స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే  పైలట్‌ రోహిత్ రెడ్డికి అరెస్ట్ వారెంట్!తెలంగాణSwechaa08 Aug 2026, 01:06 PM

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్ రెడ్డికి అరెస్ట్ వారెంట్!

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ హైదరాబాద్ మున్సిపల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 'మెసర్స్ ఇంటెల్లిడెక్స్' కంపెనీకి రోహిత్ రెడ్డి జారీ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చెక్ వరుసగా మూడు సార్లు బౌన్స్ కావడంతో సదరు సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన కోర్టు, బాధితుల తరఫు వాదనలతో ఏకీభవించింది. ఈ వ్యవహారంలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఆయనపై మోపబడిన నేరం రుజువైందని న్యాయమూర్తి ఖుష్బూ ఉపాధ్యాయ స్పష్టం చేశారు. విచారణ ముగిసి తీర్పు వెలువరించే సమయానికి నిందితుడైన మాజీ ఎమ్మెల్యే కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

LandScam: బంజారాహిల్స్‌లో 'మెగా' స్కెచ్.. రూ.2,200 కోట్ల స్థలం ఆక్రమణ!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa08 Aug 2026, 12:55 PM

LandScam: బంజారాహిల్స్‌లో 'మెగా' స్కెచ్.. రూ.2,200 కోట్ల స్థలం ఆక్రమణ!

భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిపై కార్పొరేట్ పంజా పడింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్( సాక్షిగా, బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని సుమారు రూ.2,200కోట్ల విలువైన 11 ఎకరాల విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు అధికార పక్ష పెద్దల అండదండలతో ఒక భారీ స్కెచ్ వేశారు. కేబీఆర్ పార్కు ప్రాంగణంలో ఇటీవల చెట్లు నరికిన ఘటన మరవకముందే, దానికి సమీపంలోని ఈ పచ్చని అడవిపై యంత్రాలతో దాడి చేసి వేలాది వృక్షాలను నేలమట్టం చేస్తుండటం స్థానికులను, పర్యావరణ ప్రేమికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

మెటాతో కేంద్రం ఢీ.. అసలు గొడవ ఎక్కడ మొదలైంది?NationalSwechaa08 Aug 2026, 12:40 PM

మెటాతో కేంద్రం ఢీ.. అసలు గొడవ ఎక్కడ మొదలైంది?

భారత ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? దీనికి ప్రధాన కారణం భారత్‌ మెటాకు అత్యంత కీలకమైన మార్కెట్‌ కావడమే. కోట్లాది భారతీయులు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్లాట్‌ఫామ్‌లపై ఏ కంటెంట్‌ ఉండాలి? ఏది తొలగించాలి? యూజర్ల భద్రత ఎలా ఉండాలి?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కామ్‌.. ఒకే ఆధార్‌తో ఇద్దరు ఉద్యోగులు.. రెండేసి జీతాలు!తెలంగాణSwechaa08 Aug 2026, 11:41 AM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కామ్‌.. ఒకే ఆధార్‌తో ఇద్దరు ఉద్యోగులు.. రెండేసి జీతాలు!

తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో మునుపెన్నడూ లేని రీతిలో భారీ ఆడిట్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒకే ఆధార్ కార్డు నంబర్‌ను వినియోగించి ఇద్దరు వేర్వేరు వ్యక్తులుగా లేదా రెండు వేర్వేరు పేర్లతో రెండు కీలక శాఖల్లో ఉద్యోగాలు పొంది లక్షల రూపాయల జీతాలను కొల్లగొడుతున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఉద్యోగుల సమగ్ర డేటాను, ఆధార్ వివరాలను ఆర్థిక శాఖ లోతుగా పరిశీలించే క్రమంలో ఈ నకిలీ ఉద్యోగుల ఉదంతం బయటపడింది. ఇప్పటివరకు చేపట్టిన ప్రాథమిక విచారణలో 40 అనుమానాస్పద కేసులను గుర్తించగా, అందులో ఏకంగా 80 మంది డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

త్వరలో మద్యం ధరల పెంపు.. కొత్త రేట్లు ఎప్పటి నుంచి అంటే..?తెలంగాణSwechaa08 Aug 2026, 11:03 AM

త్వరలో మద్యం ధరల పెంపు.. కొత్త రేట్లు ఎప్పటి నుంచి అంటే..?

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు భారీషాక్ తగలనుంది. త్వరలోనే అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం కేటగిరీల బ్రాండ్ల ధరల పెంపుపై అధ్యయనం చేసిన ఉన్నతస్థాయి ‘ప్రైస్ ఫిక్సేషన్’ సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్‌పీ (MRP) సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గురువారం అందించిన ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అన్ని అనుమతులు పూర్తయితే ఆగస్టు 15తర్వాత నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.

MusiRejuvenation: మూసీ పునరుజ్జీవనానికి లైన్‌క్లియర్.. ఫేజ్-1కు పర్యావరణ అనుమతులు!తెలంగాణSwechaa08 Aug 2026, 10:49 AM

MusiRejuvenation: మూసీ పునరుజ్జీవనానికి లైన్‌క్లియర్.. ఫేజ్-1కు పర్యావరణ అనుమతులు!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవనం, సుందరీకరణ ప్రాజెక్టులో మరో కీలక అడ్డంకి తొలగిపోయింది. ప్రాజెక్టు మొదటి దశ(ఫేజ్-1) అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ (SEIAA) ముందస్తు పర్యావరణ అనుమతులు(EC) జారీ చేసింది. ఈ గ్రీన్‌సిగ్నల్‌తో దసరా పండుగ నాటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) కసరత్తును ముమ్మరం చేసింది. మొత్తం రూ.7,055కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న మొదటి దశలో భాగంగా.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 21కిలోమీటర్ల మేర నదీ తీరాన్ని ‘వి’ఆకారంలో అభివృద్ధి చేయనున్నారు.

Make in India: భారత్‌కు ఫ్రాన్స్ బంపర్ ఆఫర్.. 'మేక్ ఇన్ ఇండియా'కు భారీ ప్రాజెక్ట్!NationalSwechaa08 Aug 2026, 10:35 AM

Make in India: భారత్‌కు ఫ్రాన్స్ బంపర్ ఆఫర్.. 'మేక్ ఇన్ ఇండియా'కు భారీ ప్రాజెక్ట్!

భారత వాయుసేన (IAF) యుద్ధ సామర్థ్యాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే దిశగా ఒక చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రూ.3.25లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ప్రతిపాదనలో భాగంగా, ఏకంగా 94జెట్లను భారత్‌లోనే తయారు చేసేందుకు ఫ్రాన్స్ ముందుకొచ్చింది. ఈమేరకు ఫ్రెంచ్ రక్షణ దిగ్గజాలు సంయుక్తంగా సిద్ధం చేసిన అధికారిక ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ కీలక ఒప్పందం ఖరారైతే, ఫ్రాన్స్ వెలుపల రఫేల్ యుద్ధ విమానాల తయారీ అసెంబ్లీ లైన్ ఏర్పడటం చరిత్రలోనే ఇదే తొలిసారి కానుంది.

HYDRAA: ఫేక్ ముఠాలకు హైడ్రా లాంటి  ఫైర్ కావాలి? సిటీలో ప్రతి అనుమతుల్లో 70 శాతం ఫేక్?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa08 Aug 2026, 10:13 AM

HYDRAA: ఫేక్ ముఠాలకు హైడ్రా లాంటి ఫైర్ కావాలి? సిటీలో ప్రతి అనుమతుల్లో 70 శాతం ఫేక్?

జీహెచ్ఎంసీ పరిధిలో ఏ షాపుకైనా ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి. 5 అంతస్థుల కంటే ఎక్కువ ఉంటే ఫైర్ డిపార్ట్ మెంట్ అన్నీ పర్యవేక్షించి ఎన్వోసీ ఇవ్వాలి. అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న రెసిడెన్షియల్ కాకుండా ఎలాంటి కమర్షియల్ అయినా జీహెచ్ఎంసీ పరిధిలోని హైడ్రా అధికారుల అనుమతులు తప్పకుండా ఉండాల్సిందే.

ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. ఉచిత పథకాలపై ఆందోళన!తెలంగాణSwechaa08 Aug 2026, 09:32 AM

ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్.. ఉచిత పథకాలపై ఆందోళన!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో త్వరలోనే తీవ్రమైన ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ప్రభుత్వ ఖజానాలో నిధులు ఖాళీ అవడానికి ఈ ఉచితాలే ప్రధాన కారణమని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. కంటోన్మెంట్ బోర్డుకు సర్‌ఛార్జి బకాయిల చెల్లింపునకు సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘కోటీశ్వరులకు కూడా రైతుబంధు ఇవ్వడం, భారీ లగ్జరీ బైక్‌లపై తిరిగే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయడం వెనుక అర్థమేంటి?’ అని ప్రభుత్వాన్ని నిలదీసింది.

Heart attack death: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కానిస్టేబుల్ హఠాన్మరణం!క్రైమ్Swechaa08 Aug 2026, 09:15 AM

Heart attack death: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కానిస్టేబుల్ హఠాన్మరణం!

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భద్రతా విధుల్లో నిమగ్నమై ఉన్న పోలీసు సిబ్బందిలో ఒకరు విధులు నిర్వర్తిస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారు. మృతి చెందిన అధికారిని 41 ఏళ్ల కానిస్టేబుల్ గణేశ్‌గా గుర్తించారు. నిరంతరం కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంగణంలో ఈ విషాదకర సంఘటన జరగడంతో తోటి పోలీసు సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Rishabh Pant: సీఎంకు రిషబ్ పంత్ షాకింగ్ ట్వీట్.. అర్ధరాత్రి వేళ వింత రిక్వెస్ట్!క్రీడలుSwechaa08 Aug 2026, 08:53 AM

Rishabh Pant: సీఎంకు రిషబ్ పంత్ షాకింగ్ ట్వీట్.. అర్ధరాత్రి వేళ వింత రిక్వెస్ట్!

టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో ఇల్లు కట్టుకునేందుకు సరైన భూమి కొనుగోలు చేయడంలో సాయం చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అర్ధరాత్రి వేళ ఆయన విజ్ఞప్తి చేశారు. తెల్లవారుజామున 12:46 గంటలకు పంత్ వరుసగా చేసిన ఈ ట్వీట్లలో విపరీతమైన స్పెల్లింగ్ తప్పులు, వ్యాకరణ దోషాలు ఉండటంతో నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు. తన నివాసాన్ని ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు మార్చాలని భావిస్తున్నానని, అయితే స్థలాన్ని కొనుగోలు చేయడం ఒక పీడకలగా మారిందని పంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

UPI ఫ్రీ పేమెంట్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుందా..? సామాన్యులకు కొత్త టెన్షన్..!వ్యాపారంSwechaa07 Aug 2026, 11:43 PM

UPI ఫ్రీ పేమెంట్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుందా..? సామాన్యులకు కొత్త టెన్షన్..!

ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం.. వ్యక్తిగతంగా ఒకరు మరో వ్యక్తికి పంపే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే సంవత్సరానికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, లగ్జరీ హోటళ్లలో రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై 0.3 నుంచి 0.5 శాతం వరకు MDR విధించే అవకాశం ఉందన

Dil Raju: సల్మాన్ ఖాన్ తో జాకీ ష్రాఫ్..ఈసారి సంథింగ్ స్పెషల్ రోల్సినిమాSwechaa07 Aug 2026, 09:44 PM

Dil Raju: సల్మాన్ ఖాన్ తో జాకీ ష్రాఫ్..ఈసారి సంథింగ్ స్పెషల్ రోల్

Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆయనకి అత్యంత సన్నిహితుడు టాలెండ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కలిసి హిందీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సౌత్ క్వీన్, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. నయన్ నటిస్తున్న రెండవ బాలీవుడ్ సినిమా.

Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. 15 అడుగుల లోతులో పడిన కారు!..క్రైమ్Swechaa07 Aug 2026, 09:18 PM

Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. 15 అడుగుల లోతులో పడిన కారు!..

తిరుమలలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 22వ మలుపు వద్ద అదుపుతప్పిన ఓ కారు పిట్టగోడను ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.

Private Schools: ప్రైవేట్ స్కూల్స్‌కు సర్కార్ షాక్.. ఫీజులపై కొత్త రూల్తెలంగాణSwechaa07 Aug 2026, 08:34 PM

Private Schools: ప్రైవేట్ స్కూల్స్‌కు సర్కార్ షాక్.. ఫీజులపై కొత్త రూల్

Private Schools: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పాఠశాల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆ పేరు ఈ పేరు చెప్పి పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పేరెంట్స్ ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Electric Flying Car: వావ్... గాల్లో ఎగిరే కారు తయారీ.. ప్రయోగం కూడా సక్సెస్NationalSwechaa07 Aug 2026, 07:56 PM

Electric Flying Car: వావ్... గాల్లో ఎగిరే కారు తయారీ.. ప్రయోగం కూడా సక్సెస్

Electric Flying Car: ఉత్తరాఖండ్ కు చెందిన యువ ఆవిష్కర్త రవి టమ్టా అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అదే ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్ (ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వాహనం). అంటే గాల్లో ఎగిరే కారు. అరే.. కారు ఏంటి గాల్లో ఎగరడం ఏంటి అనే సందేహం రావొచ్చు. కానీ రవి టమ్టా అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించారు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ వెహికల్ ను విజయవంతంగా పరీక్షించారు కూడా.

NEET paper leak: నీట్ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. బయటపడిన దోషులు!..NationalSwechaa07 Aug 2026, 07:56 PM

NEET paper leak: నీట్ పేపర్ లీక్ కేసులో ట్విస్ట్.. బయటపడిన దోషులు!..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ–2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన ఈ చార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెల్లడించింది. పరీక్షకు మూడు రోజుల ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, వాటిని వాట్సాప్, టెలిగ్రామ్, ఆఫ్‌లైన్ కోచింగ్ క్లాసుల ద్వారా విద్యార్థులకు చేరవేశారని పేర్కొంది.

Pawan Kalyan: ఆగస్టు 15న OG వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ ..సినిమాSwechaa07 Aug 2026, 06:59 PM

Pawan Kalyan: ఆగస్టు 15న OG వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ ..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే 300 కోట్ల హైయ్యెస్ట్ గ్రాసర్ కలెక్ట్ చేసిన సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ అండ్ మాఫియా బ్యాక్‌డ్రాప్ లో వచ్చి..పాన్ ఇండియా వైడ్ గా భారీ హిట్ సాధించింది. అసలు, ఈ సినిమా ఇంత సక్సెస్ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. దీనికి, ముందు వచ్చిన హరిహర వీరమల్లు కమర్షియల్‌గా బిగ్ లాస్ అని ఒప్పుకోవాల్సిందే.

Srikanth Odela: ది ప్యారడైజ్ టీజర్ పై నెగిటివ్ కామెంట్స్..ఆ లోపాలేంటంటేసినిమాSwechaa07 Aug 2026, 06:57 PM

Srikanth Odela: ది ప్యారడైజ్ టీజర్ పై నెగిటివ్ కామెంట్స్..ఆ లోపాలేంటంటే

Srikanth Odela: టీజర్ వచ్చాక ఎంత హైప్ క్రియేట్ అయిందో..అంత నెగిటివిటీ కూడా వచ్చింది. అసలు, ఇందులో డైలాగ్స్ గమ్మున ఎవరికీ అర్థం కావడం లేదు. సౌండ్ ప్రాబ్లం చాలా ఉంది. ఇది, ఒకరకంగా ఇద్దరి పొరపాటు అని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అయితే, రెండవది దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ది. వీరు, టీజర్ కట్ చేసినప్పుడు సౌండ్ చూసుకోలేదా..ఎంత స్పీడ్‌గా చెప్పిన డైలాగ్స్ ఎలా అర్థమవుతాయి అని ఆలోచించలేదా?

TG High Court: కోటీశ్వరులు కూడా లబ్ది పొందుతున్నారు, భవిష్యత్‌ తరాలకు ఏం మిగులుస్తారు- ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa07 Aug 2026, 06:07 PM

TG High Court: కోటీశ్వరులు కూడా లబ్ది పొందుతున్నారు, భవిష్యత్‌ తరాలకు ఏం మిగులుస్తారు- ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సమాజంలోని పలు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు పలు రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఆర్థిక భరోసా కల్పించేలా కొన్ని స్కీమ్స్ ను తీసుకొచ్చాయి. అయితే, పేదల కోసం తెచ్చిన ఉచిత పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని, సంపన్నులు సైతం లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఒక కేసు విచారణ సందర్భంగా.. ఉచిత పథకాల అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఉచిత పథకాల అమలులో అర్హుల ఎంపిక, ప్రభుత్వాల బాధ్యతపై ప్రశ్నలు లేవనెత్తింది.

Investment Scam: "లడ్డూ" కావాలా నాయనా.. అంటూ పరిచయాలు.. ఆపై 3.45 కోట్లకు టోకరా.. మైహోం భూజాలో భారీ మోసంక్రైమ్Swechaa07 Aug 2026, 05:05 PM

Investment Scam: "లడ్డూ" కావాలా నాయనా.. అంటూ పరిచయాలు.. ఆపై 3.45 కోట్లకు టోకరా.. మైహోం భూజాలో భారీ మోసం

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని మైహోం భూజాలో భారీ మోసం వెలుగుచూసింది. కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ బయటపడింది. గణేశ్ లడ్డూ వేలంలో లడ్డూలు కొనుగోలు చేసి అపార్ట్ మెంట్ వాసుల్లో గుర్తింపు పొందిన వ్యక్తి భారీ మోసానికి తెరలేపాడు. తన మాయ మాటలతో అపార్ట్ మెంట్ వాసులను నమ్మించి నిండా ముంచేశాడు. భారీ లాభాల ఎరతో వారి నుంచి కోట్ల రూపాయలు దండుకున్నాడు.

Vandematram: పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా మూడేళ్లు జైలు.. వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంNationalSwechaa07 Aug 2026, 03:41 PM

Vandematram: పాడకుండా అడ్డుకున్నా, అవమానించినా మూడేళ్లు జైలు.. వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వందేమాతరం బిల్లుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంటులో పాస్ అయిన వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో వందేమాతరం గేయానికి చట్టబద్ధత లభించింది. ఇకపై ఎవరైనా వందేమాతరం గేయాన్ని అవమానించినా, పాడుతుండగా అడ్డుకున్నా, పాడుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించినా నేరంగా పరిగణిస్తారు.

రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!ఏపీSwechaa07 Aug 2026, 03:40 PM

రాజమండ్రి హిట్ అండ్ రన్ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!

రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఆకతాయిలు కారుతో ఢీకొట్టడంతో పీజీ వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అమరావతిలోని సచివాలయంలో ఈ ఘటనపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదానికి పాల్పడిన నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి అమానుషానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని, వారికి తగిన రీతిలో శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు.

ఆల్ టైమ్ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్..!NationalSwechaa07 Aug 2026, 03:29 PM

ఆల్ టైమ్ రికార్డు.. దేశంలోనే అగ్రస్థానంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్..!

విశాఖపట్నం కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అతితక్కువ కాలంలోనే ఊహించని రీతిలో పురోగతి సాధించి దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా అవతరించింది. వార్షికంగా ఏకంగా రూ.2,493 కోట్ల ఆల్ టైమ్ రికార్డు రాబడిని ఆర్జించి ఈ జోన్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుందని కేంద్ర రైల్వే శాఖ అధికారికంగా వెల్లడించింది. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రైల్వే రవాణా, మౌలిక వసతుల కల్పన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని, ఆధునీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌కు మరో మెగా బస్ టెర్మినల్!..తెలంగాణSwechaa07 Aug 2026, 03:29 PM

హైదరాబాద్‌కు మరో మెగా బస్ టెర్మినల్!..

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గాజులరామారంలో 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇంటర్‌స్టేట్, సిటీ బస్సుల కోసం ప్రత్యేక టెర్మినల్స్‌తో పాటు ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు కానుంది.

ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఇతర రాష్ట్రాల బస్సులు నగరంలోకి ప్రవేశించకుండా ఇక్కడి నుంచే సేవలు అందిస్తాయి. దీంతో ఎంజీబీఎస్, జేబీఎస్‌పై ఒత్తిడి తగ్గి, హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

స్కూల్లో కాల్పులు..ముగ్గురు టీచర్లు, స్టూడెంట్స్ మృతిInternationalSwechaa07 Aug 2026, 02:59 PM

స్కూల్లో కాల్పులు..ముగ్గురు టీచర్లు, స్టూడెంట్స్ మృతి

ఓ విద్యార్థి ఘాతుకానికి ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు టీచర్లు బలయ్యారు. పాఠశాలకు తుపాకీ తీసుకుని వచ్చిన ఓ స్టూడెంట్ విచక్షణారహితంగా కాల్పులు జరపడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఓ పాఠశాలలో వెలుగుచూసింది. ఇదే ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల్లోకివెళితే.. బ్యాంకాక్ శివారులోని 'నాంథబురి' ప్రాంతంలో గల ఓ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో తరగతిలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ స్టూడెంట్ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించాడు. గన్ శబ్దాలు విన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు దక్కించుకోవడానికి వేరే క్లాస్ రూముల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని దాక్కున్నారు.

కాంట్రాక్టర్లకు బెదిరింపులు.. మంత్రి పేరిట విద్యాశాఖ ఇంజినీర్ దందా!తెలంగాణSwechaa07 Aug 2026, 02:36 PM

కాంట్రాక్టర్లకు బెదిరింపులు.. మంత్రి పేరిట విద్యాశాఖ ఇంజినీర్ దందా!

మంత్రి పేరు చెబుతూ ఓ విద్యాశాఖ ఇంజినీర్ కాంట్రాక్టుల దందా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తన బినామీ సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు, మిగతా కాంట్రాక్టర్లను పోటీ నుండి తప్పుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ప్రహరీ నిర్మించే పనికోసం రూ.3.73 కోట్లతో అధికారులు టెండర్లు పిలిచారు.అయితే, ఆ టెండర్‌లో ఆరు కంపెనీలు పోటీ పడగా ఓ కంపెనీకి అర్హత లేదని తప్పించారు.

బ్యాంక్ అకౌంట్‌తో అడ్డంగా బుక్కైన మరో ఎమ్మెల్యే!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa07 Aug 2026, 02:17 PM

బ్యాంక్ అకౌంట్‌తో అడ్డంగా బుక్కైన మరో ఎమ్మెల్యే!

రాజకీయాల్లో నిత్యం ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితంలో మాత్రం చిన్నచిన్న పొరపాట్లతో పరువును బజారున పడేసుకుంటున్నారు. సరిగ్గా అలాంటి ఘటనే తెలంగాణ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఒక కొత్త ఎమ్మెల్యే సారు, ఓ వయ్యారి వేసిన ప్రేమ వలలో చిక్కుకుని అడ్డంగా బుక్కయ్యారనే టాక్ నడుస్తోంది. చాలా రోజులుగా అత్యంత గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం, చివరకు ఆయన వేసిన ఒక చిన్న పొరపాటు వల్ల బయటపడి రచ్చకెక్కినట్లు తెలుస్తోంది.

రెండో ఖాతా తెరిచిన అధికార ఎమ్మెల్యే.. అయ్యో అలా ఎలా దొరికిపోయావ్!టాప్ న్యూస్Swechaa07 Aug 2026, 01:37 PM

రెండో ఖాతా తెరిచిన అధికార ఎమ్మెల్యే.. అయ్యో అలా ఎలా దొరికిపోయావ్!

అధికార కాంగ్రెస్‌లో లేటు వయసులో ఓ ఎమ్మెల్యే వెలగబెట్టిన యవ్వారం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. దక్షిణ తెలంగాణ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత.. రెండో ఖాతా తెరిచినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన భార్య బయటపెట్టినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన దక్షిణ తెలంగాణ లోని ఓ నియోజకవర్గం నుండి పోటీచేసి తొలిసారిగా ఎమ్మెల్యే అయినట్టు సమాచారం. ఎమ్మెల్యే మీద మనసు పడిన ఓ పడతితో ఆయన ప్రేమలో పడినట్టు సమాచారం. ఈ వ్యవహారం చాలా కాలం నుంచే గుట్టుగా సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

రేపటి నుంచి ఆటో, క్యాబ్, స్విగ్వీ, జొమాటో సర్వీసులు అన్ని బంద్తెలంగాణSwechaa07 Aug 2026, 01:06 PM

రేపటి నుంచి ఆటో, క్యాబ్, స్విగ్వీ, జొమాటో సర్వీసులు అన్ని బంద్

రేపటి నుంచి ఆటో, క్యాబ్, స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి గిగ్ సర్వీసులు బంద్ కానున్నాయి. తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ 16 వాహన సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. రేవంత్ ప్రభుత్వాన్ని మొద్దునిద్ర నుంచి తట్టిలేపడానికి తామంతా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు వాహన, డెలివరీ సంఘాల జేఏసీ ప్రకటించింది.ఆటో, క్యాబ్, లారీ, ఓలా, ర్యాపిడో, ఉబర్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ తదితర డెలివరీ సేవలు అన్నీ బంద్ చేస్తామని జేఏసీ తెలిపింది.ఇప్పటివరకు చాలాసార్లు తమ సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.