స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Hyderabad: గాలిలో విషవాయువులు.. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వాలు.. ఇంకెంత కాలం ఈ నరకం?..అభిప్రాయంSwechaa31 Oct 2026, 08:20 PM

Hyderabad: గాలిలో విషవాయువులు.. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వాలు.. ఇంకెంత కాలం ఈ నరకం?..

హైదరాబాద్‌ జవహర్‌నగర్‌ డంప్‌యార్డ్.. ప్రజల ఆరోగ్యానికి శాపంగా మారింది! ప్రపంచంలో అత్యధిక మీథేన్‌ ఉద్గారాలు వెలువరిస్తున్న వ్యర్థ కేంద్రాల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది. భూగర్భ జలాల కాలుష్యం, స్థానికుల అనారోగ్య సమస్యలు, చెత్త నుంచి వెలువడే విషపదార్థాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా శాశ్వత పరిష్కారం లభించలేదు.

మా సమస్యలు పరిష్కారం అయ్యేలా, న్యాయం జరిగేలా చూడండి- స్వేచ్ఛ న్యూస్‌కు నిమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విన్నపంతెలంగాణSwechaa31 Oct 2026, 08:05 PM

మా సమస్యలు పరిష్కారం అయ్యేలా, న్యాయం జరిగేలా చూడండి- స్వేచ్ఛ న్యూస్‌కు నిమ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విన్నపం

NIMS: హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సమస్యల గురించి, తమకు జరుగుతున్న అన్యాయం గురించి, నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి గురించి స్వేచ్ఛ న్యూస్ కు తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా, తమకు న్యాయం జరిగేలా దారి చూపిస్తారని ఆశిస్తూ వినతిపత్రం అందజేశారు.

నిమ్స్ కాంట్రాక్ట్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దొరికే విధంగా చూడాలని కోరారు. నిమ్స్ లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, అన్యాయాలను, అక్రమ నియామకాలను, అవినీతిపరుల గురించి వివరించే ప్రయత్నం చేశారు.

AP: రాప్తాడులో ఉన్మాదం.. రంపంతో విద్యార్థినిపై దాడి.. ప్రభుత్వం సీరియస్‌!ఏపీSwechaa31 Oct 2026, 07:59 PM

AP: రాప్తాడులో ఉన్మాదం.. రంపంతో విద్యార్థినిపై దాడి.. ప్రభుత్వం సీరియస్‌!

AP: బడి గదిలో పిల్లలంతా శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఇంతలోనే చేతిలో రంపం పట్టుకుని ఓ వ్యక్తి లోపలికి దూసుకొచ్చాడు. కళ్లముందేం జరుగుతోందో టీచర్, తోటి పిల్లలు తెలుసుకునేలోపే.. టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థినిపై విచక్షణ లేకుండా రంపంతో దాడికి దిగాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది.రాప్తాడు హైస్కూల్‌లో ఎప్పటిలాగే క్లాసులు నడుస్తున్నాయి. పదో తరగతి గదిలో టీచర్ లెక్కల పాఠం చెబుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు మెషీన్ రంపంతో నేరుగా క్లాస్‌రూమ్‌లోకి చొరబడ్డాడు. బెంచీపై కూర్చున్న ఆ బాలిక వద్దకు వెళ్లి తల, ముఖం, వీపుపై రంపంతో కోసేశాడు. అడ్డుకోబోయిన మరో అమ్మాయికి కూడా గాయాలయ్యాయి. "నేను బోర్డు వైపు తిరిగి పాఠం చెబుతున్నాను.. అప్పుడే ఓ వ్యక్తి లోపలికి వచ్చి దాడి చేశాడు. కళ్లముందు అంత రక్తం చూసి బిత్తరపోయాను, అసలేం జరుగుతుందో తోచలేదు" అంటూ ఆ క్లాస్ టీచర్ భయంతో వణికిపోతూ చెప్పారు. తోటి విద్యార్థులు, టీచర్లు పెద్దగా కేకలు వేయడంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Trivikram: వెంకటేష్ లాంటి హీరోతో ఇలాంటి సినిమా తీస్తారా?సినిమాSwechaa31 Oct 2026, 07:44 PM

Trivikram: వెంకటేష్ లాంటి హీరోతో ఇలాంటి సినిమా తీస్తారా?

Trivikram: నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలను చూస్తే ఠక్కున గుర్తొచ్చేది ముందు వెంకటేష్..తర్వాత దర్శకరచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ రెండు సినిమాలకి ఆయన కథ-మాటలు అందించారు. దానికి, వెంకీ కామెడీ టైమింగ్, పర్ఫార్మెన్స్‌తో హిట్ కొట్టాడు. అప్పటి నుంచి త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ హీరోగా సినిమాలు ఎప్పుడు వస్తుందో..అని ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూశారు. ఎట్టకేలకి ఆ కోరిక ఆదర్శకుటుంబంతో తీరింది. కానీ, ఇక్కడే గురూజీ ఊహించని ఫ్లాప్ ఇచ్చాడు.

ప్రభుత్వం క్రాప్‌ హాలిడేపై మంత్రి తుమ్మల క్లారిటీతెలంగాణSwechaa31 Oct 2026, 07:09 PM

ప్రభుత్వం క్రాప్‌ హాలిడేపై మంత్రి తుమ్మల క్లారిటీ

ప్రభుత్వం క్రాప్‌ హాలిడే ప్రకటించిందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడేను ప్రకటించలేదన్నారు. ప్రస్తుతం ఎల్‌ నినో తీవ్రంగా ఉందని దానిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను సబ్సిడీలో అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Nayanathara: ఇప్పటికీ పద్ధతి మార్చుకోని నయనతార?సినిమాSwechaa31 Oct 2026, 06:21 PM

Nayanathara: ఇప్పటికీ పద్ధతి మార్చుకోని నయనతార?

Nayanathara: సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది నయనతార. తమిళంలో, తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందికుంటోంది. అంతేకాదు, బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నయన్..అక్కడ కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే, నయన్ విషయంలో మేకర్స్ నుంచి ఎప్పుడూ ఓ కంప్లైంట్ వస్తోంది. అదే, సినిమా ప్రమోషన్స్‌కి రాదు అని.

అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డితెలంగాణSwechaa31 Oct 2026, 06:15 PM

అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి

Harish Rao: అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అబద్ధానికి డ్రెస్ వేస్తే రేవంత్ లెక్క ఉంటుదన్నారు. అసత్యాల్లో రేవంత్ రెడ్డికి ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. మంచిరేవుల భూములపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను బీఆర్ఎస్ కాపాడితే.. రేవంత్ రెడ్డి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆ భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే మంచిరేవుల భూములు ప్రభుత్వానికి దక్కాయని తెలిపారు. కానీ, మంచిరేవుల భూములను కాపాడినట్లు రేవంత్ అబద్దాలాడారని హరీశ్ రావు ఆరోపించారు.

Telangana Politics: ఓట్ల వేళ మర్డర్ పాలిటిక్స్.. కామ్రేడ్లను టార్గెట్ చేస్తోందెవరు?తెలంగాణSwechaa31 Oct 2026, 05:29 PM

Telangana Politics: ఓట్ల వేళ మర్డర్ పాలిటిక్స్.. కామ్రేడ్లను టార్గెట్ చేస్తోందెవరు?

Telangana Politics: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల నగారా మోగిన ప్రతిసారీ పాత హత్యల తాలూకు వివాదాలు తెరపైకి రావడం చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఎర్రజెండాకు కంచుకోటగా నిలిచిన ఈ ప్రాంతంలో, కీలక ఎన్నికలు వచ్చినప్పుడల్లా సీపీఎం నాయకత్వాన్ని టార్గెట్ చేయడం, మర్డర్ కేసుల దర్యాప్తు పేరుతో వారిపై ఒత్తిడి పెంచి లొంగదీసుకోవడం అధికార పార్టీలకు ఒక అలవాటుగా మారిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు మునుగోడు ఉపఎన్నిక సమయంలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాన్నే, ఇప్పుడు అధికార కాంగ్రెస్ కూడా అమలు చేస్తోందా అన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ప్రస్తుత తరుణంలో, ఏడాది క్రితం నాటి హత్య కేసును పోలీసులు తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు రాజకీయ సూత్రధారులు ఎవరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్క బిల్డర్ సంతోషం కోసం 2వేల ఇళ్లు కూలుస్తారా?తెలంగాణSwechaa31 Oct 2026, 04:45 PM

ఒక్క బిల్డర్ సంతోషం కోసం 2వేల ఇళ్లు కూలుస్తారా?

Harish Rao: రాష్ట్రాన్ని పాలించే రక్షకుడే భక్షకుడిగా మారిపోయాడు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఒక్క బిల్డర్‌ను సంతోషపెట్టడం కోసం 2వేల అపార్ట్‌మెంట్లలో ఉండే 4వేల కుటుంబాలు, 5వేల మంది ప్రజల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక్క అపార్ట్‌మెంట్ కట్టుకోవడానికి ప్రజలకు చెందిన ఇన్ని అపార్ట్‌మెంట్లు కూల్చాలా? అని ప్రశ్నించారు. నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు హరీశ్ రావు. ఈ మార్పు వల్ల 4వేల కుటుంబాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు.

KCR: కేసీఆర్ రీ-ఎంట్రీ ప్లాన్ ఫిక్స్ అయ్యిందా.. కేటీఆర్ ప్రకటన వెనుక అసలు స్కెచ్ ఇదేనా?తెలంగాణSwechaa31 Oct 2026, 04:05 PM

KCR: కేసీఆర్ రీ-ఎంట్రీ ప్లాన్ ఫిక్స్ అయ్యిందా.. కేటీఆర్ ప్రకటన వెనుక అసలు స్కెచ్ ఇదేనా?

KCR: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారా? గులాబీ బాస్ సెకండ్ ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో సంచనాలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతారని, దేశ రాజకీయాలను శాసించేలా కీలక పాత్ర పోషిస్తారంటూ కేటీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై అధికార కాంగ్రెస్‌పై పోరాడుతున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి మహారాష్ట్ర, పంజాబ్, యూపీ వంటి రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత జాతీయ బాటను పూర్తిగా పక్కన పెట్టేశారు.

రేవంత్ సర్కారును వణికిస్తున్న ‘కర్ణాటక’ రిజల్ట్స్..!టాప్ న్యూస్Swechaa31 Oct 2026, 03:33 PM

రేవంత్ సర్కారును వణికిస్తున్న ‘కర్ణాటక’ రిజల్ట్స్..!

త్వరలో రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది.ఈ ఎన్నికల్లో కర్ణాటక జరిగిన విధంగానే ఓటమి ఎదురు అవుతుందని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతున్నట్టు సమాచారం. కర్ణాటకలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘బీజేపీ-జేడీఎస్’ కూటమి మొత్తం నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో మూడు బీజేపీ గెలుచుకోగా.. జేడీఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి కూడా గెలుచుకోలేదు. దీనికి కర్ణాటక ప్రభుత్వంపై గల ప్రజావ్యతిరేకతే కారణమని చర్చ జరుగుతోంది.

నీటి ఎద్దడి నివారణకు రూ.120కోట్లు విడుదల.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!తెలంగాణSwechaa31 Oct 2026, 03:23 PM

నీటి ఎద్దడి నివారణకు రూ.120కోట్లు విడుదల.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

 ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ తాగునీటి సౌకర్యాల కల్పనకు భారీగా ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 'సింగూరు' ప్రాజెక్టు ఆధారిత ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాలు తీర్చడానికి రూ.120 కోట్లను కేటాయించినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.

TG: హైదరాబాద్‌కు నీటి గండం.. రోజుకు 10 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నా తీరని దాహం!తెలంగాణSwechaa31 Oct 2026, 03:02 PM

TG: హైదరాబాద్‌కు నీటి గండం.. రోజుకు 10 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నా తీరని దాహం!

గ్రేటర్ హైదరాబాద్‌ను మునుపెన్నడూ లేని విధంగా నీటి సంక్షోభం వెంటాడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, ఎండల తీవ్రతతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో నగరవాసులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని దాదాపు 25 కీలక ప్రాంతాల్లో బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో ప్రజలు జలమండలి వాటర్ ట్యాంకర్ల మీదే ఆధారపడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నగరంలో రోజుకు 10 వేల నుంచి 12 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయని వాటర్ బోర్డు అధికారులు చెబుతుండటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

అండాల దందా.. నగరంలో మరో 18 మంది యువతులు అరెస్టుతెలంగాణSwechaa31 Oct 2026, 02:52 PM

అండాల దందా.. నగరంలో మరో 18 మంది యువతులు అరెస్టు

యువతులకు డబ్బులు ఎరగా వేసి అక్రమంగా అండాలు సేకరించి డబ్బులు సంపాదిస్తున్న మరో ముఠాగుట్టు రట్టయ్యింది. నిన్న బేగంపేట ఘటన మరువకముందే తాజాగా సరూర్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో యువతుల నుంచి అండాలు సేకరిస్తున్న అక్రమార్కులను పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాలేజీ స్టూడెంట్స్‌ను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్న అండాల విక్రయ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో సరూర్ నగర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో ఉన్న 18 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీ విద్యార్థినులు, నిరుపేద యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దందా నడుపుతున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి పెద్ద మొత్తంలో డబ్బుల ఆశ చూపి, ఇంజెక్షన్లు ఇచ్చి అండాలను సేకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

బంగారం ఒకేరోజు రూ.4,000 డౌన్.. దీపావళి నాటికి రూ.లక్ష దిగువకు చేరుతుందా?వ్యాపారంSwechaa31 Oct 2026, 01:47 PM

బంగారం ఒకేరోజు రూ.4,000 డౌన్.. దీపావళి నాటికి రూ.లక్ష దిగువకు చేరుతుందా?

 భారతీయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనివిధంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. శనివారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.4,000 వరకు ధర తగ్గగా, వెండి ధర సైతం రూ.10,000 వరకు పడిపోయింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టడం ఆభరణాల కొనుగోలుదారులు, సామాన్యులకు ఎంతో ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఊహించని పరిణామాలు, ముడిచమురు (క్రూడ్ ఆయిల్) ధరల మందగమనం, అమెరికా డాలర్ బలపడటం వంటి ప్రధాన కారణాల వల్ల బంగారం ధరలు భారీగా దిగివచ్చినట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర.. 72 టీఎంసీల నీటిని ఎత్తుకెళ్లిన ఏపీతెలంగాణSwechaa31 Oct 2026, 01:42 PM

రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర.. 72 టీఎంసీల నీటిని ఎత్తుకెళ్లిన ఏపీ

తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదీ జలాల వివాదంపై కేఆర్ఎంబీ ట్రిబ్యునల్‌లో ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో చేసుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని పక్కనబెట్టి నదీ పరివాహాక ప్రాంతం తమ వద్ద ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని, పెరిగిన ఆయకట్టు, తాగు నీటి అవసరాల నిమిత్తం కేటాయింపులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అందుకు మోకాలడ్డుతోంది. తమ వద్ద ప్రాజెక్టులు, నీటి వినియోగం పెరిగినందున ప్రస్తుతం ఉన్న నీటి కేటాయింపులనే కొనసాగించాలని కృష్టా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎదుట ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారు.

కోర్టు ఆదేశాలనూ లెక్కచేయని హైడ్రా.. రామంతపూర్‌లో ఇల్లు కూల్చివేత!తెలంగాణSwechaa31 Oct 2026, 01:19 PM

కోర్టు ఆదేశాలనూ లెక్కచేయని హైడ్రా.. రామంతపూర్‌లో ఇల్లు కూల్చివేత!

 హైదరాబాద్ నగరంలో హైడ్రా (HYDRAA) తన కూల్చివేతల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా శనివారం నగరంలోని రామాంతాపూర్ ప్రాంతంలో హైడ్రా అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. స్థానిక చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం (FTL) పరిధిలో అక్రమంగా నిర్మించారనే ఆరోపణలతో ఓ ఇంటిని అధికారులు నేలమట్టం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూల్చివేతకు గురైన ఇంటి యజమాని మీడియా ముందు తన ఆవేదనను వెల్లబోసుకున్నాడు. కోర్టు ఇచ్చిన 'స్టేటస్ కో' (Status Quo) ఆదేశాలను సైతం అధికారులు లెక్కచేయకుండా ఈ కూల్చివేతలకు పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు.

ఇందిరా గాంధీ వర్ధంతి.. జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ!NationalSwechaa31 Oct 2026, 01:01 PM

ఇందిరా గాంధీ వర్ధంతి.. జ్ఞాపకాలను నెమరువేసుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ!

 భారతదేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆమెతో గడిపిన మధుర బాల్య జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు. తమ నాయనమ్మతో కలిసి ఉన్న అరుదైన చిన్ననాటి ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టులు పెట్టారు. రాహుల్ గాంధీ తన 'దాదీ' (నాయనమ్మ) ఇందిరా గాంధీ ఒడిలో కూర్చుని, ఆమె చేతులు పట్టుకుని యజుర్వేదంలోని శాంతి మంత్రం విన్న క్షణాలను గుర్తుచేసుకున్నారు.

సీఎం ఒమర్ అబ్దుల్లా కుర్చీకి గండం..ఉండేనా? ఊడేనా?NationalSwechaa31 Oct 2026, 12:49 PM

సీఎం ఒమర్ అబ్దుల్లా కుర్చీకి గండం..ఉండేనా? ఊడేనా?

జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది.సీఎం ఒమర్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యి తీర్మానం సైతం చేసుకున్నట్టు సమాచారం. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తమ మీద కొందరు సీనియర్ల పెత్తనం ఎక్కువ అయ్యిందని.. సమస్యలు విన్నవించేందుకు వెళితే అధిష్టానం పట్టించుకోవడం లేదని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)లోని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఒమర్ అబ్దుల్లా సర్కారుపై సొంత ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరేసే క్రమంలో ఉన్నట్టు తెలియడంతో ముఖ్యమంత్రి ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్న 24 మంది ఎమ్మెల్యేలు.. సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం పంపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం శ్రీనగర్‌లోని NC ఎమ్మెల్యే ఖైజర్ జంషీద్‌లోన్ నివాసంలో 19 మంది ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. అనంతరం సీఎంకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

బద్ధలైన మయోన్ అగ్నిపర్వతం.. 3 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద మేఘాలు!InternationalSwechaa31 Oct 2026, 12:47 PM

బద్ధలైన మయోన్ అగ్నిపర్వతం.. 3 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద మేఘాలు!

 పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్‌ దేశంలో ఒకేసారి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన మయోన్ అగ్నిపర్వతం (Mount Mayon) ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. సుమారు ఆరు నిమిషాల పాటు భీకర శబ్దాలతో సాగిన ఈ పేలుడు కారణంగా అగ్నిపర్వతం నుంచి వెలువడిన నల్లటి పొగ, రాళ్లు, దట్టమైన బూడిద మేఘాలు ఆకాశంలోకి ఏకంగా 3 కిలోమీటర్ల (దాదాపు 10 వేల అడుగులు) ఎత్తుకు ఎగసిపడ్డాయి. గాలుల తీవ్రత వల్ల ఈ బూడిద మేఘాలు నైరుతి దిశగా వేగంగా పయనిస్తూ సమీపంలో ఉన్న జనావాసాలను కప్పేస్తున్నాయి.

Pooja Hegde: ఆ మూడు సినిమాలలోనే ఉన్న బుట్టబొమ్మ భవిష్యత్తు!సినిమాSwechaa31 Oct 2026, 12:39 PM

Pooja Hegde: ఆ మూడు సినిమాలలోనే ఉన్న బుట్టబొమ్మ భవిష్యత్తు!

Pooja Hegde: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో పూజా హెగ్డే కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉందా.! అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు తెలుగులో ఈమె క్రేజీ బ్యూటీ. వరుసగా భారీ చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇప్పుడు పోటీ ఎక్కువవడంతో పాటు వరుస ఫ్లాప్స్ కూడా రావడంతో తెలుగుతో పాటు మిగతా భాషలలోనూ అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం, చేతిలో 3 సినిమాలే పూజా కెరీర్‌ను కాపాడేది.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి : కేటీఆర్తెలంగాణSwechaa31 Oct 2026, 12:25 PM

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి : కేటీఆర్

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు (PSU), ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి ఆస్తులని పేర్కొన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణ, తక్కువ విలువకు సంస్థ వాటాలను కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఐడీబీఐ బ్యాంక్ విలువను తగ్గించి చూపిస్తున్నట్టు వస్తున్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

సముద్ర గర్భంలో సైలెంట్ అటాక్.. లింపెట్ మైన్లతో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి!InternationalSwechaa31 Oct 2026, 12:22 PM

సముద్ర గర్భంలో సైలెంట్ అటాక్.. లింపెట్ మైన్లతో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి!

హార్ముజ్ జలసంధిలో మరో ప్రమాదకర పరిణామం చోటు చేసుకుంది. 27 మంది భారతీయ సిబ్బంది ఉన్న పనామా జెండాతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్‌పై లింపెట్ మైన్లతో దాడి జరిగినట్లు సమాచారం. రెండు పేలుడు పరికరాలు నౌకకు అమర్చడంతో ఇంజిన్ గదిలో పేలుళ్లు జరిగి మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో లింపెట్ మైన్లు అంటే ఏమిటి? అనే చర్చ మొదలైంది.

‘వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తు... స్వేచ్ఛగా ఆడనివ్వండి’: శ్రీలంక దిగ్గజంక్రీడలుSwechaa31 Oct 2026, 12:12 PM

‘వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తు... స్వేచ్ఛగా ఆడనివ్వండి’: శ్రీలంక దిగ్గజం

శ్రీలంక క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య భారత యువ క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక అద్భుతమైన పెట్టుబడి అని ఆయన అభివర్ణించారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జయసూర్య ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అయితే అతడిలో ఉన్న అపారమైన ప్రతిభ, దూకుడైన బ్యాటింగ్ శైలి ఇప్పటికే ప్రత్యేకంగా నిలుస్తున్నాయని జయసూర్య పేర్కొన్నారు.

మురుగు నీరే పంటలకు సాగు నీరైంది..!తెలంగాణSwechaa31 Oct 2026, 11:43 AM

మురుగు నీరే పంటలకు సాగు నీరైంది..!

రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆగం అవుతున్నారు. చేతికొచ్చిన పంట నీరు లేక ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. దీంతో మురుగు నీటిని మోటార్లు పెట్టి మరీ పొలాలకు మళ్లిస్తున్నారు. అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం మరింత దయనీయంగా తయారైంది. ఓ వైపు వర్షాలు లేక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అల్లాడుతున్నారు. పంట కోతకు రాకముందే ఎండిపోతుండటంతో పెట్టుబడి కూడా రావడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రంలో నదులు పారుతున్నా పంటలకు నీళ్లివ్వలేని దుస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగు నీటి కష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే జిల్లా నుంచి కృష్ణా, తుంగభద్ర నదులున్నా పారుతున్నా పంటలకు నీరు అందడం లేదని, తమను ప్రభుత్వం ఆదుకోవడం లేదని మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా రైతులకు సైతం నీళ్లివ్వకుండా గోస పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కార్తీక మాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్, కోడిగుడ్ల ధరలు!తెలంగాణSwechaa31 Oct 2026, 11:16 AM

కార్తీక మాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్, కోడిగుడ్ల ధరలు!

  తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియులకు ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతూ కిలో రూ.300 మార్కు వరకు పలికిన చికెన్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసం సమీపిస్తుండటం, మార్కెట్‌లో కోడిమాంసానికి డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో వ్యాపారులు ధరలను భారీగా తగ్గించారు. ప్రస్తుతం మార్కెట్‌లో చికెన్ ధరలు కిలో రూ.250 పరిధికి చేరుకోవడం వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తోంది. స్థానిక మార్కెట్లను బట్టి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు నమోదవుతున్నాయి.

కేంద్రానికి రాహుల్ సవాల్.. మరికొద్ది గంటల్లో ఢిల్లీలో రాజకీయ సంగ్రామం!NationalSwechaa31 Oct 2026, 10:52 AM

కేంద్రానికి రాహుల్ సవాల్.. మరికొద్ది గంటల్లో ఢిల్లీలో రాజకీయ సంగ్రామం!

ఎన్నికల సంఘం పనితీరుపై ఆరోపణలతో కాంగ్రెస్ నేతృత్వంలోని INDIA కూటమి కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడంతో పాటు, రోడ్లపై నిరసన మార్చ్ చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ స్వయంగా పిలుపునివ్వడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.

ముంచుకొస్తున్న వాయుగుండం.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!ఏపీSwechaa31 Oct 2026, 10:42 AM

ముంచుకొస్తున్న వాయుగుండం.. రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

 'అర్నబ్' తుపాను సృష్టించిన భీకర బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ వాసులు ఇంకా కోలుకోకముందే, రాష్ట్ర ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ మరో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న నికోబార్ దీవుల సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

తిరుపతిలో డ్రైవర్ లెస్ ట్రైన్స్.. ముంబైలో పరుగులుఏపీSwechaa31 Oct 2026, 10:35 AM

తిరుపతిలో డ్రైవర్ లెస్ ట్రైన్స్.. ముంబైలో పరుగులు

ఏపీలోని తిరుపతి శ్రీ సిటిలో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లెస్ ట్రెయిన్స్ తయారు అవుతున్నాయి. మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముంబైలోని వడాలా-థానే-కాసర్వడవలి మెట్రో లైన్ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లను ఫ్రాన్స్ సంస్థ ఆల్‌స్టోమ్ (Alstom) విజయవంతంగా రూపొందిస్తోంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్‌స్టోమ్ తయారీ కేంద్రంలో రూపొందించిన తొలి రైలు సెట్‌ను ప్రతినిధులు తాజాగా ఆవిష్కరించారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కోసం ఎల్ అండ్ టీ (L&T) ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఆల్‌స్టోమ్ కంపెనీ మొత్తం 39 డ్రైవర్‌ లెస్ రైళ్లను, సిగ్నలింగ్ వ్యవస్థను తయారు చేస్తున్నది.

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలుNationalSwechaa31 Oct 2026, 09:52 AM

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలు

 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 (NVS-03) ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ భారీ ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.