స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలుNationalSwechaa31 Oct 2026, 09:52 AM

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ప్రశంసలు

 ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 (NVS-03) ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ భారీ ప్రయోగం విజయవంతం కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల బృందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

గర్ల్స్ హాస్టల్ ముసుగులో  అండాల సేకరణ..తెలంగాణSwechaa31 Oct 2026, 09:28 AM

గర్ల్స్ హాస్టల్ ముసుగులో అండాల సేకరణ..

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న చీకటి కోణాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడి యువతులను డబ్బు ఆశ చూపించి వారి నుంచి రహస్యంగా అండాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. అనంతరం వాటిని సంతాన సాఫల్య కేంద్రాలకు తరలిస్తున్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు బేగంపేట పరిధిలోని ప్రకాశ్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకివెళితే.. నగరంలో గర్ల్స్ హాస్టల్ ముసుగులో ఈ దందా నడుస్తున్నట్టు తెలిసింది. ఏడాది నుంచి హాస్టల్‌ ముసుగులో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.కొందరు నిర్వాహకులు ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి నుంచి అండాలు సేకరిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి అయినట్టు తెలిసింది.

ఇస్రో ఖాతాలో మరో చారిత్రక ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎన్‌వీఎస్-03!NationalSwechaa31 Oct 2026, 09:06 AM

ఇస్రో ఖాతాలో మరో చారిత్రక ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన ఎన్‌వీఎస్-03!

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దేశీయ అంతరిక్ష రంగంలో మరొక అద్భుతమైన మైలురాయిని దాటింది. భారతదేశానికి సొంతంగా ఉన్న ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' (NavIC) సేవలను మరింత సమర్థవంతంగా, కచ్చితత్వంతో అందించే లక్ష్యంతో చేపట్టిన 'ఎన్‌వీఎస్-03' (NVS-03) ఉపగ్రహ ప్రయోగం పూర్తి విజయవంతమైంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం రాత్రి 11:51గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌18 (GSLV-F18) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

చరిత్రలో ఈ రోజు (31 అక్టోబర్)InternationalSwechaa31 Oct 2026, 08:39 AM

చరిత్రలో ఈ రోజు (31 అక్టోబర్)

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1984: భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ న్యూఢిల్లీలో హత్యకు గురయ్యారు.

  • 1875: స్వతంత్ర భారత్ ఉక్కు మనిషి, మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జననం (జాతీయ ఐక్యతా దివస్ / National Unity Day).

  • 2018: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' (182 మీటర్లు) గుజరాత్‌లో ఆవిష్కరణ.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1517: మార్టిన్ లూథర్ జర్మనీలోని విటెన్‌బెర్గ్ దేవాలయ తలుపుపై తన '95 తీసిస్‌లు' (95 Theses) నిరసన పత్రాన్ని అతికించారు — ఇది ప్రొటెస్టెంట్ సంస్కరణలకు (Protestant Reformation) పునాది వేసింది.

  • 1922: బెనిటో ముస్సోలిని ఇటలీకి అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

  • 1999: ఈజిప్ట్ ఎయిర్ ఫ్లైట్ 990 న్యూయార్క్ సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి 217 మంది మరణించారు.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 2000: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్ళిన మొదటి సిబ్బంది 'ఎక్స్‌పెడిషన్ 1' (Expedition 1) ప్రయాణం ప్రారంభమైంది.

  • 2018: గుజరాత్‌లోని నర్మదా నది తీరాన పటేల్ 143వ జయంతి సందర్భంగా 182 మీటర్ల ఎత్తున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు.

👤 ప్రముఖుల జననాలు & వర్ధంతులు

  • 1875 (జననం): సర్దార్ వల్లభభాయ్ పటేల్ — భారత జాతీయ ఐక్యత శిల్పి (జాతీయ ఐక్యతా దినోత్సవం).

  • 1984 (మరణం): ఇందిరా గాంధీ — భారతదేశ తొలి మరియు ఏకైక మహిళా ప్రధాని.

  • 1943 (జననం): జి. రామ్‌రెడ్డి — ప్రముఖ భారతీయ విద్యావేత్త, దూరవిద్య పితురుడు.

నేటి పంచాంగం - 31 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ షష్ఠిSpiritualitySwechaa31 Oct 2026, 08:24 AM

నేటి పంచాంగం - 31 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ షష్ఠి

వివరాలు:

  • తేదీ: 31 అక్టోబరు 2026, శనివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: షష్ఠి (రాత్రి 06:12 వరకు, తదుపరి సప్తమి)

  • వారం: శనివారం (స్థిరవాసరే)

  • నక్షత్రం: పునర్వసు (ఉదయం 10:02 వరకు, తదుపరి పుష్యమి)

  • యోగం: సిద్ధ (మధ్యాహ్నం 02:08 వరకు, తదుపరి సాధ్య)

  • కరణం: వణిజ (ఉదయం 07:18 వరకు), తదుపరి విష్టి/భద్ర (రాత్రి 06:12 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు

  • అమృతకాలం: రాత్రి 10:48 - 12:22 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 06:18 - 07:04 వరకు మరియు ఉదయం 07:04 - 07:50 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 01:05 - 02:40 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మిథునం (ఉదయం 04:15 వరకు), తదుపరి కర్కాటకం

  • సూర్యోదయం: ఉదయం 06:18

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:40

56 వేల కోట్ల క్రిప్టో చోరీ.. ఉత్తర కొరియా హ్యాకర్ల పనేనా?క్రైమ్Swechaa31 Oct 2026, 12:04 AM

56 వేల కోట్ల క్రిప్టో చోరీ.. ఉత్తర కొరియా హ్యాకర్ల పనేనా?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ దొంగతనాల్లో ఒకటి ఇది. కేవలం 20 నిమిషాల్లో 6.36 బిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ ఆస్తులు మాయం చేశారు. దీని వెనుక ఉత్తర కొరియా హ్యాకింగ్ గ్రూప్ ట్రేడర్‌ట్రెయిటర్ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎవరీ హ్యాకర్లు? ఎలా దాడి చేశారు?

ప్రపంచ ఓటర్ వార్నింగ్.. ట్రంప్‌కు టెన్షన్, నెతన్యాహుకు షాక్! ఇండియా పాలకులూ జాగ్రత్త!InternationalSwechaa30 Oct 2026, 11:21 PM

ప్రపంచ ఓటర్ వార్నింగ్.. ట్రంప్‌కు టెన్షన్, నెతన్యాహుకు షాక్! ఇండియా పాలకులూ జాగ్రత్త!

అమెరికాలో ట్రంప్‌కు మిడ్‌టర్మ్ పరీక్ష ఎదురవుతోంది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు కూటమికి మెజారిటీ రాలేదు. బ్రెజిల్‌లో లూలాకు ప్రజలు మరో అవకాశం ఇచ్చారు. సెర్బియాలో విద్యార్థుల ఉద్యమం ఏకంగా ఎన్నికల్లో సత్తా చాటింది. ఈ పరిణామాలు భారత్ కు కూడా హెచ్చరికేనా..?

Gold Price: భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. అసలు కారణాలు ఇవే!NationalSwechaa30 Oct 2026, 09:53 PM

Gold Price: భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. అసలు కారణాలు ఇవే!

Gold Price: కొన్ని రోజులుగా చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కిందికి దిగివస్తున్నాయి. మార్కెట్లో రేట్లు భారీగా పడిపోతుండటంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటుంటే, ఇన్వెస్టర్లు మాత్రం షాక్ తింటున్నారు. అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు, అమెరికా నుంచి వస్తున్న తాజా ఆర్థిక లెక్కల దెబ్బకు పసిడి రేట్లు దాదాపు నాలుగు నెలల కనిష్టానికి జారిపోయాయి. అటు వెండి కూడా ఔన్స్‌కు 50 డాలర్ల కంటే కిందికి పడిపోయింది.ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో మన దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లోనూ రేట్లు దిగజారాయి. బంగారం 10 గ్రాముల ధర రూ.1,41,263కి పడిపోగా, వెండి కేజీ ధర రూ.1,84,245 దాకా తగ్గింది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 3,956 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మార్కెట్లో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోవడమే ఈ భారీ తగ్గుదలకు దారితీసిందని చెబుతున్నారు.

డిసెంబర్‌లోపు ఇళ్ల స్థలాలు- జర్నలిస్టులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్తెలంగాణSwechaa30 Oct 2026, 09:41 PM

డిసెంబర్‌లోపు ఇళ్ల స్థలాలు- జర్నలిస్టులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Cm Revanth: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తాను సీఎం అయిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నానని, ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నానని తెలిపారు. అందులో భాగంగా జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. వాస్తవానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చానన్న రేవంత్ రెడ్డి.. కోర్టు ఆర్డర్ వల్ల ఆగిపోవాల్సి వచ్చిందన్నారు.

డిసెంబర్ లోపు ఇళ్ల స్థలాలు

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో కమిట్ మెంట్ తో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. డిసెంబర్ లోపు ఇళ్ల స్థలాలు ఇస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పారు. ఆ వెంటనే రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.

Trisha Krishnan: ఎంజీఆర్ జీవితకథలో త్రిష!సినిమాSwechaa30 Oct 2026, 09:41 PM

Trisha Krishnan: ఎంజీఆర్ జీవితకథలో త్రిష!

Trisha Krishnan: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. సినీ గ్లామర్, రాజకీయ అధికారం కలిసిన రాష్ట్రం కాబట్టే అందరిలోనూ ఇంత ఆసక్తి ఉంటుంది. ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడం, మొట్ట మొదటి పోటీలోనే గెలిచి, ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకోవడం తమిళనాట రాజకీయాలలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఎంజీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో త్రిష కనిపించబోతుందట.

దేశంలోనే అతిపెద్ద భూస్వామి రేవంత్ రెడ్డి- దాసోజు శ్రవణ్తెలంగాణSwechaa30 Oct 2026, 09:28 PM

దేశంలోనే అతిపెద్ద భూస్వామి రేవంత్ రెడ్డి- దాసోజు శ్రవణ్

Telangana: దేశంలోనే అతిపెద్ద భూస్వామి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. ఈ నాలుగింటికి సంబంధించి భూమి వైశాల్యం దగ్గర దగ్గర 6లక్షల 80వేల పైచిలుకు ఎకరాలు ఉందన్నారు. ఈ మొత్తానికి గుత్తేదారు రేవంత్ రెడ్డి అని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి.. 7లక్షల ఎకరాలకు గుత్తేదారు అని వెల్లడించారు.

Rowdy Janardhana: ఇలాంటి టైమ్ లో అంత రిస్క్ అవసరమా విజయ్?సినిమాSwechaa30 Oct 2026, 08:54 PM

Rowdy Janardhana: ఇలాంటి టైమ్ లో అంత రిస్క్ అవసరమా విజయ్?

Rowdy Janardhana: సినిమా విషయంలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, దర్శక-నిర్మాతలైనా రిస్క్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడితేనే అన్నిటికీ మంచిది. అసలే ఫ్లాపుల్లో ఉన్న హీరో విజయ్ దేవరకొండ, నష్టాలలో ఉన్న నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు. ఇప్పుడు వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా రౌడీ జనార్ధన. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ కొత్త టాక్ వినిపిస్తోంది. సలార్, పుష్ప, బాహుబలి సినిమాల తరహలోనే రౌడీ జనార్ధన కూడా రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారట.

TG: భట్టి క్యాంప్ ఆఫీసులపై రచ్చ! ఖజానా ఖాళీ అంటూనే జీవోలు..తెలంగాణSwechaa30 Oct 2026, 08:37 PM

TG: భట్టి క్యాంప్ ఆఫీసులపై రచ్చ! ఖజానా ఖాళీ అంటూనే జీవోలు..

TG: రాష్ట్రంలో ఖజానా మొత్తం ఖాళీగా ఉందని, గత పాలకుల వల్లే నిధుల కొరత ఏర్పడిందని పదేపదే చెబుతున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. తన క్యాంప్ ఆఫీసుల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే సకల సౌకర్యాలున్న ‘ప్రజాభవన్’ అధికారిక నివాసంగా ఉండగా.. సొంత నియోజకవర్గమైన మధిర, అటు ఖమ్మం కేంద్రంగా వరుస భవనాల రినోవేషన్లు, నిర్మాణాల పేరుతో జీవోల మీద జీవోలు విడుదల చేయడం ఇప్పుడు విమర్శల పాలవుతోంది.మధిరలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ ఆధునీకరణ కోసం దాదాపు రూ. 1.50 కోట్లు కేటాయించినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందులో భాగంగా ఆఫీస్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, పీఏ గది, కలరింగ్ కోసం రూ. 40.81 లక్షల విలువైన టెండర్‌ను 'ఆర్ ఎన్ కన్‌స్ట్రక్షన్స్'కు ఇచ్చినట్లు వివరాలు ప్రచారంలోకి వచ్చాయి.

Aadarsha Kutumbam: ఆ తొమ్మిది పాటలెక్కడ గురూజీ..పాపం ఫ్యాన్స్!సినిమాSwechaa30 Oct 2026, 08:25 PM

Aadarsha Kutumbam: ఆ తొమ్మిది పాటలెక్కడ గురూజీ..పాపం ఫ్యాన్స్!

Aadarsha Kutumbam: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదర్శకుటుంబం మూవీలో మీరు చెప్పిన ఆ తొమ్మిది పాటలెక్కడ గురూజీ..అంటూ పాపం ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ 'ఆదర్శ కుటుంబం'. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాలతో ఈ అక్టోబర్ 30న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది.

TRAI Report: జియో దూకుడు.. ఎయిర్‌టెల్‌కు భారీ షాక్‌.. పడిపోతున్న రెండో అతిపెద్ద సంస్థ!NationalSwechaa30 Oct 2026, 08:21 PM

TRAI Report: జియో దూకుడు.. ఎయిర్‌టెల్‌కు భారీ షాక్‌.. పడిపోతున్న రెండో అతిపెద్ద సంస్థ!

TRAI Report: భారత టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో దూకుడు ముందు దేశంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్ అయిన భారతీ ఎయిర్‌టెల్ నిలబడలేకపోతోంది. కొత్త యూజర్స్‌ని ఆకర్షించడంలో జియో సునామీ సృష్టిస్తుంటే.. ఎయిర్‌టెల్ మాత్రం ఊహించని రీతిలో చతికిలపడింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు మార్కెట్‌లో ఎయిర్‌టెల్ బలహీనపడుతున్న తీరును స్పష్టంగా తేటతెల్లం చేశాయి.ట్రాయ్ లెక్కల ప్రకారం సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు మార్కెట్‌లోకి రాగా, అందులో ఏకంగా 19 లక్షల మంది జియో నెట్‌వర్క్‌నే ఎంచుకున్నారు. ఇదే సమయంలో భారీ అంచనాలు పెట్టుకున్న ఎయిర్‌టెల్ ఖాతాలోకి కేవలం 2 లక్షల మంది కొత్త కస్టమర్లు మాత్రమే వచ్చారు.

నేనేమీ తప్పుగా మాట్లాడలేదు, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాతెలంగాణSwechaa30 Oct 2026, 07:31 PM

నేనేమీ తప్పుగా మాట్లాడలేదు, నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా

Anirudh Reddy: నియోజకవర్గాలకు నిధులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతోందని.. నిధులు, బిల్లుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ సొంత పార్టీ ప్రభుత్వంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు అధికార పార్టీలోనూ కలకలం సృష్టించాయి. అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై అనిరుధ్ రెడ్డి స్పందించారు. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

BRS: బావా బావమర్ది షేరింగ్.. గులాబీ దళం పక్కా ప్లాన్‌తో కాంగ్రెస్‌కు చిక్కులు తప్పవా?తెలంగాణSwechaa30 Oct 2026, 07:12 PM

BRS: బావా బావమర్ది షేరింగ్.. గులాబీ దళం పక్కా ప్లాన్‌తో కాంగ్రెస్‌కు చిక్కులు తప్పవా?

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ ఫైట్‌కు తెరలేచింది. వచ్చే మార్చిలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్.. ఊహించని రీతిలో భారీ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. పేరుకు ఇవి రెండే సీట్లు అయినా.. ఏకంగా 6 ఉమ్మడి జిల్లాలు, దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి వీటి కిందకు వస్తాయి. దీంతో ఈ రెండు స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసి, అధికార కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు పార్టీలోని ఇద్దరు కీలక పిల్లర్లు కేటీఆర్, హరీష్ రావు చెరో సీటును పంచుకున్నారనే వార్త ఇప్పుడు తెలంగాణ భవన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో విద్యావంతులైన ఓటర్లు తీర్పు ఇచ్చే ఈ ఎన్నికల్లో గెలిచి కేడర్‌లో నూతనోత్సాహం నింపాలని గులాబీ దళపతి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేని పోరాటం- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితెలంగాణSwechaa30 Oct 2026, 06:48 PM

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేని పోరాటం- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Govt Lands: ప్రభుత్వ భూముల పరిరక్షణలో సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీలేని వైఖరితో ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూవివాదాలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన న్యాయపోరాటం చేస్తోందని తెలిపారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత

సీఎం రేవంత్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విలువైన ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయ వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. రెవెన్యూ అధికారులు, న్యాయశాఖ, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయాన్ని పెంచి సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారని మంత్రి పొంగులేటి వివరించారు.

Akhil Akkineni: లెనిన్ సక్సెస్‌తో భయపడుతున్న అక్కినేని హీరో!సినిమాSwechaa30 Oct 2026, 06:46 PM

Akhil Akkineni: లెనిన్ సక్సెస్‌తో భయపడుతున్న అక్కినేని హీరో!

Akhil Akkineni: ఇమెజ్ కాపాడుకోవడం అందరు హీరోల వల్లా, దర్శకుల వల్లా కాదు. దీనికోసం చాలా ఛాలెంజెస్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్ ఉన్నప్పుడే క్రేజ్ ఉంటుంది తప్ప. ఫ్లాప్స్ వస్తుంటే అప్పుడే, రిజక్షన్స్ మొదలవుతాయి. కృష్ణ వంశీ, వినాయక్ లాంటి అగ్ర దర్శకులు ఇప్పుడు సైలెంట్‌గా ఉండటానికి కారణం ఇలాంటి రిజక్షన్సే. ఇప్పుడు, అక్కినేని హీరో అఖిల్ కూడా ఈ విషయంలోనే కాస్త భయపడుతున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

TG: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆ ఏరియాల్లో అలర్ట్!తెలంగాణSwechaa30 Oct 2026, 06:32 PM

TG: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆ ఏరియాల్లో అలర్ట్!

TG: దాదాపు నెల రోజుల తర్వాత భాగ్యనగరాన్ని వరుణుడు ఒక్కసారిగా ముంచెత్తాడు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుండటంతో రోడ్లన్నీ క్షణాల్లో జలమయమయ్యాయి. సాయంత్రం వేళ అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RC 17: ఈసారి మెగా పవర్ ప్రాజెక్టే..కన్‌ఫర్మ్!సినిమాSwechaa30 Oct 2026, 06:14 PM

RC 17: ఈసారి మెగా పవర్ ప్రాజెక్టే..కన్‌ఫర్మ్!

రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి రామ్ చరణ్, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి చేయబోతున్న ఈ పవర్ ప్రాజెక్ట్‌కి సంబందించిన బిజినెస్ వ్యవహారాలను కూడా పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ విదేశాలలో ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు. దాదాపు నెలరోజుల పాటు రామ్ చరణ్-సుకుమార్ కలిసి విదేశాలలో పర్యటించి లొకేషన్స్ ఫైనల్ చేశారు. ఇక, ఇప్పటి వరకూ రాని ఓ అద్భుతమైన కథతో RC 17 రూపొందనుంది.

Ramlila Maidan Protest: నవంబర్ 1న మోడీ సర్కార్‌పై విపక్షాల మహా దండయాత్ర.. సక్సెస్ అవుతుందా?NationalSwechaa30 Oct 2026, 06:01 PM

Ramlila Maidan Protest: నవంబర్ 1న మోడీ సర్కార్‌పై విపక్షాల మహా దండయాత్ర.. సక్సెస్ అవుతుందా?

Ramlila Maidan Protest: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నవంబర్ 1న ఢిల్లీలోని రామలీలా మైదానంలో విపక్ష ‘ఇండియా’ కూటమి తలపెట్టిన మహా ప్రదర్శన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా 10 లక్షల మందితో దేశ రాజధానిని ముంచెత్తాలని విపక్షాలు ప్లాన్ చేస్తుండగా, ఈ భారీ నిరసన కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేస్తుందా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద పొలిటికల్ క్వశ్చన్‌గా మారింది. కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ర్యాలీ కోసం దేశం నలుమూలల నుంచి విద్యార్థి సంఘాలు, కూటమి పార్టీల శ్రేణులను తరలిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా ఈ పోరును లీడ్ చేయనున్నారు.

ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుస్తారు- హాట్ టాపిక్‌గా మారిన ఆకునూరి మురళి పోస్ట్తెలంగాణSwechaa30 Oct 2026, 05:49 PM

ఇలా చేస్తే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుస్తారు- హాట్ టాపిక్‌గా మారిన ఆకునూరి మురళి పోస్ట్

Murali Akunuri: మియాపూర్ భూముల వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్పందించారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్ కు కీలక సూచన చేశారాయన. ముఖ్యమంత్రి రేవంత్ కు ఒక గొప్ప అవకాశం వచ్చిందన్నారు ఆకునూరి మురళి. మియాపూర్ భూములను నిజాయితీగా, పారదర్శకంగా అమ్మి వచ్చిన డబ్బును (30వేల కోట్లు లేక 60వేల కోట్లు) ఆర్థిక శాఖ బయట పటిష్టమైన పారదర్శకమైన విధానంతో విద్యానిధిలో జమ చేద్దామని సూచించారు.

Nithya Menen: డబ్బు కోసం కాదు..కథ నచ్చితేనే చేస్తా!సినిమాSwechaa30 Oct 2026, 05:42 PM

Nithya Menen: డబ్బు కోసం కాదు..కథ నచ్చితేనే చేస్తా!

Nithya Menen: కథ, అందులో తన పాత్ర నచ్చితేగానీ సినిమాకి సైన్ చేయని అతికొద్దిమంది హీరోయిన్స్‌లో నిత్య మేనన్ ఒకరు. రెమ్యునరేషన్ కోసం ఈ బ్యూటీ ఎప్పుడు సినిమాను ఒప్పుకోలేదు. నిత్యా హీరోయిన్, సింగర్. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో దాదాపు యాభై చిత్రాలకు పైగా నటించింది. పాత్ర నచ్చి కొన్ని సినిమాలలో కీలక పాత్రలు కూడా చేసింది. ఆ సినిమాలు సన్నాఫ్ సత్యమూర్తి, గీత గోవిందం. మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు నంది బహుమతులు అందుకుంది.

ఒమేగా హాస్పిటల్స్‌లో ఐటీ సోదాలు.. 24 చోట్ల రైడ్స్!తెలంగాణSwechaa30 Oct 2026, 05:26 PM

ఒమేగా హాస్పిటల్స్‌లో ఐటీ సోదాలు.. 24 చోట్ల రైడ్స్!

ప్రముఖ ఒమేగా హాస్పిటల్స్‌పై హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు ఏకకాలంలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా మొత్తం 24 ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లలోని ఒమేగా బ్రాంచీలలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

Telangana Politics: కామ్రేడ్స్ చెరోదారి.. గ్రాడ్యుయేట్ పోరులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తప్పదా!తెలంగాణSwechaa30 Oct 2026, 04:54 PM

Telangana Politics: కామ్రేడ్స్ చెరోదారి.. గ్రాడ్యుయేట్ పోరులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తప్పదా!

Telangana Politics: తెలంగాణలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సమరంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు స్థానాలనూ క్లీన్‌స్వీప్ చేసి తమ సత్తా చాటాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంటే.. మిత్రపక్షాలైన కమ్యూనిస్టుల వైఖరి ఇప్పుడు హస్తం పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి కామ్రేడ్స్ చెరో దారి చూసుకుంటున్నారు. మొన్నటిదాకా కలిసి నడిచిన సీపీఎం హ్యాండ్ ఇవ్వడం, మరో మిత్రపక్షమైన సీపీఐ నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇటీవల జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం అనుబంధ సంఘాలు కలిసి పనిచేసి విజయవంతమయ్యాయి. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు సీపీఎం అండగా నిలుస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ సీన్ కట్ చేస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సుత్తి కొడవలి పార్టీ రూట్ మార్చేసింది. కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా సొంతంగా ఒక ప్రత్యేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి, తమ అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించేసింది.

TG: మియాపూర్ భూములను కాపాడింది జర్నలిస్టులే.. మీడియాది అలుపెరగని పోరాటం..!తెలంగాణSwechaa30 Oct 2026, 04:32 PM

TG: మియాపూర్ భూములను కాపాడింది జర్నలిస్టులే.. మీడియాది అలుపెరగని పోరాటం..!

TG: హైదరాబాద్ మహానగరంలో ఒక్క గజం భూమి ధర ఆకాశాన్ని తాకుతున్న వేళ.. వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడటం అంటే ఏకంగా అధికార పీఠంతోనే ఢీకొట్టడం. మియాపూర్ భూముల వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రాగానే మొత్తం ఘనత అంతా తమ ఖాతాలోనే వేసుకునేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడవచ్చు. కానీ, చరిత్రను ఒక్కసారి తిరగేస్తే అసలు సత్యం కళ్లముందు కదలాడుతుంది. నాడు అధికార బలంతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న బీఆర్ఎస్ హయాంలో.. ప్రాణాలకు తెగించి ఆ భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది అప్పటి మీడియా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మాత్రమే.

కూరలో బల్లి, షాక్‌లో స్టూడెంట్స్.. జేఎన్టీయూ హాస్టల్‌లో కలకలంతెలంగాణSwechaa30 Oct 2026, 04:28 PM

కూరలో బల్లి, షాక్‌లో స్టూడెంట్స్.. జేఎన్టీయూ హాస్టల్‌లో కలకలం

JNTUH: హైదరాబాద్ నగరంలోని జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని హాస్టల్ మెస్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. మంజీరా బాలుర హాస్టల్‌లో గురువారం రాత్రి విద్యార్థులకు వడ్డించిన కూరలో బల్లి కనిపించడం సంచలనం రేపింది. కర్రీ ఉంచిన పెద్ద పాత్రలో సజీవంగా ఉన్న బల్లిని కళ్లారా చూసిన విద్యార్థులు షాక్ కి గురయ్యారు. అసలే ఆహార నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఈ తరహా ఘటన వారిలో మరింత ఆందోళన పెంచేసింది.

విద్యార్థులకు వండించిన కూరలో బల్లి

రాత్రి డిన్నర్ చేసేందుకు విద్యార్థులు హాస్టల్ మెస్‌కు వెళ్లారు. ఆ సమయంలో వారికి ఊహించని దృశ్యం ఎదురైంది. కర్రీ ఉంచిన పెద్ద పాత్రలో బల్లిని గమనించి విస్తుపోయారు. వెంటనే దాన్ని ఫోన్లలో వీడియో తీశారు. అనంతరం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Tollywood: శేఖర్ కమ్ముల మేకింగ్ స్టైలే వేరు..అలా, ఇప్పుడెవరు చేస్తున్నారు!సినిమాSwechaa30 Oct 2026, 03:34 PM

Tollywood: శేఖర్ కమ్ముల మేకింగ్ స్టైలే వేరు..అలా, ఇప్పుడెవరు చేస్తున్నారు!

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో దరకుడిగా శేఖర్ కమ్ముల మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందరూ, కమర్షియల్ సినిమా అంటూ యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలను, పీరియాడిక్, మైథలాజికల్, బయోపిక్స్ ..ఇలా హెవీ జానర్స్‌లో సినిమాలను చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ, శేఖర్ కమ్ముల మాత్రం చాలా సహజమైన కథలను చెప్పడానికే ఆసక్తి చూపిస్తుంటాడు. అంతేకాదు, ఎప్పుడు కూడా 100, 200 కోట్ల బడ్జెట్ సినిమా తీయాలని ట్రై చేయలేదు.

ఆకలితో కస్టమర్లు మిగిల్చిన ఫుడ్ తిన్నందుకు.. ఉద్యోగానికే ఎసరు!వైరల్ న్యూస్Swechaa30 Oct 2026, 03:25 PM

ఆకలితో కస్టమర్లు మిగిల్చిన ఫుడ్ తిన్నందుకు.. ఉద్యోగానికే ఎసరు!

 ఆకలి తీర్చుకోవడానికి ఓ పేద యువతి చేసిన చిన్న పని ఆమె ఉద్యోగాన్నే ఊడదీసింది. ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్లు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని (Leftover Food) ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లినందుకు 18 ఏళ్ల విద్యార్థినిని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఆకలి తీర్చుకునేందుకే తాను అలా చేశానని, సరైన భోజనం కొనుక్కునే స్థోమత లేకపోవడం వల్ల మిగిలిన ఆహారాన్ని తీసుకెళ్లానని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.