స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

‘రాజీనామాకు కారణమదే..’ తొలిసారి మౌనం వీడిన ధర్మేంద్ర ప్రధాన్!NationalSwechaa09 Aug 2026, 10:39 AM

‘రాజీనామాకు కారణమదే..’ తొలిసారి మౌనం వీడిన ధర్మేంద్ర ప్రధాన్!

నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత, సంబల్‌పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఆ అంశంపై తొలిసారి నోరు విప్పారు. జూలై 25న రాజీనామా సమర్పించిన సరిగ్గా రెండు వారాల తర్వాత ఒడిశాలోని భువనేశ్వర్ జీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలోని నవతరం విద్యార్థులను (జెన్-జీ) కొంతమంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదోవ పట్టించారని, ఈ క్రమంలో వారి ఆకాంక్షలను కాపాడటానికే తాను మంత్రి పదవిని వదులుకున్నానని వెల్లడించారు.

Bandi : టెన్షన్ టెన్షన్.. పాతబస్తీకి బండి సంజయ్తెలంగాణSwechaa09 Aug 2026, 10:33 AM

Bandi : టెన్షన్ టెన్షన్.. పాతబస్తీకి బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ నేడు పాతబస్తీకి వెళ్లనున్నారు. బోనాల సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లనున్నారు. బండి సంజయ్ వస్తున్నారని తెలియడంతో పెద్దఎత్తున అక్కడ బందోబస్తు, ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. బోనాల సమయం కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షించనున్నారని తెలుస్తోంది. బీజేపీ శ్రేణులు, మరికొందరు కీలక నేతలు సైతం ఆయన వెంట పాతబస్తీకి వెళ్లి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారని సమాచారం. అయితే, కేంద్రమంత్రి వస్తున్న నేపథ్యంలో సెన్సిటిల్ ఏరియా అయిన పాతబస్తీలో ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు నిఘా మరింత పెంచారు.

ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై సస్పెన్స్.. వీడియో వచ్చినా వీడని సందేహాలు!NationalSwechaa09 Aug 2026, 10:27 AM

ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యంపై సస్పెన్స్.. వీడియో వచ్చినా వీడని సందేహాలు!

ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) ముజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారంటూ ఇజ్రాయెల్ వార్తా సంస్థలు ప్రసారం చేసిన కథనాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వార్తలను ఖండిస్తూ ఇరాన్ ప్రభుత్వ అనుబంధ 'మెహర్ న్యూస్ ఏజెన్సీ' ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే ఒక ప్రత్యేక వీడియోను శనివారం రాత్రి విడుదల చేసింది.

25 ఏళ్లొచ్చినా ఇంకా సెటిల్ కాలేదా..? అయితే ఈ స్టోరీ మీ కోస‌మే..!అభిప్రాయంSwechaa09 Aug 2026, 09:30 AM

25 ఏళ్లొచ్చినా ఇంకా సెటిల్ కాలేదా..? అయితే ఈ స్టోరీ మీ కోస‌మే..!

ఒకప్పుడు 25 ఏళ్లు అంటే జీవితంలో చాలా విషయాలు క్లియర్ అయిపోయే వయసుగా భావించేవాళ్లు. చదువు పూర్తయ్యేది. ఉద్యోగం వచ్చేది. కొంతకాలానికి పెళ్లి చేసుకునేవాళ్లు. ఆ తర్వాత ఇల్లు, కుటుంబం అంటూ జీవితం ఒక ట్రాక్‌లోకి వెళ్లిపోయేది. కానీ ఇప్పుడు..?

Bonalu Story: కాకతీయుల నుంచి రాయల కాలం వరకు.. బోనాలకు వేల ఏళ్ల ఘన చరిత్ర!తెలంగాణSwechaa09 Aug 2026, 09:29 AM

Bonalu Story: కాకతీయుల నుంచి రాయల కాలం వరకు.. బోనాలకు వేల ఏళ్ల ఘన చరిత్ర!

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వెనుక శతాబ్దాల ఘన చరిత్ర దాగి ఉంది. సాధారణంగా 1816లో హైదరాబాద్‌లో విజృంభించిన ప్లేగు వ్యాధి నివారణ కోసమే బోనాలు ప్రారంభమయ్యాయని ప్రచారంలో ఉన్నప్పటికీ, చారిత్రక ఆధారాలు మాత్రం అంతకంటే వేల సంవత్సరాల ముందే ఈ సంప్రదాయం తెలంగాణ గడ్డపై వర్ధిల్లిందని స్పష్టం చేస్తున్నాయి. పురావస్తు పరిశోధనలు, ప్రాచీన ఆధారాలు ఈ విషయాన్ని నొక్కిచెబుతున్నాయి. చరిత్ర పరిశోధకుల కథనం ప్రకారం సుమారు మూడు వేల ఏళ్ల క్రితమే ఆషాఢ మాసంలో బోనం ఎత్తే ఆచారం ఉండేది. కామారెడ్డి జిల్లా పరిధిలోని రాతి గుట్టల్లో మహిళలు శిరస్సుపై బోనాలతో ఉన్న శిల్పాలు లభించడం దీనికి ప్రధాన నిదర్శనం. అలాగే 1600 ఏళ్ల కిందటి విష్ణుకుండినుల నాటి 'గర్భాపాత్ర' కీసరగుట్ట వద్ద దొరకడం ఈ పండుగ పురాతనత్వాన్ని చాటుతోంది. కాకతీయుల కాలంలోనూ ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరిగేవి.

భారత్‌పై పశ్చిమాసియా సెగ.. భారీగా పెరిగిన చమురు బిల్లు!..InternationalSwechaa09 Aug 2026, 09:20 AM

భారత్‌పై పశ్చిమాసియా సెగ.. భారీగా పెరిగిన చమురు బిల్లు!..

పశ్చిమాసియాలో చెలరేగిన ఘర్షణల ప్రభావం భారత్‌పై పడుతోంది. ముడి చమురు దిగుమతి పరిమాణం 18 శాతం తగ్గినా.. దిగుమతి బిల్లు మాత్రం ఏకంగా 26 శాతం పెరిగింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య భారత్‌ దాదాపు 59.7 మిలియన్‌ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా.. ఇందుకోసం 49 బిలియన్‌ డాలర్లు, అంటే రూ.4.11 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. హార్మూజ్‌ జలసంధి వద్ద సరఫరా అంతరాయాల భయాలతో అంతర్జాతీయ ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. రష్యా 40 శాతానికి పైగా సరఫరాతో భారత్‌కు అతిపెద్ద చమురు వనరుగా నిలిచింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. భారత్‌పై చమురు భారం మరింత పెరిగే అవకాశం ఉంది.

గ్రేటర్ ప్రజలకు అలర్ట్.. ‘ఇందిరమ్మ టవర్స్’ దరఖాస్తులకు ముగుస్తున్న గడువు!తెలంగాణSwechaa09 Aug 2026, 09:17 AM

గ్రేటర్ ప్రజలకు అలర్ట్.. ‘ఇందిరమ్మ టవర్స్’ దరఖాస్తులకు ముగుస్తున్న గడువు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల టవర్స్’ పథకం కింద ఇళ్లు పొందాలనుకునే అర్హులకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల కలల ఇంటిని నిజం చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మరో రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వీపీ గౌతమ్ స్పష్టం చేశారు. రాజధానిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 7,680 ఎల్‌ఐజీ (LIG) ఫ్లాట్ల కేటాయింపు లక్ష్యంగా ప్రభుత్వం ఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Medical Wonder: ఇక ఆపరేషన్ కుట్లకు గుడ్ బై.. వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ!టాప్ న్యూస్Swechaa09 Aug 2026, 09:00 AM

Medical Wonder: ఇక ఆపరేషన్ కుట్లకు గుడ్ బై.. వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ!

శస్త్రచికిత్సలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆపరేషన్ గాయాలు, వాటికి వేసే కుట్లు, ఆ తర్వాత అయ్యే మచ్చలు. అయితే ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా గాయాలను అత్యంత సులభంగా మాన్పించేందుకు హైదరాబాద్‌కు చెందిన సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. శస్త్రచికిత్సలు, అనుకోకుండా జరిగే ప్రమాదాల వేళ కుట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా ఒక వినూత్న స్వదేశీ సర్జికల్ గ్లూను (టిష్యూ అడెసివ్) వారు విజయవంతంగా అభివృద్ధి చేశారు.

Geetu Mohandas: యష్ నాకు ఒక ఎమోషన్..టాక్సిక్ తర్వాత నా లైఫ్ ఏంటో?సినిమాSwechaa09 Aug 2026, 08:29 AM

Geetu Mohandas: యష్ నాకు ఒక ఎమోషన్..టాక్సిక్ తర్వాత నా లైఫ్ ఏంటో?

Geetu Mohandas: యష్ గురించి మాట్లాడుతూ.. చాలా ఎమోషనల్ అయింది గీతూ మోహన్‌దాస్. యష్..ఒక కో స్టార్..ఒక రైటర్..ఒక ప్రొడ్యూసర్ మాత్రమే కాదు. నాకు ఒక ఎమోషన్ అని తెలిపింది. టాక్సిక్ సినిమా ప్రయాణంలో యష్ ద్వారా ఎన్నో విషయాలను నేచుకున్నాని చెప్పుకొచ్చింది. నేను తర్వాత తీసే ప్రతీ సినిమాపై యష్ ప్రభావం ఉంటుందని అన్నారు. ఇక, ఈ సినిమాలో నటించిన నయనతార, హ్యూమ ఖురేషి, కియారా, రుక్మిణి వసంత్, తారా సుతారియాలతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది..కంటికి కనిపించని టెక్నికల్ టీమ్ అందరూ ఎంతో శ్రమించారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

Nayanathara: యష్ ఒక్క కాల్ చేసి రమ్మన్నాడు..వచ్చేశాసినిమాSwechaa09 Aug 2026, 08:00 AM

Nayanathara: యష్ ఒక్క కాల్ చేసి రమ్మన్నాడు..వచ్చేశా

Nayanathara: కన్నడ రాకింగ్ స్టార్ యష్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ హెవీ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా టాకిక్స్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించగా కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార, కియారా అద్వానీ, తారాసుతారియా, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఆగస్టులో పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.

రాహుల్ నుంచి RSS వరకు.. Gen Zపై ఇంత ఫోకస్ ఎందుకు?NationalSwechaa09 Aug 2026, 12:47 AM

రాహుల్ నుంచి RSS వరకు.. Gen Zపై ఇంత ఫోకస్ ఎందుకు?

Gen Zని కేవలం ఓటర్లుగా చూస్తే సరిపోదు. వాళ్లే ఇప్పుడు నేరుగా రాజకీయ కథనాలను తయారు చేసే శక్తిగా మారుతున్నారు. ఒక వీడియో వైరల్ చేస్తారు.. ఒక సమస్యపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెడతారు.. కొన్ని గంటల్లో అది జాతీయ స్థాయి అంశంగా మారుతుంది. అంటే గతంలో రాజకీయ పార్టీలు ప్రజలకు తమ అజెండాను చెప్పేవి.

NTRivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ అప్‌డేట్సినిమాSwechaa08 Aug 2026, 11:43 PM

NTRivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ అప్‌డేట్

NTRivikram: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను 2027 సెకండాఫ్ లో ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి 2027 ఏడాది చివరన గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మొత్తానికి, ఎన్టీఆర్ కి గాయం కావడంతో త్రివిక్రమ్ సినిమా బాగానే ఆలస్యం అవుతోంది.

Cinema: ఇంత వయెలెన్స్ అవసరమా?సినిమాSwechaa08 Aug 2026, 11:18 PM

Cinema: ఇంత వయెలెన్స్ అవసరమా?

Cinema: రాబోతున్న సినిమాలలో టాక్సిక్ ట్రైలర్ చూసిన తర్వాత ఏ ఆడియన్స్ కోసం సినిమా తీశారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, నాని నటించిన ది ప్యారడైజ్ కూడా హింస, రక్తపాతం బాగా ఉన్న కంటెంట్‌తో తీశారు. ట్రైలర్ లో నానీ, వందలమందిని చంపేసి ఆ గుట్ట మీద కూచొని బ్లేడ్స్ తో దిష్టి తీసుకునే సీన్స్ ఎవరి కోసం..సమాజానికి, ఇలాంటి సినిమాలు ఎంతవరకూ అవసరం..ఇలాంటి ప్రశ్నలు బాగానే వినిపిస్తున్నాయి. మరి, మన మేకర్స్ ఈ విషయంలో ఎప్పుడు మారతారు?

UPI Charges: UPI ఛార్జీలు.. యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్రం కీలక ప్రకటనNationalSwechaa08 Aug 2026, 08:50 PM

UPI Charges: UPI ఛార్జీలు.. యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్రం కీలక ప్రకటన

UPI Charges: యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై త్వరలోనే ఛార్జీలు విధించనున్నారనే వార్తలు అటు యూజర్లను, ఇటు వ్యాపారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. యూపీఐ ఛార్జీల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ యూజర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. యూజర్లు, వ్యాపారులపై యూపీఐ ఛార్జీల భారం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల కేంద్రం లోక్ సభలో పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ 2007 సవరణ బిల్లును ఆమోదించింది. దీంతో యూజర్లు లేదా వ్యాపారులపై ఛార్జీలు ఉంటాయనే ప్రచారం జోరందుకుంది. ఈ ప్రచారానికి తెరదించుతూ కేంద్రం స్పష్టతనిచ్చింది.

South Central Railway: రైలు ప్రయాణికులకు అధికారుల హెచ్చరిక.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!..NationalSwechaa08 Aug 2026, 07:32 PM

South Central Railway: రైలు ప్రయాణికులకు అధికారుల హెచ్చరిక.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!..

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక హెచ్చరిక చేసింది. రిజర్వేషన్ ఉన్న కోచ్‌లలో సరైన టికెట్ లేదా అనుమతి లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. జనరల్ టికెట్‌తో రిజర్వ్‌డ్ కోచ్‌లో ప్రయాణిస్తే రూ.2 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే, రిజర్వేషన్ ఉన్న ప్రయాణికుడి సీటును ఆక్రమించి ఇబ్బంది పెడితే రూ.1,000 వరకు జరిమానా పడొచ్చు. జరిమానా చెల్లించకపోతే కేసు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండటంతో.. ప్రయాణికులు తమకు కేటాయించిన కోచ్‌లోనే ప్రయాణించాలని రైల్వే అధికారులు సూచించారు.

Kamareddy: కామారెడ్డిలో వర్షం బీభత్సం.. కౌన్సిలర్ వినూత్న నిరసన!..తెలంగాణSwechaa08 Aug 2026, 07:15 PM

Kamareddy: కామారెడ్డిలో వర్షం బీభత్సం.. కౌన్సిలర్ వినూత్న నిరసన!..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కామారెడ్డి–కరీంనగర్ జాతీయ రహదారిలోని స్టేషన్‌ రోడ్డుపై పోలీస్‌ స్టేషన్‌ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోయింది. రోడ్డంతా కుంటను తలపించడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై 46, 47వ వార్డు కౌన్సిలర్‌ గెరిగంటి లక్ష్మీనారాయణ నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. సమీపంలోనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఉండటంతో 108 వాహనాలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, లేదంటే దీక్ష చేపడతామని అధికారులను హెచ్చరించారు.

Traffic Diversions: హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. 2 రోజులు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలుతెలంగాణSwechaa08 Aug 2026, 07:05 PM

Traffic Diversions: హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. 2 రోజులు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 9, 10వ తేదీలలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. వాహనదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

యువకుల నిర్లక్ష్యానికి బలైన మెడికో ప్రియాంక మృతి!..క్రైమ్Swechaa08 Aug 2026, 07:01 PM

యువకుల నిర్లక్ష్యానికి బలైన మెడికో ప్రియాంక మృతి!..

రాజమహేంద్రవరంలో జరిగిన దారుణ ఘటనలో పీజీ మెడికల్‌ విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంక కన్నుమూశారు. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె.. హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కారుతో ప్రియాంకను పలుమార్లు ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారికి ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించింది. ప్రియాంక మృతితో వైద్య విద్యార్థులు, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

The Paradaise: తప్పు జరగకుండా ముందే చూసుకోవాల్సింది..సినిమాSwechaa08 Aug 2026, 05:57 PM

The Paradaise: తప్పు జరగకుండా ముందే చూసుకోవాల్సింది..

The Paradaise: ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా టీజర్ గురించి పాజిటివ్ రివ్యూస్ కంటే నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చాయి. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ శాతం చేసిన వాళ్ళే ఉన్నారు. నాని హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ది ప్యారడైజ్ పలు కారణాల వల్ల.. ఇదుగో వచ్చే నెల 24న రిలీజ్ అని ప్రకటించారు.

Ajay Bhupathi: ఫ్లాప్ ని ఒప్పుకోవడానికి కూడా నిజాయితీ ఉండాలి..సినిమాSwechaa08 Aug 2026, 05:56 PM

Ajay Bhupathi: ఫ్లాప్ ని ఒప్పుకోవడానికి కూడా నిజాయితీ ఉండాలి..

Ajay Bhupathi: ఒక దర్శకుడు సినిమా తీస్తున్నాడంటే, దాని ప్రభావం ఎంతోమంది మీద చూపుతుంది. కెప్టన్ ఆఫ్ ది షిప్ డైరెక్టరే. అందుకే, ఆ కుర్చీకి..అందులో కూర్చునే వ్యక్తికి అంత గౌరవమిస్తారు. నిర్మాత డబ్బులు పెట్టడం ఒక ఎత్తైతే, దాన్ని సరిగ్గా ఉపయోగించి అదే నిర్మాత మరో రెండు సినిమాలు తీయగల ధైర్యాన్నిచ్చే దర్శకుడు మరో ఎత్తు.

100 Horns Bike: ఇది బైకా? హారన్ల షాపా? ఒకే బైకుకు 100 హారన్లు.. పోలీసులే షాక్వైరల్ న్యూస్Swechaa08 Aug 2026, 05:54 PM

100 Horns Bike: ఇది బైకా? హారన్ల షాపా? ఒకే బైకుకు 100 హారన్లు.. పోలీసులే షాక్

100 Horns Bike: ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో వాహన తనిఖీల సమయంలో పోలీసులకు ఓ బైక్ కంటపడింది. ఆ బైక్ ను చూసి పోలీసులే పరేషాన్ అయ్యారు. ఇదెక్కడి విడ్డూరం అని ముక్కున వేలేసుకున్నారు. వారలా షాక్ అవడానికి కారణం ఆ బండికి 100 హారన్లు ఉండటమే. ఈ చిత్రవిచిత్రమైన బైక్ ను చూసి స్థానికలే కాదు పోలీసులు సైతం విస్తుపోయారు. రూల్స్ కు విరుద్ధంగా ఉందంటూ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బైక్ ను సీజ్ చేసేశారు.

Land Grab: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో సొంత బాబాయి భూమి కబ్జా..! శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరాచకాలు..!క్రైమ్Swechaa08 Aug 2026, 04:39 PM

Land Grab: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో సొంత బాబాయి భూమి కబ్జా..! శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరాచకాలు..!

Srihari Goud: శేరిలింగంపల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిపై భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. సొంత బాబాయికే ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, అతని భూమిని కబ్జా చేసినట్లు కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీహరి గౌడ్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాబాయ్ భార్య, ఆమె కొడుకు శ్రీహరి గౌడ్ ను నిలదీయగా.. వారిపై విచక్షణారహితంగా దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Honey Trap: పాకిస్తాన్ మహిళ హనీట్రాప్‌లో ఎయిర్ ఫోర్స్ అధికారి.. డిఫెన్స్ సీక్రెట్స్ లీక్క్రైమ్Swechaa08 Aug 2026, 04:22 PM

Honey Trap: పాకిస్తాన్ మహిళ హనీట్రాప్‌లో ఎయిర్ ఫోర్స్ అధికారి.. డిఫెన్స్ సీక్రెట్స్ లీక్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఒక ఆఫీసర్ పాకిస్తాన్ మహిళ హనీ ట్రాప్ లో చిక్కుకున్నారు. అంతేకాదు డిఫెన్స్ సీక్రెట్స్ సైతం ఆయన లీక్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సదురు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Korean kanakaraju: సక్సెస్ ట్రాక్ ఎక్కిన వరుణ్ తేజ్..సినిమాSwechaa08 Aug 2026, 03:44 PM

Korean kanakaraju: సక్సెస్ ట్రాక్ ఎక్కిన వరుణ్ తేజ్..

Korean kanakaraju: చాలాకాలంగా హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న మన హీరోలు ఒక్కొక్కరు మెల్లగా మంచి హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నారు. మొన్నామధ్య అఖిల్ లెనిన్ సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. ఎవరూ ఊహించని విధంగా ఇది 100 కోట్ల మార్క్ ను చేరుకుంది. అఖిల్ ఇలాంటి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురుచూశాడు. ఇక, కెరీర్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మంచి హిట్ లెనిన్ రూపంలోనే దక్కింది.

PhonePe: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..! ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్NationalSwechaa08 Aug 2026, 03:43 PM

PhonePe: యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..! ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్

కేంద్రం తెచ్చిన కొత్త పన్ను సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. దీంతో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేస్తారన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఛార్జీల బాదుడు తప్పదేమో అని యూపీఐ వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో PhonePe CEO సమీర్ నిగమ్ గుడ్ న్యూస్ చెప్పారు.

Warangal: పెద్ది కుటుంబం పై పెద్దమనస్సు చాటిన కేసీఆర్!..తెలంగాణSwechaa08 Aug 2026, 03:08 PM

Warangal: పెద్ది కుటుంబం పై పెద్దమనస్సు చాటిన కేసీఆర్!..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ఆయన ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయల చొప్పున.. మొత్తం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకులో జమ చేయనున్నారు. మొత్తంగా పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల సాయం అందనుంది. పిల్లల చదువు, భవిష్యత్‌తో పాటు కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తుందని కేసీఆర్ తెలిపారు.

బోనాల వేడుక.. నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు!తెలంగాణSwechaa08 Aug 2026, 02:23 PM

బోనాల వేడుక.. నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు!

హైదరాబాద్‌లో బోనాల పండుగ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీసు యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నగరంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 9న జరగనున్న బోనాల ఉత్సవాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిర్దేశిత సమయాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయనున్నారు. ముఖ్యంగా చార్మినార్ జోన్ పరిధిలో ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు (48 గంటలు) మద్యం దుకాణాలతో పాటు రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు పూర్తిగా మూతపడనున్నాయి.

షబ్బీర్ అలీకి షాకిచ్చిన గ్రామస్తులు!..రాజకీయాలుSwechaa08 Aug 2026, 02:17 PM

షబ్బీర్ అలీకి షాకిచ్చిన గ్రామస్తులు!..

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులపై చర్చ జరుగుతున్న వేళ.. మెదక్ జిల్లాలో షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నార్సింగి మండలం జప్తిశివునూర్‌లో గ్రామస్తులు భారీగా తరలివచ్చి గెస్ట్‌హౌస్ కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారు. తమ పంట పొలాలకు వెళ్లే శతాబ్దాల నాటి దారిని మూసివేశారని గ్రామస్తులు ఆరోపించారు. పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో గ్రామంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

HYDRAA JOBS: ‘హైడ్రా’ డ్రైవర్ జాబ్స్‌కు పోటెత్తిన నిరుద్యోగులు.. స్టేడియం వద్ద తోపులాట!తెలంగాణSwechaa08 Aug 2026, 01:47 PM

HYDRAA JOBS: ‘హైడ్రా’ డ్రైవర్ జాబ్స్‌కు పోటెత్తిన నిరుద్యోగులు.. స్టేడియం వద్ద తోపులాట!

ఒక ఉద్యోగం పడితే చాలు.. వేలకు వేలు గుమిగూడే పరిస్థితి.. రూపాయి సంపాదన లేక, ఇంట్లో అడిగి రూపాయి తీసుకోలేక, రోజులు గడిచే కొద్దీ పెరిగిపోతున్న వయసును చూసి నలిగిపోతున్న నిరుద్యోగుల ఆవేదనకు సరూర్‌నగర్ స్టేడియం దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం. కేవలం 150 'హైడ్రా' ఉద్యోగాల కోసం వేలాది మంది యువకులు అర్ధరాత్రి నుంచే స్టేడియం ముందు క్యూ కట్టారంటే.. మన దగ్గర నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో, ఒక చిన్న ఉద్యోగం కోసం కుర్రాళ్లు ఎంతగా తపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో విపత్తు నిర్వహణ, సహాయక చర్యల కోసం ఏర్పాటైన ‘హైడ్రా’ (HYDRAA) సంస్థ చేపట్టిన డ్రైవర్ ఉద్యోగ నియామక ప్రక్రియ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. ఎల్‌బీ నగర్ సమీపంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో శనివారం వేకువజాము నుంచే ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

పంత్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు!NationalSwechaa08 Aug 2026, 01:28 PM

పంత్ రిక్వెస్ట్‌కు స్పందించిన సీఎం.. అధికారులకు కీలక ఆదేశాలు!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేసేందుకు సాయం చేయాలని కోరుతూ చేసిన ట్వీట్లపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అత్యంత సానుకూలంగా స్పందించారు. ఢిల్లీ నుంచి స్థావరాన్ని మార్చుకుని సొంత మట్టిలో మొదటి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న పంత్ ఆకాంక్షను సీఎం మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా స్పందించారు. ధామి, నిబంధనలకు లోబడి పంత్‌కు పూర్తి సహకారం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.