స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మనకు జయశంకర్ గురువు.. సీఎంకు చంద్రబాబే గురువు : కేటీఆర్రాజకీయాలుSwechaa06 Aug 2026, 02:04 PM

మనకు జయశంకర్ గురువు.. సీఎంకు చంద్రబాబే గురువు : కేటీఆర్

మనకు ప్రొఫెసర్ జయశంకర్ గురువు అయితే.. సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబే గురువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మరోసారి తల్లడిల్లుతోందని చెప్పారు. నీటి వాటా విషయంలో రాష్ట్రానికి మళ్లీ అన్యాయం చేసేందుకు ఏపీ ప్రయత్నిస్తోందని, కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని ఆడిస్తోందన్నారు. అదే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ పవర్‌లో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నించారు.

తమిళనాడు టు ఢిల్లీ.. రైలులో తల లేని మొండెం ట్రావెల్!(వైరల్)క్రైమ్Swechaa06 Aug 2026, 01:47 PM

తమిళనాడు టు ఢిల్లీ.. రైలులో తల లేని మొండెం ట్రావెల్!(వైరల్)

ఓ నిందితుడు డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కించి ఢిల్లీకి పంపాడు. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఓ ట్రాలీ బ్యాగ్ అనుమానాస్పదంగా కనిపించింది. జనరల్ బోగీలో ఉన్న ఆ బ్యాగ్ నుంచి దుర్వాసన రావడం, రక్తపు మరకలు ఉండటంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆ బ్యాగ్‌ను పరిశీలించగా.. తల, కొన్ని శరీర భాగాలు లేని మృతదేహం లభ్యమైంది. బాడీ అవయవాలకు చుట్టిన పాలిథిన్‌ కవర్‌పై చెన్నైకు సంబంధించిన స్లిప్ ఉండటంతో.. ఆ బాడీ చెన్నైకి చెంది ఉండొచ్చని పోలీసుల అనుమానిస్తున్నారు.

Gold, silver price: షాకింగ్.. ఒక్కరోజులోనే రూ.10వేలు పెరిగిన ధర..!వ్యాపారంSwechaa06 Aug 2026, 01:39 PM

Gold, silver price: షాకింగ్.. ఒక్కరోజులోనే రూ.10వేలు పెరిగిన ధర..!

బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి నేడు కోలుకోలేని భారీ షాక్ తగిలింది. దేశీయంగా బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పసిడి ప్రేమికులు, పండుగలు లేదా శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలని భావించిన సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఈ ఆకస్మిక ధరల పెంపుతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ధరల వివరాల్లోకి వెళితే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా రూ. 2,650 పెరిగింది. ఈ పెంపుతో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,37,250కు చేరుకుంది. అదేవిధంగా, మేలిమి బంగారంగా పిలిచే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 2,890 మేర ఎగబాకింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర మార్కెట్‌లో ప్రస్తుతం రూ. 1,49,730 వద్ద కొనసాగుతోంది.

ఐదుగురు పిల్లలు.. ప్రియుడితో భార్యను పంపించేసిన భర్త (వైరల్)వైరల్ న్యూస్Swechaa06 Aug 2026, 01:21 PM

ఐదుగురు పిల్లలు.. ప్రియుడితో భార్యను పంపించేసిన భర్త (వైరల్)

ఓ భర్త తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఆమె మరల ప్రేమించిన తన ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌ నగర్‌లో జరిగింది. 21 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ జంటకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం కబీర్ నగర్‌కు చెందిన తనకంటే వయసులో 13 ఏళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ప్రేమలో పడింది. అతనితో కలిసి వెళ్లిపోయింది. మరల ఆమె తిరిగి రావడంతో దంపతుల మధ్య తీవ్ర వివాదం నెలకొంది. తను వెళ్లిపోయిన యువకుడితో ఉంటానని భార్య మొండికేయడంతో గ్రామపెద్దల సమక్షంలో ఆ యువకుడికి తన భార్యనిచ్చి అధికారికంగా పెళ్లి జరిపించాడు.

ఏది పడితే అది వాగితే ఊరుకోను.. ఎవరినీ వదిలిపెట్టను : హరీశ్ రావురాజకీయాలుSwechaa06 Aug 2026, 01:04 PM

ఏది పడితే అది వాగితే ఊరుకోను.. ఎవరినీ వదిలిపెట్టను : హరీశ్ రావు

రాష్ట్రంలో వర్షాలు కురవకుండా, అధికారపార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు తాను క్షుద్రపూజలు చేస్తున్నానని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీ యుగంలో రాష్ట్రంలో వర్షాలు పడొద్దని, తాను క్షుద్రపూజలు చేశానని కాంగ్రెస్ నేతలు తనపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు.

Accident: ప్రాణం తీసిన అతివేగం.. విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని విద్యార్థి మృతి!క్రైమ్Swechaa06 Aug 2026, 01:03 PM

Accident: ప్రాణం తీసిన అతివేగం.. విద్యుత్ స్తంభానికి బైక్ ఢీకొని విద్యార్థి మృతి!

సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో ఒక కాలేజీ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన లాల్‌బజార్ నుంచి డైరీ ఫామ్ వెళ్లే ప్రధాన రహదారిపై జరిగింది. లభించిన సమాచారం ప్రకారం.. ఇద్దరు కాలేజీ విద్యార్థులు అపాచీ బైక్‌పై లాల్‌బజార్ వైపు నుంచి డైరీ ఫామ్ దిశగా వెళ్తున్నారు.

Salman khan: సల్మాన్ ఖాన్‌పై ‘బీయింగ్ హ్యూమన్’ ఫ్రాడ్ కేసు.. కోర్టు సమన్లు!టాప్ న్యూస్Swechaa06 Aug 2026, 12:53 PM

Salman khan: సల్మాన్ ఖాన్‌పై ‘బీయింగ్ హ్యూమన్’ ఫ్రాడ్ కేసు.. కోర్టు సమన్లు!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్‌లకు చండీగఢ్ జిల్లా కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 'బీయింగ్ హ్యూమన్' జ్యువెలరీ షోరూమ్ వివాదానికి సంబంధించిన ఒక మోసం కేసులో న్యాయస్థానం వారిద్దరికీ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని స్పష్టం చేస్తూ, వచ్చే అక్టోబర్ 5వ తేదీన కోర్టుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

మంత్రులు చెప్పిన వినని అధికారులు.. ఏం జరుగుతోంది?తెలంగాణSwechaa06 Aug 2026, 12:47 PM

మంత్రులు చెప్పిన వినని అధికారులు.. ఏం జరుగుతోంది?

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఆదేశాలను కొందరు అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇదే తొలిసారి కాదు.. రాష్ట్రంలో పార్ట అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కొందరు మంత్రుల మాటలను పెడచెవిన పెట్టడం, ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్టు సమాచారం.ఎందుకంటే వాళ్లంతా ఒకే దగ్గర ఏళ్లుగా పాతుకుపోయినట్టు కూడా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా అటవీశాఖ మంత్రి కొండా సురేఖ .. ఆదేశాలను అధికారులను పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

lottery: చెత్తలో పారేసిన టికెట్‌కే రూ.10.9 కోట్ల జాక్‌పాట్..! చివరికి ఏమైందంటే?వైరల్ న్యూస్Swechaa06 Aug 2026, 12:31 PM

lottery: చెత్తలో పారేసిన టికెట్‌కే రూ.10.9 కోట్ల జాక్‌పాట్..! చివరికి ఏమైందంటే?

చేతికి అందివచ్చిన మహా అదృష్టం చిన్న పొరపాటు వల్ల చెత్తబుట్ట పాలైనా.. చివరికి దేవుడి దయ వల్ల మళ్లీ ఆ ఇంట్లోనే వాలింది. కోట్ల రూపాయల విలువైన లాటరీ టికెట్‌ను చెత్తలో పారేసి, ఆ తర్వాత.. శ్రమించి దాన్ని వెతికి పట్టుకున్న మున్సిపల్ సిబ్బంది సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటలీలోని బిటోంటో నగరంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

ప్లీజ్ నన్ను తీసుకెళ్లండి.. ఏపీలో హైదరాబాద్ యువతి సూసైడ్!ఏపీSwechaa06 Aug 2026, 12:17 PM

ప్లీజ్ నన్ను తీసుకెళ్లండి.. ఏపీలో హైదరాబాద్ యువతి సూసైడ్!

ఏపీలో మరోదారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఏపీలో తాను చదువుకుంటున్న కాలేజ్ హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని కానూరులో చోటుచేసుకోగా.. స్థానికంగా సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన కంతేటి వైష్ణవి(19).. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కానూరులో గల శ్రీ భారతి ఇన్‌స్టిట్యూట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ సెంటర్‌లో మూడు వారాల కిందట నీట్ శిక్షణ కోసం చేరింది.

TG : ఆగస్టు 15 నుంచి కొత్త  స్మార్ట్ రేషన్ కార్డులుతెలంగాణSwechaa06 Aug 2026, 12:03 PM

TG : ఆగస్టు 15 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సంగారెడ్డి జిల్లా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.

చెవి నొప్పిగా ఉందని వెళితే.. ఏకంగా చెయ్యి పోయింది? (వైరల్)వైరల్ న్యూస్Swechaa06 Aug 2026, 11:42 AM

చెవి నొప్పిగా ఉందని వెళితే.. ఏకంగా చెయ్యి పోయింది? (వైరల్)

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువతి తన చెయ్యిని కోల్పోయింది.చెవి నొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లిన యువతికి అక్కడి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. కానీ అదృష్టవశాత్తు చెయ్యి కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో వెలుగు చూసింది.

బీజేపీలో కొత్త జోష్.. మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులుతెలంగాణSwechaa06 Aug 2026, 11:28 AM

బీజేపీలో కొత్త జోష్.. మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులు

రాష్ట్ర బీజేపీలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల పార్టీలోని కీలక నేతలైన కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ నడుమ వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.తన నియోజకవర్గంలో కేంద్రమంత్రి బండి జోక్యం చేసుకుంటున్నారని, తన వారిని కాదని ఆయన వర్గానికి,అనుచరులకు పదవులు ఇప్పించుకుంటున్నాడని ఈటల రాజేందర్ పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే, కేంద్రంలోని బీజేపీ పెద్దల జోక్యంతో ఇరువురి మధ్య సయోధ్య కుదరడంతో ఇంతకాలం పెండింగులో ఉన్న జిల్లా అధ్యక్ష పోస్టులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.

ఏపీలో దారుణం.. గొడవ పెట్టుకుందని యువతిపై కారు ఎక్కించి!ఏపీSwechaa06 Aug 2026, 10:51 AM

ఏపీలో దారుణం.. గొడవ పెట్టుకుందని యువతిపై కారు ఎక్కించి!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఓ యువతితో గొడవకు దిగారు. అనంతరం ఆమెను వెంబడించి మరీ కారుతో ఢీకొట్టి హతమార్చారు. ఈ ఘటన ఏపీలోని రాజమండ్రిలో చోటుచేసుకోగా గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే.. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంక (28) వెళ్లింది.అయితే, ప్రసాదిత్యా మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు స్వల్ప వాగ్వాదం నెలకొంది.

చిత్రం లేదు
వ్యాపారంSwechaa06 Aug 2026, 10:33 AM

Muse Code: ఏఐ ఆధారిత కోడింగ్ రంగంలోకి మెటా.. కొత్త యాప్ విడుదల!

కృత్రిమ మేధ (AI) సాంకేతికతలో ఆధిపత్యం కోసం టెక్ దిగ్గజాల మధ్య పోటీ తీవ్రమవుతున్న వేళ, మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ల కోసం అత్యంత ఆధునిక ఏఐ కోడింగ్ టూల్ 'మ్యూజ్ కోడ్' (Muse Code) అప్లికేషన్‌ను బుధవారం అధికారికంగా ప్రారంభించింది. ఓపెన్‌ఏఐ, యాంత్రోపిక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చే దిశగా మెటా ఈ అడుగు వేసింది. మానవ ప్రమేయం తక్కువగా ఉంటూనే క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ కోడింగ్, ప్లానింగ్, బగ్స్ సరిదిద్దడం వంటి పనులను ఇది స్వయంప్రతిపత్తితో (Agentic) పూరించగలదు.

Robin Uthappa: ‘వారిలా దారి తప్పొద్దు వైభ‌వ్‌..’ బుడ్డోడికి రాబిన్ ఊతప్ప సూచనలు!క్రీడలుSwechaa06 Aug 2026, 10:21 AM

Robin Uthappa: ‘వారిలా దారి తప్పొద్దు వైభ‌వ్‌..’ బుడ్డోడికి రాబిన్ ఊతప్ప సూచనలు!

15 ఏళ్ల పిన్న వయసులోనే భారత జాతీయ జట్టులో చోటు సంపాదించి, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప కీలక సూచనలు చేశారు. 2026 ఐపీఎల్‌లో అగ్రశ్రేణి స్కోరర్‌గా నిలిచి వార్తల్లో నిలిచిన వైభవ్, ఇటీవలి జింబాబ్వే పర్యటనలో తన నాలుగో మ్యాచ్‌లోనే తొలి అంతర్జాతీయ అర్ధశతకం సాధించి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. అయితే, ఈ వేగవంతమైన ఎదుగుదల క్రమంలో వైభవ్ కెరీర్ దారితప్పకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఊతప్ప అభిప్రాయపడ్డారు.

RSS Chief Mohan Bhagwat: జెన్ Z, జెన్ ఆల్ఫా యువతతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ!NationalSwechaa06 Aug 2026, 10:04 AM

RSS Chief Mohan Bhagwat: జెన్ Z, జెన్ ఆల్ఫా యువతతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ!

ఆర్ఎస్ఎస్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ దేశ భవిష్యత్తుకు నిర్దేశకులైన జెన్ Z (Gen Z), జెన్ ఆల్ఫా తరాలకు చెందిన యువతతో కీలక ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దేశ నిర్మాణం, నాయకత్వ లక్షణాల పెంపొందింపు, ప్రపంచాన్ని ఏకం చేయడంలో భారతదేశ వహిస్తున్న కీలక పాత్ర వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ‘ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (IIMUN)’ సంస్థ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ (NMACC) వేదిక నేడు ఈ సదస్సు ప్రారంభం కానుంది.

Russia: రష్యా సైన్యంలో కీలక మార్పులు.. భారీగా సైనిక దళాల పెంపు!InternationalSwechaa06 Aug 2026, 09:45 AM

Russia: రష్యా సైన్యంలో కీలక మార్పులు.. భారీగా సైనిక దళాల పెంపు!

 రష్యా రక్షణ దళాల సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేసి, సైనిక సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆర్మీలోని కమాండ్, లాజిస్టిక్స్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖలో పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. క్రెమ్లిన్‌లో రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్‌లతో పుతిన్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఈ నియామకాలను అధికారికంగా ప్రకటించారు.

Shocking video: స్టేడియంలో పిడుగుపడి.. యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి!వైరల్ న్యూస్Swechaa06 Aug 2026, 09:27 AM

Shocking video: స్టేడియంలో పిడుగుపడి.. యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి!

థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. మైదానంలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో తీవ్ర విషాదం అలుముకుంది. నరాతివాత్ ప్రావిన్స్‌లోని ప్రసిద్ధ శాంటిపాప్ స్టేడియంలో ‘గోలక్ కప్’ టోర్నమెంట్‌లో భాగంగా లీగ్ మ్యాచ్ కొనసాగుతుండగా ఈ దురదృష్టకర సంఘటన

Bommarasipet land scam: బొమ్మరాసిపేట్‌లో భూ భారతి మాటున  రూ.10 వేల కోట్ల భూ స్కాం!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa06 Aug 2026, 09:14 AM

Bommarasipet land scam: బొమ్మరాసిపేట్‌లో భూ భారతి మాటున రూ.10 వేల కోట్ల భూ స్కాం!

పొజిషన్‌లో ఉండరు. 40 ఏండ్లుగా రెవెన్యూ రికార్డుల్లో కనిపించరు. కానీ తాము 1965లో కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్స్ చూపిస్తారు. 21 మంది చేసుకున్న పార్టిషన్ డీడ్‌తో 1974 భూ సంస్కరణలు వచ్చేంత వరకు పేపర్స్‌తో మాయ చేస్తారు. భూమి గురించి లోతుగా తెలియని పవర్‌లో ఉన్న రాజకీయ నాయకులు, వాళ్లు చెప్పిందే గుడ్డిగా నమ్మి మొత్తానికి మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నారు. బొమ్మరాసిపేట్ భూములతో తొలుబొమ్మలాట ఆడుకుంటూ 1,049 ఎకరాలను ఎలా వాడుకుంటున్నారో స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిన ఆధారాలను మీ ముందు ఉంచుతున్నాం.

Uttam Vs Harish: తప్పుడు ప్రచారం మానుకోండి, బట్ట కాల్చి మీద వేయడమే మీ పని- హరీశ్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్తెలంగాణSwechaa05 Aug 2026, 10:51 PM

Uttam Vs Harish: తప్పుడు ప్రచారం మానుకోండి, బట్ట కాల్చి మీద వేయడమే మీ పని- హరీశ్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి వాటాల విషయంలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హరీశ్ కి హితవు పలికారు. కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయద్దన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. GRMB అజెండాలో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. 12 ఏళ్లుగా ఏపీ అవే అభ్యంతరాలు చెబుతోందన్నారు. సీతారామ ప్రాజెక్టుకు టీఏసీ అనుమతి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు.

దిగొచ్చిన మార్క్ జుకర్ బర్గ్.. భారత ప్రభుత్వానికి క్షమాపణలుInternationalSwechaa05 Aug 2026, 09:30 PM

దిగొచ్చిన మార్క్ జుకర్ బర్గ్.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు

ఫేస్ బుక్ లో ప్రధాని మోదీ వీడియో తాత్కాలిక తొలగింపు వివాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దిగొచ్చాడు. వీడియో తొలగింపు అంశంలో క్షమాపణలు చెప్పాడు. చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్, డీప్ ఫేక్ కంటెంట్ పై ఆయన విచారం వ్యక్తం చేశాడు.

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. గుట్టంతా ఫోన్‌లోనే?క్రైమ్Swechaa05 Aug 2026, 09:13 PM

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. గుట్టంతా ఫోన్‌లోనే?

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఉదయ్ పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆయనను రెండు రోజుల పాటు విచారణ చేసేందుకు ఉప్పరపల్లి కోర్టు ఓకే చెప్పింది. లైంగిక వేధింపుల కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లుNationalSwechaa05 Aug 2026, 09:08 PM

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు

పండుగలు, సెలవుల నేపథ్యంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపిన రైల్వే అధికారులు.. ప్రయాణికులు ముందుగానే తమ టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణానికి ముందు అధికారిక షెడ్యూల్‌ను ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు.

Telangana: ఫలిస్తున్న బిజెపి పెద్దల వ్యూహం.. బండి-ఈటల మధ్య తగ్గిన దూరం!..తెలంగాణSwechaa05 Aug 2026, 09:05 PM

Telangana: ఫలిస్తున్న బిజెపి పెద్దల వ్యూహం.. బండి-ఈటల మధ్య తగ్గిన దూరం!..

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు విభేదాలతో వార్తల్లో నిలిచిన ఇద్దరు కీలక నేతలు.. ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో ఎంపీ ఈటల రాజేందర్ లంచ్ మీటింగ్‌కు హాజరయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Agri Gold Lands: వేలానికి 6వేల ఎకరాల అగ్రిగోల్డ్ భూములు- క్యాబినెట్ సబ్ కమిటీఏపీSwechaa05 Aug 2026, 07:34 PM

Agri Gold Lands: వేలానికి 6వేల ఎకరాల అగ్రిగోల్డ్ భూములు- క్యాబినెట్ సబ్ కమిటీ

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. 6 వేల ఎకరాల అగ్రిగోల్డ్ భూములను వేలానికి సిద్ధం చేశామని, వేలం ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సీఐడీని ఆదేశించామని వెల్లడించింది.

Polymer Currency Notes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వాడకంలోకి వచ్చేది ఎప్పటి నుంచి అంటేNationalSwechaa05 Aug 2026, 07:23 PM

Polymer Currency Notes: ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. వాడకంలోకి వచ్చేది ఎప్పటి నుంచి అంటే

ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. త్వరలోనే అవి వాడకంలోకి వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

UPI Transaction Charges: బాదుడు తప్పదా? యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీల గురించి ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలుNationalSwechaa05 Aug 2026, 04:50 PM

UPI Transaction Charges: బాదుడు తప్పదా? యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీల గురించి ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

మన దేశంలో యూపీఐ ద్వారానే పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాటిపై ఎలాంటి ఛార్జీలు లేవు. ఉచితంగానే పేమెంట్స్ చేసుకుంటున్నారు. అయితే, భవిష్యత్తులో యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీల బాదుడు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ పేమెంట్స్ పై ఫ్యూచర్ లో ఛార్జీలు విధించవచ్చని ఆయన సంకేతం ఇచ్చారు.

Tejaswini Nandamuri: బాలయ్య కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..దర్శకులెవరో తెలుసా?సినిమాSwechaa05 Aug 2026, 04:49 PM

Tejaswini Nandamuri: బాలయ్య కూతురు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ..దర్శకులెవరో తెలుసా?

Tejaswini Nandamuri: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయ నందమూరి తేజస్విని సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వబోతుందా..? ప్రస్తుతం అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో, నందమూరి అభిమానుల్లో బాగా వినిపిస్తోంది. గత కొన్నేళ్ళుగా బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఉంటుందని స్వయంగా బాలయ్యే స్టేజ్ మీద వెల్లడించాడు.

Dial 112: ఇక నుంచి డయల్ 100 కాదు డయల్ 112.. కొత్త ఎమర్జెన్సీ నెంబర్.. ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండితెలంగాణSwechaa05 Aug 2026, 03:48 PM

Dial 112: ఇక నుంచి డయల్ 100 కాదు డయల్ 112.. కొత్త ఎమర్జెన్సీ నెంబర్.. ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి

Dial 112: తెలంగాణలో అత్యవసర సేవలకు కొత్త నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు డయల్ 100 కు కాల్ చేసే వాళ్లు. ఇక నుంచి డయల్ 100 స్థానంలో ఒకే ఒక్క ఎమర్జన్సీ నెంబర్ డయల్ 112 ను అందుబాటులోకి తెచ్చారు. డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక వంటి అన్ని అత్యవసర సేవలకు కోసం డయల్ 112ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రజలంతా ఈ నెంబర్ ను సేవ్ చేసుకోవాలన్నారు. ఇకపై ఒకేసారి 960 కాల్స్ తీసుకునేలా సిస్టమ్ ను అప్ డేట్ చేశారు.