స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

CJP: రాజకీయ పార్టీగా CJP? అభిజీత్ దీప్కే కీలక ప్రకటన.. అదే మా లక్ష్యం..NationalSwechaa05 Aug 2026, 03:12 PM

CJP: రాజకీయ పార్టీగా CJP? అభిజీత్ దీప్కే కీలక ప్రకటన.. అదే మా లక్ష్యం..

CJP: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)ని రాజకీయ పార్టీగా మార్చే అంశంపై ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందించారు. కీలక ప్రకటన చేశారు. కాక్రోచ్ పార్టీని పొలిటికల్ పార్టీగా మార్చే యోచన ప్రస్తుతానికి లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్ గ్రూప్ గానే పని చేస్తామని వెల్లడించారు. దేశంలోని యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటమే తమ పంథా అని తెలిపారు. ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామన్నారు. దేశంలో స్టూడెంట్స్ ఎక్కడ ఉద్యమం చేసినా అండగా ఉంటామని వెల్లడించారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యూహ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభిజీత్ ఈ కీలక ప్రకటన చేశారు.

Dundigal: రహదారి లేని జాగాలే రుద్ర నవీన్ టార్గెట్?తెలంగాణSwechaa05 Aug 2026, 02:42 PM

Dundigal: రహదారి లేని జాగాలే రుద్ర నవీన్ టార్గెట్?

దుండిగల్ మున్సిపాలిటీలోని బౌరంపేట్ గ్రామంలో మరో విల్లా ప్రాజెక్ట్ నిర్మించేందుకు రుద్ర కన్‌స్ట్రక్షన్ ప్రారంభించింది. అయితే దీనికి బౌరంపేట్ గ్రామం నుంచి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. ఇలా అయితే ప్రాజెక్ట్ ముందుకు సాగదని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి 50 ఫీట్లు ప్రైవేట్‌గా రోడ్డు నిర్మాణం చేసుకున్నారు.

కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..? ఉద్యమమా.. రాజకీయమా..?- మ‌రికొద్ది గంట‌ల్లో కీల‌క ప్ర‌క‌ట‌నNationalSwechaa05 Aug 2026, 02:39 PM

కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి..? ఉద్యమమా.. రాజకీయమా..?- మ‌రికొద్ది గంట‌ల్లో కీల‌క ప్ర‌క‌ట‌న

దేశ రాజకీయాల్లో గత రెండు నెలలుగా అత్యంత చర్చనీయాంశంగా మారిన పేరు కాక్రోచ్ జనతా పార్టీ. నీట్ పేపర్ లీక్ వివాదంతో ప్రారంభమైన ఈ ఉద్యమం.. కేవలం విద్యా వ్యవస్థకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా యువత ఆకాంక్ష‌ల‌కు ప్రతీకగా మారింది. కేంద్ర ప్రభుత్వం విద్యా శాఖలో మార్పులు ప్రకటించడం, విద్యాశాఖ మంత్రిని తప్పించడం వంటి పరిణామాల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. కీలక సమావేశంలో కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్ వ్యూహంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకప్పుడు హాట్‌కేక్.. ఇప్పుడు ఖాళీ సీట్లు..! కంప్యూటర్ సైన్స్‌కు ఏమైంది..? ఉన్నత విద్యలో కొత్త ట్రెండ్ మొదలైందా?తెలంగాణSwechaa05 Aug 2026, 02:38 PM

ఒకప్పుడు హాట్‌కేక్.. ఇప్పుడు ఖాళీ సీట్లు..! కంప్యూటర్ సైన్స్‌కు ఏమైంది..? ఉన్నత విద్యలో కొత్త ట్రెండ్ మొదలైందా?

కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి అనేక పనులను ఇప్పుడు AI టూల్స్ వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ పరిస్థితులు విద్యార్థులు, తల్లిదండ్రులను కూడా ఆలోచింపజేస్తున్నాయి. కేవలం కంప్యూటర్ సైన్స్ ఒక్కటే భవిష్యత్తు కాదనే భావన క్రమంగా పెరుగుతోంది.

ప్రైవేట్ కాలేజీలే కనిపిస్తున్నాయా..? ప్రభుత్వ విద్య కనిపించదా ఎమ్మెల్సీ గారూ..? ఇదీ దందానే క‌దా?తెలంగాణSwechaa05 Aug 2026, 02:36 PM

ప్రైవేట్ కాలేజీలే కనిపిస్తున్నాయా..? ప్రభుత్వ విద్య కనిపించదా ఎమ్మెల్సీ గారూ..? ఇదీ దందానే క‌దా?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే కేవలం ఒక హోదా కాదు. లక్షల మంది చదువుకున్న యువతకు ప్రాతినిధ్యం వహించే బాధ్యత. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థలో ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి ప్రశ్నించాల్సిన స్థానం. అలాంటి బాధ్యతలో ఉన్న ఒక ఎమ్మెల్సీ కొత్త దందా షురూ చేశారు. ఆ ఎమ్మెల్సీకి ఇంకా ఏదో కావాలి..? అదేంటి..?

Meenakshi Chaudhary: ముసలి హీరోతో రొమాన్స్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!సినిమాSwechaa05 Aug 2026, 02:35 PM

Meenakshi Chaudhary: ముసలి హీరోతో రొమాన్స్..ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి..ఈ హాట్ భామ ఏ సినిమా చేసినా..సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంటోంది. అయితే, ఈ సారి మాత్రం కాస్త నెగిటివ్‌గా కామెంట్స్ వస్తున్నాయి. దీనికి, కారణం ఎవరూ ఊహించని వయసు మళ్ళిన హీరోతో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే. ఇంతకీ, ఆ ముసలి హీరో ఎవరూ..ఏ భాషలో మీనాక్షి ఇలాంటి సాహసం చేయడానికి ఒప్పుకుంది..పూర్తి కథనంలో చూద్దాం.

TG : ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో 60 లక్షల  ఓట్లు డిలీట్?తెలంగాణSwechaa05 Aug 2026, 02:29 PM

TG : ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో 60 లక్షల ఓట్లు డిలీట్?

తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రకియ పూర్తయ్యే వరకు సుమారు 60 లక్షల ఓట్లు డిలీట్ అయ్యే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, వలసలు పోయిన వారి ఓట్లను అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇళ్లు మారిన ఓటర్ల వివరాలు సేకరించడంలో బీఎల్‌వోలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.ఇక చనిపోయినవారు, డూప్లికేట్‌ ఓట్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడకు పని కోసం వచ్చిన వారికి ఓట్లు ఉంటే వాటిని కూడా గుర్తించి తొలగిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్యూమరేషన్‌ ఫారామ్స్ సమర్పణకు కేవలం ఐదు రోజులే సమయం ఉంది.

Sick Rooms : ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం.. సర్కారీ స్కూల్స్‌లో ‘సిక్ రూమ్స్’ఏపీSwechaa05 Aug 2026, 02:26 PM

Sick Rooms : ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం.. సర్కారీ స్కూల్స్‌లో ‘సిక్ రూమ్స్’

ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల బాగోగుల కోసం పాఠశాలల్లోనే ‘సిక్’ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. సాధారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా పిల్లలు జబ్బు పడుతుంటారు. అలాంటి వారిని ఇంటికి పంపించకుండా స్కూల్లోనే ఏర్పాటు చేసిన సిక్ రూమ్స్‌లో విశ్రాంతి కల్పిస్తారు.అలా చేయడం వలన విద్యార్థులు కాస్త సెట్ అయ్యాక మళ్లీ తరగతి గదిలోకి వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. వారికి అవసరమైన ప్రాథమిక వైద్యం కూడా అందించనున్నారని సమాచారం.

Car Rash Driving: దిల్‌సుఖ్‌ నగర్ రోడ్లపై ఓవర్ స్పీడ్‌తో కారు హల్చల్.. నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ పేరుSwechaa05 Aug 2026, 02:24 PM

Car Rash Driving: దిల్‌సుఖ్‌ నగర్ రోడ్లపై ఓవర్ స్పీడ్‌తో కారు హల్చల్.. నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ పేరు

Car Rash Driving: హైదరాబాద్ దిల్‌సుఖ్‌ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఉన్న ఓ కారు.. ఓవర్ స్పీడ్ తో హల్ చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక అద్దంపై సీఎం రేవంత్ ఫోటో రేడియం స్టిక్కర్ ఉంది. ఆ ఫోటోకి కాస్త పక్కగానే అడ్వకేట్ సింబల్ స్టిక్కర్ కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ పేరును కొందరు పోకిరీలు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యధేచ్చగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి రద్దీ రోడ్డులో స్పీడ్ గా కారు తోలుతూ తోటి వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ మెయిన్ రోడ్ పై 2 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ కారు నడుపుతున్న పోకిరీల డేంజర్ డ్రైవింగ్ బయటపడుతుందని స్థానికులు చెబుతున్నారు.

Pocso Case: తెలంగాణ బాస్కెట్ బాల్ సెక్రటరీ పృథ్వీశ్వర్‌పై పోక్సో కేసుక్రైమ్Swechaa05 Aug 2026, 02:14 PM

Pocso Case: తెలంగాణ బాస్కెట్ బాల్ సెక్రటరీ పృథ్వీశ్వర్‌పై పోక్సో కేసు

Pocso Case: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. బాలికను లైంగికంగా వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదవడంతో పృథ్వీశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 24న అతడిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడని, రంగారెడ్డి జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. పోక్సో కేసు బయటకు రాకుండా కొందరు పెద్దలు మ్యానేజ్ చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. బాధితురాలి తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Trinee IPS : వాళ్లే ప్రపోజ్ చేశారు ఓకే అన్నా.. తప్పేముంది?తెలంగాణSwechaa05 Aug 2026, 01:53 PM

Trinee IPS : వాళ్లే ప్రపోజ్ చేశారు ఓకే అన్నా.. తప్పేముంది?

హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో సహచర ట్రైనీ మహిళ ఐపీఎస్ మీద లైంగికవేధింపులు, దాడి కేసులో అరెస్టు అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో ఆయన షాకింగ్ నిజాలు వెల్లడించినట్టు తెలిసింది. ‘నేను సివిల్స్ సాధించాక నా స్ఫూర్తిదాయక కథనాలు చూసి సోషల్ మీడియాలో వేలమంది అభిమానులుగా మారారు.అందులో కొందరు మహిళలు నాకు ప్రపోజ్ చేస్తే ఓకే చెప్పా.. దాంట్లో తప్పేముంది?’ అని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.

Breaking : హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రయివేటు కాలేజీల హస్తం?టాప్ న్యూస్Swechaa05 Aug 2026, 01:35 PM

Breaking : హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 ప్రయివేటు కాలేజీల హస్తం?

హైదరాబాద్‌లోని కొన్ని ప్రయివేట్ కాలేజీలు భారీ మోసానికి పాల్పడ్డాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి తమ కాలేజీలకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇంటర్ బోర్డుకు సదరు నకిలీ అనుమతి పత్రాలను సమర్పించినట్టు తెలిసింది.. ఈ వ్యవహారం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారింది. హైడ్రా కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీకి గురవ్వగా.. దీని వెనుక ఓ ముఠా హస్తం ఉన్నట్టు సమాచారం. ఈ తతంగం అంతా 8 ప్రముఖ ప్రైవేటు కళాశాలల ఆధ్వర్యంలో నడిచినట్టు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Minister Uttam Kumar Reddy: సీఎంఆర్ వ్యవస్థపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలుతెలంగాణSwechaa04 Aug 2026, 06:19 PM

Minister Uttam Kumar Reddy: సీఎంఆర్ వ్యవస్థపై మంత్రి ఉత్తమ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) వ్యవస్థపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎంఆర్ డిఫాల్టర్లను ముందుగానే గుర్తించేందుకు ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ అమలుపై అధికారులతో మంత్రి చర్చించారు. గత 10-12 ఏళ్ల సీఎంఆర్ కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, మిల్లర్లకు అప్పగించిన నిల్వలు, ప్రభుత్వానికి రావాల్సిన బియ్యంపై సమగ్ర సమీక్ష చేశారు. జిల్లా, సంవత్సరం, మిల్లుల వారీగా సీఎంఆర్ డిఫాల్టర్ల వివరాలు, పెండింగ్ బకాయిలు, రికవరీ పురోగతిపై ప్రత్యేక పరిశీలన చేశారు.

Ayush Funds Misuse: ఆయుష్‌లో రూ.3.50 కోట్ల మందుల కొనుగోళ్లపై విచారణకు ప్రభుత్వం ఆదేశంతెలంగాణSwechaa04 Aug 2026, 04:43 PM

Ayush Funds Misuse: ఆయుష్‌లో రూ.3.50 కోట్ల మందుల కొనుగోళ్లపై విచారణకు ప్రభుత్వం ఆదేశం

ఆయుష్ విభాగంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేసిన ఫిర్యాదు, ముఖ్యమంత్రి కార్యాలయం ఎండార్స్‌మెంట్ ఆధారంగా ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మెమో నెం.2653/E1/2025ను జారీ చేసింది. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఈ అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయుష్ డైరెక్టర్‌ను ప్రభుత్వం కోరింది.

USPC పోరుబాట.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటంతెలంగాణSwechaa04 Aug 2026, 03:58 PM

USPC పోరుబాట.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై దశలవారీ పోరాటం

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ పోరాటం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (USPC) నిర్ణయించింది. మంగళవారం టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యుఎస్ పీసీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో యుఎస్ పీసీ నాయకులు మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, వాటి పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

SWECHAA Exclusive: ఫార్ములా-ఈ రేసుల కుంభకోణం..  ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌పై సంచలన అభియోగాలు!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa04 Aug 2026, 03:49 PM

SWECHAA Exclusive: ఫార్ములా-ఈ రేసుల కుంభకోణం.. ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో కేటీఆర్‌పై సంచలన అభియోగాలు!

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా-ఈ రేసుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా-ఈ రేసుల నిర్వహణ, నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు జరిపిన దర్యాప్తు సంస్థ (ఏసీబీ), మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై సంచలన అభియోగాలతో ముగింపు నివేదికను సేకరించింది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (A1), ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), బీఎల్‌ఎన్ రెడ్డి (A3), గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు (A4), ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్-FEO (A5)లను నిందితులుగా పేర్కొంటూ క్రిమినల్ కుట్ర, నమ్మకద్రోహం, ప్రభుత్వ ధనం దుర్వినియోగం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.

T Fiber: సెప్టెంబర్ 1 నుంచి.. ప్రభుత్వ ఆఫీసులకు టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు- మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలుతెలంగాణSwechaa04 Aug 2026, 03:30 PM

T Fiber: సెప్టెంబర్ 1 నుంచి.. ప్రభుత్వ ఆఫీసులకు టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు- మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు

T Fiber: సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ​గడువులోగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ సేవలు అందించేలా ఏర్పాట్లు చేయాలని టీ ఫైబర్ అధికారులతో చెప్పారు. సెప్టెంబర్ 1 తర్వాత ప్రైవేట్ ఆపరేటర్లకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ నిమిత్తం ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. ​'టీ-స్వాన్' (T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

VIRAL: వలలో చిక్కిన 30 కిలోల భారీ బొచ్చచేప.. నెట్టింట ఫొటోలు వైరల్!వైరల్ న్యూస్Swechaa04 Aug 2026, 12:49 PM

VIRAL: వలలో చిక్కిన 30 కిలోల భారీ బొచ్చచేప.. నెట్టింట ఫొటోలు వైరల్!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయంలో మత్స్యకారుల వలకు సుమారు 30కిలోల బరువున్న భారీ బొచ్చ చేప చిక్కింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ ద్వారా ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా వస్తున్న నిరంతర నీటి ప్రవాహంతో పెద్ద పెద్ద చేపలు మిడ్ మానేరుకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన మత్స్యకారుడు రాజ్‌కుమార్ ఆదివారం వేసిన వలలో ఈ భారీ బొచ్చ చేప పడింది.

Life Partner Expectations: కాబోయే భార్యపై వింత ఆంక్షలు.. సోషల్ మీడియాలో యువకుడి పోస్ట్ తీవ్ర దుమారం!వైరల్ న్యూస్Swechaa04 Aug 2026, 12:20 PM

Life Partner Expectations: కాబోయే భార్యపై వింత ఆంక్షలు.. సోషల్ మీడియాలో యువకుడి పోస్ట్ తీవ్ర దుమారం!

సోషల్ మీడియా మోజులో కొట్టుమిట్టాడుతున్న నేటి యువత, పెళ్లి విషయంలో వాస్తవాలకు దూరంగా కల్పలోకంలో విహరిస్తోంది. జీవిత భాగస్వామి ఎంపిక కోసం సోషల్ మీడియా రీల్స్, ఫిల్టర్లతో కూడిన ఊహాప్రపంచాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ, ఆకాశమే హద్దుగా అంచనాలు పెంచేసుకుంటోంది. రూపురేఖల నుంచి హోదా వరకు అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు అడిగే వింత వింత షరతులు చూస్తుంటే.. వారు కోరుకున్న స్వప్న సుందరులు లేదా మిస్టర్ పర్ఫెక్ట్‌లు దొరకాలంటే ఈ జన్మలో సాధ్యం కాదని, ఇంకో జన్మ ఎత్తాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Listening Tour: సీజేపీ మాస్టర్ ప్లాన్.. నీట్ ఉద్యమం తర్వాత సరికొత్త రాజకీయ వ్యూహం!NationalSwechaa04 Aug 2026, 10:50 AM

Listening Tour: సీజేపీ మాస్టర్ ప్లాన్.. నీట్ ఉద్యమం తర్వాత సరికొత్త రాజకీయ వ్యూహం!

నీట్ పేపర్ లీక్.. అందుకు వ్యతిరేకంగా చేపట్టిన సుదీర్ఘ ఆందోళనల విజయంతో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఊపుమీదుంది. ఇదే ఉత్సాహంతో సరికొత్త రాజకీయ వ్యూహాలకు సద్ధమవుతోంది. తమ పోరాటానికి లభించిన ఆదరణను కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా యువతతో నేరుగా మమేకమయ్యేందుకు 'లిజనింగ్ టూర్' పేరిట ప్రత్యేక పర్యటన చేపడుతున్నట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. భారతదేశంలోని యువత ఆశయాలు, వారి సమస్యలు, ప్రధాన ఆందోళనలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే ఈ దేశవ్యాప్త పర్యటన ముఖ్య ఉద్దేశమని పార్టీ ప్రకటించింది. తమ భవిష్యత్ రాజకీయ, సంస్థాగత కార్యాచరణను ఖరారు చేసేందుకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీజేపీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.

Earthquakes: వెనిజువెలాలో భూకంపాల బీభత్సం.. 6,125కి చేరిన మృతుల సంఖ్య!InternationalSwechaa04 Aug 2026, 10:12 AM

Earthquakes: వెనిజువెలాలో భూకంపాల బీభత్సం.. 6,125కి చేరిన మృతుల సంఖ్య!

వెనిజువెలా(Venezuela)లో జూన్ 24వ తేదీన సంభవించిన భారీ జంట భూకంపాలు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 6,125కి చేరినట్లు నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్జ్ అధికారికంగా ధృవీకరించారు.

Supreme Court: నీట్ విద్యార్థులకు ఊరట.. కేసుల ఎత్తివేతకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!NationalSwechaa04 Aug 2026, 09:06 AM

Supreme Court: నీట్ విద్యార్థులకు ఊరట.. కేసుల ఎత్తివేతకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Manu Bhaker: మాటే మన గుర్తింపు.. యువత ప్రవర్తనపై మను బాకర్ ఆందోళనక్రీడలుSwechaa04 Aug 2026, 08:45 AM

Manu Bhaker: మాటే మన గుర్తింపు.. యువత ప్రవర్తనపై మను బాకర్ ఆందోళన

ప్రస్తుత సమాజంలో అనుచిత పదజాలం మాట్లాడటాన్ని ఒక 'ట్రెండ్' లేదా 'కూల్'గా భావించే ధోరణి పెరిగిపోతుండటంపై భారత ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మను బాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో కొందరు విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదమైన వేళ ఆమె సోషల్ మీడి

BJP Lost: మూడు చోట్ల పోటీ.. రెండు చోట్ల ఓటమి.. అధికారంలో ఉండి కూడా.. బీజేపీకి వార్నింగ్ బెల్స్రాజకీయాలుSwechaa03 Aug 2026, 08:00 PM

BJP Lost: మూడు చోట్ల పోటీ.. రెండు చోట్ల ఓటమి.. అధికారంలో ఉండి కూడా.. బీజేపీకి వార్నింగ్ బెల్స్

మూడు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓటమి ఎదురైంది. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండి కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ పరిణామం ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. అసలు బీజేపీకి ఎందుకు పరాభవం ఎదురైంది అన్న విశ్లేషణ మొదలైంది. ఇవాళ మూడు రాష్ట్రాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి.

AI Impact: ఏఐ ఎఫెక్ట్.. 2లక్షల నుంచి 40వేలకు పడిపోయిన జీతం.. ఓ కాపీ రైటర్ మనోవేదనవైరల్ న్యూస్Swechaa03 Aug 2026, 06:34 PM

AI Impact: ఏఐ ఎఫెక్ట్.. 2లక్షల నుంచి 40వేలకు పడిపోయిన జీతం.. ఓ కాపీ రైటర్ మనోవేదన

నాణెనికి రెండు వైపులు ఉన్నట్లు.. ఏఐ రాకతో లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయి. ఈ సాంకేతిక విప్లవం ఉద్యోగ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. ఏఐ రాకతో లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోవాల్సి వస్తోందనే భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది నిజమే అనేలా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ కాపీ రైటర్ పై ఏఐ తీవ్రమైన ప్రభావమే చూపింది. అతడి జీవితమే తలకిందులైపోయింది. ఏఐ రాకముందు అతడి నెల సంపాదన 2లక్షలుగా ఉండేది. ఏఐ వచ్చాక అతడి సంపాదన 40వేలకు పడిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా కాపీ రైటర్ చెప్పుకుని తీవ్ర ఆవేదన చెందాడు.

Prashant Kishor: బీజేపీకి బిగ్ షాక్.. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయంNationalSwechaa03 Aug 2026, 05:21 PM

Prashant Kishor: బీజేపీకి బిగ్ షాక్.. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం

Prashant Kishor: బిహార్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కమలం కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం సాధించారు. బిహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20వేల ఓట్లకుపైగా మెజార్టీతో ప్రశాంత్ కిశోర్ విజయం సాధించారు.

Congress Mla: 7 రోజుల్లో రూ.450 కోట్ల అప్పు క్లియర్.. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్రమార్జన చూసి సొంత పార్టీ నేతలు షాక్తెలంగాణSwechaa03 Aug 2026, 03:57 PM

Congress Mla: 7 రోజుల్లో రూ.450 కోట్ల అప్పు క్లియర్.. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్రమార్జన చూసి సొంత పార్టీ నేతలు షాక్

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కేవలం వారం రోజుల్లోనే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయల అప్పు క్లియర్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రజాప్రతినిధి అక్రమార్జన చూసి సొంత పార్టీ నేతలే షాక్ అవుతున్నారు. గెలిచిన ఏడాదిన్నరలోపే రూ. 450 కోట్లకు పైగా అప్పులను అవలీలగా చెల్లించిన వైనం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

చిత్రం లేదు
వ్యాపారంSwechaa03 Aug 2026, 01:38 PM

JioTag 2: రూ.1,249కే జియో సరికొత్త ఆవిష్కరణ!

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ సరికొత్త స్మార్ట్ ట్రాకింగ్ డివైజ్ ‘జియోట్యాగ్ 2’ (JioTag 2)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే క్రాస్ ప్లాట్‌ఫామ్ ఫీచర్‌తో లభిస్తున్న ఈ పరికరం సరసమైన ధరకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్?: ప్రయాణికులకు షాక్.. వైరల్ వార్తలపై స్పందించిన రైల్వే!NationalSwechaa03 Aug 2026, 12:51 PM

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్?: ప్రయాణికులకు షాక్.. వైరల్ వార్తలపై స్పందించిన రైల్వే!

విశాఖపట్నం నుంచి బెంగళూరు మార్గంలో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై దక్షిణ కోస్తా రైల్వే అధికారులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, రూట్ మ్యాప్, టైమ్‌టేబుల్స్ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

Subhadeep Ghosh: కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘో టీమిండియాలో కీలక మార్పుక్రీడలుSwechaa03 Aug 2026, 12:31 PM

Subhadeep Ghosh: కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘో టీమిండియాలో కీలక మార్పు

శ్రీలంకతో జరగనున్న కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టు సహాయక సిబ్బందిలో ముఖ్యమైన మార్పులు చేసింది. టీమిండియా నూతన ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్‌ను నియమించగా, ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న టి.దిలీప్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి గాలె వేది