స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

గర్ల్‌ఫ్రెండ్‌పై కోపంతో కరెంట్ స్తంభమెక్కిన ప్రేమికుడు.. సీన్ కట్ చేస్తే..!వైరల్ న్యూస్Swechaa07 Aug 2026, 01:00 PM

గర్ల్‌ఫ్రెండ్‌పై కోపంతో కరెంట్ స్తంభమెక్కిన ప్రేమికుడు.. సీన్ కట్ చేస్తే..!

ప్రేమ వ్యవహారాల్లో చిన్నచిన్న మనస్పర్థలు రావడం సహజమే అయినా, ఆవేశంలో కొందరు చేసే విపరీతమైన పనులు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంటాయి. తాజాగా ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవపడి, ఆగ్రహంతో ఏకంగా అత్యంత ప్రమాదకరమైన విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కి తీవ్ర కలకలం సృష్టించాడు. స్ట్రీట్ లైట్ పోల్ పైభాగానికి చేరుకుని ప్రమాదకర స్థితిలో కూర్చోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఎంత వేడుకున్నా అతడు కిందకు దిగేందుకు నిరాకరించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సర్కారు తప్పు..అధికారులు పదే పదే కోర్టుకు రావడం బాధాకరం : హైకోర్టుతెలంగాణSwechaa07 Aug 2026, 12:56 PM

సర్కారు తప్పు..అధికారులు పదే పదే కోర్టుకు రావడం బాధాకరం : హైకోర్టు

కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాల్సిన రూ.33 కోట్ల బకాయి నిధుల విడుదల వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన హాజరవ్వడం గమనార్హం. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అమలు చేయలేదని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జె.రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

AI Company Offer: హెల్మెట్ పెట్టుకుంటే చాలు.. గంటల వ్యవధిలోనే వేలల్లో జీతం!InternationalSwechaa07 Aug 2026, 12:42 PM

AI Company Offer: హెల్మెట్ పెట్టుకుంటే చాలు.. గంటల వ్యవధిలోనే వేలల్లో జీతం!

తలకి ఒక ప్రత్యేకమైన హెల్మెట్ ధరించి కొన్ని గంటల పాటు కూర్చుంటే చాలు.. వేల రూపాయల నజరానా చెల్లిస్తోంది ఓ ప్రముఖ ఏఐ సంస్థ. మానవ ఆలోచనలను నేరుగా టెక్స్ట్‌గా మార్చే విప్లవాత్మక సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్న శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'కండ్యూట్' (Conduit) అనే ఏఐ స్టార్టప్ ఈ వినూత్న అవకాశాన్ని అందిస్తోంది. ఈ ప్రయోగాల్లో పాల్గొనే వలంటీర్లకు రెండు గంటల సెషన్‌కు ఏకంగా 55 డాలర్లు (దాదాపు రూ. 5,237) ఆఫర్ చేస్తోంది.

పిల్ల చనిపోయిందని.. అక్కాచెల్లెళ్లపై ఎలుగుబంటి దారుణంవైరల్ న్యూస్Swechaa07 Aug 2026, 12:30 PM

పిల్ల చనిపోయిందని.. అక్కాచెల్లెళ్లపై ఎలుగుబంటి దారుణం

పొలం పనులు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న అన్నాచెల్లెళ్లపై ఓ ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా నర్హర్‌పూర్ అటవీ పరిధిలోని ‘లర్‌గావ్-మర్కటోలా’ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గోర్సే జూరి (50), సోదరుడు హలాల్ జూరి (45) పొలం పనులు ముగించుకుని తమ పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి వారి మీద దాడి చేసింది.

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీళ్లు!వైరల్ న్యూస్Swechaa07 Aug 2026, 12:25 PM

గుజరాత్‌లో వింత ఘటన.. బావిలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నీళ్లు!

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విచిత్ర సంఘటన స్థానికులతో పాటు ప్రయాణికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలోని విర్పర్ద గ్రామంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో నీళ్లు కొన్ని రోజులుగా వాటంతట అవే ఉవ్వెత్తున ఎగసిపడుతూ, అలల మాదిరిగా కదులుతుండటం కలకలం రేపింది. అయితే, ప్రజలు భయాందోళన చెందుతున్నట్లుగా ఇది భూకంపానికి సంబంధించిన చర్య కాదని, భూగర్భంలో జరుగుతున్న సహజ సిద్ధమైన ప్రక్రియ వల్లే ఇలా జరుగుతోందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

చైల్డ్ సెక్సువల్ కంటెంట్.. ‘మెటా’కు రూ.4,700 కోట్ల భారీ జరిమానా?InternationalSwechaa07 Aug 2026, 12:18 PM

చైల్డ్ సెక్సువల్ కంటెంట్.. ‘మెటా’కు రూ.4,700 కోట్ల భారీ జరిమానా?

పిల్లలు, టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు వారి భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు ‘మెటా’కు 567 మిలియన్ డాలర్లు అనగా.. భారత కరెన్సీలో సుమారు రూ.4,700 కోట్లకు పైగా భారీ జరిమానా విధిస్తూ ‘న్యూ మెక్సికో’ కోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. న్యూ మెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టోరెజ్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ కేసు విచారణ రెండు దశల్లో సాగింది. ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్ పిల్లల మానసిక ఆరోగ్యానికి కలిగించే హానికరమైన కంటెంట్‌ను దాచిపెడుతోందని..వినియోగదారులను మోసం చేసిందని నిర్దారణకు వచ్చిన మెక్సికో కోర్టు జ్యూరీ మార్చిలోనే మెటాపై 375 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3,100 కోట్ల జరిమానా విధించింది.

ఉత్కంఠకు తెర.. ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు అనుమతి!NationalSwechaa07 Aug 2026, 12:14 PM

ఉత్కంఠకు తెర.. ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ సభకు అనుమతి!

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించతలపెట్టిన 'ఛాత్రోన్ కీ గూంజ్' (విద్యార్థుల గళం) సదస్సుకు ఏర్పడిన ఆటంకాలు ఎట్టకేలకు తొలగిపోయాయి. సభా వేదిక అయిన కేపీ గ్రౌండ్‌కు గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేసి తీవ్ర రాజకీయోత్కంఠకు కారణమైన కాయస్థ పాఠశాల (కేపీ) ట్రస్ట్ గురువారం అర్ధరాత్రి వెనక్కి తగ్గింది. కొన్ని కఠినమైన షరతులతో సభ నిర్వహణకు తిరిగి అనుమతి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

Varuna Yagam: వర్షాల కోసం తెలంగాణ ప్రభుత్వం బిగ్‌ప్లాన్.. ముహూర్తం ఖరారు!తెలంగాణSwechaa07 Aug 2026, 11:49 AM

Varuna Yagam: వర్షాల కోసం తెలంగాణ ప్రభుత్వం బిగ్‌ప్లాన్.. ముహూర్తం ఖరారు!

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా వర్షాలు కురవడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో ‘వరుణ యాగం’ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావం నుంచి విముక్తి కలిగి, కృష్ణా-గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ మహా క్రతువును చేపడుతున్నారు. ఈ మహా యాగ నిర్వహణ బాధ్యతలను యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రముఖ వేద పండితులు, అర్చకులకు అప్పగించారు.

Congress : రాహుల్ గాంధీకి  షాకిచ్చిన సాధువులు..NationalSwechaa07 Aug 2026, 11:36 AM

Congress : రాహుల్ గాంధీకి షాకిచ్చిన సాధువులు..

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి బిగ్‌షాక్ తలిగింది. ఢిల్లీలోని ఆయన ఉంటున్న నివాసాన్ని పలువురు ఆందోళనకారులు ముట్టడించారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే గేట్లు మూసివేయగా.. అక్కడే ఆందోళన కారులు, సాధువులు నిరసనలు తెలిపారు.అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.

మహిళా హోంగార్డుకు వేధింపులు..  గడ్డి పీకలేదని సస్పెండ్!ఏపీSwechaa07 Aug 2026, 11:18 AM

మహిళా హోంగార్డుకు వేధింపులు.. గడ్డి పీకలేదని సస్పెండ్!

మహిళా హోంగార్డుకు ఉన్నతాధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.ఇంట్లో పనులు, బయట పనులు, తాము చెప్పిన పని చేయాల్సిందేనని లేదంటే జాబ్ నుంచి తొలగిస్తామంటూ ఆమెను వేధింపులకు గురిచేసినట్టు తెలుస్తోంది.అనారోగ్య సమస్యల కారణంగా తనకు స్టేషన్ పని అప్పగించాలని కోరినా ఉన్నతాధికారులు వినిపించుకోకుండా తనను సస్పెండ్ చేశారని ఓ బాధిత మహిళా హోంగార్డు ఆరోపించింది.

లోకేష్ నోట పవన్ నామస్మరణ..! అసలు రాజకీయ లెక్క ఏంటి..?ఏపీSwechaa07 Aug 2026, 10:12 AM

లోకేష్ నోట పవన్ నామస్మరణ..! అసలు రాజకీయ లెక్క ఏంటి..?

సందర్భం ఉన్నా.. లేకపోయినా పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్న లోకేష్.. దీని వెనుక అసలు రాజకీయ లెక్క ఏంటి..? టీడీపీ సోషల్ మీడియా ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది..?

పొగాకు ఆకులతో మాంసం రుచి: ఫుడ్ టెక్నాలజీలో సైంటిస్టుల సంచలనం!టాప్ న్యూస్Swechaa07 Aug 2026, 09:54 AM

పొగాకు ఆకులతో మాంసం రుచి: ఫుడ్ టెక్నాలజీలో సైంటిస్టుల సంచలనం!

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్న 'మొక్కల ఆధారిత మాంసం' (ప్లాంట్-బేస్డ్ మీట్) ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుకు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. సాధారణంగా సోయా, బఠాణీ వంటి వాటితో తయారుచేసే కృత్రిమ ఉత్పత్తులు చూడటానికి మాంసంలా ఉన్నప్పటికీ, అసలైన రుచి, రంగు, వాసనను అందించడంలో విఫలమవుతున్నాయి. ఈ లోటును పూరిస్తూ, పొగాకు, లెట్యూస్ వంటి మొక్కల నుంచే మాంసానికి సహజ సిద్ధమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే సరికొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు విజయవంతంగా ఆవిష్కరించారు.

ప్రజలే కొత్త ప్రతిపక్షం.. రాజకీయ వ్యవస్థను మార్చ‌డ‌మే కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యమా..?NationalSwechaa07 Aug 2026, 09:15 AM

ప్రజలే కొత్త ప్రతిపక్షం.. రాజకీయ వ్యవస్థను మార్చ‌డ‌మే కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యమా..?

ఇప్పటి వరకు దేశంలో జరిగిన చాలా ఉద్యమాలు ఒక చట్టం కోసం, ఒక డిమాండ్ కోసం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగాయి. కానీ సీజేపీ మాత్రం సమస్యల మూలాన్ని గుర్తించి మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే ఈ ఉద్యమాన్ని ఇతర రాజకీయ పార్టీలకు భిన్నంగా నిలబెడుతోంది.

Hyderabad: హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ NOCలు.. తెలంగాణలో ఇంటర్ కాలేజీల కుంభకోణం!..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa07 Aug 2026, 09:10 AM

Hyderabad: హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ NOCలు.. తెలంగాణలో ఇంటర్ కాలేజీల కుంభకోణం!..

తెలంగాణలో ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్ ఎన్‌వోసీ వ్యవహారం రోజురోజుకూ మరింత సంచలనంగా మారుతోంది. విద్యార్థుల భద్రతకు అత్యంత కీలకమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసి ప్రభుత్వ వ్యవస్థలను మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతుండగా, మరిన్ని కాలేజీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Ranga Reddy District: నారాయణ.. నారాయణ..ఏమిటీ ‘సర్వే’త‘ర్యామి’ లీలలు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa07 Aug 2026, 09:06 AM

Ranga Reddy District: నారాయణ.. నారాయణ..ఏమిటీ ‘సర్వే’త‘ర్యామి’ లీలలు?

మార్కెట్‌లో రంగారెడ్డి జిల్లా సర్వేయర్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ఏసీబీ అధికారులు కొత్తగా ఈ శాఖపై దృష్టి పెట్టడంతో, ఏడీ శ్రీనివాసులు, మల్టీజోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి చెరో 100 కోట్లకు తక్కువ కాకుండా అక్రమంగా సంపాదించారని తేలింది. కోట్లాది రూపాయల క్యాష్ బెడ్స్ కింద దాచిపెట్టారంటేనే అర్థం చేసుకోండి. వందల కోట్ల ఈ అక్రమ సంపాదన వెనకాల జరిగే తతంగం చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి.

Telangana: సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణతెలంగాణSwechaa06 Aug 2026, 11:12 PM

Telangana: సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ

సైబర్ నేరాలపై తెలంగాణ ఉక్కుపాదం మోపింది. సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన దేశవ్యాప్త 'ప్రగతి' (PRAGATI) సమీక్షలో, సైబర్ నేరాలను అరికట్టడంలో చూపిన పనితీరుకు గాను తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

GOBARdhan Sheme: LPG కష్టాలకు చెక్..! గోబర్ధన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. అసలేంటీ స్కీమ్NationalSwechaa06 Aug 2026, 10:26 PM

GOBARdhan Sheme: LPG కష్టాలకు చెక్..! గోబర్ధన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం.. అసలేంటీ స్కీమ్

కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గోబర్ధన్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎల్పీజీ గ్యాస్ కొరతను అధిగమించే దిశగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ స్థానంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా గోబర్ధన్ పథకానికి ఆమోద ముద్ర వేసింది.

Mohan Bhagwat: దేశద్రోహులు కాదు దేశ భవిత- Gen-Zపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలుNationalSwechaa06 Aug 2026, 09:27 PM

Mohan Bhagwat: దేశద్రోహులు కాదు దేశ భవిత- Gen-Zపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

జెన్ జీని (Gen-Z) ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరసన చేసే జెన్ జీ దేశ ద్రోహులు కాదన్నారు. వారే మన దేశ భవిత అని చెప్పారు. వారి ఆవేదన నిజమైనదే అని అన్నారు. ప్రస్తుత తరం కంటే జెన్ Z, జెన్ ఆల్ఫా నిజాయితీ కలవారు అనేది తన భావన అన్నారు. పెద్దలను ప్రశ్నించని ఇంతకుముందు తరంలా కాకుండా నేటి జెన్ జీ లాజికల్ ఆన్సర్స్ కోరుతున్నారని మోహన్ భగవత్ అన్నారు. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తూ వారితో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.

social media: డీప్‌ఫేక్‌లపై కేంద్రం ఫోకస్.. అమల్లోకి కొత్త నిబంధనలు!..NationalSwechaa06 Aug 2026, 09:02 PM

social media: డీప్‌ఫేక్‌లపై కేంద్రం ఫోకస్.. అమల్లోకి కొత్త నిబంధనలు!..

డీప్‌ఫేక్‌లు, ఏఐతో రూపొందించే తప్పుడు కంటెంట్ దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికల్లో వినియోగదారులను మోసపూరిత కంటెంట్ నుంచి రక్షించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.

The Paradise Teaser: కాకులు తల్వార్ పడితే..జడల్ జమానా షురూసినిమాSwechaa06 Aug 2026, 09:01 PM

The Paradise Teaser: కాకులు తల్వార్ పడితే..జడల్ జమానా షురూ

The Paradise Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్'. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా సినిమాతో నానిని ఊర మాస్ అవతార్ లో చూపించి కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాను ఇచ్చాడు శ్రీకాంత్. ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాతో అంతకుమించి కల్ట్ రోల్ లో చూపించబోతున్నాడు.

బంగారం టార్గెట్ రూ.2 లక్షలు..! డబ్బులుంటే ఇప్పుడే కొనేయాలా..?వ్యాపారంSwechaa06 Aug 2026, 08:05 PM

బంగారం టార్గెట్ రూ.2 లక్షలు..! డబ్బులుంటే ఇప్పుడే కొనేయాలా..?

ఒకప్పుడు రూ.50 వేల బంగారం చాలా ఖరీదని అనుకున్నారు. ఆ తర్వాత రూ.1 లక్ష అసాధ్యమని భావించారు. కానీ మార్కెట్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిని కూడా చూసింది. అందుకే రూ.2 లక్షల లక్ష్యం అసాధ్యం అని చెప్పలేం.

Kamalapur Sarpanch: బెల్ట్ షాపులపై చర్యలు ఏవి? అబ్కారీ శాఖ తీరుపై కమలాపూర్ సర్పంచ్ ఆగ్రహంతెలంగాణSwechaa06 Aug 2026, 06:34 PM

Kamalapur Sarpanch: బెల్ట్ షాపులపై చర్యలు ఏవి? అబ్కారీ శాఖ తీరుపై కమలాపూర్ సర్పంచ్ ఆగ్రహం

అబ్కారీ శాఖ నిర్లక్ష్యపు పనితీరుపై కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, భీంపెళ్ళి సర్పంచ్ వాసాల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ కమలాపూర్ సర్పంచ్ నిరసన తెలిపారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని, అనేక కుటుంబాలు ఆగమవుతున్నాయని, బెల్ట్ షాపులు నిషేధించాలన్న మహిళల అభ్యర్థన మేరకు కమలాపూర్ లో బెల్ట్ షాపులు నిషేధిస్తూ తీర్మానం చేశామన్నారు.

Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. వర్షాకాల అసెంబ్లీకి ముహూర్తం ఖరారు!..ఏపీSwechaa06 Aug 2026, 06:07 PM

Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. వర్షాకాల అసెంబ్లీకి ముహూర్తం ఖరారు!..

రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని కీలక సామాజిక, ఆర్థిక, పరిపాలనా అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి వెల్లడించారు.

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్..అసలు మ్యాటరేంటంటే!సినిమాSwechaa06 Aug 2026, 06:06 PM

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్..అసలు మ్యాటరేంటంటే!

Chiranjeevi: ఈ మధ్య సోషల్ మీడియాలో సినీ తారల గురించి రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. డీప్ ఫేక్ ఫొటోస్, వీడియోస్‌తో ఇబ్బంది పడుతున్నవారూ ఉన్నారు. ఇప్పటికే, సమంత, మృణాల్ ఠాకూర్, శృతి హాసన్, కీర్తి సురేష్ సహా పలువురు హీరోయిన్స్ డీఫ్ ఫేక్ బారిన పడి పోలీసులకి ఫిర్యాదు చేసే వరకూ వెళ్ళారు.

India: భారతీయ ఇంజినీర్ అరుదైన రికార్డు.. సరికొత్త ఆవిష్కరణతో సంచలనం!NationalSwechaa06 Aug 2026, 05:21 PM

India: భారతీయ ఇంజినీర్ అరుదైన రికార్డు.. సరికొత్త ఆవిష్కరణతో సంచలనం!

విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ భారతదేశంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన మొదటి పూర్తి స్వదేశీ ఎంఆర్ఐ స్కాన్ మెషిన్ అందుబాటులోకి తీసుకు వచ్చాడు. న్యూయార్క్‌లోని జీఈ కార్పొరేట్ సంస్థలో హై శాలరీ తీసుకుంటున్న భారతీయ ఇంజినీర్ డాక్టర్ అర్జున్ అరుణాచలం.. పేదలకు ఏదైనా మంచి చేయాలనే లక్ష్యంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి భారత్‌కు వచ్చారు.

Prashanth Neel: ఎన్టీఆర్, అనిల్ కపూర్ కాంబోలో సీన్స్ డ్రాగన్‌కే హైలెట్సినిమాSwechaa06 Aug 2026, 05:19 PM

Prashanth Neel: ఎన్టీఆర్, అనిల్ కపూర్ కాంబోలో సీన్స్ డ్రాగన్‌కే హైలెట్

Prashanth Neel: మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియన్ సినిమా డ్రాగన్. ప్రస్తుతం, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ అండ్ గ్రే కలర్ నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది.

UPI Payments: కేంద్రం సంచలనం.. UPI పేమెంట్స్ పై ఛార్జీల వసూళ్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదంNationalSwechaa06 Aug 2026, 05:16 PM

UPI Payments: కేంద్రం సంచలనం.. UPI పేమెంట్స్ పై ఛార్జీల వసూళ్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై ఛార్జీలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ పై ఛార్జీల వసూళ్ల బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ''పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ 2007'' చట్ట సవరణ బిల్లు లోక్ సభ లో పాస్ అయ్యింది. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లుకు లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. అంటే, ఇకపై ఛార్జీల వసూళ్ల పూర్తి అధికారం బ్యాంకులకు ఇచ్చింది కేంద్రం. లోక్ సభలో పాస్ అయిన ఈ బిల్లును రాజ్యసభకు పంపింది. అక్కడ కూడా ఆమోదం తెలుపనుంది. అనంతరం రాష్ట్రపతి రాజముద్రతో ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి రానుంది.

AI Startup success story : 100 మంది నో చెప్పారు.. కానీ నేడు రూ.38వేల కోట్ల సామ్రాజ్యం!వ్యాపారంSwechaa06 Aug 2026, 02:47 PM

AI Startup success story : 100 మంది నో చెప్పారు.. కానీ నేడు రూ.38వేల కోట్ల సామ్రాజ్యం!

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సరికొత్త విప్లవాలు సృష్టిస్తున్న ఈ రోజుల్లో ఒక స్టార్టప్ ప్రస్థానం వ్యాపార రంగంలో ఆదర్శంగా నిలుస్తోంది. ప్రారంభంలో ఐడియా బాగోలేదని వంద మందికి పైగా ఇన్వెస్టర్లు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినప్పటికీ, వ్యవస్థాపకుడి చెక్కుచెదరని నమ్మకంతో నేడు ఆ కంపెనీ ఏకంగా 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 38,000 కోట్లు) విలువైన దిగ్గజ సంస్థగా రూపాంతరం చెందింది. లండన్ కేంద్రంగా సేవలందిస్తున్న ఏఐ వీడియో క్రియేషన్ ప్లాట్‌ఫామ్ 'సింథీషియా' సాధించిన ఈ అసాధారణ విజయగాథ ప్రతీ నవతరం పారిశ్రామికవేత్తకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది.

FCRA: ఆ కొత్త సవరణ బిల్లుతో భారతీయులకే తీవ్ర నష్టం: శశి థరూర్NationalSwechaa06 Aug 2026, 02:32 PM

FCRA: ఆ కొత్త సవరణ బిల్లుతో భారతీయులకే తీవ్ర నష్టం: శశి థరూర్

కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో పునఃప్రవేశపెట్టిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ బిల్లు-2026 పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విదేశీ నిధుల సమీకరణలో పారదర్శకత పెంచే నెపంతో తీసుకొస్తున్న ఈ సవరణలు, నిజానికి కార్యనిర్వాహక వర్గానికి (ప్రభుత్వానికి) విపరీతమైన, నియంత్రణ లేని చట్టాలను కట్టబెట్టేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రతిపాదిత మార్పులు పారదర్శకతను పెంచకపోగా, దేశంలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సామాజిక సేవా రంగాన్ని దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

School Holidays: స్కూళ్లకు లాంగ్ వీకెండ్.. వరుసగా 3 రోజులు సెలవులు?తెలంగాణSwechaa06 Aug 2026, 02:16 PM

School Holidays: స్కూళ్లకు లాంగ్ వీకెండ్.. వరుసగా 3 రోజులు సెలవులు?

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, విద్యాసంస్థల విద్యార్థులకు ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు లాంగ్ వీకెండ్ సెలవులు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 10 వరకు వరుసగా పాఠశాలలకు విరామం లభించే అవకాశం ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 8వ తేదీన రెండవ శనివారం, ఆగస్టు 9వ తేదీన సాధారణ ఆదివారం కావడంతో ఎలాగూ సెలవులు ఉంటాయి.