెప్పినట్టే జరుగుతోందా?

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి చేసిన బంగారం అంచనాలు చర్చకు వస్తున్నాయి. జనవరిలో బంగారం 5,000 డాలర్లను దాటిన సమయంలో కియోసాకి.. భవిష్యత్తులో బంగారం 27,000 డాలర్లకు చేరవచ్చని సంచలన అంచనా వేశారు.

కొండా సుస్మిత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా?!..తెలంగాణSwechaa21 Aug 2026, 09:36 AM

కొండా సుస్మిత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతారా?!..

తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇప్పటికే అసమ్మతి రాగం టీ కాంగ్రెస్ లో హైపిచ్ లో వినిపిస్తుండగా.. పదవుల పంపాకాలపై కూడా కొందరు నేతలు నిరాశలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదివరకు తరచుగా జరిగే పంచాయితీ అయినా ఇప్పుడు కాస్త ఘాటుగా మారిన అంశం.. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ వ్యవహారం.. ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన.. క్రమక్రమంగా కొండా ఫ్యామిలీ మాటలు రాజకీయాల్లో తరచుగా మంటలు పుట్టిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.. గతంలో పలుమార్లు నోరు జారిన.. ఏదో సద్దుమనిగింది.. కానీ ఈసారి మాత్రం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

TG Congress Group Politics: రైజింగ్ స్టేట్‌లో  డ్రైనేజీ మాటలు!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa21 Aug 2026, 09:27 AM

TG Congress Group Politics: రైజింగ్ స్టేట్‌లో డ్రైనేజీ మాటలు!

ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు అంతటా అధికార కాంగ్రెస్ పార్టీ నేతల వివాదాలు రోజుకో రచ్చగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా పని చేసి అభివృద్ది జోడెద్దుల్లా పరిగెత్తాల్సిన తెలంగాణ రైజింగ్ స్టేట్‌లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. ఇది తారస్థాయికి చేరి వీళ్ల ఆఫ్ ది రికార్డ్ మాటలతో ఒకరిపై ఒకరు డ్రైనేజ్ మాటలు మాట్లాడుకోవడంతో రైజింగ్ కాదు అంతా డ్రైనేజ్ చేస్తున్నారని ప్రజలు చీదరించుకుంటున్నారు.

సౌత్ వర్సెస్ ఢిల్లీ..! డీలిమిటేషన్‌పై దక్షిణాది కొత్త వ్యూహం.. అసలు లెక్కేంటి?NationalSwechaa21 Aug 2026, 09:24 AM

సౌత్ వర్సెస్ ఢిల్లీ..! డీలిమిటేషన్‌పై దక్షిణాది కొత్త వ్యూహం.. అసలు లెక్కేంటి?

జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం ప్రజాస్వామ్య న్యాయమా? లేక జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను రాజకీయంగా శిక్షించకుండా వారి ప్రస్తుత వాటాను కాపాడటమే న్యాయమా? ఈ ప్రశ్నకు సమాధానం కేవలం సీట్ల సంఖ్యను నిర్ణయించదు. భవిష్యత్తు రాజకీయాల్లో ఉత్తరం-దక్షిణం మధ్య అధికార సమీకరణాన్ని కూడా ప్రభావితం చేయ‌వ‌చ్చు.

హైడ్రా-హైదరాబాద్ పోలీసుల్లో భారీ మార్పు !..తెలంగాణSwechaa21 Aug 2026, 08:46 AM

హైడ్రా-హైదరాబాద్ పోలీసుల్లో భారీ మార్పు !..

తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీలు ఉంటాయని మరోసారి భారీగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను మారుస్తారనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగానే జరిగే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్‌‌ను కూడా మార్చేస్తారని అంటున్నారు. ప్రజా ఉద్యమాలను, అందోళనకు కారణాలను అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టుకు యాక్టివ్‌గా ఉండే ఆఫీసర్ రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. కానీ, ఆయనను రేవంత్ రెడ్డి పూర్తిగా నమ్మే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొన్ని పేర్లను స్వయంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Imran Khan: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్.. పాక్ రాజకీయాల్లో కీలక మలుపు!InternationalSwechaa21 Aug 2026, 08:45 AM

Imran Khan: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్.. పాక్ రాజకీయాల్లో కీలక మలుపు!

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను భారీ భద్రత నడుమ అర్ధరాత్రి సమయంలో ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించారు. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకే జైలు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారని, ఆయనకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని

నారాయణ అనే నామానికి ఉన్న శక్తి ఏమిటి?..SpiritualitySwechaa21 Aug 2026, 08:15 AM

నారాయణ అనే నామానికి ఉన్న శక్తి ఏమిటి?..

ఓం నమో నారాయణాయ. లేదా నారాయణ అనే నామం కేవలం ఒక నామం కాదు... అది ఈ సమస్త బ్రహ్మాండాన్ని నడిపించే ఒక మహా శక్తి... శాస్త్రాల ప్రకారం, 'నార' అంటే జీవాత్మలు లేదా ఆపోమూర్తి అయిన జలం. 'అయన' అంటే ఆశ్రయం లేదా గమ్యస్థానం. అంటే, విశ్వంలో ఉన్న సమస్త జీవులకు ఏది పరమ ఆశ్రయమో, ఏ శక్తిలో సకల ప్రాణులు అంతిమంగా లీనమవుతాయో... అదే 'నారాయణ తత్త్వం అని శాస్త్రాలు చెబుతున్నాయి.

Spirituality: మంత్రం అంటే ఏమిటి?..SpiritualitySwechaa21 Aug 2026, 07:59 AM

Spirituality: మంత్రం అంటే ఏమిటి?..

మంత్రం అంటే కేవలం కొన్ని పదాలను పదేపదే పలకడం కాదు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మంత్రానికి ఎంతో లోతైన అర్థం ఉంది. సంస్కృతంలోని 'మన్' అంటే మనస్సు అని, 'త్ర' అంటే రక్షణ లేదా విముక్తికి సంబంధించిన భావాన్ని సూచిస్తుందని చెబుతారు. అందుకే మంత్రం అంటే మనస్సును చంచలమైన ప్రాపంచిక ఆలోచనల నుంచి క్రమంగా ఏకాగ్రత వైపు నడిపించే పవిత్ర ధ్వని అని ఆధ్యాత్మిక శాస్త్రాలు వివరిస్తాయి.

మంత్రాన్ని 'మననం + త్రాయతే' అని కూడా వివరిస్తారు. మననం అంటే పదేపదే స్మరించడం, జపించడం. త్రాయతే అంటే రక్షించడం. అంటే భక్తితో, నియమంతో మంత్రాన్ని జపించే సాధకుడి మనస్సుకు ఆధారంగా నిలిచి, అతడిని అంతర్ముఖంగా నడిపించేదే మంత్రం అనే భావన ఉంది. అంటే మనస్సును, ప్రాణాన్ని ఒకే దిశలో నడిపించే సాధనే మంత్రజపం అని వేదోత్తములు చెబుతున్నారు.

Sanjush: కారు ఢీకొని యువతి మృతి.. జనసేన ఎంపీ కొడుకుపై కేసు నమోదుక్రైమ్Swechaa21 Aug 2026, 12:22 AM

Sanjush: కారు ఢీకొని యువతి మృతి.. జనసేన ఎంపీ కొడుకుపై కేసు నమోదు

Sanjush: జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు సంజూష్ పై కేసు నమోదైంది. ఈ నెల 16న హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద కారుతో యువతిని ఢీకొట్టాడు సంజూష్. ఈ ప్రమాదంలో యువతి చనిపోయింది. మృతురాలిని లైఫ్ స్టైల్ ఉద్యోగిని భారతిగా గుర్తించారు. రోడ్డు దాటుతున్న సమయంలో సంజూష్ కారు యువతిని ఢీకొట్టింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజూష్ పై కేసు నమోదైంది.

దేశంలో చెక్కెర సంక్షోభం ముంచుకొస్తోందా? అస‌లేం జ‌రుగుతోంది..?NationalSwechaa21 Aug 2026, 12:02 AM

దేశంలో చెక్కెర సంక్షోభం ముంచుకొస్తోందా? అస‌లేం జ‌రుగుతోంది..?

దశాబ్దం తర్వాత దేశంలోకి చెక్కెరను దిగుమతి చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది. కొద్ది గంట‌ల కింద‌ట కేంద్రం సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చెక్కెరను అక్టోబర్ 31 వరకు సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతించింది. అసలు సమస్య ఎక్కడ మొదలైంది?

నీరు వృథా చేయొద్దు, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలితెలంగాణSwechaa20 Aug 2026, 11:01 PM

నీరు వృథా చేయొద్దు, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి

ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి సద్వినియోగపరుచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుండి సాకర్‌పల్లి, ఏదుట్ల‌, గోపాలపేట, రేమ‌ద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని ప‌ర్య‌వేక్షించారు.